వైఎస్ జగన్ పర్యటన సాగేదిలా..... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ పర్యటన సాగేదిలా.....

వైఎస్ జగన్ పర్యటన సాగేదిలా.....

Written By news on Wednesday, November 13, 2013 | 11/13/2013

తూర్పు గోదావరి జిల్లాలో నేడు జగన్ పర్యటన
హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుండి బయలుదేరి మధ్యాహ్నం  రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రిలో దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్‌రావు విగ్రహానికి పూలమాల వేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జక్కంపూడి ఇంటికి చేరుకుని వారి కుటుంబసభ్యలతో మాట్లాడతారు.
సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుండి కాకినాడ బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడలో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కుమారుని వివాహానికి హాజరవుతారు. రాత్రి 7 గంటలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వెళతారు. రాత్రి 8 గంటలకు కాకినాడ నుండి బయలుదేరి హైదరాబాద్‌ తిరిగి వస్తారు.


వైఎస్ జగన్ పర్యటన సాగేదిలా.....

 హైదరాబాద్ నుంచి మధురపూడికి మధ్యాహ్నం 1.45కి జగన్ చేరుకుంటారు. 2.10 గంటలకు మధురపూడి నుంచి బయలుదేరి 2.30 గంటలకు కంబాలచెరువు సెంటర్‌లో జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పిస్తారు. 3 గంటలకు సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఇంటికి వెళతారు. ఇటీవల వివాహమైన ఆమె కుమార్తె సింధు సహస్రను, అల్లుడు భుజంగరాయుడును అశీర్వదిస్తారు. 4 గంటలకు రాజ మండ్రి నుంచి రాజానగరం  ఏడీబీ రోడ్ మీదుగా కాకినాడ వెళతారు.

సాయంత్రం 6 గంటలకు అచ్చంపేట జంక్షన్ ఆశ్రంపాఠశాల రోడ్డులో ఉన్న ద్వారంపూడి భాస్కరరెడ్డి, పద్మావతి కల్యాణ మంటపానికి చేరుకుని పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్  కుమారుడు సూర్యప్రకాష్, దివ్యశ్రీల వివాహానికి హాజరై నవదంపతులను ఆశీర్వదిస్తారు. రాత్రి ఏడు గంటలకు కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటికి వెళతారు. 8 గంటలకు ద్వారంపూడి ఇంటి నుంచి బయలుదేరి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళతారు.
Share this article :

0 comments: