ఆ పాపం చంద్రబాబుదే: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ పాపం చంద్రబాబుదే: జగన్

ఆ పాపం చంద్రబాబుదే: జగన్

Written By news on Tuesday, December 3, 2013 | 12/03/2013

ఆ పాపం చంద్రబాబుదే: జగన్
హైదరాబాద్: మిగుల జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కును రద్దు చేస్తూ సుప్రీకం కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి కౌంటర్ దాఖలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తెలిపారు. లోటస్ పాండ్ లో కృష్ణా నదీ జలాలపై బచావత్ అవార్డును  చంద్రబాబు అమలు చేయలేదని చెప్పారు.  నదీ జలాల విషయంలో రాష్ట్రానికిఅన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఏ విధంగా మిన్నకుండిపోయారో వివరించారు.

1973లో కృష్ణానదీ జలాలపై బచావత్ ఇచ్చిన తీర్పు ప్రకారం మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ కు పూర్తి హక్కులు లభించాయి. చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగులు జలాలు ఉన్నా ప్రాజెక్టులు కట్టడానికి ఆయన ప్రయత్నించలేదు. ఈ చంద్రబాబే దేవగౌడను ప్రధానిని చేశారు. కేంద్రంలో చక్రం తిప్పారు. ఆ సమయంలో కర్ణాటక సుప్రీం కోర్టుకు వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక వాదనకు పూర్తిగా మద్దతు ఇచ్చింది. 2000లో సుప్రీం కోర్టు రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. మిగులు జలాల హక్కును సుప్రీం కోర్టు  రద్దు చేసింది. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తీర్పుపై  చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీలైనన్ని ప్రాజెక్టులు కట్టి జలాలపై హక్కు సాధించాలని  ఆరాటపడ్డారు. అటువంటి మహానేతను విమర్శిస్తున్నారని బాధపడ్డారు. ఆ మహానేత తరువాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వారిని విమర్శించకుండా ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఆ మహానేతను చంద్రబాబు విమర్శిస్తారన్నారు.

రాష్ట్రాన్ని విడగొట్టే సమయానికి మిగులు జలాల అంశం లేకుండా చేయాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుకున్నారు. డిసెంబరు 9లోగా రాష్ట్రాన్ని విడగొట్టాలని అనుకున్నారు. అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ హడావుడిగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. మిగులు జలాలే లేవు, మీ చావు మీరు చావండని తేల్చారన్నారు.

రెండు జిల్లాలకు బదులు అన్ని జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రం అని పేరుపెడితే ఎవరు కాదన్నారు? అని జగన్ ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. తమకు ముగ్గురు సభ్యుల బలమే ఉన్నా తమ ప్రయత్నాలు తాము చేసస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే దేశమంతటా పర్యటించి జాతీయ నేతలను కలుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నదీజలాలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు అని తెలిసి కూడా విభజన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Share this article :

0 comments: