07 April 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

YSRCP leader Gattu Ramachandra press meet

Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013

Sharmila's Conduct Rachabanda at Yanamadala, Krishna

YSRCP mla prasanna kumar reddy fire on Anam viveka

పార్టీని బలోపేతం చేస్తాం: జనార్దన్‌రెడ్డి

 రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు వైఎస్ఆర్‌సీపీ కృషి చేస్తోందని జిల్లా కన్వీనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి త్వరలోనే అసెంబ్లీ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లాలో అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ సూచించారని వెల్లడించారు.

స్టాడింగ్ కమిటీలు వేయాలి: వైఎస్ఆర్‌సీపీ

మొదటి దశ బడ్జెట్ సమావేశాలు పూర్తయి 3 వారాలు అవుతున్నా స్టాడింగ్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రజాసమస్యలపట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని తెలిపింది. ఈ వ్యవహారంపై శాసనసభా వ్యవహారాల మంత్రి, సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసనసభ సమావేశాలు నిర్వహించాలంటేనే వణుకుపుడుతోందని ఎద్దేవా చేసింది. ప్రభుత్వ కుట్రలకు చంద్రబాబు కూడా వత్తాసు పలకడం శోచనీయమని వైఎస్ఆర్‌సీపీ పేర్కొంది.

ఆనం వ్యాఖ్యలను తప్పుపట్టిన సోదరుడు

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలను ఆయన సోదరుడు ఆనం జయకుమార్‌ రెడ్డి తప్పుపట్టారు. వైఎస్ వల్ల తమ కుటుంబం ఎంతో లబ్ధిపొందిందని చెప్పారు. తన అన్న ఆనం వివేకానంద రెడ్డి రాజకీయ ఎదుగుదలకు వైఎస్ఆరే కారణం అన్నారు. రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలు చాలా బాధిస్తున్నాయని చెప్పారు. వైఎస్‌ వల్ల లబ్ధి పొందిన వాళ్లలో మా సోదరులే మొదటివారని అన్నారు.

ముందు మంత్రి ఆనంనే ఉరితీయాలి

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం అధికార మదంతో మాట్లాడారన్నారు. ఆయన మదాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి పార్థసారధి సమర్థిస్తున్నారని విమర్శించారు. జగన్ కేసులో ఉన్న ఆరుగురు మంత్రులను ప్రభావితం చేయడానికే ఆనం ఈ నాటకం ఆడుతున్నారన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించిన మంత్రి ఆనంనే ముందు ఉరితీయాలన్నారు. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని లేదా పిచ్చాస్పత్రిలో చేర్చాలని చెప్పారు. జగన్ ను భౌతికంగా లేకుండా చేయాలని కాంగ్రెస్, టిడిపిలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు చేశారు. మంత్రి ఆనం దిష్టిబొమ్మలను ఉరి తీశారు. తగులబెట్టారు. మంత్రిని మానసిక రోగుల ఆస్పత్రిలో చేర్చాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లోని మాదాపూర్ లో మంత్రి ఆనం వ్యాఖ్యలకు నిసనగా వైఎస్‌ఆర్‌సీపీ నేత రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సికింద్రాబాద్ రాణిగంజ్‌లో శీలం ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దహనం చేశారు. రాణీగంజ్ పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

కరీంనగర్ లో మంత్రి ఆనంపై డిఎస్ పి చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ నేత మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తాడికొండ అడ్డరోడ్డు, దాచేపల్లి, ముప్పాళ్ల, మేడికొండూరులలో ఆనం దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నకిరెకల్ లలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ లో వైఎస్‌ఆర్ సీపీ బాధ్యుడు కృష్ణమోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఇయ్యంబంజర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, వికోట, పలమనేరులలో మంత్రి ఆనం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే బాబ్జి ఆధ్వర్యంలో ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయరహదారిపైన, ముమ్మిడివరంలలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు.

'Anam Kutalapai fire'





ఎర్రగడ్డ మానసిక వైద్యశాల (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మానసిక వైద్యశాలలో చేర్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఈమేరకు వినతిపత్రం ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు ఆస్పత్రి గేట్లు మూసివేసి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నేతలు పుత్తా ప్రతాప్‌ రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ సహా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు నేతలను బలవంతంగా అరెస్టు చేశారు.

Sharmila fire on CBI in Nujiveedu at Krishna district

పేదవాడి గడప తొక్కడమే.... ఈ కడప బిడ్డ చేసిన నేరమా?

తండ్రి చనిపోయిన బాధలో ఉన్నా, తండ్రి కోసం చనిపోయిన కుటుంబాల్ని పరామర్శించేందుకు, ఆ బడుగుజీవులకు నేనున్నానంటూ ధైర్యం చెప్పేందుకు పేదవాడి గడప తొక్కడమే ఈ కడప బిడ్డ చేసిన నేరమా! అందుకే కదా ఈ శిక్ష.
ఏది ఏమైనా, నమ్మిన సిద్ధాంతం కోసం... ఇచ్చిన మాట తప్పలేక, తలవంచలేక, మడమ తిప్పలేక జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. ఇవన్నీ నా కెందుకులే అనుకుని ఉంటే పదవులు దక్కేవే కదా. కానీ అన్నింటినీ త్యజించి పూలబాట నుండి ముళ్ళబాట వైపు పయనించేందుకు, చరిత్ర తిరగరాసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన జగన్మోహనుని యావత్ ఆంధ్రరాష్ట్రం అభినందిస్తోంది. శిరస్సు వంచి సలాం చేస్తోంది. 

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలెన్నుకున్న వాడే నాయకుడు, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నవాడే నాయకుడు. ప్రజల మనసు దోచినవాడే అధినాయకుడు. అటువంటి నాయకుడు జగన్ వచ్చాడని ప్రజలంతా సంబరపడుతున్నారు. మా యువనేతా.. కష్టనష్టాలెన్ని ఎదురైనా దరిచేరే వరకు పోరాటాన్ని విడువకు. ప్రజలంతా నీ వెంటే. మంత్రులైతేనేమి, మంత్రాంగం నడిపేవారైతేనేమి ఎందరో కలిసికట్టుగా కుట్ర పన్నినా, ఎన్ని కుతంత్రాలు, వెన్నుపోట్లు ఎదురైనా విజయం నీదే. ఢంకా బజాయించడం ఖాయం. ఎండనక వాననక, పగలనక రేయనక, తిండనక నిద్రనక, కష్టపడ్డ నీ వెంటే జనమంతా. రాజు వెంట ఉన్న జనం యువరాజుని కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు.

- డాక్టర్ కె. గౌతమ్ నాగిరెడ్డి, మార్కాపురం, ప్రకాశంజిల్లా

జగన్ బయటికి వస్తేనే రాష్ట్రానికి వెలుగు

రాజకీయాలంటే నాకు సదభిప్రాయం లేదు. అవకాశవాదులు, స్వార్థమే పరమావధిగా భావించేవారు ప్రజాసేవకులుగా ముసుగు వేసుకుని రాజకీయనాయకులుగా అవతారం ఎత్తుతారని నా నమ్మకం. కానీ, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నా అభిప్రాయంలో మార్పు వచ్చింది. రాజకీయ నాయకులపై ఉన్న తేలిక భావం పూర్తిగా సడలింది. ఆయన తనయుడు జగన్మోహనరెడ్డిని చూసిన తర్వాతైతే లీడర్ అంటే ఇలా ఉండాలనిపించింది. కారణం... జగన్ అహర్నిశలు ప్రజల కోసమే శ్రమించారు. అరెస్టు అయ్యేవరకు ప్రజల మధ్యలోనే ఉన్నారు. నేను విశ్రాంత ఉపాధ్యాయుడిని. రాజశేఖరరెడ్డిరైతులకు ప్రాణం పోసేందుకు ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమానికి ఆకర్షితుడనై 2005 నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రతినెలా రెండు వందల రూపాయలు పంపిస్తున్నాను. 

కానీ చంద్రబాబునాయుడి దుష్టపాలన తర్వాత, ప్రజలకు మేలు జరుగుతున్న సమయంలో రాజశేఖరరెడ్డి అకాల మరణంతో మళ్లీ చీకటిరాజ్యం అయిపోయింది మన రాష్ట్రం. ఇప్పుడు ఆ చీకటి తొలగిపోవాలంటే జగన్ ముఖ్యమంత్రిగా రావాలి. ఆయన కార్యదీక్ష, ఆయనకున్నంత మనోనిబ్బరం ఏ నాయకుడిలోనూ కనిపించవు. పది నెలలుగా జైల్లో ఉన్నా ఆయన చిరునవ్వు చెక్కుచెదరలేదు. అందుకే ఆయన్ని ఎంత అభినందించినా తక్కువే. జగన్ త్వరగా బయటికి రావాలి. పేదల కష్టాలు తొలగిపోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ప్రజారాష్ట్రంగా గుర్తింపుపొందాలి. 

- బదరీనారాయణ, రాయదుర్గం, అనంతపురం

భయంతోనే ఆనం ప్రేలాపనలు: వైఎస్సార్ సీఎల్పీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతోనే మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆ పార్టీ శాసనసభాపక్షం ధ్వజమెత్తింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, తెల్లం బాలరాజులు శుక్రవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

‘‘నెల్లూరు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆనం కుటుంబానికి సంబంధించిన నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనానికి కాంగ్రెస్ కొట్టుకుపోయింది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి 40 వేల మెజారిటీ రాగా.. ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్‌లో 35 వేల మెజారిటీ వచ్చింది. కోవూరు ఉప ఎన్నికల్లో 25 వేల మెజారిటీ, ఉదయగిరి నియోజకవర్గంలో 30 వేల మెజారిటీ రాగా.. కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు’’ అని గుర్తు చేశారు. ఇలాంటి ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయని, నెల్లూరు ప్రజానీకం వారిని వెలివేస్తారన్న భయంతోనే మతిభ్రమించి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

నెల్లూరులో వైఎస్ సంతాప సభలో వెక్కివెక్కి ఏడ్చావు

- జగన్‌ను సీఎం చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని అన్నావు
- నెల్లూరులో వైఎస్ సంతాప సభలో వెక్కివెక్కి ఏడ్చావు
- ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం దివంగత నేత వైఎస్‌ను తూలనాడతావా?
- సంవత్సరం తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవర్ని వెలివేస్తారో తేలుతుంది 
- వైఎస్ కుటుంబంపై మంత్రి ఆనం ఆరోపణలను ఖండించిన వైఎస్సార్ సీపీ ఎంపీ 

 కాంగ్రెస్ పెద్దలు, ‘ఢిల్లీ’ మెప్పు పొందేందుకే మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో 2007లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు 60 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లాలో హంగామా చేసిన ఆనం సోదరులు.. ప్రస్తుతం రాజకీయ లబ్ధికోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ఎంపీ మేకపాటి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆనం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

‘‘మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పిన వ్యక్తి ఆనం రాంనారాయణరెడ్డి. ఈ విధంగా రాష్ట్రంలో ఎవరూ కూడా చెప్పలేదు. నెల్లూరులోని వీఆర్ కాలేజ్ ఆవరణలో జరిగిన వైఎస్ సంతాప సభలో మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్చారు. అటువంటి వ్యక్తులు రాజకీయలబ్ధి కోసం ఈ విధంగా తూలనాడటం సిగ్గుచేటు’’ అని దుయ్యబట్టారు. వైఎస్ పెట్టిన రాజకీయ భిక్షతో ఇంతటి స్థాయికి ఎదిగి స్వలాభం కోసం కఠినంగా మాట్లాడటం హేయమన్నారు. ఆనం మాటలు చూస్తుంటే జగన్‌ను పర్మినెంట్‌గా జైల్లోనే ఉంచాలనే ఆలోచన ఉన్నట్లుందని సందేహం వ్యక్తం చేశారు. 

విజయమ్మ, షర్మిల గురించి మాట్లాడిన మాటలు వారి సంస్కృతికి అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘బయ్యారం గనుల గురించి బ్రదర్ అనిల్‌పై అభియోగాలు మోపిన మంత్రి ఆనం దిగజారుడు వ్యాఖ్యలు చేసేకంటే.. అధికారం వారి చేతి లోనే ఉంది నిరూపించవచ్చు కదా?’’ అని మేకపాటి ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో జగన్ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) వేసిన సందర్భంగా వారు (ఆనం) ఇంత నీచంగా మాట్లాడడాన్ని చూస్తే.. వైఎస్ కుటుంబంపై ఎంత కక్షగట్టారో అర్థమవుతోందని పేర్కొన్నారు. జగన్ బయటకొస్తే ఈ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అక్కసుతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం పై ఇంత అన్యాయంగా మాట్లాడుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో కచ్చితంగా బుద్ధిచెప్తారని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబానికి భవిష్యత్తులో ఏ చిన్న హాని జరిగినా మీరే (కాంగ్రెస్ నేతలే) బాధ్యత వహించాలని హెచ్చరించారు.

వారిని వెలివేస్తారనే భయం పట్టుకుంది... 
రాష్ట్రం నుంచి వైఎస్ కుటుంబాన్ని వెలివేయాలని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంవత్సరం తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవర్ని వెలివేస్తారో తేలుతుందని స్పష్టం చేశారు. ‘‘నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి మతిభ్రమించినట్లుంది. 2009లో పోటీచేసిన నాకు కేవలం 55 వేల మెజారిటీ మాత్రమే ఇచ్చింది. కానీ 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీచేసి 2.97 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందాను. గతంతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ మెజారిటీతో గెలిచాను. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు ఇలాగే తూలనాడితే పది రెట్ల ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం’’ అని పేర్కొన్నారు. 

మీ తమ్ముడే మా పార్టీలో చేరాలనుకుంటున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్న మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సొంత తమ్ముడు జయకుమార్‌రెడ్డి తమ పార్టీలో చేరటానికి ఉవ్విళ్లూరుతున్నారని మేకపాటి తెలిపారు. జగన్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని, రాగానే పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ కుటుంబంపై ఆనం చేసిన వ్యాఖ్యలను టీడీపీ సమర్థించిన విషయాన్ని ప్రస్తావించగా.. రెండు పార్టీలు ఒక్కటే ఎజెండాగా పనిచేస్తున్నాయి కాబట్టే ఒకరినొకరు సమర్థించుకుంటారని మేకపాటి బదులిచ్చారు. సీఎం కుర్చీ కోసమో హోంమంత్రి పదవి కోసమో ఆనం ఈ రకంగా వ్యాఖ్యలు చేసినట్లున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు చెప్పినా తుది చార్జిషీటు వేయడం లేదు

* సుప్రీంకోర్టు చెప్పినా తుది చార్జిషీటు వేయడం లేదు
* ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతున్నట్లుగా ఒకటి, రెండు అంటూ చార్జిషీట్లు వేస్తున్నారు
* సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగానే సాగుతుంటే.. మంత్రులను ఎందుకు అరెస్టు చేయరు?
* చిరంజీవి బంధువుల ఇంట్లో దొరికిన డబ్బు సంగతేంటి?
* బాబుపై ఆరోపణలున్నా సీబీఐ ఎందుకు విచారణ చేయదు? 

‘‘ఈ ప్రభుత్వంలో పొలాలకు నీళ్లు బంద్, ఇళ్లకు కరెంట్ బంద్, విద్యార్థులకు చదువులు బంద్, పరిశ్రమలకు పవర్ బంద్, కార్మికులకు ఉపాధి బంద్, రాష్ట్రానికి అభివృద్ధి బంద్, ప్రజలకు మనశ్శాంతి బంద్.. ఆడవారిపై అత్యాచారాలు మాత్రం యథేచ్చగా జరుగుతున్నాయి.’’
- షర్మిల 

‘‘సీబీఐ సుప్రీంకోర్టును ధిక్కరించింది. ఆరు నెలలైనా తుది చార్జిషీటు వేయడం లేదు. ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతున్నట్లు ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు అంటూ చార్జిషీట్లు పెడుతున్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగానే సాగుతుంటే.. ఈ కేసుతో సంబంధం ఉన్న మంత్రులను ఎందుకు అరెస్టు చేయడం లేదో సీబీఐ సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రి చిరంజీవి దగ్గరి బంధువుల ఇంట్లో రూ.70 కోట్లు దొరికితే సీబీఐకి కనపడదు. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అన్న ప్రశ్నలకు సమాధానమూ ఉండదు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రంలోనే అతి పెద్ద మాఫియా డాన్ అని సొంత పార్టీవారే చెప్పినా సీబీఐ పట్టించుకోదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా?’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. 

‘‘పెద్ద మనుషులు అని చెప్పుకునే నాయకులు.. జగన్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక సీబీఐ వెనుక ఉండి దాడి చేస్తున్నారు. ఆయన బయట ఉంటే ప్రజా సమస్యలపై పోరాడుతూ వైఎస్‌కు నిజమైన వారసుడిగా నిలిచిపోతారని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మనుగడ ఉండదని తెలిసి అబద్ధపు కుట్రలతో జగనన్నను జైలులో పెట్టారు’’ అని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు వైఖరికీనిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో సాగింది. ఆమె పాదయాత్రకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
‘‘రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబుకు దేశంలో ఎక్కడ చూసినా హెరిటేజ్ దుకాణాలు ఉన్నాయి. దుబాయ్, సింగపూర్, మలేసియాలలో ఆస్తులు ఉన్నాయి. అంతెందుకు కమ్యూనిస్టులు చంద్రబాబు అవినీతిపై ‘బాబు జమానా - అవినీతి ఖజానా’ అంటూ పుస్తకాలు వేశారు. అప్పట్లో ఎకరా నాలుగు కోట్లు విలువ ఉన్న భూములను కేవలం రూ.లక్షలకే ఎమ్మార్‌కు కట్టబెట్టారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ ఆస్తిని ఆయన అమ్మేశారు. ఐఎంజీ అనే బోగస్ సంస్థకు 850 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. పదేళ్ల క్రితమే ఆ ఆస్తుల విలువ రూ.2,500 కోట్లు ఉండగా, నేడు పది వేల కోట్లకు చేరింది. ఈ భూములను కేవలం రూ. వందల కోట్లకు బినామీ సంస్థకు అప్పగించారు. దీనిపై విచారణ చేయమని సీబీఐకి చెబితే మా వద్ద సిబ్బంది లేరని చెప్పింది. 

ఇన్ని ఆరోపణలున్నా చంద్రబాబును సీబీఐ ఎందుకు ప్రశ్నించడంలేదు? సీబీఐకి చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో అర్థం చేసుకోలేని అమాయకులు కాదు ప్రజలు. ‘ఈనాడు’ పత్రిక రూ.100 విలువ చేసే షేరును రూ.5 లక్షలకు అమ్మితే తప్పులేదట. ‘సాక్షి’ దినపత్రిక ఒక్కో షేరును రూ.250కు విక్రయిస్తే అది క్విడ్ ప్రో కో అట. జగనన్నపై ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క ఆధారం కూడా సీబీఐ ఇప్పటి వరకూ చూపలేకపోయింది. సీబీఐ తీరు చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తుంది. ప్రాథమిక హక్కులను కాలరాసే అధికారం సీబీఐకి ఎవరిచ్చారు? 

నిందితులకు పాలకుల అండ..: తెనాలిలో ఒక అమ్మాయిపై నలుగురు యువకులు వేధింపులకు పాల్పడితే అడ్డుకున్న ఆమె తల్లిని లారీ కిందకు తోసి చంపేశారు. ఆ నలుగురిలో ఒకరు కాంగ్రెస్ నాయకుడి కుమారుడు. ఆ అమ్మాయి చేత పోలీసులు తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారట. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులను ప్రభుత్వం ఉపయోగించుకుంటూ బాధితుల పక్షాన కాకుండా బాధించేవారి పక్షాన వ్యవహరిస్తోంది. ఇది రాక్షస పాలన కాదా? నిన్న హైదరాబాద్‌లో ఒక యువతిపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగుల పెట్టారు. ఈ రోజున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో పెళ్లికి ఒప్పుకోలేదని మరో యువతిని హత్య చేశారు. చంద్రబాబు హయాంలోనూ ఇదే సాగింది. అప్పట్లో అనురాధ అనే యువతిపై యాసిడ్ దాడి జరిగితే వైద్య ఖర్చులకి కూడా సాయం చేయలేదాయన.

బాబు ఆదర్శంగా కిరణ్ పాలన..: కిరణ్‌కుమార్‌రెడ్డికి చంద్రబాబు ఎందుకు నచ్చారో తెలియదు. ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు. చంద్రబాబు హయాంలానే ఇప్పుడు కూడా కరువు వచ్చి ప్రజలు అప్పుల పాలయ్యారని, బతుకు భారమైందని అందరూ చెబుతున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు కళ్లముందే కుదేలైపోయాయి. సీఎం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు మూడు గంటల కరెంటే ఇస్తున్నారు. పరీక్షల సమయంలో కరెంట్ తీసేస్తున్నారంటే.. విద్యార్థుల పట్ల వీరికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. 

నిన్న ఒక గుడిసెకు వెళ్లాం. ఒకే ఒక బల్బు ఉంటే.. 400 రూపాయల బిల్లు వచ్చిందని ఆమె నాకు చూపించింది. రోజు కూలీ చేసుకుంటే వంద రూపాయలు వస్తాయమ్మా.. ఇంత బిల్లులు వస్తుంటే ఎలా అ ని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మన ముఖ్యమంత్రిగారు మాత్రం ప్రతిపక్షాలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికి ఉంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయేది. అదే జరిగి ఉంటే ప్రజలపై ఈ కరెంటు చార్జీల భారం పడేది కాదు. కానీ బాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రజలను వేధిస్తున్నారు.’’

11 కిలోమీటర్లు సాగిన యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 118వ రోజు శుక్రవారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం పొనసానపల్లి క్రాస్‌రోడ్స్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. మోర్సపూడి, తుక్కులూరు మీదుగా నూజివీడు వరకు 11 కిలోమీటర్లు నడిచారు. నూజివీడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 1,597.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేశ్, మద్దాల రాజేశ్ కుమార్, నాయకులు వసంత నాగేశ్వరరావు, సామినేని ఉదయభాను, మేకా ప్రతాప అప్పారావు, జలీల్‌ఖాన్, మొవ్వా అనంద శ్రీనివాస్ తదితరులున్నారు.

మహిళలకు భద్రత కరువు: విజయమ్మ

తెనాలిలో సునీల కుటుంబానికి పరామర్శ
- స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా రక్షణ ఏది?
- చట్టాలున్నా, సరైన పాలకుల్లేకే సమస్యలు 

 ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లయినా నేటికీ మహిళలకు భద్రత లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. శాంతిభద్రతలు ఇంతగా పతనావస్థకు చేరుకోవటం బాధనిపిస్తోందని, చట్టాలున్నా నడిపించగలిగే పాలకులు లేకనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పారు. 

నడిరోడ్లపై మద్యంషాపులకు అనుమతులు ఇవ్వటంవల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నడిబొడ్డులో బార్ అండ్ రెస్టారెంటు ఎదుట మద్యం మత్తులో కొందరు యువకులు రోడ్డుపై యువతిని వేధించడం, ప్రతిఘటించినందుకు ఆమె తల్లి సునీలను లారీ కిందకు తోసేసి చంపడం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని శుక్రవారం సాయంత్రం విజయమ్మ పరామర్శించారు. సునీల భర్త బాబూరావు, కుమార్తెలను పలకరించారు. దురంతం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు.

ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రిని, హోంమంత్రిని కోరుతున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబానికి తప్పక న్యాయం చేయాలంటూ అసెంబ్లీలో వాళ్ల తరఫున మాట్లాడతానని హామీ ఇచ్చారు. ‘‘ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా చాలా బాధనిపిస్తోంది. ఆడవాళ్లు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని గాంధీ అన్నారు. కానీ అది నేటికీ వచ్చినట్టు అన్పించటం లేదు. ఎందుకంటే ఏ రోజు చూసినా ఇలాంటి ఘోరాలే వార్తల్లో కనిపిస్తున్నాయి. యువతులకు, మహిళలకు భద్రత లేకుండా పోతోంది. తెనాలి ఘటనే దీనికి నిదర్శనం. షాపింగ్‌కు వెళ్లి వస్తున్న యువతిపై.. ఎంతోమంది జనం, కన్నతల్లి చూస్తుండగానే ఇలాంటి అఘాయిత్యం జరిగిందంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. 

తన తల్లికి న్యాయం చేయాలని, కారకులను కఠినంగా శిక్షించాలని ఆ అమ్మాయి అడుగుతోంది. బాధ్యులు ఎంతటి అధికారంలో ఉన్నవారైనా సరే, కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ తరపున కోరుతున్నాం’’ అన్నారు. ఇటీవలే శ్రాగ్వి అనే 8 నెలల పాప కిడ్నాపింగ్‌కు గురైన వైనాన్ని విజయమ్మ ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయో లేదో కూడా తెలియడం లేదన్నారు. ‘‘నడిరోడ్లపై మద్యం షాపులకు లెసైన్సులివ్వడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.5,000 కోట్లున్న ఎక్సైజ్ ఆదాయం ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రూ.10 వేల కోట్లకు పెరిగింది. ఢిల్లీ దారుణం తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. ఇంకా చాలా చట్టాలున్నాయి. కానీ సరిగా నడిపించగలిగే పాలకులు లేకే సమస్యలన్నీ వస్తున్నాయి’’ అన్నారు.

అమ్మను కాపాడుకోలేకపోయా...: అమ్మను కాపాడుకోలేకపోయానంటూ సునీల కుమార్తె మౌనిక విలపించింది. ‘‘అమ్మ నా దగ్గరకొచ్చిందని చూసుకోలేదు. నన్ను రక్షించమంటూ అప్పటికే కేకలు వేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అంతలోనే అమ్మ వచ్చింది. నన్ను వేధిస్తున్న వాళ్లను ప్రశ్నించింది. అంతలోనే వాళ్లు అమ్మను లారీ కిందకు తోసేశారు’’ అంటూ కన్నీరుమున్నీరైంది. విజయమ్మ ఆమె కంటనీరు తుడిచి ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉంటామని హామీఇచ్చారు.

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 119వ రోజు శనివారం యనమదలలో ప్రారంభమవుతుందని, అక్కడే రచ్చబండ జరుగుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈదర జంక్షన్ వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని చెప్పారు. సాయంత్రం భట్టులవారిగూడెం వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బస చేస్తారని వారు వివరించారు.

పర్యటించే ప్రాంతాలు
యనమదల, ఈదర, భట్టులవారిగూడెం

Sharmila 118th Day Padayatra

Written By news on Friday, April 12, 2013 | 4/12/2013

Chanchalguda Jail superintendent fire on TDP

MLA Bhumana Karunakar Reddy Fires on Government

'మంత్రి ఆనంకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్'

నెల్లూరు: మహానేత వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డిపై అనుచితవ్యాఖ్యలు చేసిన మంత్రి రాంనారాయణరెడ్డిపై వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కాకాని గోవర్దన్‌రెడ్డి మండిపడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతోనే రాజకీయంగా ఎదిగిన ఆనం ఆయనపై వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆరేనని.. అటువంటి మహానేతపై వ్యాఖ్యలు చేయడం ఆనం మంచిది కాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఆనంను ప్రజలు రాజకీయంగా ఉరితీస్తారని, తన మంత్రి పదవి కాపాడుకోవడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కాకాని గోవర్దన్‌రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: మహానేత వైఎస్ పై మంత్రి ఆనం అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌లో వంగపండు ఉషా ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైఎస్ కుటుంబంపై ఆనం అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన ఉషాను అరెస్ట్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కుందన్‌బాగ్‌లో మంత్రి ఆనం నివాసం ధర్నా చేపట్టిన విజయారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తెనాలి ఘటన దారుణం: వైఎస్ విజయమ్మ

 తెనాలి ఘటన బాధాకరమని వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ వ్యాఖ్యానించారు. తెనాలి ఘటన చూస్తే మహిళలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నడిబజారులో యువతిని వేధించడం చాలా దారుణమని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

యువతిపై మానభంగాన్ని అడ్డుకున్న తల్లిని లారీ కింద తోసి చంపడం ఘోరమైన విషయమని వైఎస్‌ విజయమ్మఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని, సునీల హంతకులను కఠినంగా శిక్షించాలని వైఎస్‌ విజయమ్మ డిమాండ్ చేశారు.

నిందితులు ఎంతటివారైనా వదలొద్దని, నడిరోడ్లపై మద్యం షాపుల వల్ల నేరాలు పెరుగుతున్నాయన్నారు. వైఎస్‌ మరణం తర్వాత ఎక్సైజ్‌ ఆదాయం 5వేల కోట్లు రూపాయలకు పెరిగిందన్నారు. సునీల ఘటనను అసెంబ్లీలో లేవనెత్తుతామని, చట్టాలున్నా పాలకులు సరిగా లేకుంటే ప్రయోజనమేంటి అని వైఎస్‌ విజయమ్మ ప్రశ్నించారు. సునీల కుటుంబసభ్యులకు వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. 

మంత్రి ఆనం రాజకీయ వ్యభిచారి: చెవిరెడ్డి

చిత్తూరు: వైఎస్‌ఆర్ కుటుంబంపై నోరు పారేసుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురంలోని నెట్టకుప్పంలో మంత్రి ఆనం వ్యాఖ్యలపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తూ శవయాత్రను నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఆనం రాజకీయ వ్యభిచారి అని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఆనంకు బుద్ధి చెప్తారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. 

జగనన్నను సీబీఐ వేధిస్తోంది: షర్మిల

కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కై సీబీఐతో జగన్‌పై దాడి చేయించాయని షర్మిల ఆరోపించారు. విచారణ పేరుతో సీబీఐ మానవహక్కులను కూడా కాలరాస్తుందని షర్మిల మండిపడ్డారు. అధికారంలో లేని ఎంపీ జగనన్న సాక్షులను ప్రభావితం చేస్తారా, అధికారంలో ఉన్న మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తారా అని షర్మిల ప్రశ్నించారు. జగన్‌ను అరెస్ట్‌ చేసి మంత్రులను ఎందుకు బయట వదిలేశారని.. దీనికి సీబీఐ సమాధానం చెప్పాల నూజివీడు సభలో షర్మిల నిలదీశారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి జగన్‌ను సీబీఐ వేధిస్తోందన్నారు. 6నెలలు గడువు ముగిసినా ఫైనల్‌ ఛార్జిషీట్‌ వేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐకి చంద్రబాబు అవినీతి ఎందుకు కనిపించడం లేదని షర్మిల అడిగారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైయ్యారు కాబట్టే చంద్రబాబును సీబీఐ విచారించడం లేదన్నారు. 
కిరణ్‌ హయాంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, గత 3రోజులుగా తెనాలి, హైదరాబాద్‌, చిత్తూరులో మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకోవడం రాష్ట్రంలోని శాంతి భద్రతలకు అద్దపడుతోందన్నారు. చంద్రబాబు హయాంలో కూడా మహిళల పరిస్థితి ఇలానే ఉందని షర్మిల విమర్శించారు. 

నూజివీడులో సాగునీటి కోసం కృష్ణా జలాలను రప్పించాలని వైఎస్‌ ప్రయత్నం చేశారని, వైఎస్‌ఆర్ 80శాతం పనులు కూడా పుర్తి చేశారని.. కానీ ఇప్పటికీ మిగిలిన పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత విద్యకు వైఎస్‌ నూజివీడులో ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు సిగ్గులేకుండా వైఎస్‌ఆర్‌ చేసిన రుణమాఫీని తాను చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. విద్యుత్‌ బిల్లులు కట్టలేకపోతే మహిళలను అరెస్ట్‌ చేసి అవమానించారని..ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్‌ నిల్లు.. బిల్లులు ఫుల్ అని షర్మిల అన్నారు. 

తెనాలి వెళ్లనున్న విజయమ్మ

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరు జిల్లా తెనాలి వెళ్లనున్నారు. అక్కడ సునీల కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. కూతురిని వేధిస్తున్న తాగుబోతు యువకులను అడ్డుకున్న తల్లి సునీలను వారు తోసివేయడంతో, ఆమె లారీ కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే


మంత్రి ఆనం వ్యాఖ్యలపై ఎంపి మేకపాటి ఆగ్రహం

హైదరాబాద్: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ ఆశీస్సుల కోసం మంత్రి ఆనం అలా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆనాడు మంత్రి ఆనం అన్నట్లు తెలిపారు. జగన్ 60 అడుగుల కటౌట్ పెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు పొగిడి, ఈరోజు విమర్శించడం ఏమిటని ఆయన అడిగారు. రాజకీయ లబ్ది కోసమే అని అర్ధమవుతోందన్నారు. ప్రజలు కూడా ఇదంతా గమనిస్తున్నారని చెప్పారు. ఆనం సోదరులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరకొచ్చిందన్నారు. బయ్యారం గనులతో తనకు సంబంధంలేదని బ్రదర్ అనీల్ ఎప్పుడో చెప్పారన్నారు.

ఆనం సొంత సోదరుడు జయకుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకపాటి తెలిపారు


Krishnamma Odilo 12th Apr 2013

జగన్‌ని, ప్రజల్ని జైలు గోడలు వేరుచేయలేవు

యువనేత జగన్‌మోహన్‌రెడ్డిగారికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుగు ప్రజలందరికీ జరుగుతున్న అన్యాయంగా నేను భావిస్తున్నాను. రాజశేఖరరెడ్డిగారు ఈ లోకం విడిచివె ళ్లినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆయన మరణం రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని అంతా అనుకుంటున్న సమయంలో ఆ లోటును భర్తీ చెయ్యడానికా అన్నట్లు ఆయన తనయుడు జగన్ ప్రజల్లోకి వచ్చారు. ‘‘మీకు అండగా ఉంటాను’’ అని భరోసా ఇచ్చారు. ‘‘నాకు మానాన్నగారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తాను’’ అని నల్లకాల్వలో ఇచ్చిన మాట ప్రకారం జగన్‌గారు ప్రజల్లోకి వచ్చినప్పుడు, ఓదార్పుయాత్రలో ప్రతిచోటా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టడం చూసినప్పుడు పర్వాలేదు, రాష్ట్రానికి జగన్ అనే పెద్ద దిక్కు ఉంది అని సంతోషపడ్డాం. 

అయితే ఓదార్పుయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేని కాంగ్రెస్ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మకై జగన్‌గారిని ఇబ్బంది పెట్టడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. ఎలాగైనా జగన్‌ని అణచివేయాలన్న దుష్టసంకల్పంతో ఓదార్పుయాత్రను అడ్డుకొని, ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టడం కుటిల రాజకీయాలకు పరాకాష్ట. అక్కడితో ఆగారా అంటే లేదు. కాంగెస్ అధిష్టానం, చంద్రబాబు నాయుడు వ్యూహం పన్ని జగన్ కంపెనీపై, సాక్షి కార్యాలయంపై దాడులు జరిపించారు. జగన్‌ని అరెస్టు చేయించి, బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇలా ఎన్ని వేధింపులకు గురిచేసినా జగన్ ధైర్యంగా నిబ్బరంగా నిలబడడం చూస్తుంటే మనకొక మంచి నాయకుడు దొరికాడు అనే ధైర్యం కలుగుతోంది. 

గత పదినెలల్లో మేము ఒక్క పండుగ కూడా జరుపుకోలేదు. అన్ని పండగలను కలిపి ఒకేరోజు... జగన్‌గారు బైటికి వచ్చిన రోజు జరుపుకుంటాము. జగన్‌గారు ప్రజలకోసం నిరంతరం పోరాడుతూ రైతుదీక్ష, జలదీక్ష, ఫీజు పోరు దీక్ష, హరితయాత్ర చేసి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారు. మా నుంచి ఆయన్ని ఏ జైలూ వేరు చేయలేరు. జగన్ వెంట మేము, మా వెంట జగన్ ఉంటాడు. జగన్ గారు జైలు నుండి ఎప్పుడొస్తారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే ఆయన బయటికి వచ్చి ప్రజల సమస్యలు తీర్చాలని మా ఆశ, ఆకాంక్ష. ఇక ‘వస్తున్నా మీకోసం’ అంటూ బయల్దేరిన చంద్రబాబు నాయుడు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అతడిని ప్రజలు ఎట్టి పరిస్థితులలో నమ్మరు కాక నమ్మరు. 

- రామకృష్ణారెడ్డి, కనిగిరి, ప్రకాశం జిల్లా

**********

నిన్నటితో సహా గత పదినెలల్లో మేము ఒక్క పండుగ కూడా జరుపుకోలేదు. అన్ని పండగలను కలిపి ఒకేరోజు... జగన్‌గారు బైటికి వచ్చిన రోజు జరుపుకుంటాము. జగన్‌గారు ప్రజలకోసం నిరంతరం పోరాడుతూ రైతుదీక్ష, జలదీక్ష, ఫీజు పోరు దీక్ష, హరితయాత్ర చేసి ప్రజల గుండెల్లో నిలిచారు. మా నుంచి ఆయన్ని ఏ జైలూ వేరు చేయలేరు. 

తండ్రి లేని లోటును తనయుడొక్కడే తీర్చగలడు

నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించేటపుడు గ్రామస్థులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని అభిలాషతో, వారితో సన్నిహితంగా మెలిగేవాడిని. ఒకరోజు ఒక వ్యక్తిని కలిసినప్పుడు ‘‘చాలా రోజులైంది చూసి, బాగున్నావా’ అని అడిగాను. కొంత సంభాషణ తర్వాత ఆయన తన చొక్కా గుండీలు విప్పి, తన ఛాతీని చూపిస్తూ తనకు జరిగిన శస్త్ర చికిత్స గురించి చెప్పాడు. ‘‘సార్ నేను ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకొనే స్తోమత ఉన్నవాణ్ణి కాదు. కానీ ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో నాలాంటి పేదవారికి పెద్ద ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం ఇప్పించింది. 

ఈ పథకమే లేకుంటే నేను ఈరోజు మీకు కనిపించేవాడినే కాదు’’ అంటూ రెండు చేతులు జోడించి, ఆకాశం వైపు చూపిస్తూ ‘‘ రాజశేఖరరెడ్డిలాంటి ముఖ్యమంత్రి ఉంటే నాలాంటి పేదవారికి కొండంత ధైర్యం’’ అని అన్నాడు. మాట్లాడుతున్నంత సేపు నేను ఆయన ముఖంలో వెలుగు చూశాను. ప్రజల్లో ఆ పథకం పట్ల ఎంత సంతృప్తికరమైన భావన ఉందో అర్థమైంది. ప్రస్తుతం ఆ పథకాన్ని నీరు కారుస్తున్నారు. పథకంలో కవర్ అయ్యే వ్యాధుల సంఖ్య తగ్గించారు. ఎన్నో ఆంక్షలు విధిస్తున్నారు. చివరికి ఆరోగ్యశ్రీని రద్దు చేసే దుస్థితి కూడా ఈ రాష్ట్రానికి దాపురించింది. నెలకు కచ్చితంగా జీతం పొందే వ్యవస్థీకృత రంగంలోని ప్రభుత్వ ఉద్యోగులే... ఉచిత వైద్యసదుపాయం కావాలని. 

సంవత్సరానికి కుటుంబానికి 5 లక్షలు కేటాయించాలని కోరుతూ కోరుతూ విజ్ఞప్తులు చేస్తున్నప్పుడు... పేదలకు ఉపయోగపడే ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని రద్దు చేయబోవడం ఎంత వరకు సబబు? ప్రజలందరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే రాజశేఖరెడ్డిగారి ఆశయాన్ని పూర్తిగా కొనసాగించగల నాయకుడు జగన్ ఒక్కరే. ఆయన రాక కోసం, ఆయన్ని ముఖ్యమంత్రి పదవిలో చూడడం కోసం ఎదురు చూసే ప్రజలలో నేనూ ఒకడిని. 

- షణ్ముఖ రెడ్డి, అనంతపురం

మళ్లీ రాజన్న రాజ్యం వస్తేనే పండగ: షర్మిల


పెరిగిన ధరలు, కరెంటు చార్జీలతో రాష్ట్రంలో ప్రజలు బతకడమే కష్టంగా మారిందని, ఉగాది వచ్చినా ప్రజలు పండగలా జరుపుకొనే పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘గ్రామాల్లో ఎక్కడా కరెంట్ లేదు.. పొలాలకు లేదు.. ఇళ్లకు లేదు. బిల్లు మాత్రం నాలుగింతలు వస్తోంది. సాగుకు నీరు లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంటు అందక పిల్లలకు చదువు లేదు.. ఆర్టీసీ చార్జీలు పెరిగిపోయాయి. 

ఉప్పు, పప్పు, బెల్లం అన్ని ధరలూ పెరిగిపోయాయి’ అని ఆమె మండిపడ్డారు. ‘నిజమైన ఉగాది రాజన్న రాజ్యంలోనే వస్తుంది. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. ఆ డబ్బు ఇంటికి తీసుకువచ్చి ఆడవారి చేతుల్లో పెట్టినప్పుడే నిజమైన పండగ వస్తుంది’ అని ఆమె అన్నారు. జగనన్న ఆధ్వర్యంలో త్వరలోనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఇచ్చారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం కృష్ణాజిల్లా నూజివీడు నియోజక వర్గంలో సాగింది. 

నూజివీడు మండలం గొల్లపల్లిలో జరి గిన రచ్చబండలో షర్మిల మాట్లాడుతూ.. ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అమ్మా.. పండగకు ఎంతమంది కొత్త బట్టలు కొనుక్కున్నారు? చేతులెత్తండి’ అని అడిగారు. పిల్లలు మాత్రమే చేతులెత్తారు. ‘సరే.. పండగకు ఫలహారాలు ఎంతమంది చేసుకున్నారు?’ అని షర్మిల మరోప్రశ్న వేశారు. కొద్దిమంది మాత్రమే చేతులెత్తారు. పెరిగిన ధరలతో ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందని అక్కడివారంతా అన్నారు. దీంతో షర్మిల స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా మర్రిబంధం, గొల్లపల్లిలలో షర్మిల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన ప్రసంగం ఆమె మాటల్లోనే..

ప్రజలు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారా?
‘రాజశేఖరరెడ్డి బతికిఉంటే ఇప్పుడు ఇస్తున్న నెలకు 20 కిలోలకు బదులుగా 30 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నవి 20 కిలోలు మాత్రమే. మనం మరో పది కిలోల బియ్యం బయట కొనుక్కోవాల్సి వస్తోంది. బయట మార్కెట్‌లో కిలో బియ్యం రూ. 30 వేసుకున్నా పదికిలోలు అంటే రూ.300 అవుతుంది. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే మీకు నెలకు ఈ రూ.300 మిగిలేవి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి బియ్యం 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచకుండా.. ధరను రూ. 2 నుంచి రూ.1కి తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల మీకు మిగులుతుంది కేవలం 20 రూపాయలే. అంటే ఏడాదికి రూ.240. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం వస్తోంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి ఇంకా ఒక ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక పథకం పెట్టింది. 

ఈ పథకంలో ఉప్పు, నూనె, కారం, పంచదార ఇస్తారట. ఆ ప్యాకెట్లపై ముఖ్యమంత్రి బొమ్మ కూడా వేసుకుంటారట. దీనివల్ల ఒక్కో కుటుంబానికీ నెలకు రూ.100 మిగులుతుందంట. అంటే అటు బియ్యంలో, ఇటు దీనిలో కలిపి కుటుంబానికి ఏడాదికి రూ.1500 మాత్రమే మిగులుతాయి. అదే రాజశేఖరరెడ్డి బతికి ఉంటే మీకు ఐదేళ్లలో కనీసం 20 వేల రూపాయలు మిగిలి ఉండేవి. ఈ ముఖ్యమంత్రి మిగిల్చింది 1500 మాత్రమే. ఇది చూసి ప్రజలు ఓటు వేయాలట. ప్రజల్ని ఆయన పిచ్చివాళ్లు అనుకుంటున్నారు. (ప్రజలనుద్దేశించి) ఏమ్మా మీరు పిచ్చివాళ్లా? మీరు అమాయకులా? నెలకు వంద రూపాయలు మిగిలితే సరిపోతుందా?

ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఆయుష్షు లేదు
కరెంట్ నిల్ - బిల్ ఫుల్ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉంది. విద్యుత్ చార్జీల పేరుతో ఏకంగా రూ.32 వేల కోట్ల భారం వేసి ప్రజల రక్తం పిండాలనుకుంటున్నారు. వ్యాట్ పేరుతో మరో రూ.10 వేల కోట్ల భారం వేశారు. ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఆయుష్షు లేదు. మహా అయితే ఆరు నెలలో, సంవత్సరమో ఉంటుంది. వీరి పాపం పండింది. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారు. ‘ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నారు. 

తెలుగుదేశం, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. త్వరలోనే జగనన్న ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో రైతేరాజు అవుతాడు. రాజన్న రాజ్యం రాగానే రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు ఉండవు. గుడిసెలు లేని రాష్ట్రంగా మారుస్తాం. ప్రతి ఒక్కరికీ పక్కాగృహాలు వస్తాయి. వృద్ధులు, వితంతువులకు పింఛన్ రూ.700, వికలాంగులకు రూ.1000కి పెరుగుతుంది. మహిళలు, రైతులకు వడ్డీలేని రుణాలు వస్తాయి. ఏ ఒక్కరూ డబ్బులేక చదువుకోవడం మానివేసే పరిస్థితి ఉండదు. పిల్లల్ని బడికి పంపించే తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాం.’

13.5 కిలోమీటర్లు సాగిన యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 117వ రోజు గురువారం కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం సీతారామపురం నుంచి ప్రారంభమైంది. మర్రిబంధం, మీర్జాపురం, గొల్లపల్లి మీదుగా పోనసానపల్లి క్రాస్‌రోడ్స్ వరకు సాగింది. మార్గమధ్యంలో పామాయిల్, మొక్కజొన్న రైతులతో మాట్లాడి షర్మిల సమస్యలు తెలుసుకున్నారు. మహనీయుడు జ్యోతిరావు పూలే 187వ జయంతి సందర్భంగా మర్రిబంధంలో ఆయన చిత్రపటానికి షర్మిల నివాళుల ర్పించారు. పోనసానపల్ల్లిలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. గురువారం ఆమె 13.5 కిలోమీటర్లు మేర నడిచారు. ఇప్పటివరకూ మొత్తం 1,586.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, నాయకులు సామినేని ఉదయభాను, మేకా ప్రతాప అప్పారావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, దుట్టా రామచంద్రరావు, గోసుల శివభరత్‌రెడ్డి, ముసునూరి రత్నబోస్, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం

* 230 సీట్లు ఖాయం
* విజయమ్మ పేరులోనే విజయం ఉంది
* జగన్ త్వరలో బయటకు వస్తారు
* మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం
* వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
* గందరగోళం తర్వాతే స్థిరత్వం వస్తుంది
* కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం ఉండవు

 రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ప్రభంజనం సృష్టించబోతోందని, వచ్చే ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తుందని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి చెప్పారు. విజయ నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని గురువారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజలు, పంచాంగ శ్రవణం చేశారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని, ఈ పార్టీ అనుగ్రహం లేకుండా ఏ వ్యక్తీ ప్రధానమంత్రి కాలేరని చెప్పారు. గ్రహ గతుల ఆధారంగా తాను ఈ అంశాలు చెబుతున్నానన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది కనుక గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రానికి ఉపకారాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం కలిసి ఉండలేవని ఏదో ఒక రోజు విడిపోతాయని ఆ తరుణం కోసం ఎదురు చూడాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పై పోటీ చేయడం ఆత్మహత్యా సదృశ్యంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారని, మహా ప్రభంజనం ముందు ప్రాణాలు ఒడ్డడం ఎందుకని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జాతక రీత్యా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని, ఆయన త్వరలో బయటకు వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళతారన్నారు.

రాష్ట్రంలో సూర్యచంద్రులు కలిశారా?
‘కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చి తీరతాయి. రకరకాల కూటములు, కొత్త ఫ్రంట్‌లు ఏర్పడే అవకాశం ఉంది. భాగస్వామ్య పార్టీలతో విభేదించి కూటములు మారుతుంటారు. ప్రజల పక్షాన ఉన్న వారినే విజయం వరిస్తుంది. రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది పలు కష్టనష్టాలకు గురైనా అంతిమంగా సుఖశాంతులు పొందుతారు. ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రానికి కొత్తేమీ కాదు.. అయితే రాష్ట్రానికి ఇబ్బందులు అంతగా ఉండవు. గ్రహ గతుల ప్రకారం సూర్యచంద్రులు కలిస్తే అమావాస్య(చీకటి) వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి సూర్యచంద్రులు కలిసి పోయారా? అన్నట్లుగా ఉంది. సూర్యచంద్రులు సమదూరంలో ఉంటే పౌర్ణమి వస్తుంది. అది అందరికీ ఆహ్లాదకరమైనది. ప్రజలంతా సాధారణ ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అమావాస్యను ఎంత కాలం భరించాలి? పౌర్ణమి రావాలని కోరుకుంటున్నారు.

ప్రజలు చల్లగా ఉండాలి: విజయమ్మ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉగాది పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. తాము ఎపుడైనా ఇల్లు మారాల్సి వచ్చినపుడు ఉగాది పండుగ తరువాత వచ్చే శుభప్రదమైన రోజున మారదామని వైఎస్ చెప్పేవారన్నారు. విజయనామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరిగి చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సూర్యచంద్రులు కలిసి పోయినట్లుగా ఉన్నారని... కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న చీకటి పాలన మాదిరిగా పరిస్థితి ఉందన్నారు. విజయమ్మ తొలుత జ్యోతి వెలిగించి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. ఎన్ని కష్టాల్లో ఉన్నా విజయమ్మ ప్రజల కోసం తపన పడటాన్ని ఆమెకు దగ్గరగా ఉండే తమలాంటి వారు చూసి ఆవేదన చెందుతుంటామని కానీ ఆమె మాత్రం నిబ్బరంగా ఉంటారని శోభ అన్నారు. జగన్ బయట ఉంటే ఉగాది ఇంకా ఆనందోత్సాహాలతో జరుపుకునే వాళ్లమన్నారు. తాను జగన్‌ను కలిసినప్పుడల్లా ప్రజల కోసం పోరాటాలు చేయాలని చెబుతున్నారని తెలిపారు. తొలుత విజయమ్మ జ్యోతి వెలిగించి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు.

పూలేకు నివాళులు...
మహాత్మా జ్యోతిరావ్ పూలే 186వ జయంతి సందర్భంగా విజయమ్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మహాత్మా అని పేరు గాంచిన వారు ఇద్దరేనని, వారిలో ఒకరు గాంధీ మహాత్ములైతే, మరొకరు పూలే అని అన్నారు. గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడితే, పూలే సామాజిక స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అన్నారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన పూలే మహిళా విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన సతీమణి తొలి మహిళా ఉపాధ్యాయిని కావడం విశేషమన్నారు. వైఎస్ 2009 ఏప్రిల్ 11న తొలిసారిగా పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నల్లా సూర్యప్రకాష్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఏ.సోమయాజులు, సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్, అధికార ప్రతినిధి ఆర్.కె.రోజా, బి.జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోన రఘుపతి, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

‘నూతన ఏడాది పేరు ‘విజయ’ నామ సంవత్సరం. వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలి పేరులోనే విజయం ఉంది. ఆమె నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. కార్యకర్తలు చేయాల్సిందల్లా ఇతోధికంగా ఆమెకు మద్దతు ప్రకటించడమే. అందరినీ కలుపుకొని పోయే ఉదారగుణం విజయమ్మ, జగన్, షర్మిలకు ఉంది. అందుకే గుడివాడ, బెజవాడలలో పాదయాత్ర సభలకు జనం పోటెత్తుతున్నారు. షర్మిల పాదయాత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది.
- మారేపల్లి రామచంద్రశాస్త్రి, ప్రముఖ సిద్ధాంతి

Sharmila fire on congress and TDP

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 118వ రోజు శుక్రవారం మొర్సపూడి నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. తుక్కులూరు వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం నూజివీడు వరకు పాదయాత్ర, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని, అక్కడే షర్మిల రాత్రి బసచేస్తారని వారు వివరించారు. 

పర్యటించే ప్రాంతాలు
మొర్సపూడి, తుక్కులూరు, నూజివీడు

వేమూరులో గడపగడపకు వైఎస్ఆర్‌సీపీ!

Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013

రెండో విడత గడపగడపకు వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాన్ని ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున ప్రారంభించారు. గుంటూరు ఙల్లా వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలులో నిర్వహించిన గడపగడపకు వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు,నేతలు పార్టీ అభిమానులు హాజరయ్యారు. 

తెనాలి(గుంటూరు): కుమార్తెను కీచకుల బారి నుంచి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన కాంత సునీల కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ పరామర్శించారు. మహిళలకు, దళితులకు రక్షణ లేకపోతే సమాజం గొడ్డుపోతుందని ఆయనీ సందర్భంగా అన్నారు. 

రాజన్న రాజ్యంలో రైతే రాజు: షర్మిల

రాబోయే రాజన్నరాజ్యంలో రైతే రాజు అని షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు మానే అవసరం ఉండదని, వృద్ధులకు 700 రూపాయలు, వికలాంగులకు 1000 పింఛన్‌ ఇస్తామన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని, కాబోయే సీఎం జగనన్నే గొల్లపల్లిలో షర్మిల అన్నారు. 

Ugadi Celebrations at YSR Congress party office

ఈ విజయనామ సంవత్సరం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ...

ఈరోజు ఉగాది. ఈ కొత్త సంవత్సరం ప్రజలకు దేవుని దయ, సుఖసంతోషాలు, సిరిసంపదలు, సకలవిధములైన సౌభాగ్యాలు చేకూరునుగాక అని జగన్, నేను ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం. ఈ సంవత్సరం న్యాయానికి, వెలుగుకు, మంచితనానికి, మానవత్వానికి, నిజాయితీకి, విశ్వసనీయతకు విజయం చేకూరునుగాక అని మేము ఆకాంక్షిస్తున్నాము.

గత మూడున్నర సంవత్సరాలుగా అనగా సెప్టెంబర్ 2009 నుండి రాష్ట్రం అనుభవిస్తున్న విపరీత పరిస్థితుల నుండి ఈ సంవత్సరం రాష్ట్రానికి విడుదల కలుగును గాక అని జగన్, నేను కోరుకుంటున్నాము. 2004 నుండి 2009 వరకు రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా, సస్యశ్యామలంగా, కళకళలాడుతూ ఉండింది. దీనికి ప్రజలే సాక్షి.

సరిపడా వర్షాలు, సమృద్ధిగా నీళ్లు, అవసరమైనంత కరెంటు, రైతులకు గిట్టుబాటు ధరలు, విద్యార్థులకు సమయానికి పరీక్షలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, అందరికీ అందుబాటులో ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యం, పార్టీలకు అతీతంగా ఆరోగ్య అవసరాలు గలవారికి సిఎం రిలీఫ్ ఫండ్, 108, 104, ప్రతిఒక్క కుటుంబానికి సొంత ఇల్లు, వృద్ధులకు పెన్షన్, ఆడవాళ్లకు పావలా వడ్డీ, రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచిత విద్యుత్తు, ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిన భరోసా, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, అదుపులో వున్న ద్రవ్యోల్బణం నడుమ నడిచిన పాలన, నిజంగా రాజశేఖరరెడ్డి గారి పాలన దేవుని చేత సంపూర్ణంగా ఆశీర్వదించబడిన పాలన. అటువంటి నాయకుని పాలనలో పయనించడం రాష్ట్రం యొక్క సుసౌభాగ్యం.

మనందరి దురదృష్టవశాత్తు అటువంటి మహానేతని, ఆయన నాయకత్వాన్ని మనమందరం పోగొట్టుకున్నాం. ఆయన మరణవార్త ఇంకా కుదుటపడకముందే వరదలు, ప్రత్యేక, సమైక్య రాష్ట్ర ఉద్యమాలు, కరువులు, ఆందోళనలు, కరెంటు కోతలు, తాగునీటి, సాగునీటి కొరత... ఇలా రకరకాల సమస్యలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వీటిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో అవ్వ తాతల దగ్గర నుండి ఎల్‌కెజి పిల్లల వరకు ఈ నాయకత్వ వైఫల్యం యొక్క ఫలితాన్ని చవిచూడవలసి వచ్చింది. అటు వర్షాలు పడక, ఇటు కరెంటు లేక వ్యవసాయరంగం మూలుగుతూ వుంటే మరోవైపు పెరుగుతున్న ధరలు, రాజకీయ అనిశ్చితి, కరెంటు కష్టాలతోపాటు సీబీఐ కేసుల పేరుతో వ్యాపారవేత్తలను పీడించడంతో పారిశ్రామికరంగం ఇతర రాష్ట్రాలకు తరలివెళుతూ వుంది. దాంతో మన యువతకు వచ్చే ఉద్యోగాలు కూడా తరలివెళ్లాయి. 2009 నుండి నేటివరకు జరిగిన ఈ రాష్ట్ర తిరోగతికి ప్రజలే సాక్షి!

ఇదిలావుంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, దాని నాయకుడు చందబాబు... ప్రజలు తన మీద నమ్మకం ఉంచి ఇచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అవిశ్వాస సమయాలలో బేరానికి పెట్టి, ఈ ప్రభుత్వ వైఫల్యాలలో తన వంతు భాగం పంచుకుంటూ, సహాయసహకారాలు అందిస్తున్నారు. దీనికి ప్రజలే సాక్షి!

ఈ ఉగాది పర్వదినాన ప్రతి కుటుంబం ఆ దేవదేవుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ధనధాన్యాలతో దీవింపబడాలని, మన రాష్ట్రం అన్ని రంగాలలో మంచి నాయకత్వం కింద త్వరితగతిని అభివృద్ధి, సంక్షేమ పథంలో తిరిగి నడవాలని పూర్ణ మనస్సుతో, జగన్, నేను దేవుని వేడుకుంటున్నాము.


- వైఎస్ భారతి
w/
o వైఎస్ జగన్

ఎన్టీఆర్‌కు విలువలే లేవన్నావు

- ఇప్పుడు యుగపురుషుడని ప్రశంసిస్తున్నావు
- చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత జనక్ ప్రసాద్ ధ్వజం

 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్‌ను యుగపురుషుడు, కారణజన్ముడంటూ పాదయాత్రలో పొగుడుతున్న చంద్రబాబు 1995లో ఆయన గురించి ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ సూచించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం నుంచి దించేసినప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటి? వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన ఘటనలు తెలుగు ప్రజలు మరిచిపోయారని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ‘ఇండియాటుడే’ ప్రతినిధి అమర్‌నాథ్ కె.మీనన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఏం మాట్లాడారో బాబు గుర్తుచేసుకోవాలన్నారు. ‘ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవన్నావ్. తెలుగుదేశం పార్టీ అసలు ఎన్టీఆర్‌దే కాదన్నావ్. పార్టీతో సంబంధంలేద న్నావ్. ఆయనకు మతిస్థిమితం లేదంటూ పార్టీ సభ్యత్వ పుస్తకాల్లో ఎన్టీఆర్ బొమ్మను తొలగించింది నీవు కాదా?’ అని ప్రశ్నించారు. తండ్రిని జైల్లో పెట్టి అధికారం కోసం సోదరుల్ని చంపించిన జౌరంగజేబు కంటే నీచుడు చంద్రబాబని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను జనక్‌ప్రసాద్ గుర్తుచేశారు.

ఒక్క మంచి పనైనా చేశావా?
మహానేత వైఎస్ అందించిన సువర్ణ పాలన వల్ల పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, అది జీర్ణించుకోలేక చంద్రబాబు అనునిత్యం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బాబు తన హయాంలో ఒక్క మంచి పనైనా చేశారా? అని ప్రశ్నించారు.

‘ఒక్క ప్రాజెక్టు కట్టావా? ఆరోగ్యశ్రీ లాంటి పథకం తెచ్చావా? 108 సర్వీసులు పెట్టావా? మహారాష్ట్ర, కర్ణాటక ఇష్టమొచ్చినట్టు డ్యాములు కడుతుంటే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి నిద్రపోయిన మాట వాస్తవం కాదా? మీ నిర్వాకం వల్లే రాష్ట్రంలో 15వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటం వాస్తవం కాదా’ అని ఎండగట్టారు. ఇలాంటి వ్యక్తికి వైఎస్‌ను విమర్శించే అర్హతలేదన్నారు. నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్న చంద్రబాబు కుమారుడు లోకేష్ బాగోతాలను బయటపెడితే మహిళలు చీపుర్లు పట్టుకొని వెంటపడి తరిమి కొడతారని హెచ్చరించారు. సంస్కారం ఉంది కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్లటం లేదన్నారు.

హోంమంత్రి ప్రభావితం చేయరా ?

* సాక్షులను ప్రభావితం చేస్తారంటూ జగన్‌ను పది నెలలుగా జైల్లో పెట్టారు
* సీబీఐ చార్జిషీట్లో హోం మంత్రి సబిత, మరో మంత్రి ధర్మాన పేర్లూ చేర్చారు
* సాక్షులను ప్రభావితం చేసే అవకాశం హోంమంత్రికి ఉంటుందా.. ఎంపీకి ఉంటుందా?
* మంత్రులను బయట వదిలి.. ఎంపీని ఎందుకు జైల్లో పెట్టారు?
* మంత్రులు కాంగ్రెస్‌లో ఉన్నారని.. ఆ పార్టీని జగన్ వ్యతిరేకిస్తున్నారనేనా?
* ఈ ప్రభుత్వం యువతను మద్యం మత్తులో ముంచుతోంది.. తెనాలి ఘటన దీనికి పరాకాష్ట
* చంద్రబాబు మద్దతు వల్లే ఈ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది 

 ‘‘జగనన్న బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ పది నెలలుగా జైల్లో పెట్టారు. ఇప్పుడు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు, అంతకుముందు మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు చేర్చారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం హోంమంత్రికి, మరో మంత్రికి ఉంటుందా? ఒక సాధారణ ఎంపీకి ఉంటుందా? సీబీఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేయగలిగే మంత్రులను బయట వదిలి.. ఒక సాధారణ ఎంపీ అయిన జగన్‌ను ఎందుకు జైలులో పెట్టారు? మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు... జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడు గనుకేనా?’’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సీబీఐపై నిప్పులు చెరిగారు. 

‘‘జగనన్న విషయంలో సీబీఐ చెబుతున్న చందమామ కథలు ప్రజలు నమ్మేస్థితిలో లేరు. రాజకీయంగా పతనం చేయడానికే జగన్‌ను అరెస్టు చేశారు. ఈ పాపం ఊరికే పోదు. ఈ కుట్రలు పన్నిన వారు ఇంతకు ఇంత అనుభవిస్తారు’’ అని షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కయిన టీడీపీ అధినేతచంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాగిం ది. హనుమాన్ జంక్షన్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. 

కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మ..
‘‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని వాడుకుని జగనన్నను జైలు పాలు చేసింది. సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని స్వయంగా సీబీఐ మాజీ డెరైక్టర్ జోగీందర్ సింగ్ చెప్పారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ తాము గత్యంతరం లేక కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నామని, ఆ పార్టీని వ్యతిరేకిస్తే వేయి పడగలతో కాటేస్తుందని, సీబీఐని ఉసిగొల్పుతుందని చెప్పారు. సీబీఐ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరమా? జగనన్నపై ఇన్ని ఆరోపణలు చేసిన సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపలేదు.

తెనాలి సంఘటన బాధాకరం..
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఉగాది పండుగకు బట్టలు కూడా కొనుక్కునే పరిస్థితిలో లేమని, ఫలహారం చేసుకునే పరిస్థితి కూడా లేదని మహిళలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కుంటుపడింది. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది. ప్రభుత్వం పక్కా ఇళ్లకు పాడికట్టింది. అయితే ఒక్క మద్యం మాత్రం పుష్కలంగా ఏరులై పారుతోంది. తెనాలిలో నలుగురు యువకులు తాగిన మైకంలో ఒక అమ్మాయిని వేధిస్తుండగా.. ఆ అమ్మాయి తల్లి అడ్డుపడితే లారీ కిందకు తోసేసినట్లు పత్రికల్లో చదివాను. మద్యం మత్తులో యువత ఎంత చెడిపోతుందో, కుటుంబాలు ఎంత చితికిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

గ్రామాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. బెల్టుషాపులు తీసేసి పుణ్యం కట్టుకో అక్కా అని ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు మొరపెట్టుకుంటున్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే.. ఈ ఏడాది జనంతో 15 శాతం అదనంగా తాగించడానికి మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను నాశనం చేసేవారిని పాలకులు అంటారా? రాక్షసులు అంటారా? చంద్రబాబు అధికారంలోకి వస్తే మద్యం సరసమైన ధరలకు అమ్మిస్తారట. ఇలాంటి పెద్దమనుషులు మన నాయకులు. మహాత్మా గాంధీ తమ సొంతమని, తమకు ఆదర్శమని, ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్ ఒక మద్యం మాఫియా డాన్‌ను ఈ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ విలువలు ఎంత దిగజారిపోయాయో అర్థమవుతోంది.

ఇక్కడి నుంచే ఉచిత విద్యుత్ వాగ్దానం చేశారు
వైఎస్ రాజశేఖరరెడ్డి 1999లో ఇక్కడి(హనుమాన్ జంక్షన్) నుంచే ఉచిత విద్యుత్ వాగ్దానం చేశారు. మద్దతు ధర కోసం ఇక్కడ నుంచే ఉద్యమం చేశారు. ఆయన బతికి ఉంటే రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. ఆయన రెక్కల కష్టంతో అధికారం చేపట్టిన ఈ కాంగ్రెస్ నాయకులు.. ఆయన వాగ్దానం చేసిన తొమ్మిది గంటలు కాదు కదా మూడు గంటల విద్యుత్ కూడా రైతులకు ఉచితంగా ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నారు. అది కూడా తేళ్లు, పాములు తిరిగే రాత్రి సమయాల్లో ఇస్తున్నారు. గ్రామాల్లో నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. 

లేని కరెంట్‌కు మూడింతల బిల్లులు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కరెంట్ నిల్ - బిల్ ఫుల్ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉంది. విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై ఏకంగా 32 వేల కోట్ల రూపాయల భారం వేసింది. వ్యాట్ పేరుతో మరో పది వేల కోట్ల రూపాయల భారం వేసింది. ఇంత ధైర్యంగా ప్రజలను ఈ ప్రభుత్వం వేధిస్తోందీ అంటే దీనికి కారణం చంద్రబాబు అండగా ఉండడమే. ఎమ్మార్, ఐఎంజీ కేసులు బయటకు రాకుండా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికి ఉంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయేది. అదే జరిగితే ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడేది కాదు.’’

13.4 కిలోమీటర్లు సాగిన యాత్ర..
పాదయాత్ర 116వ రోజు బుధవారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను నుంచి ప్రారంభమైంది. ఇక్కడ రచ్చబండ నిర్వహించి స్థానికుల సమస్యలు తెలుసుకున్న అనంతరం షర్మిల నడుచుకుంటూ కానుమోలు, పెరికిడి మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకున్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బుధవారం మొత్తం 13.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ మొత్తం 1,573.2 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. అంతకుముందు ఆరుగొలనులో వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గోసుల శివభరత్‌రెడ్డి నేతృత్వంలో పలువురు డాక్టర్లు, వైద్య విద్యార్థులు, 104, 108 ఉద్యోగులు షర్మిలను కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. 

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని, టి. బాలరాజు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకా ప్రతాప అప్పారావు, ముసునూరి రత్నబోస్, జేష్ట రమేష్‌బాబు, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి, కుక్కల నాగేశ్వరరావు, ఉప్పులేటి కల్పన, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వసంత నాగేశ్వరరావు, స్థానిక నాయకులు దుట్టా రామచంద్రరావు తదితరులున్నారు.

ఉగాది శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు షర్మిల ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సరాదిని అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

ఎన్నో కుట్రలు, మరెన్నో కుయుక్తులు...

కేసులకు భయపడి...
హైదరాబాద్‌లో అతి విలువైన భూములను ఐఎంజీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టిన కుంభకోణం, ఎమ్మార్ కేసు చంద్రబాబును నీడలా వెన్నాడుతున్నాయి. ఆయన కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించడానికి ఈ కేసుల భయం కూడా కారణమని టీడీపీ వర్గాలే అంటుంటాయి. ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్న ఎమ్మార్ వ్యవహారానికి సంబంధించి అసలు ఒప్పందం కుదిరింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే! ఆయన దగ్గరుండి మరీ ఆ ఒప్పందం కుదిర్చారు. అయినప్పటికీ ఎమ్మార్ కేసును విచారిస్తున్న సీబీఐ మాత్రం ఆ కేసులో ఏనాడూ బాబు జోలికి వెళ్లలేదు. ఆయనను కనీసం విచారించలేదు. అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీకి 850 ఎకరాల విలువైన భూములను బాబు కారుచౌకగా కట్టబెట్టారు. ఈ కేసుల్లో ఇరుక్కోకుండా ఉండేందుకే ఆయన కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారన్న వాదనలున్నాయి. తనపై విచారణ జరగకుండా ‘మేనేజ్’ చేసుకునేందుకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బాబు గట్టిగా నిలబడలేకపోతున్నారని అంటున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరికి రూ.200 కోట్లు బదిలీ చేశానని గుర్రాల వ్యాపారి హసన్ అలీ వాంగ్మూలమిచ్చిన ఉదంతాన్ని కూడా ఈ సందర్భంలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ జరిపిన దర్యాప్తు వివరాలేవీ బయటికి పొక్కకపోవడం వంటి పలు ఉదంతాలు పై వాదనలకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. 

సర్కారు పడిపోకుండా అ‘విశ్వాసం’...
ఉప ఎన్నికలు రాకుండా, అదే సమయంలో ప్రభుత్వం పడిపోకుండా కాంగ్రెస్-టీడీపీ పక్కా అవగాహన మేరకు నడచుకుంటున్నాయి. అవిశ్వాసం పెట్టలేదన్న మచ్చను చెరుపుకునేందుకు తాజాగా బాబు మరో ఎత్తుగడ వేస్తున్నట్టు సమాచారం. దాని ప్రకారం, మే నెలలో ప్రారంభమయ్యే రెండో విడత అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలన్న ప్రణాళికతో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోదన్న నిర్ధారణకు వచ్చాకే ఆ పని చేస్తారని తెలుస్తోంది. ‘ఇటీవల వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 9 మంది కాంగ్రెస్, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశాకైతే ప్రభుత్వ మనుగడకు ఢోకా ఉండదు. ఆ సమయంలో అవిశ్వాసం పెడితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టు ఉంటుంది’ అన్నది వ్యూహమంటున్నారు. పైగా 15 మంది ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు జరిగే ఆస్కారముందని కాంగ్రెస్, టీడీపీ భయపడుతున్నాయి. అందుకే వారిపై వేటు వేసేనాటి నుంచి అసెంబ్లీ కాల పరిమితి ఏడాది లోపు ఉండేలా చూసి ఉప ఎన్నికలను తప్పించుకునే ఆలోచనతో అవి ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. 

వైఎస్ అనంతరం పెనవేసుకున్న బంధం..
వైఎస్ మరణించిన తర్వాత నుంచి కాంగ్రెస్‌కు చంద్రబాబు సన్నిహితమయ్యారన్నది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా జగన్‌పై సీబీఐ విచారణ జరిపించేలా తెరవెనక తతంగం జరిగినప్పటి నుంచి కాంగ్రెస్‌కు ఆయన బలమైన మిత్రునిగా మారారు. అప్పటినుంచీ కాంగ్రెస్‌కు టీడీపీ అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తూనే వస్తోంది...
* కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి టీడీపీ ఏకంగా పోటీకే దూరంగా ఉంది! పైగా టీడీపీ జెడ్పీటీసీలందరినీ కాంగ్రెస్ ఆర్థిక సాయంతో నిర్వహించిన క్యాంపుకు తర లించి మరీ పోలింగ్ రోజు దాకా వారిని ‘కాపాడుకున్నారు’ చంద్రబాబు. వారందరితో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయించారు కూడా! చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి కిరణ్‌తో బాబు చేతులు కలిపారు. టీడీపీ జెడ్పీటీసీల రెండో ప్రాధాన్యతా ఓట్లన్నింటినీ కాంగ్రెస్‌కే వేయించారు.
* ఇలా కడప, చిత్తూరు జిల్లాల్లో కాంగ్రెస్‌కు సహకరించినందుకు బదులుగా అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతలు టీడీపీ అభ్యర్థికి సహకరించారు.
* 2011లో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పరస్పరం రెండో ప్రాధాన్యతా ఓట్లు వేసుకున్నాయి! టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు వేసినట్టు ఓట్ల లెక్కింపులో బయటపడింది.
* బాబు-కిరణ్ పరస్పర సహకార వైఖరి రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ నియామకంలోనూ బట్టబయలైంది. కీలకమైన ఈ పదవికి రాష్ట్ర ప్రముఖులెవరినీ కాదని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన, అది కూడా తెలుగే రాని జస్టిస్ కక్రూ పేరును ప్రభుత్వం ప్రతిపాదిస్తే అందుకు బాబు ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. నిజానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి హెచ్‌ఆర్‌సీ చైర్మన్ పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలూ ఉన్నా ఆయన్ను ‘విస్మరించారు’!
* ఇక సమాచార హక్కు కమిషనర్ల (ఆర్టీఐ) నియామకంలోనూ కిరణ్‌కు బాబు అండగా నిలిచారు. ఏకంగా ఎనిమిది మంది కమిషనర్ల నియామకానికి ప్రతిపాదిస్తే ఒక్కరి విషయంలోనూ చంద్రబాబు అసమ్మతి కూడా వ్యక్తం చేయలేదు. పైగా ఆ జాబితాపై సాక్షాత్తూ గవర్నరే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు కూడా బాబు కనీసం నోరు విప్పలేదు.
* చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐల పరిమితి పెంపు నిర్ణయంపైనా బాబు ఇలాగే వ్యవహరించారు. ఆ నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తుందని ప్రకటించి కూడా... రాజ్యసభలో ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరవడం ద్వారా యూపీఏకు అనుకూలంగా వ్యవహరించినా పట్టించుకోలేదు!
* 2012 మేలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా టీడీపీ బాహాటంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది. తమకు గట్టి పట్టుందని చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లోని రామచంద్రపురం, నరసాపురం నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లన్నింటినీ గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థులకు వేయించారు. ఫలితంగా ఆ స్థానాల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు ఆ పార్టీకి అక్కడున్న క్రియాశీలక సభ్యుల సంఖ్య కంటే కూడా తగ్గాయి. దాంతో పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓడించడానికి ఆరు చోట్ల కాంగ్రెస్-టీడీపీ పరస్పరం సహకరించుకున్నాయి.
* సమగ్ర విధానం రూపొందించాకే పరిశ్రమలకు భూ కేటాయింపులుంటాయని అసెంబ్లీలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా కర్నూలు జిల్లాలో ప్రిజమ్ సిమెంట్స్‌కు వెయ్యెకరాలను తక్కువ ధరకే కట్టబెట్టినా బాబు కిమ్మనలేదు.
* రోశయ్య హయాంలో హైదరాబాద్‌నడిబొడ్డున అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో రూ.200 కోట్ల పైగా విలువైన 9.14 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కూడా, నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని మరీ బాబుకు అతి సన్నిహితుడైన జీఎన్ నాయుడుకు కేటాయించింది!

* అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం మలపనగుడి అటవీ ప్రాంతంలోని అత్యంత విలువైన 25 హెక్టార్ల ఓబుళాపురం గనులను చంద్రబాబుకు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు అతి సన్నిహితుడైన వ్యక్తికి చెందిన ఎస్‌ఆర్ మినరల్స్ సంస్థకు ధారాదత్తం చేయాలని కిరణ్ సర్కారు నిర్ణయించింది! అందుకోసం ప్రభుత్వ రంగంలోని ఏపీఎండీసీ నోట్లోనే మట్టి కొట్టింది. ఆ గనుల లీజును ఏపీఎండీసీకే ఇవ్వాలని 2005లో వైఎస్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం తోసిరాజంది. ఇందుకోసం.. అటవీ అనుమతులు తెచ్చుకోవడంలో ఏపీఎండీసీ శ్రద్ధ చూపడం లేదంటూ కుంటిసాకులను తెరపైకి తెచ్చింది. ఆ కారణంగా మీ దరఖాస్తును ఎందుకు తిరస్కరించరాదంటూ ఏపీఎండీసీకి నోటీసులు కూడా ఇచ్చింది. తమ ప్రయత్న లోపం లేదని సంస్థ మొత్తుకున్నా విన్పించుకోలేదు. అసలు ఒక ప్రభుత్వ రంగ సంస్థకు అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత తనదేనన్న వాస్తవాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ‘విస్మరించింది’! 

అవిశ్వాసంలో దోబూచులాట...
అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌చేస్తే, ‘ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు. ఒకరు చెబితే పెట్టాలా?’ అంటూ కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమయ్యే దాకా కాలయాపన చేసి, ప్రభుత్వం పడిపోదని రూఢీ చేసుకున్నాక మాత్రమే అవిశ్వాసం ప్రతిపాదించడం బహిరంగ రహస్యమే. ఇక తాజాగా వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం సందర్భంగానైతే మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాబు స్వయంగా గట్టెక్కించారు.

కరెంటు చార్జీలు, ఆర్టీసీ వడ్డన, భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, ఆధార్ గందరగోళం, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, మంచినీటి కొరత, గిట్టుబాటు ధరల లేమి, హామీల అమలులో వైఫల్యం... ఇలా అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనా ప్రధాన ప్రతిపక్ష నాయకునిలో చలనమైనా లేకపోవడం చరిత్రలో బాబుకు ముందు ఎప్పుడూ లేదు! పైగా ప్రభుత్వాన్ని నిలదీయాలని, పడగొట్టాలని విపక్షాలన్నీ కోరినా ‘తటస్థ వైఖరి’ మాటున ప్రభుత్వాన్ని బాహాటంగా గట్టెక్కించారు. ప్రభుత్వం మైనారిటీలో పడినట్టు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌తో స్పష్టమైనా, కేవలం బాబు నిస్సిగ్గు నిర్ణయమే కాంగ్రెస్‌కు శ్రీరామరక్షగా మారింది. 

‘మూడో’ శక్తి ఉండొద్దు!
రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలన్న లాలూచీ రాజకీయ అవగాహన కాంగ్రెస్, టీడీపీల వైఖరిలో కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. ‘అయితే కాంగ్రెస్, లేదంటే టీడీపీ మాత్రమే’ అధికారంలో ఉండాలనే అంతర్గత అవగాహనతో అవి ‘ముందుకెళ్తున్నాయి’. మూడో ప్రత్యామ్నాయంగా మరో పార్టీ ఎదిగితే తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని భయపడుతున్నాయి. ఆ దుస్థితిని ఎలాగైనా తప్పించుకునేందుకు ఎంతటి నైచ్యానికైనా అవి వెనుదీయడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టయి 10 నెలలు దాటుతున్నా, ఆయనకు బెయిలు రాదని చంద్రబాబు పదేపదే చెబుతుండటం కూడా ఇరు పార్టీల కుట్రకు అద్దం పడుతోంది. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి, వారి సంక్షేమాన్ని గాలికొదిలి కేవలం మనుగడే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ రాజకీయ జూదమాడుతున్నాయి. 

బాబుకు భలే ప్రతిఫలం...
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీకి సారథిగా ఉంటూ కూడా... మూడేళ్లుగా ఆ పార్టీతో అంటకాగుతున్నందుకు బాబుకు మంచి ప్రతిఫలమే లభించింది.
* ఏ కేసూ బాబు మెడకు చుట్టుకోలేదంటే కాంగ్రెస్ పెద్దల అండదండల వల్లేనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది
* ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ ముందు సాక్షిగా జగన్‌విచారణకు హాజరైనప్పుడు, ఆ గనులను కేటాయించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని రుజువు చేసే జీవోను ఆయన అధికారులకు అందజేశారు. అదే విషయాన్ని బయట మీడియాకు కూడా చెప్పారు. దానిపై సీబీఐ ఆగమేఘాల మీద స్పందించింది! దాని పూర్వాపరాలేంటో తెలుసుకోకుండానే, కనీసం విచారణ కూడా చేయకుండానే, ఈ వ్యవహారంతో బాబుకు ఎలాంటి సంబంధమూ లేదంటూ కొన్ని గంటల్లోనే క్లీన్‌చిట్ ఇచ్చేసింది. తర్వాత కూడా ఏనాడూ బాబును విచారించేందుకు కూడా సీబీఐ సాహసం చేయలేదంటే, అప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో ఆయన మంచి ‘టచ్’లో ఉండటమే కారణమంటారు.
* ఎమ్మార్ కేసులో ఒప్పందం కుదిరిన నాడు ఏం జరిగిందో తేలాలంటే బాబును విచారించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తమైనా సీబీఐ ఆ ప్రయత్నమే చేయలేదు.
* కాంగ్రెస్‌తో లాలూచీకి బాబు పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయని అధికార వర్గాలే చెబుతున్నాయి. బాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ టీడీపీ నేత, కాంట్రాక్టర్‌కు అగమేఘాలపై రూ. 200 కోట్ల బిల్లులు మంజూరవడం అప్పట్లో ఓ సంచలనం. 

ఎన్నో కుట్రలు, మరెన్నో కుయుక్తులు...
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ కలిసి ఆయనను అప్రతిష్టపాలు చేయడానికి పన్నిన కుట్రలు, కుయుక్తులకు లెక్కే లేదు! వైఎస్ కుటుంబాన్ని ప్రజా క్షేత్రంలో, రాజకీయంగా దెబ్బ తీయడం అసాధ్యమని తేలిపోవడం వల్లే ఇలాంటి కుట్రలకు తెర తీశారు.
* కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో పిటిషన్ వేసీ వేయగానే బాబు కూడా తన మనుషులతో జగన్‌పై మరో పిటిషన్ వేయించారు. రెండు పిటిషన్లలోనూ ఒకే పత్రాలున్న వైనం.. వాటి కుమ్మక్కును వద్దన్నా పట్టించేసింది! పైగా ఆ పత్రాలన్నీ సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం నుంచి టీడీపీ సేకరించినవేనని కూడా తేలిపోయింది.
* వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలోనేమో... విచారణ జరపాలంటూ హైకోర్టు తీర్పు వచ్చీ రాగానే సీబీఐ ఆగమేఘాలపై 30 బృందాలను ఏర్పాటు చేసి మరీ యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. కానీ బాబు అక్రమార్జనపై విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించినప్పుడు మాత్రం అదే సీబీఐ ‘సిబ్బంది లేమి’ సాకు చూపింది. బాబు స్టే తెచ్చుకునేదాకా తాత్సారం చేసింది. అప్పటికే ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో బాబు సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడంతో ఆయనపై ఈగ కూడా వాలలేదు.
* ఒకపక్క సీబీఐ విచారణ సాగుతుండగానే మరోపక్కన బాబు తన మనుషులను ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రం ఇప్పించిన గంటల్లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ స్పందించి, జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఉత్తర్వులిచ్చింది. 

‘ఢిల్లీ’లో గుసగుసలు...!
ప్రజా సమస్యలపై కేంద్రంతో మాట్లాడే సాకుతో ఢిల్లీ వెళ్లడం, ప్రభుత్వ పెద్దలతో ఏకాంతంగా భేటీ అవడం బాబుకు పరిపాటిగా మారింది.
* టీడీపీ నేతలతో పాటుగా ప్రధానిని కలిసిన బాబు, వారందరినీ కనుసైగతో బయటికి పంపి తాను ఏకాంతంగా ముచ్చటించారు
* జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడానికి ఒకరోజు ముందు కూడా బాబు ఢిల్లీలో అత్యంత గోప్యంగా అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరంతో చీకట్లో భేటీ అయ్యారు. చాలాకాలం తర్వాత స్వయంగా చిదంబరమే ఈ రహస్యాన్ని లోక్‌సభ సాక్షిగా బయటపెట్టారు!
* పీఆర్పీ విలీనానికిముందు అవిశ్వాస తీర్మానం డిమాండ్ వచ్చినప్పుడు, అలా చేయబోనని, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చూస్తానని సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌కు బాబు ఫోన్ చేసి మరీ హామీ ఇచ్చిన విషయం పత్రికల్లో వచ్చింది!

Popular Posts

Topics :