రైతుల దీనస్థితికి చలించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల దీనస్థితికి చలించిన జగన్

రైతుల దీనస్థితికి చలించిన జగన్

Written By news on Wednesday, November 27, 2013 | 11/27/2013

రైతుల దీనస్థితికి చలించిన జగన్విస్తరించు & ప్లే క్లిక్ చేయండి
నరసాపురం: భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి తదితర పంటలను ఆయన పరిశీలించారు. సారవ గ్రామంలో రైతుల దీనస్థితి చూసి జగన్ చలించిపోయారు. మోకాల్లోతు బురదలో దిగి రైతుల కష్టాలు తెలుసుకున్నారు.

అన్నదాతల దీనస్థితిపై దేశానికి తెలపాలని మీడియాను ఈ సందర్భంగా కోరారు. ఎకరాకు రూ.10వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీలం తుఫాన్ పరిహారం ఇంతవరకు అందలేదని.. అసలు ప్రభుత్వం ఉందా, లేదా అని ప్రశ్నించారు.  అన్నదాతలను ఎందుకు పట్టించుకోవడంలేదని అడిగారు.

పెదమైనవానిలంకలో వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే పెదమైనవానిలంకలో బ్రిడ్జి కట్టిస్తామని హామీయిచ్చారు. ఉప్పు తయారీదారులను రైతులుగా గుర్తిస్తాం, రుణలు ఇస్తామన్నారు. ఉప్పు నిల్వల కోసం గోదాములు నిర్మిస్తామని తెలిపారు. తీరం కోతకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, లెహర్‌ తుఫాన్‌ ముంచుకొస్తున్నా వైఎస్
జగన్‌ కోసం పెదమైనవానిలంక ఎదురుచూడడం విశేషం.
Share this article :

0 comments: