రేపు(శనివారం) ఉదయం జగన్‌ సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశo - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రేపు(శనివారం) ఉదయం జగన్‌ సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశo

రేపు(శనివారం) ఉదయం జగన్‌ సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశo

Written By news on Friday, November 15, 2013 | 11/15/2013

విభజనకు ఆంధ్రప్రదేశ్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
హైదరాబాద్: వైఎస్‌ జగన్‌ రేపు(శనివారం) ఉదయం సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశమవుతారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు నేత మైసూరా రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సీపీఎం కార్యదర్శి కారత్‌తో జగన్‌ భేటీ అవుతారని వెల్లడించారు. ఎల్లుండి సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ను జగన్ కలుస్తారని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీల నేతలనూ కలుస్తామన్నారు.

కోర్టు అనుమతి వచ్చాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను జగన్ కలుస్తారని అన్నారు. ఎవరు ఏంచెప్పినా కేంద్రం పెడచెవిన పెడుతోందని విమర్శించారు. విభజన విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని ఆరోపించారు. విభజన కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఎంపిక చేసుకుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం అధికార దుర్వినియోగమే పాల్పడుతోందని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: