వైఎస్సార్‌సీపీలో చేరిన పెనుకొండ కాంగ్రెస్ నాయకులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్‌సీపీలో చేరిన పెనుకొండ కాంగ్రెస్ నాయకులు

వైఎస్సార్‌సీపీలో చేరిన పెనుకొండ కాంగ్రెస్ నాయకులు

Written By news on Wednesday, October 23, 2013 | 10/23/2013

పెనుకొండ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
 
 పార్టీలో జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) ఉపాధ్యక్షుడు గుట్టూరు శ్రీరాములు, కార్యదర్శి  కర్రా సంజీవరెడ్డి, లీగల్‌సెల్ కార్యదర్శి భాస్కరరెడ్డి, మాజీ సర్పంచ్ తుంగోడు హనుమంతరెడ్డి, నాయకులు అజయ్‌రెడ్డి, జాఫర్, ఖాజీపీరా, ఫరీద్, శంకరరెడ్డి, నాగరాజు, బోయ దుర్గన్న, మాజీ సర్పంచ్ ఆదినారాయణరెడ్డి, రఫిక్, గౌస్‌లాజం, అమర్, చందశేఖరరెడ్డి, మాజీ సర్పంచ్ కంబాలప్ప, పూజిరెడ్డి, ప్రభాకరరెడ్డి, న్యాయవాది ఉమర్‌ఫరూక్ తదితరులు ఉన్నారు.
 
 వీరి వెంట అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు లోచర్ల విజయ భాస్కరరెడ్డి, నాయకులు బ్రహ్మసముద్రం శ్రీనివాసులు, సోమందేపల్లి మండల కన్వీనర్ నీరుగంటి నారాయణస్వామి, పందిపర్తికి చెందిన గజేంద్ర ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి నాయకులకు సూచించారు. అన్ని మండలాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు. కాగా.. పెనుకొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా నాయకులు ఆందోళన చెందుతున్నారు.
Share this article :

0 comments: