ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి భేటీ

ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి భేటీ

Written By news on Monday, November 18, 2013 | 11/18/2013

ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారమిక్కడ ప్రారంభం అయ్యింది. విభజన రాజకీయాలు, సమైక్య ఉద్యమ సెగల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సంస్థాగత విషయాలు, తదుపరి పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇందులో చర్చిస్తారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి విస్తృతస్థాయి సమావేశం ఇదే కనుక అనేక ప్రధానమైన అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. గతంలో సెప్టెంబర్ 21న జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఒక నెల రోజుల ఆందోళన కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడమేకాక, ఇప్పటికీ చురుగ్గా ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఈ సమావేశంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.
Share this article :

0 comments: