బిల్లును మండలిలో పంచకుండా నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిల్లును మండలిలో పంచకుండా నిరసన

బిల్లును మండలిలో పంచకుండా నిరసన

Written By news on Monday, December 16, 2013 | 12/16/2013

 మండలిలో సెక్రటరీ నోట్ చదివితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించిందని పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. బిల్లును మండలిలో పంచకుండా తమ నిరసనను తెలిపామన్నారు. వివిధ పార్టీలకు చెందిన ఇతర మిత్రులు కూడా తమకు సహకరించారని ఆయన చెప్పారు. శ్రీనివాసులు నాయుడు, నన్నపనేని రాజకుమారి కూడా మద్దతు చెప్పారన్నారు. సమైక్యాంధ్ర మాత్రమే కావాలని, ఆమేరకు తీర్మానం చేయాలని తాము అడిగినా పట్టించుకోకుండా ఎవరో రాసిన తీర్మానం ప్రతిని తెస్తామంటే తాము దద్దమ్మలం కాదని జూపూడి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తీర్మానాన్ని అంగీకరించేది లేదన్నారు. బిల్లును పంచారని, దాన్ని తగలబెట్టారని అంటున్నారని.. పెద్దల సభలో మాత్రం ఇది అన్యాయమని ఎలుగెత్తి చాటుతామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా పర్యటించి అందరినీ కోరారని చెప్పారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు సమైక్యంగా ఉంచాలని కోరుకుంటుండటం వల్లే తాము విభజనను వ్యతిరేకిస్తున్నామన్నారు. కౌన్సిల్ లో తమ వాదన గట్టిగా వినిపించినట్లు చెప్పారు.

సీడబ్ల్యుసీ నుంచి వచ్చినా, రాష్ట్రపతి నుంచి వచ్చినా దీన్ని ఆమోదించేది లేదన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను తాము చదువుకున్నట్లు వాళ్లు చదువుకున్నారో లేదో అడగాలని చెప్పారు. అసలు డిమాండ్ ఉన్న రాష్ట్రాలన్నింటినీ వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నారన్నారు. ఏ సంప్రదాయాలను రుద్దాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికమని విమర్శించారు. రాజకీయ అవకాశాలకు కౌన్సిల్ వేదిక కాదని, కారాదని, దీన్ని వ్యతిరేకించి తీరుతామని అన్నారు. చేతనైతే దీన్ని కౌన్సిల్లో చర్చించాలని, తమ హక్కులను కూలదోసి ఎక్కడినుంచో వచ్చిన తీర్మానాన్ని చర్చించాలంటే సహించేది లేదన్నారు.

శాసనసభలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను 65 పేజీలు, షెడ్యూళ్లతో రూపొందించారు.
1వ షెడ్యూల్లో రాజ్యసభ సభ్యుల వివరాలు
2వ షెడ్యూల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుల వివరాలు
3వ షెడ్యూల్లో శాసనమండలి స్థానాల వివరాలు
5వ షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రంలోని  దళిత వర్గాల వివరాలు
6వ షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల సమాచారం
7వ షెడ్యూల్లో నిధుల వివరాలు
8వ షెడ్యూల్లో ఫించన్ల పంపిణీ వివరాలు
9వ షెడ్యూల్లో ప్రభుత్వ రంగసంస్థలు, కార్పొరేషన్ల వివరాలు
10వ షెడ్యూల్లో రాష్ట్రా స్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు
11వ షెడ్యూల్లో నదీజలాల నిర్వహణ, బోర్డుల విధి విధానాలు
12వ  షెడ్యూల్లో సహజ వనరులు బొగ్గు, విద్యుత్ విధివిధానాలు
13వ షెడ్యూల్లో విద్య, మౌళిక వసతుల వివరాలు
బిల్లు ప్రతులను అసెంబ్లీ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించినప్పటికీ వెబ్ సైట్ లో ఇంకా అందుబాటులోకి రాలేదు. అసలు అసెంబ్లీ వెబ్ సైట్ తెరిచేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నా, అది మాత్రం అసలు తెరుచుకోలేదు. ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించడం వల్ల బహుశా సర్వర్ సమస్య వచ్చి ఉండొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
Share this article :

0 comments: