చిత్తూరు జిల్లాలో మూడో రోజు ఆరంభమైన జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిత్తూరు జిల్లాలో మూడో రోజు ఆరంభమైన జగన్ పర్యటన

చిత్తూరు జిల్లాలో మూడో రోజు ఆరంభమైన జగన్ పర్యటన

Written By news on Monday, December 2, 2013 | 12/02/2013

చిత్తూరు జిల్లాలో మూడో రోజు ఆరంభమైన జగన్ పర్యటన
చిత్తూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజు సోమవారం చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. వి. కోట నుంచి ఆరంభమైన ఈ యాత్ర ప్రధానంగా వి.కోట బస్టాండు సెంటర్, దొడ్డిపల్లి, కొమ్మరామడుగు, దియోదొడ్డి మీదుగా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ అన్ని ప్రాంతాల్లో రోడ్డు షోగా కొనసాగి, బైరెడ్డిపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడంతో పాటు విభజనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్ కుట్రలను, ఆ పార్టీకి వంతపాడుతున్న తెలుగుదేశం పార్టీ మోసాలను ప్రజలకు వివరించి,  దాంతో పాటు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబీకులను కూడా జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారు.
Share this article :

0 comments: