విభజించు - పాలించు అనే రీతిలో కాంగ్రెస్ వ్యవహారం: ఉద్ధవ్ థాకరే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజించు - పాలించు అనే రీతిలో కాంగ్రెస్ వ్యవహారం: ఉద్ధవ్ థాకరే

విభజించు - పాలించు అనే రీతిలో కాంగ్రెస్ వ్యవహారం: ఉద్ధవ్ థాకరే

Written By news on Monday, November 25, 2013 | 11/25/2013

విభజించు - పాలించు అనే రీతిలో కాంగ్రెస్ వ్యవహారం: ఉద్ధవ్ థాకరే
ముంబై : దేశాన్ని సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందదని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. వాళ్లకు ఎలా నచ్చితే అలాచేస్తున్నారని, దీన్ని తాము నిరసిస్తున్నామని ఏపీ విభజనను తాము కూడా వ్యతిరేకిస్తున్నామని ఉద్ధవ్ థాకరే తెలిపారు. ప్రత్యేక విదర్భకు తాము వ్యతిరేకమని, జగన్‌ చెప్పినట్టు ఆర్టికల్‌ 3ని కేంద్రం దుర్వినియోగం చేయకూడదని ఆయన అన్నారు. అవసరమైతేనే రాష్ట్ర విభజన చేయాలని, ఆర్టికల్‌-3లో సవరణలు చేయాలని, రాష్ట్ర విభజనకు తీర్మానాన్ని తప్పనిసరిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని థాకరే డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని, అసెంబ్లీ ఆమోదించాకే పార్లమెంటుకు తీర్మానం వెళ్లాలని థాకరే చెప్పారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నవాళ్లు విభజించు - పాలించు అనే రీతిలో చూస్తున్నారని, బ్రిటిష్‌ వారి విధానాన్ని కాంగ్రెస్‌ అమలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ బిల్లు వస్తే తాము పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేస్తామని, మహారాష్ట్రను విభజించడానికి తము వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు.
Share this article :

0 comments: