కేంద్రం, రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలిస్తుంది: జనక్‌ప్రసాద్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రం, రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలిస్తుంది: జనక్‌ప్రసాద్‌

కేంద్రం, రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలిస్తుంది: జనక్‌ప్రసాద్‌

Written By news on Tuesday, December 10, 2013 | 12/10/2013

కేంద్రం, రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలిస్తుంది: జనక్‌ప్రసాద్‌
హైదరాబాద్: రాష్ట్రవిభజనపై కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర నుంచి సర్వత్రా విమర్శలు తలెత్తాయి.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్‌ మండిపడ్డారు.  కేంద్రం, రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వం పాలిస్తుందంటూ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 3పై... ఏకాభిప్రాయానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేసారని చెప్పారు.

కేంద్రం విభజన చేస్తుంటే.. చంద్రబాబు సమైక్యం అనే మాట ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా మారిందని ఆయన ఎద్దెవా చేశారు. చంద్రబాబు మీకు చిత్తశుద్ది ఉంటే గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ ఉపసంహరించుకోండని జనక్‌ప్రసాద్‌ డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: