కుప్పం జనసంద్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుప్పం జనసంద్రం

కుప్పం జనసంద్రం

Written By news on Monday, December 2, 2013 | 12/02/2013

 తిరుపతి: జగన్ రాకతో కుప్పం జనసంద్రమైంది. రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. పెద్దాచిన్న, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గంలో ఆదివారం రెండోరోజు జగన్ చేపట్టిన సమైక్య శం ఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నవించారు. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైన యాత్ర శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 20కి పైగా గ్రామాల మీదుగా పలమనేరు నియోజకవర్గంలోని వెంకటగిరి కోట వరకూ సాగింది.
 
 శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో జగన్.. వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు. జనం అడుగడుగునా స్వాగతం పలకడంతో వి.కోటలో మధ్యాహ్నం 2 కు జరగాల్సిన సభ రాత్రి 8 గంటలకు జరిగింది. అనంతరం జగన్ రాత్రి బస కోసం దగ్గర్లోని పట్రాపల్లెలో ఉన్న పార్టీ నేత వాసు ఇంటికి వెళ్లారు. జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు,  తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎం.సుబ్రమణ్యంరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా తదితరులు ఉన్నారు.

చిత్తూరు: ‘చంద్రబాబు, సీఎం కిరణ్ విభజనకు సహకరిస్తూ డ్రామాలు ఆడుతున్నారు... ఈ డ్రామాలు ఎన్ని రోజులు ఆడుతారని ప్రశ్నిస్తున్నా’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అటు టీడీపీ వైఖరిని, ఇటు కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టా రు. రెండో రోజు ఆదివారం ఆయన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించారు.

రెండుచోట్ల ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ‘చంద్రబాబూ! మీరు  ఇంతవరకు విభజన లేఖను వెన క్కి తీసుకోలేదు. సమైక్యమని మీ నోట ఒక్క మాట వెలుపలికి రావడంలేదు. విభజనకు సహకరిస్తూ డ్రామాలు చక్కగా ఆడుతున్నారు. బాబుకు నేనేమీ తీసిపోనని కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి విభజన విషయంలో సహకరిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈడ్రామాలు కొనసాగిస్తా రు?’ అని  ప్రశ్నించారు. ‘ప్రస్తుతం ఢిల్లీ అహం కారానికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి పోరా టం జరుగుతోంది.

ఏ ఒక్కరికీ వేచి ఉండాల్సిన అవసరం లేకున్నా... పిల్లలను చంకన వేసుకుని తల్లులు, పనులకు వెళ్లాల్సినవసరమున్నా వెళ్లకుండా ఉన్న అన్నలు, నిలబడడం కష్టమైనా వేచి ఉన్న అవ్వా, తాతలు, మీ అడుగు లో అడుగులేస్తూ మీకు తోడుగా, అండగా ఉంటామంటూ వచ్చిన  ఎదురుచూసిన చిన్నపిల్లలు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అంటూ ధన్యవాదాలు తెలిపారు.  ‘చరిత్రలో రాజకీయ వ్యవస్థ మారాలి. ఆ మార్పు కుప్పం నుంచే మొదలు కావాలి’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
 
 ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడ?
 కృష్ణా జలాల నీరే లేకపోతే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం చదువుకున్న పిల్లలు, ఎక్కడికి పోవాలన్నారు. ‘హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగస్తులు కొన్న ప్లాట్ల విలువ విభజన కారణంగా పడిపోతే నష్టం ఎవరు కట్టిస్తారని సోని యాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబును నేను అడుగుతున్నా. చంద్రబాబూ!  సమైక్యానికి తూట్లు పొడిచి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన నీవు వస్తే తలుపులు తీయాలా? సమైక్యం కోసం పాటుపడుతున్న నేను వస్తే కుప్పం ప్రజలు తలుపులు మూసుకోవాలా?’ అంటూ ప్రశ్నించారు.  ‘చంద్రబాబును కుప్పం, చిత్తూరు జిల్లా ప్రజలు నిలదీయాలి. సమైక్యానికి అనుకూలంగా లేఖ ఇవ్వమని ఒత్తిడి తేవాలి. రాష్ట్రం మొత్తం ఐక్యంగా ఉన్నామన్న సందేశాన్ని దేశమంతా వినిపించాలనే ఒక బలమైన కారణంతోనే కుప్పం నుంచి సమైక్య యాత్ర ప్రారంభించా’ అని ఆయన అన్నారు.
 
 విభజనకు ‘నో’ అని చెప్పించిన జననేత
 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని విభజించడానికి ఒప్పుకోమని ప్రజలను చైతన్యపరుస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్రలో నాలుగు ప్రశ్నలను సంధిం చారు. వాటికి ప్రజల చేత ‘నో’ (ఒప్పుకోం) అనే సమాధా నం చెప్పించారు. రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఒప్పుకుం టారా..?, తెలుగుజాతిని విడగొడుతామంటే ఒప్పుకుం టామా..?, హైదరాబాద్ నగరం మనందరిదీ, అన్నదమ్ములుగా ఉన్న మనం హైదరాబాద్ కోసం కొట్టుకోవాలా?, రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాగాంధీ, ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, కిరణ్‌లను క్షమిస్తామా...? అని వ రుస ప్రశ్నలు వేశారు. ప్రజలతో ఢిల్లీకి వినపడేలా గట్టిగా నో అన్న సమాధానం చెప్పించారు. ‘త్వరలో వచ్చే ఎన్నిక ల్లో 30 ఎంపీ స్థానాలను గెలుచుకుందాం. ఎవరు మన రా ష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ఢిల్లీ గద్దెపై కూర్చొబెడుదాం.  ఢిల్లీ కోటను బద్దలు కొడుదాం... కొత్త కోటను మనమే నిర్మిద్దాం’ అంటూ ప్రజల హర్షాతిరేకాల మధ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు.
Share this article :

0 comments: