డెబ్బై రోజులలో కాంగ్రెస్ ను బంగళాఖాతంలో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డెబ్బై రోజులలో కాంగ్రెస్ ను బంగళాఖాతంలో

డెబ్బై రోజులలో కాంగ్రెస్ ను బంగళాఖాతంలో

Written By news on Thursday, December 19, 2013 | 12/19/2013

డెబ్బై రోజులలో కాంగ్రెస్ ను బంగళాఖాతంలో కలపబోతున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. అయినా అవిశ్వాసం పెట్టామని అన్నారు. అయినా తాము ఎందుకు అవిశ్వాసం పెట్టామంటే, కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్.పిలు సోనియాగాంధీపై అవిశ్వాసం ప్రకటిస్తున్న విషయాన్ని దేశమంతా తెలియచేయడం కోసం తాము మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు. టిడిపి ఎమ్.పిలు ఇద్దరు,ముఖ్యంగా టిడిపిపి నేత నామా నాగేశ్వరరావు వ్యతిరేకించడమే కాకుండా , తమ పట్ల వెటకారంగా కూడా మాట్లాడారని ఆయన అన్నారు.రాష్ట్రపతి విభజనకు అనుకూలంగా మాట్లాడి ఉంటే ఆయన సరిచేసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.మొత్తం మునిగిపోతున్నా అంతా బాగానే ఉందని కిరణ్ చెబుతున్నారని ,విభజన జరగదని చెబుతున్నారని అన్నారు.శాసనసభలో సమైక్య తీర్మానం చేసే అవకాశం ఉన్నప్పట్టికీ ఆ ప్రయత్నం కిరణ్ ఎందుకు చేయలేదని ఆయన అన్నారు.స్పీకర్ ను తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడ్డుకుంటారని, ఉప సభాపతి అప్పుడు సభకు వెళతారని, సరిగ్గా ఆ సమయంలోనే చంద్రబాబు కూడా అక్కడకు వెళ్లి చర్చ మొదలైందనిపిస్తారని జగన్ ఆరోపించారు.ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారికే పూర్తి మద్దతు ఇస్తామని గతంలో చెప్పామని,ఇప్పుడు కూడా చెబుతున్నానని జగన్ ఒక ప్రశ్నకు స్పష్టం చేశారు.దాని గురించే రాజ్ నాద్ సింగ్ ను కలిశానని అన్నారు.బిజెపి వారు చంద్రబాబుతో స్నేహం చేస్తారా?లేదా అన్నది వేరే విషయం అని,తాము రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని జగన్ తెలిపారు.చివరి నిమిషం వరకు సమైక్యం కోసమే,నిజాయితీగా పోరాడతామని, పారద్శకంగా ఉంటామని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: