రాజ్యాంగ సవరణతోనే రాష్ట్రాలకు రక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజ్యాంగ సవరణతోనే రాష్ట్రాలకు రక్ష

రాజ్యాంగ సవరణతోనే రాష్ట్రాలకు రక్ష

Written By news on Sunday, December 29, 2013 | 12/29/2013

రాజ్యాంగ సవరణతోనే రాష్ట్రాలకు రక్ష
ఆర్టికల్ 3ని వక్రీకరించి రాష్ట్ర విభజన  వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం


 హైదరాబాద్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ఎమ్మెల్యేలను సామ, దాన, దండోపాయాలతో విభజన బిల్లుకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని వక్రీకరించి ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర విభజన ప్రక్రియ-సమాఖ్య స్ఫూర్తి’ అనే అంశంపై శనివారం మహాసభ కార్యాలయంలో జరిగిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనతో, కాస్తో కూస్తో మిగిలి ఉన్న సమాఖ్య స్ఫూర్తిని ఢిల్లీ పెద్దలు కాలరాస్తున్నారన్నారు. స్పీకర్‌కు కూడా ఢిల్లీ నుంచే ఆదేశాలు, తాయిలాలు అందుతున్నాయని ఆరోపించారు.

ఒక ప్రాతిపదిక లేకుండా.. కమిటీ, కమిషన్ ఏదీ చర్చించకుండా  విభజన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుపై ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు.  పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించడం దేశ సమగ్రతకు ఎంతో అవసరమని చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభలోగానీ, పార్లమెంట్‌లో గానీ కనీసం మూడింట రెండొంతుల మెజార్టీతోనే రాష్ట్రాల పునర్విభజన జరిగేలా రాజ్యాంగాన్ని సవరించాలని సూచించారు. లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి  ఎన్.తులసిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.నర్సింహారావు, కె.రవీంద్ర, పి.రామజోగయ్య, కె. నారాయణరావు, ఎ.మురళి, సయ్యద్ జాఫ్రీ, వీవీ కృష్ణారావు, విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులురవితేజ, చక్రవర్తి ఇందులో పాల్గొన్నారు.
Share this article :

0 comments: