లోక్ సభలో జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోక్ సభలో జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు

లోక్ సభలో జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు

Written By news on Tuesday, December 17, 2013 | 12/17/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా  మరోసారి గళమెత్తారు.  దాంతో  సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌... జై సమైక్యాంధ్ర నినాదాల మధ్య... లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌ చేస్తూ  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఎస్ పీవై రెడ్డి మంగళవారం సభలో ప్లకార్డులు ప్రదర్శించారు.  స్పీకర్‌ పోడియం ముందు నిరసన నినాదాలు చేశారు.

 సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్ తో పాటు ఎంపీలు నినదించారు. ఈ గందరగోళం మధ్యే మంత్రులు, వివిధ కమిటీల సభ్యులు నివేదికలను సభకు సమర్పించారు. దాదాపు 15 నిమిషాల సేపు నివేదికల సమర్పణ కార్యక్రమం కొనసాగింది.  అవిశ్వాస తీర్మానాలపై 50 మంది సభ్యుల్ని లెక్కించేందుకు సహకరించాలని ఆందోళన చేస్తున్న సభ్యులను స్పీకర్‌  కోరారు.  అయితే వారెవరూ పట్టించుకోకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

అటు రాజ్యసభలో లోక్‌పాల్‌ బిల్లుపై చర్చ ప్రారంభమైంది.  బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు తమ అభిప్రాయాన్ని సభకు తెలిపారు.  అంతకు ముందు ప్రధాని మన్మోహన్‌ సింగ్... సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌తో సమావేశమయ్యారు.  లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే కూడా పాల్గొన్నారు
Share this article :

0 comments: