ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం

Written By news on Saturday, November 2, 2013 | 11/02/2013

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డుకున్నారంటూ నల్గొండ జిల్లా, హుజూర్‌నగర్ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు శుక్రవారం ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రి ప్రోద్బలంతోనే కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కొందరు దుండగులు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేశారని వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నియోజకవర్గంలో తన మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని భావించిన మంత్రి తెలంగాణవాదం ముసుగులో ఇతర జిల్లాల నుంచి అల్లరిమూకలను దింపి అలజడి సృష్టించారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వైఖరిపై వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పర్యటనను అడ్డుకోవడాన్ని, మహానేత వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నియోజకవర్గంలో ఉత్తమ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రి అండతోనే విగ్రహాల ధ్వంసం జరిగిందని ఆరోపించారు. మనుగుడ ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి తెలంగాణ ముసుగులో దాడులు చేయిం చారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
 
  మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రోద్భలం తోనే కొందరు దుండగులు నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని  నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై  మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తు పాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడానికి వస్తున్న  వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. నియోజకవర్గంలో తన మనుగడ ప్రశ్నార్థకంగా మారే  అవకాశం ఉందని భావించిన మంత్రి ఉత్తమ్.. తెలంగాణవాదం  ముసుగులో  ఇతర జిల్లాల నుంచి అల్లరిమూకలను దింపి అలజడి సృష్టించారని మండిపడ్డారు. ఏనాడూ ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు తెలంగాణ ఊసెత్తడం హాస్యాస్పదమన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలంగాణ బిడ్డలేనన్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
 
 వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతుల పరామర్శలను రాజకీయాలు చేయడం తగదన్నారు. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి,కోడి మల్లయ్యయాదవ్, జడరామకృష్ణ, ముసంగిశ్రీను,గొట్టెముక్కల రాములు,కస్తాల ముత్తయ్య, పులిచింతల వెంకటరెడ్డి, మందా వెంకటేశ్వర్లు, కొమరాజు శ్రీను, అయిల ధనమూర్తి, దేవరకొండ వెంకన్న, కాలవ వెంకటేశ్వరరావు, పులిచింతల లక్ష్మమ్మ, పాతర్లపాటి లక్ష్మి, పశ్య మల్లేశ్వరి, దాసరి రాములు, బత్తిని సత్యనారాయణ, వేముల రాజు, పిల్లి మల్లయ్య, బారు రామారావు, నక్కా నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: