సమైక్యవాదిపై చేయిచేసుకున్న చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్యవాదిపై చేయిచేసుకున్న చంద్రబాబు

సమైక్యవాదిపై చేయిచేసుకున్న చంద్రబాబు

Written By news on Thursday, October 31, 2013 | 10/31/2013

సమైక్యవాదిపై చేయిచేసుకున్న చంద్రబాబు
ఏలూరు : భారీ వర్షాలు, వరద ప్రభావ బాధితుల్ని పరామర్శించేందుకు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సమైక్య సెగ తగిలింది. గురువారం సమైక్య వాదులు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ దశలో చంద్రబాబు సమైక్యవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో సహనం కోల్పోయి ఓ సమైక్యవాదిపై చేయి చేసుకున్నారు. కారు దగ్గర నుంచున్న ఆయన చేత్తో కొట్టారు.
చంద్రబాబే ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. వారు దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. చంద్రబాబు కాన్వాయిని అతికష్టమ్మీద అక్కడి నుంచి పంపించారు.  రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా సమన్యాయం అంటూ దీక్ష చేసిన సంగతి తెలిసిందే
Share this article :

0 comments: