సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు

సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు

Written By news on Friday, November 15, 2013 | 11/15/2013

ఆత్మకూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శుక్రవారం నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు, ముఖ్యనేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి పరిచయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 18న సుప్రీంకోర్టులో విభజనపై వాదన ఉందన్నారు. బీజేపీ కూడా విభజనను అడ్డుకునే అవకాశం ఉందని చెప్పారు. సమైక్యరాష్ట్రంలో ఎన్నికలు జరిగి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. దక్షిణ తెలంగాణలో కూడా 30 అసెంబ్లీ స్థానాలు వస్తాయని భావిస్తున్నామన్నారు. సీమాంధ్రలో 150 అసెంబ్లీ స్థానాలను తమ పార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి ఆఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ హడావుడి చూస్తే రాష్ట్రం విడిపోతుందనే అనుమానం కలుగుతోందన్నారు. తెలంగాణలో కూడా నాలుగైదు పార్లమెంటు స్థానాలను తమ పార్టీ గెల్చుకుంటుందన్నారు. నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని విజయబావుటా ఎగురవేస్తామని చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు జగన్ ఫోబియా పట్టుకుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ కలవరింతలేనని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు, తెలుగుదేశానికి 20 స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సామాన్యుడిని చేరదీశారని గుర్తు చేశారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ గొప్ప మానవతావాది అని చెప్పారు. సీమాంధ్రలో ప్రతి సీటు విలువైనదేనని, చిన్నచిన్న పొరపొచ్చాలను పక్కన పెట్టి పార్టీ శ్రేణులన్నీ ఐకమత్యంగా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: