10 March 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Sharmila's Speech in Vejendla, Guntur

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013

ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదు: షర్మిల

ఈ ప్రభుత్వాన్ని ఎంతమంది కాపాడటానికి ప్రయత్నించినా ఎక్కువ కాలం నిలవదని, త్వరలోనే పడిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. మరో ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ సాయంత్రం ఆమె వేజండ్ల గ్రామం చేరుకున్నారు. చేరుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ మట్టికొట్టుకుపోయే రోజు చాలా దగ్గరలోనే ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కైనా నిలబడలేవన్నారు. ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం పాలకవర్గానికి మద్దతిచ్చాడని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. 

ప్రజలు జగనన్ననే సీఎం అని ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు. జగనన్న రాజన్న కన్న కలలు నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. ఆ రోజు వచ్చేవరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని కోరారు.

రాజమండ్రిలో ఆదిరెడ్డికి ఘనస్వాగతం

 వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆదిరెడ్డి అప్పారావుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్న అప్పారావుకు జిల్లా నేతలు, కార్యకర్తలు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో సన్మానం చేశారు. బీసీలకు పెద్దపీట వేసే విధంగా ఎమ్మెల్సీ కేటాయించడంపై వైఎస్ జగన్‌కు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు.

'ప్రభుత్వానికి మద్దతుతెలిపిన టిడిపి'

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపిందని వైఎస్ఆర్ సిపి కేంద్ర పాలకమండలి సభ్యులు మైసూరా రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చను ఆ పార్టీ వైఎస్ఆర్ సిపిని విమర్శించడానికే ఉపయోగించుకుందన్నారు. ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని చెప్పారు. పాలకపక్షంపై టిడిపి తన విశ్వాసాన్ని చాటుకుందన్నారు. కాంగ్రెస్, టిడిపి మధ్య సంబంధాలు రెండేళ్లుగా కొనసాగుతున్నాయని, ఇప్పుడు శాసనసభ సాక్షిగా నిరూపితమైందని పేర్కొన్నారు. సభలో లేని వ్యక్తులను విమర్శించకూడదన్న సభానిబంధనలను కూడా టిడిపి సభ్యులు పాటించలేదన్నారు. ఆ సమయంలో టిడిపి సభ్యుల మాటలకు అధికార పక్ష సభ్యులు మద్దతు తెలపడం చూస్తుంటే వారి కుమ్మక్కుకు స్సష్టమైపోయిందన్నారు. అందరూ దీనిని గమనిస్తున్నారని తెలిపారు.

ఛార్జిషీట్ అనేది ఒక అభియోగ పత్రం. దానిని కోర్టులో దాఖలు చేసిన తరువాత, కోర్టు విచారించి నిర్ధారిస్తుందని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న విషయాలను బయట ప్రస్తావించకూడదు. నిబంధనలు అతిక్రమించి ఛార్జిషీట్లోని విషయాలను ప్రస్తావిస్తుంటే ఉపసభాపతి సక్రమమైనరీతిలో అడ్డుకోలేదన్నారు. తెలిసి చేశారో తెలియక చేశారో అర్ధం కావడంలేదన్నారు.

కర్నూలు: వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారనే భయంతోనే ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు పలకలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పడిపోయి ఎన్నికల్లోస్తే జగన్ సీఎం అవుతారన్న జంకుతో చంద్రబాబు అవిశ్వాసానికి దూరంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలే చంద్రబాబుకు ఆఖరి ఎన్నికలు అవుతాయని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యకర్తల సమావేశంలో నాగిరెడ్డి పాల్గొన్నారు.

వస్త్రవ్యాపారులకు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు

వస్త్ర వ్యాపారంపై విధిస్తున్న వ్యాట్‌ను ఎత్తేయాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర వస్త్ర వ్యాపారులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. పక్క రాష్ట్రాలు రాయితీలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం వ్యాట్ పేరుతో వసూలు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం దిగి రాకుంటే మెడలు వంచతామంటూ వైఎస్సార్ సీపీ నేతలు హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వస్త్ర వ్యాపారుల సమస్యపై సోమవారం సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వ్యాట్ ఎత్తివేసే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Congress Leader hubert join in YSRCP

Mysura Reddy Press Meet 16th March 2013

Jampana Pratap Joined YSRCP

YS Sharmila padayatra in budampadu at Guntur

సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల అభినందన

అవిశ్వాసంలో గెలిచిన ముఖ్యమంత్రి కిరణ్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు అభినందించారు. పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రిని అసెంబ్లీలో కలిశారు. పనిలో పనిగా నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విన్నవించారు. సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

Special edition on Guntur gundello 16th Mar 2012

బుడంపాడు నుంచి షర్మిల పాదయాత్ర

వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 92వ రోజుకు చేరింది. శనివారం ఉదయం ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గం బుడంపాడు నుంచి యాత్రను ప్రారంభించారు. నారాకోడూరు... వేజెండ్ల మీదగా షర్మిల పాదయాత్ర చేస్తారు. మొత్తం 14.2 కిలోమీటర్ల పాటు నేడు ఆమె పాదయాత్ర కొనసాగనుంది.

బాబుకు డిప్యూటీ సీఎం: కేటీఆర్

శాసనసభ సాక్షిగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు మరోసారి కళ్లకు కట్టినట్టు చూశామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారక రామారావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నది తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అవిశ్వాసానికి అన్ని విపక్షాలు మద్దతిస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సిగ్గులేకుండా అధికార పక్షానికి అండగా ఉందని దుయ్యబట్టారు. కేటీఆర్ శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ప్రతిరోజూ పాదయాత్రలో ఈ ప్రభుత్వాన్ని కత్తులతో నరికేయాలని పిలుపునిస్తున్న చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వకుండా అదే ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో టీడీపీని విలీనం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులను చంద్రబాబు సంసిద్ధం చేస్తున్నారని చెప్పారు. సీఎం కిరణ్ తన చాంబర్‌లో సోనియాగాంధీ ఫొటోకు బదులుగా చంద్రబాబు ఫొటో పెట్టుకోవాలని సూచించారు. సీఎం మంత్రివర్గ విస్తరణ చేస్తామని నిన్ననే ప్రకటించారని, ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబుకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి, ఇతర నేతలకు కొన్ని మంత్రి పదవులు ఇచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. 

మంత్రి పదవులు తీసుకోండి: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడి తిరిగి వెళుతున్న కేటీఆర్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, జయ మంగళ వెంకటరమణ తారసపడ్డారు. వారిని చూసిన కేటీఆర్ ‘కాబోయే మంత్రులు’ వస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్నా మంచి పదవులు తీసుకోండని వారికి సూచించారు. మంత్రి పదవులు ఇచ్చేట్లయితే మా కృష్ణా జిల్లాకు ఇరిగేషన్ పదవి ఇవ్వాలి... దాన్ని కూడా మా అన్న (ఉమామహేశ్వరావు) కు ఇవ్వాలని వెంటకరమణ వ్యాఖ్యానించారు.

బతుకునిచ్చినవారికి వేధింపులు ,బతకనేర్చినవారికి కిరీటాలు!


చట్టాలు కొందరికి చుట్టాలు అయినప్పుడు
చెదబట్టిన నిప్పులూ ఉంటాయి
నివురుగప్పిన నెగళ్లూ ఉంటాయి
నేరస్థుడు కాకున్నా...
నెలల తరబడి జైలులో కుక్కాలంటే
న్యాయం ధర్మం చట్టం కాదు...
పగ ద్వేషం కక్ష ఉంటే చాలు
నిన్ను అయినా...
నన్ను అయినా...
జగన్ అయినా...
జనమయినా..!
అందుకే ఇప్పుడు అంతా పొలిటీషియన్ల చేతుల్లో, చేతల్లో...
ఇది రాజ్యాంగమనే గొడుగు కింద
రాజ్యాంగ వ్యతిరేక వ్యవహారం
ష్!
క్రమశిక్షణతో మెలగండి
ప్రశ్నించడం మానండి
Freedom of speech laid in our constitutiion
Human rights laid in our constitution
But, many times
they are in our fate
మేరా భారత్ మహాన్
- తోట శివప్రసాదరావు, కొత్తపేట, తూ.గో.


బతుకునిచ్చినవారికి వేధింపులు బతకనేర్చినవారికి కిరీటాలు!

ఇంత నీచమైన పరిపాలనా విధానం నా సర్వీసులో ఎప్పుడూ చూడలేదు. న్యాయవ్యవస్థ కేంద్ర ప్రభుత్వపు సొంత వ్యవస్ఠగ్థా రాజ్యాంగ సవరణ చేస్తే భవిష్యత్తులో ప్రజలు దానికి అనుగుణంగా ఆత్మరక్షణ చేసుకుంటారు. ఇది భారతదేశపు ‘వినూత్న’ ప్రజాస్వామ్య పరిపాలన అని ప్రజాస్వామ్య దేశాలు, ప్రజాస్వామ్య వాదులు మెచ్చుకుంటారు. అధికార దాహం, అహంభావం అనేవి ఇంతగా పేట్రేగిపోకూడదు.

కాంగ్రెస్‌కి ప్రాణభిక్షపెట్టిన వైఎస్సార్ కుటుంబాన్ని సి.బి.ఐ. సహకారంతో బజారుకీడ్చి, ఆయన కుమారుణ్ని జైల్లో బంధించి రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్, ప్రతిపక్షం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటాయి.

అధికారపక్షం కొమ్ముకాసిన ప్రతిపక్ష నాయకుడిని, పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను తిట్టి అదే పార్టీ పంచన చేరిన చేవలేని ‘నాయకుడిని’ నేను ఇంతవరకు చూడలేదు. అంతకంటే చేవలేనిది కాంగ్రెస్. అన్నం పెట్టినవాణ్ని హింసిస్తూ తిట్టినవాణ్ని అక్కున చేర్చుకుంది! ‘జగన్ మా మాట వింటే మంత్రిపదవి ఇచ్చేవాళ్లం, కాని మాకు వ్యతిరేకం అయితే ఇలాగే హింసిస్తాం’ అని చెప్పకనే చెప్పింది.

ఇంత బజారు పరిపాలనను ప్రజలు త్వరలోనే అంతమొందిస్తారు. అందరూ కలిసి జగన్‌ని ఒక్కణ్ని చేసి హింసిస్తున్నారు. ఆ హింస ఎంతోకాలం ఉండదు. జీసస్ ఇలా అన్నారు: I tell the truth you will weep and mourn while the world rejoices, you will grieve but your grief will turn to joy. అంతా కలిసి ఒక్కణ్ని చేసి హింసిస్తూ ఆనందిస్తే, ఒకరోజు ఆ ఆనందం ఆ ఒక్కడి సొంతం అవుతుంది. ఇది సత్యం.

- టి.ఎం.లూథర్, గుంటూరు

కేసుల నుంచి బయటపడేందుకే..


అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా కూల్చే అవకాశం ఉన్నా.. కేసుల దృష్ట్యానే టీడీపీ దానిని వ్యతిరేకించాలని నిర్ణయించుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి చేయూత నివ్వడం ద్వారా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన అన్యాయం తలపెట్టారని విమర్శించారు. శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ.. గడచిన నాలుగేళ్లలో విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు పేరిట రూ.32 వేల కోట్ల మేరప్రజలపై భారం వేసిన ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన భుజాలపై ఎత్తుకుని రక్షించారని బాలినేని చెప్పారు. ఎడాపెడా ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వాన్ని ఆయన వెనకేసుకొచ్చారన్నారు. 

నాలుగేళ్లలో ఎరువుల ధరలు పెంచడం ద్వారా రాష్ట్ర రైతులపై సుమారు రూ.15 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. సుమారు రూ.2,000 కోట్ల మేర ఆర్టీసీ చార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకే చంద్రబాబు మొగ్గు చూపడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ‘కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నందుకు, తద్వారా గత మూడేళ్లలో రాష్ట్ర ప్రజలపై సుమారు రూ.23 వేల కోట్ల మేర భారం మోపినందుకు.. ప్రభుత్వాన్ని కాపాడారా?’ అని నిలదీశారు. రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు 25 నుంచి 30 శాతం పెరిగినందుకు, ప్రజలపై సుమారు రూ.20 వేల కోట్ల భారం పడినందుకు అవిశ్వాసానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అపర సంజీవనిగా ఉపయోగపడిన 104 పథకాన్ని నిర్వీర్యం చేసినందుకే కాపాడారా? అని బాలినేని ప్రశ్నించారు. ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తెలిసీ చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడారంటేనే దాని వెనుక ఉన్న మర్మం అర్థమవుతోందని వివరించారు.

వైఎస్ పేరు వింటే మీకు వణుకు


ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బేరసారాలాడుకుని అమ్ముడుపోయిందంటూ ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఇది శాసనసభలో ఆయన
 తొలి ప్రసంగం. ‘మంచి పనులు చేసిన వారు కీర్తి కిరీటాలతో ప్రజల మధ్య జీవించి ఉంటారు. మంచి పనులు చేయకపోతే ఎంతకాలం రాజ్య పాలన చేసినా చరిత్రలో కలిసిపోతారు’ అనే అర్థంతో పోతన చెప్పిన పద్యంతో భూమన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘పోతన చెప్పిన విధంగా ఎన్నో మంచి పనులు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల్లో జీవించి ఉన్నారు. మూడున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించడంలో విఫలమైంది. ఫలితంగా ప్రజల తిరస్కారానికి గురైంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు మట్టికరిపించారు’’ అన్నారు.

వైఎస్ హామీలను మరిచిన సర్కారు

పథకాలకు మంచి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలకు ఒరిగిందేమీ లేదని భూమన అన్నారు. వైఎస్ పథకాలకు తూట్టు పొడిచి ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలింది. వైఎస్ పథకాలను నీరుగార్చిన ఘనత కిరణ్ ప్రభుత్వానికే దక్కుతుందంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘రైతులకు ఉచిత విద్యుత్‌ను 9 గంటలకు పెంచుతామని 2009లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రజలకు వైఎస్ ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం మరిచింది. అంతేగాక మూడున్నరేళ్లలో ప్రజలపై ఏకంగా రూ. 32 వేల కోట్ల విద్యుత్ భారం వేశారు. రైతులకు 2 గంటలు కూడా కరెంటివ్వలేని పరిస్థితి నెలకొంది. వైద్యమందక ఏటా 3 వేల మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించాలి. వైఎస్ హామీలను, ఆయన పథకాలను సంతృప్తస్థాయిలో అమలు చేయగల సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని ప్రజలు విశ్వసించారు. అందుకే ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు’’ అని వివరించారు.

అక్రమ విజయం సిగ్గుచేటు

సహకార ఎన్నికల్లో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడి, పెద్ద సంఖ్యలో సంఘాల ఎన్నికలు వాయిదా వేసి, గెలిచామని అధికార కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని భూమన అన్నారు. దాంతో మంత్రి కొండ్రు మురళి జోక్యం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీతో సహా అన్ని పథకాలనూ గతంలో కంటే మెరుగ్గా అమలు చేస్తున్నామన్నారు. వైఎస్ ఫొటో పెట్టుకొంటే ప్రయోజనమేమీ ఉండదని వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అన్నారు. దాంతో, తాము వైఎస్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరు చెప్పుకునే ప్రజల్లోకి వెళ్లామని భూమన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ఫొటోతోనే వెళ్లి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ పేరు చెబితే కాంగ్రెస్‌కు, టీడీపీకి వణుకు ఎందుకని ప్రశ్నించారు. అధికారం పోతుందని కాంగ్రెస్, అధికారం రాదని టీడీపీ భయపడుతున్నాయన్నారు.

అమ్ముడుపోయిన టీడీపీ

ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడంలో ప్రభుత్వం విఫలమైతే, సర్కారు తీరును ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బేరసారాలు ఆడుకొని అమ్ముడుపోయిందని భూమన విమర్శించారు. వైఎస్‌పై, ఆయన కుటుంబంపై టీడీపీ సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు దుర్మార్గమైన, అరాచకమైన విమర్శలు చేశారంటూ ధ్వజమెత్తారు. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, తన నిర్ణయాల ద్వారా 3 వేల కిలోమీటర్లు వెనక్కు పోయారంటూ శాసనమండలిలో విపక్ష నేత, టీడీపీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు చేసిన విమర్శలను ప్రస్తావించారు. బాబు అవినీతి పాలన గురించి మాట్లాడితే రోజులు, వారాలు కూడా చాలవన్నారు.

ఈ ప్రభుత్వమున్నది.. ప్రజలను కాపాడటానికా? లేక చంద్రబాబును కాపాడటానికా?

వైఎస్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన సర్కారు క్షణం కూడా కొనసాగటానికి వీల్లేదు 
ఐదేళ్లు చార్జీలు పెంచబోమని వైఎస్ చెప్పారు.. సర్కారు పక్షానికోసారి చార్జీలు వడ్డిస్తోంది 
నెలలో పక్షం రోజులు పరిశ్రమలకు పవర్ కట్.. పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయి 
చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి.. 20 లక్షల కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డాయి
ఎరువుల ధరలు పెరిగాయి.. గిట్టుబాటు లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి 
ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షేమ విధానాలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి 
మూడేళ్లుగా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అధోగతి... ఒక్క పరిశ్రమ కూడా రావటం లేదు
కార్మికులకు ఉన్న ఉద్యోగాలు ఊడుతుంటే.. కొత్త ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయి?
సర్కారుపై కొడవళ్లతో వెంటపడాలన్న బాబు.. తన చేతిలో ఆయుధాన్ని ప్రయోగించరట 
ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రధాన ప్రతిపక్షం విప్ జారీ చేయటం చరిత్రలో ఎక్కడా లేదు
అవిశ్వాసంపై చర్చలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష నాయకురాలు విజయమ్మ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: ‘‘ఈ ప్రభుత్వం ప్రజలను కాపాడటానికి ఉందా? లేక చంద్రబాబును కాపాడటానికా? ఈ ప్రభుత్వం ఎవరికి ప్రతినిధి? కిరణ్‌కుమార్‌రెడ్డికా? చంద్రబాబుకా? ప్రజలకు ప్రతినిధి కాదా? ... దివంగత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచింది.. అలాంటి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగటానికి వీల్లేదు. ... పవర్ హాలిడే, క్రాప్ హాలిడేలకు కారణమవుతున్న ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు హాలిడే ఇస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మ స్పష్టం చేశారు. 

‘‘ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వమని, కొడవళ్లతో వెంటపడాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. తన చేతిలోని ఆయుధాన్ని ప్రయోగించరట! ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టటానికి వచ్చిన అస్త్రాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వినియోగించుకోకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి తన సభ్యులకు విప్ జారీ చేయటం ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా ఉండబోదు’’ అని ఆమె తూర్పారపట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని నిండు సభలో ఎండగట్టారు. శుక్రవారం శాసనసభలో ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ విడిగా, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, నాగం జనార్దన్‌రెడ్డిలు సంయుక్తంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆమె మాట్లాడారు. 2009 ఎన్నికల ముందు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, బియ్యం కోటాను 30 కిలోలకు పెంచటం వంటి హామీల అమలును ఈ ప్రభుత్వం మరచిపోయిందని ధ్వజమెత్తారు. వచ్చే ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచబోమని రాజశేఖరరెడ్డి ప్రకటించగా.. ఈ ప్రభుత్వం పక్షానికోసారి చార్జీలను పెంచుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సర్కారును కాపాడేందుకు కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాగా.. ప్రజాక్షేత్రంలో ఉన్న రాజకీయ పార్టీగా.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు తామే ముందుకు వచ్చామని పేర్కొన్నారు. విజయమ్మ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... 

పక్షానికోసారి విద్యుత్ చార్జీల మోత 

ప్రజలపై ఉరిమిపడుతున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవటం ప్రభుత్వ నేరం కాదా? ప్రజా సమస్యలను పరిష్కరించటానికి ఈ ప్రభుత్వానికి టైం కూడా లేదు. రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.. ఇప్పుడు మాత్రం పక్షానికోసారి చార్జీల మోత మోగిస్తున్నారు. సర్‌చార్జి పేరుతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు. బిల్లులు ఎక్కువ మొత్తంలో ఇస్తూ విద్యుత్ మాత్రం తక్కువ ఇస్తున్నారు. 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే వారికి 116 శాతం పెంపు, 500 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించుకునే వారికి 33 శాతం మాత్రమే పెంపు ప్రతిపాదించారు. 

15 రోజులు పరిశ్రమలకు పవర్ కట్... 

పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయి. పరిశ్రమలకు నెలలో పక్షం రోజులు విద్యుత్ కోతల వల్ల చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి.. దీనితో 20 లక్షల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. వ్యవసాయానికి రెండు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయటం లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియటం లేదు. మూడేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అధోగతి పాలయింది. ఒక్క పరిశ్రమ కూడా రావటం లేదు. 

అంధకారంలో మగ్గాల్సిందేనా? 

రెండేళ్లుగా గ్యాస్, బొగ్గు లేదని తెలిసినా ఈ ప్రభుత్వం ఎందుకు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు? మరో రెండేళ్లపాటు బొగ్గు, గ్యాస్ అందుబాటులో ఉండదని కేంద్రమంత్రి ప్రకటించారు.. మరి అలాంటప్పుడు రాష్ట్రం అంధకారంలో మగ్గాల్సిందేనా? ఉత్తర భారతదేశం నుంచి 1,100 మెగావాట్ల కారిడార్ ఉంటే.. రాష్ట్రం మేల్కోకపోవటం వల్ల కేవలం 230 మెగావాట్లు రాష్ట్రం తీసుకున్నది.. అదే కర్ణాటక 850 మెగావాట్లు ముందే కొనుగోలు చేసింది. 


రైతులకు సాయమేదీ? 
పత్తి, మిరప, వేరుశనగ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎరువుల ధరలు 250 శాతం పెరిగాయి. గిట్టుబాటు ధర మాత్రం ఆ స్థాయిలో పెరగక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలు జనరేటర్లు కొనుగోలు చేయకుండా వ్యాట్‌ను ఐదు నుంచి 11 శాతానికి పెంచారు. నీలం తుపానులో రూ. 3,600 కోట్లు నష్టపోయిన రైతులకు ఏ మేరకు సాయం అందించారు? రాష్ట్రంలో రైతులు రూ. 60 వేల కోట్లు రుణాలు తీసుకుంటే.. వడ్డీ మాఫీ కింద రూ. 2,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. బడ్జెట్‌లో రూ. 650 కోట్లు మాత్రం ఎలా పెడతారు? ప్రభుత్వం విపత్తులు సృష్టిస్తోంది. వ్యవసాయ వృద్ధి రేటు 1.96 శాతానికి పడిపోయింది. 

సంక్షేమం నిర్వీర్యం... 

ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 అంబులెన్స్ సర్వీసులు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర సంక్షేమ విధానాలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయి. రాజీవ్ యువకిరణాల కింద 15 లక్షల మందికి అని ఒకసారి, మరోసారి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని సీఎం చెప్పారు. కానీ గవర్నర్ తన ప్రసంగంలో 2.75 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ఉన్న ఉద్యోగాలు ఊడుతుంటే.. కొత్త ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయి? ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి కొనసాగింపుగా సాగుతోంది. భాగస్వామ్య సదస్సుల పేరుతో రూ. 6.5 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.. కానీ ఎస్‌ఐపీబీలో రూ. 1.32 లక్షల కోట్లకు అనుమతులు ఇచ్చినట్లు గవర్నర్ ప్రకటించారు. సహకార ఎన్నికల్లో గెలిచామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటోంది కానీ.. ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేసిందో అందరికీ తెలుసు.

చంద్రబాబు చరిత్రహీనుడు

టీడీపీ అధినేతపై షర్మిల నిప్పులు 
నీకు వీసమెత్తు విశ్వసనీయతైనా ఉందా చంద్రబాబూ?
అవినీతి కాంగ్రెస్‌ను తరిమికొట్టండన్నావు 
తీరా అవిశ్వాసం పెడితే కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నావు
అవిశ్వాసంతో ఇతర పక్షాలు లబ్ధి పొందుతాయని కుంటిసాకులు చెప్తున్నావు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 91, కిలోమీటర్లు: 1,251

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అవినీతి, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పాలించే హక్కులేదన్నావు. కాంగ్రెస్‌ను తరిమికొట్టండన్నావు. తీరా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం వచ్చేసరికి మాట మార్చావు. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నావు. ఇదేమని అడిగితే.. ఇతర పక్షాలు లబ్ధిపొందుతాయని కుంటిసాకులు చెప్తున్నావు. నీకు కావాల్సింది ప్రజల ఇబ్బందులు తీరడమా లేక మరేదైనా ప్రయోజనమా? ఈ ప్రభుత్వం మాకొద్దని ప్రజలందరూ ముక్త కంఠంతో నినదిస్తుంటే చెవులుండీ నీకు వినపడడం లేదా చంద్రబాబూ? నీకు వీసమెత్తు విశ్వసనీయతైనా ఉందా? ప్రజల పక్షాన కాకుండా వారిని పీడిస్తున్న పాలక పక్షాన నిలిచిన నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిపై నిప్పులు చెరిగారు. 

ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదని, మామను వెన్నుపోటు పొడిచి పీఠమెక్కినప్పటి నుంచీ చంద్రబాబు మోసాలు, కుట్రలతోనే గడిపారని విమర్శించారు. ప్రజల బాధలు పట్టని ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కయిన చంద్రబాబుకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం గుంటూరు నగరంలో సాగింది. షర్మిలను చూసేందుకు వచ్చిన అభిమానులతో గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. మాయాబజార్ సెంటర్‌లో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
ప్రజాస్వామ్యానికే చంద్రబాబు మాయని మచ్చ..

‘‘ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తమకొద్దని మొరపెట్టుకుంటున్న ప్రజల తరఫున ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంపై ఉంది. కానీ చంద్రబాబు ఆ పని చేయకపోగా ఇతర పార్టీలు ముందుకొస్తే వారికి సహకరించడం లేదు. అవిశ్వాసానికి మద్దతివ్వకుంటే ప్రభుత్వానికి అండగా నిలిచినట్టు కాదా? ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అధికార కాంగ్రెస్ కంటే ముందుగానే అవిశ్వాసానికి వ్యతిరేకంగా వ్యవహరించాలంటూ ప్రతిపక్ష నేత తమ శాసన సభ్యులకు విప్ జారీ చేశారు. ఇలాంటి నాయకుడిని ఏమనాలి? ప్రజాసామ్యానికే చంద్రబాబు మాయని మచ్చ. మోసాలు, కపటాలే ఆయన సిద్ధాంతాలు.
మంచి నీళ్లవ్వలేని ఈ సర్కారు ఎందుకు?

దాహార్తితో అల్లాడుతున్న ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు? రాష్ట్రంలో ఏ గ్రామానికెళ్లినా పేదలు తాగునీరు కొనుక్కుంటున్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి ముందుచూపు లేదు. అందుకే రాష్ట్రంలో అంధకారం అలముకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలు కూడా ఉండడం లేదు. పైగా పరిశ్రమలకు 12 గంటలు కోతలు. రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ కరెంటు కోతలతో మూతపడ్డాయి. లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీనికి తోడు కరెంటు చార్జీల వాతలు పెడుతున్నారు. సర్‌చార్జీ పేరుతో రూ.32వేల కోట్లు వసూలు చేస్తున్నారు. వైఎస్ తెచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆయన ఆశయాలకు గండికొట్టారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ ఏనాడూ ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచలేదు. లక్షలమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించారు. 108, ఆరోగ్యశ్రీ, అభయహస్తం వం టి సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ ఈ కాంగ్రెస్ నేతలకు వైఎస్ మీద గౌరవం లేదు. అందుకే ఆయన ఆశయాలకు గండికొట్టి చార్జీల మీద చార్జీలు పెంచుతూ ప్రజలను పీడిస్తున్నారు.’’

గుంటూరులో జనహోరు..: ‘మరో ప్రజాప్రస్థానం’ 91వ రోజు శుక్రవారం గుంటూరులో జరిగిన పాదయాత్రకు జనం పోటెత్తారు. ఉదయం గుంటూరు నగరం హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద ప్రారంభమైన యాత్ర.. చుట్టుగుంట, వికలాంగుల కాలనీ, నల్లచెరువు, పూలమార్కెట్, మాయాబజార్ సెంటర్, బీఆర్ స్టేడియం మీదుగా సంగడిగుంట వరకు సాగింది. 11.5 కి.మీ. మేర నడిచిన షర్మిల పొన్నూరు రోడ్డులోని ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి న బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. వస్త్రాలపై వ్యాట్‌ను రద్దు చేసేలా పార్టీ తరఫున పోరాడాలంటూ ఏపీ వస్త్రవ్యాపారుల సమాఖ్య కన్వీనర్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, జిల్లా వాసవీ హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ సొసైటీ కన్వీనర్ వీసం కృష్ణమూర్తి శుక్రవారం షర్మిలను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. యాత్రలో అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, గోనె ప్రకాశ్‌రావు, ఆర్కే, గౌతం రెడ్డి, తలశిల రఘురాం, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, రావి వెంకటరమణ, కోన రఘుపతి, మహ్మద్ ముస్తఫా, షౌకత్, నజీర్ అహ్మద్, గులాం రసూల్, ఏటిగడ్డ నరసింహారెడ్డి, దేవళ్ల రేవతి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీయే అధికార పార్టీ అన్నట్టుగా ....

అసెంబ్లీ సాక్షిగా రుజువైన కాంగ్రెస్-టీడీపీ ఫిక్సింగ్
అవిశ్వాసంలో గట్టెక్కిన సర్కారు.. కాంగ్రెస్‌ను వదిలి వైఎస్సార్‌సీపీనే టార్గెట్ చేసిన టీడీపీ
వైఎస్సార్‌సీపీయే అధికార పార్టీ అన్నట్టుగా మాటతీరు
ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలిన టీడీపీ సభ్యులు
రూ. 32 వేల కోట్ల కరెంట్ బాదుడుకు పరోక్ష ఆమోదం
వీధి రాజకీయాలను తలపించిన మోత్కుపల్లి మాటలు
దివంగత వైఎస్, వైఎస్సార్‌సీపీలే లక్ష్యంగా దూషణలు
అవిశ్వాసానికి మద్దతివ్వని టీడీపీకి సభలో ప్రాధాన్యత
‘దేశం’ తీరును ఆనందంగా వీక్షించిన కాంగ్రెస్ సభ్యులు

రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరగని సరికొత్త సంప్రదాయానికి టీడీపీ తెర తీసింది! అధికార కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. తద్వారా ప్రధాన ప్రతిపక్ష హోదాకే కొత్త నిర్వచనమిచ్చింది. పనిలో పనిగా కాంగ్రెస్‌తో తన కుమ్మక్కును సాక్షాత్తూ శాసనసభా వేదికపైనే బాహాటంగా రుజువు చేసి చూపింది. రూ.32 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం వంటి కిరణ్ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటికీ టీడీపీ ఆమోదముద్ర వేసినట్టయింది! ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం మాట అటుంచి.. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శుక్రవారం సభలో ఆద్యంతం దివంగత వైఎస్‌ను, ఆయన కుటుంబీకులను, వైఎస్సార్ కాంగ్రెస్‌ను విమర్శించడానికే పరిమితమైంది. తద్వారా తీర్మానాన్ని పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చింది. ఫలితంగా వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోయినా... కేవలం 142 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందని నిండు సభలో వెల్లడైంది. అంతేగాక కేవలం టీడీపీ మద్దతు వల్లే శుక్రవారం నాటి అవిశ్వాసాన్ని గట్టెక్కిందని కూడా సభ సాక్షిగా రుజువైంది!

సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని సరికొత్త సంప్రదాయానికి విపక్ష టీడీపీ తెర తీసింది! ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, సహచర విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వానికి పూర్తి రక్షణగా, అడుగడుగునా అండగా నిలిచింది. తద్వారా కాంగ్రెస్ పార్టీతో తన కుమ్మక్కును శుక్రవారం సాక్షాత్తూ అసెంబ్లీ వేదికపైనే రాష్ట్రం మొత్తానికీ మరోసారి రుజువు చేసి చూపింది. బాధ్యతాయుత విపక్షంగా కనీసం ప్రభుత్వ వైఫల్యాలనైనా ఎండగట్టాల్సింది పోయి మోత్కుపల్లి నర్సింహులు సహా టీడీపీ సభ్యులంతా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే లక్ష్యం చేసుకుని మాట్లాడారు.

తద్వారా అవిశ్వాస తీర్మానాన్ని సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్షమే ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించారు! ఇక చర్చ పొడవునా టీడీపీకి లభించిన ప్రాధాన్యత కూడా కాంగ్రెస్‌తో ఆ పార్టీ కుమ్మక్కు రాజకీయానికి ఆద్యంతం అద్దం పట్టింది. శుక్రవారం సభలో వ్యవహరించిన తీరు ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తినే కాలరాసిందన్న అపవాదును టీడీపీ మూటగట్టుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా రెండుసార్లు ఓడి జవసత్వాలుడిగిన కాంగ్రెస్‌ను రెండుసార్లు వరుసగా గెలిపించి ప్రస్తుతం అనుభవిస్తున్న అధికారానికి కారకుడైన దివంగత వైఎస్ పట్ల టీడీపీ అనుచిత వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులంతా ఆనందంగా వీక్షించన వైనం కూడా విస్తుగొలిపింది. శుక్రవారం అసెంబ్లీ టీడీపీ సభ్యులు మాట్లాడిన తీరు సభలో మునుపెన్నడూ లేని విచిత్ర పరిస్థితిని కళ్లకు కట్టిందని అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరన్నారు. ‘‘టీడీపీ సభ్యులు మాట్లాడేందుకు లేస్తే చాలు... వాళ్లకు నిబంధనలతో పని లేకపోయింది. తోచింది, అనుకున్నది మాట్లాడేశారు. సభలో లేని వారిని దూషించదలచినా, వారిపై అడ్డగోలు ఆరోపణలు చేయదలిచినా టీడీపీ వారు కనీసం ముందుగా అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా సభ నడిచిన తీరు నన్ను విస్మయానికి గురి చేసింది’’ అంటూ ఆయనమండిపడ్డారు.

విషయమేమిటి.. లక్ష్యమెవరు?

వాస్తవానికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరగాల్సిన చర్చనే టీడీపీ పూర్తిగా పక్కదోవ పట్టించింది. కాంగ్రెస్‌తో టీడీపీ ముందుగానే ఒప్పందం కుదుర్చుకుందా అన్న రీతిలో రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించాయి. వ్యూహాత్మకంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇంతటి కీలక సమయంలో కూడా కనీసం సభకు రాకుండా అధికార పక్షానికి అండగా నిలిచిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, అవిశ్వాసంపై జరిగిన చర్చలోనూ పార్టీ సభ్యులకు అదే మాదిరిగా ‘దారి చూపారు’. ప్రజా సమస్యలను ఏమాత్రమూ పట్టించుకోకుండా.. వైఎస్, ఆయన కుటుంబ సభ్యులే లక్ష్యంగా టీడీపీ ఆరోపణలు గుప్పించింది. మోత్కుపల్లి అయితే మాట్లాడిన రెండు గంటల్లో ఏకంగా గంటా నలభై నిమిషాలకు పైగా వైఎస్ ప్రభుత్వంపైనే ఆరోపణలు గుప్పించేందుకు పరిమితమయ్యారు. పేదల భూములను వైఎస్ లాక్కున్నారన్నారు.

ఆ క్రమంలో, ‘ఎమ్మార్‌కు వైఎస్ 534 ఎకరాలు కట్టబెట్టార’ంటూ అలవోకగా ఆరోపణ చేసేశారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతను అమలు చేసిన మోత్కుపల్లికి అడుగడుగునా అధికార పార్టీ అండ లభించింది. వైఎస్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, వైఎస్ సతీమణి విజయమ్మను, చివరికి బైబిల్‌ను కూడా మోత్కుపల్లి వదల్లేదు. వైఎస్సార్‌సీపీ నేతలనుద్దేశించి అసభ్య పదజాలం ప్రయోగించారు. సీనియర్ ఎమ్మెల్యే అయి ఉండి, సభ్యులనుద్దేశించి నేరుగా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తెలిసి కూడా, పదేపదే అవే మాటలను ప్రస్తావించారు. కాంగ్రెస్‌ను గానీ, ఆ పార్టీ నేతలను గానీ ఒక్క మాటన్నా రూల్సు పుస్తకాలు చేతుల్లో పట్టుకుని మరీ అభ్యంతరాలు తెలిపిన మంత్రులు గానీ, వారి వెనక ఉండి కేకలు వేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు గానీ.. వైఎస్‌ను మోత్కుపల్లి దుర్భాషలాడుతుంటే మాత్రం తమకేమీ వినబడనట్టుగా వ్యవహరించారు. కొందరు సభ్యులైతే నవ్వులు చిందించారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి తయారు చేసుకున్న స్క్రిప్టులను చదివారు.

ప్రభుత్వాన్ని కాదంటూ సీఎంకు సంజాయిషీ!

వైఎస్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించిన టీడీపీ సభ్యులు, అధికార పార్టీని తామేమీ అనడం లేదంటూ ఒకటికి రెండుసార్లు సంజాయిషీ ఇచ్చుకున్నారు! మోత్కుపల్లి అయితే ఓ దశలో సీఎం కిరణ్‌ను ఉద్దేశించి, ‘మిమ్మల్నేమీ అనడం లేదు. వైఎస్ పాలనలో అక్రమాలేనన్నదే మా బాధంతా’ అంటూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన తీరు పరిశీలకులనే విస్మయపరిచింది. పైగా స్పీకర్ కూడా మోత్కుపల్లి మాటల్లో అభ్యంతకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారే తప్ప వైఎస్‌నుద్దేశించి మాట్లాడొద్దని స్పీకర్ రూలింగ్ ఇవ్వలేకపోయారు. నిజానికి వైఎస్‌నుద్దేశించి మోత్కుపల్లి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానిస్తున్న సందర్భంలో ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సరికదా, నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు సూచనలిచ్చేందుకు ప్రయత్నించారు. మోత్కుపల్లికి తోడు మధ్యలో ఎర్రబెల్లి దయాకరరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్ తదితర టీడీపీ సభ్యులు కూడా తమ వంతుగా అధికార పార్టీకి అండగా, వైఎస్ కుటుంబమే లక్ష్యంగా మాట్లాడారు. విచారణలో భాగంగా సీబీఐ పేర్కొన్న అంశాలనే కోర్టు తీర్పులన్న స్థాయిలో ప్రస్తావిస్తూ, వాటి సాయంతో జగన్‌ను దోషిగా చిత్రీకరించజూశారు. కానీ, ‘చంద్రబాబును ఏ కోర్టయినా నిర్దోషిగా నిర్ధారించిందా? అలాగే వైఎస్‌ను ఏ కోర్టయినా దోషి అని చెప్పిందా?’ అని వైఎస్ విజయమ్మ వేసిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. ఒకరకంగా చెప్పాలంటే అవిశ్వాసంపై జరిగిన చర్చలో భాగంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్న సమయంలో అసలు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయా.. లేక వైఎస్సార్ కాంగ్రెస్సా అనే అనుమానాలు కూడా కలిగాయని పరిశీలకులే అంటున్నారు.

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రొగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

బసచేసిన ప్రాంతం నుంచి శనివారం బయలుదేరి ప్రత్తిపాడు నియోజకవర్గం బుడంపాడు మీదుగా భోజన విరామకేంద్రానికి చేరుకుంటుంది. విరామానంతరం నారాకోడూరు, వేజెండ్ల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు
ప్రత్తిపాడు నియోజకవర్గం: బుడంపాడు
పొన్నూరు నియోజకవర్గం: నారాకోడూరు, వేజెండ్ల

వీగిన అవిశ్వాస తీర్మానం

 వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, లోక్‌సత్తా , నాగం జనార్ధన రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతు తెలుపకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. డివిజన్ ఓటింగ్ కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. అవిశ్వాసానికి అనుకూలంగా మద్దాల రాజేష్, పేర్నినాని, పెద్దిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి, అమరనాథ్ రెడ్డి, సాయిరాజ్, జోగి రమేశ్, సుజయ్ రంగారావు, కొడాలి నాని, వనిత, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్లనాని ఓటు వేశారు. దాంతో శాసనసభలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అవిశ్వాసానికి అనుకూలంగా మొత్తం 57 మంది ఓటు వేశారు. టీడీపీ కి చెందని ఆరుగురు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు. రెబెల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, కోటం, వేణుగోపాల చారి ఓటింగ్ దూరంగా ఉన్నారు.

ఎమ్మెల్యేలకు మరోసారి విప్ జారీ చేసిన టీడీపీ

ఎమ్మెల్యేలకు టీడీపీ మరోసారి విప్‌జారీ చేసింది. అవిశ్వాసం జరిగే సమయంలో తటస్థంగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని గురువారం విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే!

YS Sharmila speech at Guntur

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013

కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తాం: భూమన

కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని వైఎస్ఆర్ సీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రజ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. తాము త్వరలోనే అధికారంలోకి వస్తామన్నారు. వైఎస్ పేరుతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పూర్త చేయలేకపోయారని భూమన ఆరోపించారు

సంగడిగుంటలో ముగిసిన షర్మిల పాదయాత్ర

గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న షర్మిల 91వ రోజు పాదయాత్ర సంగడిగుంటలో ముగిసింది. నేటి పాదయాత్రలో షర్మిల 11.5 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటి వరకు ఈ పాదయాత్రలో 1250.9 కి.మీ షర్మిల పాదయాత్ర చేశారు. నల్లచెరువు మెయిన్‌రోడ్, ఏటుకూరు క్రాస్‌రోడ్, ఎస్.కె.పి.ఆలయం, పూలమార్కెట్, పొన్నూరు రోడ్, బీఆర్‌స్టేడియం జిన్నాటవర్ మీదుగా మాయాబజార్‌సెంటర్‌లో బహిరంగ సభకు హాజ‌రై ష‌ర్మిల ప్రసంగించారు. అనంతరం సంగడిగుంటకు చేరుకున్నారు.

ఏ కోర్టూ చంద్రబాబు నిర్దోషని చెప్పలేదు..

అసెంబ్లీలో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు వ్యాఖ్యలపై శ్రీమతి విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అవిశ్వాసం ఎందుకు పెట్టామో స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు. తాను చంద్రబాబును వ్యక్తిగతంగా ఏమీ అనలేదని స్పష్టంచేశారు. ఏం మాట్లాడానో రికార్డులు పరిశీలించండి. చంద్రబాబుపైనా కేసులున్నాయి, ఆరోపణలున్నాయన్నారు. దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. వీరికి సభ్యతా సంస్కారాలున్నాయా. నేను మాట్లాడాలంటే చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని ఎందుకు కలిశారనే దానిపై మాట్లాడాలి లేదా  ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో టీడీపీ సభ్యుల గైర్హాజరు గురించి మాట్లాడాలని చెప్పారు. వ్యక్తిగత ఆరోపణల గురించి ఎందుకు అనుమతిచ్చారో అర్థం కావడం లేదనీ, ఈరోజు తాను చాలా బాధ పడుతున్నాననీ తెలిపారు. కోర్టు కేసుల గురించి మాట్లాడుతున్నారనీ,  ఏ కోర్టూ చంద్రబాబు నిర్దోషని చెప్పలేదు.. మహానేత డాక్టర్ వైయస్ఆర్, శ్రీ జగన్మోహన్ రెడ్డీ దోషులని చెప్పలేదన్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తులోని అంశాలను సభలో ఎందుకు చదువుతున్నారని మోత్కుపల్లిని నిలదీశారు. స్పీకరు గమనించి చర్య తీసుకోవాలని శ్రీమతి విజయమ్మ కోరారు.

అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు: వైఎస్ఆర్ సీపీ

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఇంత చీకటి రోజు ఎప్పుడూ చూడలేదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మాట్లాడనీయకపోవడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల నిరసన తెలుపుతూ.. మీడియాపాయింట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ వ్యవహారశైలి బాధాకరమని వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు. 

కాంగ్రెస్‌-టీడీపీ కుమ్మక్కై సభను నడిపిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వారన్నారు. వైఎస్ఆర్, కుటుంబసభ్యుల గురించి మాట్లాడినా డిప్యూటీ స్పీకర్ నోరు మెదపడం లేదని శోభానాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో చేసుకున్న చీకటి ఒప్పందం బయటపడుతుందనే తమపై ఎదురుదాడి చేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 

షర్మిల సభకు కిక్కిరిసిన జనం


 మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర భాగంగా గుంటూరు పట్టణంలో జరిగిన షర్మిల బహిరంగ సభకు జనం పోటెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో సభాప్రాంగణం కిక్కిరిసింది. ఈ సభలో ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్, టీడీపీలపై ధ్వజమెత్తారు. 

అమాయకుడైన జగనన్న 9 నెలలు జైలులో ఉంచారు.. మీకు మనస్సాక్షి ఉందా అని షర్మిల ప్రశ్నించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గుంటూరు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అవిశ్వాసాన్ని వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్‌కు లేని తొందర టీడీపీకి వచ్చిందని..అందుకే ముందుగానే టీడీపీ విప్ జారీ చేసింది అని షర్మిల అన్నారు. ఈ సభలో షర్మిల టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు.

కేసులు, విచారణ లేకుండా చంద్రబాబు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని.. ప్రజా వ్యతిరేక పార్టీకి మద్దతు పలికిన తర్వాత.. ఇక టీడీపీ ఎక్కడుంది బాబూ అని ఎద్దేవా చేశారు. మన కర్మ కొద్ది ఓ వైపు అసమర్థ ప్రభుత్వం.. మరోవైపు చేతగాని ప్రతిపక్షం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల కోసం వైఎస్ఆర్ 5 శాతం రిజర్వేషన్ల కోసం పట్టుపట్టారని.. కేంద్రం ఒప్పుకోకుంటే 4 శాతం రిజర్వేషన్లను ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దేనని షర్మిల ఈసందర్భంగా గుర్తు చేశారు.

వైఎస్ఆర్‌ రైతులకు ఏమీ చేయలేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని..చిన్నపిల్లవాడ్ని అడిగినా రైతులకు, రాష్ట్రానికి వైఎస్ఆర్ ఏంచేశారో చెబుతారని ఆమె అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

అంజిరెడ్డి మృతికి విజయమ్మ సంతాపం


రెడ్డీ ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి మృతికి వైఎస్ విజయమ్మ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అంజిరెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ డాక్టర్ అంజిరెడ్డి శుక్రవారం అపోలో ఆస్పత్రిలో మరణించారు.


డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ అధినేత కళ్లం అంజిరెడ్డి(73) కన్నుమూశారు. అంజిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో 1940లో జన్మించారు. 1984లో స్థాపించిన డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్ ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

Debate on no-confidence motion in AP Assembly

Popular Posts

Topics :