21 April 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్‌ఆర్‌ సీపీలో 10వేల మంది చేరిక

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

విజయనగరం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బలిజపేటలోని 20 గ్రామాలకు చెందిన 10వేల మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. వీరిని అంబటి రాంబాబు, పెన్మత్స సాంబశివరాజు, సుజయ్‌కృష్ణ రంగారావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
 - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=587933&Categoryid=14&subcatid=0#sthash.A6tQXBi8.dpuf

వైఎస్‌ఆర్‌ స్మృతివనానికి విద్యుత్‌ నిలిపివేత

నల్లకాలువ: కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాలువలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతి వనానికి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. బిల్లు చెల్లించలేదన్న ఏకైక కారణంతో విద్యుత్ సరఫరా ఆపేశారు. అధికారుల తీరుపై వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఖల్‌నాయక్‌::


ఖమ్మం: దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు నాయకుడు కాదు ఖల్‌నాయక్‌ అన్నారు. త్వరలో జగనన్న బయటకు వచ్చి సీఎం అవుతారని, రాజన్నరాజ్యం తెస్తారని చెప్పారు. షర్మిల నేటి పాదయాత్ర శివాయిగూడెంలో ముగిసింది. అంతకుముందు శివాయిగూడెం సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.కాంగ్రెస్ కు బాబు సాయం: ద్వారంపూడి
               
కాకినాడ: వైఎస్‌ఆర్ జనం గుండెల్లో ఉన్నారన్న విషయం మరచి కాంగ్రెస్‌, టీడీపీలు కుట్రపన్ని వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టించాయని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. తనపై కేసులు లేకుండా చూసుకునేందుకే రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి అవిశ్వాస సమయంలో కాంగ్రెస్ చంద్రబాబు సాయపడ్డారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణం చంద్రబాబే.. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టి ఉంటే ఈనాడు ప్రజలకు విద్యుత్ కష్టాలు ఉండేవి కాదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి సమక్షంలో డెయిరీ ఫాం సెంటర్‌కు చెందిన 500 మంది వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.


- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=587925&Categoryid=14&subcatid=0#sthash.XeFSxXhS.dpuf

Special Edition "Prajala Kosam Evaru''

YS Vijayamma speech in Vikarabad, Ranga Reddy district

Vijayamma conducts rachabanda at Chittampalli

Vijayamma conducts rachabanda at Chevella

Sharmila comment on Chandrababu Padayatra

Special edition on 'Tadakha'

YS Sharmila spech in khammm mamata college

మీ సమస్యలు జగన్ కు చెబుతాను: విజయమ్మ

రంగారెడ్డి జిల్లా చెట్టింపల్లి గ్రామంలో జరిగిన రచ్చబండలో రైతులు, మహిళలు తమ సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు మొరపెట్టుకున్నారు. విద్యుత్ సక్రమంగా సరఫరా కావడంలేదని, విద్యుత్ బిల్లులు గతంలో కంటె ఎక్కువ వస్తున్నాయని తెలిపారు. కొందరు పెన్షన్ రావడంలేదని, రేషన్ కార్డులు ఇవ్వడంలేదని తెలిపారు. ప్రజల సమస్యలను విన్న విజయమ్మ మాట్లాడుతూ 'మీ సమస్యలన్ని జగన్ కు చెబుతాను' అన్నారు.

జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్ పథకాలు

వైఎస్ఆర్‌ కుటుంబం మాట ఇస్తే.....తప్పే కుటుంబం కాదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం రచ్చబండ నిర్వహించిన ఆమె ప్రజల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే సంక్షేమ రాజ్యం అందిస్తారని హామీ ఇచ్చారు. అలాగే వైస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్ని మళ్లీ అమల్లోకి వస్తాయని తెలిపారు. 

YS Vijayamma conducts rachabanda starts at chevella part1

'మా జీవితాలు దుర్భరమైపోయాయి...'

చేవెళ్ల : వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని పథకాలు అందేవని..... ప్రస్తుతం ఏ పథకం అందక తమ జీవితాలు దుర్భరమైపోయాయని వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో చేవెళ్ల ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఒకరు అధికంగా వచ్చిన కరెంట్ బిల్లులను చూపిస్తే...పింఛన్లు రావటం లేదని వృద్ధులు కన్నీరు పెట్టారు. ఏం తినాలి, ఎట్లా బతకాలని వారు ఆవేదన చెందారు. వైఎస్ బతికి ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావన్నారు.

రూ.1 కిలో బియ్యం ఇచ్చి మరోవైపు కూరగాలయల ధరలు పెంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏకష్టాలు వచ్చినా వైఎస్‌... తమ దగ్గరకు వచ్చేవారని, ఇప్పుడు తమ సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. తాగునీరు...డ్రైనేజీ, రేషన్ కార్డు, అమ్మ హస్తం సరుకులు ఇవ్వడం లేదని వారు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వృద్ధులకు ఫించన్లు పెంచుతారని ఈ సందర్భంగా విజయమ్మ హామీ ఇచ్చారు. 


YS Vijayamma rachabanda at chevella

చదువు'కొన'లేకపోతున్నారు: షర్మిల

 ఉన్నత విద్యతోనే అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోగలమని వైఎస్ షర్మిల అన్నారు. చదువుతోనే పేదరికాన్ని పారదోలగలమన్ని ఆమె పేర్కొన్నారు. షర్మిల శనివారం ఉదయం విద్యా, ఉపాధి అవకాశాలపై ఖమ్మం మమత కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ విద్యార్థుల్లోని ప్రతిభను బయటకు తీసేందుకు వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో తాపత్రయపడ్డారని అన్నారు.

దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్‌ చనిపోవడంతో పథకాలను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటంతో విద్యార్థులు చదువు కొనలేకపోతున్నారన్నారు. వైఎస్ఆర్‌ డాక్టర్‌ కావడం వలనే ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకున్నారని ఆమె అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు ఆయన డాక్టర్‌గా ఆలోచించడం వలనే పుట్టుకొచ్చాయని తెలిపారు. అందరూ బాగా చదివి దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడాలని షర్మిల ఆకాంక్షించారు. 

చేవెళ్ల బయల్దేరిన విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం ఉదయం లోటస్ పాండ్ నుంచి చేవెళ్ల బయల్దేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ తరలివచ్చారు. రాష్ట్ర ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలుసుకుని వారికి భరోసా కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఆమె రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పంటలు ఎండిపోయిన రైతుల పొలలాలను, మౌలిక వసతుల్లేక ఇబ్బంది పడుతున్న దళితుల కాలనీలను విజయమ్మ సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

గోప్యంగా ఉంచాల్సిన నివేదికను కేంద్రం ముందు పరిచిన సీబీఐ

అడిగి తెప్పించుకుని మరీ పరిశీలించిన న్యాయ మంత్రి అశ్వనీకుమార్
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బయటపెట్టిన సీబీఐ డెరైక్టర్
ప్రధాని కార్యాలయం, బొగ్గు శాఖ ఉన్నతాధికారులు కూడా చూశారని వెల్లడి
యూపీఏలో ప్రకంపనలు.. విపక్షాలు భగ్గు.. అశ్వనీ రాజీనామాకు పట్టు
కోర్టుకు సమర్పించేదాకా గోప్యంగా ఉంచాల్సిన నివేదికను కేంద్రం ముందు పరిచిన సీబీఐ
కాంగ్రెస్ జేబు సంస్థగా మారిన వైనానికి మరో ఉదాహరణ
రాజకీయ క్రీడలో పావుగా వాడుకుంటున్న అధికార పార్టీ
సీబీఐ మాజీ సారథులు కూడా అంగీకరించిన వాస్తవమిది
తాజాగా ప్రస్తుత డెరైక్టర్ నోటా పరోక్షంగా అదే మాట

‘ప్రమాణ’పూర్వకంగా...

స్థాయీ నివేదికను 2013 మార్చి 8న సుప్రీంకోర్టుకు సమర్పించడానికి ముందే దాని తాలూకు ముసాయిదాను కేంద్ర న్యాయ మంత్రితో పంచుకోవడం జరిగింది. ఆయన కోరిన మీదటే అలా చేయాల్సి వచ్చింది. ప్రధాని కార్యాలయం, కేంద్ర బొగ్గు శాఖల్లోని సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు కూడా ముసాయిదాను ముందే చూశారు. వారు కోరిన మీదటే అలా చేయాల్సి వచ్చింది.
- శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా

బొగ్గు కుంభకోణంపై స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించక ముందే దాని ముసాయిదాను కేంద్ర న్యాయ మంత్రి అశ్వనీకుమార్ తెప్పించుకుని చూశారు. ఆయనతో పాటు ప్రధాని కార్యాలయం, కేంద్ర బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శులు కూడా ముసాయిదాను చదివారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాయే స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు!

ముసాయిదాను చూశాక అందులో కేంద్రం ఏమైనా మార్పుచేర్పులు చేసిందా అన్న అంశంపై మాత్రం ఆయనేమీ చెప్పలేదు. అన్నీ సుప్రీంకే నేరుగా చెబుతానని ప్రకటించి ఇటు ప్రజల్లో సస్పెన్స్‌ను, అటు యూపీఏ సారథి కాంగ్రెస్‌లో ఆందోళనను పెంచారు.

సీబీఐకి మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలా అన్నది సుప్రీంకోర్టు పరిధిలోని విషయమంటూ ఈ సందర్భంగా సిన్హా నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. తద్వారా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితేమిటో చెప్పకనే చెప్పారు.

బొగ్గు గనులను యూపీఏ సర్కారు వేలం వేయకుండా స్క్రీనింగ్ కమిటీ పేరుతో ఇష్టానికి కేటాయించడం ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలకు ఏకంగా రూ.1.86 లక్షల కోట్ల మేరకు అనుచిత లబ్ధి చేకూర్చిందని 2012 ఆగస్టులో పార్లమెంటుకు సమర్పించిన తుది నివేదికలో కాగ్ పేర్కొంది. అనంతరం పౌర సమాజం ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా విషయం సుప్రీంకోర్టుకు చేరింది.

అవసరార్థం అటు రాజకీయ ప్రత్యర్థులపైకి దర్యాప్తు సాకుతో ఉసిగొల్పడంతో పాటు, ఇటు సొంత తప్పిదాల్ని వీలైనంతగా కప్పిపుచ్చుకోవడానికి కూడా సీబీఐని అధికార కాంగ్రెస్ అడ్డంగా వాడుకుంటున్న వైనాన్ని దర్యాప్తు సంస్థ డెరైక్టరే సుప్రీంకోర్టు ముందు స్వయంగా, ప్రమాణపూర్వకంగాఅఫిడవిట్ రూపంలో బయటపెట్టారు!

బొగ్గు భగ్గుమంది. ‘చేతి’ నిండా దట్టంగా మసి అంటుకుంది. అంతులేని అవినీతికి ఆలవాలంగా మారిన బొగ్గు కుంభకోణం క్రమంగా యూపీఏ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కేసు దర్యాప్తులో వేలు పెట్టేందుకు తెగించిన అధికార సంకీర్ణం.. ఆ వైనాన్ని సీబీఐ సారథే స్వయంగా బయట పెట్టడంతో అడ్డంగా బుక్కయింది. సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన స్థాయీ నివేదికను కాంగ్రెస్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతకు ముందే ‘చే’జిక్కించుకుందని సంస్థ డెరైక్టర్ రంజిత్ సిన్హా శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి ప్రమాణపూర్వకంగా నివేదించారు. సాక్షాత్తూ కేంద్ర న్యాయ మంత్రే నివేదిక ముసాయిదాను అడిగి మరీ తెప్పించుకుని ఆద్యంతం పరిశీలించారని కోర్టుకు అఫిడవిట్ రూపంలో వివరించారు. కోర్టుకు సమర్పించేదాకా గోప్యంగా ఉంచాల్సిన ఆ నివేదికను ప్రధాని కార్యాలయంతో పాటు బొగ్గు శాఖ కూడా ముందుగానే చదివేశాయని పేర్కొన్నారు. 

తద్వారా పెను రాజకీయ దుమారానికి తెర తీయడమే గాక... సీబీఐని కాంగ్రెస్ పూర్తిగా తన జేబు సంస్థగా మార్చుకుందని కూడా చెప్పకనే చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థను తన రాజకీయ క్రీడలో పావుగా వాడుకుంటూ వస్తున్న వాస్తవాన్ని మరోసారి బట్టబయలు చేశారు. సుప్రీంకోర్టు స్వీయ పర్యవేక్షణలో సీబీఐ జరుపుతున్న దర్యాప్తుకే ఈ పరిస్థితి ఉంటే.. ఇక ఇతర కేసులు, మరీ ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై కాంగ్రెస్ బనాయిస్తున్న కక్షసాధింపు కేసులను దర్యాప్తు సంస్థ ఎంత వివక్షపూరితంగా విచారిస్తుందో వివరించాల్సిన పని లేదని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసును సీబీఐ విచారిస్తున్న తీరే అందుకు ప్రత్యక్ష తార్కాణమని గుర్తు చేసింది. బీజేపీ, వామపక్షాలు సహా విపక్షాలన్నీ సీబీఐ అఫిడవిట్ ఉదంతంపై భగ్గుమన్నాయి. 

సీబీఐ పూర్తిగా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందనేందుకు ఇది తాజా ఉదాహరణ అన్నాయి. న్యాయ మంత్రి అశ్వనీకుమార్ తక్షణం తప్పుకోవాలని డిమాండ్ చేశాయి. సీబీఐ డెరైక్టర్ అఫిడవిట్ దెబ్బతో యూపీఏ సర్కారు సుప్రీంకోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది! ఈ ఉదంతంపై సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని దేశమంతా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అందరి దృష్టీ కేసు తదుపరి విచారణ జరిగే ఏప్రిల్ 30పైనే కేంద్రీకృతమైంది...

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీబీఐ జరుపుతున్న దర్యాప్తులో కేంద్రం అనుచిత జోక్యం చేసుకుందని బాహాటంగా రుజువైంది. బొగ్గు కుంభకోణంపై తాము రూపొందించిన స్థాయీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించక ముందే దాని ముసాయిదాను కేంద్రంతో పంచుకున్నామని సీబీఐ డెరైక్టర్ స్వయంగా అంగీకరించారు. న్యాయ మంత్రి అశ్వనీకుమార్ ముసాయిదాను ముందుగానే ఆసాంతం చదివారని వెల్లడించారు. పైగా, మంత్రి స్వయంగా కోరిన మీదటే దాన్ని ఆయన ముందు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. అంతేకాదు, ‘‘ప్రధాని కార్యాలయం, కేంద్ర బొగ్గు శాఖలకు చెందిన ఇద్దరు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు కూడా ముసాయిదాను ముందుగానే చూశారు. 

మంత్రి అయినా, ఉన్నతాధికారులైనా స్వయంగా కోరిన మీదటే ముసాయిదా ప్రతిని వారితో పంచుకోవాల్సి వచ్చింది’’ అని కూడా సిన్హా స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు శుక్రవారం ఆయన సమర్పించిన రెండు పేజీల సంచలనాత్మక అఫిడవిట్ దేశమంతటా పెను రాజకీయ దుమారం సృష్టిస్తోంది. దానికి తోడు, ముసాయిదాలో కేంద్రం ఏమైనా మార్పుచేర్పులు చేసిందా అన్న అతి కీలకాంశంపై అఫిడవిట్‌లో సిన్హా మౌనం వహించారు! కేంద్రమే స్వయంగా కల్పించుకుని మరీ స్థాయీ నివేదిక తాలూకు తీవ్రతను వీలైనంతగా తగ్గించిందంటూ విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. పైగా, బొగ్గు కుంభకోణం నివేదికను ప్రభుత్వంతో ఏ దశలోనూ ఏ విధంగానూ పంచుకోలేదని గతంలో సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పగా... అది అవాస్తవమని ఇప్పుడు ఆ సంస్థ సారథే ప్రమాణపూర్వకంగా అంగీకరించడం మరింత సంచలనం సృష్టిస్తోంది. నివేదికను సీబీఐ డెరైక్టర్ పరిశీలించాక దాన్ని నేరుగా సుప్రీంకోర్టుకు మాత్రమే సమర్పించినట్టు దర్యాప్తు సంస్థ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్ మార్చి 12న కోర్టుకు విన్నవించారు. దాంతో ఈ విషయమై కోర్టు అసాధారణ రీతిలో స్పందించింది. 

‘‘స్థాయీ నివేదికను మీరే స్వయంగా పరిశీలిస్తున్నారని, అందులోని వివరాలను రాజకీయ కార్యనిర్వాహక విభాగంతో పంచుకోలేదని, ఇకముందు సమర్పించబోయే నివేదికలను కూడా మీరే స్వయంగా పరిశీలిస్తారని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించండి’’ అని సీబీఐ డెరైక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిన్హా అఫిడవిట్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో, అది ఇంకెన్ని పెను సంచలనాలకు దారి తీస్తుందో చూడాల్సిందేనంటున్నారు. అందరి కళ్లూ కేసులో తదుపరి విచారణ జరగబోయే ఏప్రిల్ 30వ తేదీ మీదే కేంద్రీకృతమయ్యాయి. బొగ్గు కుంభకోణంపై ఇకముందు సుప్రీంకు సమర్పించే ఏ నివేదికనూ కేంద్రానికి సంబంధించిన ఎవరికీ వెల్లడించబోనంటూ సిన్హా ప్రమాణం చేశారు. తాజా స్థాయీ నివేదికను కూడా ఎవరితోనూ పంచుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు, స్థాయీ నివేదికను ప్రభుత్వంతో పంచుకోలేదని సుప్రీంకు చెప్పిన హరీన్ రావల్‌ను కేసు బాధ్యతల నుంచి తప్పించారు. ఇకపై సీబీఐ తరఫున ఉదయ్ లలిత్ న్యాయవాదిగా వ్యవహరిస్తారు.

పౌర సమాజం స్పందనతో...

బొగ్గు కుంభకోణంలో తాజా వివాదానికి కేంద్ర బిందువైన స్థాయీ నివేదికను మార్చి 8న సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించింది. 2006-09 మధ్య పలు కంపెనీలకు కేంద్రం చేసిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులు, సదరు కంపెనీల అర్హతలను మాత్రం సరిచూసుకోకుండానే జరిగాయంటూ అందులో ఆక్షేపించింది. పైగా ఆ కంపెనీలకే ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో కూడా బొగ్గు శాఖ ఎలాంటి వివరణా ఇవ్వలేదంటూ తప్పుబట్టింది. కేటాయింపుల విషయంలో ప్రభుత్వ సంస్థలు పాల్పడ్డ పలు అవకతవకలు దర్యాప్తులో స్పష్టంగా బయట పడ్డాయని కూడా పేర్కొంది. ‘‘ఈ విషయమై దాదాపు 300 కంపెనీలపై తమ దర్యాప్తు సాగుతోంది. 1993 నుంచి, నిర్దిష్టంగా 2006-08 మధ్య బొగ్గు గనుల కేటాయింపులు పొందిన ప్రతి కంపెనీ మా దర్యాప్తు పరిధిలో ఉంది. ఇప్పటికి 12 కంపెనీలపై దర్యాప్తు ముగిసింది. 9 కంపెనీలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి’’ అని గతంలో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. కేంద్రం మాత్రం దర్యాప్తు సంస్థ వాదనలను ఖండించింది. కేటాయింపుల మంచిచెడులను నిర్ణయించే పరిధి సీబీఐకి లేదని వాదించింది. 

బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ పౌర సమాజ సభ్యులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి, ఎల్.రాందాస్, టీఎస్‌ఆర్ సుబ్రమణియన్, ఎంఎల్ శర్మ తదితరులు వారిలో ఉన్నారు. దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు బొగ్గు క్షేత్రాల కోసం భారీ సంఖ్యలో కంపెనీలు దరఖాస్తు చేసుకున్నా, కేవలం ‘ఎంపిక చేసిన’ కొన్నింటికి మాత్రమే ఎందుకు వాటిని కట్టబెట్టాల్సి వచ్చిందంటూ కేంద్రాన్ని గతంలోనే నిలదీసింది. ఈ విషయమై ఎలాంటి న్యాయ ప్రక్రియనూ చేపట్టని పక్షంలో మొత్తం కేటాయింపులనే రద్దు చేయాల్సి రావచ్చని కూడా హెచ్చరించింది.

కేంద్రం రిమోట్‌తోనే: జోగిందర్ సింగ్

కేంద్రం కనుసన్నల్లోనే సీబీఐ పనిచేస్తుందని..ఏమాత్రం స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం దానికి లేదని.. స్వయంగా ఆ సంస్థ మాజీ డెరైక్టర్ జోగిందర్‌సింగ్ వెల్లడించారు. ఆయన 2012 మే 12న ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీబీఐ ‘ఎలా పనిచేస్తుందో’ పూసగుచ్చినట్లు వివరించారు. ‘‘కేంద్రం ప్రతి దశలోనూ సీబీఐకి తాను చెప్పదలచుకున్న దాన్ని హోంశాఖ న్యాయ సలహాదారుల ద్వారా చెప్తుంది. సీబీఐ పూర్తిగా వారి సూచనలు, నిర్దేశాల మేరకే పనిచేయాల్సి ఉంటుంది. వారేం చెప్తే అది చేయాల్సిందే. దాన్ని తోసిపుచ్చేందుకు సంస్థకు ఎలాంటి అవకాశమూ లేదు. సీబీఐ ఒక్కో కేసులో ఒక్కో విధంగా పనిచేస్తుంది. హోంశాఖ లీగల్ అధికారుల ద్వారా ప్రభుత్వం ముందుగా సీబీఐకి సలహా ఇస్తుంది. తర్వాత దాన్ని మార్చుకుంటుంది. ఆ మేరకు సీబీఐ దర్యాప్తు తీరూ మారుతుంది. అలా ఆ సంస్థ నిందలపాలవుతుంది. కానీ.. తెరవెనుక ఉండి కథ నడిపించే వారు మాత్రం ఎప్పటికీ బయటకు రారు. ఇది పూర్తిగా వాస్తవం’’ అని ఆయన స్పష్టంచేశారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=587553&Categoryid=1&subCatId=32

జన సునామి...ఖమ్మం జన గుమ్మమైంది

జన సునామి...ఖమ్మం జన గుమ్మమైంది...అభిమానం పోటెత్తింది...మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు...ఏ వీధిలో చూసినా జగనన్న చె ల్లెలు కోసం ఎదురుచూపులు...పిన్నలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ రోడ్లెక్కడంతో రహదారులు కిటకిటలాడాయి... భవనాలు, చెట్లెక్కి ప్రజలు షర్మిలకు అభివాదం చేశారు...జడ్పీ సెంటర్‌లో జరిగిన సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనం హాజరయ్యారు.

మహానేత ఆశయ సాధన కు జగనన్న వదిలిన బాణం దూసుకొస్తోంది. జనప్రభంజనం సృష్టిస్తోంది...కుట్రలు కుతంత్రాలు ఛేదిస్తూ ‘మరో ప్రజాప్రస్థాన’మై ముందుకు కదులుతోంది. రాజన్న తనయ...జగనన్న సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రతో శుక్రవారం ఖమ్మం నగరం జనసంద్రమైంది. వేలాదిగా ప్రజలు వెంటరాగా...అడుగడుగునా అభిమానం పోటెత్తగా... కష్టాలు చెప్పుకునేందుకు ఎదురొచ్చిన వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకొని..‘త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది...జగనన్న హయాంలో మీ కష్టాలు తొలగుతాయి..’అంటూ ప్రజలకు భరోసానిస్తూ షర్మిల జిల్లాలో ఐదోరోజు యాత్రను ముగించారు.

ఘన స్వాగతం...‘రాజన్న బిడ్డ వస్తోందని వచ్చా..పెద్దతండా దగ్గర రోడ్డు పక్కన ఆగిన..మస్తుమంది జనం ఉన్నరు..ఆమెను జూస్తనో లేదో అనుకున్నా..ఆమే నా దగ్గరకు వచ్చింది..తాతా బాగున్నవా అంది. నా కళ్లలో నీళ్లుదిరిగినయి. ఏముంది బిడ్డా.. ముసలోన్ని..వికలాంగుడిని.. గీ సీఎం నాకు పింఛన్ ఇత్తలేడు.. నేనెట్ల బతకాలి.. అన్న వెంటనే ‘నీకు పింఛన్ నేనిస్తా తాతా.. జగనన్న సీఎం అయ్యేదాక ప్రతినెలా రూ.వెయ్యి ఇస్తానంది నాతల్లి’. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారు. మా రాజన్న బిడ్డ పులి అన్నారు శివరాత్రి రామారావు. 
- న్యూస్‌లైన్, ఖమ్మం రూరల్


ఓవైపు కలకోట సింధు డప్పు కళాబృందం వారి నృత్యాలు...మరోవైపు బోనాలు ఎత్తుకొని మహిళలు... పాలేరు నియోజకవర్గంలో నుంచి మరోప్రజాప్రస్థానం ఖమ్మం నగరంలోకి అడుగిడుతుండగా మున్నేరు వంతెన వద్ద షర్మిల పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. కళాకారుల నృత్యాలు, డప్పువాయిద్యాలు, మహిళా కార్యకర్తల ఆటపాటలతో కాల్వొడ్డు నుంచి పాదయాత్ర ముందుకు సాగింది. మంగళహారతులతో స్వాగతం పలికారు.
- న్యూస్‌లైన్, ఖమ్మం అర్బన్

అభయమిచ్చారు...
‘రాజన్న బిడ్డ వస్తోందని వచ్చా..పెద్దతండా దగ్గర రోడ్డు పక్కన ఆగిన..మస్తుమంది జనం ఉన్నరు..ఆమెను జూస్తనో లేదో అనుకున్నా..ఆమే నా దగ్గరకు వచ్చింది..తాతా బాగున్నవా అంది. నా కళ్లలో నీళ్లుదిరిగినయి. ఏముంది బిడ్డా.. ముసలోన్ని..వికలాంగుడిని.. గీ సీఎం నాకు పింఛన్ ఇత్తలేడు.. నేనెట్ల బతకాలి.. అన్న వెంటనే ‘నీకు పింఛన్ నేనిస్తా తాతా.. జగనన్న సీఎం అయ్యేదాక ప్రతినెలా రూ.వెయ్యి ఇస్తానంది నాతల్లి’. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారు. మా రాజన్న బిడ్డ పులి అన్నారు శివరాత్రి రామారావు. - న్యూస్‌లైన్, ఖమ్మం రూరల్

ఆదుకుంటాం....
‘అమ్మా 50 మంది మానసిక వికలాంగులున్న కేంద్రాన్ని నిర్వహిం చాలంటే కష్టంగా ఉంది. వైఎస్ హయాంలో స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించేవారు. ప్రస్తుత ప్రభుత్వాలు నిధులు విడుదల చేయక సేవా సంస్థలు మూతపడే దశకు వచ్చాయి. అప్పులపాలవుతున్నామని..’ పెద్దతండాలో మెప్మా మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రం నిర్వహకురాలు వాపోయింది. గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున రూ.15వేలు తక్షణ సాయం గా అంద జేస్తామని అధ్యక్షుడు సాధు రమేష్‌రెడ్డి హామీ ఇచ్చారు. షర్మిల ఆదుకుంటామన్నారు.
- న్యూస్‌లైన్, ఖమ్మం రూరల్

టూక్రీ వోడ్ బ్యాన్..
‘తెలంగాణకు పాదయాత్ర ద్వారా వచ్చిన మా సోదరి షర్మిలకు మా సంప్రదాయ వస్త్రం టూక్రీ (బంజా రా మహిళలు తలపై కప్పుకునే వస్త్రం)ని బహూకరించాం.. శుక్రవా రం పాదయాత్ర ప్రారంభమయ్యే చోటకు వెళ్లి టూక్రీ కప్పి ఆడబిడ్డపై మాప్రేమను చాటుకున్నాం. గిరిజనులు ఎక్కువగా ఉండే మా జిల్లా కు సోదరి షర్మిల రావడం చూస్తుంటే..రాజన్న జిల్లాకు వచ్చి అభివృద్ధి చేసిన రోజులే గుర్తుకొస్తున్నయి. ఆ మహనీయుని కూతురుకు టూక్రీ కప్పడం తప్ప మేమేం చేయగలం..’ అని పెద్దతండాకు చెంది న లంబాడ మహిళలు అన్నారు. - న్యూస్‌లైన్, ఖమ్మం రూరల్


కూలి కడుపునింపట్లే..
‘అమ్మా...సిమెంట్ ఇటుక పని మా కడుపునింపటం లేదు. ఒక్కోసారి నెలం తా పనివుండదు..పని ఉన్న రోజు రూ.100 ఇస్తే అదే గొప్ప. ఏం తినాలి..ఎట్ల బతకాలి.? మాకు పూటగటవటమే కష్టం. ప్రాణాల మీదకు వస్తే వైద్యం ఎలా చేయిం చుకోమమ్మా.. ఇదిగో ఈపాపకు ఆరోగ్యశ్రీ ఉండబట్టి నాన్నగారి హయాంలో కాలు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు జబ్బు చేస్తే పరిస్థితి ఏంటమ్మా..’ అని ఆటోనగర్‌కు చెందిన ఓ మహిళ గోడు చెప్పుకుంది. ‘బాధపడకండమ్మా..మనకు మంచిరోజులస్తాయని’ షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. - న్యూస్‌లైన్, ఖమ్మం రూరల్

బిడ్డతో మాట్లాడాలి..
‘నన్ను వెళ్లనీయండి.. నేను షర్మిల ను చూడాలి.. నా బిడ్డతో మాట్లాడా లి..’ అంటూ మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న అశేష జనవాహినిలో నుంచి పెద్దతండాకు చెందిన ఎం.పద్మ అనే మహిళ దూసుకొచ్చింది. షర్మిలను గట్టిగా పట్టుకొని ముద్దుపెట్టుకుంది. ‘అమ్మా...జగనన్న బయటకు రావాలమ్మా..అన్యాయం రాజ్యమేలుతుంటే.. గట్టిగా పోరాటం చేయాలి.. దేనికైనే నేను సిద్ధం..’ అని చెమ్మగిల్లిన కళ్లతో తెలిపింది. ‘జగనన్న అతి త్వరలోనే వస్తారు.. రాజన్న రాజ్యాన్ని తెస్తారని’ షర్మిల ఆమెకు భరోసా ఇచ్చారు. - న్యూస్‌లైన్, ఖమ్మం రూరల్

మహానేత ఆశయసాధన కోసం...జగనన్న వదిలిన బాణం...ఖమ్మంలో జన సునామీ సృష్టించింది...అడుగడుగునా అభిమానం పోటెత్తగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ జిల్లాలో ఐదోరోజు శుక్రవారం విజయవంతంగా కొనసాగింది. కష్టాలు..బాధలు..చెప్పుకొనేందుకు ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని రాజన్న బిడ్డ అక్కున చేర్చుకున్నారు. మీకు అండగా ‘మేమున్నాం..’ అంటూ కొండంత భరోసానిచ్చారు. ‘అమ్మా... మహానేత మృతితో పింఛన్ రావడం లేదని ఒకరు..కూలి సరిపోవడం లేదని ఇంకొకరు..వైద్యం చేయించుకునే స్తోమత లేదని మరొకరు..ఫీజురీయింబర్‌మెంట్ ఇవ్వడం లేదని విద్యార్థులు..స్వచ్ఛంద సంస్థల నిర్వహణ కష్టతరంగా మారిందని సేవకులు...గిట్టుబాటు ధరలు లేవని రైతులు.. వాపోయారు’ ‘జగనన్న పాలనలో.. రాజన్న రాజ్యంలో.. మీ కష్టాలు తొలగుతాయని’ షర్మిల వారిని ఓదార్చారు.

ఇది వైఎస్‌ఆర్ ఖిల్లానే

ఖమ్మం: ‘ఓ అమ్మ చెప్పింది... అధైర్య పడవద్దు ధైర్యంగా ఉండండి... మీకు అం డగా ఉంటామని... ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది... ఖమ్మం జిల్లా వైఎస్సార్ ఖిల్లా అని నిరూపించారు...’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం చేరుకున్న సందర్భంగా శుక్రవారం జడ్పీసెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. పాలేరు రిజర్వాయర్ ద్వారా ఖమ్మం పట్టణానికి మంచినీరు అందించాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సంకల్పించారని, దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం ఈ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని అన్నారు. దేశ చరిత్రలోనే గిరిజనులకు అటవీభూములపై హక్కు కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు.

రెండు లక్షల ఎకరాల అటవీభూములపై గిరిజనులకు వైఎస్ హక్కు కల్పించారని గుర్తు చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు సరిపడ నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగర్ ఆధునికీకరణ పనులు వైఎస్ బతికుంటే ఎప్పుడో పూర్తయ్యేవని, ఆయన లేకపోవడంతో ఈ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని షర్మిల అన్నారు. రైతులు, విద్యార్థులు ఏది కావాలంటే ఆ వరాలు ఇచ్చి వారి అభిమానాన్ని చురగొన్న నేత వైఎస్సార్ అని ఆమె కొని యాడారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజ్ రియింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.

నిరుపేదలకు అందని కార్పోరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీతో వారి ముంగిటకు తెచ్చారన్నారు.ఏ ఒక్క రూపాయి చార్జీ పెంచినా అది నిరుపేదలకు భారంగా మారుతుందని, ఐదేళ్లలో ఆర్టీసీ, గ్యాస్, కరెంట్ చార్జీలు పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. నిరుపేదలకు పక్కాఇళ్లు కట్టించాలని వైఎస్ భావించారని, అయితే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మొండిగోడలకే పరిమితమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో క రెంట్ కోతలవల్ల అనేక మంది కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

నామాకు పాలేరు షుగర్స్ నజరానాగా ఇచ్చిన బాబు...
చంద్రబాబునాయుడు తన ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్ల విలువైన పాలేరు షుగర్ ఫ్యాక్టరీని నామా నాగేశ్వరరావుకు కారుచౌకగా రూ.9 కోట్లకే కట్టబెట్టారని షర్మిల మండిపడ్డారు. ఫ్యాక్టరీ తొలి నాళ్లలో పెట్టుబడి పెట్టిన రైతులకు షేర్స్, డివెడెంట్ ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. రైతుల ఉసురు చంద్రబాబు, నామా నాగేశ్వరరావులకు తప్పకుండా తగులుతుందన్నారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా 50 పరిశ్రమలను ము క్కలుగా చేసి ఆయన అనుయాయులకు కట్టబెట్టారన్నారు. 2009లో టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, చంద్రబాబు పాదయాత్ర తర్వాత ఆ సంఖ్య 74కు చేరుకుందన్నారు. అసలు ఆయన పాదయాత్ర చేస్తుంటే టీడీపీ ముందుకు వెళ్తోందో వెనక్కు వెళ్తోందో ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి చరిత్ర హీనుడుగా మిగిలాడని విమర్శించారు. 

బషీర్‌బాగ్ వృతుల కుటుంబాలను 
ఆదుకున్నది వైఎస్సే...
చంద్రబాబు ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిదిసార్లు కరెంట్ బిల్లులు పెంచారని, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్సార్ దీక్షలు చేపట్టారని షర్మిల గుర్తు చేశారు. బషీర్‌బాగ్ కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించకుండా గాయాలపాలైన పోలీసులను చంద్రబాబు పరామర్శిం చాడని అన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని వినతులు ఇచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. వైఎ స్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.1.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. రైతులం టే చంద్రబాబుకు ప్రేమ లేదని, పాదయాత్రతో మొసలికన్నీరు కారుస్తున్నారని వివర్శించారు.

చీకటిని చీల్చుకుంటూ సూర్యుడొస్తాడు

ఇది నేను ఒక్కడిని మాత్రమే రాస్తున్న ఉత్తరం కాదు. రాష్ట్రంలో ఉన్న కొన్ని కోట్లమంది ప్రజల మనసులోని మాట. ఏదో అభిమానంతో రాయడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి, రాజకీయ నాయకుల్లో మానవత్వం అనేవి ఆ రారాజు రాజశేఖరుడితోనే పోయాయనే బాధతో రాస్తున్నా. 

అవి చంద్రబాబు నాయుడుగారు పరిపాలించే రోజులు... మానాన్న పెద్ద వ్యవసాయదారుడు. కానీ ఆ పాలనలో పంటలు కాదు కదా, తినే తిండికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అదే సమయంలో కరెంటు బిల్లులనీ, బ్యాంకు రుణాలని కరెంటోళ్ళు, బ్యాంకులోళ్లు ఇళ్ల మీద పడి ఇంటి తలుపులు, బిందెలు, గిన్నెలు... ఏవి కనిపిస్తే అవి లాక్కెళుతున్నారు. ఇంట్లో మనుషులుంటే పరువు తీసినట్టుగా మాట్లాడుతున్నారు. మా నాన్న, మేము కనిపించకుండా బావిలోకి దిగి దాక్కున్నాం. అప్పుడు నాకు అనిపించింది రజాకారుల రోజుల్లో ఇలాగే ఉండేదేమో అని.

అయితే ఎప్పుడూ చీకటే ఉండదు. దానిని చీల్చుకుంటూ సూర్యుడు వస్తాడు. అలాగే వచ్చాడు. రాజాధిరాజు రాజశేఖరుడొచ్చాడు. మంచినాయకుడి కోసం చూస్తుంటే మనసున్న మంచి నాయకుడొచ్చాడు. మా లాంటి కొన్ని లక్షల కుటుంబాలని రుణ విముక్తుల్ని చేశాడు. కాని ఆయన పాలనలో ఆనందంగా ఉన్న ప్రజలను చూసిన దేవుడు... చివరికి వీళ్లు తనను కూడా మరిచేలా ఉన్నారే అనుకున్నాడో ఏమో, లేదా ఎవరు ఏ కుట్రలు పన్నారో గానీ 2009 సెప్టెంబరు 2 న తేదీనసూర్యుడు అస్తమించాడు. 

ఓదార్పు యాత్రను చూసి ‘పులి కడుపున పులి పుట్టిందిరా, మళ్లీ మన భరతం పడుతుందిరా’ అనుకున్న సోనియా గాంధీ, అమె తొత్తులు అందరూ కలిసి, అంతటి ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్‌ను జైలుకు పంపి రాష్ట్ర ప్రజలకు మళ్లీ చంద్రబాబు హయాం నాటి కటిక చీకటిని తెచ్చిపెట్టారు. ఒక్క వ్యక్తిని ప్రజలకు దూరం చేయడానికి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తితో సహా రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం, కొన్ని దర్యాప్తు సంస్థలు... అన్నీ కలిసి దేని పాత్రను అది పోషిస్తూ ప్రయాసపడడం బహుశా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. కానీ, ఆ మూర్ఖులకు తెలియదు... పడిన సముద్ర కెరటం పడినట్లుగానే ఉండదనీ, అది ఉవ్వెత్తున పైకి లేస్తే దాన్ని చూస్తూ నవ్వుకుంటున్న వారందరూ కనుమరుగై పోతారనీ, మళ్లీ చీకటిని చీల్చుకుంటూ సూర్యుడొస్తాడనీ, ప్రజాభీష్టం నెరవేరుతుందనీ, ప్రజల హృదయాలలో ఉన్న యవనేత జగనే వారి నాయకుడిగా ఆవిర్భవిస్తాడనీ.

విజయమ్మగారూ... మీరు మీ కొడుకు కోసం, భారతిగారూ... మీరు మీ భర్తకోసం, షర్మిలమ్మా... మీరు మీ సోదరుడి కోసం ఎదురు చూస్తున్నారేమో కానీ... రాష్ట్రంలో బడుగు, బలహీన, మధ్య తరగతి కుటుంబాల నుండి కొన్ని కోట్ల మంది జనం రాజన్న పాలను కొనసాగించే నాయకుడైన జగనన్న కోసం ఎదురుచూస్తున్నారు. మా నిరీక్షణ త్వరగా ఫలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.

- మహేశ్, వరంగల్ 

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com

పాదయాత్ర తర్వాత వారి సంఖ్య 74

* పాదయాత్రకు ముందు టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేలు.. పాదయాత్ర తర్వాత వారి సంఖ్య 74కు చేరింది
* వైఎస్సార్ నాడు మండే ఎండలో పాదయాత్ర చేశారు...
* ప్రజల కష్టాలు చూసి చలించిపోయారు
* చంద్రబాబు రోడ్డు కింద.. దారిని నీళ్లతో తడిపి నడిచారు
* దొంగలు పడే వేళ పల్లెలన్నీ నిద్రపోయాక పాదయాత్ర చేస్తున్నారు

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘2009లో టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టి, ముగించే సమయానికి 74 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. 90 మంది ఎమ్మెల్యే సంఖ్య 74కు చేరింది. అంటే చంద్రబాబు గారు పాదయాత్ర ముందుకు చేశారా.. వెనక్కి చేశారా? పాదయాత్ర తో పార్టీ ముందుకు వెళ్లిందో, వెనక్కి పోయిందో ఆ పార్టీ నాయకులే చెప్పాలి. 

ఇదే పాదయాత్రలో ఆయన ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఇదే పాదయాత్రలో టీడీపీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. మాటల్లో విశ్వసనీయత, చేతల్లో నమ్మకం లేని చంద్రబాబు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం ఉండదని అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం ఖమ్మం నియోజకవర్గంలో సాగింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఏసీ బస్సులో, నెత్తి మీద ఫ్యానుతో బాబు యాత్ర..
వైఎస్సార్ మే నెలలో.. మండే ఎండలో పాదయాత్ర చేసి చూపించారు. చంద్రబాబు గారు శీతాకాలంలో పాదయాత్ర మొదలుపెట్టి.. మేలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, పాదయాత్రను అర్ధంతరంగా నిలిపివేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగాల్సిన పాదయాత్రను రేపు (శని వారం) విశాఖ జిల్లాలోనే నిలిపివేస్తున్నారట. వైఎస్సార్ పాదయాత్ర చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీస పోలీసు భద్రత కూడా వైఎస్సార్‌కు కల్పించలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగానే పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మాత్రం ఈ ప్రభుత్వం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించి సగౌరవంగా పంపింది.

వైఎస్సార్ పాదయాత్ర చేసినప్పుడు ప్రజల మధ్య గడపాలని టెంటులో పడుకున్నారు. కానీ చంద్రబాబు గారు ఏసీ బస్సుల్లో గ డుపుతూ.. నెత్తి మీద ఒక ఫ్యాను పెట్టుకొని మరీ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర అంతా రోడ్డు మీద కంటే రోడ్డు కిందనే ఎక్కువగా సాగింది. ఈయన గారి పాదయాత్రకు ఒక జేసీబీ భూమిని తవ్వితే, ఒక రోడ్డు రోలర్ మళ్లీ ఆ భూమిని చదును చేసి, దాని మీద లక్షల లీటర్ల నీళ్లను ట్యాంకర్ల ద్వారా తెచ్చిపోసి.. దారిని తడిపి మరీ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర చేసిన గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవు కానీ.. ఈయన నడవటానికి రోడ్డు మీద నీళ్లు పోయించుకున్నారు. వృథాగా రోడ్డు పాలు చేసిన నీటిని దాహార్తి ఉన్న గ్రామాలకు ఇచ్చి ఉంటే కనీసం చంద్రబాబుకు పుణ్యమైనా దక్కి ఉండేది.

ఎవరి కష్టాలు తెలుసుకోవడానికి..?
అర్ధరాత్రి ‘వస్తున్నాం... మీకోసం’ అని దొంగలు అంటారు. ఈ చంద్రబాబు పాదయాత్ర కూడా చీకట్లోనే సాగుతోంది. ఎండిపోయిన పంటలు చూడాలన్నా.. ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్నా వెలుగుపూట పల్లెలోకి, ప్రజల్లోకి వెళ్లాలి. చంద్రబాబేమో చీకటి వేళలో గ్రామాలు నిద్రపోయాక ఎవరిని పలకరించడానికి, ఎవరి కష్టాలు తెలుసుకోవడానికి పాదయత్ర చేశారో అర్థం కావడంలేదు. వైఎస్సార్ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి ఎంతగానో చలించిపోయారు. కానీ చంద్రబాబు చీకట్లో యాత్ర చేసి ప్రజల కష్టాలను, కన్నీళ్లను చూడలేకపోయారు. ఆయనకు ప్రజల కష్టాలతో పని లేదు. ఆయనకు కావాల్సింది రికార్డులు. అందుకే నడచిన 50 రోజులకు, 100 రోజులకు, 150 రోజులకు, 200 రోజులకు కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు.

500.. 1,000..1,500 .. 2,000 కిలోమీటర్లకు పైలాన్లు కట్టుకుంటున్నారు. మాటపై నిలబడే అలవాటు లేదు కనుక ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేశారు. మద్యం ధరలు బాగా పెరిగిపోయాయని బాబు బాధపడుతున్నారు. సీఎం అయితే మద్యం ధరలు తగ్గించి సరసమైన ధరలకే అమ్ముతామని వాగ్దానం చేశారు. తక్కువ ధరకు ఎక్కువ మద్యం తాగొచ్చని చెబుతున్నారంటే ఆయన ఏ రకం నాయకుడో అర్థం కావడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు... ఈ ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సి ఉంది, కానీ అవేవీ పట్టించుకోకుండా అవిశ్వాసం సమయంలో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారు.

శుక్రవారం132వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం నియోజకవర్గం పెద్దతండా నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంలో సాగింది. జెడ్పీ సెంటర్‌లో షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మొదట ఖమ్మం బస్టాండ్ సెంటర్‌లో సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ పోలీసులు అనుమతించ లేదు. అక్కడ్నుంచి పెవిలియన్ గ్రౌండ్‌లోకి మార్చాలని ప్రయత్నించగా.. అక్కడ మున్సిపల్ అధికారులు అడ్డుపడ్డారు. 

చివరికి మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ సెంటర్‌లో సభ పెట్టారు. అక్కడి నుంచి షర్మిల పాకబండలోని మమత మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం 11.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1782.7 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గట్టురామచంద్రరావు, బానోతు మదన్‌లాల్, యడవెల్లి కృష్ణ, చంద లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, మట్టా దయానంద్, సాధు రమేష్‌రెడ్డి, మెండెం జయరాజ్ తదితరులున్నారు.

రాత్రిళ్లు ఎవరుంటారు?


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధరాత్రి సమయంలో చేస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర అంతంకాని విషాదయాత్రగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు పాదయాత్ర ప్రజల కన్నీళ్లు తుడవడానికి చేస్తున్నట్లుగా లేదని, సాయంకాలంవేళ విహారయాత్ర చేస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు సుమారు 200 రోజులపాటు అర్ధరాత్రి వేళల్లో చేసిన పాదయాత్ర ప్రజలకు ఏరకమైన భరోసా కల్పించలేదన్నారు. భూమన శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004కు ముందు చేపట్టిన పాదయాత్రకు, చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న పాదయాత్రకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తే డా ఉందన్నారు. వైఎస్ భగభగమండే ఎండల్లో రోజుకు 23 కిలోమీటర్లమేర పాదయాత్ర చేస్తూ.. ప్రజల కన్నీళ్లను తుడిచారని గుర్తుచేశారు. పాదయాత్రలో రాత్రివేళ రోడ్డుపక్కనే వేసిన గుడారాల్లోనే కూలర్లు లేకుండా విశ్రమించేవారని, అందుకు ప్రత్యక్షసాక్షి తానేనని భూమన తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న 6 కిలోమీటర్ల పాదయాత్ర సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమై, అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగుతోందన్నారు. అదికూడా మట్టిరోడ్డుపై లక్షల లీటర్ల మంచినీటిని చల్లుతూ పూర్వం రాజులు విహారయాత్ర వెళ్లినట్లు చంద్రబాబు వెళుతున్నారని ఎద్దేవా చేశారు.

రాత్రిళ్లు ఎవరుంటారు?

‘‘చంద్రబాబు తన పాదయాత్రలో ఏ ఒక్క పేదవారి కన్నీరైనా తుడిచారా? ఒక్క ఎకరానైనా ఎండిన పంటపొలాన్ని పరిశీలించారా?’’ అని భూమన సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న అర్ధరాత్రి పాదయాత్రలో ఎవర్ని కలుస్తున్నారని నిలదీశారు. ‘‘బాబు సీఎంగా ఉండగా.. తాను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదేపదే అంటుండేవారు. దీంతో అప్పట్లో అందరూ బాబు చాలాగొప్పగా పనిచేసేవారని భావించేవారు. అయితే బాబు నిద్రలేనితనంతో బాధపడుతున్నారని, అందుకే అర్ధరాత్రివేళ పాదయాత్ర చేస్తూ.. తన పైత్యాన్ని పార్టీ కార్యకర్తలపై రుద్దుతున్నారని అసలు విషయం ఇప్పుడు బయటపడుతోంది’’ అని భూమన ఎద్దేవా చేశారు.

అలవికాని వాగ్దానాలు: ‘‘గ తంలో వైఎస్ పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల కడగండ్లను చూసి చలించి వాగ్దానాలు చేయగా.. అప్పుడు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఎగతాళి చేశారు. వైఎస్ హామీలను నెరవేర్చడానికి తన వద్ద మంత్రదండమేదీ లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబే అర్ధరాత్రివేళల్లో అలవికాని వాగ్దానాలు చేస్తున్నారు’’ అని భూమన విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని దించేసే అస్త్రాన్ని చంద్రబాబు తన చేతిలో పెట్టుకుని అడుగడుగునా కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. బాబు పాదయాత్ర టీడీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి చేసినట్టుగా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకే చేసినట్లుందని ఆయన ఆరోపించారు. బాబు పాదయాత్రకు విశ్వసనీయత లేనందునే ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారన్నారు. కాగా మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల రాత్రివేళ గుడారాల్లోనే నిద్రిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా భూమన చెప్పారు.

సీబీఐ నిజస్వరూపం రుజువైంది

- సుప్రీంకోర్టుకు సీబీఐ డెరైక్టర్ నివేదికే తార్కాణం: కొణతాల
- సుప్రీం పర్యవేక్షణలోని కేసు పరిస్థితే ఇలా ఉంటే ఇతర కేసుల మాటేమిటి?
- కాంగ్రెస్ తొత్తుగా పనిచేస్తున్న దర్యాప్తు సంస్థ
- జగన్ కేసులో సీబీఐ చార్జిషీట్లన్నీ కేంద్రం నుంచి వచ్చినవే
- రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తున్న కాంగ్రెస్

సాక్షి, హైదరాబాద్: ‘‘కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్న వాస్తవం సుప్రీంకోర్టులో తాజాగా ఆ సంస్థ డెరైక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్‌తో మరోసారి రుజువైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదికను రహస్యంగా ఉంచాల్సిన సీబీఐ, దాన్ని కేంద్ర మంత్రుల ముందు పెట్టడం చూస్తే వారి విశ్వసనీయత ఏంటో బట్టబయలైంది. సీబీఐ కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థులను వేధించే ఆయుధంగా పనిచేస్తోంది’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. 

శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రహస్యంగా ఉంచాల్సిన నివేదికను కేంద్ర న్యాయ మంత్రి అశ్వినికుమార్‌కు, ప్రధాని కార్యాలయం, బొగ్గు శాఖల సంయుక్త కార్యదర్శులకు చూపించామంటూ సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న కేసులోనే ఇలా మంత్రులు జోక్యం చేసుకుంటుంటే, ఇక ప్రైవేట్ కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?’’ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఎదిరించి బయటకొచ్చినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కావాలనే కుట్రపూరితంగా కేసులు బనాయించారన్నారు. కోర్టు ప్రమేయం లేకుండా నడుస్తున్న జగన్ కేసులో సీబీఐ వేసే ప్రతి చార్జిషీటూ కేంద్రం ఆదేశాల మేరకే సిద్ధమవుతోందని తెలిపారు. కాంగ్రెస్ తన కక్షసాధింపు చర్యల కోసం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగ పరుస్తోందన్నారు.

కాంగ్రెస్, టీడీపీలకే నచ్చుతోంది: సీబీఐ వ్యవహరిస్తోన్న తీరు కాంగ్రెస్, టీడీపీలకు మాత్రమే నచ్చుతోందంటూ కొణతాల ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని పార్టీలూ సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని కోరుతుంటే, ఆ రెండు పార్టీలు మాత్రం ఆ సంస్థ తమకు అనుకూలంగా పనిచేసేలా, తమ తొత్తులా ఉండేందుకే ఇష్టపడుతున్నాయని మండిపడ్డారు. ప్రత్యర్థులు ఎవరుంటే వారిపై దాడులు చేయడానికి సీబీఐ కాచుకుని కూర్చుంటుందంటూ ధ్వజమెత్తారు. 

అందులో భాగంగానే జగన్‌పై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా నిర్బంధించారని చెప్పారు. ‘‘2జీ స్పెక్ట్రం కేటాయింపులు ప్రధానికి, కేంద్ర ఆర్థికమంత్రికి తెలిసే జరిగాయంటూ టెలికం మాజీ మంత్రి ఎ.రాజా అఫిడవిట్ దాఖలు చేసినా పట్టించుకోకుండా అంతా ఆయనపైనే నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మరణించిన రాజశేఖరరెడ్డి పేరును ముద్దాయిగా ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చింది.

కానీ జీవోలు విడుదల చేసిన మంత్రులు, సంబంధిత శాఖల అధికారులను మాత్రం విస్మరించారు. ఎఫ్‌ఐఆర్‌లో 50వ నిందితునిగా ఉన్న జగన్‌ను చార్జిషీట్లకు వచ్చేసరికి తొలి నిందితుడిగా చేర్చారు. వారికిష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ఆఖరికి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు. తుది చార్జిషీట్ నమోదు చేయాలన్న ఆదేశాలనూ పెడచెవిన పెట్టారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ ఏదోలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలయ్యే దాకా జగన్ బయటకు రాకుండా అడ్డుకునేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారు. వీరి చర్యలను చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటోంది’’ అన్నారు. 

సీఎస్‌ల నియామకంలోనూ చంద్రబాబు బాటే..!
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నియామకంలో పారదర్శకత లోపించిందని కొణతాల అభిప్రాయపడ్డారు. ‘‘ఢిల్లీలో పని చేస్తున్న 1977 బ్యాచ్ అధికారి జె.సత్యనారాయణ ఉన్నా ఆయన్ను పక్కకు పెట్టి, 1979 బ్యాచ్‌కు చెందిన పీకే మహంతిని నియమించడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే పని చేస్తున్న వారిని తీసుకోవాలనుకుంటే 1978 బ్యాచ్‌కు చెందిన శామ్యూల్ ఉన్నారు. కానీ పట్టించుకోలేదు. దళిత బాంధవుడని బిరుదు అందుకున్న సీఎం కిరణ్ వారికి మొండిచేయి చూపారు. 1979 బ్యాచ్ వారినే తీసుకోవాలనుకుంటే రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తున్న ఐవీఆర్ కృష్ణారావు ఉన్నా పక్కకు పెట్టాలని చూస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా తన హయాంలో ఇదే విధానం అవలంభించారు. కిరణ్ కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు’’ అని మండిపడ్డారు.

బాబు అక్రమ ఆస్తులపై ఆధారాలు సమర్పించండి

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడి, భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పిటిషనర్లను ఆదేశించారు. విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలువురికి అక్రమంగా లబ్ధి చేకూర్చి తాను ప్రయోజనాలు పొందారని, ఈ వ్యవహారాలపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఈడీల దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుంకరి జనార్దన్ దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త శుక్రవారం విచారించారు. బాబు ఆస్తుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజకీయ కారణాలతో వేసిన పిటిషన్ అని చెప్పి దాన్ని హైకోర్టు కొట్టివేసిందని జనార్దన్ వివరించారు.


source:sakshi

తొలి సభ చేవెళ్ల మార్కెట్‌లోనే


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలుసుకుని వారిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా వీలైతే వారి పొలాలను, మౌలిక వసతుల్లేక ఇబ్బంది పడుతున్న దళితుల కాలనీలను విజయమ్మ సందర్శిస్తారని, వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

తొలి సభ చేవెళ్ల మార్కెట్‌లోనే: ప్రజల కష్టాలు తెలుసుకొని, వారికి అండగా ఉంటామంటూ మనోధైర్యం కలిగించేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పేరుతో నాడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రను చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలా ఆయన పాదయాత్రకు తొలి అడుగు పడిన ప్రదేశంలో ప్రస్తుతం కూరగాయల మార్కెట్ ఏర్పాటైంది. విజయమ్మ శనివారం ఉదయం 11 గంటలకు తొలుత ఇక్కడే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి నాంది పలకనున్నారు. రైతులు, మహిళలతో మాట్లాడతారు.

తరువాత పక్కనే ఉన్న ఇబ్రహీంపల్లి, ఖానాపూర్, చిట్టెంపల్లి గ్రామాలను సందర్శించి, అక్కడి ప్రజలను కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. వికారాబాద్ మార్గంలోని మిగతా గ్రామాలను పరిశీలిస్తూ ముందుకు సాగుతారు. సాయంత్రానికి వికారాబాద్ చేరుకుని అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం నిరాడంబరంగా సాగాలని, ఆర్భాటాలు లేకుండా చూడాలని విజయమ్మ సూచించినట్లు పార్టీశ్రేణులు వెల్లడించాయి. చేవెళ్లలో నాంది పలకనున్న ఈ కార్యక్రమం భవిష్యత్తు కొనసాగింపులో భాగంగా... వైఎస్ హయాంలో చేపట్టి, ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలిపోయిన భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించాలని విజయమ్మ నిర్ణయించినట్లు తెలిసింది.

వైఎస్‌కు విడదీయలేని అనుబంధం...
దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి చేవెళ్లతో విడదీయలేని అనుబంధం ఉంది. కరువు కాటకాలతో ప్రజలు, ముఖ్యంగా రైతులు అల్లాడిపోతున్న సమయంలో వారిలో భరోసా నింపాలనే ఆశయంతో ఆయన 2003, ఏప్రిల్ 9న ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 68 రోజుల పాటు 1,470 కిలోమీటర్లు సాగిన వైఎస్ ‘ప్రజాప్రస్థానం’ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు ఎంతో ఉపయోగపడింది. 2004 సాధారణ ఎన్నికల ప్రచారాన్ని ఏప్రిల్ 5, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి రోజున వైఎస్ చేవెళ్ల నుంచే ‘జైత్రయాత్ర’ పేరుతో ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ప్రభుత్వ కార్యక్రమమైన ‘రాజీవ్ పల్లెబాట’ను కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించారు. ‘గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ కూడా ప్రధాని మన్మో హన్‌సింగ్‌తో వైఎస్ ఇక్కడి నుంచే ప్రారంభింపజేశారు.

నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా..

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ఆరోరోజు 13.3 కిలోమీటర్లు సాగనుందనిపాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. ఉదయం మమత మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మమత సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్, ఖానాపురం, కైకొండాయిగూడెం క్రాస్‌రోడ్, బల్లెపల్లి మీదుగా శివాయిగూడెం క్రాస్ రోడ్ వరకు సాగుతుందన్నారు. ఇక్కడ బసచేయనున్నట్లు పేర్కొన్నారు.

రేపటి నుంచి వైఎస్సార్‌సీపీ రచ్చబండ కార్యక్రమం

Written By news on Friday, April 26, 2013 | 4/26/2013

రాష్ర్టంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమానికి నడుంబిగించింది. శనివారం నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి రచ్చబండ కార్యక్రమం ఆరంభం కానుంది. రచ్చబండ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొనున్నారు. అదే రోజు సాయంత్రం వికారాబాద్ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. 

ముగిసిన షర్మిల 132వ రోజు పాదయాత్ర


ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , కడప ఎంపీ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఆటోనగర్‌లో ఆరంభమైన పాదయాత్ర పాకబండ దగ్గర ముగిసింది. ఈ రోజు షర్మిల 11.2 కి.మీ మేర తన పాదయాత్రను కొనసాగించారు. ఇప్పటి వరకూ 1782.7 కి.మీ నడిచిన షర్మిల ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

చంద్రబాబు పాదయాత్ర మూన్ వాక్: షర్మిల

ప్రజలతో సంబంధం లేకుండా చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఖమ్మం జెడ్పీ సెంటర్‌ నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల అన్నారు. చంద్రబాబు రికార్డుల కోసమే పాదయాత్ర సాగిస్తున్నారని..ఆయన యాత్ర మూన్‌వాక్ తరహాలో సాగిందని షర్మిల ఎద్దేవా చేశారు. ఇష్టం వచ్చినట్లు వాగ్ధానాలు చేసిన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. 

ఎన్టీఆర్‌ ఇచ్చిన మద్య నిషేధానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర ద్వారా 16 మంది విశ్వసనీయత కోల్పోయారని..బాబు పాదయాత్ర ద్వారా ఆ పార్టీ ముందుకు వెళుతుందో.. వెనక్క పోతుందో ఆయనకే అర్ధం కావడంలేదన్నారు. అర్ధరాత్రి చీకట్లో యాత్ర చేసిన చంద్రబాబు.. నిద్రపోయే సమయంలో ఎండిన పంటలను పరిశీలించారని.. ఏసీ బస్సుల్లో ఫ్యాన్ పెట్టుకుని ఉన్నారని షర్మిల విమర్శించారు.

షర్మిల సవాల్ కు స్పందన ఏది?

Written by Nagarjuna On 26/4/2013 20:12:00 PM

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=61390&Categoryid=28&subcatid=0
విమర్శల పేరుతో నోరుపారేసుకోవడం మన రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు అలవాటైపోయింది. ప్రత్యర్థులను నోటికి వచ్చినట్లు విమర్శిస్తుంటారు. అందులో వాస్తవాస్తవాలను అసలు పట్టించుకోరు. లక్ష మందికిపైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న జ్ఞానం కూడా ఉండదు. ప్రజా ప్రతినిధిగా ఏం మాట్లాడ వచ్చో, ఏమి మాట్లాడ కూడాదో కూడా వారికి తెలియదు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉందిగదా అని ఏదిబడితే అది మాట్లాడితే ఎలా? అవతల వారి పరువు మర్యాదలను, గౌరవాన్ని మరిగణనలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా నోరు పారేసుకుంటే ఎలా? ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మాట్లాడే మాటలకు ఎంత విలువ ఉండాలి? ఎంత విశ్వసనీయత ఉండాలి? ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారనుకుంటే ఎలా? జనం ఏమైనా పిచ్చివాళ్లా? లేక వారిని పిచ్చివారని అనుకుంటారా? చివరికి మంత్రులు, అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏ విధమైన సాక్ష్యాధారాలు చూపకుండా అర్ధంపర్ధంలేని విధంగా ఆరోపణలు చేయడానికి అలవాటుపడిపోయారు.

ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజం గనులు, ‘రక్షణ స్టీల్స్’కు సంబంధించి కొందరు మంత్రులు, కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు ఏమాత్రం ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దివంగ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి బయ్యారం గనులను తన అల్లుడు బ్రదర్ అనీల్ కు చెందిన రక్షణ స్టీల్స్ అనే సంస్థకు లీజ్ కు ఇచ్చారని ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన ఖనిజసంపదను తక్కువకు లీజుకు ఇచ్చారని కూడా విమర్శించారు. ఈ ఆరోపణలకు సంబంధించి వారు ఏ ఒక్క ఆధారం చూపలేదు. రక్షణ స్టీల్స్ ఒప్పందం రద్దు చేసినప్పటికీ వారు ఆరోపణలు చేయడం మాత్రం మానలేదు. బ్రదర్ అనిల్‌ ఖండించినా వారు కారుకూతలు ఆపలేదు.


‘రక్షణ స్టీల్స్'తో తన భర్త అనిల్ కు సంబంధంలేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం వల్లభి గ్రామంలో ఈ నెల 22న జరిగిన బహిరంగ సభలో తెలిపారు. సంబంధం ఉందని నిరూపిస్తే అదే రోజు పాదయాత్ర ఆపి ఇంటికి వెళ్లిపోతానని, నిరూపించలేకపోతే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పదవులకు రాజీనామా చేసి ఇంటికెళ్లిపోతారా? అని సవాల్ కూడా విసిరారు. బయ్యారంలో ఖనిజాన్ని తవ్వుకొనే హక్కు వైఎస్ ఆర్ రక్షణ స్టీల్స్‌కు ఇవ్వలేదు. ఆ ఖనిజాన్ని ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీనే తవ్వాలని ఆయన ఆకాంక్షించారు. బయ్యారానికి సమీపంలోని వరంగల్ జిల్లా రాజోలి గ్రామంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని సంకల్పించారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు, గిరిజనులకు ఉపాధి కల్పించాలన్నది ఆయన లక్ష్యం అని చెప్పారు.

సవాల్ షర్మిల మాటల్లోనే... ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజం గనులతో, రక్షణ స్టీల్స్‌తో నాకు గాని, నా భర్తకు గాని సంబంధం లేదు. ఇదే మాట ఇప్పటికి అనేకమార్లు స్పష్టంగా చెప్పాం. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నేతలు పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారు. బయ్యారం గనులు, రక్షణ స్టీల్స్ ఒప్పందం రద్దు చేసి రెండేళ్లకు పైనే అవుతుంది. రద్దు చేసింది కూడా అప్పుడు మా పక్షాల ఉన్న, ఇప్పుడూ మా పార్టీలోనే ఉన్న అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. దాన్ని రద్దు చేసి ఇన్ని రోజులైనా, వైఎస్ ఆర్ నాకు కట్నం కింద ఇచ్చారని, రక్షణ స్టీల్స్ నాదని, నా బినామీలే ఉన్నారని ఈ నాయకులు ఈ రోజుకూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఒకటి, రెండుసార్లు కాదు ఇప్పటికి 100 సార్లు చేసుంటారు. ప్రతిసారీ వీళ్లకు సమాధానం ఇస్తూనే ఉన్నాం. అయినా ‘దున్నపోతు మీద వాన పడ్డట్టు’ ఉంది కానీ వాళ్ల మట్టి బుర్రలకు ఎక్కడంలేదు. ఈ పార్టీ నాయకులందరికీ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు సవాల్ చేస్తున్నాను. చంద్రబాబు గారూ! ఇంకొకసారి బయ్యారం గనులను వైఎస్ ఆర్ అల్లునికి, కూతురుకు కట్టబెట్టారని అనే ముందు నా సవాల్‌ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వైఎస్ ఆర్ బిడ్డగా నేను సవాల్ చేస్తున్నాను. బయ్యారం గనుల్లో, రక్షణ స్టీల్స్‌లో నాకు భాగం ఉంది అని చంద్రబాబుగారు నిరూపించగలిగితే, అదే రోజున నేను పెట్టేబేడా సర్దుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి, పాదయాత్ర ముగించి ఇంటికి వెళ్లిపోతాను. నిరూపించలేకపోతే మీరు మీ పార్టీకి, మీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా? సమాధానం చెప్పాలి. నా మీద ఆరోపణలు చేస్తున్న ఎవరెవరైనా సరే నా సవాల్‌ను స్వీకరిస్తారా? అని ఆమె అడిగారు.

వాస్తవం: ఖమ్మం జిల్లా బయ్యారంలోని ఇనుప ఖనిజం తక్కువ రకంది అయినప్పటికీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ అక్కడ ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని తలచారు. దాదాపు పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావించారు. ఆ ఉద్దేశంతోనే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. ఇక్కడ లభించేది తక్కువ రకం ఇనుప ఖనిజం అయినందున ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. కోట్లకు కోట్ల రూపాయలు విలువైన ఖనిజం అక్కడ ఉందని చెప్పిన తెలుగుదేశంలోని బడా నేతలు కూడా అటువైపు చూడలేదు. ఒక్క రక్షణ స్టీల్స్ సంస్థ మాత్రమే ముందుకు వచ్చింది. బయ్యారం గనులకు ఏపీఎండీసీ యజమానిగా ఉంటూ వెలికితీసిన ఇనుప ఖనిజాన్ని మాత్రమే రక్షణ స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వాలన్న ఒప్పందం మాత్రమే వైఎస్ హయాంలో కుదిరింది. ఆ ఒప్పందానికి సంబంధించి జిఓ 69/2000 విడుదల చేశారు. రక్షణ స్టీల్స్‌కు లాభాలొస్తే అందులో 20 శాతం నిధులు స్థానిక ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించాలన్న నిబంధన కూడా ఆ ఒప్పందంలో ఉంది. ఖమ్మం లేదా పక్కనున్న వరంగల్ జిల్లాలో రక్షణ స్టీల్స్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా ఆ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తరువాత రోశయ్య ప్రభుత్వం ఏపీఎండీసీకి ఆ భూములు ఇచ్చింది. 56 వేల హెక్టార్లలో ఏపీఎండీసీకి తవ్వకాలకు అనుమతిస్తూ రోశయ్య ప్రభుత్వం 2010 జూన్ 30న జిఓ విడుదల చేసింది.

రక్షణ స్టీల్స్ బ్రదర్ అనిల్‌దేనని నోటికొచ్చినట్లు మాట్లాడినవారు ఇప్పుడు షర్మిల సవాలుపై నోరు మెదపడంలేదు. వారి ఆరోపణలు నిజమైతే ఎందుకు స్పందించడంలేదు? అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలేనని తేలిపోయింది. ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవని కూడా తేలిపోయింది. ఏ ఆధారంలేకుండా ప్రజలకు ఎందుకు అబద్దాలు చెప్పారు? చెప్పిన అబద్దమే వందసార్లు చెబితే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? మంత్రులు కూడా టిడిపి వారికి వంతపాడారు. రక్షణ స్టీల్స్ ఒప్పందం ఎలా జరిగిందో, ఎవరితో జరిగిందో, ఆ ఒప్పందంలోని వివరాలు ఏమిటో ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు తెలియదా? వారు కూడా అలా మాట్లాడటం ఏమిటి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. వ్యక్తిగత ఆరోపణలకు దిగడం, ప్రత్యర్ధుల పరువు మర్యాదలకు భంగం కలిగించడం మంచిపద్దతికాదు. ఈ విధమైన అసత్యాలను మాటిమిటికి ప్రచారం చేయడం భావ్యంకాదు. అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించాలనుకోవడం మంచిదికాదు. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం, వారికి ఏమీ తెలియదనుకోవడం అవివేకం. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ది చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు.

Special edition on 'Vachedi Jagananna'

YS Vijayamma conducts Praja Darbar at Pulivendula

Grand welcome to YS Sharmila in khammam

చంద్రబాబుపై మండిపడ్డ ద్వారంపూడి!

బాబు రాష్ట్రానికి అధిపతి అయితే కరువు కాటకాలు వస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. పాదయాత్రలో బాబు నడిచిన దారిలో పచ్చగడ్డిసైతం ఎండుగడ్డిగా మారిపోయిందని ఆయన అన్నారు. కాకినాడలో నడిచిన మార్గంలో శనివారం పసుపు నీళ్లతో ప్రక్షాళన, శాంతి హోమం చేయనున్నట్టు ద్వారంపూడి తెలిపారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలకు పోదామని చంద్రబాబుకు తెలుపాలని ద్వారంపూడి తెలిపారు.

ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో షర్మిల సభ

ఖమ్మం బస్టాండ్ సెంటర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో బస్టాండ్ సమీపంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రంగారెడ్డి జిల్లాలో రేపు విజయమ్మ పర్యటన

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజా క్షేత్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆమె రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు చేవెళ్లలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరిగి నియోజకవర్గం చిట్టెంపల్లిలో రచ్చబండ నిర్వహించి, సాయంత్రం నాలుగు గంటలకు వికారాబాద్ లో బహిరంగ సభలో విజయమ్మ పాల్గొంటారని రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు. 

పులివెందులలో విజయమ్మ ప్రజా దర్బార్


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శుక్రవారం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అరటి, చినీ రైతులు విజయమ్మ వద్ద తమగోడు వెల్లబోసుకున్నారు.

స్పందించిన ఆమె వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై విజయమ్మకు వినతిపత్రాలు ఇచ్చారు. వాటన్నింటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=587232&Categoryid=14&subcatid=0#sthash.OYxk8QFh.dpuf

వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ సభ్యులు వీరే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా చెల్లూరి అర్జున, ఎస్.పాండురంగారెడ్డిలను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగినట్టు ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త టీఎస్ విజయ్‌చందర్ గురువారం తెలిపారు.

బాబు భరోసానే కిరణ్‌కు అండ..

- వైఎస్సార్ సీపీ నేత జనక్‌ప్రసాద్ ధ్వజం
- విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలను పీక్కుతింటున్నారు
- ఢిల్లీ పెద్దలు, బాబు అండ చూసుకుని పెనుభారం మోపారు
- వైఎస్ హయాంలో ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచలేదు
- రాష్ట్రాన్ని బాగుపరిచే శక్తి కిరణ్, చంద్రబాబులకు లేదు
- బయ్యారం గనులపై టీడీపీది తప్పుడు ప్రచారం 

 హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో పెత్తందారీతనం రాజ్యమేలుతోందని, ప్రజలకు జవాబుదారీ తనం లేని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒంటెత్తు పోకడలతో మూడు నెలలకోసారి విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి విధానాలను ప్రజలు, సొంత పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా అవేవి పట్టించుకోకుండా ఢిల్లీ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు అండ చూసుకొని ప్రజలపై పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జనక్‌ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ధర్నాలు, దీక్షలు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. విద్యుత్‌చార్జీల పెంపు, కరెంటు కోతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ.. 30 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలతో కలిసి ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా ఈ ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. సీఎం కిరణ్ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని, పేదలపై విద్యుత్ చార్జీల భారం మోపడం లేదంటూనే రూ.34 వేల కోట్ల భారం మోపారని చెప్పారు. ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో4లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, 20లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని వివరించారు. 

బాబు భరోసానే కిరణ్‌కు అండ..
టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న భరోసా చూసుకొని కిరణ్ అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని పీల్చుకుతింటున్నారని జనక్‌ప్రసాద్ పేర్కొన్నారు. ‘చంద్రబాబు పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్‌ను గొడ్డళ్లతో, కొడవళ్లతో నరకాలంటారు. కాంగ్రెస్ నేతల చొక్కాలు పట్టాలని పిలుపిస్తారు. దద్దమ్మ ప్రభుత్వం అంటూనే అదే సర్కారును తన భుజాలపై మోస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

అవిశ్వాసం సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడారని ధ్వజమెత్తారు. కిరణ్ పాలన అచ్చం చంద్రబాబు తొమ్మిదేళ్ల చీకటి పాలనను గుర్తుచేస్తోందని తెలిపారు. బాబు హయాంలో కూడా విద్యుత్ చార్జీల ధరలు తగ్గించమని ఉద్యమిస్తే పోలీసుల చేత కాల్పులు జరిపించారని, రైతులపై కేసులు పెట్టారని, బాబును ఆదర్శంగా తీసుకున్న కిరణ్ అవే విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్‌ది ప్రజారంజకపాలన..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనంతా ప్రజారంజకంగా సాగిందని జనక్ పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచకుండా సువర్ణ పాలన అందించారన్నారు. వంటగ్యాస్ ధరను కేంద్రం పెంచినా ఆ భారం ప్రజలపై పడకుండా ఆదుకున్న మహానేత వైఎస్ అని అన్నారు. వైఎస్ మరణం తర్వాత ప్రభుత్వ ఆదాయం రూ.60 వేల కోట్లు పెరిగినా చార్జీలు పెంచి ప్రజలను పీల్చుకుతింటోందన్నారు.

ఐఎంజీ భూములు, నిజాం షుగర్‌లపై మాట్లాడరేం!
బయ్యారం గనుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ఐఎంజీ భూములు, నిజాం షుగర్‌ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని జనక్‌ప్రసాద్ ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున 540 ఎకరాలను దిక్కూమొక్కూలేని ఐఎంజీ అనే సంస్థకు చంద్రబాబు కారు చౌకగా కట్టబెట్టారన్నారు. వందల కోట్ల విలువ చేసే నిజాం షుగర్స్‌ను తప్పుడు విధానాలు అవలంభించి తన బినామీ నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. బాబు తన హయాంలో కొన్ని వేల ఎకరాల భూములను అమ్మడమేకాక, ప్రభుత్వ పరిశ్రమలను దివాలా తీయించి తనకు కావాల్సిన వారికి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ ఒకటే అని రాష్ట్రాన్ని బాగుపరిచే శక్తి వారికి లేదని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ హయాం నాటి సువర్ణయుగం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని జనక్‌ప్రసాద్ చెప్పారు.

Popular Posts

Topics :