ఇటలీలో అన్నారు.. తెలుగులో అనలేరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇటలీలో అన్నారు.. తెలుగులో అనలేరా?

ఇటలీలో అన్నారు.. తెలుగులో అనలేరా?

Written By news on Thursday, November 7, 2013 | 11/07/2013

రోడ్ల దిగ్బంధం విజయవంతం: రోజా
రోడ్ల దిగ్బంధం విజయవంతం
* తొలిరోజు కార్యక్రమం విజయవంతమైంది : వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రోజా
*  ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సమైక్య ఆకాంక్షను చాటారు
* సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను దగా చేస్తున్నారు
* రాష్ట్రంలో 75 శాతం మంది ఉద్యమిస్తుంటే ఒక్కసారైనా ‘సమైక్యం’ అనరెందుకు బాబూ?
* ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా బండ రాయిలా మిగిలిపోయారు ఎందుకు?
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమం తొలిరోజు విజయవంతమైందని, ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున పాల్గొన్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా చెప్పారు. ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించేలా ప్రజలందరూ సమైక్య ఆకాంక్షను కళ్లకు కట్టారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇద్దరూ పదవులను అంట్టిపెట్టుకుని సీమాంధ్ర ప్రజలను దగా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు విధానమంటూ ఒకటి ఉందా? అని సూటిగా ప్రశ్నించారు.
 
 రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు గాను పార్టీలకు అతీతంగా అందరూ కలిసి అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనను కావాలనే పెడచెవిన పెట్టారన్నారు. ఇన్నాళ్లకు చంద్రబాబు అసెంబ్లీ తీర్మానమనడం విచిత్రంగా ఉందన్నారు. ఇరుప్రాంత నేతలతో రోజుకో మాట మాట్లాడిస్తూ టీడీపీ ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. గాయం చేయమని చేతికి కత్తి ఇచ్చి, తర్వాత సమన్యాయం అంటూ డ్రామా ఆడుతున్నారని రోజా మండిపడ్డారు. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందంటున్న సీమాంధ్ర టీడీపీ నేతలు... రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబును చొక్కా పట్టుకొని నిలదీసి, లేఖను వెనక్కు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
 
 ఇటలీలో అన్నారు.. తెలుగులో అనలేరా?
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని 75 శాతం మంది ప్రజలు 90 రోజులకు పైగా ఉద్యమిస్తున్నా... చంద్రబాబు ఒక్కమారైనా ప్రజల ఆకాంక్ష మేరకు ‘సమైక్యాంధ్ర’ అని ఎందుకు అనడంలేదని రోజా ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ఢిల్లీలో నిరాహారదీక్ష సందర్భంగా సోనియాగాంధీకి అర్థంకావడం కోసం ఇటలీ పదాలను ఉటంకించారు. రాష్ట్రం స్తబ్ధుగా ఉందంటూ ఇటలీ భాషలో ‘ఇమ్మొబిలిస్మో’ అని చంద్రబాబు అన్నారు. సోనియాకు అర్థం కావడం కోసం ఇటలీ పదాలను ఉపయోగించారుగానీ తెలుగు ప్రజల కోసం సమైక్యం అని ఒక్క మాట చెప్పలేరా?’’ అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమిస్తున్నా చంద్రబాబు మాత్రం బండరాయిలా మిగిలిపోయారన్నారు. ప్యాకేజీల నాయుడుగా ముద్రపడిన చంద్రబాబు తెలుగువాడిగా పుట్టినందుకైనా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని రోజా హెచ్చరించారు.
Share this article :

0 comments: