విడిపోతే మూడు తరాలకు నష్టం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విడిపోతే మూడు తరాలకు నష్టం..

విడిపోతే మూడు తరాలకు నష్టం..

Written By news on Sunday, December 15, 2013 | 12/15/2013

జననేత కదనానికి సైదోడు కండి..
మండపేట/రాయవరం, న్యూస్‌లైన్ :రాష్ట్ర ప్రజల అభీష్టానికి అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సమైక్య ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని, తద్వారా సమైక్య ఆకాంక్షను ఎలుగెత్తి చాటాలని ఆ పార్టీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ ఆధ్వర్యంలో సమైక్య మహాసభ జిల్లాలో తొలిసారిగా మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రాయవరం మండలం        మాచవరంలో జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి అధికసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. స్థానిక వేణుగోపాల రైస్‌మిల్లు ఆవరణలో జరిగిన సభకు పార్టీ సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి తదితరులు హాజరయ్యారు. 
 
 విడిపోతే మూడు తరాలకు నష్టం..
 ఈ సందర్భంగా రెడ్డి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో బోస్ మాట్లాడుతూ విభజన వలన మొదటగా నష్టపోయేది సీమాంధ్ర విద్యార్థులేనన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దాదాపు 21 అత్యున్నత విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. విభజన వలన దాదాపు మూడు తరాల వారు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలు ఎడారిగా మారి రైతులు కుదేలవుతారన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న 40 లక్షల మంది సీమాంధ్రుల భవిష్యత్తు మాటేమిటని ప్రశ్నించారు. ఆగమేఘాలపై రాష్ట్రాన్ని విభ జించాలన్న కాంగ్రెస్ ప్రయత్నాన్ని సమష్టిగా అడ్డుకోవాలన్నారు. లేకుంటే ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు పట్టిన గతే మనకూ పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిట్టబ్బాయి మాట్లాడుతూ విభజన బిల్లును పార్లమెంటులో ఓడించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి దేశవ్యాప్తంగా పర్యటించి ఆయా పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నారన్నారు.
 
 త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తారని అన్నారు. విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులకు ముందే తెలుసని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తెచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కొల్లి నిర్మలకుమారి మాట్లాడుతూ కుమ్మక్కైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కొత్తపేట, ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావులు మాట్లాడుతూ జగన్ ఉద్యమానికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది తమ పార్టీ ఒక్కటేనన్నారు. 
 
 మహానేతకు నివాళి
 తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొడ్డు అనంత వెంకటరమణచౌదరి, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాల్, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, గుత్తుల సాయి, జయరాం, ఆకుల వీర్రాజు, అనుబంధ సంఘాల కన్వీనర్లు రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), కర్రి పాపారాయుడు, రొంగల లక్ష్మి, యనమదల మురళీకృష్ణ, పంపన రామకృష్ణ, గుత్తుల రమణ, గారపాటి ఆనంద్, మంతెన రవిరాజు, పార్టీ నేతలు ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి, కొవ్వూరి త్రినాథరెడ్డి, సత్తి వెంకటరెడ్డి, పోతంశెట్టి ప్రసాద్, సిరిపురపు శ్రీనివాసరావు, వల్లూరి రామకృష్ణ, ఆచంట సత్యనారాయణ, కోట వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: