చంద్రబాబు పర్యటనకు రెడ్ కార్పెట్ పరిచిన కాంగ్రెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు పర్యటనకు రెడ్ కార్పెట్ పరిచిన కాంగ్రెస్

చంద్రబాబు పర్యటనకు రెడ్ కార్పెట్ పరిచిన కాంగ్రెస్

Written By news on Friday, November 1, 2013 | 11/01/2013

చంద్రబాబు పర్యటనకు రెడ్ కార్పెట్ పరిచిన కాంగ్రెస్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న డ్రామా మరోసారి బయటపడింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ జిల్లాలో చేపట్టిన పర్యటనకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. తుపాను బాధితులను పరామర్శించేందుకు నల్గొండ బయలుదేరిన చంద్రబాబు పర్యటనపై కాంగ్రెస్ నేతలు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.  బాబుకు భారీ బందోబస్తు కల్పించి తమ విధేయతను చాటుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణకు చంద్రబాబు అనుకూలంగా లేఖ ఇచ్చినందుకు ఆయన్ను అడ్డుకోలేమని ఏకంగా మంత్రి స్థానంలో ఉన్న జానారెడ్డి తెలిపారు. విజయమ్మ తెలంగాణ పర్యటనను అడ్డుకుని, బాబుకు అనుమతి ఇవ్వడం సర్వత్రా  విమర్శలకు తావిస్తోంది. 
 
 వైఎస్సార్ సీసీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది.  దీంతో మరోమారు టీడీపీ-కాంగ్రెస్ కలిసి ఆడుతున్న కుట్ర రాజకీయం బయటపడిందని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న విజయమ్మను పోలీసులు అడ్డుకొన్న ప్రభుత్వం, బాబు పర్యటనకు మాత్రం మార్గం అనుకూలంగా వ్యవరిస్తోంది.
Share this article :

0 comments: