రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ కోరారు: శరద్ పవార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ కోరారు: శరద్ పవార్

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ కోరారు: శరద్ పవార్

Written By news on Monday, November 25, 2013 | 11/25/2013

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ కోరారు: శరద్ పవార్విస్తరించు & ప్లే క్లిక్ చేయండి
ముంబై : ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను కోరారని ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ తెలిపారు. అయితే, తెలంగాణకు అనుకూలంగా ఎన్సీపీ తొమ్మిది నెలల క్రితమే నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా జగన్ ముంబైలో సోమవారం నాడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను కలిశారు.

ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ, కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఉన్న న్యాయపరమైన అంశాలను జగన్‌ ప్రస్తావించారని, ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోవాలన్న అంశాన్ని జగన్‌ చెప్పారని తెలిపారు. ఆర్టికల్‌-3 అంశంలో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని జగన్‌ చెప్పారని, ఈ సమయంలో తమ అభిప్రాయం, నిర్ణయం అప్పుడే చెప్పలేనని, అయితే.. జగన్‌ లేవనెత్తిన అంశాలను తప్పకుండా తమ వర్కింగ్‌ కమిటీ ముందు ఉంచుతానని అన్నారు. రాజకీయ పునరేకీకరణ, ఎన్నికల అవగాహనలపై ఎలాంటి చర్చా జరగలేదని, కేవలం రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అంశాలపైనే చర్చ సాగిందని ఆయన అన్నారు.
Share this article :

0 comments: