కదం తొక్కిన విద్యార్థి లోకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » కదం తొక్కిన విద్యార్థి లోకం

కదం తొక్కిన విద్యార్థి లోకం

Written By news on Wednesday, December 11, 2013 | 12/11/2013


 వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సమైక్యాన్ని కాంక్షిస్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకం కదం తొక్కింది. పార్టీ నాయకుల సారధ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తించింది. జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలోచిలకలూరిపేటలో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. పట్టణంలోని ఎస్‌ఆర్, వివేకానంద, చైతన్య, కామినేని, మోడరన్, కాకతీయ, ఆర్‌వీఎస్‌సీవీఎస్ విద్యాసంస్థల విద్యార్థులు వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్‌వీఎస్ హైస్కూల్ రోడ్డు పాత విజయాబ్యాంక్ సెంటర్ నుంచి బ్యానర్లు, ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.


చౌత్రసెంటర్, మెయిన్‌బజారు, గడియార స్తం భం, మార్కెట్ సెంటర్, కళామందిర్ సెంటర్, పోలీస్‌స్టేషన్‌రోడ్డు మీదుగా తిరిగి చౌత్రసెంటర్ చేరుకొని అక్కడి నుంచి ఎన్నార్టీ సెం టర్ వరకు సాగింది. మంగళగిరిలో పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిడుగురాళ్లలో జంగాకృష్ణమూర్తి, వేమూరులో మేరుగ నాగార్జున, వినుకొండలో నన్నపనేని సుధ, తెనాలిలోప్రసాద్, అన్నాబత్తుని శివరావు తదితరుల సారధ్యంలో ప్రదర్శనలు జరిగాయి. ఇంకా బాపట్లలోని అన్ని మండలాల్లో ప్రదర్శనలు చేపట్టారు.
 
 గుంటూరులో..: వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డ్జిసెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ధ నుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో  ర్యాలీ చేపట్టారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు ఎండీ నసీర్‌అహ్మద్, షేక్ షౌకత్, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ షేక్ గులాంరసూల్, తూర్పు నియోజకవర్గ నాయకులు మహ్మద్ ముస్తఫా, పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పుటూరి న ర్సిరెడ్డి, నగర కన్వీనర్ పానుగంటి చైతన్య సారధ్యం వహించి ముందుకు కదిలారు.

లాడ్జిసెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన తాలుకా, శంకర్‌విలాస్ సెంటర్ మీదుగా ఓవర్‌బ్రిడ్జి వద్దకు చేరకుంది. అనంతరం ఓవర్‌బ్రిడ్జీపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. దీంతో సుమారు గంటన్నరకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది, తిరిగి అక్కడ నుంచి ప్రారంభమైన ప్రదర్శన హిందూ కళాశాల కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీ రాములు విగ్రహం వరకు కొనసాగిన అనంతరం మానవహారంగా ఏర్పాడ్డారు. అనంతరం శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రదర్శనకు పలు కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
Share this article :

0 comments: