17 February 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

maro praja prasthanam images

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013

తన నీడను కూడా తాను విశ్వసించని నిత్య శంకిత.....

 










































http://telugu.greatandhra.com/kapilamuni/articles/mahamonagadu_23.php

Sharmila's padayatra Guntur On 23rd Feb 2013

బోన్‌లో ఉన్నా సింహం సింహమే

ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జిల్లాలోని పొందుగుల గ్రామానికి ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని తుగ్లక్ పరిపాలన అంటూనే అవిశ్వాసం పెట్టడానికి వెనుకాడుతున్నారన్నారు. కళ్లు ఆర్పకుండా వెయ్యి అబద్దాలు చెప్పగల ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఈ జన్మలో మాటమీద నిలబడరని అన్నారు. కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కై నీచరాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్ట్ పనులు 75శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయడానకి ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే కనీసం ఈ ప్రభుత్వం పరామర్శించడానికి ముందుకు రాలేదన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లపై కేంద్రం ముందుగానే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కపెట్టిందని విమర్శించారు. 

జగనన్నను 9 నెలలుగా జైల్లో పెట్టి కక్ష తీర్చుకుంటున్నారని, బోన్‌లో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని చెప్పారు. షర్మిలను చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు.

YS Sharmila fires on CM Kiran

YS Sharmila's Rachabanda in Vadapalli, Nalgonda

ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం


నల్గొండ : వైఎస్ షర్మిల శనివారం నల్గొండ జిల్లా వాడపల్లి నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర నల్లగొండ జిల్లా వాడపల్లి వంతెన మీదుగా గుంటూరు జిల్లా పొందుగల గ్రామంలోకి ప్రవేశించనుంది. గుంటూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 300 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.

నేడు ఆమె 9 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల18నే పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించాల్సించాల్సి ఉన్నప్పటికీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల మృతులకు సంతాప సూచకంగా యాత్ర వాయిదా పడింది

పేలుళ్ల మృతులకు షర్మిల సంతాపం

 బాంబు పేలుళ్లలో మృతి చెందినవారికి వైఎస్ షర్మిల సంతాపం తెలిపారు. శనివారం ఉదయం వాడపల్లిలో పాదయాత్రను ప్రారంభించిన ఆమె మృతుల ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈరోజు మధ్యాహ్నం గుంటూరు జిల్లాలో ప్రవేశించనుంది. రాత్రికి పులిపాడు క్రాస్ వద్ద షర్మిల బస చేస్తారు.

జగన్ కోసం జనం ఘోష

వినబడలేదా కోట్లాది ప్రజల గుండె ఘోష?
కనపడలేదా కోటిన్నర సంతకాల ఆశ భాష?
జనం కేక పొలికేకలా పోరు కేకలా మారకముందే
జగన్ కోసం జనగర్జన దిక్కులు పిక్కటిల్లకముందే
బుద్ధి తెచ్చుకోలేరా! మీ మనసులు శుద్ధి చేసుకోలేరా?
కుట్రలు, కుతంత్రాల భాగోతం ఎన్నాళ్లని?
జగనన్నకు, జననేతకు సంకెళ్లు ఎందుకని?
తెలుగుగడ్డ ఉడికిపోతున్నది, రగిలిపోతున్నది.
తెలుగురాష్ట్రం రణభేరి మోగించింది.
కేసుల డాలులతో, కుట్రలతో, కుతంత్రాలతో
అడ్డుకోండి... చేతనైతే ఆపుకోండి ప్రభంజనాన్ని.

- తుమ్మలపల్లి భాస్కర్, కోదాడ, నల్లగొండ

చట్టాన్ని ఉల్లంఘించి జగన్‌ని అరెస్ట్ చేశారు!

నిజానికి నేడు జనబాహుళ్యంలో చర్చ జరుగుతోంది జగన్ ‘అవినీతి’ గురించికాదు. రోజూ పుంఖానుపుంఖాలుగా అసత్య కథనాలు ప్రచురిస్తున్న పచ్చ పత్రికలను అడ్డం పెట్టుకొని కుట్రపూరితంగా జగన్‌గారిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, టి.డి.పి. నాయకుల గురించి! తమ కుతంత్రం ఎల్లకాలం సాగదని ఆ రెండు పార్టీల నాయకులు తెలుసుకోవాలి. చట్టాలని గౌరవించాలని, చట్టం చెప్పిందే వేదంగా భావించాలని అనునిత్యం ప్రజలకి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుండే బడా నేతల అసలు స్వరూపం ఏమిటో జగన్ పై ‘అవినీతి కేసు’ మోపడంతో తేటతెల్లమయింది. జగన్ గారికి అవినీతి బురద అంటించాలనుకున్న నాయకులను నేడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకు నిదర్శనం ఇటీవల నాకు ఎదురైన ఒక అనుభవమే. 

ఒకరోజు నేను ఆటోలో వెళ్తుంటే ఆ ఆటోడ్రైవర్‌కి, ఆటోలో నా పక్కన కూర్చున్న ప్రయాణికుడికి మధ్య జరిగిన సంభాషణను ఇక్కడ యథాతథంగా రాస్తున్నాను.

ఆటో డ్రైవర్: జగన్‌కి యూత్ ఫాలోయింగ్, మహిళల ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని దొడ్డిదారిన ‘తిరకాసు’ కేసొకటి పెట్టి కాంగ్రెస్, టి.డి.పి. వాళ్లు జగన్‌ని జైల్లో వేయించారట.

ప్రయాణికుడు: అధికారం ఉన్న వాళ్లు ఎన్నయినా చేస్తారు భయ్యా! అసలు అవినీతి కేసు జగన్ మీద పనిచెయ్యదంట. ఇదంతా పెద్ద పెద్ద సదువులున్న ఆ సి.బి.ఐ వాళ్లకీ, కేసులెట్టిన వాళ్లకి తెలియదా?! అంతా రంగులేసుకొని రాజకీయ నాటకాలు మొదలెట్టారు. 

ఆ.డ్రై : వారెంత నాటకాలు మొదలెట్టినా జనం నమ్మటంలేదు గదా? ఇదంతా రాజశేఖర్ రెడ్డి, ఆ జగనన్న సంపాదించిన కీర్తి ప్రతిష్టలు బదనాం చెయ్యటానికేనంట.

ప్రయా: ఏడ్చారు! మరొక వెయ్యి జన్మలెత్తినా రాజశేఖర్‌రెడ్డిని ప్రజలనుండి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. ఆయన జనంతో అంతగా కల్సిపోయి పనిచేసిండు. అయినా ఈ పెద్దలకింత ‘పిదప’ బుద్ధులెందుకు కల్గుతున్నాయో? ఇదేనేమో కలికాలం అంటే! పెద్దల బుద్దులు చిన్నవిగా మారిపోతే జగనే పెద్ద మనసుతో సి.బి.ఐ ఎంక్వయిరీకి సహకరించాడు. అసలు ఈ పెద్దలకు లాగా జగన్ నాటకం ఆడి ఆ రోజు సి.బి.ఐ ముందు హజరు కాకుండా తప్పించుకుని మరోరోజు కోర్టుకి హాజరయి ఉంటే అసలు జగన్‌ని అరెస్టు చేసి ఉండే వారు కాదు కదా? 

ఆ.డ్రై: ఎంతయినా ఈ కేసు దారుణం! ఇందులో చూపినంత శ్రద్ధ దేశాన్ని దాటివెళ్లిన బ్లాక్‌మనీని వెనక్కి తెప్పించటంలో చూపి ఉంటే నాలాంటి పేదోళ్ల బతుకులు బాగయి ఉండేవి.

ప్రయా : బాగా చెప్పావు భయ్యా! పేదల బతుకులు బాగు శేయాలన్న ‘రాజన్న’ మనకి దూరమయ్యాడు. పేదల ఆశాజ్యోతి జగన్‌ని కత్తిగట్టి మరీ జైల్లో పెట్టి ప్రజలకి దూరం చేశారు. 

- కె. పద్మావతి, అన్నోజిగూడ, రంగారెడ్డి జిల్లా

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యులుగా తాడేపల్లి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా గుంటూరు జిల్లాకు చెందిన తాడేపల్లి విజయకృష్ణను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయకృష్ణను నియమించినట్లు పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ టీఎస్ విజయ్‌చందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికైనా మేల్కొండి..


పౌరుల భద్రత విషయంలో మొద్దునిద్ర పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ బాంబుపేలుళ్ల ఘటనతోనైనా మేల్కోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కె.రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. పాలకులు భద్రతా వ్యవస్థను వారి భద్రత కోసం వినియోగించుకుంటున్నారే తప్పా పౌరులకు భద్రత కల్పించడం లేదన్నారు. ఉగ్రవాద ముప్పు ఉందన్న సమాచారం ముందే తెలిసినా పోలీస్ యంత్రాంగం, నిఘా వ్యవస్థలు చొరవ చూపకపోవడం క్షమించరాని విషయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి, అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పేలుళ్ల ఘటనలో ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలను అందించాలని, ఈ ఘటనకు పాల్పడిన నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులపై ఎల్లో మీడియా హడావుడి

* ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులపై ఎల్లో మీడియా హడావుడి
* స్వయంగా వాదనలు విన్నట్లు రాసేసిన రామోజీ 
* విచారణ మొదలు కాకున్నా... నేరం రుజువైందంటూ రాతలు
* తన షేరు విలువపై ఎన్నడూ నిజాలు చెప్పని ‘ఈనాడు’
* అసలు 100 రూపాయల షేరు 5.28 లక్షలకు అమ్మటమే రికార్డు
* వేరెక్కడా దొరకనట్టు ఎగబడి మరీ కొనేసిన రిలయన్స్
* అక్రమ బంధం కళ్లకు కడుతున్నా గురివింద రీతిలో రాతలు
* జడ్చర్లలో పరిశ్రమల కోసం బాబు హయాంలోనే 950 ఎకరాల భూ సేకరణ
* 2006 వరకూ మూడేళ్లపాటు ఏ పరిశ్రమా ముందుకు రాని తీరు
* 250 ఎకరాల్ని సెజ్‌గా మార్చేందుకు ఏపీఐఐసీ ప్రతిపాదన; కేంద్రం ఓకే
* హెటెరో, అరబిందో దరఖాస్తు చేయటంతో తలా 75 ఎకరాల కేటాయింపు
* ధరల కమిటీ నిర్ణయించిన ధరకన్నా తక్కువకు విక్రయించారట 
* కమిటీ నిర్ణయించింది విక్రయ ధర; ఏపీఐఐసీ కేటాయించింది లీజుకు
* లీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన కంపెనీలు; డెవలప్‌మెంట్ ఖర్చూ వాటిదే
* అసలు ముఖ్యమంత్రి టేబుల్ వద్దకు కూడా రాని ఫైళ్లు
* అయినా అన్నీ ఆయనకే అంటగడుతూ... జగన్‌ను ఇరికించే ఎత్తుగడలు
* ఇలాంటి ఆరోపణలతోనే తొలి చార్జిషీట్... దాని ఆధారంగానే అటాచ్‌మెంట్
* ‘సాక్షి’ మీడియా లక్ష్యంగా నగదు డిపాజిట్ల అటాచ్‌మెంట్
* ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ద్వారా సాక్షి గొంతు నొక్కే కుట్ర 

వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని విచారించకుండానే... తక్షణం శిక్ష విధించేయాలని ఈ రాష్ట్రంలో ఓ వర్గం బలంగా కోరుకుంటోంది. 

నాణేనికి రెండో కోణాన్ని చూపిస్తున్న ‘సాక్షి’ పత్రికను, చానెల్‌ను మూయించి తీరాలని కూడా ఆ వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 

జనాభిమానాన్ని నిరూపించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండానే చిదిమేయాలని భావిస్తోంది. 

ఇవన్నీ ఏ రకంగానైనా జరిగిపోవాలని తన వంతు కుట్రలు చేస్తోంది ఆ వర్గం. అందుకే దానికి ఎల్లో ముద్ర పడింది. ఆ సిండికేట్ కుట్రలు లోతుకెళుతున్నట్టే... దానిపై ముద్ర కూడా పెద్దదవుతోంది. వారం రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వులపై గురువారంనాడు ఒక వర్గం మీడియా చేసిన హడావుడి చూసినా... నేరం రుజువయింది అంటూ రామోజీరావు విషపుత్రిక ‘ఈనాడు’ కక్కిన కథనం చూసినా ఈ ఎల్లో కుట్ర ఎంత లోతైనదో తెలుస్తుంది. ఇక శుక్రవారంనాడు రామోజీ పనిగట్టుకుని ‘ఈడీ న్యాయాధికార సంస్థ’ ఆశ్చర్యపోయిందంటూ విచారణ తానే స్వయంగా చూసినట్టుగా రాసిన కథనం... ఎల్లో సిండికేట్ దిగజారుడు తనాన్ని, చౌకబారు ఎత్తుగడల్ని ఎత్తిచూపనే చూపిస్తోంది.
పీకల్లోతు నష్టాల్లో ఉన్న తన కంపెనీ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో రూ. 100 విలువైన ఒక్కో షేరును రూ.5,28,630 చొప్పున అమ్మేశారు రామోజీ. ప్రపంచంలో ఇంకెక్కడా షేర్లే దొరకనట్టు గొట్టాం కంపెనీల్ని సృష్టించి మరీ... 2,600 కోట్లు పెట్టి ఎగబడి కొనేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. వాటాదారులకు చెప్పకుండా వాళ్ల డబ్బును మళ్లించి, స్టాక్ ఎక్స్ఛేంజీలకు చెప్పకుండా మాయదారి మార్గంలో జరిగిన ఈ కొనుగోలును చూసి నవ్విపోనిదెవరు? సిగ్గు పడాల్సినదెవరు? శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు... అందరికీ నీతులు చెప్పే రామోజీ తాను చేసిందేమిటి? ఏం! నీతి నియమాలేవీ ఈ నేతి బీరకాయకు వర్తించవా? 

నేరం రుజువయినట్టా?
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం నేతలు వేసిన కేసులో హైకోర్టు ఆదేశంతో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. అది ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. అవే చార్జిషీట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా తన చార్జిషీట్లుగా దాఖలు చేస్తూ వస్తోంది. ఈ చార్జిషీట్ల మేరకు కొన్ని ఆస్తులు ఇప్పటికే సీబీఐ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. చార్జిషీట్ల వారీగా ఈడీ కూడా అటాచ్‌మెంట్ ఉత్తర్వులను జారీ చేస్తోంది. ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వులు కరెక్టా? కాదా? అనే అంశంపై ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ కోర్టు ఈడీకి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. 

ఇదీ... జరిగిన కథ. 
దీనర్థం నేరం రుజువయినట్టా? అసలు విచారణ జరిగిందా? వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై విచారణ ఇంకా మొదలైనా కాలేదే? ఆయన ప్రస్తుతం విచారణలో ఉన్న ఖైదీ కూడా కాదు. కేవలం రిమాండ్‌లో ఉన్నారు. రిమాండ్‌లో ఉంచగలిగేది కూడా 14 రోజులే. అందుకే ప్రతి 14 రోజులకోసారి రిమాండ్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా ఇదే తంతు కొనసాగిస్తున్నారు. ఇదంతా రామోజీకి తెలియదా? మరి ‘నేరం రుజువు’ అంటూ రాయటాన్ని ఏమనుకోవాలి? రామోజీ తన కోరికను, జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసును ఇంత నిర్లజ్జగా బయటపెట్టుకోవటాన్ని ఏమనాలి? రామోజీ మోసం చేస్తున్నదెవరిని? తన పాఠకుల్ని కాదా? పాఠకులంటే అంత లోకువా? 

ఈడీ ఆరోపణలివీ...
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్) హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలకు తలా 75 ఎకరాల్ని వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ కేటాయించింది. కమిటీ నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు ఈ భూమిని కేటాయించటం ద్వారా ఈ రెండు సంస్థలకూ తలా 8.6 కోట్ల చొప్పున మొత్తం 17.2 కోట్ల లబ్ధి కలిగిందని ఈడీ పేర్కొంది. 

* మెదక్ జిల్లా పాశమైలారంలోని ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ లో (ఈపీఐపీ) అరబిందో ఫార్మాకు ప్రభుత్వం భూమి కేటాయించింది. అది ఆ భూమిని తన అనుబంధ సంస్థ ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించింది. ఇలాకాక ట్రైడెంట్ నేరుగా ప్రభుత్వం నుంచి కొని ఉంటే ప్రభుత్వానికి రూ.4.3 కోట్ల మేర లాభం వచ్చేదనేది ఈడీ చేసిన మరో ఆరోపణ. 
* ఇలా ఈ రెండు సంస్థలకూ ప్రభుత్వం రూ.21.5 కోట్ల మేర లబ్ధిని చేకూర్చిం దని, అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో రూ.29.5 కోట్లను పెట్టుబడిగా పెట్టాయని ఈడీ చెబుతోంది. 
* ఈ రెండు మొత్తాలనూ కలిపి (రూ.21.5 కోట్లు + రూ.29.5 కోట్లు) 51 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చేసింది. 
* అసలు 21.5 కోట్లు లబ్ధి కలిగినందుకు ప్రతిఫలంగా 29.5 కోట్లు పెట్టుబడి పెట్టడమనేదే అర్థంలేని ఆరోపణ. అలా ఎవ్వరూ చేయరని ఈడీకి తెలి యదా? ఇది జగన్‌మోహన్ రెడ్డిని ఇరికించటానికి చేస్తున్న ఆరోపణ కాదా?

వైఎస్సార్‌కు, జగన్‌కు సంబంధమేంటి?
అసలు ఈ ఆరోపణలతో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి సంబంధం ఉందా? ఆయన పాత్రేంటి? నిజంగా ఆయనే వీటికి భూములు కేటాయించారా? సీఎం సంతకాలు చేశారా? కేటాయింపు ఆదేశాలిచ్చారా? ఈ ప్రశ్నలన్నిటికీ లేదనే సమాధానం వస్తుంది. దీనికి మూలాలన్నీ చంద్రబాబునాయుడి హయాంలో కనిపిస్తాయి. సీబీఐ గానీ, ఈడీ గానీ అటువైపు చూడకపోవటమే చిత్రాతిచిత్రం. 

చంద్రబాబు హయాంలోనే భూ సేకరణ...
జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 954 ఎకరాల భూమిని సేకరించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందే ఈ భూ సేకరణ పూర్తయిపోయింది. దీనికి ఎకరాకు రూ.75 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించారు. భూ సేకరణ పూర్తయిన తరవాత మూడేళ్ల దాకా... అంటే 2006 వరకూ ఏ ఒక్క పరిశ్రమా ఇక్కడ కంపెనీ పెడతామంటూ ముందుకు రాలేదు. అప్పుడు... అంటే 2006లో నాటి ఏపీఐఐసీ ఎండీ బి.పి.ఆచార్య రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్రానికి ఒక ప్రతిపాదన చేశారు. మొత్తం 954 ఎకరాల భూమిలో 250 ఎకరాల్ని సెజ్‌గా ప్రకటిస్తే పరిశ్రమలు ముందుకు రావచ్చని, అవి యాంకర్ యూనిట్లుగా కూడా నిలుస్తాయని చెప్పారు. 2006 అక్టోబర్లో కేంద్రం దీనికి అనుమతించింది. యాంకర్ యూనిట్లను ప్రోత్సహించటానికి ఈ సెజ్‌లో ఎకరాకు రూ.15 లక్షలు వసూలు చేయాలని ధరల కమిటీ నిర్ణయించింది. 2006 డిసెంబర్ 31 లోగా ఈ ధరకు భూమిని కేటాయించాలని, లేదంటే ధరను పక్కనబెట్టి 50 ఎకరాలను కేటాయించాలని... వీటిలో ఏది ముందు జరిగితే అది చేయాలని సూచించింది. 

నవంబర్లోనే దరఖాస్తులు...
2007 జూన్, అక్టోబర్ నెలల్లో ఈ సంస్థలకు భూమి కేటాయించారని, నవంబర్-డిసెంబర్ నెలల్లో అవి పెట్టుబడులు పెట్టాయని... ముడుపుల సంగతి నిరూపించటానికి ఇదొక్కటి చాలని ఈడీ పేర్కొన్నట్టుగా ఈనాడు రాసేసింది. అసలు ఏం జరిగిందో తెలుసా? 
2006 నవంబర్‌లో హెటెరో, అరబిందో సంస్థలు ఏపీఐఐసీకి లేఖలు రాశాయి. తమకు ఆ సెజ్‌లో తలా 75 ఎకరాలు కేటాయించాలని కోరాయి. ఈ లేఖల్ని పరిశీలించిన ఏపీఐఐసీ అధికారులు ఎండీ బి.పి.ఆచార్యకు పంపారు. చివరికి ఎకరా 7 లక్షల చొప్పున విక్రయానికి ఓకే చేశారు. కాకుంటే ఇక్కడ గమనించాల్సిందొకటుంది. ఎకరాకు రూ.15 లక్షల ధరను నిర్ణయించింది ఏకమొత్తంగా అమ్మటానికి. కానీ ప్రభుత్వం ఎకరా రూ.7 లక్షల చొప్పున కేటాయించింది లీజు పద్ధతిన. రూ.7 లక్షల చొప్పున ధర నిర్ణయించి... ఆ ధరలో ఒక శాతాన్ని ఏడాదికి లీజు అద్దెగా చెల్లించాలనేది హెటెరో, అరబిందో సంస్థలతో చేసుకున్న ఒప్పందం. ఆ లీజు మొత్తాన్ని ఒకేసారి ముందే చెల్లించాలనేది కూడా ఒప్పందంలోనే ఉంది. దీంతో ఆ రెండు సంస్థలూ భూమిని తీసుకున్న వెంటనే ఎకరాకు రూ.7 లక్షల చొప్పున లీజు అద్దెను ఒకేసారి చెల్లించేశాయి. అంటే ఎకరాకు రూ.7 లక్షల చొప్పున సొమ్ము ముందే ఏపీఐఐసీ చేతికి వచ్చింది. లీజు గడువు ముగిశాక ఆ భూమి ఎలాగూ ఏపీఐఐసీదే. దీన్ని ప్రభుత్వానికి కలిగిన నష్టంగా భావించవచ్చా? 

పెపైచ్చు ఏపీఐఐసీ ధరల కమిటీ నిర్ణయించిన ధర మామూలు కేటాయింపులకు వర్తించేదే. అంటే చుట్టూ కాంపౌండ్ వేసి... మధ్యలో రోడ్లు వేశాక అమ్మితేనే వర్తిస్తుంది. కానీ జడ్జర్ల సెజ్‌కు అలాంటివేమీ చేయలేదు. కంచె, రోడ్లు, వీధిలైట్ల వంటి సౌకర్యాలేవీ లేవు. అవన్నీ హెటెరో, అరబిందోలే వేసుకున్నాయి. మరి అభివృద్ధి చేసిన భూమిని ఎకరా 15 లక్షలకు ఏకమొత్తంగా విక్రయించాలనుకున్నపుడు... అభివృద్ధి చేయని భూమిని ఎకరా రూ.7 లక్షల చొప్పున... లీజుకివ్వటం తప్పా? అసలు దీంట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాత్రేమిటి? కనీసం ఈ ఫైళ్లు ఆయన టేబుల్ వద్దక్కూడా రాలేదనే విషయాన్ని సీబీఐ, ఈడీ ఎందుకు చెప్పటం లేదు. కంపెనీలు ముందుకు రావటం, ఏపీఐఐసీ కేటాయించటం ఈ రాష్ట్రంలో కొత్తేమీ కాదుగా? మరి దాన్ని ముఖ్యమంత్రికి అంటగట్టడంలో దురుద్దేశం బయటపడటం లేదా? కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కనుక ఆ కంపెనీ ప్రతినిధులు తనను కలవటానికి అనుమతించటమో, లేక వారితో ఫొటో దిగటమో చేస్తే తప్పా? సీఎం దగ్గరకు రాని ఫైళ్లను ఆయనకు అంటగడుతూ... దానికి లింకు పెట్టి ఆయన తనయుడి కంపెనీలను టార్గెట్ చేయటం వెనక దురుద్దేశాలు తెలియటం లేదా?

టార్గెట్ ‘సాక్షి’ మీడియా... 
‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించిన ఈడీ ప్రాధికార సంస్థ... భూములతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లనూ అటాచ్ చేయడానికి అనుమతించింది. కంపెనీ ఆస్తులంటే భూములు, భవనాలు, యంత్రాల వంటివి ఉంటాయి. కంపెనీ షేర్లు కూడా కంపెనీ ఆస్తులే. కంపెనీ మనుగడకు ఇబ్బంది లేకుండా అలాంటి ఆస్తుల్ని అటాచ్ చేసినా ఇబ్బంది ఉండదు. కానీ ‘సాక్షి’ విషయంలో నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేయటమే అనేక అనుమానాలకు ఆస్కారమిస్తోంది. ఎందుకంటే మున్ముందు వచ్చే అవసరాల కోసం సంస్థలోనే పెట్టి ఉంచిన రివాల్వింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేస్తే కంపెనీని నడపటం అనేది ఎవరికైనా సవాలే. ‘సాక్షి’ విషయంలో జరుగుతోంది అదే. 

మాతృగర్భం నుంచే పోరాటం మొదలైనట్లు...
‘సాక్షి’ది ఆవిర్భావం నుంచీ పోరాటమే. అసలు ‘సాక్షి’ పుట్టడానికి ముందే ఎల్లో కుట్రలు పదునెక్కి... ఆరోపణలు చట్ట సభలనూ కుదిపాయి. అన్నిటినీ తట్టుకుని నిలబడ్డ ‘సాక్షి’ మీడియా... ప్రత్యర్థుల భయాన్ని నిజం చేసింది. అప్పటిదాకా తాను రాసిందే వార్త.. తాను చూపిందే నిజమని చెబుతూ వచ్చిన ఆధిపత్య మీడియాకు గండి పడింది. నాణేనికి రెండో కోణం కూడా ఉందని తెలుగు పాఠకులకు తెలిసింది. కొన్ని దశాబ్దాల పాటు ఎందరెందరినో కొట్టి, ఎన్నో అడ్డదార్లు తొక్కి నిర్మించిన ఆధిపత్యపు కోటలు ఒక్కసారిగా కూలిపోయేసరికి ప్రత్యర్థులకు దిక్కుతోచలేదు. ఫలితం... సాక్షి గొంతు నొక్కే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. కుట్రలు మరింత లోతులకు పోయాయి. వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేసైనా సరే... సాక్షి గొంతు నొక్కాలన్న కసితో సాగుతున్న ఎల్లో కుట్రల్లో మరో కోణమే ఈడీ అటాచ్‌మెంట్ కూడా

గుంటూరుజిల్లాలోకి ఘన స్వాగతం ..


నేడు గుంటూరుజిల్లాలోకి మరో ప్రజాప్రస్థానం 
ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్ సీపీ భారీ ఏర్పాట్లు.
పల్నాటి సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో 
స్వాగత ద్వారాలు. తొలిరోజు 9 కిలోమీటర్లు 
నడవనున్న షర్మిల .పొందుగలలో బహిరంగ సభ
అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం

పొందుగలకు పండగొచ్చింది.. సంక్రాంతి మళ్లీ వచ్చినట్టు ఊరంతా ఒకటే సంతోషం.. వీధి వీధినా కొలువుదీరిన రంగవల్లులు.. ఇంటింటా మామిడి తోరణాలు.. బంధుగణం స్నేహితుల రాక.. వారికి మర్యాదలు చేస్తూ గ్రామస్తులు .... మరో వైపు కళకళలాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లు.. కార్యాలయాలు.. జిల్లా వ్యాప్తంగా వున్న పార్టీ నేతల రాకతో సందడి సందడిగా మారిన పొందుగలకు కొత్త కళ వచ్చింది..ఊరు ఊరంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలేస్తున్నది.. షర్మిలమ్మ కోసం ఎదురుచూస్తున్నది.. మరికొద్ది గంటల్లో పొందుగలలో తొలి అడుగుపెట్టనున్న షర్మిలమ్మకు ఘనస్వాగతం పలకాలని.. ఊరు ఊరంతా ఉవిళ్లూరుతోంది. జగనన్నకు సోదరంటే మాకూ చెల్లెలేనని పెద్దవాళ్లు.. మాఅక్కయ్యేనని చిన్నవాళ్లు.. మాకు కూతురు లెక్కని పెద్దమ్మలు..మా బిడ్డలాంటిదని పెద్దోళ్లు.. మా ఇంటి ఆడపడుచని మహిళలు.. మా మనవరాలని వృద్ధులు.. మా ఊరికి వెలుగని గ్రామస్తులు.. మా కన్నీళ్లు తుడిచే నాయకురాలని కర్షకులు.. మాకు బాసటగా నిలిచే మహిళని బడుగు,బలహీన వర్గాలు ప్రజలు..ఇలా ఒకరేమిటి యావత్ జిల్లా కోటి కళ్లతో ఎదురు చూస్తూ నోరారా ‘రావమ్మా.. షర్మిలమ్మా..రావమ్మా’అంటూ మంగళహారతులిచ్చేందుకు సిద్ధమయ్యారు...

జిల్లా ప్రజలు నిరీక్షిస్తున్న రోజు రానే వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం జిల్లాలోకి ప్రవేశించనున్నది. ఆమెకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. తొలిగా ఆమె ప్రవేశించనున్న గురజాల నియోజకవర్గంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని అధికారులుగాని, అధికార పక్షం, విపక్షం నేతలు గానీ కనీసం పరామర్శించకపోవడంతో ఆ వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.


ముఖ్యంగా మిర్చి రైతులు దాదాపు రూ.25 కోట్ల వరకు నష్టపోయారు. 20 వేల ఎకరాల్లో శనగ పూత కూడా రాలి పోయింది, పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లుతున్నా అధికారులు స్పందించడం లేదు. విద్యుత్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ అన్ని వర్గాలపై భారాన్ని మోపుతున్న ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అపర భగీరధుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సాగు స్థిరీకరణ కోసం చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండటంతో రైతాంగం సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఈ వైఫల్యాలకు ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని భుజానమోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే కారణమనే భావన సర్వత్రా వినవస్తోంది. 

ఈ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు షర్మిల మరో ప్రజాప్రస్థానం ద్వారా ప్రజల్లోకి వస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా వాడపల్లి వంతెన మీదుగా గుంటూరు జిల్లా పొందుగల గ్రామంలోకి ప్రవేశిస్తారని జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. జిల్లాలో 14 నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర జరుగుతుందన్నారు. తొలి రోజు షర్మిల తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్ర చేసే విధంగా షెడ్యూల్ రూపొందించారు. నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి బస నుంచి ఉదయం యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు నడిచి వాడపల్లిలో పర్యటిస్తారు.

అక్కడి నుంచి వంతెన మీదుగా గుంటూరు జిల్లా పొందుగల చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తరువాత 4.5 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి పులిపాడులో ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారుభారీ ఏర్పాట్లు ... మరో ప్రజాప్రస్థానం విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్ నేతలు అనేకసార్లు సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, నాయకులకు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పలు సూచనలు చేశారు. పోస్టర్లు విడుదల, కరపత్రాల పంపిణీ, మైక్‌ల సహాయంతో గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు, కృష్ణాజిల్లాల సమన్వయ కర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పాదయాత్ర జరగనున్న నియోజకవర్గాల్లో మైక్‌లతో ప్రచారం చేపట్టారు. 

జిల్లా యువజన విభాగం కన్వీనరు కావటి మనోహరనాయుడు, బీసీ విభాగం కన్వీనర్ దేవెళ్ల రేవతి, పార్టీ నాయకుడు యేటిగడ్డ నరసింహారెడ్డి (బుజ్జి) కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పోస్టర్లు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పలువురు నేతలు వందలాది ద్విచక్ర వాహనాలు, లారీలు, బస్‌లలో పొందుగల గ్రామానికి తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 

పల్నాటి సంస్కృతి ప్రతిబింబించేలా...
పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పల్నాడు సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో భారీ స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. అద్దంకి- నార్కెట్‌పల్లి హైవేకు ఇరువైపులా వైఎస్సార్, జగన్, విజయమ్మ, షర్మిలల భారీ ఫొటోలతో కూడిన స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ద్వారాలకు పై భాగంలో రెండు వైపులా కోడి పుంజుల బొమ్మలను ఏర్పాటు చేసి పల్నాటి సంస్కృతిని చాటి చెప్పారు.

భారీగా తరలిరండి: మర్రి రాజశేఖర్ 
జగనన్న సోదరి, మన ఆత్మబంధువు షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పొందుగలకు తరలిరావాలని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. మునుపెన్నడూ, ఎక్కడా జరగని రీతిలో ఆమెకు స్వాగతం పలికేందుకు అంతా కృషి చేయాలి. వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిలకు వివరించాలని కోరారు. 

పాదయాత్రను విజయవంతం చేయండి : ఎమ్మెల్యే పీఆర్కే
షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పొందుగల, శ్రీనగర్ గ్రామాలలో షర్మిల చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. షర్మిలమ్మకు బ్రహ్మరథం పట్టి పల్నాటి చరిత్రను రాష్ట్రమంతా చాటిచెప్పేలా కార్యకర్తలు నాయకులు, మహిళలు తరలిరావాలని కోరారు.

ఒక్క సీసీ కెమెరా కూడా పని చేయకున్నా పట్టని వైనం

కసబ్, అఫ్జల్ ఉరికి ప్రతీకార దాడులు జరగవచ్చని వెల్లడి 
బుధ, గురువారాల్లో కూడా ప్రత్యేక అలర్ట్‌లు
అయినా పెడచెవిన.. ఫలితంగానే జంట పేలుళ్లు
ఐదు నెలల క్రితమే దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదుల రెక్కీ
భారీ జనసమ్మర్ద ప్రాంతం... భద్రతా చర్యలు శూన్యం
ఒక్క సీసీ కెమెరా కూడా పని చేయకున్నా పట్టని వైనం
హుబ్లీ కేంద్రంగా దక్షిణాదిన చురుగ్గా ముజాహిదీన్

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడులకు దిగే అవకాశం ఉందంటూ కేంద్ర నిఘావర్గాలు అందించిన హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం వల్లే దిల్‌సుఖ్‌నగర్ దుర్ఘటన చోటు చేసుకుందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. ముంబై దాడుల దోషి కసబ్ ఉరితీతకు ప్రతీకారంగా ఉగ్రవాదలు దాడులు జరగవచ్చంటూ కేంద్ర నిఘా వర్గాలు జనవరి 19, 23, 25న అన్ని రాష్ట్రాలకూ హెచ్చరికలు పంపాయి. అఫ్టల్‌గురు ఉరికి ముందు ఫిబ్రవరి 3, 7న, తరవాత ఫిబ్రవరి 11, 13, 16, 17, 19 తేదీల్లో కూడా ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఓ ప్రత్యేక బృందాన్ని కూడా హైదరాబాద్ పంపినట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటన్నింటికీ మించి, హైదరాబాద్ సహా బెంగళూరు, హుబ్లీ (కర్ణాటక), కోయంబత్తూరు (తమిళనాడు)ల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదముందంటూ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లకు ఒక రోజు ముందు బుధవారం, దాడులు జరిగిన గురువారం ఉదయం కూడా రాష్ట్రానికి ప్రత్యేకంగా అలర్ట్‌లు అందాయి. కానీ వీటిని సాధారణ హెచ్చరికలుగానే ప్రభుత్వం భావించడం దుర్ఘటనకు కారణమైందని నిపుణులు చెపుతున్నారు. రాష్ట్రాలకు నిఘా హెచ్చరికలు రావడం సాధారణమే అయినా ... కనీసం కసబ్, అఫ్జల్ గురు ఉరితీత నేపథ్యంలోనైనా, బుధ, గురువారాల్లో వచ్చిన తాజా అలర్ట్‌లను సీరియస్‌గా తీసుకుని ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశముండేదని అభిప్రాయపడుతున్నారు. 

దీనికి తోడు స్థానిక నిఘా విభాగం తీవ్రమైన అలక్ష్యం కనబరిచిందని, తాజా దాడులే అందుకు నిదర్శనమని మాజీ డీజీపీ ఒకరన్నారు.

రెక్కీ వెలుగులోకి వచ్చినా...: దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లకు రెక్కీ నిర్వహించామని పుణే పేలుళ్ల నిందితుడైన ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ 2012 అక్టోబర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో వెల్లడించాడు. సహచర ఉగ్రవాది ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి హైదరాబాద్‌లోని బేగం బజార్, అబిడ్స్‌లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లో కూడా మోటార్‌సైకిల్‌పై విస్తృతంగా తిరుగుతూ పక్కాగా రెక్కీ నిర్వహించామంటూ వాంగ్మూలమిచ్చాడు. ఆ సమాచారం మన పోలీసులకు వెంటనే అందింది కూడా. దాంతోపాటు బెంగళూరులో పట్టుబడ్డ ఉబేదుర్ రెహమాన్ కూడా విచారణలో అదే విషయం వెల్లడించాడు. దిల్‌సుఖ్‌నగర్, సుల్తాన్‌బజార్, అబిడ్స్‌ల్లో బాంబులు పేల్చేందుకు రెక్కీ నిర్వహించామని అతడు పేర్కొన్నట్టు బెంగుళూరు పోలీసులు అక్కడి కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో పేర్కొన్నారు. అయినా దిల్‌సుఖ్‌నగర్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలే చేపట్టలేదు. దాంతో ముష్కరులు మరోసారి ఆ ప్రాంతాన్నే లక్ష్యం చేసుకుని మారణహోమం సృష్టించారు. వ్యూహాత్మకంగా పక్కపక్కనే రెండు చోట్ల బాంబులు పెట్టడం, ఒకచోట పేలగానే భయోత్పాతంతో అంతా ఎటువైపు పరుగులు తీస్తారో ఊహించి, ఆ దిశలోనే కాసేపటికి పేలేలా మరో బాంబు పెట్టారంటే భారీగా ప్రాణనష్టం జరిగేలా ఎంత పకడ్బందీగా ప్రణాళిక రచించారో అర్థం చేసుకోవచ్చు!

భద్రతా చర్యలు శూన్యం

హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే కొద్ది ప్రాంతాల్లో దిల్‌సుఖ్‌నగర్ ఒకటి. ఇక్కడ సాయంత్రం సమయంలో అర కిలోమీటర్ పరిధిలో కనీసం వెయ్యి మంది సంచరిస్తుంటారు. ఉగ్రవాదులు గతంలో రెండుసార్లు ఇక్కడ బాంబులు పేల్చేందుకు విఫలయత్నం చేశారు. మామూలుగా అయితే ఫలానా ప్రాంతంలో బాంబు దాడులు జరుగుతాయని ఊహించడం ఎవరికైనా కష్టమే. కానీ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నా కట్టుదిట్టమైన భద్రతా చర్యల దిశగా పోలీసులు ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడంపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సౌదీ టు సౌతిండియా, వయా పాక్

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సౌదీ అరేబియా కూడా ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలకు సౌదీనే వేదికగా మార్చుకుంది. పాక్ అండదండలు, ఐఎస్‌ఐ దన్నుతో , సౌదీ నుంచి అందుతున్న ఆర్థిక, ఇతరత్రా సాయాలతో దక్షిణ భారతదేశంలో అది పక్కాగా పాగా వేసింది. కర్ణాటకలో హుబ్లీతో పాటు పలు ప్రాంతాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనూ అత్యంత చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా హుబ్లీని ఐఎం తన స్థావరంగా మార్చుకున్నట్టు వెల్లడైంది. అవసరాన్ని బట్టి అటు మహారాష్ట్ర, గోవాలకు గానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోకి పారిపోయేందుకు అనువుగా ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు తేల్చారు. ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హుబ్లీలో ఉండగా స్థానికంగా ఏకంగా ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలే తెరిచి కొన్నాళ్ల పాటు నిర్నిరోధంగా నడిపాడంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. 

ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి 2012 ఆగస్టు 29, సెప్టెంబర్ 2 మధ్య కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల్లో పోలీసులు కనీసం 18 మందిని అరెస్టు చేశారు. దక్షిణాదిన పెను విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తొయిబా, హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) పన్నిన కుట్రను విఫలం చేసినట్టు ప్రకటించారు. వీరంతా ఐఎస్‌ఐతో పాటు ప్రధానంగా సౌదీలోని ‘ఉగ్ర’ నేతల ఆదేశానుసారమే పని చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. అరెస్టయిన వారిలో ఒక జర్నలిస్టు, ఇంకో విద్యాధికుడు, ఇద్దరు డాక్టర్లతో పాటు ఏకంగా ఒక డీఆర్‌డీఓ శాస్త్రవేత్త కూడా ఉండటం గమనార్హం! ఉగ్రవాదులు ఎన్ని వ్యవస్థల్లోకి, ఎంతగా చొచ్చుకుపోయారనేందుకు ఇదో నిదర్శనం మాత్రమే. ‘‘ఆరేళ్ల క్రితం హుబ్లీ నుంచి సౌదీకి ‘వలస వెళ్లిన’ జకీర్ మహ్మద్ అనే డాక్టర్ ఈ మొత్తం కుట్రకు సూత్రధారి. ఇంగ్లిష్ మాట్లాడగలిగి, కంప్యూటర్, ఇంటర్నెట్ వాడకంలో నైపుణ్యముండి, జీన్స్ వంటి సాధారణ వస్త్రధారణతో జనంలో తేలిగ్గా కలిసిపోయే యువతను అతను లక్ష్యంగా చేసుకున్నాడు. 50 మందికి పైగా 2003 నుంచి 2008 మధ్య ఐదేళ్ల కాలంలో ఉగ్రవాద శిక్షణ కోసం పాకిస్థాన్‌కు పంపాడు’’ అని కూడా వారు వెల్లడించారు. వీరిలోనే పలువురు హైదరాబాద్‌ను లక్ష్యం చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ సమాచారం కూడా మన పోలీసు, నిఘా వర్గాలకు అప్పుడే చేరింది. అయినా పట్టించుకోలేదు!

నాలుగు రోజుల క్రితమే సీసీ కెమెరా వైర్లు కట్!

దిల్‌సుఖ్‌నగర్ జంక్షన్‌లోని ఎనిమిది సీసీ కెమెరాలు పని చేయడం లేదన్న విషయం కూడా జంట పేలుళ్లు జరిగేదాకా స్థానిక పోలీసులకు తెలియదు! వైర్లు కట్ కావడం వల్లే అవి పని చేయడం లేదని వారు తీరిగ్గా గుర్తించారు. అది బాంబు పేలుళ్ల తరువాతే కావడం గమనార్హం. అవి మూగబోవడం కూడా ముష్కరుల పనేనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే మెట్రో రైలు నిర్మాణ పనుల కారణంగా సీసీ కెమెరా వైర్లు కట్ అయి ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కానీ ఈ విషయంలో స్థానిక పోలీసుల తీరు సహించరానిదేనంటూ తమ తప్పిదాన్ని అంగీకరించారు!

నేడు 9 కిలోమీటర్లు పాదయాత్ర


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం నుంచి గుంటూరు జిల్లాలో ప్రారంభం కానుంది. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దాన్ని భుజాన మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా వాడపల్లి వంతెన మీదుగా గుంటూరు జిల్లా పొందుగల గ్రామంలోకి ప్రవేశించనుంది. వాస్తవానికి ఈనెల 18వ తేదీనే షర్మిల పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల మృతులకు సంతాప సూచకంగా యాత్రను 23వ తేదీకి మార్చినట్టు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మరో ప్రజాప్రస్థానం ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. గురజాల, మాచర్ల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం షర్మిల పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. 

నేడు 9 కిలోమీటర్లు పాదయాత్ర

షర్మిల శనివారం 9 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారని తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి బస నుంచి ఉదయం యాత్ర ప్రారంభమవుతుంది. నల్లగొండ జిల్లా పరిధిలో 3 కి.మీ. పాదయాత్ర అనంతరం వాడపల్లి బ్రిడ్జి మీదుగా గుంటూరు జిల్లాలోని పొందుగల గ్రామానికి చేరుకుంటారు. కృష్ణానది వంతెన దాటి పొందుగలకు చేరుకోవడంతో గుంటూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన తరువాత 6 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారని, పాదయాత్రలో ప్రజలను కలిసి పులిపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేయనున్న బసకు చేరుకుంటారని చెప్పారు. అక్కడితో మొదటి రోజు పాదయాత్ర ముగుస్తుందని, యాత్రలో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. 

కేవలం ఫైన్‌లు వేస్తూ, వసూళ్లు చేసుకోవడంపైనే...

ఉగ్రవాదుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
కేంద్రంలో ఎన్‌ఐఏ, రాష్ట్రంలో ఆక్టోపస్ ఏం చేస్తున్నాయి?
దాడులపై కచ్చితమైన సమాచారాన్ని ఎందుకు రాబట్టలేకపోతున్నారు

 ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఎలాంటి చర్యలకైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదులు మారణకాండకు తెగబడుతూ రెచ్చిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవడం లేదన్నారు. తీవ్రవాదుల ఘాతుకాల నుంచి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని విమర్శించారు. ‘‘ముంబై ఘటన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఉగ్రవాద కదలికలపై ముందే పసిగట్టి అవాంఛిత ఘటనలను నిరోధించాలి. అయితే ఇప్పటిదాకా ఎన్‌ఐఏ సమర్థంగా పనిచేసిన దాఖలాలు ఒక్కటీ లేవు. ఉగ్రవాద నిర్మూలన కోసం రాష్ట్రంలో ‘అక్టోపస్’ను ఏర్పాటు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంది’’ అని అన్నారు. కేంద్ర హోంమంత్రిగా సుశీల్‌కుమార్ షిండే అనర్హుడని మైసూరారెడ్డి మండిపడ్డారు. నిర్దిష్ట సమాచారం ఇవ్వకుండా కంటి తుడుపు చర్యల మాదిరి అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశామని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ‘‘కేంద్రం అధీనంలో ఎన్‌ఐఏ, ఐబీ, రా వంటి అత్యున్నత సంస్థలు ఉన్నప్పటికీ కచ్చితమైన సమాచారం ఎందుకు రాబట్టలేకపోతున్నారు? నిర్దిష్ట సమాచారం రాష్ట్రాలకు ఎందుకు అందజేయలేకపోతున్నారు?’’ అని ప్రశ్నించారు.

సీఎం ఏం చర్య తీసుకున్నారు: దాడులు జరగొచ్చని రెండ్రోజుల ముందే కేంద్రం నుంచి సమాచారం వస్తే ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మైసూరా డిమాండ్ చేశారు. సీఎం అధీనంలో ఉండే ఆక్టోపస్‌ను సమావేశపరిచి ఏమైనా అప్రమత్తం చేశారా అని ప్రశ్నించారు. నగర కమిషనర్ అనురాగ్‌శర్మ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతానికి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే జంట పేలుళ్లు జరిగాయంటే భద్రతాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర పోలీసులు కేవలం ఫైన్‌లు వేస్తూ, వసూళ్లు చేసుకోవడంపైనే నిమగ్నమయ్యారని విమర్శించారు.

క్షతగాత్రులను ఆదుకునేందుకు సిద్ధం...

పేలుళ్ల కారణంగా క్షతగాత్రులైన వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం అవసరమైతే 9849032888, 9652278978 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.

మరో ప్రజా ప్రస్థానం నేడు సాగుతుందిలా...

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయా లను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం దామరచర్ల మండలం వాడపల్లి నుంచి ప్రారంభమవుతుంది. 

వాడపల్లి బ్రిడ్జి మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పొందుగులలో పాదయాత్ర సాగుతుంది. రాత్రికి ఆ గ్రామ శివారులో షర్మిల బస చేస్తారు.

ముందే హెచ్చరికలున్నా కేంద్రం చర్యలేవి?

Written By news on Friday, February 22, 2013 | 2/22/2013

హైద‌రాబాద్‌లోని దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో గురువారం జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనపై ముందస్తు సమాచారం ఉన్నా కేంద్రం చర్యలెందుకు తీసుకోలేదని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. ఈ దాడులు జరగడం అత్యంత విచారకరమని ఆమె అన్నారు. దాడులు జరగడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి బయటపడుతోందని సుష్మా విమర్శించారు.

‘అలర్ట్ ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే’

నగరంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ముందుగానే కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి డికె అరుణ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారని ఆమె తెలిపారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని మంత్రి సూచించారు.

వైఎస్ఆర్ సిపి కొవ్వొత్తుల ప్రదర్శన

దిల్‌సుఖ్‌నగర్ లో బాంబు పేలుళ్లకు నిరసన తెలుపుతూ వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా, పార్టీలకు అతీతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కూకట్ పల్లిలో వైఎస్ఆర్ సీపీ నేత జనార్దనరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. వడ్డేపల్లి నర్సింగరావు, ముక్కా రూపానందరెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గుంటూరులో పార్టీ నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో వైఎస్‌ఆర్ సీపీ నేత వరుద కల్యాణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలిలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. కరీనంగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. 

విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. జీవీఎంసీ నుంచి జగదాంబ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. కర్నూలులో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి ఆధ్వర్యంలో నల్లజెండాలతో కార్యకర్తలు ర్యాలీ జరిపారు. చిత్తూరులో జర్నలిస్టులు, వైఎస్ఆర్ సీపీ, ఏబీవీపీ కార్యకర్తలు దిల్‌సుఖ్‌నగర్ లో బాంబు పేలుళ్ల మృతులకు నివాళులర్పించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

 దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయపడింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు అనుభవరాహిత్యానికి పరాకాష్ట అని ఆ పార్టీ మండిపడింది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేత మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం అనుభవలేమి, అవగాహనా రాహిత్యం స్పష్టంగా బయటపడ్డాయని ఆయన విమర్శించారు.

శుక్రవారం మైసూరారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తడానికా పోలీసులు ఉన్నది అని ప్రశ్నించారు. పోలీస్‌ కమిషనర్‌ సాయిబాబా గుడి నుంచి వెళ్లిన అయిదు నిమిషాలకే ఆ పరిసర ప్రాంతాల్లో బాంబులు పేలాయంటే.. పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాద అణిచివేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందని మైసూరా స్పష్టం చేశారు

ఏ గ్రూప్ రక్తం కావాలన్నా ఫోన్ చేయండి

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో గాయపడినవారికి సహాయ సహకారాలు అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ చెప్పారు. ఏ గ్రూప్ రక్తం కావాలన్నా ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ఫోన్ నెంబర్లు 98490 32888, 96522 78978 అని వెల్లడించారు. వైఎస్ఆర్ సీపీ వైద్య విభాగం సహాయక చర్యల్లో పాల్గొంటుందని చెప్పారు.

అత్యంత బాధాకరం: విజయమ్మ


ఉగ్రవాదుల చర్యలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షులు విజయమ్మ కోరారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ రద్దీ ప్రాంతంలో గురువారం రెండుచోట్ల ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడిన ప్రాంతాన్ని విజయమ్మ, పలువురు పార్టీ నేతలతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై ఆమె స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటన వల్ల భారీగా ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోందని, ఇది అత్యంత బాధాకరమైన ఘటనని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సంఘటన పట్ల ప్రజలంతా సంయమనం పాటించి ధైర్యంగా ఉండాలని కోరారు.

ఉగ్రవాదుల దుశ్చర్యలకు సంబంధించి రెండు రోజుల కిందటే కేంద్రం హెచ్చరించినట్టు వార్తలొస్తున్నాయని, ఇలాంటి సమాచారం అందినప్పుడు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించి జాగ్రత్త పడాల్సిందని అభిప్రాయపడ్డారు. సంఘటనలో గాయపడ్డ క్షతగ్రాతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఆమె ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారి బంధువులను ఓదార్చారు. మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. విజయమ్మతో పాటు పార్టీ నాయకులు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కోఆర్డినేటర్ రాజ్‌ఠాకూర్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ తదితరులున్నారు.

షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి, నేటి యాత్ర వాయిదా


హైదరాబాద్ బాంబు పేలుళ్ల ఘటన పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాంబు పేలుళ్లలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి యుద్ధప్రాతిపదికన వైద్యసదుపాయం అందించాలని గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు సరైన ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని కోరారు.

ఈ సంఘటనకు సంతాప సూచకంగా శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కావాల్సిన మరో ప్రజాప్రస్థానాన్ని ఒకరోజుపాటు వాయిదా వేసినట్టు ప్రోగ్రాం కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా పాదయాత్రకు రెండు రోజుల విరామం ప్రకటించిన విషయం విదితమే. మరోప్రజాప్రస్థానం పాదయాత్ర తిరిగి ఈ నెల 23 నుంచి పునఃప్రారంభమవుతుందని రఘురాం తెలిపారు.

YS Vijayamma Condemns Dilsukhnagar blasts

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

క్షతగాత్రులకు విజయమ్మ పరామర్శ

దిల్‌సుఖ్‌నగర్‌ వరుస బాంబు పేలుళ్లలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలిని కోరారు. ఉస్మానియా ఆస్పత్రిలో సౌకర్యాలు సరిగ్గాలేవన్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ లేదని చెప్తున్నారని అన్నారు. మృతి చెందినవారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంఘటనా స్థలానికి విజయమ్మ

వరుస పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పేలుళ్లను పార్టీలకు అతీతంగా ఖండించాలన్నారు. దిల్‌సుఖ్‌నగర్ లో వరుస పేలుళ్లు సంభవించిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించారు. రెండు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్టు కేంద్ర హోం మంత్రి షిండే చెప్తుతున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.

YSRCP MLA Srikanth Reddy Press Meet 21st feb 2013

బాంబు పేలుళ్లపై విజయమ్మ దిగ్భ్రాంతి

దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయంత్రం వరుస బాంబు పేలుళ్ల ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆమె సంతాపాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వై.ఎస్.విజయమ్మ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 


నగరంలోని రద్దీ ప్రదేశమైన దిల్ షుఖ్ నగర్ ప్రాంతంలోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల వద్ద చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అనుమానస్పదంగా వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్క్షప్తి చేశారు. 

నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ లోని కోణార్క్,వెంకటాద్రి థియేటర్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.భయంతో జనం పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దుర్ఘటన సాయంత్రం 7గంటలకు చోటుచేసుకుంది. తొలి పేలుడు జరిగిన నిమిషం వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుళ్లు చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. పేలుళ్ల సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్సులు చేరుకున్నాయి. క్షతగాత్రులను ఉస్మానియా, ఓమ్నీ, మలక్‌పేట యశోదా ఆస్పత్రులకు తరలించారు. ఉస్మానియా లో 25 మంది, ఓమ్ని 12 , యశోదాలో 15 మంది క్షతగాత్రులను తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

దిల్ షుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు

దిల్ షుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంబవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిలుషుఖ్ నగర్ లోని కోణార్క్ థియేటర్ వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్లోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.

Brother Anil Kumar has to answer Media Questions

Special edition on Bharosha 1000km Feb 2013

పార్టీలో చేరిన నేతలు


 శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాయిరాజ్‌తోపాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు, టీడీపీ నేత పాతపట్నం ఇన్‌చార్జి కలమట వెంకటరమణలు కూడా పార్టీలో చేరారు. వీరికి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, సుజయకృష్ణ రంగారావు, కేంద్రపాలక మండలిసభ్యులు పెన్మత్స సాంబశివరాజు, శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ తదితరులున్నారు.

పార్టీలో చేరిన అరకు నేతలు
విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన కొత్తపల్లి గీతతోపాటు పలువురు మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు పార్టీలో చేరారు.

పోరాటమే మార్గం

రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమస్యల పరిష్కారంకోసం వారికి అండగానిలిచి పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దిశానిర్దేశం చేసిన తర్వాత జిల్లాల వారీగా పార్టీ సంస్థాగత అంశాలను పరిశీలించారు. 23 జిల్లాలకు చెందిన నాయకులు 8 గ్రూపులుగా ఏర్పడి సభ్యత్వ నమోదును సమీక్షించారు. విజయమ్మ జిల్లా పర్యటనల నాటికి ఆయా జిల్లాల్లో చేయాల్సిన పనులను నేతలకు వివరించారు. 

అంతకుముందు రైతు సమస్యలు, పెరిగిన నిత్యావసరాల ధరలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, సహకార ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై విస్తృతచర్చ జరిగింది. వైఎస్ దూరమైన ఈ మూడున్నరేళ్లలో రైతులకు కన్నీరే మిగిలిందని పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు రూ.9 వేల కోట్లు నష్టపోయారని, చంద్రబాబు హయాంలో మాదిరి ప్రస్తుతం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. బాబు హయాంలో 107 లక్షల టన్నులుగా ఉన్న ఆహారధాన్యాల ఉత్పత్తిని వైఎస్ ఐదేళ్లలో 204 టన్నులకు పెంచగా... ప్రస్తుతం మళ్లీ 170 టన్నులకు పడిపోయిందని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను ఆదుకుంటామని సీఎం కిరణ్ పేపర్ ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వైఎస్ ఉన్నప్పుడు ఉన్నంత ధైర్యంగా రైతులు ఇప్పుడులేరని పార్టీ శాసనసభా పక్షం ఉపనాయకురాలు శోభా నాగిరెడ్డి చెప్పారు. 

పార్టీ ప్లీనరీలో ప్రకటించినట్టుగానే వ్యవసాయానికి ప్రత్యేకంగా రూ.మూడువేల కోట్లు కేటాయించాలని పార్టీ ట్రేడ్‌యూనియన్ కన్వీనర్ జనక్‌ప్రసాద్ అన్నారు. ఆడపడుచులకు పావలావడ్డీకే రుణాలు అందజేసిన ఘనత వైఎస్‌కు మాత్రమే దక్కుతుందని పార్టీ సీజీసీ సభ్యురాలు బాలమణెమ్మ చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా లబ్ధిపొందారని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు రెండెకరాలు కేటాయించి ఆర్థికంగా ఆదుకున్నారని, వారికోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించాలని పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ సూచించారు. విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, మేకా శేషుబాబు, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, బి.గురునాథరెడ్డి, టి.బాలరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తానేటి వనిత, పేర్ని నాని, సుజయకృష్ణ రంగారావు, బాలనాగిరెడ్డి, కొడాలి నాని, మద్దాల రాజేష్, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పి.సాయిరాజ్, పార్టీ ముఖ్యనేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్, పీఎన్వీ ప్రసాద్‌లతోపాటు సీజీసీ, సీఈసీ, జిల్లాల కన్వీనర్లు, పరిశీలకులు, కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగం రాష్ట్ర కన్వీనర్లు, అధికార ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. డీసీసీబీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేదు.

Popular Posts

Topics :