తెలంగాణలో వైయస్ఆర్ సి‌పి బలోపేతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో వైయస్ఆర్ సి‌పి బలోపేతం

తెలంగాణలో వైయస్ఆర్ సి‌పి బలోపేతం

Written By news on Monday, December 2, 2013 | 12/02/2013

గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్
జగన్ వైయస్ఆర్ సి‌పి  పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే పని చేపట్టాడు.  సమైక్యం స్టాండ్ తీసుకున్న తరువాత ఆ ప్రాంతంలో ఆ పార్టీ ఖాళీ అయిందన్నంతగా హడావుడిచేసింది. నిజానికి ఈ మీడియా అంతా సమైక్యం అంటే పడి చచ్చేరకం.
అలాంటిది సమైక్యం కోసం జగన్ తెలంగాణలో పార్టీని పణంగా పెడితే, మెచ్చుకోవాల్సింది పోయి, ఇదే అదను అని వేయాల్సిన రాళ్లనీ వేసింది. అయితే అంతలోనే జగన్ బయటకు వచ్చిన తరువాత ఎవరూ ఏ పిలుపు ఇవ్వకుండానే, తీసుకురాకుండతానే వెల్లువలా వచ్చిన జనాన్ని చూసి, నివ్వెరపోయారు.హైదరాబాద్ లో సమైక్య సభకి కూడా తెలంగాణ ప్రాంతాల నుంచి జనం బాగానే వచ్చారు. దీంతో తెలంగాణలో జగన్ కు పట్టుంది అన్నది అర్థమయింది. అప్పటికీ దీన్ని జీర్ణించుకోలేని విపక్షలు విజయమ్మ పర్యటనకు ఆటకం కలిగించడం వంటి యత్నాలు చేసారు. అయినా జగన్ ఇవేమీ పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు అదే తెలంగాణలో పార్టీని బలోపేతం  చేసే దిశగా సాగిపోతున్నాడు.
తాజాగా పలు జిల్లాలకు పార్టీ కన్వీనర్లను నియమించారు. ఇందులో తెలంగాణ సెంటిమెంటు అధికంగా ఉన్న ఉత్తరతెలంగాణలో రెండు జిల్లాలు ఉండడమే వైఎస్సార్సిపి ఇంకా తెలంగాణలో ఉంది అనడానికి రుజువు. ఇక ఎన్నికలకు సై అంటూ జగన్ శనివారమే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఒకటి సమైక్య శంఖారావాన్ని పూరించి రణరంగంలోకి దిగితే రెండోది పార్టీని కూడా సంస్థాగతంగా పటిష్టం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం. ఇందులో భాగంగా ఎన్నికల సమన్వయ కమిటి ఏర్పాటు చేసారు.
అంతలోనే రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్లు లేని జిల్లాలకు కొత్త కన్వీనర్లను నియమించి ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసే విధంగా బాధ్యులకు దిశా నిర్దేశం చేసాడు.  కన్వీనర్లను నియమించిన జిల్లాల్లో తెలంగాణకు చెందిన ఆదిలాబాద్, కరీంనగర్  లు ఉండడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ గా వినాయక్ రెడ్డి, కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిలను నియమించారు జగన్. వీరితో పాటు ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గానికి సమన్వయ కర్తగా రవిప్రసాద్ ను నియమించారు. అంటే ఎవరెలా అనుకున్నా, జగన్ తాను అనుకున్న దిశగా తన కార్యక్రమాలు నడిపించుకుంటూ పోతున్నాడని అర్థమవుతోంది.

http://telugu.greatandhra.com/politics/political-news/telangana-lo-ycp-48583.html
Share this article :

0 comments: