బాబుకు ధీటుగా సమాధానం చెప్పిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు ధీటుగా సమాధానం చెప్పిన జగన్

బాబుకు ధీటుగా సమాధానం చెప్పిన జగన్

Written By news on Tuesday, December 3, 2013 | 12/03/2013

http://kommineni.info/articles/dailyarticles/content_20131203_24.php

బచావత్ తీర్పు ప్రకారం మిగులు జలాలపై ఆంద్రప్రదేశ్ కే హక్కు ఉందని ,అయినా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల కాలంలో వాటిని ఉపయోగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే ఒక కేసులో సుప్రింకోర్టు తీర్పు లో మిగులు జలాలపై హక్కు లేదని పేర్కొందని, అప్పుడు చంద్రబాబు సరైన న్యాయవాదులను పెట్టలేదా అని జగన్ మండిపడ్డారు.ఈ తీర్పుపై చర్య తీసుకోవలసిన చంద్రబాబు నాయుడు రెండువేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగువరకు ముఖ్యమంత్రిగా ఉండి కూడా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.ఆ రోజులలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి త్వరగా పెద్ద ప్రాజెక్టులను కట్టి నికర జలలాను వాడుకునేలా చేయాలని కోరినా చంద్రబాబు విస్మరించారని ఆయన అన్నారు.ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎలాగైనా ఈ ప్రాజెక్టులను నిర్మించాలని గట్టి ప్రయత్నం చేస్తూ,నికర జలాలపై హక్కు పొందడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు.దానిపై ఇప్పుడు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.దేవెగౌడ్ హయాంలో ఇలాంటి తీర్పు వచ్చిందని,సోనియాగాందీ తన జన్మదినం నాడు తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించారని, బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిందని, అయినా కాంగ్రెస్ ను తిట్టవలసింది పోయి, సోనియాగాంధీని తిట్టవలసింది పోయి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శిస్తున్నారని జగన్ అన్నారు.వై.ఎస్.మరణం తర్వాత రోశయ్య,కిరణ్ లు ముఖ్యమంత్రులు అయ్యారని,వారికి కావల్సిన విధంగా లేఖలు ఇవ్వవవద్దని ఎవరైనా చెప్పారా అని జగన్ ప్రశ్నించారు.వై.ఎస్.మంచి చేయడం కోసం ఇచ్చిన లేఖను వక్రీకరించి, సోనియాను,కిరణ్ ను తిట్టకుండా, నాలుగేళ్ల క్రితం చనిపోయిన రాజశేఖరరెడ్డిని తిడుతున్నారని చంద్రబాబును ఆయన ఆక్షేపించారు.రాజకీయం ఎంతగా దిగజారిపోయిందంటే నీళ్లు రావని తెలిసినా విబజనకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు.చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ బలమైన వాదననే వినిపించినట్లుగా కనిపిస్తుంది.
Share this article :

0 comments: