'రాష్ట్ర విభజన జరిగితే పోలవరం ప్రాజెక్టు అసాధ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'రాష్ట్ర విభజన జరిగితే పోలవరం ప్రాజెక్టు అసాధ్యం

'రాష్ట్ర విభజన జరిగితే పోలవరం ప్రాజెక్టు అసాధ్యం

Written By news on Tuesday, November 26, 2013 | 11/26/2013

'రాష్ట్ర విభజన జరిగితే పోలవరం ప్రాజెక్టు అసాధ్యం'
ప.గో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే పోలవరం ప్రాజెక్టు అసాధ్యమని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది. విభజించు, పాలించు అనే నినాదంతో కేంద్రం రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయడానికి చూస్తోందని మండిపడింది. సోమవారం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్, తెల్లం బాలరాజులు టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. తండ్రి వైఎస్సార్ చేతిలో రెండుసార్లు అధికారాన్ని కోల్పోయిన టీడీపీ... కొడుకు వైఎస్ జగన్ చేతిలో పతనం అవ్వడం ఖాయమని తెలిపారు.  ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చి అధికారంలోకి వచ్చిన సంస్కృతి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుదని విమర్శించారు.
 
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన సంగతిని గుర్తు చేశారు. పది ఎంపీ సీట్ల కోసం కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తోందన్నారు. దేశంలో కాంగ్రెస్‌ను ఎదిరించి నిలబడిన వ్యక్తి వైఎస్ జగనేనని తెలిపారు.
Share this article :

0 comments: