31 March 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Sharmila's Maro Praja prasthanam: Sea Of Humanity in Gudivada

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013

విజయమ్మ ఆరోగ్యంపై నారాయణ ఆందోళన

వైఎస్ విజయమ్మ ఆరోగ్యంపై చేసిన సీపీఐ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మొండి ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేశారు. దీక్ష చేస్తున్న నేతలకు 24 గంటల డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు వైద్య పరీక్షలు

కరెంట్ సత్యాగ్రహం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు. విజయమ్మసహా, 8 మందికి షుగర్‌లెవల్స్‌ పడిపోయావని పేర్కొన్నారు. దీక్ష చేస్తున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వీరికి వెంటనే వైద్య సహాయం అందించాలని వైద్యులు సూచించారు.

షుగర్‌లెవల్స్‌ ఈవిధంగా ఉన్నాయి... 
వైఎస్‌ విజయ్మ 75
శోభానాగిరెడ్డి 54
సుజయకృష్ణరంగరావు 71
ఎన్‌ అమర్‌నాథ్‌రెడ్డి 74
ప్రసన్నకుమార్‌రెడ్డి 71
పేర్నినాని 60
కాపురామచంద్రారెడ్డి 73
గురునాథరెడ్డి 71

చంద్రబాబుది వెన్నుపోట్ల చరిత్ర: షర్మిల


కష్టకాలంలో ప్రజలవైపు నిలబడకుండా చంద్రబాబు స్వప్రయోజనాలు చూసుకున్నారని షర్మిల విమర్శించారు. సొంతమామను వెన్నుపోటు పొడిచినట్టు రాష్ట్రప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టలేదు చంద్రబాబు నిలబెట్టలేదని ఆమె గుర్తు చేశారు. గుడివాడ నెహ్రూచౌక్‌లో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. రెండెకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు వేలకోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వ్యసాయం దండగ అన్నారని, ప్రజలకు ఏదీ ఉచితంగా బాబు ఇవ్వొద్దన్నారని గుర్తు చేశారు.

కొడాలి నాని అన్నతోపాటు ఎమ్మెల్యేలు కష్టకాలంలో వైఎస్సార్ సీపీలో చేరారని తెలిపారు. వారి మీద వేటుపడుతుందని తెలిసినా... వీరు ప్రజలపక్షాన నిలబడ్డారని చెప్పారు. పదవీ వ్యామోహం వీరికా, చంద్రబాబుకా అని షర్మిల ప్రశ్నించారు. ఎన్టీ రామారావు టీడీపీని కాంగ్రెస్‌ మీద కోపంతో స్థాపించారని, అలాంటిది చంద్రబాబు కాంగ్రెస్‌తోనే కుమ్మక్కయ్యారని అన్నారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌లా చంద్రబాబు ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు కాదన్నారు. కుట్రలు, వెన్నుపోట్ల నుంచి ఆయన పుట్టాడన్నారు. గుడివాడ ప్రాంతంలో ఇళ్లు ఇవ్వడానికి వైఎస్‌ఆర్ 70 ఎకరాలు సేకరించారని, కాని ఇప్పటికీ ఇళ్లు పూర్తికాలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బాబు 16 లక్షలమందికి పింఛన్లు ఇస్తే... వైఎస్‌ఆర్ 71 లక్షలమందికి ఇచ్చారని తెలిపారు.

నన్నెవరూ ఆపలేరు: కొడాలి నాని

జగన్‌ సీఎం కాకుండా, తనను అసెంబ్లీకి రాకుండా ఏ మగాడూ అడ్డుకోలేడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని అన్నారు. గుడివాడ బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు తప్ప ఎవరైనా ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపాయన్నారు. జగన్‌కు మద్దతు తెలిపినందుకు తనను అనేక మాటలన్నారని తెలిపారు. తాను డబ్బులు తీసుకుని వైఎస్సార్ సీపీలో చేరానని నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైఎస్‌పై చంద్రబాబు తన చెంచాలతో లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. షర్మిల కుటుంబానికి అండగా ఉంటామని కృష్ణాజిల్లా ప్రజలంతా చెప్తున్నారన్నారు. వైఎస్‌ ఫొటోతోపాటు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ చావుకు కారణమైన చంద్రబాబుకు ఆయన బొమ్మ పెట్టుకునే హక్కు లేదని కొడాలి నాని అన్నారు.

గుడివాడలో షర్మిల సభకు పోటెత్తిన జనం

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం రాత్రి గుడివాడ చేరుకుంది. ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నెహ్రూచౌక్‌లో ఏర్పాటు చేసిన షర్మిల బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఎటుచూసినా జనమే కనిపించారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో గుడివాడ జనసంద్రమయింది.

వైఎస్ఆర్ సీపీ ఆమరణదీక్షకు వేదపండితుల మద్దతు

వైఎస్ఆర్ సీపీ ప్రజా ప్రతినిధుల ఆమరణదీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఈరోజు కుషాయిగూడ నుంచి వేదపండితులు దీక్షాస్థలికి వచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. 

ఇదిలా ఉండగా, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పరామర్శించారు

వైఎస్సార్ సీపీ దీక్షకు పొత్తూరి సంఘీభావం

కరెంట్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ నేతలు చేస్తున్న దీక్షకు సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. 5 రోజుల దీక్ష ద్వారా ప్రజల సమస్యను చాటి చెప్పగలిగారని ఈ సందర్భంగా పొత్తూరి అన్నారు. దీక్ష చేస్తున్న వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ అభిమానిగా దీక్ష విరమించాలని విజయమ్మసహా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరో బలవంతంగా దీక్షను విరమింపజేయడం కన్నా తన సలహా మేరకు విరమించాలని కోరారు.

Serious illness to ys vijayamma and ysrcp leaders

Serious illness to ys vijayamma and ysrcp leaders

జ(గ)నాభిప్రాయమే కీలకం!


Written by MK On 6/4/2013 13:40:00 PM(sakshi)
వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సహా తొమ్మిది పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయని ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’ విశ్లేషించింది. ‘ఎన్నికల తర్వాత సంకీర్ణ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే మిత్రుల అన్వేషణలో పడ్డాయి. ఎన్నికల అనంతరం బలమైన కూటమిగా అవతరించడానికి కావాల్సిన సంఖ్యా బలాన్ని కూడగట్టుకునే కసరత్తును ఆరంభించాయి’ అని పేర్కొంటూ పత్రిక తాజా సంచిక ముఖచిత్ర కథనం ప్రచురించింది. ఈ 9 పార్టీలు ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడమే గాక కేంద్రంలో సర్కారు ఎవరిదనేది ఆ పక్షాల సారథులే నిర్ణయిస్తారన్నది కథనం సారాంశం. జాతీయ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ములాయంసింగ్ యాదవ్, మాయావతి, శరద్ పవార్, ఎం.కరుణానిధి, జె.జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్, జగన్‌మోహన్‌రెడ్డిలను ప్రస్తావిస్తూ ముఖచిత్ర కథనంలో వారి ఫొటోలను ప్రచురించారు. జాతీయ రాజకీయ విశ్లేషకుల్లో మారిన దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, వైఎస్సార్‌సీపీని బలమైన రాజకీయ శక్తిగా గత రెండేళ్లలో పలు మీడియా కథనాలు పలుసార్లు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలోనే ‘ఇండియాటుడే’ తాజా కథనం ఉండటం గమనార్హం.

అనామకుడు బాబు!

దేశంలోని ఏడు ప్రధాన రాష్ట్రాలకు చెందిన 9 మంది రాజకీయ ప్రముఖులే కేంద్రంలో ఎన్నికల తర్వాత రాజకీయాలను శాసిస్తారని, ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున జగన్ ఆ భూమికను పోషిస్తారని కథనంలో పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని పదేపదే చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరు కూడా ఈ కథనంలో లేదు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల నుంచి పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలిద్దరి ప్రస్తావనా కథనంలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కేవలం వైఎస్సార్‌సీపీని, జగన్‌ను మాత్రమే ప్రస్తావించారు.

యువ సంచలనం!

రాష్ట్రాలవారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, యూపీ, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో తొమ్మిది రాజకీయ పార్టీలు కీలక శక్తులుగా ఉన్నాయని కథనం వివరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్, బీహార్ నుంచి జనతాదళ్ (యునెటైడ్) అగ్ర నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, తమిళనాడు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జె.జయలలిత, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, పశ్చిమ బెంగాల్ నుంచి ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ సారథి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లను కేంద్ర రాజకీయాల్లో నిర్ణాయక పాత్రధారులుగా కథనం అభివర్ణించింది. వీరిలో మిగతా ఎనిమిది మందీ దీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ సంకీర్ణ రాజకీయాల్లో ఆరితేరిన ఉద్ధండులు కాగా జగన్ ఒక్కరే నవ యువ సంచలనం కావడం గమనార్హం.

బలీయ శక్తి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత బలీయమైన రాజకీయ శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని ఇండియాటుడే తాజా ముఖచిత్ర కథనం పేర్కొంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో పార్టీ చాలా పటిష్టంగా కన్పిస్తోందని వివరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఓటర్లు క్రమేపీ వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ వైపు మళ్లుతున్నారని విశ్లేషించింది. ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో చేరారని ప్రస్తావించింది. ‘‘జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ నిరాకరించి 2012 మే 27 నుంచీ జైల్లోనే ఉంచినా.. కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలతో పాటు యువ ఔత్సాహిక నేతలు ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో చంచల్‌గూడ జైలు ముందు బారులు తీరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనువుగా మలచుకోవడంలో టీడీపీతో పాటు ఇతర అన్ని పార్టీల కంటే వైఎస్సార్‌సీపీయే చాలా ముందుంది’’ అంటూ విశ్లేషించింది. ‘‘జగన్ జరిపిన విసృ్తత ఓదార్పు యాత్రను ఆయన అరెస్టు ద్వారా ప్రభుత్వం నిరోధించింది. అయినా, తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అసంపూర్తిగా వదిలిన అజెండాను పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తన సోదరి షర్మిలను జగన్ నియోగించారు. ఆ మేరకు ఆమె అత్యంత కష్టతరమైన పాదయాత్ర సాగిస్తున్నారు’’ అని పేర్కొంది.

నూతన చారిత్రిక దశ!

వాస్తవానికి ‘ఇండియాటుడే’ ముఖ చిత్ర కథనం ఓ కొత్త చారిత్రిక దశను పరోక్షంగా ప్రస్తావించింది. ఆరున్నర దశాబ్దాలుగా నిత్యం పరిణామానికి గురవుతూ వస్తున్న మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇప్పుడు ఓ కొత్త దశకు చేరుకుంది. నెహ్రూ, ఇందిర, జయప్రకాష్ నారాయణ్ (లోక్ నాయక్) తదితరుల కాలం ఇప్పుడు చరిత్రలో ఉజ్వల ఘట్టంగా మాత్రమే మిగిలింది. బహుశా ఇకముందు మన దేశానికి జాతీయ స్థాయిలో కేంద్రీకృత నాయకత్వం గానీ, సారథ్యంగానీ ఉండకపోవచ్చు. ఈ పరిస్థితి ఒక్కనాడే వచ్చిపడింది కాదు. వాస్తవానికి లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, వీపీ సింగ్, ఐకే గుజ్రాల్, దేవె గౌడ, పీవీ, మన్మోహన్ సింగ్ లాంటి నేతలు ప్రధాన మంత్రులు కాగలగడం చూస్తేనే మన ప్రజాస్వామ్యం తీరుతెన్నుల్లో వచ్చిన మార్పు కళ్లకు కడుతుంది. ఇన్నాళ్లకు ఇది తిరుగులేని ధోరణిగా స్థిరపడింది. ప్రాంతీయ స్థాయిలో జనహృదయ విజేతలుగా ఆవిర్భవించే నేతలే ఇకపై జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారు. ‘ఇండియా టుడే’ కథనం సైతం ఇదే విషయం చెప్తోంది. నిజానికి ఈ క్రమం 1960 దశకం చివర్లోనే మొదలయింది. సోషలిస్ట్ దార్శనికుడు రామ్ మనోహర్ లోహియాను ఈ క్రమానికి మంత్రసానిగా చెప్పవచ్చు. దక్షిణ భారత దేశంలో పుట్టిన సంస్కరణ ఉద్యమాలూ, ఉత్తర భారత దేశంలో తలెత్తిన నూతన చేతనా ఈ క్రమాన్ని చెక్కుతూ పోయాయి. ఈవీఆర్ నుంచి ఎంజీఆర్ వరకూ, కర్పూరీ ఠాకూర్ నుంచి మాయావతి వరకూ, ఎన్టీర్ నుంచి వైఎస్సార్ వరకూ ఎందరో జనహృదయ విజేతలు ఈ క్రమం లోతుగా వేళ్లూనుకోడానికి కారకులయ్యారు. తాజాగా ఈ జాబితాలో చేరిన తెలుగు నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇండియా టుడే కథనం ఆ మాటే చెప్తోంది.
- See more at: http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=60390&Categoryid=28&subcatid=0#sthash.iUAwMXkI.dpuf

'బెజవాడకు లగడపాటి చేసిందేమీలేదు'

ప్రకాశం బ్యారేజీ గేట్ల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధ, పడమటి సురేష్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరి స్వార్థం కోసం ప్రకాశం బ్యారేజీ గేట్లను పెంచారని వంగవీటి రాధ శనివారమిక్కడ ప్రశ్నించారు. రైతుల కోసం గేట్లను పెంచమన్నప్పుడు కుదరదన్న అధికారులు ఇప్పుడు... లగడపాటి రాజగోపాల్ ల్యాంకో అవసరాల కోసం ఎలా పెంచారని మండిపడ్డారు. ఎంపీగా లగడపాటి రెండుసార్లు గెలిచినా బెజవాడ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకు వెళతామని రాధా తెలిపారు.

YSR Life Story take film

Serious illness to YSRCP Leaders at 'currrent satyagraham'

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు

అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వైద్యులు శనివారం వైద్య పరీక్షలు చేశారు. అంతకు ముందు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పరీక్షలు చేయించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరాకరించారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ వారికి పార్టీనేత కొణతాల రామకృష్ణ నచ్చచెప్పారు.

YS Vijayamma challenges to CM Kiran Kumar Reddy

మన రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే నేతలలో ఒక్క జగన్ పేరే ఉండడం..

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలక భూమిక ఫోషిస్తున్నారు.తాజాగా ఆయన జాతీయ రాజకీయాలలో కూడా కీలకమైన వ్యక్తి అవుతారని ఇండియా టుడ్ కదనం ఆసక్తికరంగా ఉంది. మన రాష్ట్రం నుంచి అలా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేతలలో ఒక్క జగన్ పేరే ఉండడం విశేషంగా కధనాలు వచ్చాయి. ఇండియా టుడే కధనం. మిగిలిన నేతలలో మూలాయం సింగ్ యాదవ్, మాయావతి, కరుణానిధి, జయలలిత, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ , శరద్ పవార్, మమత బెనర్జీలు ఉండగా రాష్ట్రం నుంచి జగన్ పేరు ఉండడం ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు పేరు లేకపోవడం ఆ పార్టీ అభిమానులకు కొంత నిరుత్సాహం కలిగిస్తుంది.

source:kommineni

లోకేష్ కి ఇంగ్లీష్ రాదా ?

greatandhra.com

YS Jagan will be key role in central politics

బీజేడీ కోసం పోలవరానికి చెక్

- కాంగ్రెస్‌పై మండిపడ్డ కొణతాల
- కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు
- ఒడిశా పార్టీ మద్దతు కోసమే ఇదంతా... 

 కేంద్రంలో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పణంగాపెట్టి ఒడిశాకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నిప్పులు చెరిగింది. అక్కడి బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ మద్దతు కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపిందని ధ్వజమెత్తింది. పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.

‘ఈరోజు ప్రకటన చూస్తే.. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్రంలో మనుగడ సాగిస్తున్న యూపీఏ ప్రభుత్వం ఒడిశా అభ్యంతరం చెప్పిందని ప్రాజెక్టును ఆపడం దురదృష్టకరం. ఆ మాటకొస్తే ఒడిశా గత 40 -50 ఏళ్లుగా అభ్యంతరం చెబుతూనే ఉంది. మహారాష్ట్రతో పాటు ఒడిశా కూడా ఆమోదం తెలిపి ఒప్పందంపై సంతకాలు చేశాకే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014లోనూ కేంద్రంలో పగ్గాలు చేపట్టేందుకు వీలుగా ఒడిశాలోని బీజేడీ అనుగ్రహం కోసం రాష్ట్ర ప్రజలను బలిచేస్తోంది’ అని ధ్వజమెత్తారు. 

రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతున్నా సీఎం కిరణ్ కళ్లు మూసుకొని నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయించుకుంటున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ కార్యక్రమాలు ఎలాగూ చేయట్లేదు, జల వనరుల ప్రాజెక్టులకు కేంద్రం అడ్డుపడుతున్నా సీఎం మాట్లాడకుండా ఉండడం సిగ్గుచేటన్నారు. సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగితే, రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాకే కోట్ల రూపాయలను ప్రాజెక్టుకు కేటాయించి కాల్వల నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. బ్యారేజీ నిర్మాణానికి చట్టపరమైన ఇబ్బందులు వచ్చినా అన్నీ అధిగమించి ఆయన టెండర్లను పిలిచారన్నారు. వైఎస్ బతికి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. వైఎస్ ఆనాడు టెండర్లు పిలిస్తే, అప్పటి సీఎం రోశయ్యకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆ టెండర్లు ఆరు నెలలు పాటు ఖరారుకాక కాలదోషం పట్టాయన్నారు. రెండవ కృష్ణుడుగా వచ్చిన కిరణ్ కుమార్‌రెడ్డి మళ్లీ టెండర్లను పిలిచి ఏడాది కాలయాపన చేసి వాటిని రద్దు చేశారన్నారు. 

ఇప్పుడు మూడోసారి టెండర్లు పిలిచి, ఖరారు చేసినప్పటికీ అర్ధరాత్రి రైతుల పేరుతో శంకుస్థాపన అంటూ కొంత ఆర్భాటం చేసి మొసలి కన్నీరు కార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఎలా కాలగర్భంలో కలిపారో.. కిరణ్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారన్నారు. దుష్టశక్తులు ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అన్నట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. తక్షణమే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, లేదంటే వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.

ఎన్నికల గుర్తును సైకిల్ కాకుండా వెన్నుపోటుకు సంకేతంగా కత్తి గుర్తును పెట్టుకుంటే మంచిదని..

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు తెలుగుదేశం పట్ల, చంద్రబాబుపైన విశ్వాసం కోల్పోయే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. అందుకే షర్మిల పాదయాత్రలోనూ పాల్గొంటున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెక్సీల్లో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టడంపై టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడాన్ని రమేష్ ఖండించారు. శుక్రవారం పులువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విజయమ్మ దీక్ష వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ను పదవినుంచి దించేసి,ఆయన మానసిక క్షోభతో చనిపోవడానికి కారణం చంద్రబాబేనని ఆయన అభిమానులు తెలుసుకున్నారు కాబట్టే వాళ్లు ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకొని, ఆయనతో ప్రచారం చేయించుకొని ఇప్పుడు అతడిని వదిలివేయడం మీకు తెలియదా అని రేవంత్‌ను ప్రశ్నించారు. జూ.ఎన్టీఆర్ విజయవాడ వస్తే టీడీపీ నాయకులే కాదు కార్యకర్తలు కూడా అక్కడకి వెళ్లవద్దని స్వయంగా చంద్రబాబు ఫోను చేశాడా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తమపార్టీ ఎన్నికల గుర్తును సైకిల్ కాకుండా వెన్నుపోటుకు సంకేతంగా కత్తి గుర్తును పెట్టుకుంటే మంచిదని ఆ పార్టీ నేతలకు సూచించారు. 

ఆరోపణలు నిరూపిస్తావా?

టీడీపీ అధినేత చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు. అవాస్తమైన ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా నాలుగు రోజులుగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతోపాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ద్వారంపూడి శుక్రవారం శిబిరం వద్ద విలేకరులతో మాట్లాడారు. తన ఆస్తుల చిట్టా, డాక్యుమెంట్లు అన్నీ ఇస్తానని, బాబు రూ.వెయ్యి కోట్లు అంటూ తన గురించి చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఇది తన బహిరంగ సవాలని పేర్కొన్నారు. ‘వస్తున్నా.. మీకోసం’ పేరుతో యాత్ర చేసి చంద్రబాబు పిచ్చెక్కి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో ప్రజలు బాధపడుతుంటే దాన్ని పట్టించుకోకుండా, అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిపోయి పాదయాత్ర చేయటమేంటి? అని ప్రశ్నించారు. పాదయాత్రకు బాబు పూర్తిగా అనర్హుడన్నారు.

న్యాయదేవతా! ఇంకెన్నాళ్ళు?


ఇరవై ఆరు జీవోలను తప్పుపడితే ఎలా? అని సమర్థించుకుంటూ మన మంత్రులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. వారి ఆగ్రహానికి అర్థముందనుకుంటే, నాటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిగారిని అవినీతిపరుడని, స్వార్థపరుడని, ఈ రాష్ట్రాన్ని ఆథోగతిపాల్చేశాడని ప్రతిపక్షాలు, పత్రికలు, సమాచార చానె ళ్లు అదేపనిగా ప్రచారం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు మిన్నకుండిపోయారు?! పదవులు లేకుంటే బతకలేము అన్నట్లు వాటిని పదిల పరచుకునే నీచ, నికృష్టమైన ప్రయత్నాలలో భాగంగా ఎవరికిష్టమొచ్చినటు ్లవారు సమయానుకూలంగా మాట్లాడడం అవమానకరం. సుప్రీం కోర్టు నోటీసులు అందేవరకు వీరికి అవేమీ పట్టలేదు సరిగదా. అందలంపై ఆశీనులై ఆనందాన్ని అనుభవించారు. నేటికీ అనుభవిస్తున్నారు. వై.యస్ జీవించినప్పుడు ఆయన వీరుడు, శూరుడు, అపరభగీరథుడు, కాటన్‌దొర, బడుగు బలహీన వర్గాలకు, తాడిత పీడిత ప్రజలకు ఆరాధ్యుడని పొగుడుతూ, పదవులు పొందిన ప్రతిసారి పాదాభివందనాలు చేస్తూ ప్రస్తుతించినవారు ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. అయ్యో! ఇదెక్కడి న్యాయం?

ఉచిత విద్యుత్తు, మహిళల అభ్యున్నతికై వడ్డీలేని ఋణాలు, ముస్లింలకు నాల్గుశాతం రిజర్వేషన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు, ఇందిరా గృహనిర్మాణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి మహోన్నత పథకాలు... ఇవన్నీ అన్యాయంగా అమలులోనికి వచ్చినవేనా? పరిశ్రమలు విస్తరిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారికి చట్టపరిధిలో భూములను కేటాయించి పారిశ్రామికోద్యమానికి కంకణం కట్టుకోవడం మహానేరమా? ఎక్కడో కుదేలుపడి, అధికార పగ్గాలు కోల్పోయిన కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు అందించాలని అహర్నిశలు శ్రమించి, మైళ్లకుమైళ్లు పాదయాత్ర చేసి ఒంటిచేత్తో అధికారాన్ని సంపాదించి పెట్టడమే ఆయన చేసిన ఘోర తప్పిదమా?

వంశ పారంపర్య దిశలోనే అఖండ భారతావనిలో అధికార పీఠాన్ని అలంకరించిన కాంగ్రెస్ సంస్కృతిని తప్పు పట్టలేమనుకుంటే... వైయస్ మరణించగానే ఆయన కుమారుడు పదవీకాంక్షతో ముఖ్యమంత్రి పీఠంపై కన్ను వేశాడని వై.యస్ జగన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు మరి? ఓదార్పుయాత్రలో ప్రజలు ఆయనను ఆదరించిన తీరును చూసి ఓర్వలేక ఆధార రహిత ఆరోపణలతో నేరస్తుడిగా చిత్రీకరించి జైలుపాలు చేశారు. ఆయన కుటుంబంపై విషం జల్లుతూ అడగడుగునా, రోజుకో వింత ఆరోపణలతో వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. పదినెలలకు పైగా జైల్లో నిర్బంధించి, జైలు కాలాన్ని యింకా పొడిగించే దురాలోచనలతో కొత్తకొత్త ఆరోపణలను అన్వేషిస్తున్నారు.

‘‘కాంగ్రెస్‌లో ఉంటే ఆయన నిర్దోషి. బయటకు వచ్చాడు కాబట్టి క్రిమినల్’’ - ఇదీ వారి నిర్వచనం. జగన్‌మోహన్‌రెడ్డి తనకై తాను బయటకు వెళ్లిపోలేదు. అంతా కలిసి వెళ్లగొట్టారు. ఆయన కుటుంబాన్ని అవమానించారు. కన్నీరు పెట్టించారు. జైల్లోపెడితే పతనమౌతాడు అనుకుంటే అది వారి అంధత్వం. వారి ఆలోచనకు భిన్నంగా జనమంతా జగన్‌తోనే ఉన్నట్లు మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలలో వెల్లడయింది. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వై.ఎస్. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుందే కానీ తరగదు. కాంగ్రెసు, ప్రతిపక్షాలు చేతులు కలిపినందువల్లనే ఎన్నికల్లో ధరావతును కూడా కోల్పోయాయి. ప్రజలు అమాయకులుకారు. సునిశితంగా గమనిస్తున్నారు. అంతకుమిన్నగా పై వాడు గమనిస్తున్నాడు.

ఆయనే అసలైన న్యాయాధిపతి. ఢిల్లీ పెద్దల కనుసైగలతో నడుస్తున్న సి.బి.ఐ. ‘జగన్‌ను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు’ అంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరం. రాష్ట్రజనాభాలో అత్యధిక సంఖ్యాకులు జగన్‌వైపే వున్నారు. జగన్‌ద్వారానే సమర్ధవంతమైన పాలన, జగన్‌తోనే దళిత బడుగు బలహీన, మైనారిటీ వర్గాలకు సముచిత న్యాయం సాధ్యమని ప్రజల విశ్వాసం. వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోగల ఏకైక యువనాయకుడు జగన్.

- తలమాల రాయప్ప, దళిత బహుజన సామాజిక కార్యకర్త
వెస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్

14 వరకూ కొనసాగనున్న ప్రజా బ్యాలెట్

కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కును ఎండగట్టాలి: విజయమ్మ
అవిశ్వాసానికి బాబు మద్దతిచ్చి ఉంటే చార్జీలు పెరిగేవి కాదు
కోతల సీఎంకు ప్రజల వాతలు తప్పవు: నోముల
14 వరకూ కొనసాగనున్న ప్రజా బ్యాలెట్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రజలకు భారంగా మారిన విద్యుత్ సమస్యపై అందరూ స్పందించాలని, ‘ప్రజా బ్యాలెట్’ ద్వారా ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యల్ని తెలియజెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. కరెంటు చార్జీల మోత, విద్యుత్ కోతలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రజా బ్యాలెట్’ను విజయమ్మ, సీపీఎం నేత నోముల నర్సింహయ్య సంయుక్తంగా ప్రారంభించారు. కరెంటు సత్యాగ్రహం నాలుగో రోజు అయిన శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని దీక్షా ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల పోరాటంతో ప్రభుత్వం చార్జీలను ఉపసంహరించినప్పటికీ ఆ నిర్ణయం బిక్షం వేసినట్లుగా ఉందన్నారు. ‘ప్రభుత్వం చార్జీలు పెంచడం వల్ల రైతులు మోటార్లు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో లైట్లు వేసుకునేందుకు సైతం సామాన్యులు జంకుతున్నారు. విద్యుత్ చార్జీల మోతతో వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా టీడీపీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అవిశ్వాసం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేసి ఉంటే చార్జీల పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చేది కాదు. అన్ని వర్గాలకూ ఇబ్బందులు తప్పేవి. సర్కారుతో కుమ్మక్కు అయిన టీడీపీ వైఖరికి నిరసనగా ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నాం. ఈ ప్రజా బ్యాలెట్ 14 వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికీ భారంగా మారిన విద్యుత్ సమస్యపై అందరూ స్పందించాలని కోరుతున్నాం. ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల్ని తెలియజెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా 9న బంద్‌ను ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుతున్నాం. బంద్ రోజు నాటికి వైఎస్ పాదయాత్ర ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతుంది. ఆ సందర్భంగా పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పాదయాత్రగా వెళ్లాలని కోరుతున్నా’ అని తెలిపారు. దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం నోముల నర్సింహయ్య మాట్లాడుతూ.. సామాన్యుడికి, రిలయన్స్ అధినేతల వంటి వారికి ఒకేవిధమైన చార్జీలుంటాయా? అని ప్రశ్నించారు. ‘గతంలో విద్యుత్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న కిరణ్ ఇప్పుడు చార్జీల పెంపు వంటి అప్రజాస్వామిక చర్యలకు ఎలా పాల్పడుతున్నారు? కోతల సీఎంకు ప్రజలు వాతలు పెడతారు’ అని హెచ్చరించారు.

దీక్షా శిబిరంలో జగ్జీవన్‌రామ్ జయంతి

భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని కరెంటు సత్యాగ్రహం దీక్షా శిబిరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధికి జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారని, సమసమాజ స్థాపన దిశగా ఆయన రూపొందించిన విధానాలు అందరికీ ఆమోదయోగ్యమని అన్నారు. జగ్జీవన్‌రామ్ మార్గంలో ప్రయాణించిన వైఎస్ దళితుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు ఎం.సుచరిత, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులు, మద్దాల రాజేశ్ మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికోసం జగ్జీవన్‌రామ్ ఆశయసాధనలో వైఎస్ ముందుకుసాగారని కొనియాడారు. బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప రాజనీతిపాలకుడని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు కొనియాడారు. దళితుల హ క్కులను కాపాడటంలో జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారని తెలిపారు. దళితుల అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్ రెక్కల కష్టంతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని అనేక రకాలుగా వేధిస్తున్న తీరును చూసి రాష్ట్రంలోని దళితులు ఆవేదన చెందుతున్నారని పార్టీ నేత నల్లా సూర్యప్రకాశ్‌రావు పేర్కొన్నారు.

విద్యుత్ చార్జీలపై ప్రజాగ్రహం
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్‌లో వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో పెంచిన విద్యుత్ చార్జీలపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరవధిక నిరాహార దీక్షా శిబిరం వద్ద నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో ఈ విషయం వెల్లడైంది. కరెంటు సత్యాగ్రహం దీక్షా శిబిరం వద్ద పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పెట్టెలో ఓట్లు వేసిన 4,755 మంది ప్రజలు విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకి ంచారు. శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. చార్జీల పెంపును ఒక్కరు కూడా సమర్థించ లేదంటే ప్రజలెంత ఆగ్రహంతో ఉన్నారో తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా బ్యాలెట్ నడుస్తోందని, తమకు ఇప్పటికి అందిన సమాచారం ప్రకార ం యావత్ రాష్ట్ర ప్రజలు విద్యుత్ చార్జీల పెంపును మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారని కృష్ణదాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కరెంటు చార్జీలను తగ్గించేంత వరకూ వైఎస్ విజయమ్మ నేతృత్వంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరాహారదీక్షను కొనసాగిస్తారని కృష్ణదాస్ చెప్పారు.

విజయమ్మ సత్యాగ్రహ దీక్షకు పలువురు నేతల సంఘీభావం

‘దీక్షల వల్ల లాభమేంటని కొంతమంది మాట్లాడుతున్నారు. దీక్షల కారణంగానే రూ. 12,700 కోట్ల విద్యుత్ చార్జీల భారం రూ. 6,500 కోట్లకు పరిమితమైంది. దీక్షల వల్లే 200 యూనిట్లలోపు వారికి పెంపు నుంచి మినహాయింపు లభించింది. దీక్షలే లేకపోతే 2 యూనిట్లు వాడుకునే వారికీ చార్జీలు పెరిగేవి’
-నాగేశ్వర్, ఎమ్మెల్సీ

 ప్రజలపై పెనుభారం మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కరెంట్ సత్యాగ్రహ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. నిరాహార దీక్షలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను శుక్రవారం పలువురు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్, సినీనటుడు నరేష్ దీక్షా శిబిరం వద్దకు వచ్చి తమ మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు కంచర్ల ధర్మారెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపారు.

పోరాడితే ప్రజావ్యతిరేకులా?: నాగేశ్వర్
విద్యుత్ చార్జీల పెంపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ‘ఒక మనిషి చెయ్యి నరికి, తర్వాత కృత్రిమ చెయ్యి అతుకు పెట్టి.. మేం చేయూత నిస్తున్నాం’ అని చెప్పుకుంటున్నట్టు ఉందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఎద్దేవా చేశారు. విజయమ్మ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. గతంలో టీడీపీ చార్జీలు పెంచితే వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలను పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నాయని విమర్శించడాన్ని తప్పుపట్టారు. రిలయన్స్ లాంటి పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతోంది కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కాదా అని నాగేశ్వర్ ప్రశ్నించారు. రూ. 6 వేల కోట్ల చార్జీలను పెంచితే అది ప్రజల ప్రభుత్వం.. చార్జీల భారం తగ్గించమని పోరాడుతున్న వారు ప్రజావ్యతిరేకులా అని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ప్రభుత్వం దీక్షలను భగ్నం చేయవచ్చునేమోగానీ, ప్రజల గుండెల్లో రగులుతున్న అగ్నిని మాత్రం భగ్నం చేయలేదన్నారు.

సర్వం త్యాగం చేసిన వైఎస్ కుటుంబం: నరేష్
ప్రజాసమస్యలపై ఎవరెన్ని పోరాటాలు చేసినా వైఎస్సార్ కుటుంబానికి ఉన్న పోరాట పటిమ ఈ దేశంలో వేరెవ్వరికీ లేదని సినీ నటుడు నరేష్ అన్నారు. విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం సర్వం త్యాగం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించి, రాష్ట్ర ప్రజలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సీబీఐ బ్లాక్‌మెయిల్ సంస్థ

కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తే సీబీఐని ఉసిగొల్పు తుందని ములాయం లాంటి నేతలే చెప్తున్నారు
జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటే సీఎం అయ్యేవారని ఆజాదే చెప్పారు
ఏ ఆధారాలూ లేకున్నా జగనన్నను 10 నెలలుగా జైల్లో బంధించారు
చిరంజీవి బంధువుల ఇంట్లో డబ్బు దొరికినా.. బొత్సపై ఆరోపణలొచ్చినా సీబీఐకి కనిపించదు
‘ఈనాడు’ రూ. 100 విలువ చేసే ఒక్కో షేరును రూ. 5 లక్షలకు అమ్మినా సీబీఐకి కనిపించదు
సీఎం 32 వేల కోట్ల విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల రక్తం పిండైనా వసూలు చేయాలని చూస్తున్నారు
ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు రక్షణగా నిలబడి కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 112, కిలోమీటర్లు: 1,531.6

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ మనుగడ కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తనను వ్యతిరేకించేవారిపై సీబీఐని ప్రయోగించి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘ఒకప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఉన్న సీబీఐ సంస్థ ఇప్పుడు అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందించి, ఊపిరి పోసే బ్లాక్‌మెయిల్ సంస్థగా మారిపోయింది’’ అని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ,దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికీ నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో సాగింది. కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

వెయ్యి పడగలతో కాటేస్తుంది..

‘‘‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వెయ్యి పడగలతో కాటేస్తుంది. సీబీఐని ఉసిగొల్పుతుంది.. కేసులు పెడుతుంది.. జైలుకైనా పంపుతుంది. ఈ కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం అంత సులువు కాదు’ అని ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఎంతో ఆవేదనతో మాట్లాడారు. గత్యంతరం లేకనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డామని ఆయన పరోక్షంగా చెప్పారు. ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొనసాగుతోందీ అంటే అది ములాయం సింగ్ లాంటి నేతల వల్లే. మూడుసార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అలాంటి నేత నిన్న కాంగ్రెస్, సీబీఐల గురించి చేసిన వ్యాఖ్య ఇది. ఆయనే కాదు కేంద్రంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష పార్టీ కూడా ఈ రోజు సీబీఐని విమర్శిస్తూనే ఉంది. అంతెందుకు ‘జగన్‌మోహన్‌రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే ఇప్పటికే ఆయన ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారు’ అని ఆ పార్టీకి చెందిన కేంద్ర నాయకుడు గులాంనబీ ఆజాదే చెప్పారు.

చిరంజీవి, బొత్స కనిపించరా?

కేంద్ర మంత్రి చిరంజీవి సొంత వాళ్ల ఇంట్లో రూ.70 కోట్లు దొరికినా సీబీఐకి కనిపించదు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒక మాఫియా డాన్ అని, రాష్ట్రంలో 75 శాతం లిక్కర్ దుకాణాలు ఆయన బినామీలవేనని స్వయంగా ఆయన పార్టీ నేతలే చెప్తున్నా సీబీఐ ఆయన మీద విచారణ చేయదు. ప్రజా నాయకుడైన జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టి ఇప్పటికే 10 నెలలైంది. ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ‘ఈనాడు’ రూ. 100 విలువ చేసే ఒక్కో షేరును రూ. 5 లక్షలకు అమ్ముకుంటే సీబీఐకి తప్పు కనిపించదు. రూ. 10 విలువ చేసే ‘సాక్షి’ షేర్‌ను రూ.350కి అమ్ముకుంటే, సీబీఐ వాళ్లు దాన్ని క్విడ్ ప్రో కో అంటున్నారు. జగనన్నకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకుకావాలనే చార్జిషీటు వేయకుండా జాప్యం చేస్తున్నారు. ప్రాథమిక హక్కులను కూడా సీబీఐ కాలరాస్తోంది. అసలు ఇప్పుడు విచారణ జరగాల్సింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని ఎంత దుర్మార్గంగా వాడుకుంటుందీ అనే అంశం మీదనా? లేక జగన్‌మోహన్‌రెడ్డి మీదనా? ఇప్పుడు విచారణ జరగాల్సింది సీబీఐ కేంద్రం చేతిలో ఎలా కీలు బొమ్మ అయిందన్న అంశం మీదనా? లేక జగనన్న మీదనా?

మూడు నెలలకోసారి చార్జీల వాత..

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా రూ. 32 వేల కోట్ల విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల రక్తం పిండైనా వసూలు చేయాలని చూస్తున్నారు. ఈ పెంపు ఇంతటితో ఆగేది కాదు. మూడు నెలలకు ఒకసారి పెంచుతూనే పోతారట. పెంచిన విద్యుత్తు చార్జీలను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ దీక్షలు చేస్తున్నా కిరణ్‌కుమార్ రెడ్డికి కనిపించదు.. వినిపించదు.. అర్థం కాదు. ఇలాగే చంద్రబాబు నాయుడు.. కరెంటు చార్జీలు పెంచినప్పుడు వైఎస్సార్ ఏ ప్రదేశంలో కూర్చొని నిరాహార దీక్ష చేశారో.. అదే చోట ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో కలిసి నిరాహార దీక్ష చేయబట్టి ఇప్పటికి4 రోజులైంది. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డిలో ఏ చలనమూ లేదు. మనసు బండరాయి అయినప్పుడు ఎంత కదిలించి ఏం ప్రయోజనం? ఈ రోజు(శుక్రవారం) జగ్జీవన్‌రాం జయంతి.. ఈ రోజు మొదలుకొని అంబేద్కర్ జయంతి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తోంది. కరెంటు చార్జీలు పెంచినందుకు నిరసనగా ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ముందుకు వచ్చింది. ప్రజలంతా ప్రజా బ్యాలెట్‌లో పాల్గొని నిరసన తెలియజేయాలని మా ప్రార్థన.

వైఎస్ ఉంటే 9 గంటల విద్యుత్ వచ్చేది..

ఇవాళ వైఎస్సార్ బతికే ఉంటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు వచ్చేది. కానీ ఈ ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే.. ఉచిత విద్యుత్తును ఎత్తి వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే దు. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, తనను వైఎస్సార్ వారసునిగా ప్రజలు స్వాగతిస్తున్నారన్న అక్కసుతో అబద్ధపు కేసులు బనాయించి జైలులో పెట్టారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’


కిరణ్ లెక్కల గారడీ..

వైఎస్సార్ మాటంటే మాటే.. ఇచ్చిన మాట కోసం ప్రాణంపోయినా సరే మాట పోకూడదని నిలబడేవారు. వైఎస్సార్ రూ.2 కిలో చొప్పున ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ప్రతి నెలా 20 కిలోలు కాకుండా 30 కిలోలు ఇస్తానని వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్పష్టంగా వాగ్దానం చేశారు. వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులకు, ఆయన ఇచ్చిన హామీలు మాత్రం అక్కర లేదట. ఇవాళ కిరణ్‌కుమార్‌రెడ్డి లెక్కల గారడీ చేస్తున్నారు. వైఎస్సార్ రూ.2కు కిలో బియ్యం ఇస్తే.. నేను రూపాయికే ఇస్తున్నానని కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్ బతికే ఉంటే ఈ రోజు ప్రతి కుటుంబానికీ 30 కిలోల బియ్యం ఇచ్చేవారు. అంటే 10 కిలోల బియ్యం అదనంగా వచ్చేవి. 

అప్పుడు ప్రతి కుటుంబానికీ కనీసం రూ. 300 నుంచి రూ. 400 కలిసొచ్చేది. కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.2కే కిలో బియ్యాన్ని రూపాయి చేస్తే పేదలకు కలిసొస్తుంది కేవలం రూ. 20. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు 30 కిలోల బియ్యం పథకం అమలు చేయకుండా.. ఎన్నికల సంవత్సరం ‘సరుకుల పొట్లం’ అనే పథకం పెట్టి దానిమీద సీఎం తన ఫొటోనే వేసుకొని ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? కిరణ్‌కుమార్‌రెడ్డిగారూ.. పేదలను మోసం చేసిన ఏ పార్టీ వారికైనా ఏ గతి పడుతుందో చంద్రబాబును చూసి తెలుసుకోండి.


14.2 కిలోమీటర్ల మేర యాత్ర

పాదయాత్ర 112వ రోజు శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు శివారులో ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి కోరాడ, జెమిస్‌పేట మీదుగా నడుచుకుంటూ కైకలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి వెన్నకోట, సంఘర్షణపురంలలో యాత్ర చేశారు. ఇక్కడ బాబూ జగ్జీవన్‌రాం చిత్రపటానికి షర్మిల పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి పెనుమిల్లి మీదుగా ముదినేపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఇదే మండల కేంద్ర శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం 14.2 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, ఆర్కే, తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, కుక్కల నాగేశ్వర్‌రావు, ఎంవీఎస్ నాగిరెడ్డి, లక్ష్మీపార్వతి, చిత్తర్వు నాగేశ్వర్‌రావు, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు దూలం నాగేశ్వర్‌రావు తదితరులున్నారు.

అది ఎల్లో జర్నలిజమే

- మహిళల గురించి రాసేటప్పుడయినా వివరణ తీసుకోరా?
- ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగ్రహం
- మీ లెసైన్స్ రద్దు చేయాలని ఆర్‌ఎన్‌ఐని కోరతాం
- డబ్బునే గౌరవిస్తున్నారని చైర్మన్ కట్జూ వ్యాఖ్య
- క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు
- వివరణలు ప్రచురించని ‘ఈనాడు’కూ అక్షింతలు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివరణను ప్రచురించాలని ‘ఈనాడు’కు ఆదేశం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మండిపడింది. ఆ పత్రికలో వస్తున్న వార్తలు ప్రజలను, ముఖ్యంగా మహిళలను అప్రతిష్టపాలుచేసే విధంగా ఉన్నాయని, సర్క్యులేషన్ పెంచుకునేందుకు సంచలనాలు సృష్టించాలన్న ఆలోచనతో పదేపదే అపరాధిగా మారుతోందని కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలోని పత్రికలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అందిన ఫిర్యాదులపై కట్జూ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం జూబ్లీహాల్‌లో విచారణ జరిపింది. హోమ్‌సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కామేశ్వరి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా కట్జూ ఆంధ్రజ్యోతి వ్యవహారశైలిని ఆక్షేపించారు.

‘‘ఈ దేశంలో కొన్ని పత్రికలు సర్క్యులేషన్, సంచలనాల కోసం ప్రజలను, మహిళలను ఎలా అప్రతిష్టపాలు చేస్తున్నాయనేందుకు ఈ కేసు ఒక ఉదాహరణ. ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నాయి. ఆంధ్రజ్యోతిపై క్రిమినల్ కేసు నమోదుకు సంబంధిత కోర్టును ఆదేశిస్తున్నా. పోలీసులు కూడా విచారణ జరపాలి. పత్రిక లెసైన్స్‌ను రద్దు చేయాలని రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్‌ఎన్‌ఐ)కు సిఫారసు పంపుతాం... ’’ అని పేర్కొన్నారు. కమిటీ విచారణ జరిపిన 19 ఫిర్యాదుల్లో ఆరు ఆంధ్రజ్యోతి పత్రికపైనే రావడంతో కమిటీ సభ్యులు కూడా ‘‘అన్నీ ఆంధ్రజ్యోతిపైనేనా? ఆ పత్రిక జర్నలిజం నైతిక విలువలను ఉల్లంఘిస్తోంది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీవీవీ రామకృష్ణాచార్యులు, డాక్టర్ ఎ.గాయత్రీదేవిల ఫిర్యాదును పరి శీలించిన కట్జూ స్పందిస్తూ ‘‘ఏ ఆధారాలూ లేకుండా ప్రజలను అప్రతిష్టపాలు చేస్తారా?’’ అని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.

ప్రకటనలు ఇవ్వొద్దని డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)కి సిఫారసు చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన ఫిర్యాదుపై విచారిస్తూ.... షోకాజ్ నోటీసుకు వివరణ ఎందుకు ఇవ్వలేదని ఆంధ్రజ్యోతి న్యాయవాదిని కట్జూ ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ, తమ ఎడిటర్ విదేశాల్లో ఉన్నందున కౌంటర్ వేయలేకపోయామని చెప్పారు. ‘‘మాకు వివరణలు చెప్పొద్దు. మేం దానికి అనుమతించం. అయినా మేము 11 నెలల క్రితం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడానికి, మీ ఎడిటర్ వారం క్రితం విదేశాలకు వెళ్లడానికి సంబంధం ఏమిటి?’’ అని కమిటీ సభ్యులు నిలదీశారు.

వివరణ ప్రచురించాల్సిన బాధ్యత లేదా?
‘‘విచారణ సంస్థ చేస్తున్న దర్యాప్తు గురించి రాస్తూ... ఫలానా కేసులో ఫలానా వారిని ప్రశ్నిస్తారని ఒకసారి, ప్రశ్నించరని మరోసారి రాయడం ఎందుకు?’’ అని ఈనాడు పత్రిక యాజమాన్యాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. ఓఎంసీ కేసులో కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీబీఐ ప్రశ్నిస్తుందని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించిందని, తమ పార్టీ అధ్యక్షుడి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఆ కథనంపై వివరణ ప్రచురించాలని ఆ పత్రిక యాజమాన్యాన్ని కోరినా ప్రచురించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీఎన్‌వీ ప్రసాద్ చేసిన ఫిర్యాదును ప్రెస్ కౌన్సిల్ విచారించింది.

ఈ సందర్భంగా ఈనాడు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని రాశామని, ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అన్నారు. ఈ వాదనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాది శ్రీరాం విభేదించారు. ఆ కథనంలో పదేపదే కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి అని రాశారని, ఎంపీ అంటే రాజకీయాలకు సంబంధం ఎందుకు ఉండదని, అందునా ఆయన పార్టీ అధ్యక్షుడని కౌన్సిల్ కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడొకరు మాట్లాడుతూ... వివరణ ఇచ్చినప్పుడు ప్రచురించాల్సిన బాధ్యత లేదా? అని ఈనాడు న్యాయవాదిని ప్రశ్నించారు. ‘‘మీరు రాసిన వార్త జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసింది కదా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇంతకీ మీరు రాసిన వార్త నిజమేనని రుజువైందా?’’ అని మరో సభ్యుడు ప్రశ్నించగా, లేదని ఈనాడు న్యాయవాది ఒప్పుకున్నారు.

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో వివరణ పంపాలని, దాన్ని ‘ఈనాడు’ తప్పనిసరిగా ప్రచురించాలని కమిటీ ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వంపై దినభూమి ఎడిటర్ ఫిర్యాదును జస్టిస్ కట్జూ విచారిస్తూ ‘30 మంది పోలీసులు రాత్రిపూట గోడదూకి ఇంట్లోకి వెళ్లి ఫిర్యాదుదారుడిని అరెస్టు చేస్తారా? వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? చార్జిషీటు వేసి జైలుకెందుకు పంపలేదు? అలా పంపలేకపోతే రాజీనామా చేయండి’ అని తమిళనాడు ప్రభుత్వం వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు. అనంతరం కట్జూ మాట్లాడుతూ జర్నలిస్టులకు కనీస విద్యార్హతపై ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు శ్రవణ్‌గార్గ్ నేతృత్వంలోని కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనుందని, దీన్ని పూర్తిస్థాయి ప్రెస్‌కౌన్సిల్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలని అభిప్రాయపడ్డారు.

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 113వ రోజు శనివారం కోడూరులో ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. కలవపూడి సత్రం, పెదపాలపర్రు, చౌటుపల్లి, కొత్తమల్లాయిపాలెం వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం మల్లాయిపాలెం గేటు, నక్కల కాల్వ, బంటుమిల్లి రోడ్డు, ముబారక్ సెంటర్, ఓల్డ్ బైపాస్ రోడ్డు, గుడ్‌మాన్‌పేట, బస్టాండ్ వరకు పాదయాత్ర సాగిన తరువాత నెహ్రూచౌక్‌లో బహిరంగ సభ జరుగుతుందని, ఏలూరు రోడ్డు వద్ద షర్మిల రాత్రి బస చేస్తారని చెప్పారు.

పర్యటించే ప్రాంతాలు
కోడూరు, కలవపూడి సత్రం, పెదపాలపర్రు, చౌటుపల్లి, కొత్తమల్లాయిపాలెం, మల్లాయిపాలెం గేటు, నక్కల కాల్వ, బంటుమిల్లి రోడ్డు, ముబారక్ సెంటర్, ఓల్డ్ బైపాస్‌రోడ్డు, గుడ్‌మాన్‌పేట, బస్టాండ్, నెహ్రూచౌక్, ఏలూరురోడ్డు. 

అయిదోరోజుకు చేరిన వైఎస్ఆర్ సీపీ దీక్ష

కరెంట్‌ కోతలు- విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ దీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆరోగ్యం క్షీణిస్తోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో పాటు పలువురు నేతలకు వైద్యులు శనివారం పరీక్షలు నిర్వహించారు. వైఎస్‌ విజయమ్మ తలనొప్పితో బాధపడుతున్నారని, శోభానాగిరెడ్డి, సుజయ్‌ కృష్ణరంగారావులకు షుగర్‌ లెవెల్స్‌ పడిపోయాయని వైద్యులు తెలిపారు. 

మరోవైపు..రాత్రి 11 గంటల సమయంలో దీక్షా ప్రాంగణం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రశాంతంగా జరుగుతున్న దీక్షా శిబిరంలోకి పోలీసులు రావడంతో అక్కడ కొంచెం హడావిడి నెలకొంది. దీక్షను పోలీసులు భగ్నం చేయకుండా రాత్రంతా వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు దీక్షా శిబిరం వద్దనే ఉన్నారు.

ప్రజల కోసమే మా దీక్ష: వైఎస్ విజయమ్మ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాల కన్నీరు వరదలై పారుతోందన్న సీఎం వ్యాఖ్యలు అర్థరహితమని ఆమె శనివారమిక్కడ అన్నారు. ప్రజల కన్నీటి వరదలో ఇటువంటి ముఖ్యమంత్రులు కొట్టుకుపోతారని విజయమ్మ వ్యాఖ్యానించారు. 

కరెంట్ సమస్యపై రెఫరెండానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని విజయమ్మ సవాల్ విసిరారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించి ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే తాము దీక్ష చేస్తున్నామని, తమ దీక్షను సీఎం ఎగతాళి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. కరెంట్ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్దామని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుందని అన్నారు. 

ఇప్పుడంతా బావుందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని విజయమ్మ ప్రశ్నించారు. పల్లెలకు వెళితే కరెంట్ కష్టాలేంటో ముఖ్యమంత్రికి తెలుస్తాయని ఆమె అన్నారు. ప్రజా బ్యాలెట్ కు మంచి స్పందన లభిస్తోందని విజయమ్మ తెలిపారు. ఈనెల 9న జరిగే బంద్ ను విజయవంతం చేయాలని ఆమె ప్రజలను కోరారు. కాగా కరెంట్ ఛార్జీలు, విద్యుత్ కోతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష నేటికి అయిదోరోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా నీరసించిపోయారు.

YS Jagan will be key role in central politics of IndiaToday survey

YSRCP MLAs health condition very serious at power deeksha

Government behaviour on Power Deeksha

ఆందోళనలో MLA ల ఆరోగ్యం

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

షుగర్ లెవెల్ తగ్గిపోవడం తో ఆందోళనలో MLA  ల ఆరోగ్యం.MLA   వనిత ను 108 లో మెడిసిటి ఆసుపత్రి కి తరలించారు.దీక్ష విరమించెదిలెదన్న MLA  లు .ప్రభుత్వానికి వ్యతిరేకం గా  కార్యకర్తల నినాదాలు.విజయమ్మ సహా మిగతా MLA  లను ఆసుపత్రి కి తరలించేందుకు రంగం సిద్ధం.

వేదికపై కుప్పకూలిన ఎమ్మెల్యే తానేటి వనిత

పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే తానేటి వనిత వేదికపైనే సృహ తప్పిపడిపోయారు. కరెంటుపై సత్యాగ్రహం చేస్తూ . తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆమె సృహ తప్పినట్లు తెలుస్తోంది.

Sharmila fired on Oppositios and CBI

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు పూర్తి

 వైఎస్‌ విజయమ్మ తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారని ఉస్మానియా వైద్య బృందం తెలిపారు. దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శోభానాగిరెడ్డి, వనిత, సుజయ్‌ కృష్ణరంగారావు, నానిలకు షుగర్‌ లెవెల్స్‌ తగ్గాయని, గుర్నాథ్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, అమర్నాథ్‌రెడ్డి, జూపూడిలకు తగ్గిన బీపీ లెవెల్స్‌ పడిపోయాయని వైద్యులు తెలిపారు

కరెంట్ సత్యాగ్రహం దీక్ష వద్దకు పోలీసులు!

కరెంట్ సత్యాగ్రహం దీక్ష శిబిరం వద్దకు పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్ లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్ లో కరెంట్ సత్యగ్రహం దీక్షను వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన సంగతి తెలిసిందే. సైఫాబాద్ ఏసీపీ రామ్‌నర్సింహారెడ్డి నేతృత్వంలో పోలీసులు శిబిరం వద్దకు చేరుకున్నారు.

చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా: షర్మిల

 సీబీఐ విచారణతో నెలల తరబడి జగనన్నను వేధిస్తున్నారని షర్మిల ఆరోపించారు. కావాలనే జగన్‌కు బెయిల్ రాకుండా ఆలస్యం చేస్తోందని షర్మిల అన్నారు. ఇన్నాళ్ల విచారణలో సీబీఐ ఒక్క ఆధారాన్ని సంపాదించలేకపోయిందని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తే 1000 పడగలతో కాటేస్తుందని ములాయం ఒప్పుకున్న విషయాన్ని సభలో తెలిపారు. 

రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ తప్ప మూడో పార్టీ ఉండకూడదనే ఆరెండు పార్టీల లక్ష్యమన్నారు. అందుకే కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై జగన్‌పై అబద్ధపు కేసులు పెట్టించారన్నారు. చంద్రబాబు, చిరంజీవి, బొత్సలు నిర్దోషులని ఏ కోర్టు చెప్పలేదని షర్మిల అన్నారు. చంద్రబాబు అవినీతి సీబీఐకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని, చంద్రబాబు మద్దతు ఇస్తున్నారనే ధీమాతోనే కిరణ్‌ 30 వేలకోట్ల రూపాయల భారాన్ని మోపారని షర్మిల విమర్శించారు. ఓ పక్క రైతులు నీళ్లులేక, కరెంట్ లేక నానా అవస్థలు పడుతుంటే..లేని కరెంట్‌కు మూడింతలు బిల్లులు వేసి పేదలపై భారం మోపారన్నారు. ప్రజలంతా విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ చేపట్టిన ప్రజాబ్యాలెట్‌లో పాల్గొనాలని షర్మిల పిలుపునిచ్చారు. 

ప్రజా బ్యాలెట్ ఫలితాలు విడుదల

వైఎస్‌ఆర్‌ సీపీ దీక్షా శిబిరం వద్ద ప్రజా బ్యాలెట్‌ ఫలితాలను పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ ధర్మాన కృష్ణదాస్‌ విడుదల చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4,755 ఓట్లు పడ్డాయి. విద్యుత్ సమస్యలపై హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మ కరెంట్ సత్యగ్రహం దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. 

ముందుచూపులేని ప్రభుత్వం: నరేష్

ప్రభుత్వం ముందు చూపులేకుండా వ్యవహరించడంవల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తిందని ప్రముఖ సినీనటుడు నరేష్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కరెంట్ సత్యాగ్రహ దీక్షా శిబిరాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కోతలను ఎత్తేయాని కోరారు. వైఎస్‌ కుటంబ పోరాట పటిమ, ప్రజల కోసం వారు పడుతున్న శ్రమ ఎంతో గొప్పదన్నారు. రాష్ట్రం అంధకారంలో మగ్గుతోందని, కరెంట్‌ సంక్షోభాన్ని జాతీయవిపత్తుగా ప్రకటించాలని నరేష్‌ డిమాండ్‌ చేశారు.

YS Sharmila fire on Congress and TDP

Congress Rebel MLA Jogi Ramesh speech in YS Vijayamma Hunger strike

Chandrababu responsible for NTR's death: Nani

YS Sharmila slammed CM Kiran

Press Council of India chairman Markandey Katju unsatisfied Eenadu,Andhrajyothy

దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేల ఆరోగ్య వివరాలు

వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కరెంట్‌ సత్యాగ్రహం నాలుగో రోజు కొనసాగుతోంది. దీక్ష చేపట్టిన ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. వారి ఆరోగ్య వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. 

పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు.
ఆమె బిపి 130:80 - పల్స్ 72 - షుగర్ 82
ఎమ్మెల్యేలు
శోభానాగిరెడ్డి - బిపి 110:60 - పల్స్ 84 - షుగర్ 49
సుచరిత - బిపి130:80 - పల్స్76 - షుగర్94
గుర్నాథ రెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. బిపి 110: 70 - పల్స్74 - షుగర్ 105
కాపు రాంచంద్రారెడ్డి - బిపి110:80 - పల్స్76 - షుగర్ 98 - బాగా నీరసంగా ఉన్నారు.
కోట శ్రీకాంత్ రెడ్డి - బిపి 120:80 - పల్స్78 - షుగర్82
ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి - బిపి 150:100 - పల్స్86 - షుగర్96 నీరసంగా ఉన్నారు. 
కొడుమూరు శ్రీనివాసులు -బిపి 120:90 - పల్స్82 - షుగర్80
ప్రవీణ్ కుమార్ రెడ్డి - బిపి 120:90 - పల్స్76 - షుగర్ 84
పలమనేరు అమర్‌నాథ్ రెడ్డి - బిపి 110:70 - పల్స్78 - షుగర్89
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి -బిపి110:80 - పల్స్71 - షుగర్89
బాలినేని శ్రీనివాస్ రెడ్డి - బిపి 110:70 - పల్స్78 - షుగర్70. నీరసంగా ఉన్నారు.
గొట్టిపాటి రవికుమార్ -బిపి 100:60 - పల్స్88 - షుగర్96
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -బిపి 130:70 - పల్స్74- షుగర్78
పేర్నినాని - బిపి 130:70 - పల్స్70 - షుగర్62
జోగి రమమేష్ - బిపి 120:80 - పల్స్76 - షుగర్96
చింతలపూడి రాజేశ్ - బిపి 120:80 - పల్స్76 - షుగర్82
బాలరాజు -బిపి 110:70 - పల్స్80 - షుగర్74
అప్పారావు - బిపి 140:70 - పల్స్86 షుగర్140
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి -బిపి 155:110 - పల్స్80 - షుగర్70
మేకా శేషుబాబు - బిపి110:70 - పల్స్74 - షుగర్82
గొల్ల బాబురావు - బిపి130:80 - పల్స్84 - షుగర్96
సుజయకృష్ణ రంగారెడ్డి - 100:60 - పల్స్72 -షుగర్74
ఈ బీపీ డౌన్ కావడంతో బాగా నీరసంగా ఉన్నారు.
కృష్ణదాస్ - బిపి 120:80 - పల్స్84 - షుగర్76
కూన శ్రీశైలం -బిపి 120:80 - పల్స్84 - షుగర్76
తానేటి వనిత -బిపి 110:70 - పల్స్72 - షుగర్ 64 ఈమె తీవ్రమైన కడుపునొప్పి
సాయిరాజ్ -బిపి 120:80 - పల్స్77 - షుగర్84
ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి - బిపి 130:90 - పల్స్70 - షుగర్ 98
ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు - బిపి 110:60 - పల్స్80 షుగర్77

విజయమ్మకు ఎమ్మెల్సీ నాగేశ్వర్ సంఘీభావం

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌ సీపీ కరెంట్ సత్యాగ్రహ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ నాగేశ్వర్ సందర్శించారు. వైఎస్ విజయమ్మను కలిసి సంఘీభావం తెలిపారు.

ఇదిలా ఉండగా, విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆమరణదీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలకు ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు


వైఎస్ఆర్ సీపీ ప్రజా బ్యాలెట్ ప్రారంభం

పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, కరెంట్ కోతలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైఎస్‌ఆర్ సీపీ ప్రజా క్షేత్రంలోకి వెళుతోంది. ఇందుకోసం ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా బ్యాలెట్‌ను ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ప్రారంభించారు. 

కొన్ని ప్రశ్నలతో కూడిన బ్యాలెట్‌తో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. బాబు జగ్జీవన్‌రాం జయంతి రోజున ప్రారంభమైన ఈ ప్రజా బ్యాలెట్‌ అంబేద్కర్ జయంతి రోజైన ఈనెల 14 వరకూ కొనసాగనుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ప్రజా బ్యాలెట్ ఉపయోగించేలా ప్రజల వద్దకు వెళ్లాలని విజయమ్మ సూచించారు

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై కట్జూ అసంతృప్తి

ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల తీరుపట్ల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రతిస్టకు భంగం కలిగేలా వార్తలు ఎందుకు ప్రచురించారని ఆయన శుక్రవారమిక్కడ ప్రశ్నించారు. ఖండన ఇచ్చినా ఎందుకు ప్రచురించలేదని అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ కమిటీ ఈరోజు హైదరాబాద్‌లో పలు కేసులను విచారించింది. 

ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతిపై ఆరు పిటిషన్లను మార్కండేయ కట్జూ పరిశీలించారు. వార్తలు రాసేటప్పుడు వివరణలు కూడా తీసుకోరా అని సూటిగా ప్రశ్నలు వేశారు. తనపై వార్త రాసి వివరణ కూడా తీసుకోలేదంటూ ఓ మహిళ కట్జూను ఆశ్రయించింది. దీనిపై స్పందిస్తూ ఆయన ఆంధ్రజ్యోతి ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందన్నారు. సర్కులేషన్, టీఆర్పీ రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా అని వ్యాఖ్యానించారు. మీ లైసెన్స్లను ఎందుకు రద్దు చేయకూడదంటూ ఆయన ప్రశ్నించారు

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై కట్జూ అసంతృప్తి

ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల తీరుపట్ల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రతిస్టకు భంగం కలిగేలా వార్తలు ఎందుకు ప్రచురించారని ఆయన శుక్రవారమిక్కడ ప్రశ్నించారు. ఖండన ఇచ్చినా ఎందుకు ప్రచురించలేదని అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ కమిటీ ఈరోజు హైదరాబాద్‌లో పలు కేసులను విచారించింది. 

ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతిపై ఆరు పిటిషన్లను మార్కండేయ కట్జూ పరిశీలించారు. వార్తలు రాసేటప్పుడు వివరణలు కూడా తీసుకోరా అని సూటిగా ప్రశ్నలు వేశారు. తనపై వార్త రాసి వివరణ కూడా తీసుకోలేదంటూ ఓ మహిళ కట్జూను ఆశ్రయించింది. దీనిపై స్పందిస్తూ ఆయన ఆంధ్రజ్యోతి ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందన్నారు. సర్కులేషన్, టీఆర్పీ రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా అని వ్యాఖ్యానించారు. మీ లైసెన్స్లను ఎందుకు రద్దు చేయకూడదంటూ ఆయన ప్రశ్నించారు

CPM Leader Narsimhaiah comments at ysrcp deeksha

Krishnamma Odilo 5th Apr 2013

YSRCP deeksha continues for 4th day part 2

దళితుల అభివృద్ధికి జగ్జీవన్ కృషి :విజయమ్మ

బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షా శిబిరంలోనే జరుపుకుంది. శుక్రవారం ఉదయం ఆయన చిత్రపటానికి పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా విజయమ్మ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దళితుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. 

అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ చేసిన సేవలను కొనియాడారు. బాబూ జగ్జీవన్ రాం అందరికీ చిరస్మరణీయులని, ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా దళితుల సంక్షేమానికి పాటుపడ్డారని ఆమె అన్నారు.

YSRCP deeksha continues for 4th day updates

త్వరలోనే మంచి రోజులు వస్తాయి...


జగన్ అక్రమాస్తులు సంపాదించారని అరెస్ట్ చేసి కొన్ని నెలలవుతోంది. కనీసం బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ఆయన జైల్ నుండి బయటికొస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్నది సీబీఐ చేస్తున్న ప్రధాన అభియోగం. కాని నాకు తెలిసి ఆయన నిజంగా తప్పులు చేసి ఉంటే, ఆయన మీద కేసులు పెడుతున్నారని తెలిసినప్పుడే ఆయన తన ప్రభావంతో ఆ కేసు నుండి తప్పించుకుని అరెస్ట్ అవ్వకుండా పరిస్థితులన్నింటినీ ఎప్పుడో చక్కదిద్దుకునేవారు. కానీ అలాంటి వ్యక్తి కాదు కాబట్టి, న్యాయస్థానాలకు గౌరవమిచ్చి అరెస్టయ్యారు. ఇప్పటివరకూ ఆయన ఏ ఆర్థిక నేరం చేసినట్టు రుజువు చేయలేకపోయారు. అవన్నీ సీబీఐ వారి నిందలు మాత్రమే.

జగన్ అరెస్టు కేవలం కాంగ్రెస్‌వారి కక్ష సాధింపు చర్య మాత్రమే. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మన న్యాయవ్యవస్థ ఎంతో గొప్పది. జగన్ బెయిల్ మీద త్వరలోనే బయటికొస్తారని అందరం ఎదురుచూస్తున్నాం. అటు ఆయన కుటుంబానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు త్వరలోనే మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నాం.
- బి.రామలక్ష్మి, పాల్వంచ, ఖమ్మం జిల్లా

పెంచింది 6,344 కోట్లు..తగ్గించింది 830 కోట్లే

తాటాకు తీసుకుని... ఈతాకు ఇచ్చినట్టుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. విద్యుత్ చార్జీల పెంపుతో (2013-14 ఆర్థిక సంవత్సరానికి) ప్రజలపై ఏకంగా రూ.6,344 కోట్ల భారం మోపిన ప్రభుత్వం కేవలం రూ.830 కోట్ల సబ్సిడీతోనే సరిపుచ్చింది. అంటే పెంచిన చార్జీల్లో కేవలం 13.08 శాతం మాత్రమే తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే ఇంకా 86.92% భారం ప్రజలపైనే ఉందన్నమాట. వాస్తవం ఇలావుంటే ప్రజలపై ఒక్క పైసా భారం పడనివ్వబోమని సీఎం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రజలను, పరిశ్రమలను దెబ్బకొడుతున్న సర్దుబాటు చార్జీలు, ఎడాపెడా విధిస్తున్న కోతల గురించి ప్రభుత్వం ప్రస్తావించకపోవడం గమనార్హం. చితికిపోయిన చిన్నపరిశ్రమలపైనా ప్రభుత్వం కనికరం చూపలేదు. చిన్న చిన్న బడ్డీకొట్లకు ప్రభుత్వ ప్రకటన సాంత్వన చేకూర్చలేదు. పెపైచ్చు మొత్తం 2 కోట్ల 55 లక్షల మంది వినియోగదారుల్లో 2 కోట్ల 16 లక్షల మందికి చార్జీలు పెంచలేదని... ఇంకా ఎవరైనా మాట్లాడితే పెట్టుబడిదారుల తరఫున మాట్లాడినట్టేనని సీఎం వ్యాఖ్యానించడాన్ని కూడా విద్యుత్‌రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. 

నెలకు 200 యూనిట్లు దాటి వినియోగించే గృహ వినియోగదారులందరూ పెట్టుబడిదారులేనా అని వారు నిలదీస్తున్నారు. వాస్తవానికి ఈఆర్‌సీ రూ.3,037.5 కోట్ల భారం మాత్రమే మోపాలని భావిస్తే.. ఈఆర్‌సీపై ఒత్తిడి తెచ్చి మరీ ప్రభుత్వం ఆ భారాన్ని ఏకంగా రూ.6,344.76 కోట్లకు పెంచింది. అంటే అదనంగా రూ.3 వేల కోట్లకుపైగా భారాన్ని పెంచిన ప్రభుత్వం.. ఇంతాచేసి ఇప్పుడు రూ.830 కోట్లు మాత్రమే తగ్గించిందని విశ్లేషిస్తున్నారు. ఇలావుండగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, కుటీర పరిశ్రమలు, పంచాయతీలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితరాలపై మోపిన సుమారు రూ.5,514 కోట్ల భారం కూడా వస్తువుల రేట్ల పెరుగుదల రూపంలో చివరకు ప్రజలపైనే పడుతుంది. గృహ వినియోగదారులపై పడిన రూ.2 వేల కోట్ల భారంలో రూ.830 కోట్లను మినహాయించినా రూ.1,170 కోట్ల భారం మిగిలే ఉంది.

భారం పెంచిన సర్కారు: విద్యుత్ చార్జీలను ఈఆర్‌సీనే నిర్ణయిస్తుందని సీఎం పదే పదే ప్రకటించారు. వాస్తవానికి ప్రభుత్వ వ్యవహారశైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. 2013-14లో ఏకంగా రూ.12,723 కోట్ల మేరకు చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. కానీ రూ.3,297.26 కోట్ల పెంపునకే ఈఆర్‌సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) కొనుగోలుకు అంగీకరించాలని పట్టుబట్టిన ప్రభుత్వం... ఈఆర్‌సీపై ఏకంగా కేంద్ర విద్యుత్ చట్టాన్ని కూడా ప్రయోగించింది. ఫలితంగా 4 నెలలు 2,430 మిలియన్ యూనిట్ల (243 కోట్ల యూనిట్లు) విద్యుత్‌ను ఆర్-ఎల్‌ఎన్‌జీ ద్వారా కొనుగోలు చేసేందుకు ఈఆర్‌సీ అనుమతించింది. దీంతో యూనిట్‌కు ఏకంగా రూ.12.50 చొప్పున రూ.3,037.5 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ కారణంగానే ప్రజలపై భారం రూ.6,344.76 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.830 కోట్లను మాత్రమే సబ్సిడీగా భరించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే రూ.3,037.5 కోట్లలో రూ.830 కోట్లు తీసివేస్తే రూ.2,207.5 కోట్ల భారం కేవలం ప్రభుత్వం వల్లే ప్రజలపై పడిందన్నమాట. వాస్తవం ఇలావుంటే ప్రభుత్వం భారీగా చార్జీల భారం తగ్గించినట్టు మాట్లాడడం విడ్డూరం. 

కుటీర పరిశ్రమలు కుదేలే..!: కుటీర పరిశ్రమలపై ప్రభుత్వం కనికరం చూపలేదు. స్వర్ణకారులు, వడ్రంగి, మరమగ్గాలు, ధోబీఘాట్లు, బొమ్మలు, సబ్బులు, అగర్‌బత్తీలు, క్యాండిల్, పచ్చళ్ల తయారీ యూనిట్లతో పాటు ఫినాయిల్ తయారీ వంటివన్నీ కుటీర పరిశ్రమలకిందకు వస్తాయి. అయితే వీరికి చార్జీల తగ్గింపునకు ప్రభుత్వం కనీసం ప్రయత్నించలేదు. కుటీర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు గత రెండేళ్లలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. ఫలితంగా యూనిట్ విద్యుత్ చార్జీ ధర రూ. 1.80 నుంచి ఏకంగా రూ. 3.75కి పెరిగిపోయింది. అంటే కేవలం గత రెండేళ్లలోనే వీటికి విద్యుత్ చార్జీలను 108.3 శాతం మేరకు ప్రభుత్వం పెంచిందన్నమాట. వీటికితోడుగా విధిస్తున్న సర్దుబాటు చార్జీలతో రాష్ట్రంలోని కాటేజీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూసివేత దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం తాజాగా పెంచిన చార్జీల వల్ల కేవలం కాటేజీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపైనే ఏకంగా రూ.300 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో 25 వేల కుటీర పరిశ్రమల సంబంధిత కనెక్షన్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి లక్షమంది జీవనం సాగిస్తున్నారు.

మేమూ పెట్టుబడిదారులమేనా: చిన్నచిన్న పాన్‌షాప్‌లు, జిరాక్స్ మిషన్లు వంటి చిన్నతరహా వాణిజ్య సంస్థలపై చార్జీల తగ్గింపులో ప్రభుత్వం కనికరం చూపలేదు. చిన్న చిన్న షాపులు నడుపుకుంటున్న తాము పెట్టుబడిదారులం ఎంతమాత్రమూ కాదని వారు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం 50 యూనిట్లలోపు చిన్నతరహా వాణిజ్య సంస్థలకు యూనిట్‌కు రూ.3.85 చార్జీ ఉండగా... తాజాగా రూ.5.40 మేరకు పెంచారు. ఇక 50 యూనిట్లు దాటితే మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.6.63 వసూలు చేయనున్నారు. అదేవిధంగా 51-100 యూనిట్లకు యూనిట్‌కు రూ. 7.38 చొప్పున వసూలు చేయనున్నారు.

101-300 యూనిట్లకు యూనిట్‌కు 8.13 చొప్పున వసూలు చేయనున్నారు. ఇక 301-500 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.63, 500 యూనిట్లపైన రూ. 9.13 మేర వసూలు చేయనున్నారు. అంటే 50 యూనిట్లు దాటి వినియోగించే చిన్నతరహా వాణిజ్య సంస్థలకు 50 యూనిట్ల వరకు టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తివేశారన్నమాట. ఇది చిరు వ్యాపారులపై భారీ భారం మోపనుంది. మరోవైపు విద్యుత్ కోతల వల్ల చిన్నతరహా పరిశ్రమలన్నీ ఇప్పటికే మూసివేత దశకు చేరుకున్నాయి. ఆర్డర్లన్నీ ఆగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. వీటికి విద్యుత్ చార్జీలను తగ్గించకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఎస్‌ఎంఈ) అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 

3వ రోజుకు వైఎస్సార్‌సీపీ సత్యాగ్రహ దీక్ష


 విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం పేరుతో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాటికి మూడో రోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న పలువురు నేతల ఆరోగ్యం మూడో రోజు సాయంత్రానికి క్షీణించింది. దీక్షలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వైద్యులు పలు దఫాలుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరు నేతలు నీరసంగా కనిపించారు. గురువారం సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రి నుంచి డాక్టర్ తిరుపతిరెడ్డి నేతృత్వంలో వచ్చిన వైద్య బృందం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించింది. 

కొందరు ఎమ్మెల్యేల రక్తపోటులో హెచ్చుతగ్గులు నమోదయ్యాయని, మరికొందరి రక్తంలో చక్కెరలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. వారికి వెంటనే వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్టీ శాసనసభ పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి, తానేటి వనిత షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయి. వారిద్దరి రక్తంలో చక్కెర పరిమాణం 56 ఎం.జిగా నమోదైంది పేర్ని నాని రక్తంలో చక్కెర 66 ఎం.జిగా నమోదైంది. ఎన్.అమరనాథరెడ్డి షుగర్ లెవల్స్ పడిపోగా బీపీ కూడా బాగా తగ్గింది. షుగర్ స్థాయిలు పడిపోయిన వారిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు, సుజయకృష్ణ రంగారావు, పేర్ని నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గొట్టిపాటి రవికుమార్, జోగి రమేష్ ఉన్నారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలను ఆస్పత్రికి తరలిస్తామని సైఫాబాద్ ఏసీపీ రాంనర్సింహారెడ్డి మధ్యాహ్నం కోరగా అందుకు విజయమ్మ అంగీకరించలేదు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించేదాకా దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేయడంతో అధికారులు వెనుదిరిగారు. విజయమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

ఎవరికీ భిక్షం?

పెంచిన చార్జీలు తగ్గించేదాకా దీక్ష ఆపే ప్రసక్తే లేదు..
రూ.6344 కోట్లు పెంచి..రూ.830 కోట్లు తగ్గిస్తారా?
200 యూనిట్లు దాటి వాడేవారంతా క్యాపిటలిస్టుల్లా కనిపిస్తున్నారా?
రైతులకు 3 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు.. దానిపై మాట్లాడరేం?
మూతపడిన పరిశ్రమలపైనా నోరెత్తలేదు
మా పోరాటం ఆగదు.. బంద్ యథావిధిగా జరుగుతుంది

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై రూ.6,344 కోట్ల మేర విద్యుత్ చార్జీల భారం వేసి 830 కోట్ల రూపాయలు తగ్గిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్తున్నారని, ఆయన ఎవరికి భిక్షం పడేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు కొంతమేర తగ్గించినట్లు గురువారం ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్దిసేపటికి రాత్రి 9 గంటలకు ఆమె కరెంటు సత్యాగ్రహ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులతో సమావేశమై విద్యుత్ చార్జీలను సమీక్షించిన ముఖ్యమంత్రి ఇంకా ఏమో చెబుతారని అనుకున్నామని, కానీ ఆయన ప్రకటన ఏ మాత్రం హర్షణీయంగా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ముందు 6,344 కోట్ల రూపాయల భారం వేయాల్సిందిగా తానెక్కడ చెప్పానని ముఖ్యమంత్రి అనడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు.

వారు క్యాపిటలిస్టులా: 150 నుంచి 200 యూనిట్లు వాడుకునే విద్యుత్ గృహ వినియోగదారులు కాక మిగతా వారందరినీ క్యాపిటలిస్టులుగా(పెట్టుబడిదారులు) ముఖ్యమంత్రి పేర్కొనడం గర్హనీయమని విజయమ్మ అన్నారు. చిన్న తరహా, కుటీర పరిశ్రమలు నడుపుకునే వారిని కూడా క్యాపిటలిస్టులు అన్నారంటే ఏమనాలో తెలియడం లేదన్నారు. రైతులకు పల్లెల్లో రెండు మూడు గంటల కంటే ఎక్కువ కరెంటు ఇవ్వడం లేదని, దాని గురించి ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూత పడ్డాయని, వాటి గురించి ఒక్క మాటా చెప్పలేదన్నారు. అంతవరకు దీక్ష ఆగదు: పెంచిన విద్యుత్ చార్జీలను మొత్తంగా తగ్గించాలనేది తమ పార్టీ డిమాండ్ అనీ, అప్పటి వరకూ తాము చేస్తున్న దీక్ష కొనసాగుతుందని విజయమ్మ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన విధంగా శుక్రవారం నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమం, 9న బంద్ యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆమె కోరారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆనాటి పరిస్థితులే ఉన్నందున దానికి గుర్తుగా 9న నిర్వహిస్తున్న బంద్‌లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున వైఎస్ విగ్రహానికి పాలాభిషేకాలు చేసి కార్యకర్తలు కనీసం రెండు కిలోమీటర్లు పాదయాత్రలు చేసి బంద్ నిర్వహించాలని పేరు పేరునా కోరుతున్నానని అన్నారు.

ప్రజలే బుద్ధి చెప్తారు: సీఎం ప్రకటనకు ముందు దీక్షా శిబిరం వద్ద విజయమ్మ.. మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం దిగిరాకపోతే విద్యుత్ చార్జీల అంశంపై తమ ఆందోళన ప్రజా క్షేత్రంలోకి వెళుతుందని చెప్పారు. ఇది మోయలేని భారం కనుక తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ప్రజల పక్షాన తమ పార్టీ కూడా అదే కోరుకుంటోందని తెలిపారు. అందరి అభిమతానికి భిన్నంగా ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ప్రజలు పాలకులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పది సార్లు పెంచి ఒక్క సారి తగ్గించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలాది కోట్ల రూపాయల కరెంటు చార్జీల భారం వేసి వంద లేదా రెండు వందల కోట్ల రూపాయలు తగ్గిస్తామంటే సహించేది లేదని విజయమ్మ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ఏకపక్షంగా ఉందని కాంగ్రెస్ వారే కొందరు చె బుతూ ఇది మంచిది కాదనే అభిప్రాయంతో ఉన్నారని, వారంతా తమ మాదిరిగా ఆందోళన చేస్తే బాగుంటుందని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుగానీ, కాంగ్రెస్‌గానీ వైఎస్‌ను టార్గెట్ చేసి మాట్లాడటమే వారి పనిగా ఉందే తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టవని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

టీడీపీకి అర్హత లేదు: బషీర్ బాగ్ ఉదంతంలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న టీడీపీకి కరెంటు ఉద్యమం చేసే నైతిక అర్హత అసలు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు అసెంబ్లీలో ప్రభుత్వానికి మద్దతునిచ్చి బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికే టీడీపీ ఆందోళన చేస్తోందన్నారు. తక్కువ ధరకు బొగ్గు లభిస్తున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రభుత్వాన్ని టీడీపీ ఎందుకు ప్రశ్నించదని ఆమె అన్నారు. గ్యాస్ లభ్యమవుతున్న ధర కన్నా ఎక్కువ ధరకు కొంటున్నా ఎందుకు టీడీపీ కిమ్మనడం లేదన్నారు.

ఆదాయం పెరిగినా సబ్సిడీ ఇవ్వరా?: సోమయాజులు

రాష్ట్ర ఆర్థిక ఆదాయ వనరులు రూ.43 వేల కోట్లు పెరిగినా విద్యుత్ రంగానికి అదనంగా ఇచ్చే సబ్సిడీ రూ. 200 కోట్లేనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు ధ్వజమెత్తారు. సత్యాగ్రహం దీక్షా శిబిరం వద్ద ఆయన కొణతాల రామకృష్ణతో కలిసి మీడి యాతో మాట్లాడారు. గత మూడేళ్లుగా రాష్ర్ట ప్రభుత్వం ఇంధన సర్‌చార్జి రూపంలో ప్రజలపై రూ.18 వేల కోట్ల భారం వేసిందని, మొత్తం రూ.30 వేల కోట్లు విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేశారని చెప్పారు. 2013-14 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు తేడా వస్తుందని చెప్పి, అందులో రూ.6,500 కోట్ల భారం ప్రజలపై వేయాలని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు ప్రభుత్వం సూచించిందని విమర్శించారు. గత ఏడాది విద్యుత్ రంగానికి ఇచ్చిన సబ్సిడీ రూ.6,045 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.5,450 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇపుడు తగ్గిస్తామంటున్న రూ.830 కోట్లు కలిపినా ఆ సబ్సిడీ రూ.6,200 కోట్లు దాటడం లేదన్నారు. 

Popular Posts

Topics :