సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజు

సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజు

Written By news on Monday, December 2, 2013 | 12/02/2013

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజు సోమవారం చిత్తూరు జిల్లా పలమనేరులో కొనసాగనుంది. వి. కోట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ప్రధానంగా వి.కోట బస్టాండు సెంటర్, దొడ్డిపల్లి, కొమ్మరామడుగు, దియోదొడ్డి మీదుగా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ అన్ని ప్రాంతాల్లో రోడ్డు షోగా కొనసాగి, బైరెడ్డిపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడంతో పాటు విభజనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్ కుట్రలను, ఆ పార్టీకి వంతపాడుతున్న తెలుగుదేశం పార్టీ మోసాలను ప్రజలకు వివరించి,  దాంతో పాటు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబీకులను కూడా జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారు.


  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో మూడవ రోజైన సోమవారం కూడా సాగనుందని పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. మూడవ రోజు ఉదయం వి.కోట సమీపంలోని పట్రపల్లి నుంచి సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమవుతుందన్నారు. వి.కోట నుంచి దొడ్డిపల్లె, నెర్నపల్లె, మద్దిరాల, కృష్ణాపురం, దానవయ్యగారి పల్లె, కుమార మడుగుల మీదుగా కస్తూరి నగరం చేరకుంటుంది. అక్కడి నుంచి కైగల్, దేవదొడ్డి నుంచి బెరైడ్డిపల్లెకు యాత్ర చేరుకుంటుందని తెలిపారు. అక్కడ దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు.
 
Share this article :

0 comments: