జగన్‌కు మద్దతునిచ్చాననే దుష్ర్పచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్‌కు మద్దతునిచ్చాననే దుష్ర్పచారం

జగన్‌కు మద్దతునిచ్చాననే దుష్ర్పచారం

Written By news on Thursday, October 24, 2013 | 10/24/2013

జగన్‌కు మద్దతునిచ్చాననే దుష్ర్పచారం: దాడి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించినందుకు తనపై దుష్ర్పచారం మొదలుపెట్టారని ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తనను పరుష పదజాలంతో హెచ్చరించారని ఆంధ్రజ్యోతి అసత్య కథనం ప్రచురించిందని ఆయన పేర్కొన్నారు. ఆ కథనంలో ఏమాత్రం నిజం లేదని, ఊహాజనితమైందని అన్నారు. గడిచిన మూడు రోజులుగా జిల్లా నేతలతో జగన్ సమావేశాలు నిర్వహిస్తుండగా, తాను సమైక్య శంఖారావం కమిటీ సమావేశాల్లో నిమగ్నమయ్యానని చెప్పారు. తాను జగన్‌ను కలవడంగానీ మాట్లాడటం గానీ జరగలేదని పేర్కొంటూ... ఆంధ్రజ్యోతి అభూత కల్పనతో సినిమా డైలాగులతో తనపై కథనం ప్రచురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Share this article :

0 comments: