'సమైక్య' సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'సమైక్య' సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు

'సమైక్య' సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు

Written By news on Friday, October 25, 2013 | 10/25/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జరప తలపెట్టిన సమైక్య శంఖారావం సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును, సభా ప్రాంగణానికి  బూర్గుల రామకృష్ణారావు పేరును ఖరారు చేశారు.  శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్య శంఖారావానికి భారీ భద్రతా ఏర్పాట్లును చేశారు. ఏ గేటు నుంచి మహిళలు, ఎఫ్ గేటు నుంచి వీఐపీలు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఎఫ్-1, జీ గేటు నుంచి ప్రజలకు ప్రవేశం కల్పిస్తున్నారు. డి గేటు నుంచి వీవీఐపీలకు ప్రవేశం కల్పించారు.
 
ప్రజల ఆలోచనా విధానాన్ని ఢిల్లీకి వినిపించడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో తమ పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపడతాయని, ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని తెలిపారు.

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ బహుదూర్ స్టేడియంలో జరుగనున్న సభ నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ  ఓ ప్రకటనలో తెలిపారు.
 
నాంపల్లి, పీసీఆర్ నుంచి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు అనుమతించరు. సుజాత స్కూల్, చర్మాస్ వైపు నుంచి వాహనాలను గన్ ఫౌండ్రీ, ఎస్ బీఎచ్ వైపు మళ్లిస్తామన్నారు. సెమెట్రీ వద్ద నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ వైపు నుంచి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా హిమయత్ నగర్ వై జంక్షన్ వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. రాజమోహల్లా వైపు నెంచి వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా సెమీట్రి జంక్షన్ వద్ద మళ్లించనున్నారు.
 
బొగ్గుల కుంట, తాజమహల్, ఈడెన్ గార్డెన్స్ మరియు కింగ్ కోఠి నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ నుంచి కాకుండా కింగ్ కోఠి క్రాస్ రోడ్డు మీదుగా తాజమహల్, అబిడ్స్ వైపు మళ్లించనున్నారు. అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ జంక్షన్ మీదుగా లిబర్టీ, హిమయత్ నగర్ ల వైపు దారి మళ్లించనున్నారు. రవీంద్రభారతి, నాంపల్లి వైపు నుంచి బషీర్ బాగ్ కు వెళ్లే వాహనాలను పూర్తిగా రద్దు చేశారు.
Share this article :

0 comments: