రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు అరెస్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు అరెస్టు

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు అరెస్టు

Written By news on Thursday, November 7, 2013 | 11/07/2013

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు అరెస్టు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రెండో రోజూ బంద్ పాటిస్తున్న ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఎన్ హెచ్ 9 ను దిగ్బంధ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేత జోగి రమేష్, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. భీమవరంగట్టు వద్ద సామినేమి ఉదయభానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా లోని పోరుమామిళ్లలో 100 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ పీఎస్ ఎదుట వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
నెల్లూరులోని సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సంజీవయ్య అరెస్ట్‌ చేయగా, కనపర్తిపాడు వద్ద కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌ చేశారు.పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం సిద్దాంతం వద్ద ఎన్ హెచ్ 16 దిగ్బంధనంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని గొల్లపూడిలో వైఎస్సార్ సీపీ నేత జలీల్‌ఖాన్‌ అరెస్ట్‌ చేయగా, తూర్పు గోదావరి జిల్లాలోని  అమలాపురంలో NH-216 దిగ్బంధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొల్లా బాబురావు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.


కాగా,  వైఎస్సార్ సీపీ వరుసుగా రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. వైఎస్సార్ జిల్లా గద్వేలి-కడప హైవే దిగ్బంధ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని వేమూరు వద్ద తెనాలి-రేపల్లే హైవే దిగ్బంధించగా, గుంటూరు- అమరావతి హైవే దిగ్బంధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఎన్ హెచ్ 214 నిర్భందించగా, ఏలూరు-రాజమండ్రి హైవేను కూడా దిగ్బంధించారు. అనంతపురం-కడప హైవే దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రాష్ట్రాన్ని యధావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Share this article :

0 comments: