సమైక్య శంఖారావం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య శంఖారావం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

సమైక్య శంఖారావం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

Written By news on Monday, October 21, 2013 | 10/21/2013

హైదరాబాద్ : రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయొద్దని, సమైక్య రాష్ట్రంగానే ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో త్వరలో హైదరాబాద్ లో జరిగే సమైక్య శంఖారావం సభకు వచ్చేందుకు సన్నాహాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో మహిళలు ఉరకలెత్తిన ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ఇళ్లల్లో పెళ్లి పేరంటాలకు పిలిచినట్లుగా, సమైక్య శంఖారావం సభకు హాజరు కావాలంటూ ఇంటింటికీ వెళ్లి బొట్లు పెట్టి మరీ పిలుస్తున్నారు. ఊళ్లలో దండోరాలు వేయిస్తున్నారు. ఈనెల 26వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని స్వచ్ఛందంగా పిలుపునిస్తున్నారు.

వైఎస్సార్ జిల్లా పులివెందులలో డాక్టర్ ఈసీ సుగుణమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా గర్జన, భారీ ర్యాలీ నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్నారు.సమైక్యాంధ్రకు మద్దతుగా కడప మాజీ  మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి సతీమణి అరుణమ్మ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ చేశారు. కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. చోడవరంలో నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ నేత కొణతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం కార్యకర్తల భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మానవహారం, అట్లతద్ది చేశారు. ఈ కార్యక్రమాలు అన్నింటి ద్వారా సమైక్య నినాదాన్ని వినిపిస్తూ, అదే సమయంలో సమైక్య శంఖారావం సభకు వచ్చేందుకు ఏర్పట్లు చేసుకుంటున్నారు
Share this article :

0 comments: