సద్వినియోగం చేసుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సద్వినియోగం చేసుకోండి

సద్వినియోగం చేసుకోండి

Written By news on Wednesday, December 25, 2013 | 12/25/2013

 పులివెందుల/లింగాల/వేంపల్లె, న్యూస్‌లైన్ : పులివెందుల ప్రాంత రైతులే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల రైతులు వ్యవసాయ గోదామును సద్వినియోగం చేసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. దొండ్లవాగు సమీపంలో ఏర్పాటు చేసిన రైతు గోదామును వైఎస్ జగన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యువజన విభాగం నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులనుద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేక లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే గోదాములు ఉంటే.. పంట పండిన తర్వాత మంచి ధర వచ్చేంతవరకు నిల్వ చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు. పులివెందులలో రైతుల సౌకర్యార్థం గోదాములు నిర్మించిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలను ఆయన అభినందించారు. గోదాము వద్దనే ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

ఎమ్మెల్యేలతో కాసేపు :
 రైతు గోదాము ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన జిల్లాలోని ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ,ఆకేపాటి అమరనాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, డీసీసీబీ చెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రుక్మిణీదేవి, తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి తదితరులతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా చర్చించారు. రైతు గోదాము ప్రారంభం అనంతరం వైఎస్ జగన్‌రెడ్డికి పులివెందుల ఎస్‌బీఐ మేనేజర్ వెంకటసుబ్బయ్య పుస్తకాన్ని బహుకరించారు. ప్రముఖ ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన శంకరణ్ రచించిన పుస్తకాన్ని ఆయన వైఎస్ జగన్‌కు అందించారు.

 వైఎస్ జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు
 క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.  వీరితో పాటు వేంపల్లెకు చెందిన జగన్ సేవా సమితి అధ్యక్షుడు ఆర్.శ్రీను, యూత్ కన్వీనర్ వేణు,  అలాగే కడప అసెంబ్లీ సమన్వయకర్త అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు డీసీ గోవిందరెడ్డి, కన్వీనర్లు బెల్లంప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కల్లూరు చంద్ర ఓబుళరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొండయ్య, సర్పంచ్‌లు ఆర్‌ఎల్‌వి ప్రసాద్‌రెడ్డి, నారాయణ, డిష్ కొండయ్య, భారతి, ఝాన్సీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
.  
 
 
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్ : పులివెందుల నియోజకవర్గంలో మంగళవారం పర్యటించిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు కుటుంబాలను పరామర్శించారు. అలాగే దారిపొడవునా బ్రహ్మరథం పట్టిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు.
 
 స్థానిక జెండామాను వీధిలో నివాసముంటున్న కంచర్ల గంగాధరరెడ్డి సెప్టెంబర్ 7వ తేదీన గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులను మంగళవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మృతుడి భార్య లక్ష్మిదేవితోపాటు కుమార్తెను వైఎస్ జగన్ ఓదార్చారు. ముందుగా దివంగత సీఎం వైఎస్‌ఆర్, మృతుడు గంగాధరరెడ్డిల చిత్ర పటాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్ రాజారెడ్డి వీధిలో నివాసముంటున్న సింహాద్రిపురం మండల వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు కొమ్మా పరమేశ్వరరెడ్డి కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి తలసేమియా వ్యాధితో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో మృతి చెందారు. మంగళవారం రాత్రి పరమేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.  
 
 సిటీ కేబుల్ సూరి ఇంటికి వైఎస్ జగన్ :
 వైఎస్‌ఆర్ సిటీ కేబుల్ నెట్‌వర్క్ ఎండీ సూర్యనారాయణ ఇంటికి మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లారు. ఇటీవల వివాహం జరిగిన సూరి కుమార్తె భారతి, అల్లుడు అవినాష్‌లను ఆయన ఆశీర్వదించారు.
 
 బలిజ సంఘంలో కేక్ కట్..
 వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బలిజ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. నూతన కార్యవర్గ సభ్యులు పరిచయం చేసుకొని అనంతరం వైఎస్ జగన్‌తో క్రిస్మస్ కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు శ్రీపతి చిన్నబాలుడు, ఉపాధ్యక్షుడు సోపాల వీరా, శ్రీనివాసులు, సంఘ పెద్దలు నక్కావెంకటసుబ్బయ్య తదితరులు మాట్లాడారు. పులివెందులలో వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
Share this article :

0 comments: