రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

Written By news on Tuesday, December 24, 2013 | 12/24/2013

రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం, శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయాలని పేర్కొన్నారు. హింస, విద్వేషం, అసహిష్ణుత వంటి వాటికి పౌరజీవనంలో చోటు లేదన్నారు.

సర్వత్రా అశాంతి నిండిన ప్రస్తుత తరుణంలో క్రీస్తు ప్రవచనాలు మనకు దారి చూపుతాయనీ, శాంతియుత సహజీవనమే క్రిస్మస్ మనకు ఇచ్చే దివ్య సందేశమనీ వ్యాఖ్యానించారు.సకల జనుల సంయమనంతో కలిసి మెలిసి ఉండాలన్న క్రీస్తు బోధనలు ఆచరణలోకి వచ్చినప్పుడు సామాజిక సంక్షోభాలు సమసిపోతాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Share this article :

0 comments: