అవిశ్వాసం రాకుండా లోక్‌సభ నిరవధికంగా వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాసం రాకుండా లోక్‌సభ నిరవధికంగా వాయిదా

అవిశ్వాసం రాకుండా లోక్‌సభ నిరవధికంగా వాయిదా

Written By news on Wednesday, December 18, 2013 | 12/18/2013

'అవిశ్వాసం' రాకుండా లోక్ సభ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. లోక్ పాల్ బిల్లును ఆమోదించిన తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మాన నోటీసులతో రెండ్రోజులు ముందుగానే సమావేశాలను కేంద్రం ముగించింది.
సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే లోక్‌పాల్‌ బిల్లుకు లోక్ సభ ఈ రోజు ఆమోదం తెలిపింది. యూపీఏ ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని సీమాంధ్ర ఎంపీలు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం వద్ద వైఎస్‌జగన్‌ సహా ఎంపీల ఆందోళన చేపట్టారు. అవిశ్వాసానికి వైఎస్సార్‌సీపీ నోటీసు ఇచ్చింది. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస నోటీసులను సభలో స్పీకర్‌ ప్రస్తావించారు. ఈ రోజు రెండు అవిశ్వాస తీర్మాన నోటీసులందాయని కూడా తెలిపారు. సభ నిర్వహణకు సహకరిస్తే నోటీసులను పరిగణలోకి తీసుకుంటానని స్పీకర్‌ చెప్పారు. అయితే చర్చకు మాత్రం అనుమతివ్వలేదు. దీంతో సీమాంధ్ర ఎంపీలు ఆందోళన కొనసాగించారు.

సభ జరిగే అవకాశం లేకపోవడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. తమకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గుతుందన్న భయంతోనే లోక్ సభ సమావేశాలను కేంద్రం వాయిదా వేయిందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాస తీర్మాన నోటీసులను స్వీకరించిన స్పీకర్- దీనిపై సభలో చర్చకు అనుమతించకపోవడం తమ ఆరోపణలకు బలాన్నిస్తోందని వారంటున్నారు
Share this article :

0 comments: