అధిష్టానం డ్రామా…ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య నాటకం బట్టబయలు…!!?? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధిష్టానం డ్రామా…ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య నాటకం బట్టబయలు…!!??

అధిష్టానం డ్రామా…ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య నాటకం బట్టబయలు…!!??

Written By news on Tuesday, December 10, 2013 | 12/10/2013

N Kiran Kumar Reddy, Sonia Gandhi
N Kiran Kumar Reddy, Sonia Gandhi
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాద ముసుగులో రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. కిరణ్ విభజనకు సహకరిస్తున్నాడని, అధిష్టానం నాటకంలో తనవంతు పాత్రను పోషిస్తున్నాడని, అందుకే ఎన్నో అవకాశాలను చేజార్చుకుని మాటలకే పరిమితమయ్యాడనే ఆరోపణలు కొత్తేం కాదు.
కాగా ముఖ్యమంత్రి తీరుపై ఇప్పుడిప్పుడే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్, పీసీసీ అద్యక్షులు బొత్స సత్యనారాయణ వాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అధిష్టానాన్ని ధిక్కరించిన వారిపై తగుచర్యలు తీసుకుంటామని చెప్పిన బొత్స ఆ మేరకు ఎవరిపై చర్యలు తీసుకోవాలో జాబితా కూడా తయారు చేసిన విషయం తెలిసిందే. అలాంటి బొత్స సత్యనారాయణ అందరి కంటే ఎక్కువగా అధిష్టానానాన్ని పాతరేస్తున్న ముఖ్యమంత్రి విషయంలో మాత్రం ఆయనతో సహా దిగ్విజయ్ సింగ్ కూడా సమర్థిస్తుండడం ఈ అనుమానాలకు కారణం. తాజాగా దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో మాట్లాడుతూ సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాసం పెట్టడం బాధాకరమని అన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడాడో తెలుసుకుని స్పందిస్తానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ తప్పుగా ఏం మాట్లాడడం లేదని, కేవలం ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే చెబుతున్నాడని మళ్లీ వెనుకేసుకు వచ్చారు. అంతే కాదు బొత్స కూడా విలేఖరులతో మాట్లాడుతూ జేసి దివాకర్ రెడ్డి మితీమీరి మాట్లాడుతున్నారని ఆయనను బర్తరఫ్ చేయాలని అధిష్టానానికి లేఖ రాసానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం సరిగానే ఉన్నారని, కేవలం ఆయన తన స్వంత అభిప్రాయాలను మాత్రమే వ్యక్తం చేస్తున్నారని వెనుకేసుకువచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి విభజన విషయంలో అధిష్టానాన్ని ధిక్కరించి మాట్లాడిన దానిలో పదిశాతం కూడా జేసి దివాకర్ రెడ్డి మాట్లాడలేదు. అలాంటప్పుడు జేసిది కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చు కదా.
పైగా తెలంగాణ బిల్ రెండు రోజుల్లో అసెంబ్లీకి వస్తుందని, దానిని సజావుగా అసెంబ్లీ దాటించేందుకు ఏకంగా దిగ్విజయ్ సింగే హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో, బిల్లును అడ్డుకుంటాను అని నొక్కి వక్కానిస్తున్న ముఖ్యమంత్రిపై పార్టీ పెద్దలిద్దరు సానుకూలంగా ఉన్నారంటే ముఖ్యమంత్రి చివరిదాక సమైక్యం నాటకం ఆడి చివరకు దానిని నిలువునా పాతరేసి తన పని తాను సజావుగా చేస్తారేమో అన్న అనుమానాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి!!!

Share this article :

0 comments: