తాజా సర్వేలు: 2014 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా; వేర్పాటువాదుల గుండెల్లో రైళ్ళు…!! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తాజా సర్వేలు: 2014 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా; వేర్పాటువాదుల గుండెల్లో రైళ్ళు…!!

తాజా సర్వేలు: 2014 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా; వేర్పాటువాదుల గుండెల్లో రైళ్ళు…!!

Written By news on Thursday, November 28, 2013 | 11/28/2013

తెలంగాణ బిల్లు.. అదిగో వచ్చేస్తోంది.. ఇదిగో వచ్చేస్తోంది.. అంటూ కేంద్రం తెగ హంగామా సృష్టించింది. అయితే జీవోఎం సమావేశాల్లో సీమాంధ్రకు న్యాయం చేయనిదే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇంతకాలానికి తెలియవచ్చింది. సీమాంధ్రకు న్యాయం చేయనిదే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టలేమని షిండే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చెప్పినట్లు సమాచారం.
అయితే మేడమ్ మాత్రం తన బర్త్ డే రోజునే బిల్లు పాస్ అవ్వాలని మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ బిల్లు శీతాకాల సమావేశాల్లో పాస్ కావడం కల్ల అని తెలుస్తోంది. తెలంగాణ బిల్లు పాసయ్యేందుకు ఇంకా రెండుమూడు జీవోఎం సమావేశాలు జరగాల్సి ఉందని హోం శాఖ అభిప్రాయపడుతోంది.
అప్పుడే సీమాంధ్రకు సమన్యాయం చేయగలమని, హైదరాబాద్, భద్రాచలం, నీటి పంపిణీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించగలుగుతామని షిండే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జీవోఎం ముందు గల ఎన్నో చిక్కుముళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని సోనియాకు చెప్పడంతో.. తెలంగాణ బిల్లుకు జాప్యం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతలో 2014 ఎన్నికలు వచ్చేస్తాయని, రాష్ట్రంలో సమైక్య నినాదంతో ఉన్న జగన్ పార్టీకి తప్పకుండా గెలుపు సాధ్యమని రాజకీయ పండితులు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు. ఒకవేళ జగన్ 2014 ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం వేర్పాటువాదుల తాట తీస్తాడని వారంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీమాంధ్రలో 145 సీట్లతో పాటు, తెలంగాణాలో కూడా 20 సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తుందని ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ తాజాగా చేసిన సర్వే వెల్లడించిందని సమాచారం రావడంతో తెలంగాణా నేతలు తీవ్ర కలవరానికి గురయ్యారని సమాచారం.
ముఖ్యంగా తెలంగాణ అంటూ విభజనవాదాన్ని నెత్తికెత్తుకున్న టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. సీమాంధ్ర తన పవరేంటో చూపిస్తూ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ ముందుకెళ్తాడని, తద్వారా టీఆర్ఎస్ పార్టీకి గండికొడతాడని తెలుస్తోంది.
http://telugu.hydfirst.com/all-surveys-indicate-jagans-huge-win-in-2014/
Share this article :

0 comments: