కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు

Written By news on Monday, December 9, 2013 | 12/09/2013

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎంపీలు వైఎస్ జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డి

ఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తిరుగులేని పోరాటం చేస్తున్న  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది.  పార్టీ లోక్సభ సభ్యులు వైఎస్ జగన్మోహన రెడ్డి, మేకపాటి రాజమోహన రెడ్డి, ఎస్పివై రెడ్డి నోటీసును స్పీకర్కు అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఒక్క సభ్యుడు ఇచ్చినా స్పీకర్ స్వీకరిస్తారు. అయితే అవిశ్వాస తీర్మానానికి సభలో కనీసం 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతిస్తారు.

 సొంత ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కొందరు  స్పీకర్ లోక్సభ మీరా కుమార్కు నోటీసు అందజేసిన విషయం తెలిసిందే.  అవిశ్వాస తీర్మానంపై ఉండవల్లి అరుణ్ కమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, రాయపాటి సాంబశిరావు సంతకాలు చేశారు. తమ నేత చంద్రబాబు నాయుడును సమైక్యతకు ఒప్పించలేని  టిడిపి లోక్సభ సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
Share this article :

0 comments: