విభజన తీరు సరైన సంప్రదాయం కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజన తీరు సరైన సంప్రదాయం కాదు

విభజన తీరు సరైన సంప్రదాయం కాదు

Written By news on Saturday, November 16, 2013 | 11/16/2013

విభజన తీరు సరైన సంప్రదాయం కాదు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనేది అతి పెద్ద అంశమని, విభజన విషయంలో ఇప్పుడు జరుగుతున్నది సరైన సంప్రదాయం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇదే జరిగితే కేంద్రంలో అధికారంలోఉన్న ఏ పార్టీ అయినా ఎన్నికల్లో లబ్ధికోసం ఏ రాష్ట్రాన్నయినా విభజించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నా, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని, రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరని చెప్పారు. ఆర్టికల్‌ -3ని సవరించేలా పోరాడుతామని, భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్తామని తెలిపారు.

భాషాప్రయుక్త ప్రాతిపదిక మీద ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్‌, ఆంధ్ర అసెంబ్లీలు రెండింట మూడొంతుల మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాయని, నాడు తెలంగాణ బిడ్డ, హైదరాబాద్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. తెలుగు ప్రజలు కలిసి ఉండాలని, విశాలాంధ్ర ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ దేశంలో మూడోదని, దేశంలోనే తెలుగు రెండో అతిపెద్ద భాష అయినా.. మమ్మల్ని విడగొట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది రేపు బీహార్‌లో జరగొచ్చు, తమిళనాడులో జరగొచ్చు, లేదా బెంగాల్‌లో జరగొచ్చని, రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటులో 272 సీట్లున్న ఏ ప్రభుత్వమైనా ఒక్క గీత గీసి రాష్ట్రాన్నివిభజించామని చెబుతాయని అన్నారు. ఏపీ విభజనతో కొత్త సంప్రదాయం ఒకటి మొదలవుతోందని, దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: