13 January 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

బాబువి శ్రీరంగ నీతులు: మేకపాటి

Written By news on Saturday, January 19, 2013 | 1/19/2013

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం తథ్యమని ఆపార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. 200లకు పైగా అసెంబ్లీ, 35 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ మద్దతు కోసం అన్ని పార్టీలు క్యూ కడతాయని మేకపాటి అన్నారు.

దేశ రాజకీయాల్లో జగన్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వైఎస్ఆర్ సీపీ కోరుకుంటుందని మేకపాటి తెలిపారు. శ్రీరంగ నీతులు చెబుతున్న చంద్రబాబు, ఆయన అవినీతిపై తెహల్కా రాసిన కథలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ తో పొత్తుండదు: మైసూరారెడ్డి

కాంగ్రెస్‌కు దేశంమొత్తం మీద 100 సీట్లు కూడా రావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి అన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం తమ పార్టీకి లేదన్నారు. డీజిల్‌ ధర పెంపును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ధరలు పెంచి సబ్సీడీ తగ్గించాలనుకోవడం బాధాకరమన్నారు. పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు.

MP Mekapati slammed CBN

YSRCP Leader M.V.Mysura Reddy press meet in YSRCP

‘ఎయిడెడ్’ సమస్యలు తీర్చాలి: ఏపీవైఎస్సార్‌టీఎఫ్

ఎయిడెడ్ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీ వైఎస్సార్ టీఎఫ్) డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న ఎయిడెడ్ టీచర్లను ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ నేతలు ఓబుళపతి, రామసుబ్బారావు, అశోక్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి శుక్రవారం పరామర్శించి మద్దతు ప్రకటించారు.

సీట్ల కోసం పాకులాడితే శృంగభంగమే: గోనె

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు సూచించారు. తెలంగాణ ఏర్పడితే 16 పార్లమెంటు సీట్లు గెలిపిస్తామని కాంగ్రెస్ నేత వయలార్ రవి భావించడం ఒట్టి భ్రమేనని, సీట్ల కోసమే రాష్ట్రం ఏర్పాటు చేయాలనుకుంటే ఎన్నికల్లో శృంగభంగం తప్పదన్నారు. శుక్రవారం సచివాలయంలో గోనె మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన బీజేపీ అనంతరం ఆ రాష్ట్రాల్లో పరాజయం పాలైందని, జార్ఖండ్ కోసం 30 ఏళ్లు పోరాడిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి తప్పలేదని గుర్తుచేశారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్


 తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అధిష్టానం దెబ్బతీస్తోందని, ఢిల్లీ వెళ్లిన మంత్రులను సైతం పార్టీ నుంచి వెళ్లిపోతే పోండి అన్నట్టుగా మాట్లాడ్డమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే అయినా రాష్ట్ర ప్రజాప్రతినిధుల, ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ధ్వజమెత్తారు.

శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే కె.శ్రీనివాసులుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్‌గాంధీ అవమానించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరడం వల్లనే కాంగ్రెస్‌కు ఆనాడు ప్రజలు గుణపాఠం నేర్పారని, ఇప్పుడూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రం ఈరోజు అధోగతి పాలుకావడానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరే కారణమని దుయ్యబట్టారు. చంద్రబాబు రోజుకోరకంగా మాట్లాడి గడి యకో అభిప్రాయం చెప్పడం వల్లనే రాష్ట్రం గందరగోళంలో పడిందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి నిర్ణయం తీసుకోవలసిన కాంగ్రెస్ రెండురకాలుగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అయోమయంలోనికి నెట్టిందని విమర్శించారు. అన్నిప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించడంతోపాటు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించేలా అభిప్రాయం చెప్పిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటేనని శ్రీనివాసులు పేర్కొన్నారు.

గర్జించి వస్తాడు సింహబలుడై...గాండ్రించి వస్తాడు బెబ్బులిపులై...

ఎవరన్నారు..! జగన్ జైల్లో ఉన్నాడని!
మా గుండె గదుల్లో ఉన్నాడని జనం అంటుంటే!!
ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం అవుతున్న సమరయోధుడిలా
పేదోడికి చేదోడుగా ఉండే ఆత్మీయ నేస్తంగా
ఆడపడుచులను ఆదుకునే ఆపత్కాల బాంధవుడిలా
రాజన్న ముద్దుల బిడ్డగా
విజయమ్మ వీర పుత్రుడిలా
కఠోర తపోదీక్ష చేస్తున్నాడు... జగనన్న!!

ఎవరన్నారు... జగనన్న అవినీతి పరుడని!
అక్రమార్కుల అవినీతిని
అంతమొందించే ఉగ్ర రూపమని జనం అంటుంటే!!
పెద్దల గద్దెలు కూల్చే పేదోడి పక్షపాతిలా
సూటిగా మడమ తిప్పని మహోన్నత శిఖరంలా
కసితీరా కృషినే నమ్ముకున్న నిత్యకృషీవలుడిలా
మహాశివుని మంగళ శాసనాలతో
అల్లా ఆశీర్వాదముతో
యేసుప్రభువు కృపాకటాక్షాలతో
అనంతమైన ఆలోచనలో ఉన్నాడు... జగనన్న..!

ఎవరన్నారు... జగనన్నది అధికార వ్యామోహమని!
అరాచక పాలనను అణచి వేసేందుకని జనం అంటుంటే!!
స్వాతంత్య్ర పోరాటంలో చెరసాలల పాలైన
భరతజాతి రత్నాల స్ఫూర్తిగా
బోసినవ్వుల బాపూజీ శాంతి మంత్రాన్ని...
ఆజాదీ తెచ్చేందుకు ఏ జాదూకూ తలవంచని
ఆజాద్ చంద్రశేఖర్ అస్తిత్వాన్ని...
చిరునవ్వుతో దర్జాగా ఉరికంబమెక్కిన
భగత్‌సింగ్ ఆత్మస్థైర్యాన్ని...
నిరుపమాన సాహసి నేతాజీ శౌర్యాన్ని... కలగలిసిన
భారతావని బంగారు భాగ్య విధాతగా
కాగల కార్యాన్ని లిఖిస్తున్న కర్మయోగి జగనన్న..!

ఔను... ఔను... ఔను...
జనం అంటున్నదే నిజం!
పది కోట్ల ప్రజలు కోరుకుంటున్నదే జగమెరిగిన సత్యం!
జైలు గోడలు జగనన్నను బందీ చేయలేవని
కుట్రలు కుతంత్రాలు జన హృదయ నేతను
ఎంతో కాలం నిర్బంధించలేవని... నిరూపిస్తూ
కుళ్లు సమాజాన్ని కూకటివేళ్లతో తుంచడానికి
రాబందుల రాక్షస క్రీడలను ఉక్కుపాదంతో తొక్కడానికి
అభాగ్యులను, అన్నార్తులను ఆదుకోవడానికి
రాజశేఖరుడు కలలుగన్న రామరాజ్య స్థాపన చేయడానికి
గర్జించి వస్తాడు సింహబలుడై
గాండ్రించి వస్తాడు బెబ్బులి పులియై
అఖిలాంధ్ర ప్రజలకు ఆప్తుడై
ఓర్పు నేర్పులతో ఓదార్చే ఓ నేస్తంగా
కష్టాల్లో కన్న కొడుకుగా
కన్నీళ్లు తుడిచే తోబుట్టువులా
ఆత్మీయతలో ఆపద్బాంధవుడిలా...
వస్తాడు, తిరిగొస్తాడు...
జయహో... జగన్! జయ జయ జయహో జగన్..!!

- ఎస్.సంతోష్‌రెడ్డి,
మాజీ మంత్రి, నిజామాబాద్

YSRCP MLA Srikanth Reddy fire on Congress and TDP

Written By news on Friday, January 18, 2013 | 1/18/2013

'వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు దారుణం'

సహకార ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు అధికారులు అండగా ఉంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రఘురామిరెడ్డి ఆరోపించారు. సహకార ఎన్నికల్లో అవకతవకలపై ఫిర్యాదు చేస్తే తమపైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన వాపోయారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న అక్కసుతోనే తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.

వైఎస్సార్ పార్టీలోకి వలసలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చింతలపూడి మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ బొడ్డు వెంకటేశ్వరరావు, టీడీపీ నేత నాగేశ్వరరావు, పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు శుక్రవారం చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేశ్‌ నేతృత్వంలో వైఎస్‌ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. 

*మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ మండలం నిడుగుర్తిలో వర్తకం జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో 1000 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

*తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో 100 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రౌతులపూడి మండలం ఎ.మల్లవరంలో 200మంది వైఎస్‌ఆర్‌ సీపీలోకి వచ్చారు.

*కృష్ణా జిల్లా పెడన మండంల కాకర్లమూడిలో ఉప్పల రాంప్రసాద్ నేతృత్వంలో 400 మంది వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది కాంగ్రెస్సే

 రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది కాంగ్రెస్సేనని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర విభజనపై ప్రజలను టీడీపీ, కాంగ్రెస్ నేతలు గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. రెండు పార్టీల నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్ని ప్రాంతాల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని అన్నారు.

'టీడీపీ అధికారంలోకి రావటం కల్ల'

ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారే టీడీపీ పగ్గాలు చేపట్టి ఆపార్టీని అధోగతి పాలు చేశారని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆమె శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ను వేధించి మరణానికి కారణమైన వారి అల్లుళ్లు, కుమారులు, కూతుళ్లు నేడు ఆయన ఫొటోలకు దండలు వేస్తూ నివాళులర్పించడం బాధాకరమన్నారు. 
ఎన్టీఆర్ చనిపోయిన నాడే టీడీపీకీ భవిష్యత్తు పోయిందని లక్ష్మీ పార్వతి అన్నారు. 

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నేతిబీరకాయలో నెయ్యి మాదిరిగా ఉందని, టీడీపీని ఆరిపోయే దీపంలా చంద్రబాబు మార్చారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని, అధికారం కోసం ఏగడ్డి అయినా కరిచే వ్యక్తి అంటూ లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్న టీడీపీ అధికారంలోకి రావటం ఇక కల్ల అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కు వారసులే లేరని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పేదల కోసం పనిచేసేవారే ఎన్టీఆర్ వారసులని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.

పాలకులు ఎన్ని కుయుక్తులు పన్నినా... ప్రజలు జగన్ వైపే

కాంగ్రెస్ పెద్దల చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారింది. కాంగ్రెస్ వాళ్లు ఏది చెప్తే సీబీఐ అది చేస్తుంది. అందుకే సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ముద్ర పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రతో రాష్ట్రంలో, దేశంలో రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2009లో అనుకోని సంఘటనలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందాడు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న విజయమ్మ... తండ్రిని కోల్పోయిన తనయుడు దుఃఖ సాగరంలో ఉండగా కొందరు తమ నీచమైన రాజకీయాల కోసం ఆ కుటుంబంపై కక్ష కట్టారు. అండగా నిలవాల్సిన వారు వెన్నుపోటు పొడిచారు. ఆనాటి నుంచి నేటివరకు ఆ కుటుంబ సభ్యులను ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. 

వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది మహనేత కోసం ప్రాణాలు అర్పించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్ తన తండ్రి కోసం చనిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తానని నల్లకాలువ సభలో వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి ఢిల్లీ పెద్దలు జగన్‌పై కక్ష కట్టారు. ఓదార్చడం భారతీయ సంస్కృతి అని చెప్పినా కేంద్రం వినలేదు. ఓదార్పు తప్పు అన్నట్లు ఇంట్లో కూర్చోమన్నారు. ఇది జీర్ణించుకోలేని జగన్... పార్టీ నుంచి బయటకు వచ్చాడు. రాజన్న రాజ్యం కోసం పార్టీ పెట్టి, వివిధ పథకాలతో జెండాను ఆవిష్కరించారు. ఇది ఢిల్లీ నాయకులకు నచ్చలేదు. అంతలోనే 2011 ఉప ఎన్నికలు వచ్చాయి. జగన్‌ను ఓడించాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నించింది. కోట్లు ఖర్చుపెట్టింది.

మంత్రులందరినీ కడపలోనే కేంద్రీకరించింది. సొంత చిన్నాన్నతో ఆరోపణలు చేయించింది. ఆఖరుకు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌ను ఓడించాలనుకున్నా ప్రజలు మాత్రం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. అఖండ మెజార్టీతో గెలిపించారు. ఇక జగన్ బయట ఉంటే రాష్ట్రంలో మనుగడ కష్టమని భావించిన సోనియా గాంధీ మే 27వ తేదీన జగన్‌ను అరెస్ట్ చేయించింది. ఎన్ని రోజులు.. ఎంత కాలం.. ఇలా జైలులో ఉంచుతారు? బెయిల్ కోసం పిటిషన్ వేస్తే చాలు సీబీఐతో చార్జిషీట్ వేయిస్తారు. ఎంతకాలం ఇలా చేస్తారు. జగన్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అంతు లేకుండా పోవడం ఖాయం. చివరకు న్యాయమే గెలుస్తుంది. ధర్మమే ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. రాజన్న రాజ్యం రావడం తథ్యం. 
- ఝాన్సీరజువా, ప్రసూననగర్, చింతల్, హైదరాబాద్

రైతు సోదరుడు... మా జగన్‌బాబు!

ఉదయించే సూర్యుని వెలుగును ఆపతరమా అని నేటి ప్రధాన ప్రతిపక్షం ఆలోచించుకోవాలి. పులి కడుపున పులే పుట్టినట్లుగా, మా రైతు రాజన్న కడుపున రైతుబిడ్డ జగన్ పుట్టాడు. జగన్ కేసులో ఎన్ని అవరోధాలు సృష్టించినా, అవహేళనలు చేసినా, త్వరలో జరగనున్న సహకార ఎన్నికల్లో, రైతు రాజ్యం కోసం, జగనన్న నాయకత్వం కోసం త్యాగాలు చేసేందుకు రైతన్న కంకణం కట్టుకున్నాడు. రైతులకు జగనన్నపై ఉన్న విశ్వసనీయత, ఆదరణ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటబోతున్నది. ఇంకా ఎన్నాళ్లు జగన్‌ను జైల్లో ఉంచుతారు? నిజంగా చట్టాలకు లోబడే జగన్‌ను జైల్లో ఉంచుతున్నారా లేదా పాలకుల ప్రలోభాలకు తలొగ్గి ఉంచుతున్నారా అనేది రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి, పల్లెలు, పట్టణాల్లోని ప్రజానీకానికి బాగా తెలుసు. 

ఈ రోజున జగన్‌ను వేధించడానికి అధికార, ప్రతిపక్షాల చేసుకుంటున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. ఈ అసమర్థ పాలక ప్రతిపక్షాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు. జగన్‌ని జైల్లో ఉంచినందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తున్నదో ఢిల్లీ పెద్దలకే తెలియాలి. వైఎస్సార్ కుటుంబాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ ముందుంది మంచి కాలం. సమయం ఏదైనా, సహనంతో ఉన్న ప్రతి పౌరుడు రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న నాయకత్వంలో సువర్ణావకాశాన్ని చూడగలుగుతాడు. సుపరిపాలనా ఫలాలను అందుకోగలుగుతాడు.

- ఎన్. సాంబశివరెడ్డి,
అకినేపల్లి మల్లారం, మంగపేట, వరంగల్


చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంది: ద్వారంపూడి


 రాష్ట్ర ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ఈ నెల 13వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన గురువారం గౌరవాధ్యక్షులు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని ఆశీస్సులు పొందారు. తమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామనే ఆవేదన శాసనసభ్యుల్లో ఉందన్నారు. అవిశ్వాసతీర్మానం సందర్భంగా తన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చినందువల్లనే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశానని... ఏడాది కాలంగా ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఒక కొత్త రేషన్‌కార్డు కూడా ఇప్పించుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత వైఎస్ సంక్షేమ పథకాల అమలు కూడా గాలికి వదలేశారని దుయ్యబట్టారు.

తాడిపత్రిలో కాంగ్రెస్ రౌడీయిజం: సురేఖ

Written By news on Thursday, January 17, 2013 | 1/17/2013

అనంతపురం: తాడిపత్రిలో రౌడీయిజం రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండాసురేఖ అన్నారు. మీడియాను సైతం కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్‌ పాలన సువర్ణయుగమైతే చంద్రబాబు, కిరణ్‌లది దుష్టపాలన అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ రెక్కల కష్టంతో ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రాంతాలు, మతాలు, కులాలకతీతంగా రాష్ట్రాన్ని వైఎస్ఆర్ అభివృద్ధి చేశారన్నారు.

కాంగ్రెస్‌లో ఉంటే జగన్ మంచివాడు.. బయటకు వస్తే చెడ్డవారు..ఇదీ కాంగ్రెస్ నైజం అన్నారు. వైఎస్ఆర్‌ రుణం తీర్చుకోవాలంటే జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జగన్‌ను సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సహకార ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ నేతల దౌర్జన్యాలకు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని కొండా సురేఖ ధైర్యం చెప్పారు.

జగన్ రిమాండ్ 31 వరకు పొడిగింపు

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ.బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో గురువారం చెంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరిని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు.

జేసీ దివాకర్‌రెడ్డికి ఎదురుదెబ్బ

తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దవడుగూరు మాజీ మండలాధ్యక్షుడు చిదంబరరెడ్డి సహా 5 వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, తాడిపత్రి నేతలు వీఆర్‌ రామిరెడ్డి, పైలా నర్సింహ్మయ్య హాజరయ్యారు.

Peoples join to YSRCP

చాలమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీలోకి..

వైఎస్ విజయమ్మ ఆశీస్సులు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఆనందంగా ఉందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్‌ సర్కారు సక్రమంగా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. పథకాలు సక్రమంగా అమలు చేస్తారేమోనని ఏడాదిగా ఎదురు చూసానని తెలిపారు. 

కాంగ్రెస్‌ వైఖరితో తీవ్రంగా నిరాశ చెంది వైఎస్‌ఆర్‌సీపీలో చేరినట్లు ద్వారంపూడి తెలిపారు. ఈనెల 13నే పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. చాలమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సీపీలోకి రాబోతున్నారని, ప్రభుత్వంపై ఎమ్మెల్యేలందరికీ వ్యతిరేకత ఉందని ద్వారంపూడి తెలిపారు. పార్టీ సీటు కోసం తాను వైఎస్ఆర్ సీపీలో చేరలేదని, సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు

వైఎస్ఆర్ సీపీలోకి వలసల జోరు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నర్సప్ప తనయుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. లోటస్‌పాండ్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 

విజయ్‌కుమార్‌తో పాటు జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు హజరయ్యారు.

అందుకే క్వారీలపై దాడులు

- కాంగ్రెస్‌ను వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరతానని ప్రకటించినందుకే: ఎమ్మెల్యే రవికుమార్
- అధికార పార్టీని వీడుతున్నందుకే ఎమ్మెల్యేలపై ఈ దాడులని అనుమానం
- నేడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి క్వారీపై దాడికి రెడీ! 

ప్రకాశం జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విజిలెన్స్ అధికారులు వారి గనుల్లో దాడులకు తెరతీశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన క్వారీలపై బుధవారం తనిఖీలు చేశారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి క్వారీ మూసి ఉండడంతో గురువారం దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది. తాను వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నానని, అందుకే తన క్వారీలపై దాడులు చేశారని రవికుమార్ బుధవారం చిలకలూరిపేటలో ఆరోపించారు. 

తాను వైఎస్‌ఆర్‌సీపీ కోసం పనిచేస్తానని దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మంగళవారం చీమకుర్తిలో తన అనుచరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో గనుల శాఖ డెరైక్టర్ జనరల్ ఆదేశాల మేరకే ఎమ్మెల్యేల క్వారీల్లో దాడులకు ఉపక్రమించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. రవికుమార్, శివప్రసాద్‌రెడ్డిలకు బల్లికురవ, సంతమాగులూరు, చీమకుర్తి మండలాల్లో క్వారీలు ఉన్నాయి. బుధవారం మైనింగ్, విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు బృందాలుగా ఏర్పడి బల్లికురవ మండలంలోని రవికుమార్‌కు చెందిన కిశోర్ గ్రానైట్స్, కిశోర్ శ్లాబ్స్, అంకమ్మ చౌదరి గ్రానైట్స్ (కామేపల్లి గ్రానైట్స్)లలో తనిఖీలు చేశారు. 

తనిఖీల సమయంలో క్వారీల్లో ఉద్యోగులు లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేదు. చీమకుర్తిలోని శివప్రసాద్‌రెడ్డికి చెందిన సూర్య గ్రానైట్ క్వారీలో దాడులు చేసేందుకు వె ళ్లిన విజిలెన్స్ అధికారులు క్వారీకి సెలవు కావడంతో తనిఖీ చేయలేదు. అక్కడ గురువారం దాడులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సూర్య గ్రానైట్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి వెనక్కి వస్తే ఆ క్వారీపైనే ప్రత్యేకంగా దాడికి వచ్చినట్లు అనుమానం కలుగుతుందని పక్క క్వారీల్లో తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. తనిఖీలపై మైన్స్ విజిలెన్స్ ఏడీ నర్సింహారెడ్డిని వివరణ కోరగా సమాధానం ఇవ్వలేదు.

sakshi

బాబును నమ్ముకుంటే...!

చంద్రబాబును నమ్ముకుంటే తమను నిండా ముంచారని సీమాంధ్ర టీడీపీ నేతలు కుయ్యోమొర్రో అంటున్నారట. అదికూడా కాంగ్రెస్ నేతలకు చెప్పుకొని తెలుగుతమ్ముళ్లు కన్నీరుమున్నీరవుతున్నారట. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరు యువ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత తీరుపై కస్సుమని లేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రికి ఒకరికి ఫోన్లు చేసి మరీ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారట. మీరే మమ్మల్ని రక్షించండంటూ వేడుకొంటున్నారట. తెలంగాణలో తిరుగుతున్నందున ఆ ప్రాంత నేతల ప్రభావానికి లోనయ్యో, లేదా పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చేసుకోవడానికో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి తమ కొంపముంచారని వాపోయారు. ఇంతజేస్తే అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలోనూ తామంతా రెంటికి చెడ్డ రేవడయ్యామని మొత్తుకుంటున్నారు. తెలంగాణ వచ్చినా అక్కడి ప్రజలు మా పార్టీని ఆమోదించే పరిస్థితి లేదు. అదే సమయంలో సీమాంధ్రలో మట్టికొట్టుకుపోతున్నాం. పాదయాత్రతో పార్టీని రక్షించే బదులు మొత్తం సమాధి చేస్తున్నారని మండిపడ్డారట. ఇప్పుడే ం చేయాలో అర్థంకావడం లేదు..! మీరే దారి చూపాలని ఫోన్లలో వేడుకుంటున్నారట.

సమైక్య డిమాండ్‌పై గురువారం జరిగే సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో మీరు తీసుకొనే నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నామని టీడీపీ నేతలు ఆ మాజీమంత్రితో అన్నారు. తెలుగు తమ్ముళ్లు చెప్పిన విషయాలపై ఆ తర్వాత మాజీ మంత్రికి డౌట్లు మొదలయ్యాయి. ఆ టీడీపీ ఎమ్మెల్యేలిద్దరూ సొంతంగా వారంతట వారే మాట్లాడుతున్నారా? లేక చంద్రబాబు డెరైక్షన్ మేరకు నడుస్తున్నారో అర్థంకావడం లేదని సదరు మాజీమంత్రి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చానని, కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయడం వల్ల సమస్య మళ్లీ మొదటికొచ్చిందని, కాంగ్రెస్ నేతల వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకోవడానికి చంద్రబాబు ఇలా చేస్తున్నారేమోనని ఆ మాజీ మంత్రి సందేహం వ్యక్తం చేస్తున్నారు. బాబును నమ్ముకుంటే...!! ఎలా అన్న అనుమానం మాజీగారి మదిలోకొచ్చేసింది.

టీడీపీ అనుయాయుల కోసం... సర్కారు ‘ఎస్సార్’!

- పొంతనలేని నిబంధనలతో ఏపీఎండీసీకి షోకాజ్ నోటీస్ 
- ముందు దరఖాస్తు చేసిన సంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలట
- ఏడేళ్ల తర్వాత అనుకోకుండా ‘గుర్తుకొచ్చిన’ నిబంధనలు
- ఎస్.ఆర్. కన్నా ముందు దరఖాస్తు చేసిన సంస్థల మాటేమిటో! 
- విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇవ్వటానికి ‘కేసులు’ అవరోధమట! 
- ఎస్.ఆర్. ప్లాంటుకు ఇవ్వటానికి అవే కేసులు అవరోధం కాదా? 
- ఈ మలుపుల వెనుక రాష్ట్రంలో కీలక నేత, కేంద్రమంత్రి ఒత్తిళ్లు 
- టీడీపీతో కాంగ్రెస్ కుమ్మక్కుకు నిదర్శనమంటున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అందరి నోటా నానుతున్న వివాదాస్పద ఓబుళాపురం ఇనుప గనులను ఎస్.ఆర్. మినరల్స్ అనే ప్రయివేటు సంస్థకు అక్రమంగా కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. అనంతపురం జిల్లా ఓబుళాపురం ప్రాంతంలో అత్యంత మేలురకం ఇనుప ఖనిజ నిల్వలున్న 45 ఎకరాల మైనింగ్ లీజును తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతకు సన్నిహితుడైన వ్యక్తికి చెందిన ఎస్.ఆర్. మినరల్స్‌కు కట్టబెట్టేందుకు ప్రభుత్వం తాజాగా పొంతన లేని నిబంధనలను తెరపైకి తెచ్చింది. 

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీని దెబ్బతీసి ఎస్.ఆర్.కు అక్రమంగా అనుచిత లబ్ధి చేకూర్చేందుకు సర్కారు పడుతున్న పాట్లు చూసి అధికారులు సైతం నివ్వెరపోతున్నారు. ‘ఎలాగైనా ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఏపీఎండీసీకి ప్రభుత్వం గత ఆగస్టు 6వ తేదీన షోకాజ్ నోటీసు (మెమో నంబరు 19040) జారీ చేసింది. ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు కట్టబెట్టాలన్న తపన తప్ప నిబంధనల ప్రకారం ఏపీఎండీసీకి మెమో జారీ చేయడంలో ఔచిత్యం లేదు. ప్రభుత్వం ఒక్కో కేసులో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ చట్టంలోని నిబంధనలను తనకు కావాల్సిన విధంగా కోట్ చేస్తోందని మెమోలోని అంశాలను బట్టే అర్థమవుతోంది. ఈ విషయం ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియని సందిగ్ధావస్థలో మేం ఉన్నాం. ప్రభుత్వ పెద్దల తీరు వల్ల మాకు ఇబ్బందిగా ఉంది...’ అని భూగర్భ గనుల శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

ప్రయివేటు కోసం ఏపీఎండీసీకి బండ...: ‘అటవీశాఖ క్లియరెన్సు తెచ్చుకునేందుకు శ్రద్ధ చూపనందున మీ దరఖాస్తును ఎందుకు తిరస్కరించరాదో 15 రోజల్లో వివరణ ఇవ్వాల’ని ఏపీఎండీసీకి ప్రభుత్వం పంపిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఏపీఎండీసీ 25 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం 27-10-2005న దరఖాస్తు చేసింది. ఎస్.ఆర్. మినరల్స్ ఇదే ప్రాంతంలోని 18 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం 12-10-2005నే దరఖాస్తు చేసింది. ఏపీఎండీసీకి ఈ 25 హెక్టార్ల మైనింగ్ లీజు ఇవ్వాలని పరిశీలించిన ప్రభుత్వం ఎస్.ఆర్. మినరల్స్ దరఖాస్తును తిరస్కరించాలని అప్ప ట్లో నిర్ణయించింది. దరఖాస్తు తిరస్కరించేందుకు ఎస్.ఆర్. మినరల్స్ నుంచి అప్ప ట్లో వివరణ కోరింది. ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా ముందు దరఖాస్తు చేసిన సంస్థకు ప్రాధాన్యం నిబంధనను తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం ఎస్.ఆర్. మినరల్స్ దరఖాస్తుకు ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ‘ఎస్.ఆర్. మినరల్స్ ఫారెస్ట్ క్లియరెన్సు కూడా తెచ్చుకుంది. రెండు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇనుము శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేసి వంద మందికి ఉపాధి కల్పించేందుకు ఎస్.ఆర్. మినరల్స్ ముందుకొచ్చింది. 

ఈ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఇనుప ఖనిజాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్‌కు సరఫరా చేయాలన్న షరతుతో ఎస్.ఆర్. మినరల్స్ మైనింగ్ లీజు దరఖాస్తును పరిశీలించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం ఏపీఎండీసీ దరఖాస్తు ను తిరస్కరించాలని నిర్ణయం తీసుకుంది.. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వండి. లేని పక్షంలో ఈ మైనింగ్ లీజుపై ఆసక్తి లేదని భావించి తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది...’ అని ప్రభుత్వం ఏపీఎండీసీకి పంపిన మెమోలో స్పష్టంగా పేర్కొంది. దీనిని బట్టే ఏపీఎండీకీకి బండ వేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. 

ముందు దరఖాస్తుకు ప్రాధాన్యం నిబంధన కొత్తగా వచ్చిందా? 
2005 నవంబర్ 10వ తేదీన 25 హెక్టార్ల మైనింగ్ లీజును కేటాయిస్తామంటూ ప్రభుత్వం ఏపీఎండీసీకి ఎలా రాతపూర్వకంగా తెలియజేసింది. 2007 జూన్ 18వ తేదీన మరోమారు ఏపీఎండీసీకి మైనింగ్ లీజు ఇస్తామంటూ ప్రభుత్వం ఎలా లేఖ పంపింది. అప్పుడు ప్రభుత్వానికి.. ‘ముందు దరఖాస్తుకు ప్రాధాన్యం’ అనే నిబంధన తెలియదా? అని అధికారులే ప్రశ్నిస్తున్నారు. ‘వాస్తవమేమంటే మైన్స్ అండ్ మినరల్స్ చట్టం -1957, ఖనిజ రాయితీల చట్టం 1960లో అనేక సెక్షన్లు ఉన్నాయి. మైనింగ్ లీజు కోసం మొదట వచ్చిన దరఖాస్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఓ సెక్షన్ చెబుతోంది. 

అయితే ఇదే అంతిమ నిబంధన కాదు. ప్రజా ప్రయోజనాలు, ఖనిజాన్ని తవ్వి సక్రమంగా వినియోగించుకునే విషయంలో సంస్థ అర్హతలు, అనుభవం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మైనింగ్ లీజులు కేటాయించవచ్చు. అందువల్ల మొదటి దరఖాస్తుకు ప్రాధాన్యం పేరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం దరఖాస్తుదారులకు లేదు..’ అని సంబంధిత నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘అందువల్లే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఈ ప్రాంతంలోని మొత్తం 93.5 హెక్టార్ల మైనింగ్ లీజుకోసం ముందుగా దరఖాస్తు చేసినా అప్పట్లో వైఎస్ సర్కారు ఆ సంస్థకు 68.5 హెక్టార్ల మైనింగ్ లీజు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 

వెనుక దరఖాస్తు చేసినప్పటికీ మిగిలిన 25 హెక్టార్లను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీకి ఈ మేరకు రెండుసార్లు ప్రభుత్వం లేఖలు పంపింది’ అని గుర్తుచేస్తున్నారు. దీనికి విరుద్ధంగా మొత్తం తాను దరఖాస్తు చేసిన 93.5 హెక్టార్లలో 68.5 హెక్టార్లు పోను మిగిలిన 25 హెక్టార్లు కూడా మొదటి దరఖాస్తుదారైన తనకే కేటాయించాలంటూ ఓఎంసీ కేంద్ర ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించటంతో కేంద్ర ప్రభుత్వం ఈ రివిజన్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీనినిబట్టే ముందు వచ్చిన దరఖాస్తు నిబంధన చెల్లదని స్పష్టమైంది. దీంతో ఎస్.ఆర్. మినరల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చి ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించాలన్న ప్రభుత్వ తాజా నిర్ణయంలో ఔచిత్యం లేదని స్పష్టమవుతోంది. ఫారెస్ట్ క్లియరెన్సు తెచ్చుకున్నంత మాత్రాన ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వాలని చట్టంలో నిబంధన ఎక్కడా లేదు. ఇలా కోరే హక్కు కూడా ఏ సంస్థకూ లేదు. ఖనిజ రాయితీ చట్టం - 1960 ఈ విషయం స్పష్టంగా చెబుతోంది. 

తనకు తానే మెమో ఇచ్చుకున్న ఉన్నతాధికారి?: పెపైచ్చు ఫారెస్ట్ క్లియరెన్సు ఇవ్వాల్సింది ప్రభుత్వం. ఏపీఎండీసీ ప్రభుత్వం రంగ సంస్థ. దీనికి ఫారెస్టు క్లియరెన్సు ఇప్పించాల్సింది ప్రభుత్వమే. ఈ పనిచేయకుండా ఫారెస్ట్ క్లియరెన్సు తెచ్చుకునే విషయంలో సరైన శ్రద్ధ చూపనందున ఏపీఎండీసీ మైనింగ్ లీజును రద్దు చేయాలని నిర్ణయించి మెమో జారీ చేయడం అన్యాయం. ఫారెస్ట్ క్లియరెన్సు సాధన కోసం ఏపీఎండీసీ శ్రద్ధ చూపనందున మైనింగ్ లెసైన్సు దరఖాస్తును ఎందుకు తిరస్కరించరాదో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దాసరి శ్రీనివాసులు మెమో జారీ చేశారు. 

ఆయన ఏపీఎండీసీకి చైర్మన్‌గా కూడా ఉండటం విశేషం! ఏపీఎండీసీ ఫారెస్ట్ క్లియరెన్సు సాధనపై శ్రద్ధ చూపకపోతే ఆ సంస్థ చైర్మన్ హోదాలో అధికారులను ఆ దిశగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితోపాటు ప్రభుత్వంపైనా ఉంది. పెపైచ్చు ఫారెస్ట్ క్లియరెన్సు కోసం తాము 2005లోనే దరఖాస్తు చేశామని ఏపీఎండీసీ ప్రభుత్వానికి పంపిన వివరణలో స్పష్టం చేసింది. ఎస్.ఆర్. మినరల్స్‌కు జారీ చేసిన ఫారెస్ట్ క్లియరెన్సును రద్దు చేయించి తమకు ఫారెస్ట్ క్లియరెన్సు ఇప్పించి మైనింగ్ లీజు ఇవ్వాలని కూడా కోరింది. 

విశాఖ స్టీల్ ప్లాంటుకు ఎందుకివ్వరాదు?: విశాఖ స్టీల్ ప్లాంటుకు ఖనిజం సరఫరా చేయాలన్న షరతుతో ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వాలని ప్రతిపాదించడంలోనూ ఏమాత్రం అర్థంలేదు. దీని బదులు ఏపీఎండీసీకే మైనింగ్ లీజు ఇచ్చి ఆ సంస్థ ద్వారానే విశాఖ స్టీల్ ప్లాంటుకు ఖనిజాన్ని సరఫరా చేయవచ్చు. లేదా నేరుగా విశాఖ స్టీల్ ప్లాంటుకే మైనింగ్ లీజు ఇవ్వవచ్చు. 

విశాఖ స్టీల్ ప్లాంటుకు మైనింగ్ లీజులు ఇస్తామని కొన్నాళ్ల కిందట ఇందిరమ్మ బాట సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నంలో చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటు అనంతపురం జిల్లాలోనే మైనింగ్ లీజు కోసం దరఖాస్తు కూడా చేసింది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో గనుల సరిహద్దు వివాదం కోర్టులో ఉన్నందున కేటాయించలేమని ప్రభుత్వం తరఫున కొన్ని నెలల కిందట గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ప్రకటించారు. మరి.. ఎస్.ఆర్. మినరల్స్‌కు లీజు మంజూరు చేయాలని అమితాసక్తి చూపుతున్న సర్కారుకు ఈ వివాదం ఎందుకు గుర్తుకు రావడంలేదు. ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించిన మైనింగ్ లీజును టీడీపీ అనుయాయునికి చెందిన ఎస్.ఆర్. మినరల్స్‌కు ఇవ్వాలని నిర్ణయించడాన్ని బట్టే టీడీపీ - కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం అర్థమవుతోందని అధికార వర్గాలతోపాటు రాజకీయ పక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. 

తెరపైకి ఇనుము శుద్ధి కర్మాగారం
ఒకవేళ ప్రభుత్వం ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించినా ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు రాదు. ముందు దరఖాస్తు నిబంధన ప్రకారమే చూసినా ఎస్.ఆర్. మినరల్స్ కంటే ముందు దరఖాస్తు చేసిన సంస్థలు ఎనిమిది ఉన్నాయి. వాటిని కాదని ఎస్.ఆర్. మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినా కేంద్రం తిరస్కరించే అవకాశాలు ఎక్కువ. అందువల్లే ఇనుము శుద్ధి కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదనను తాజాగా ఎస్.ఆర్. మినరల్స్ తెరపైకి తెచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల సూచన మేరకు ఈ ప్రతిపాదన రాగానే దీనికి అనుకూలంగా సచివాలయ స్థాయిలో ఫైలు చకచకా కదిలింది. ‘ఓబుళాపురం ప్రాంతంలో సరిహద్దు సర్వే పూర్తయ్యే వరకూ మైనింగ్ లీజులు కేటాయించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందుకే విశాఖ స్టీల్ ప్లాంటు దరఖాస్తును కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది. మరోవైపు ఓబుళాపురం మైనింగ్ కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మైనింగ్ లీజు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉంది. అయితే ఎస్.ఆర్. మినరల్స్ కోసం చాలా పెద్ద తలలు ఒత్తిడి తెస్తున్నందున ఏమైనా జరగొచ్చు’ అని ఓ అధికారి పేర్కొన్నారు. రాయలసీమకు చెందిన ఓ మాజీ మంత్రితో పాటు రాష్ట్రంలో కీలక నేత, ఓ కేంద్రమంత్రి ఎస్.ఆర్.కు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

sakshi

ప్రజల కోరిక మేరకే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి


ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టి పాటి రవి కుమార్ తాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించారు.ప్రజల అబీష్టం మేరకే తాను కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి రావాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాను ఈ ప్రకటన చేసినందుకే తన గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని ఆయన అన్నారు.కాగా తాను కొద్ది రోజులుగా అద్దంకి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలతో సమావేశమైన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని రవి కుమార్ తెలిపారు.ఎమ్మెల్యేల నుద్దేశించి రెండు కోట్ల సంతకాల గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.

సింహాన్ని బోనులో ఉంచి, నక్కలు రాజ్యం ఏలుతున్నాయి!

ప్రజల కోసం బతికే రాజన్న కుటుంబానికి ఎన్ని కష్టాలు! ఎందుకిలా ఈ రాజకీయనాయకులు జగన్‌బాబును వేధిస్తున్నారు!! అమ్మా విజయమ్మా, తల్లీ భారతీ, సోదరి షర్మిలమ్మా... మనం భయపడాల్సిందేమీ లేదు. అమ్మా మీరు ఎక్కడికీ పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేయనవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండండి. 2014 ఎన్నికలయ్యాక సి.ఎం. సీట్లో ఉండేది జగనన్నే. ప్రజల గుండెల్లో ఉన్న మనిషికి మాత్రమే అందలం ఎక్కే హక్కు ఉంటుంది. 

ఆ హక్కు జగన్‌బాబుకు ఉంది కాబట్టే ప్రజలే ఆయన్ని గెలిపించుకుంటారు. చంద్రబాబు గారి మాటలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు. ఆయన ‘వస్తున్నా మీ కోసం’అనే కన్నా, ‘వస్తున్నా నా కోసం’ అంటే బాగుంటుంది. ఇలాంటి వాళ్లంతా కలిసి కుమ్మక్కై జగన్‌ని జైల్లో పెట్టించారు. సింహాన్ని బోనులో ఉంచి నక్కలు ఎంతోకాలం రాజ్యం ఏలలేవు. పసలేని ఆరోపణలేవీ ఆయన్ని దోషిగా నిలబెట్టలేవు. అసలు దొంగలంతా బయట ఉండి, యువనేతను లోపల నిర్బంధించారు. ఈ సంగతులన్నీ ప్రజలకు తెలుసు. ఎంత అన్యాయంగా జగన్‌ని, ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారో రోజూ పేపర్లలో, టీవీలలో కనిపిస్తూనే ఉంది! ఒక్కడిని చేసి ఇంత మంది మీదపడడం ప్రజల హృదయాలను కలచివేస్తోంది. 

ఎంతసేపటికీ జగన్‌ని వేధించే వ్యూహాలను పన్నడం తప్ప పాలకపక్షంగానీ, ప్రతిపక్షం కానీ ఏనాడైనా ప్రజలను పట్టించుకున్నాయా? రాజన్న ఉన్నప్పుడు రాజ్యం ఎలా ఉండింది! ఇప్పుడెలా ఉంది? ప్రజల మీద భారం మోపకూడదని రాజన్న సబ్సీడీ భారాన్ని తన ప్రభుత్వం మీద వేసుకున్నారు. కేంద్రం చార్జీలు పెంచిన ప్రతిసారీ ‘పెరిగిన ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది, మీరు కట్టనవసరం లేదు’ అని భరోసా ఇచ్చిన ఆర్థికసాహసి ఆయన. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రతిదాన్నీ ప్రజలమీదికే తోస్తోంది. వాడని కరెంటుకు చార్జీలు విధిస్తోంది. మాట్లాడితే బస్‌చార్జీలు పెంచుతోంది. రైతుల్ని బాధల్ని పట్టించుకోవడం లేదు. సామాన్యుల ఇక్కట్లపై ధ్యాసే లేదు. ఈ పరిస్థితి మారాలంటే జగనన్న పాలన రావాలి. వచ్చి తీరుతుంది. అప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ నిజమైన పండుగ.

అమ్మా... విజయమ్మా, మీరు బాధపడొద్దు. మీకోసం ప్రతిక్షణం పోరాడే మీ బిడ్డలం మేం ఉన్నాము తల్లీ. జగన్ అన్న త్వరలోనే వస్తాడు. మన ఆశల్ని నెరవేరుస్తాడు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. అమ్మా... జగనన్న కోసం రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ‘దుఃఖపడువారు ధన్యులు’ అని దేవుడే చెప్పాడు కదా అమ్మా. బాధపడకండి. ఏ తప్పు చేయని బిడ్డ జైల్లో ఉన్నాడని మీరు బాధపడవచ్చు. మీ బాధ త్వరలోనే సమసిపోతుంది. అమ్మా... కొన్నిసార్లు మీరు కంటతడి పెడుతున్నారు. మీ కళ్లల్లో కనిపించవలసింది నీళ్లు కాదు తల్లీ... ధైర్యం ప్రతిఫలించాలి. మీ బిడ్డ విడుదలవుతాడు. ఆ రోజు వచ్చితీరుతుంది. ప్రజల ఆకాంక్షను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఉంటాను తల్లీ.. ప్రేమతో మీ ఆడబిడ్డ.

- సిహెచ్. కుమారి, కాకినాడ

చీకటి శక్తుల పన్నాగాన్ని చీల్చుకుని వస్తాడు 

ఆంధ్రరాష్ట్రం మొత్తం ఎండిపోయిన ఎడారిలా మారినప్పుడు తెల్లని పంచెకట్టుతో, చల్లని చిరునవ్వుతో వచ్చాడు రాజన్న. ఆ చిరునవ్వుకి రాష్ట్రం పచ్చగా చిగురు తొడిగి కళకళలాడింది. అది చూసి ఓర్వలేని చీకటి శక్తులు, తమ క్రూరమైన కంటిచూపుతో కాల్చివేశాయి. రాష్ట్రం మొత్తం జీవచ్ఛవంలా మారిన తరుణంలో, ఆ చీకటిని ఛేదించుకుని ఒక వెలుగులా వచ్చి నేనున్నానని ధైర్యాన్నిచ్చాడు జగన్. ఆ వెలుగును కూడా ఆర్పేయాలని కటకటాల వెనుకకు నెట్టివేశాయి ఆ శక్తులు. కాని రాష్ట్రప్రజల ప్రేమ, ఆప్యాయతలు అనే ఆయుధాలతో ఆ కటకటాలను చేధించి, మా జగనన్నను కాపాడుకుంటాం. మా మేలు కోరే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం.

- పోలూరి సునీతారెడ్డి, తనికెళ్ల, ఖమ్మం

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

క్షమాభిక్ష కోరలేదు.. విచారణ ఆపమనలేదు

* సీబీఐ సాగిస్తున్న కక్షపూరిత దర్యాప్తును మాత్రమే వివరించాం
* తండ్రిలా సరైన న్యాయం జరిగేలా చూడాలని విన్నవించాం
* మా భేటీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
* వ్యక్తులను బట్టి న్యాయం మారుతోంది.. ధర్మాన, మోపిదేవిల వ్యవహారమే ఉదాహరణ
* లారీల్లో ఎన్ని సంచుల డబ్బులు పడతాయన్న లెక్కలు చంద్రబాబుకే ఎక్కువ తెలుసు
* 26 జీవోలు సక్రమమేనని సీఎం స్వయంగా చెప్పాక జగన్ అరెస్టుకు అర్థం లేదు 

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులో సీబీఐ సాగిస్తున్న కక్షపూరిత చర్యలను వివరించేందుకే రాష్ట్రపతితో భేటీ అయ్యామని, అయితే కొన్నిపార్టీలు, మీడియా చానళ్లు తమ భేటీని రాజకీయం చేస్తున్నాయని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌పై విచారణ ఆపమని కానీ, క్షమాభిక్ష పెట్టమనికానీ కోరలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చింది మొదలుజగన్‌పై జరుగుతున్న కుట్రలు, బెయిల్ రాకుండా సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ప్రణబ్ ముఖర్జీకి వివరించామన్నారు. ఇదే సమయంలో వివిధ సందర్భాల్లో జగన్‌పై జనం చూపెట్టిన ప్రజాదరణను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని ఓ తండ్రిలా, రాజ్యాంగ పెద్దగా సరైన న్యాయం చేయాలని మాత్రమే కోరామన్నారు. 

జగన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం-జనం సంతకం’ కార్యక్రమంలో సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి అందించేందుకు మంగళవారం ఢిల్లీకి వచ్చిన విజయమ్మ బుధవారం పార్టీ నేత సోమయాజులు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ సీఈసీ సభ్యుడు కోన రఘుపతిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీబీఐ చార్జిషీట్ వేస్తే బెయిలొస్త్తుందన్న ఆశతోనే రాష్ట్రపతిని కలిశామని చెప్పారు. అయితే తాము క్షమాభిక్ష కోరుతూ ప్రణబ్‌ను వేడుకున్నట్లుగా కొందరు వ్యక్తులు, చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో జగన్ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును ఆమె ఎండగట్టారు.

బాబుకు తెలిసిన లెక్కలు మాకు తెలియవు..
లక్ష కోట్ల రూపాయలు సంపాదించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి అంత డబ్బెక్కడుందని విజయమ్మ ప్రశ్నించారు. ‘‘గతంలోనే మైసూరారెడ్డి ఈ లక్ష కోట్ల లెక్క చెప్పారు. జలయజ్ఞంలో వెయ్యికోట్లు, రెండు వేల కోట్ల అవినీతి కూడా దొరకడం లేదని అంటే చంద్రబాబు ఆదేశాలతో దానిని చివరికి లక్ష కోట్లుగా సృష్టించామని స్వయంగా మైసూరాయే చెప్పారు. ఇక ఎమ్మార్ కేసులో రూ.10వేల కోట్ల అవినీతి అని ఆరోపించారు. కానీ విజిలెన్స్ రూ.3వేల కోట్లని చెప్పింది. చివరికిఅన్నీ విచారించిన సీబీఐ.. ఏపీఐఐసీకి రూ.43 కోట్లు నష్టం వచ్చినట్లు తేల్చింది. ఇప్పటికే 70 శాతం విచారణ జరిపిన సీబీఐ మొత్తం లక్ష కోట్ల ఆరోపణలు చేసి నాలుగు చార్జిషీట్లలో కలిపి రూ.800 కోట్లు మాత్రమే అని లెక్క చెప్పింది’’ అని వివరించారు. అక్రమాస్తులు కూడబెట్టడం ఎలాగో తమకు తెలియదని, ప్రజలకుసేవ చేయడం మాత్రమే తెలుసని చెప్పారు. ‘‘ఎన్ని లారీల్లో ఎన్ని సంచులు పడతాయి, వెయ్యి లారీల్లో ఎంత సొమ్ము పడుతుందన్నది చంద్రబాబుకు, ఆయన కుమారుడికే ఎక్కువ తెలుసు. దోచుకోవడం, దాచుకోవడం వైఎస్‌కు తెలియదు. ఆయనకు కేవ లం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తెలుసు’’ అని వివరించారు.

ఎన్ని రోజులు జైల్లో పెడతారు?
సీబీఐ సాగిస్తున్న విచారణ ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఉందని విజయమ్మ తెలిపారు. ‘‘18 నెలలుగా విచారణ చేస్తున్నా సీబీఐ చార్జిషీట్ వేయకుండా, విచారణ పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తోంది. ఎంపీగా ఉన్నందున జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ ఆరోపిస్తోంది. అరెస్ట్‌కు ముందు 10 నెలలు జగన్ బయట ఉన్నప్పుడు ఎవరినీ ప్రభావితం చేయలేదు. ఎంపీగా ఉంటే ఎన్ని రోజులు జై ల్లో పెడతారు? కల్మాడీ, కనిమొళి, రాజాలు ఎంపీలే. వారికి బెయిల్ ఇచ్చారు. జగన్‌కు ఎందుకివ్వరు?’’ అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం ఉంటుందా? అని అడిగారు. ఇదే సమయంలో 26 జీవోల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘26 జీవోలు సక్రమమేనని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. మంత్రులు, అధికారులు అదే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. జీవోలన్నీ సక్రమమే అయినప్పుడు జగన్ ఎలా దోషి అవుతారు? ఇక్కడ క్విడ్ ప్రో కోకు అవకాశం ఎక్కడుంది?’’ అని ప్రశ్నించారు.

మోపిదేవిని బలిపశువును చేశారు
ఈ జీవోల విషయంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఓ న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద్‌కు మరో న్యాయం జరుగుతోందని విజయమ్మ అన్నారు. జీవోలతో ప్రమేయం ఉన్న ఒకరిని అరెస్ట్ చేస్తే మరొకరిని వదిలిపెట్టారని ఆరోపించారు. ఈ విషయంలో మోపిదేవిని ఉండవల్లి లాంటి వ్యక్తులు బలిపశువును చేశారన్నారు. అధికార పార్టీ నేత తమ్ముడన్న కారణంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ తమ్ముడు ల్యాంకో శ్రీధర్‌ను కేసు నుంచి తప్పించారన్నారు. 

ఇక చంద్రబాబుపై సీబీఐ విచారణలోనూ ఇదే రుజువైందన్నారు. వ్యాపారం చేసుకునే వ్యక్తి ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని స్వయంగా ఆర్థిక మంత్రి ఇటీవల వ్యాఖ్యానించారని విజయమ్మ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్‌యాదవ్ కేసులోనూ డింపుల్ యాదవ్‌కు సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. జగన్‌కు సైతం అప్పటి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకున్నా జైల్లో పెట్టించారన్నారు. జగన్‌పై కక్షపూరిత వైఖరికి నిరసనగా చేపట్టిన సంతకాల ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

అఖిలపక్షంలో చెప్పిందే మా వైఖరి..
తెలంగాణపై పార్టీ అభిప్రాయం ఎలా ఉందని అడగ్గా..‘‘తెలంగాణపై గతంలోనే పార్టీ ప్లీనరీ సమావేశంలో, మొన్నటి అఖిలపక్షంలో మా వైఖరి చెప్పాం. దానికే మేం కట్టుబడి ఉన్నాం. వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్ని వ్యక్తమైనా అఖిలపక్ష భేటీలో చెప్పిందే మా పార్టీ వైఖరిగా భావించాలి’’ అని విజయమ్మ బదులిచ్చారు. షర్మిల పాదయాత్ర మళ్లీ ఎప్పుడు మొదలవుతుందని అడగ్గా, ఈ నెల 28న వైద్యులు ఎంఆర్‌ఐ పరీక్ష చేస్తారని, ఆ తర్వాతే యాత్రపై నిర్ణయిస్తామన్నారు.

పీఎంఓ మానిటరింగ్ చేస్తున్నందునే రాష్ట్రపతిని కలిశాం: సోమయాజులు
‘‘గతంలోని 2జీ కేసును పూర్తిగా కోర్టు మానిటరింగ్ చేసింది. కానీ ప్రస్తుత జగన్ కేసులో లక్ష కోట్ల మేర అక్రమాలు జరిగాయని కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు చేయడంతో ఈ కేసును స్వయంగా పీఎంఓ మానిటరింగ్ చేస్తోంది. అయితే ఇందులో లక్ష కోట్ల అభియోగాలు మోపిన సీబీఐ రూ.800 కోట్లకు మాత్రమే లెక్కలు చెప్పింది’’ అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమయాజులు పేర్కొన్నారు. న్యాయవ్యస్థపై తమకు అపార నమ్మకం ఉందని, అయితే సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు సరైన రీతిలో లేనందునే న్యాయం కోసం రాష్ట్రపతిని కలిశామని వెల్లడించారు.

ఫ్యాక్టరీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గవద్దు

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013

వైఎస్ఆర్ సిపి కార్మిక విభాగం నేతృత్వంలో ఏడు కార్మిక సంఘాలు ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశాయి. బీడీ కార్మికులకు కనీస వేతనం కల్పించే జీవో 41ని పునరుద్దరించాలని ఆ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. జీవోను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్మికులు1500 కోట్ల రూపాయలునష్టపోయారని తెలిపారు. బీడీ కార్మికుల పొట్టగొట్టే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గవద్దని 
సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు వైఎస్‌ఆర్ సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ చెప్పారు.

కాంగ్రెస్ ను వదులుతున్నారు..సోదాలు చేశారు

ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలలో విజిలెన్స్ దాడులు జరిగాయి.మామూలుగా అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఉండదు.కాని ఇవి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, దర్శి ఎమ్మెల్యే బి.శివప్రసాదరెడ్డిలకు చెందినవి కావడం విశేషం. వీరిద్దరు కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళతారన్న వార్తలు వచ్చిన కొద్దిరోజులకు జరగడంతో సహజంగానే దీనికి ప్రాదాన్యత వస్తుంది.కాంగ్రెస్ లో ఉంటారనుకున్నపుడు క్వారీల జోలికి రాని అధికారులు , ఇప్పుడు వారు కాంగ్రెస్ కు దూరం అవుతారనగానే దాడులు చేసినట్లు కనిపించడం మరీ పచ్చిగా ఉంది. రాజకీయాలు ఇంతగా దిగజారకూడదు. సరిగ్గా జగన్ కేసులో కాంగ్రెస్ పార్టీ సిబిఐని ప్రయోగించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పార్టీ మారతారనుకున్న ఎమ్మెల్యేల క్వారీలపై దాడులు చేశారన్న భావన కలగడం మంచిది కాదు.అన్ని క్వారీలపై తనిఖీలు చేసి ,పద్దతిగా వ్యవహరించడంలో తప్పు లేదు కాని, మరీ ఇంత బహిరంగంగా కనపడేలా చేస్తే అదికారాన్ని దుర్వినియోగం చేసినట్లు అవుతుందేమో.

http://kommineni.info/articles/dailyarticles/content_20130116_27.php

టీడీపీ నేతలు మర్చిపోయారా: గోనే

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతిని కలిసిన సంగతి టీడీపీ నేతలు మర్చిపోయారా అని గోనె ప్రకాశరావు ప్రశ్నించారు. చంద్రబాబు మోకాళ్లపై యాత్ర చేసినా జనం నమ్మరని ఆయన అన్నారు. జగన్‌ను జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛంద సంతకాలు చేశారని..ప్రజల నిరసనను రాష్ట్రపతికి తెలిపేందుకే వైఎస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఆరోపణలు చేసిన ఆ రెండు పార్టీలు ఇప్పటికీ ఆధారాలు .......

కాంగ్రెస్, టీడీపీలు కలిసి జగన్ పై కేసులు వేశారు అని వైఎస్ విజయమ్మ ఆరోపించారు. లక్షల కోట్లు అవినీతి అని చెప్పి ఆరోపణలు చేసిన ఆ రెండు పార్టీలు ఇప్పటికీ ఆధారాలు చూపడం లేదని విజయమ్మ అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం మహానేత వైఎస్ఆర్ కు తెలియదని.. తన దగ్గర ఉన్నది పెట్టడమే వైఎస్ కు తెలుసు అని విజయమ్మ తెలిపారు. 

విచారణ చేయడంలేదు, ఛార్జిషీటు వేయడంలేదని.. బెయిల్ అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు అని.. జగన్‌ను ఎన్నిరోజులని జైల్లో పెడతారని విజయమ్మ ప్రశ్నించారు. సురేష్ కల్మాడీ, కనిమొళి, రాజాలు ఎంపీలే కదా..వారికి బెయిల్ ఎలా ఇచ్చారన్నారు. ఈ కేసులో మోపిదేవిని బలిపశువు చేశారని.. వారంరోజుల్లో బయటకు తీసుకొస్తానని చెప్పి... ఆయన్ని జైలుకు పంపారు అని విజయమ్మ అన్నారు. 

ధర్మానను ప్రాసిక్యూషన్ చేయడానికి క్యాబినెటే ఒప్పుకోలేదని.. చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తనకు ఆదేశిస్తే.. సిబ్బంది లేదని సాకులు చెప్పారన్నారు. ఇక ఈకేసు దర్యాప్తు నుంచి ల్యాంకో రాజగోపాల్ తమ్ముడిని మినహాయించడాన్ని ఆమె తప్పు పట్టారు. కేవలం 20 రోజుల వ్యవధిలో 2 కోట్లమంది జగన్ నిర్దోషి అని సంతకాలు పెట్టారు.. కోటి సంతకాల కార్యక్రమంపై కొన్నిఛానళ్లు దుష్ప్రచారం చేశాయి.. చానెళ్లు తీరు తీవ్ర బాధ కలిగించింది అని వైఎస్ విజయమ్మ అన్నారు. 

వ్యతిరేక మీడియాకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, జగన్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. వ్యక్తుల వ్యక్తిగత వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రధాని, ఆర్థికమంత్రి చెప్పారని.. ములాయం సింగ్ కేసులో ఆమె కోడలు డింపుల్ యాదవ్ పై విచారణ వద్దని సుప్రీం చెప్పిన విషయాన్ని విజయమ్మ ప్రస్తావించారు. అలాంటప్పుడు ఏ పదవిలో లేని జగన్ పై విచారణ ఎలా చేస్తున్నారు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. 

Popular Posts

Topics :