తెలుగు రానివారు తెలుగు ప్రజలను చీలుస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగు రానివారు తెలుగు ప్రజలను చీలుస్తున్నారు

తెలుగు రానివారు తెలుగు ప్రజలను చీలుస్తున్నారు

Written By news on Sunday, December 1, 2013 | 12/01/2013

'తెలుగు రానివారు తెలుగు ప్రజలను చీలుస్తున్నారు'వీడియోకి క్లిక్ చేయండి
చిత్తూరు: : తెలుగు భాష రానివారు ఒక్కటిగా కలిసి ఉన్న తెలుగు ప్రజలను చీలుస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆదివారం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం  ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని వైఎస్ జగన్ ఈ సందర్బంగా ఎండగట్టారు.
 
ఢిల్లీ అహంకారానికి తెలుగువాడి ఆత్మగౌరవానిక మధ్య నేడు పోరాటం జరగుతుందని ఆయన అభివర్ణించారు. మన ఆత్మగౌరవం ఎలా ఉంటుందో ఢిల్లీ పెద్దలకు రూచి చూపిద్దామన్నారు. మన రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని పీఠంపై కూర్చోపెడదామన్నారు. హైదరాబాద్ నగరం మనందరిదని ఆయన స్పష్టం చేశారు. ఆ నగరం కోసం మనలో మనం కొట్టుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. అలాగే అన్నదమ్ములా కలిసి ఉన్న మనం విడిపోతే నీటి కోసం గొడవల పడాల్సి వస్తుందన్నారు.
 
నేటి రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యం అన్న మాట అటు సీఎం కిరణ్, ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుల నుంచి ఎందుకు రావడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పునీరు తప్ప మంచినీరు ఎక్కడని ఆయన ప్రశ్నించారు.
 
హైదరాబాద్ నగరం మనందరిదని ఆయన స్పష్టం చేశారు. ఆ నగరం కోసం మనలో మనం కొట్టుకోవాలని ఆయన ప్రశ్నించారు. నీటి కోసం అన్నదమ్ముల్లా కలసి ఉన్న మనం గొడవలు పడాల్సి వస్తుందని అన్నారు. నేటి రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తు వైఎస్ జగన్ సమైక్య శంఖారాం పేరిట యాత్రను శనివారం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: