రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చూడాలి: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చూడాలి: వైఎస్ జగన్

రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చూడాలి: వైఎస్ జగన్

Written By news on Wednesday, December 11, 2013 | 12/11/2013

రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చూడాలి: వైఎస్ జగన్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు తమ సొంత నాయకురాలు సోనియా గాంధీపైనే అవిశ్వాసం ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చాటుతూ తాము కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని జగన్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సోనియా గాంధీ చేసిన అన్యాయాన్ని ఈ దేశం మొత్తం చూడాలని, వీలైతే ప్రపంచం కూడా చూడాలని వైఎస్‌ జగన్‌ అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానానికి తాము పట్టుబడతామని ఆయన వివరించారు.

అవిశ్వాసం పెట్టడం అనేది తెలుగు ప్రజల నిరసనకు నిదర్శనమని, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ మినహా మరోటి మాకు అంగీకారం కాదని వైఎస్‌ జగన్‌ అన్నారు. సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెట్టారంటే సోనియా తమ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో అర్థమవుతుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో కూడా విభజన బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. 70 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలొస్తాయని అందరికీ తెలుసని, అయినా అవిశ్వాసం పెట్టామంటే అది తమ ఆవేదనకు నిదర్శనమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా సోనియాపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నామని ఆయన అన్నారు.
ఇక అవిశ్వాసం విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. టీడీపీలో సొంత పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా అవిశ్వాసానికి మద్దతు పలకలేదని, అసలు ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు పార్లమెంటులోనే లేరని విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వమంటే చంద్రబాబు ఇవ్వలేదని, అలాగే అవిశ్వాసానికి మద్దతు చెబుతామంటూ పార్టీ తరఫున అధికారికంగా కూడా లేఖ ఇవ్వలేదని జగన్ అన్నారు. కానీ తాను దానిపై వ్యాఖ్యానించబోనని, ఆ పార్టీ సభ్యులంతా అవిశ్వాసాన్ని బలపరచాలని సూచించారు.


Share this article :

0 comments: