రైలు ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టాలని జగన్ పిలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైలు ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టాలని జగన్ పిలుపు

రైలు ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టాలని జగన్ పిలుపు

Written By news on Saturday, November 2, 2013 | 11/02/2013

సహాయక చర్యలు చేపట్టాలని జగన్ పిలుపు
హైదరాబాద్: విజయనగరం జిల్లా గొట్లాంలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఈ ప్రమాదంలో ఎక్కువ మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆదుకోవాలని పిలుపు ఇచ్చారు. క్షతగాత్రులకు రక్తం కావలసి ఉంటుందని, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.


విజ‌య‌న‌గ‌రం: గత రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన మరవకముందే  మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలోని గొట్లాం స‌మీపంలో  శనివారం దీపావ‌ళి పండుగ‌పూట పెనువిషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో రైలు కింద‌ప‌డి 15 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.  సిగ్నల్ లేకపోవడంతో బొకారో రైలు అక్కడే ఆగిపోయింది. అప్పుడే బొకారొ ఎక్స్ ప్రెస్ -1, ఎస్‌-2 బోగీల్లో పొగ‌లు, మంటలు చెలరేగాయంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు భయపడి రైలులో నుంచి ఒక్కసారిగా పక్క ట్రాకుపై దూకారు. ప్ర‌య‌ణికులంతా చైన్‌లాగి హ‌డావుడిగా దూక‌డంతో, అదే స‌మ‌యంలో పక్క ట్రాక్ పైకి దూసుకొచ్చిన విజయవాడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో  ఇప్పటివరకూ 15 మంది మృతిచెందిన‌ట్టు స‌మాచారం. పలువురు గాయపడ్డారు.
ఈ ఘ‌ట‌న రాత్రి 7.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రైలు ఒక్క‌సారిగా ఢీకొట్ట‌డంతో ట్రాక్‌పై మృత‌దేహాలన్ని చిధ్ర‌మైయ్యాయి. తెగిప‌డిన అవ‌య‌వాల‌తో ట్రాక్ భ‌యంక‌రంగా క‌నిపిస్తోంది. ఈ ఘోరప్రమాదంలో ఎంతమంది మృతిచెందారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మృతుల్లో చిన్నారులు, మ‌హిళ‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మృతుల్లో బెంగాల్ వాసులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉందని చెబుతున్నారు.
Share this article :

0 comments: