14 April 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జిఓ ఇచ్చిన మంత్రులు బయట- జగన్ జైల్లో!

Written By news on Saturday, April 20, 2013 | 4/20/2013

జిఓలు ఇచ్చిన మంత్రులను బయటపెట్టి, వాటితో ఏ సంబంధం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని అరెస్ట్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. 26 జిఓలకు మొత్తం మంత్రి మండలి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. బయ్యారం గనుల విషయంలో ఎల్లోమీడియా అసత్యప్రచారం చేస్తోందని చెప్పారు. జగన్ కు, ఓఎంసి యజమాని గాలి జనార్దన రెడ్డికి సంబంధం ఉందని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈనాడు రాగం, సీబీఐ తాళం, ఈడీ పల్లవి పాడుతున్నాయని విమర్శించారు. విచారణ సంస్థలు ఎల్లో మీడియాతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీడీపీ ఆరోపణలనే ఈనాడు ప్రచురిస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. ఈనాడు ప్రచురించిన వార్తలనే సీబీఐ, ఈడీ అధికారులు సైతం వల్లిస్తున్నారన్నారు. 

జగన్ బయటకు రాకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర మంత్రి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఇండియాటుడే సర్వే ఇచ్చిందని, ఆ సర్వేను ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో ఎందుకు ప్రచురించలేదని ఆయన ప్రశ్నించారు. టైమ్స్ నౌ సర్వేను మాత్రమే ఎందుకు ప్రచురించారని ఆయన అడిగారు. ఎల్లోమీడియాతో సర్వే నిర్వహించేందుకు సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. 

బయ్యారం గనుల లీజ్ రద్దు చేసింది తానేనని చెప్పారు. ఓబుళాపురం గనుల పర్మిట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. అందుకే వాటిని రద్దు చేశాం, దీనిపై టీడీపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. జిఓలు ఇచ్చిన మంత్రులను బయటపెట్టి, సంబంధం లేని జగన్ ను అరెస్ట్ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్ ను అరెస్ట్ చేసేవారా? అని ప్రశ్నించారు. మంత్రులు చేతకానితనంతో మాట్లాడుతున్నారన్నారు. బయ్యారం గనుల విలువ 14 లక్షల కోట్ల రూపాయల విలువ ఉంటుందని టీడీపీ ప్రచారం చేస్తోందని, 7 లక్షల కోట్ల రూపాయలకు ఆ గనులను టీడీపీనే తీసుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. జగన్ ఏ రోజు మంత్రులతో మాట్లాడింది లేదని ఆయన చెప్పారు. గాలి జనార్దన రెడ్డితో వైఎస్ జగన్ కు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. జగన్ ను ఇరికించేందుకు ఎల్లోమీడియా కుట్ర పన్నిందని చెప్పారు.

టీడీపీని కాంగ్రెస్‌కు అమ్మేశారు: షర్మిల

 వైఎస్‌ హయాంలో రైతు రాజులా బతికాడని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. రైతు పంట కోల్పోతే వైఎస్ నష్టపరిహారం అందించారని, రూ.12వేల కోట్ల రుణమాపీ చేశారని గుర్తు చేశారు. టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్‌కు అమ్మేశారని, అందుకే ప్రజలపై రూ. 30వేల కోట్ల కరెంట్ భారం వేసినా నోరు మెదపడం లేదని ఆరోపించారు. హిట్లర్, చంద్రబాబు పుట్టిన తేదీ ఒక్కటేనని, అందుకే ఇద్దరి ఆలోచనలకు దగ్గరి పోలికలున్నాయని అన్నారు. 

మొదట చంద్రబాబు జగన్‌పై ఆరోపణలు చేస్తారని, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్‌ ఐటెంగా ప్రకటిస్తాయని చెప్పారు. దాన్ని కాంగ్రెస్ అందుకొని వంతపాడుతుందని అన్నారు. ఆ తర్వాత ఈడీ, సీబీఐలు కోర్టులో ఇదే వాదనలు వినిపిస్తాయని అన్నారు. జగన్‌ను ఆపే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదని షర్మిల అన్నారు.

మే 5న బాపట్లలో వైఎస్సార్ సీపీ సదస్సు

బాపట్లలో మే 5న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మహిళ సదస్సు నిర్వహించనున్నట్టు పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశీల రఘురాం, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్‌ తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర మహిళ నేతలు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ఈ సదస్సులో చర్చిస్తారని తెలిపారు.

బెల్ట్ షాపులను తొలగిస్తాం: షర్మిల

మక్కపేట: కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వానికి చంద్రబాబు అమ్ముడుపోయారని షర్మిల ఆరోపించారు. వీరికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు. మరోప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మక్కపేటలో జరిగిన బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. జగనన్న సీఎం అయ్యాక వైఎస్‌ఆర్ ఆశయాలను నిజం చేస్తారని హామీయిచ్చారు. బెల్ట్ షాపులను తొలగిస్తారన్నారు. స్కూల్ విద్యార్థికి రూ.500, ఇంటర్ విద్యార్థికి రూ. 700, డిగ్రీ విద్యార్థి రూ.వేయి అకౌంట్‌లో వేస్తారని చెప్పారు.

Krishnamma Odilo 20th Apr 2013

YS Vijayamma condemns delhi rape

YSR Congress party protest for Delhi 5-years-old child rape

ys sharmila protest against delhi rape

Balineni Srinivasa Reddy Press meet 20th April

Balineni Srinivas Reddy fire on congress and TDP

Ramoji yellow media conspiracy on YS Jagan

Sharmila's speech in Penuganchiprolu, Krishna district

రాజ్యాంగ సంస్థల నోటా రామోజీ రాగం

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=61090&Categoryid=1&subcatid=1

*అప్పట్లో ఉప ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డిపై ‘ఈనాడు’ అశ్శరభ శరభ
*టీడీపీ ప్రెస్‌మీట్‌ను ఫుల్‌పేజీ వండిన రామోజీ పత్రిక
*అందులో చేసిన వ్యాఖ్యలనే ప్రాధికార సంస్థ ముందు యథాతథంగా వల్లించిన ఈడీ.. రాంకీ పెట్టుబడుల విషయంలో సీబీఐ బాటలోనే ఈడీ వాదనలు
*అసలు దోషి బాబును వదిలిపెట్టి దర్యాప్తు సంస్థల డ్రామాలు.. జగతి పెట్టుబడిదారుల్లో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందని వారు లేనే లేరన్న ఈడీ.. ఉన్నారంటూ గతంలో సీబీఐ చార్జిషీట్.. వారిని మోసగించి పెట్టుబడి పెట్టించారంటూ వాదన
*జగనే లక్ష్యంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు.. వాస్తవాల్ని ‘సాక్షి’ పరిశోధించి చెప్పినా పట్టించుకోని వైనం
*చట్టం ముందు తమ వాదనలు నిలవవని తెలిసే... దిగజారుడు కథనాలు..
*రామోజీ చెబుతారు... దాన్నే బాబు చెప్పిస్తారు. 
*బాబు చెప్పిస్తారు... దాన్నే రామోజీ ప్రచురిస్తారు.
*మళ్లీ దాన్ని ఎల్లో బాబులంతా అందుకుంటారు. 
*ఇదో సైకిల్. ఇదో విష వలయం.

కానీ ఈ సైకిల్ ఇక్కడితో ఆగటం లేదు. ఇపుడు రామోజీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నే కాకుండా... సీబీఐ ఆఫీసును, ఆఖరికి ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కార్యాలయాన్ని కూడా చుట్టబెట్టేస్తోంది. ఫలితం... బాబు ద్వారా రామోజీ ప్రవచించి, ప్రచురించిన విషపు రాతల్నిపుడు ఈ ఏజెన్సీలు సైతం వల్లిస్తున్నాయి. పెట్టుబడుల కేసులో అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని... వర్గ శత్రువుగా చూస్తున్నాయి. న్యాయాధికారుల ముందు కూడా ఆయనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నాయి. వాటిని మళ్లీ రామోజీ విషపుత్రిక ‘ఈనాడు’, దాని తోకపత్రిక పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్నాయి. అందులో భాగమే.. ‘జగన్.. ఓ గజనీ’ అంటూ న్యాయ ప్రాధికార సంస్థ ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ వాదించటం... దాన్ని ‘ఈనాడు’, తోకపత్రిక అచ్చేయటం. పది నెలల కిందట... అంటే గతేడాది జూన్ 8న తెలుగుదేశం తమ్ముళ్ల చేత పనిగట్టుకుని చెప్పించిన అసత్యాలను రామోజీ తన ‘ఈనాడు’లో ఇదే శీర్షికన అచ్చువేశారు!! అదే విచిత్రం.

విచారణ కూడా ఇంకా మొదలుకాలేదు. కోర్టులకు పూర్తి వాదనలు తెలియనే లేదు. కానీ నాణేనికి ఒకవైపునే చూపించే ఏకపక్ష వాదనల్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్నారు. దర్యాప్తు సంస్థలైతే ఎంపిక చేసుకున్న మీడియాకు మాత్రమే లీకులిస్తున్నాయి. దర్యాప్తు అధికారులు సైతం ఒక వర్గం మీడియాతోనే ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబ పరువుప్రతిష్టల్ని దిగజార్చాలనే ఏక సూత్ర ఎజెండాతో చెలరేగిపోతున్నారు. ఎవరిచ్చారు వీళ్లకి ఆ అధికారాన్ని? న్యాయాన్యాయాల విచక్షణ అనేది వీళ్లకి ఉందా? ఇదెక్కడి న్యాయం?

చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోవాలి కూడా!!. ఆ చట్ట పరిధిలోని ఏజెన్సీలు కూడా వాటి పని అవి చేసుకుపోవాలి. ఒక వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పైనో, మరొకరిపైనో వ్యక్తిగతంగా అవి కక్ష పెంచుకోవాల్సిన పనిలేదు. 

ఆ కక్షతో రాజకీయ ప్రత్యర్థుల మాదిరిగా అవి మాట్లాడాల్సిన పని కూడా లేదు. కానీ ఏడాది కిందట తెలుగుదేశం చెప్పగా రామోజీ ప్రచురించిన మాటలనే ఈడీ అధికారులు బుధవారం యథాతథంగా తిరిగి వల్లించారంటే రామోజీ, బాబు కలిసి పెంచిన మొక్కలు ఎక్కడెక్కడ వేళ్లూనుకుని పోయాయో అనే భయం కలుగకమానదు. ప్రతిసారీ మౌఖిక ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఆ ఆరోపణలకు తగ్గట్టుగా ఎలాంటి వాస్తవ నివేదికలూ సమర్పించటం లేదని, తక్షణం ఆ నివేదికలు సమర్పించాలని ఈడీ అధికారులపై ప్రాధికార సంస్థ ఆగ్రహం చూపిన అంశాన్ని మాత్రం ‘ఈనాడు’ కావాలనే రాసీ రాయనట్టుగా వదిలిపెట్టింది. మరోసారి మౌఖిక వాదనలకు అవకాశమివ్వకుండా... అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని ప్రాధికార సంస్థ ఇచ్చిన ఆదేశాలను కూడా అది పట్టించుకోలేదు. జగన్‌మోహన్ రెడ్డిని ‘గజనీ’తో పోలుస్తూ... ఈడీ అధికారులు చేసిన వ్యాఖ్యల్ని, వారి వాదనలను మాత్రమే పతాక శీర్షికల్లో ప్రచురించింది. మరి ఈ వాదనల్లో నిజమెంత? పస ఎంత? సీబీఐ మాదిరే ఈడీ కూడా ఈ వ్యవహారంలో చంద్రబాబును ఎందుకు వదిలిపెట్టింది? రాంకీ సంస్థకు సింగిల్ టెండరుపై హడావుడిగా భూములు కట్టబెట్టిన దగ్గరి నుంచి గ్రీన్‌బెల్ట్‌పై మినహాయింపులిచ్చేదాకా నాటి సీఎం చంద్రబాబునాయుడి పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అటువైపు చూడటం లేదు? అసలు ఈ వ్యవహారంలో ‘‘ఏది నిజం?’’

ముందుగా ఈడీ అధికారులు చేసిన వాదనల్లోని అంశాలను పరిశీలిద్దాం. 

అవెంత డొల్ల వాదనలో చెప్పటానికి పెద్దగా న్యాయ పరిజ్ఞానం అవసరం లేదు. కాస్త కామన్‌సెన్స్ ఉంటే చాలు!! 

1.వ్యాపార రంగంలో ఏమాత్రం విజయం సాధించని, లాభాలొస్తాయో రావో తెలియని సంస్థల్లో తెలివైన వారెవరూ పెట్టుబడులు పెట్టరు

ఇదీ ఈడీ వాదన. ఇదే నిజమైతే మరి అప్పుడే ప్రారంభమయ్యే సంస్థలకు (స్టార్టప్) నిధులెలా వస్తాయి? ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్ వంటి ఊరూపేరూ లేని సంస్థల్లో(అప్పటికి) ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి వంటి వ్యక్తులు ఎందుకు పెట్టుబడి పెట్టారు? తరవాత వారికి లాభాలెలా వచ్చాయి? బోర్డు కూడా పెట్టని బోల్డన్ని స్టార్టప్ కంపెనీల్లో విదేశీ వెంచర్ క్యాపిటలిస్టులు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? ఒక చక్కని ఆలోచన ఉంటే... అది విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంటే పెట్టుబడిదారులు ముందుకొస్తారనే సంగతి ఈడీలాంటి ఏజెన్సీకి కూడా తెలియదనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ పత్రికా రంగంలో ‘ఈనాడు’కు పోటీగా మరో పత్రికను తెస్తే సక్సెస్ అయ్యే అవకాశాలను జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించటం అబద్ధమా? పత్రిక తేవటం దగ్గర్నుంచి సర్క్యులేషన్ వరకూ ఇప్పటిదాకా ఆయన అంచనాలన్నీ నిజం కాలేదా? మున్ముందు ‘సాక్షి’ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే పరిస్థితి వస్తే.. దీన్లో పెట్టుబడి పెట్టినవారికి లాభాలు రావా? అంతెందుకు!! ‘ఈనాడు’ విలువ రూ.10 వేల కోట్లుగా లెక్కించినపుడు దాంతో సమానంగా సర్క్యులేషన్ ఉన్న ‘సాక్షి’కి అందులో సగమైనా విలువ రాదా? ఆ ప్రకారం చూసుకున్నా ‘సాక్షి’ ఇన్వెస్టర్లకు ఇప్పటికే లాభాలొచ్చినట్టు కదా? దీన్నెందుకు ఈడీ గుర్తించదు. ఈ నిజాలేవీ వారికి అవసరం లేదా? అంతెందుకు! జీవితంలో లాభమంటే ఎరుగని... నిండా అప్పుల్లో, నష్టాల్లో మునిగిన తన కంపెనీలో ఒకో వాటాను ఏకంగా రూ.5 లక్షల 28 వేల పైచిలుకు మొత్తానికి విక్రయించిన రామోజీకి... ‘సాక్షి’పై అభాండాలు వేసే నైతికార్హత ఉందా?

2. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 విలువైన వాటాలను కొందరు వ్యక్తులు, సంస్థలు రూ.350 ప్రీమియంతో కొన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు తప్ప వేరెవరూ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టలేదు. 


ఇదో అడ్డగోలు వాదన. ఎందుకంటే జగతిలో పెట్టుబడులు పెట్టినవారిలో ప్రభుత్వం నుంచి పైసా కూడా లబ్ధి పొందని వారూ ఉన్నారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనివారూ ఉన్నారు. వీరి పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఒక ప్రత్యేక చార్జిషీటు కూడా దాఖలు చేసింది. దాన్లో ఏమని చెప్పిందో తెలుసా? జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిసి వారిని మోసం చేశారని. వారికి తప్పుడు మాటలు చెప్పి వారిచేత పెట్టుబడులు పెట్టించారని. అంటే... ఇన్వెస్టర్లలో ప్రభుత్వపరంగా ప్రాజెక్టులేవైనా పొందిన వారుంటే... వారు అలా లబ్ధి పొందారు కనకే పెట్టుబడి పెట్టారనే వాదన. ఒకవేళ వారికి ఏ లబ్ధీ కలగకపోతే... వారిని తప్పుడు మాటలతో మోసం చేశారన్న వాదన. పెపైచ్చు ఈ రెండు వాదనలూ ఒకే కేసులో!! ఎంత చిత్రం. ఇంతకన్నా ఘోరమైన తీరేమైనా ఉంటుందా? సీబీఐ వేసిన చార్జిషీట్లను యథాతథంగా తీసుకుని... ఆస్తుల్ని జప్తు చేయాలంటూ పోతున్న ఈడీకి ఈ వాదనల్లోని మర్మం అర్థంకాలేదా? లేక తానూ ఆ తానులో ముక్కనే కనక అర్థంకానట్లు నటిస్తోందా? 

3. జగన్ 2003-04 ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఆదాయాన్ని రూ.9.9 లక్షలుగా చూపించారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం తన ఆస్తి రూ.77 కోట్లుగా పేర్కొన్నారు. 2004- 2009 మధ్య తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా ఆస్తులు సంపాదించారనడానికి ఇదే సాక్ష్యం. 

ఇదండీ... ఈడీ చూపిన మరో సాక్ష్యం...!!! అసలు ఆదాయానికి, ఆస్తికి తేడా ఉంటుందనే విషయం ఈడీకి గానీ, గతంలో ఇవే ఆరోపణలు చేసిన టీడీపీకి గానీ... వాటిని చేయించి, ప్రచురించిన రామోజీకి గానీ తెలియదనుకోవాలా? ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వచ్చిందంటే దానర్థమేంటి? అంతటి ఆదాయాన్నిచ్చే ఆస్తులు ఉన్నాయనేగా! 2004 నాటికి ఏడాదికి 10 లక్షల ఆదాయం రావాలంటే ఆస్తులెన్ని ఉండి ఉండాలి? అయినా జగన్‌మోహన్ రెడ్డి కుటుంబానికి ఆయన తాత రాజారెడ్డి నాటినుంచీ సొంత వ్యాపారాలున్నాయి. సొంత ఆడిటర్‌తో పాటు ఆదాయపు పన్ను చెల్లించిన చరిత్ర ఉంది. అలాంటి కుటుంబానికి చెందిన జగన్‌కు 2004 నాటికే 10 లక్షల ఆదాయం ఉందని ఈడీ కూడా చెబుతోంది. మరి 2009 నాటికి ఆస్తి 77 కోట్లకు చేరటం ఎందుకంత చిత్రంగా కనిపిస్తోందనేది అర్థంకాని విషయం.

4. జగతి పబ్లికేషన్స్ విలువ లెక్కింపు మోసపూరితంగా జరిగిందనేది ఈడీ వాదన. ఈ విలువను నిర్ధారించటం కోసం జగదీశన్, డెలాయిట్ కంపెనీల నుంచి పొందిన నివేదికలు రెండూ మోసపూరితమైనవని, వాటి ఆధారంగానే పెట్టుబడులు వచ్చాయనేది దాని మాట. 

ఒకవైపేమో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందినవారు దానికి ప్రతిఫలంగా ‘క్విడ్ ప్రో కో’ రూపంలో పెట్టుబడులు పెట్టారంటారు. మరోవైపేమో మోసపూరిత నివేదికల ఆధారంగా వారిచేత పెట్టుబడులు పెట్టించారంటారు. ఇవి రెండూ ఎలా సాధ్యం? ఒకవేళ నిజంగానే ‘క్విడ్ ప్రో కో’గా పెట్టుబడులు పెడితే వారికి విలువ నిర్ధారించే నివేదికలు అవసరమా? ఈ నివేదికలేవీ లేకుండానే పెట్టుబడి పెడతారుగా? మరి డెలాయిట్ వంటి సంస్థల చేత విలువను నిర్ధారించాల్సిన అవసరమేమొచ్చింది. ఎవ్వరూ నిర్ధారించకపోయినా నోటికొచ్చిన లెక్క చెబితే వారే పెట్టుబడి పెడతారుగా? దీనర్థం ఈ పెట్టుబడులేవీ సీబీఐగానీ, ఈడీగానీ చెబుతున్నట్టు క్విడ్ ప్రో కో కావనేగా? అంతర్జాతీయ ఆడిట్ సంస్థలిచ్చిన నివేదికలు చూశాకే పెట్టుబడి పెట్టారంటే దానర్థం ఇన్వెస్టర్లు దాన్ని కూడా ఒక ఇతర ఇన్వెస్ట్‌మెంట్లలో భాగంగానే భావించారని అర్థంకాదా? లాభాలకోసమే పెట్టుబడి పెట్టారని అర్థంకాదా? అంతర్జాతీయ సంస్థల చేత ఆడిట్ చేయించి ఇన్వెస్ట్‌మెంట్లు అభ్యర్థించారంటే దానర్థం జగతి ప్రతినిధులు పత్రికారంగంలో ఒక నిజమైన ప్రత్యామ్నాయం కోసం, లాభాలు తెచ్చే ఒక సంస్థ కోసం శ్రమించారని అర్థంకాదా? దీన్లో క్విడ్.. ప్రో...కో... ఏమైనా ఉందా?

5. జగతి పబ్లికేషన్స్ అధీనంలో యంత్రాలు మాత్రమే ఉన్నాయి. అది తన అనుబంధ సంస్థ పేరిట భూముల్ని, భవనాల్ని పెట్టింది. తెలివైన వారు ఆ కంపెనీల్లో పెట్టుబడి పెడతారు తప్పితే జగతిలో పెట్టుబడి పెట్టరు.

ఈడీ చేసిన ఈ వాదన కూడా సత్యదూరమే. ఎందుకంటే భూములు, భవనాల్ని కలిగి ఉన్న జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలోనూ ఇదే ఇన్వెస్టర్లలో కొందరు పెట్టుబడి పెట్టారు. జగతి పబ్లికేషన్స్ అనేది ‘సాక్షి’ని ముద్రించే ఫ్లాగ్ షిప్ కంపెనీ. మున్ముందు పబ్లిక్ ఇష్యూకు వెళితే గనక లాభం వచ్చేది దీన్లోని ఇన్వెస్టర్లకే. ఇక్కడ ఈడీ విస్మరించినదేమిటంటే జననిలో కూడా కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారనేది. ఎందుకంటే గతంలో మొదటి ఛార్జిషీటుపై అటాచ్‌మెంట్ ఉత్తర్వుల కోసం వాదించినపుడు ఇదే సంస్థ జనని గురించి కూడా ప్రస్తావించింది. ఇపుడేమో ఆ సంస్థ గురించి తెలియనట్టు వాదించటమే విచిత్రం. 

రాంకీపై ఆది నుంచీ అబద్ధాలే...

నిజానికి బుధవారం న్యాయ ప్రాధికార సంస్థ ముందు వాదనలు జరిగింది రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో. విశాఖలో ఫార్మాసిటీని పొందిన ఈ సంస్థకు వైఎస్ హయాంలో గ్రీన్‌బెల్ట్ విషయమై మినహాయింపులిచ్చారని, అలా మినహాయింపునిచ్చినందుకే అది జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది గతంలో సీబీఐ, ఇపుడు ఈడీ చేస్తున్న వాదన. నిజం చెప్పాలంటే ఈ ఫార్మాసిటీ వ్యవహారం జరిగింది చంద్రబాబు హయాంలో. టెండర్లు పిలవటం నుంచి టెంకాయ కొట్టడం వరకు అంతా బాబు కనుసన్నల్లోనే నడిచింది. గ్రీన్‌బెల్ట్ రూపంలో ఆ సంస్థ ఎంత భూమిని వదలాలనేదీ బాబే నిర్ణయించారు. దానికి ఇవ్వాల్సిన మినహాయింపులూ ఇచ్చారు. కాకుంటే వైఎస్ అధికారంలోకి వచ్చాక ఆ గ్రీన్‌బెల్ట్‌ను పెంచితే బాగుంటుందని భావించారు. అధికారులతో చర్చించారు. అది కష్టమని అధికారులు అనటం, రాంకీ సంస్థ ప్రతినిధులు తాము నష్టపోతామని చెప్పటంతో ఆ ఆలోచన ఉపసంహరించుకున్నారు. బాబు నిర్ణయించిన గ్రీన్‌బెల్ట్‌నే కొనసాగించమన్నారు. కానీ సూత్రధారి బాబును వదిలేసిన సీబీఐ, ఈడీలు.. ఎంతసేపూ వైఎస్సార్, జగన్ చుట్టూ తిరుగుతుండటమే విచిత్రం. 

ఇదీ... రాం‘కీ’ కథ

హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో భావించిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం... విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తావంటూ 18-7-2000న జీవో ఎంఎస్ నంబరు 381ని విడుదల చేసింది. పరవాడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కాలుష్యం దృష్ట్యా పరవాడ సరికాదని అభ్యంతరాలు వచ్చినా బుట్టదాఖలు చేశారు. పరవాడను ఖరారు చేస్తూ 24-9-2001న జీవో ఎంఎస్ నంబరు 501ని విడుదల చేశారు. బాబు యథాప్రకారం ఫార్మా పార్కు టెండర్ల ప్రక్రియను నడిపించే బాధ్యతను ఎల్‌అండ్‌టీకి అప్పగించారు. టెండర్లు ఆహ్వానిస్తూ 2002 అక్టోబర్ 31న, డిసెంబర్ 17న ప్రకటనలొచ్చాయి. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్, రాంకీ సహా 13 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కానీ ప్రతిపాదన దశలో రాంకీ సహా ఏడుగురే మిగిలారు. చివరకు 3 కంపెనీలే ప్రతిపాదనలు సమర్పించాయి. మారిషస్‌కు చెందిన క్రిస్సన్‌తో కలిసి వేసిన జూమ్ డెవలపర్స్ ఒక్కటే అర్హత పొందింది. అయితే ఏపీఐఐసీ ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదనే కారణంతో జూమ్ ప్రతిపాదనను కూడా రద్దు చేశారు. 

‘బూట్’ మార్చిన బాబు...

టెండర్ల ప్రక్రియ రద్దవటంతో చంద్రబాబు కొత్త ఆలోచన చేశారు. 2003 జూన్ 28న సమావేశమై... బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బూట్) పద్ధతి మార్చారు. బిల్డ్ ఆపరేట్ ఓన్ ప్రాతిపదికన దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. నిర్మించి, నిర్వహించి ప్రభుత్వానికి అప్పగించే బదులు... ఇక సదరు ప్రయివేటు సంస్థ హస్తగతం చేసుకోవటమన్న మాట. ఆ తరవాత నెలరోజులకే అంటే... 2003 జూలై 31న రాంకీ ఇన్‌ఫ్రా ముందుకొచ్చింది. ఏపీఐఐసీకి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సమర్పించింది. దానిపై నేరుగా చంద్రబాబుతో ఇన్‌ఫ్రా సబ్ కమిటీ చర్చించింది. 

చివరికి 2003 నవంబర్ 14న... రాంకీతో చర్చలు జరిపే అధికారాన్ని ఏపీఐఐసీకే అప్పగిస్తూ చంద్రబాబు స్వయంగా ఒక నోట్‌ను ఆమోదించారు. రెండు నెలల్లో అంతా రెడీ. ప్రాజెక్టును అప్పగించటం.. ఎంఓయూ కుదుర్చుకోవటం అంతా పూర్తి. అప్పటికే బాబు ప్రభుత్వం ఆపద్ధర్మంలో పడింది. కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన ఎంఓయూ కుదుర్చుకున్నారు. చివరికి ‘రాంకీ ఫార్మా సిటీ’ సంస్థను 2004 మార్చి 11న... అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు రిజిస్టరు చేశారు. 24 గంటలు కూడా తిరక్క ముందే... 2003 మార్చి 12న రాంకీతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిప్రకారం ఈ సంస్థలో రాంకీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉంటాయి. ఏపీఐఐసీ తన వాటా మేరకు భూమిని సమకూరుస్తుంది. దీంతో పాటు అమ్మకం పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్ని పూర్తిగా మినహాయించటం... ప్రభుత్వానికి, ఉడాకు చెల్లించాల్సిన చార్జీలేమైనా ఉంటే వాటిని తగ్గించటానికైనా, పూర్తిగా రద్దు చేయటానికైనా ఏపీఐఐసీ రికమెండ్ చేయటం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీలూ ఇవ్వటం వంటి అంశాలన్నీ ఈ కన్సెషన్ ఒప్పందంలో చేర్చటం విశేషం.

గ్రీన్‌బెల్ట్‌పై ఆనాడే నిర్ణయం...

2000 మార్చిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న విధంగా గ్రీన్ బెల్డ్ ఉండేలా డెవలపర్ చూసుకోవాలని కన్సెషన్ ఒప్పందంలో చేర్చారు. దీని ప్రకారం గ్రీన్‌బెల్ట్‌కు బాబు నిర్దేశించిన భూమి 352 ఎకరాలు. దాన్లో 58.5 ఎకరాలు గోడకు లోపల, మిగిలింది ఆవల ఉంటాయి. ఈ మేరకు లే ఔట్‌ను రాంకీ ఉడాకు సమర్పించటం... అది ఆమోదించటం అన్నీ జరిగాయి. అయితే వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఫార్మా సిటీపై సమీక్ష సందర్భంగా అక్కడ నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా... బౌండరీ చుట్టూ గోడకు ఆవల 500, ఇవతల 500 మీటర్లు ఉంటే బాగుంటుందని భావించారు. కానీ బయటి వారి నుంచి భూముల్ని కొనకుండా కిలోమీటర్ మేర గ్రీన్‌బెల్ట్ సాధ్యం కాదని ‘ఉడా’ చెప్పటంతో... దాన్ని 250 మీటర్లకు తగ్గించాలనుకున్నారు. చివరకు గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల 50 మీటర్లు ఉంటే చాలనుకున్నారు. ఇలా గ్రీన్‌బెల్ట్ 50 మీటర్లుగా ఉండటం వల్ల రాంకీ సంస్థ గోడలోపల వదలాల్సిన స్థలం 58.95 ఎకరాలు. ఇది చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదించినదే. దాన్ని మార్చినందుకే వైఎస్సార్ తనయుడు జగన్‌కు చెందిన సాక్షిలో రాంకీ పెట్టుబడులు పెట్టాయనే వాదన మరి ఎంతవరకూ నమ్మొచ్చు? 


14.5 లక్షల కోట్లు ప్రభుత్వానికొస్తాయా?

ఎన్నికలకు ముందు జగన్‌పై బురద జల్లి, ఆయన ప్రజాభిమానాన్ని దెబ్బతీయటానికి ఎంత పెద్ద సంఖ్య చెబితే అంత బాగుంటుందని రామోజీ భావించారు. అందుకే తన తెలుగుదేశం మిత్రుల చేత అద్దిరిపోయే అబద్ధాలు పలికించారు. వాళ్లుకూడా రెచ్చిపోయి... జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 17 లక్షల కోట్లు దోచుకున్నారని బీభత్సమైన ఆరోపణలు చేసేశారు. దాన్లో వాళ్లంతా కలిసి ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనులకు కట్టిన విలువ ఏకంగా 14.5 లక్షల కోట్లు. అసలు ఈ రక్షణ స్టీల్స్‌తో తనకే మాత్రం సంబంధం లేదని బ్రదర్ అనిల్‌కుమార్ ఎన్నిసార్లు చెప్పినా తెలుగుతమ్ముళ్లు వినిపించుకుంటే ఒట్టు. చివరికి రక్షణ స్టీల్స్‌కిచ్చిన లీజును రద్దుచేసేశారు. తాజాగా గురువారమే దీన్ని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించారు. అంటే బాబు-రామోజీ లెక్కల ప్రకారం రూ.14.5 లక్షల కోట్ల విలువైన ఉక్కు గనుల్ని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం కేటాయించినట్టే. మరి రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు ఎంతిస్తుంది? విశాఖ ఉక్కుకు ఇనుప గనుల కొరత తీరినట్టేనా? దీనిపై విశాఖ ఉక్కుగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ చెబితే తప్ప నిజానిజాలు తెలియవు. రామోజీ-బాబు కలిసి జగన్‌పై ఎంత బురద జల్లుతున్నారన్నది కూడా ఈజీగానే తెలుస్తుంది!!. 

ఈ ప్రశ్నలకు బదులేది?

వైఎస్ 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ఉండాలని ప్రతిపాదించినపుడు... తాము బాబు హయాంలో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందం ప్రకారం 50 మీటర్లే గ్రీన్‌బెల్ట్‌కు అంగీకరించామని, దానికే పరిమితం కావాలని ముఖ్యమంత్రిని రాంకీ సంస్థ కోరే అవకాశం లేదా? అలా కోరినపుడు మునుపటి ఒప్పందమే కనక ఆమోదించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ భావించే అవకాశం లేదా? అలాంటి సహేతుకమైన కారణాలన్నిటినీ వదిలేసి... సాక్షిలో పెట్టుబడి పెట్టారు కనకే ఈ మేలు చేశారనటం ఎంతవరకు సమంజసం?

జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపార దక్షతపై నమ్మకం ఉండో, మున్ముందు ఇన్వెస్ట్‌మెంట్లు లాభిస్తాయనో, రాష్ట్రంలో బొమ్మనేకాదు... బొరుసును కూడా చూపించే పత్రిక వస్తోంది కాబట్టి దానికి మద్దతివ్వాల్సిన అవసరముందని భావించో ‘రాంకీ’ సంస్థ పెట్టుబడి పెట్టే అవకాశం లేదా? 

గ్రీన్‌బెల్ట్‌పై నిజానికి రాంకీకి వైఎస్ సంస్థ చేసిన మేలేమీ లేదు. మునుపటి ఒప్పందాన్నే పాటించింది. మరి ఈ పాటిదానికే ‘సాక్షి’లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న సీబీఐ వాదన నిజమైతే... 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరు ప్రాతిపదికగా కట్టబెట్టేసిన చంద్రబాబునాయుడికి రాంకీ ఎంత ముడుపులిచ్చి ఉండాలి?

జగన్ ఆత్మీయస్పర్శను దూరం చేసేందుకే...


దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం త్రేతాయుగంలో రామునిగా, ద్వాపరయుగంలో కృష్ణునిగా భగవంతుడు అవతారాలెత్తినట్లు పురాణాలు చెబుతున్నాయి. రాజరిక వ్యవస్థలో దైవాంశ సంభూతులుగా కొనియాడబడిన వ్యక్తులే రాజులుగా, పరిపాలకులుగా చలామణీ అయ్యారు. ప్రజల బాగోగులు, కష్టసుఖాలు తెలుసుకుని, వారి అవసరాల్ని తీర్చి ప్రజారంజకంగా పాలించారు.

తర్వాత వచ్చిన కలియుగంలో కొంతకాలంపాటు రాజుల, సామంతరాజుల వ్యవస్థ కొనసాగి బ్రిటిష్ పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా! ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని రాజకీయపార్టీలు మన దేశంలో ఉన్నప్పటికీ భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా, అయిదు సంవత్సరాలకొకసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకుంటూ పంచవర్ష ప్రణాళికలు అమలుపరుస్తూ ప్రజల అవసరాల్ని తీరుస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మన ప్రజాప్రతినిధులు. అయితే ప్రణాళికల ద్వారా దేశం అభివృద్ధి చెందినప్పటికీ ధనికులు, పేదల మధ్య అంతరాల్ని తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

ప్రజాస్వామ్యంలో ఆర్థిక అసమానతలు తొలగించటం అంత తేలిక కానప్పటికీ పేదప్రజల కనీస అవసరాల్ని తీర్చటం ప్రజాప్రభుత్వాల బాధ్యతగా, కర్తవ్యంగా భావించి సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా వారి జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచి సమాజంలో పేదలు సైతం తలెత్తుకుని తిరిగే పరిస్థితుల్ని కల్పించే రాజకీయనాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైననేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి కనీస అవసరాల్ని గుర్తించి 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడు, విద్య, వైద్యం అందించాలన్న పట్టుదలతో ఆకలి బాధ తీర్చాలనే సదుద్దేశంతో రెండు రూపాయలకే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేదకి పక్కా గృహం, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా అందరికీ విద్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవానికీ కార్పొరేట్ వైద్యం అందించి అన్నివర్గాల ప్రజల మన్ననలనందుకుని మహాకూటమిని సైతం ధీటుగా ఎదుర్కొని ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌ది.

జన్మతః సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితాంతం పేదప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజాసేవలోనే తుదిశ్వాస విడిచిన పేదల పక్షపాతి, గొప్ప మానవతావాది వైఎస్సార్. అందువల్లనే ఆయన మరణానంతరం వేలాది విగ్రహాల్ని చందాల ద్వారా నెలకొల్పి దేవతలతో సమానంగా ఆరాధిస్తున్నారంటే పేదప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానాన్ని వర్ణించటానికి మాటలు లేవు.

అలాంటి మహనీయుడు ఆకస్మికంగా మరణిస్తే తరువాత వచ్చిన పాలకులు ఆయన ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తుంటే యువనేత జగన్ కలత చెందారు. తను కాంగ్రెస్‌లో కొనసాగితే పదవులు లభిస్తాయేమో కాని తండ్రి ఆశయాల్ని కొనసాగించలేననే నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వాన్ని తృణప్రాయంగా భావించి, రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, అఖండ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. దాదాపు సంవత్సరం నుండి జైల్లో ఉన్నప్పటికీ అన్ని పార్టీలకు చెందిని ప్రజలు, రాజకీయ నాయకులు తండోపతండాలుగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారంటే జగన్‌పై వారు పెంచుకున్న విశ్వసనీయతే కారణం. అంతటి విశ్వసనీయత, ప్రజాదరణ ఉన్న జగన్‌ని ప్రజలే నిర్బంధం నుంచి విడిపించుకుంటారు. తమ నాయకుడిగా గెలిపించుకుంటారు.

- శీలం నర్సిరెడ్డి, హైదరాబాద్

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com

సుప్రీంకోర్టుతీర్పుకూ వక్రభాష్యం

సరిహద్దు వివాదం కారణంగా సుప్రీంకోర్టు లీజులు
సస్పెండ్ చేసిన గనులు అసలు గాలి జనార్దన్‌రెడ్డివి కాదు
అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన లీజులు అసలే కాదు
‘సుప్రీం’ తీర్పును వక్రీకరించి రాసిన వార్త పక్కనే
వై.ఎస్.జగన్ కార్టూన్ వేయటంలో ఔచిత్యం ఏమిటి?
ఇది ‘ఎల్లో మీడియా’ నీచ సంస్కృతికి నిదర్శనం
ఈ కుట్రలను జనం గమనిస్తున్నారు.. తగిన బుద్ధి చెప్తారు

 ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా దాన్ని గాలి జనార్దన్‌రెడ్డికి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించటం ‘ఎల్లో మీడియా’ దుర్మార్గానికి, నీచ సంస్కృతికి ప్రబల నిరద్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత శోభానాగిరెడ్డి విమర్శించారు. జననేతగా ప్రజల గుండెల్లో స్థానం పొందిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రజల మనిషిగా నిలిచిన ఆయన తనయుడు జగన్‌లపై బురద చల్లేందుకు ఆఖరుకు సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వక్రభాష్యం చెప్పే స్థాయికి ‘ఎల్లో మీడియా’ దిగజారిందని ఆమె ధ్వజమెత్తారు. శోభానాగిరెడ్డి ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘ఆంధ్ర - కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు వివాదం ఉన్న ఏడు మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. అయితే వీటితో గాలి జనార్దన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ‘సుప్రీం సస్పెండు చేసిన ఏడు మైనింగ్ లీజుల్లో ‘గాలి’కి చెందినవి నాలుగు ఉన్నాయని (ఈనాడు) బ్యానర్ వార్తలో పేర్కొంది. దాంతో మాకు సంబంధం లేదు. అయితే ఈ తప్పుడు వార్త పక్కనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పది తలలతో చూపుతూ కార్టూన్ వేయటం ద్వారా మా నేతకు, గాలి జనార్దన్‌రెడ్డికి మధ్య లింకు ఉందని చాటేందుకు ఈనాడు కుట్రపూరితంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు వార్త పక్కనే శ్రీరామనవమి పేరిట జగన్‌కు పది తలల ఉన్నట్లు కార్టూన్ ప్రచురించటంలో ఔచిత్యం ఏమిటో? ఈనాడు అధినేత చెప్పాలి. మరో తోక పత్రిక వైఎస్ అండతో గాలి చెలరేగిపోయారంటూ అడ్డగోలుగా వార్త రాసింది.

సుప్రీంకోర్టు తీర్పుకు వైఎస్ ప్రభుత్వానికి అసలు సంబంధం ఏమిటి? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన లీజులు అసలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవే కాదు. అలాంటప్పుడు వాటిని వైఎస్‌కు ఆపాదించటం ఎల్లో మీడియా కుట్రకాదా?’’ అని ఆమె నిలదీశారు. ‘‘కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్ లీజులు తీసుకున్న కొందరు నేతలు అక్రమాలకు పాల్పడ్డారని తేల్చిన సుప్రీంకోర్టు 49 గనుల లీజులను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఉన్న మరో ఏడు లీజులను సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకూ సస్పెన్షన్‌లో ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇవి పూర్తిగా కర్ణాటక రాష్ట్రం కేటాయించిన గనులు. వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.

పెపైచ్చు ఈ వివాదం ఉన్న గనుల్లో గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన గనులు లేవు. అయినా నాలుగు గాలి గనులను ‘సుప్రీం’ సస్పెండ్ చేసిందని ఎల్లో మీడియా దుష్ర్పచారం చేయటం, దీనికి మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కార్టూన్‌ను జత చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘గాలి జనార్దన్‌రెడ్డిపై ఎల్లో మీడియా రాసుకున్న అంశాలతో మాకు సంబంధంలేదు. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మా పార్టీ నేత జగన్‌కు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ఎల్లో మీడియా రాయటాన్ని మేం ఖండిస్తున్నాం. ఇది ఎల్లో మీడియా కుట్రకు నిదర్శనం. జనం వాస్తవాలు గమనిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వక్రభాష్యం చెప్పే ‘ఎల్లో మీడియా’కు, వాటిని వెనుకుండి నడిపిస్తున్న నేతలకు ప్రజలు త్వరలోనే తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు’’ అని ఆమె హెచ్చరించారు.

అవి మావి కాదు: గాలి సోమశేఖరరెడ్డి
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన ఏడు లీజుల్లో గాలి జనార్దన్‌రెడ్డికి చెందినవి లేవని ఆయన సోదరుడు, బళ్లారి శాసనసభ్యుడు గాలి సోమశేఖరరెడ్డి తెలిపారు. గాలికి చెందిన నాలుగు లీజులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిందని మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు రద్దు చేసిన కర్ణాటకలోని 49 మైనింగ్ లీజుల్లో తమకు చెందినది అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ ఒక్కటి మాత్రమే ఉందని, మిగిలిన 48 లీజులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

‘‘మాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల్లోని (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన) మైనింగ్ లీజులపై సుప్రీంకోర్టులో అసలు వాదనలు పూర్తికాలేదు. వీటికి సంబంధించి త్వరలో వాదనలు జరగనున్నాయి. అవి 2009 నుంచి సస్పెన్షన్‌లో ఉన్నాయి. వాస్తవాలివి కాగా గాలికి చెందిన నాలుగు గనులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు’’ అని సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు.

జగనన్నతోనే పథకాలకు జీవం

మరో ప్రజాప్రస్థానంలో షర్మిల భరోసా
రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు అందుతాయి
అప్పుల ఊబి నుంచి ప్రతి రైతన్నా బయటపడతాడు
పిల్లలను చదివిస్తే అమ్మ ఖాతాలోకే డబ్బులు వస్తాయి
రాజన్న రాజ్యం తెచ్చేలా జగనన్నను ఆశీర్వదించండి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 125, కిలోమీటర్లు: 1,688.6

‘‘వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. పక్కా ఇళ్ల పథకాన్ని పాడెక్కించారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఆసుపత్రికి వెళ్తే ఆ కార్డును చెత్తబుట్టలో వేయాలని ఆసుపత్రి యాజమాన్యం అంటున్నారని నిన్న ఓ తాత బాధపడ్డారు. మరోవైపు ఈ ముఖ్యమంత్రి గారేమో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటూ రూ.కోట్లు ఖర్చు చేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను అడిగినా రుణాలే అందటం లేదని చెప్తున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నట్టు..? ఆమ్మా... అక్కా.. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ది చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 

రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికి జీవం పోస్తారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగింది. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామంలో షర్మిల వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే వేదిక మీద నుంచి కాసేపు మాట్లాడారు. అంతకుముందు పాదయాత్రలో తనతో పాటు కదం తొక్కిన మహిళలతో మాట్లాడారు. వారితో షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..

రైతుల కోసం రూ. 3 వేల కోట్లతో నిధి..

జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలిస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభు త్వమే పంట కొనుగోలు చేసేలా రూ.3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ప్రతి రైతు అప్పుల ఊబిలోంచి బయటికి వచ్చి బాగుపడేటట్టు చేస్తారు. మన విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల కోసం ఆరోగ్యశ్రీ నిలబెడతారు. వృద్ధులకు రూ.700 పిం ఛన్ అందుతుంది. వికలాంగుల పింఛన్ రూ.1,000 అవుతుంది. అక్కాచెల్లెళ్లు వారి పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు నెలనెలా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అమ్మ అకౌంట్లోనే డబ్బులు జమవుతాయి. 

ఇంటర్ చదివితే రూ.700, డిగ్రీ చదివితే రూ.1,000 అమ్మ ఖాతాలోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎలాగూ ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదలు కూడా మళ్లీ ధీమాగా పెద్దాసుపత్రులకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు వస్తాయి. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికి నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్సార్ పార్టీని బలపరచాలని మా ప్రార్థన.

శనివారం 125వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జొన్నలగడ్డ గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి గుమ్మడిదుర్రు మీదుగా అనిగండ్లపాడు శివారు వరకు యాత్ర సాగింది. జొన్నలగడ్డలో షర్మిలను వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కలిశారు. రాత్రి 7.30 గంటలకు అనిగండ్లపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు ఉదయం పూట యాత్రను రద్దు చేసినట్లు పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. మధ్యాహ్నం నుంచి యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం మొత్తం 8.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1688.6 కి.మీ యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, పేర్ని నాని, జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, వాసిరెడ్డి పద్మ, మాజీ మంత్రి వసంత నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, స్థానిక నాయకులు వెస్లీ, వేజెండ్ల శివశంకర్ తదితరులున్నారు.

అనిగండ్లపాడు నుంచి షర్మిల పాదయాత్ర

 కృష్ణాజిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమె చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 126వ రోజుకు చేరింది. శనివారం ఉదయం షర్మిల నందిగామ నియోజకవర్గం అనిగండ్లపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి పెనుగంచిప్రోలు, మక్కపేట చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. నేడు షర్మిల 13.8 కిలోమీటర్ల మేర నడవనున్నారు.

Sharmila's 126th day padayatra schedule

సునీల కుటుంబసభ్యులకు సుచరిత పరామర్శ

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

గుంటూరు: తెనాలిలో సునీల కుటుంబసభ్యులను వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పరామర్శించారు. తాగుబోతు యువలకుల బారినుంచి కుమార్తెను రక్షించే ప్రయత్నంలో సునీల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సునీల కుటుంబ సభ్యులను సుచరిత పరామర్శించి, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

విజయమ్మ ఆలోచనే ఆరోగ్యశ్రీ: కొణతాల

విశాఖపట్నం: చారిత్రాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకం ఆలోచన వైఎస్ విజయమ్మదేనని వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. పెందుర్తి మండలం కొలగానిపాలెంలో ఆయన రామాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు పడుతున్న కష్టాలను చూసి వారికి ఇలాంటి పథకాలు మేలని విజయమ్మ వైఎస్‌ఆర్‌కు సలహా ఇచ్చారన్నారు.

27 నుంచి రంగారెడ్డిలో విజయమ్మ పర్యటన

రంగారెడ్డి జిల్లాలో వైఎస్‌ విజయమ్మ పర్యటన షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా కన్వీనర్‌ జనార్ధన్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 27న చేవెళ్లలో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ప్రతి కార్యక్రమాన్ని చేవెళ్ల నుంచే ప్రారంభించేవారని జనార్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లాలో విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Krishnamma Odilo 19th Apr 2013

'అమ్మహస్తం ప్రజలపాలిట కబంధ హస్తం'

అమ్మహస్తం ప్రజలపాలిట కబంధ హస్తంగా మారిందని తిరుపతి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో ఆరోపించారు. కేవలం ప్రభుత్వ ప్రచారం కోసమే అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రంలో ఒకొక్కరిపై కిరణ్ సర్కార్ రూ. 3 వేలు భారం వేసిందని తెలిపారు. కానీ ప్రజలకు రూ.140 రాయితీ ఇస్తున్నామని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రజాదరణే జగన్‌కు శ్రీరామరక్ష

అప్పట్లో పెద్దలు సరదాగా ఒక విషయం చెప్పేవారు. ఒక తెగకు చెందిన కొందరు అమాయకులు ఎండుటాకులపై ఇసుకను జల్లి, తద్వారా వచ్చే గలగలల శబ్దంతో కిలకిలా నవ్వుకుని ఆనందపడేవారట. ఇదెందుకు చెప్పాల్సివస్తోందంటే... జగన్‌ను జైలుకు పంపించి, బెయిల్ రాకుండా చేస్తున్నామని కాంగ్రెస్, టీడీపీలు ఆనందపడటం కూడా అలాంటిదేనని. అయితే ఒక్క తేడా. పైన చెప్పుకున్నవారు నిజమైన అమాయకులు. 

ఈ రెండు పార్టీలవాళ్లు మాత్రం రాజకీయ కాలాంతకులు. మంత్రాలకు చింతకాయలు రాలవన్నది ఎంత సత్యమో, వీళ్ల నీచమైన కుట్రలకు కుతంత్రాలకు జగన్ తల వంచడన్నది అంతే నిజం. భవిష్యత్తులో జగన్ ఎదుగుదలను ఊహించి ముచ్చెమటలు పట్టి అరెస్ట్ అనే ఈ నీచపర్వానికి కాంగ్రెస్ తెరలేపితే, చంద్రబాబు తందానా అంటూ వంతపాడి జగన్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం ప్రజలు గమనించకపోలేదు. జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నవారికి, వై.ఎస్. భిక్షతో రాజకీయ జీవితం గడుపుతూ పదవులు వెలగబెడుతున్నవారికీ చిన్నమాట. 

మీరు మంత్రులో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎమ్మెల్సీలో కావచ్చు. మనది ప్రజాస్వామ్యవ్యవస్థ అని మీరు నమ్మినట్లయితే, ఈ రాష్ట్రంలో ఏ నియోజక వర్గం నుండైనా సరే మీలో ఒక్కరు సోనియా, రాహుల్‌ల ఫొటోలు పెట్టుకుంటారో, మీవద్ద ఉన్న బ్లాక్‌మనీ వెదజల్లుతారో, మద్యం ఏరులై పారిస్తారో మీ ఇష్టం. మీ మీద ఒక అతిసామాన్యుడిని, రాజకీయానుభవం, ధనం లేని వ్యక్తిని నిలబెట్టి కేవలం స్వర్గీయ వైఎస్సార్ ఫొటో, జగన్ ఫొటోతో బరిలోకి దింపుదాం. గెలవగలరా? మీ వల్ల కాదు. తెలుగువాళ్లు ఒక్కసారి అభిమానం పెంచుకుంటే, ఎప్పటికీ బాసటగా నిలుస్తారు. అదే జగన్‌కు శ్రీరామరక్ష.

- ఆరిఫ్ బాషా షేక్, సూళ్లూరుపేట, నెల్లూరు


నీ రాక కోసం... రాష్ట్రం ఎదురుచూస్తోంది

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీనే అభిమానిస్తున్నాను. నేనే కాదు, మా తాత ముత్తాతల నుంచీ కాంగ్రెస్‌నే కొనియాడేవారు. జోడెద్దుల గుర్తు, తర్వాత ఆవు దూడ, ఆ తర్వాత హస్తం గురించి గొప్పగా చెప్పేవారు. త్యాగాలు చేసిన మహనీయులు, సంస్కరణవేత్తలు కాంగ్రెస్ నుండి పుట్టినవారని కథలు కథలుగా చెప్పేవారు. తరాలు అంతరిస్తున్నా, తరానికో యుగపురుషుడు అన్నట్లు వైఎస్సార్ ఆ పార్టీ ఉనికిని మనరాష్ట్రంలో బలోపేతం చేశారు. ప్రజల కోసమే ఆలోచించి, ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, అన్ని వర్గాల వారికీ వరాలు కురిపించిన ప్రజాబంధువు. 

తన పాలనా విధానం ఎప్పటికీ కుంటుపడకుండా ఉండడానికి ఆయన తన వారసుడు జగన్‌ని ప్రజల ముందు నిలిపి అతడి భుజాలపై బాధ్యతను మోపారనిపిస్తోంది! తండ్రి చేపట్టిన పథకాలు కొనసాగించడానికై ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణనే జగన్ తన ఊపిరిగా భావించి, ప్రజల్లో మమేకమై తన పదవిని కూడా త్యాగం చేయగా, ‘కాదు కూడదు నువ్వే మా నాయకుడివి’ అని ప్రజలు మళ్లీ గెలిపించి, తమ ప్రేమాభిమానాలను వ్యక్తపరచారు. జగన్‌బాబు కోసం రాష్ట్రం అహర్నిశలూ ఎదురుచూస్తోంది. త్వరగా ఆయన కల్పిత అభాండాల నుండి బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. 

- కళ్యాణ్‌కర్ లక్ష్మీబాయి, సికింద్రాబాద్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com

ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి,ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మోసపూరిత ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ విద్యుత్ విని యోగం తగ్గిందని, అందువల్ల విద్యుత్ కోతను నగరాల్లో 3 గంటల నుంచి ఒక గంటకు, జిల్లాలో నాలుగు గంటల నుంచి రెండు గంటలకు, చిన్నపట్టణాల్లో ఆరు గంటల నుంచి నాలుగు గంటలకు తగ్గిస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేసిందని గుర్తుచేశారు. ఆ విధంగా విద్యుత్ కోతలు తగ్గకపోగా ఈ రెండు రోజుల నుంచి విద్యుత్‌కోతలు మరింతగా పెరిగాయన్నారు.

వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గితే మిగిలిన వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్ సరఫరా సమయం పెంచాలని, దీనివల్ల దెబ్బతింటున్న పండ్లతోటల్ని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ప్రభుత్వానికి పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిలేదని చెప్పారు. విద్యుత్ కోతల విషయంలోనూ ప్రభుత్వం ఇదేరీతిగా వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ చార్జీల భారం 14 లక్షల ఇళ్లకు మాత్రమేనని ఒకరోజు, 4 లక్షల ఇళ్లపైనే భారం పడుతుందని మరోరోజు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ సోనియాగాంధీ సలహా మేరకు పెట్టినవే ఆని చెప్పే కాంగ్రెస్ పెద్దలు నాలుగేళ్ల పరిపాలన తర్వాత బకాయిలున్నాయని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందన్నారు. 2011-12లో ఇన్‌పుట్ సబ్సిడీ రూ.357 కోట్లు, కరువు సాయం 1185 కోట్లు బకాయి ఉందని ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ప్రకటనలు చూస్తే రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. 

అధర్మ ‘వడ్డిం'పు

ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన
అన్నదాత నిలువు దోపిడీ...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు పంట రుణాలపై 7 శాతం వడ్డీ వసూలు చేయాలి 
అయితే గత ఆర్థిక సంవత్సరానికి సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు కేంద్రం 3% వడ్డీ రాయితీ ప్రకటించింది
అంటే బ్యాంకులు సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన అన్నదాతల నుంచి కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది
కానీ బ్యాంకులు ఆర్బీఐ ఆదేశాలకు తూట్లు పొడిచి రైతులు సకాలంలో చెల్లించినా 7 శాతం వడ్డీనే వసూలు చేస్తూ అడ్డంగా దోచుకుంటున్నాయి. 

ఈ విధంగా రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసే మొత్తం రూ.1000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ఏటా మరో రూ.500 కోట్లూ బాదుతున్నారు

బి. గణేష్‌బాబు, సాక్షి: పంట రుణాల వసూళ్లలో బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ‘వడ్డీ రాయితీ’ ఇవ్వకుండా రైతుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. సహకార రంగ బ్యాంకులు మినహా మిగిలిన అన్ని బ్యాంకులు ఈ అక్రమాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. నాబార్డ్ పర్యవేక్షణలో కార్యకలాపాలు నిర్వహించే ‘గ్రామీణ బ్యాంకులు’ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇలా అక్రమంగా వసూలు చేస్తున్న మొత్తం రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. సకాలంలో రుణం తిరిగి చెల్లించినా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ బ్యాంకులు 11% వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని కొందరు రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో మరో రూ.500 కోట్ల వరకు బ్యాంకులు రైతుల్ని బాదేస్తున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని కోటీ 54 వేల మంది రైతులకు వివిధ బ్యాంకులు రూ.37,373 కోట్ల మేర పంట రుణాలు ఇచ్చాయి. వీరినుంచి సాధారణంగా అయితే ఏడు శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయాల్సి ఉంది. అయితే సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు వడ్డీలో మూడు శాతం రాయితీని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు 29-9-2012న ఆర్బీఐ అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. పంట రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాలను చెల్లిస్తే వారి వద్ద నుంచి నాలుగు శాతం మాత్రమే వడ్డీ వసూలు చేయాలని, మిగతా మూడు శాతం వడ్డీని కేంద్రం బ్యాంకులకు చెల్లిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను బ్యాంకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సహకార రంగ బ్యాంకులను మినహాయిస్తే, మిగతా బ్యాంకులన్నీ.. సకాలంలో చెల్లిస్తున్నా రైతుల వద్ద నుంచి ఏడు శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇదేమని ఎవరైనా రైతులు ప్రశ్నిస్తే తమకు కేంద్రం నుంచి డబ్బులు రాలేదని, అవి వచ్చిన తర్వాత జమ చేస్తామని బ్యాంకులు జవాబిస్తున్నాయి. ఇలా అక్రమంగా వసూలు చేస్తున్న (3శాతం వడ్డీ) మొత్తం రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ విధంగా సమకూరే డబ్బును బ్యాంకులు దాదాపు సంవత్సరం పాటు వేరే వ్యాపార లావాదేవీలకు వాడుకుని ఆ తర్వాత తీరిగ్గా సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి.

ఇలా సంవత్సరం పాటు నిర్వహించిన లావాదేవీలకు గాను గత ఏడాదినే పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకులు కనీసం రూ.100 కోట్లు వడ్డీ రూపేణా పొందుతాయన్న మాట. అయితే సంవత్సరం తర్వాత అయినా రైతుల ఖాతాల్లో వడ్డీ రాయితీ మొత్తం సక్రమంగా చేరుతుందా? అంటే అదీ లేదు. చాలామంది రైతులు రుణ ఖాతాలు సక్రమంగా నిర్వహించుకోలేక పోవడం, బ్యాంక్ నిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవడం ఇత్యాది కారణాలతో చాలా ఖాతాల కు ఈ వడ్డీ రాయితీ సొమ్ము చేరడం లేదు. దీంతో బ్యాంకులు ఆ సొమ్మును ‘సస్పెన్స్ అకౌంట్’లో జమ చేసుకుంటున్నాయి. ఇలా బ్యాంకులు అదనంగా పొందుతున్న లబ్ధి మొత్తం వందల కోట్లలోనే ఉంటుందని అంచనా. ఈ విషయంలో బాధ్యత వహించాల్సిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. 

7% వడ్డీ వసూలు సరికాదు

ఆంధ్రా బ్యాంకు జనరల్ మేనేజర్ నరేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బ్యాంకుల అక్రమంగా వసూలు చేస్తున్న వడ్డీ విషయమై ఆయనను కలిసేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ఆయన సూచన మేరకు ఏజీఎం ఉమామహేశ్వరరావును ‘సాక్షి’ సంప్రదించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు సకాలంలో రుణాలు చెల్లించిన వారి నుంచి ఏడు శాతం వడ్డీ వసూలు చేయడం సరికాదని ఏజీఎం తెలిపారు. అయితే ఈ విషయమై మిగతా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఎస్‌ఎల్‌బీసీకి ఉండదన్నారు. ఎస్‌ఎల్‌బీసీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రాబ్యాంకు కూడా అక్రమంగా ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు రాగా ‘పరిశీలిస్తాం’ అంటూ సమాధానమిచ్చారు. నాబార్డ్ పర్యవేక్షణలో పనిచేసే గ్రామీణ బ్యాంకులు కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ‘నాబార్డ్’ సీజీఎం నాయర్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.

పంట రుణాలకూ ప్రాసెసింగ్ ఫీజు!

మరోవైపు బ్యాంకులు రైతులకు సంబంధించిన ప్రతి రుణ ఖాతాపై ప్రాసెసింగ్ చార్జీలు, ఇన్‌స్పెక్షన్ చార్టీలు, ఖాతా నిర్వహణ చార్జీల పేరుతో రూ.1000 నుంచి రూ.1500 వరకూ వసూలు చేస్తున్నాయి. రూ.25,000 పైన ఇచ్చే రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. దీన్ని ఆసరా చేసుకుని ఒక్కోబ్యాంకు ఒక్కో రకంగా అదనపు చార్జీలను వడ్డిస్తున్నాయి. వివిధ చార్జీల పేరుతో బ్యాంకులు వసూలు చేస్తున్న సొమ్ము ఏటా రూ.500 కోట్ల పైనే ఉంటోంది. బ్యాంకులు రైతులకు 7 శాతం వడ్డీతో రుణాలిస్తే, కేంద్రం బ్యాంకులకు మరో రెండు శాతం కలిపి తొమ్మిది శాతం వడ్డీని చెల్లిస్తోంది. ప్రాధాన్యతా రంగాలకు రుణసాయం అందిస్తున్నందుకుగాను కేంద్రం ఇలా రెండు శాతం వడ్డీని బ్యాంకులకు నేరుగా చెల్లిస్తోంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న బ్యాంకులు కనీసం పంట రుణాలపైన అయినా ‘ప్రాసెసింగ్ ఫీజు’లు వసూలు చేయకూడదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ఏకంగా 11శాతం వడ్డీ వేశారు

నేను 30-7-12న వైఎస్సార్ కడప జిల్లా పాత కడప ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నా. 13-4-13న రుణం చెల్లించాను. ఏడాదిలోపే చెల్లించినా.. మార్చి 30లోపు రుణం చెల్లించలేదన్న కారణంతో 11 శాతం వడ్డీ వసూలు చేశారు. పంటబీమా, వడ్డీ కలుపుకుని లక్ష రూపాయలకు రూ.1,09,160 కట్టించుకున్నారు.
- చంద్రమౌళీశ్వర రెడ్డి, పాత కడప

అదనపు చార్జీలు అన్యాయం

వైఎస్సార్ కడప జిల్లా పాత కడప ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.50,000 రుణం తీసుకున్నా. నా బ్యాంక్ అకౌంట్ నెంబరు.30072089666. నావద్ద నుంచి ప్రాసెసింగ్ ఫీజు రూ.500, ఇన్‌స్పెక్షన్ చార్జీలు రూ.500, అకౌంట్ కీపింగ్ చార్జీలు రూ.550 వసూలు చేశారు. ఈ ఆదనపు చార్జీలను కలుపుకుంటే 10 శాతంకు పైగానే వడ్డీ కట్టినట్టవుతోంది. ఈ చార్జీలు అన్యాయం.
- ధనుంజయ, ఎగువపల్లి, పాత కడప

ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాస్తా

బ్యాంకులు 3 శాతం వడ్డీ రాయితీ ఇవ్వకుండా అక్రమంగా వసూలు చేయడంపై ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాస్తా. బ్యాంకులు ఏడు శాతం వడ్డీతో వ్యవసాయానికి రుణాలు ఇస్తుంటే కేంద్రం అదనంగా మరో రెండు శాతం వడ్డీని బ్యాంకులకు ఇస్తోంది. ఆ రకంగా బ్యాంకులకు పంట రుణాలపై 9 శాతం వడ్డీ జమ అవుతోంది. దాంతో తృప్తి పడకుండా బ్యాంకులు మళ్లీ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో అదనపు వసూళ్లు చేయడం అన్యాయం. 
-ఎంవీఎస్ నాగిరెడ్డి, ఐసీఏఆర్ సభ్యుడు


http://www.sakshi.com/main/FullStory.aspx?catid=582434&Categoryid=1&subcatid=33

ఉప ఎన్నికలు జరిగేలా చూడండి

శాసనసభ సాక్షిగా విప్‌లను ధిక్కరించాం.. మాపై వేటు వేసి ఎన్నికలకు మార్గం సుగమం చేయండి
ఎన్నికలు తప్పించుకునేందుకే కాంగ్రెస్, టీడీపీల కుట్ర.. మా అనర్హతపై తక్షణమే నిర్ణయం తీసుకోండి
కాంగ్రెస్‌తో కుమ్మక్కైన బాబు ప్రతిపక్ష నేతగా అనర్హుడు
ఆయన స్థానంలో వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నేత విజయమ్మను ఎంపిక చేయండి

 శాసనసభ సమావేశాల సాక్షిగా తాము పార్టీల విప్‌లను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశామని, స్పీకర్ సమక్షంలోనే విప్ ఉల్లంఘించినందున దీనిపై విచారణలతో పనిలేకుండా తక్షణమే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. సత్వరమే నిర్ణయం ప్రకటించడం ద్వారా ఉప ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, టీడీపీలు ఉప ఎన్నికలు రాకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నాయని, ఇందులో స్పీకర్ భాగస్వాములు కారాదని విన్నవించారు. తమపై అనర్హత చర్యలు తీసుకున్నా ఉప ఎన్నికలు రాకుండా ఆయా నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై ప్రజల్లోనే తేల్చుకునేందుకు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఉమ్మడి అభ్యర్థులతో పోటీ చేసినా, విడివిడిగా పోటీచేసినా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా విఫలమైనందున ఆయన్ను తొలగించి వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షనేత విజయమ్మను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని కోరారు. పార్టీల విప్‌లను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆయా శాసన సభ్యులకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. వీటిపై ఇప్పటికే వివరణ లేఖలు అందించిన ఆయా ఎమ్మెల్యేలు గురువారం స్వయంగా స్పీకర్‌ను కలసి తమ వివరణలను వినిపించారు. ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, మద్దాల రాజేష్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జోగి రమేష్, వనిత.. స్పీకర్‌ను కలసి ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డిలు తమ వివరణ పత్రాలను ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు పంపారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం ఆయా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

ప్రజా సమస్యలను గాలికొదిలింది: పేర్ని నాని

‘‘కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నా ప్రధాన ప్రతిపక్షం ఆ పార్టీతో కుమ్మక్కైంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది. చిన్న ప్రతిపక్షాలు ప్రజల తరఫున పోరాటం చేస్తూ అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తే మేమంతా ఓటు వేశాం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రజల నమ్మకాన్ని వంచించిన మంత్రివర్గం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రభుత్వ విప్‌గా ఉన్నా విద్యుత్ సర్‌చార్జీలు సరికాదని సీఎంతో అంటే.. నోట్లు ముద్రించమంటావా? ప్రజల నుంచి కాకుండా ఎక్కడి నుంచి తేవాలని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ సమక్షంలోనే విప్‌ను ధిక్కరించినందున విచారణలతో పనిలేకుండా మాపై చర్యలు తీసుకోవాలి. వేటు వేసి ఉప ఎన్నికలు పెట్టించాలని అడుగుతున్నాం. మే 14 తర్వాత ఒక్క సంవత్సరం గడువు కూడా ఉండదు. ఆ తర్వాత అనర్హత ప్రకటిస్తే ఉప ఎన్నికలు రావన్న ఉద్దేశంతో ప్రభుత్వం కాలయాపన చేయిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’.

ప్రతిపక్ష నేతగా బాబు అనర్హుడు: కొడాలి నాని

‘‘టీడీపీ నుంచి నాకు విప్ ఇవ్వలేదు. విప్ ఇచ్చినట్లు స్పీకర్ విశ్వసించిన పక్షంలో వెంటనే నాపై చర్య తీసుకొని ఉప ఎన్నికలు జరిగేలా చూడండని కోరాను. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలన్నట్టు విప్ ఇచ్చినందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా అనర్హుడు. ఆయన్ను తప్పించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ప్రతిపక్ష నేతగా ప్రకటించాలి. ఎన్టీఆర్ స్ఫూర్తిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన చివరి వరకు కాంగ్రెస్ వ్యతిరేకి. నేను కూడా కాంగ్రెస్‌ను చివరి వరకు వ్యతిరేకిస్తాను. మాపై అనర్హత నిర్ణయం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, స్పీకర్ చేతుల్లోనే ఉంది. కాలయాపనతో పనిలేకుండా మాపై అనర్హత వేటు వేయాలి’’.

ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టాలి: మద్దాల రాజేష్

‘‘కాంగ్రెస్‌కు, శాసనసభ్యత్వానికి నేను రాజీనామా చేసి ఆరు నెలలైనా అవి ఏమయ్యాయో ఇప్పటి వరకు తేల్చలేదు. రాజీనామా లేఖను నవంబర్‌లో ఇచ్చినా స్పీకర్ నుంచి స్పందన రాలేదు. నా రాజీనామాలపై తేల్చకుండానే నాకు విప్ ఇవ్వడం హాస్యాస్పదం. విప్ తీసుకున్నప్పుడే అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని చెప్పాను. ప్రభుత్వమో, చంద్రబాబో ఇచ్చే డెరైక్షన్లో కాకుండా చట్టబద్ధంగా వెంటనే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వానికి ధైర్యముంటే రాజీనామా ఆమోదించి ఎన్నికలు నిర్వహించాలి’’

కాంగ్రెస్, టీడీపీ పారిపోతున్నాయి: జోగి రమేష్

ఉప ఎన్నికలు ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్, టీడీపీ పారిపోతున్నాయి. దొడ్డిదారిన ఏడాదిపాటు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ టీడీపీలకు ఒక్కటే సవాల్ విసురుతున్నాం. ఉప ఎన్నికలు పెట్టించండి. మీరిద్దరు కలసికట్టుగా కానీ, విడివిడిగా కానీ ఉమ్మడి అభ్యర్థులను పెట్టుకొని కానీ మాపై పోటీ చేయాలి. ఆ సత్తా ఉందో లేదో చెప్పాలి. ఏడాదిపాటు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా లేకుండా చేసినా ప్రజల్లో మాపై మరింత విశ్వాసం పెరుగుతుందే తప్ప మరేమీ కాదు. స్పీకర్ ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తికాదు కనుక సరైన నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకోకపోతే అధికార పార్టీకి తొత్తుగా మారినట్లు భావించాల్సి ఉంటుంది.’’

ఇంకా వివరణలెందుకు: ద్వారంపూడి

స్పీకర్ ఉన్న అధికారాలతో మాపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వివరణలతోనో, ఫార్మాట్‌లో రాజీనామా లేఖల తోనో అవసరం లేదు. నిండు సభలో పార్టీ విప్ ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే ఇక మా వివరణలు, రాజీనామా లేఖలతో పనేంటి? వెంటనే అనర్హత చర్యలు తీసుకొని ఎన్నికలు పెట్టించండి. ప్రజల తీర్పు కోరి ఎవరిపై వారికి విశ్వాసముందో తేల్చుకుందాం..’’

కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు దక్కవు: పెద్దిరెడ్డి

ఉప ఎన్నికలొస్తే వైఎస్సార్ కాంగ్రెస్ అన్నీ సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడం ఖాయం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన నిలవాలి. ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజ్యాంగాన్ని గౌరవించినట్లవుతుంది. ఎన్నికలొస్తే చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కదు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఓడిపోవడం ఖాయం.

ఓటమి భయంతోనే వెనకడుగు


ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్, మండల పరిషత్‌లను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడం తథ్యమని జోస్యం చెప్పారు. అలాగే అత్యధికంగా గ్రామ పంచాయతీలను మా పార్టీయే గెలుచుకుంటుందన్నారు. ఈ విషయాలన్నీ తెలిసే కాంగ్రెస్‌పార్టీ ఎక్కడ తమ పరువు పోతుందోనని స్థానిక ఎన్నికలను వాయిదావేయాలని చూస్తోందన్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు. 

దీనికితోడు ప్రత్యేక అధికారులు పూర్తిస్థాయిలో గ్రామాల్లో పర్యటించలేకపోతున్నారన్నారు. ఈ కారణంగా గ్రామీణులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. కనీసం వీధిదీపాలు కూడా వెలిగించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపని కారణంగా కేంద్రప్రభుత్వం నుంచి రావల్సిన రూ. 2,500 కోట్లు ఆగిపోయాయన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి భయంతో వణికిపోతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని మెజార్టీ శాసనసభ్యులు, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిలకు విన్నవించుకున్నారని ప్రసన్న చెప్పారు. వీళ్లు ఒక నివేదికతో ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో సంప్రదించి ఏదో ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయాలని విశ్వప్రయత్నం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.

ఆరోగ్యశ్రీ మీద సర్కారు నిర్లక్ష్య వైఖరిపై షర్మిల ధ్వజం

ఈ పథకం అందక వందలాది మంది 
నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు 
వైఎస్ మరణించాక ఆరోగ్యశ్రీ పరిధిలోకొచ్చే 
రోగాల సంఖ్య కుదించారు ఈ పాలకులు
మహానేత ఉన్నప్పుడు 108కు ఫోన్ చేస్తే.. కుయ్.. కుయ్ అంటూ 20 నిమిషాల్లో వచ్చేది
ఇప్పుడు ఫోన్ చేస్తే.. అంబులెన్స్‌లో డీజిల్ లేదంటున్నారు
ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు 
మద్దతివ్వకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
వైఎస్ పెట్టిన ప్రతిపథకానికీ జగనన్న జీవం పోస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 124, కిలోమీటర్లు: 1,679.9

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘తాను అనారోగ్యానికి గురైనప్పుడు ఏవిధంగానైతే పెద్దాసుపత్రికి పోయి వైద్యం చేయించుకుంటానో.. అలాగే పేదోడికి కూడా రోగమొచ్చినప్పుడు వారు కూడా ధైర్యంగా అదే పెద్దాసుపత్రికి వచ్చి తన మంచం పక్కనే ఒక మంచం వేసుకొని వైద్యం చేయించుకోవాలనే గొప్ప ఆలోచనతో మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు. ఆయన మరణించిన తర్వాత ఈ పాలకులు పథకాన్ని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ పథకంలోని రోగాల సంఖ్యను కుదించారు. 

దీంతో పథకం వర్తించక, తాము భరించే ఆర్థిక స్తోమత లేక, ఆత్మీయుల్ని గాలికొదిలేసి చంపుకోలేక ప్రజలు నరకం చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ తాత మదార్ సాహెబ్ అల్లుళ్ల మరణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాలకులను నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో సాగింది. 

ఈ సందర్భంగా వీరులపాడు మండల కేంద్రం మీదుగా షర్మిల వెళుతున్నప్పుడు మదార్ సాహెబ్ అనే ఓ నిర్భాగ్యుడు ఆమెను కలిసేందుకు ముందుకురావడానికి యత్నించాడు. అది చూసి రోడ్డు దిగి ఆయన దగ్గరకే వెళ్లి షర్మిల పలకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం అందకపోవడం వల్ల తన కుటుంబం చితికిపోయిందని, తన అల్లుళ్లు మరణించారని గోడు చెప్పుకొంటూ సాహెబ్ కన్నీరుమున్నీరయ్యాడు. అది విని చలించిపోయిన షర్మిల ఉద్వేగంగా మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు.

ఏమైందీ సాహెబ్ కుటుంబానికి?

షేక్ మదార్ సాహెబ్(70) ఓ పేద ముస్లిం. కాయకష్టం చేయడం తప్ప మరో వ్యసనం లేని వ్యక్తి. పేదోడే కానీ కూడుకు లోటు లేదు. ఐదుగురు ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు. వచ్చిపోయే చుట్టాలు, మనవళ్లు, మనవరాళ్లతో ఆయన ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉండేది. వైఎస్సార్ హయాంలో ఈయనకు పక్కా ఇల్లు, వృద్ధాప్య పింఛన్ వచ్చాయి. 2009లో మూత్ర కోశ వ్యాధి సోకితే దర్జాగా కార్పొరేటు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చిన 15 రోజుల తరువాత వైఎస్సార్ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు. అది తెలిసి తట్టుకోలేక మదార్ సాహెబ్ మంచాన పడ్డాడు.. 15 రోజుల పాటు తిండిలేదు.. ఐదుగురు బిడ్డలు.. అల్లుళ్లు వచ్చారు. ‘జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తున్నారు. 

మన బతుకులకు ఇబ్బంది ఉండదు, దిగులుపడొద్దు’ అని ధైర్యం చెప్పారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఏడాది కాలం కాలగర్భంలో కలిసిపోయింది. మూడో అల్లుడు జబ్బు పడ్డాడు. ప్రాణాపాయం ఉందని తెలిస్తే.. మదార్ సాహెబ్ అల్లుని కోసం అతను ఉంటున్న నిదానపురం గ్రామం వెళ్లాడు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని తాను ఆపరేషన్ చేయించుకున్న ఆసుపత్రికే అల్లుడిని కూడా తీసుకెళ్లాడు. అది చెల్లదని, మీ అల్లుడికి వచ్చిన రోగాన్ని ఆరోగ్యశ్రీ నుంచి తీసేశారని, డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెగేసి చెప్పాయి. తాను భవిష్యత్తు కోసం వెనకేసుకున్న రూ. 30 వేలు ఖర్చు చేశాడు.. కానీ అవి ఏమాత్రం సరిపోలేదు. విధిలేని పరిస్థితిలో అల్లుడిని ఇంటికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులకు అతను చనిపోయాడు. దీంతో సాహెబ్ కుంగిపోయాడు.

మరో అల్లుడు కూడా..

మరో ఏడాది గడిచిపోయింది. పెద్ద కూతురు నాగులు భర్తకు కూడా ఆరోగ్యం చెడిపోయింది. ఆయనకూ అదే పరిస్థితి.. ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదని చెప్పారు. వైద్యం చేయించడానికి చిల్లిగవ్వలేక పెద్దల్లుడిని తిరిగి ఇంటికే తీసుకొచ్చాడు. నెల రోజుల్లో పెద్దల్లుడు కూడా చనిపోయాడు. ఇది సాహెబ్‌ను కుంగదీసింది. ఇంతలో జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టారని తెలిసింది. వైఎస్ అన్నా.. ఆయన కుటుంబమన్నా సాహెబ్‌కు వల్లమాలిన అభిమానం. వరుస సంఘటనలలో మదార్ సాహెబ్ మంచాన పడ్డాడు. ఓ రోజు రాత్రి సమయంలో ఇంటి ముందు మంచంలో కూర్చొని ఉండగా.. ఏదో విష పురుగు కుట్టింది. ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేక నాటు వైద్యం చేయించుకున్నాడు. కాలుకు విషం పాకినంత వరకు పుండుగా మారింది. ఆసుపత్రికి తీసుకొని వెళితే కాలు తీసేయాలని చెప్పారు. మనసు అంగీకరించక ఇంటికి తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆయన చాలా కష్టంగా నడుస్తున్నాడు. కాలు తీసి కాలు వేయడానికి నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈయన కన్నీటి గాథ విని షర్మిల తీవ్ర ఉద్యేగానికి లోనయ్యారు.. ఏదైనా మంచి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాలని పక్కనే ఉన్న డాక్టర్ హరికృష్టను కోరారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అందక ప్రజలు మరణిస్తున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ‘‘వైఎస్సార్ సువర్ణయుగంలో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే... ఫోన్ చేసిన 20 నిమిషాల లోపు కుయ్..కుయ్..కుయ్.. అనుకుంటూ అంబులెన్స్ వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని పోయేది. ఇప్పుడు 108కు ఫోన్ చేస్తే మా అంబులెన్స్‌లో డీజిల్ లేదు.. మా ఉద్యోగులకు జీతాలు లేక ధర్నా చేస్తున్నారనే సమాధానం చెప్తున్నారు. ప్రజల్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. తాతా.. మీకు మాటిచ్చి చెప్తున్నాను. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న రాజ్యంలో ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలతో పాటు వైఎస్సార్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికి జగనన్న జీవం పోస్తారు. అంతవరకు మీరు ఓపిగ్గా, ధైర్యంగా ఉండండి’’ అని ఆమెకు భరోసా ఇచ్చారు.

14.1 కి.మీ. మేర యాత్ర..

పాదయాత్ర 124వ రోజు గురువారం కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం తోటమూల నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వీరులపాడు, పల్లంపల్లి, దాములూరు మీదుగా యాత్ర చేసిన షర్మిల.. కొణతాత్మకూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. గురువారం ఆమె 14.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,679.9 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, నేతలు వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతంరెడ్డి, స్థానిక నాయకులు వెస్లీ, పర్సా పురుషోత్తం, వేజెండ్ల శివశంకర్, కె. గురువయ్య తదితరులున్నారు.

Popular Posts

Topics :