28 April 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిస్థానాలు క్లీన్‌స్వీప్

Written By news on Saturday, May 4, 2013 | 5/04/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాడి వీరభద్రరావు చేరడం తమకెంతో సంతోషంగా ఉందని విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గొల్ల బాబురావు అన్నారు. వచ్చ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ పార్టీ అన్నిస్థానాలు క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.



కొణతాలతో విభేదాల్లేవు: దాడి

హైదరాబాద్: రాష్ట్రానికి దశా దిశా జగన్‌ వల్లే సాధ్యమని దాడి వీరభద్రరావు అన్నారు. వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన ఉందా, లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సీపీపై ప్రధాన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ తర్వాత పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసింది వైఎస్‌ఆర్‌ మాత్రమేనని అన్నారు. వైఎస్ఆర్‌ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరారని చెప్పారు. సీట్లు, అధికారం తనకు ముఖ్యంకాదన్నారు. కొణతాల రామకృష్ణతో రాజకీయ వైరుధ్యాలే తప్ప వ్యక్తిగత తగాదాలు లేవన్నారు. త్వరలోనే అన్ని సమసిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

స్పందన లేని ప్రభుత్వమిది: విజయమ్మ


ఎన్టీఆర్ నగర్: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. అన్ని రంగాల్లో కిరణ్ సర్కారు విఫలమయిందన్నారు. సర్ చార్జీల పేరుతో సామాన్యులపై మోయలేని భారం మోపిందన్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్‌లో ఎన్‌టీఆర్‌నగర్ ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని స్థానిక కార్పొరేటర్ దేప సురేఖా భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మూడురోజుల నిరాహారదీక్షను విజయమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుడిసెలేని రాష్ట్రం కోసం వైఎస్సార్ కృషి చేశారన్నారు. దీనిలో భాగంగా 80 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారని, 47 లక్షల ఇళ్లు పూర్తి చేశారని గుర్తు చేశారు. ఎన్‌టీఆర్‌నగర్ ఇళ్లను రెగ్యులరైజ్ చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా వైఎస్సార్ పార్టీ ప్రజల వెంట ఉంటుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే తాము అధికారంలోకి వచ్చాక ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని విజయమ్మ హామీయిచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన దాడి

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఈ సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు కుమారుడు రత్నాకర్ కూడా పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వారిని సాదరంగా ఆహ్వానించారు. వారిద్దరిపై పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

Jupudi Prabhakar Rao press meet 4th May

Dadi Veerabhadra Rao meets Vijayamma at Lotus Pond

వైఎస్‌ కుటుంబానికి అండగా ఉంటా

త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు దాడి వీరభద్రరావు వెల్లడించారు. ఆయన శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలిశారు. అనంతరం దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ తాను విన్న జగన్ వేరు... ఇప్పుడు తాను చూసిన జగన్ వేరు అని అన్నారు. 

గతంలో తెలుగుదేశం పార్టీ వైఖరి మేరకే తాను వైఎస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశానని ఆయన తెలిపారు. ఆరోపణలపై అప్పట్లో రెండో వైపు తెలుసుకునే అవకాశం లేదని... ఇప్పుడు అసలు వాస్తవం తెలిసిందని, అందుకే ఆ కుటుంబంతో కలిసి నడవాలనుకుంటున్నట్లు దాడి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 11 నెలలుగా జైల్లో ఉన్నా జగన్‌లో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న కసి కన్పించిందని దాడి వ్యాఖ్యానించారు 

చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్దగా తేడా లేదు: షర్మిల

 చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్దగా తేడా లేదు: షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబేమో.. ఎన్టీఆర్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వస్తే, కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన పూర్తి మద్యపాన నిషేధం, రూ.2 కిలో బియ్యం వాగ్దానాలను చంద్రబాబు నిలుపుకోలేదు. వైఎస్సార్ ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్తు, ప్రతి కుటుంబానికి 30 కిలోల బియ్యం వాగ్దానాలను కిరణ్‌కుమార్‌రెడ్డి నిలుపుకోలేదు. మరి కిరణ్‌కుమార్‌రెడ్డికి, చంద్రబాబుకి ఏమిటి తేడా? ఏమీ తేడా లేదు.. దొందూ దొందే’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు.

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. జూలూరుపాడు మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఈ సందర్భంగా షర్మిల ప్రసంగించారు. ‘‘చంద్రబాబు 8 ఏళ్ల 8 నెలల పాలనలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో నాలుగు సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఆయన ఐదు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచితే... ఈయననాలుగేళ్ల పాలనలో మూడు సార్లు పెంచారు. ఆయన గ్యాస్ ధర రెట్టింపు చేసి పెంచితే, ఈయనా రెట్టింపు చేశాడు. ఈ ఇద్దరికీ ఏమీ తేడా లేదు. ప్రజలు కూడా ఇద్దరినీ ఒకే రకంగా చూస్తున్నారు. ఎట్లయితే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపారో, అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు త్వరలోనే వస్తుంది’’ అని షర్మిల అన్నారు.

12.4 కిలోమీటర్ల మేర యాత్ర:

పాదయాత్ర 137వ రోజు శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం భగవాన్ నాయక్ తండా శివారు నుంచి ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి నడుచుకుంటూ అక్కినాపురం తండా, హిమాంనగర్, వినోభానగర్, జూలూరుపాడు మండల కేంద్రం చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి సాయిరాం తండా శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 12.4 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,846.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, ముదునూరు ప్రసాదరాజు, స్థానిక నాయకులు బానోత్ మదన్‌లాల్, నంబూరి రామలింగేశ్వరరావు, రామసహాయం నరేష్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి తదితరులున్నారు.

విజయమ్మ నేతృత్వంలో 6న కుత్బుల్లాపూర్‌లో సభ:కూన శ్రీశైలంగౌడ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో 6న సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో బహిరంగ సభ జరగనుందని ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తెలిపారు. వేలాది మంది అనుచరులతో కలిసి తాను ఆ సభలో అధికారికంగా వైఎస్సార్‌సీపీలో చేరతానని వెల్లడించారు. ప్రజల కోరిక మేరకే తాను వైఎస్సార్ కాంగ్రెస్‌తో చేరుతున్నట్టు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో గెలిచిన తాను.. ఇప్పటి వరకు కొన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో మాత్రమే పాల్గొన్నానని, ఆ పార్టీ తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తే తన జవాబు ఏమిటో చెబుతానన్నారు. వైఎస్సార్‌సీపీలో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలే చేరుతున్నారు కదా అని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘నేను బీసీ వర్గానికి చెందినవాడినే కదా. నేనూ చేరుతున్నాగా’ అని నవ్వుతూ బదులిచ్చారు.

రేపు బాపట్లలో మహిళా నగారా

గుంటూరు: మహిళల ఆర్థిక భద్రత, ఆత్మగౌరవమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 5న గుంటూరు జిల్లా బాపట్లలో మహిళా సదస్సు నిర్వహించనున్నారు. దీనికి మహిళా నగారాగా పార్టీ నేతలు నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజమయ్మ ముఖ్యఅతిథిగా హజరుకానున్నారు. సదస్సు నిర్వహణకు నేతలు భారీఏర్పాట్లు చేస్తున్నారు. 240 అడుగుల భారీ సభా వేదికను నిర్మిస్తున్నారు. సభా ప్రాంగణానికి తెనాలిలో ఇటీవల మరణించిన బేతాళ సునీల పేరును ఖరారు చేశారు. సదస్సు విజయవంతానికి సమావేశాలు నిర్వహించి శ్రేణుల్ని ఉత్తేజ పరుస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, తానేటి వనితతో పాటు పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, ఆర్‌కే రోజా, వాసిరెడ్డి పద్మ, నందమూరి లక్ష్మీపార్వతి తదితరులు హాజరు కానున్నారు. బాపట్ల నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కోన రఘుపతి నేతృత్వంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పార్టీ ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పరిశీలించారు. 

జగన్ జైలుకి వెళ్లాక...నాయకుడే కరవయ్యాడు!

జగన్ జైలుకి వెళ్లాక...నాయకుడే కరవయ్యాడు!

నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్‌కు తప్ప వేరొక పార్టీకి ఓటు వేయలేదు. నా అభిమాన రాజకీయనాయకురాలు కేంద్రంలో శ్రీమతి ఇందిరాగాంధీ, రాష్ట్రంలో డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డిగారు. వీరు తమ హయాంలో బడుగు బలహీన వర్గాల వారికి ఎనలేని సేవ చేశారు కాబట్టి ప్రతి హృదయంలోను నిలిచిపోయారు. వై.ఎస్.ఆర్.గారు మరణించిన తర్వాత ఇటు రాష్ర్టంలోను, అటు కేంద్రంలో ఎన్నో మార్పులు వచ్చి, పరిపాలన అంతా అస్తవ్యస్తంగా తయారైంది. నాయకులంతా స్వార్థ రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. 1982కు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దీటైన ప్రత్యామ్నాయం లేదు. 

అందుకే తమ ఇష్టానుసారం పరిపాలన సాగించారు. ప్రజలు విసుగు అప్పట్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఘనవిజయం చేకూర్చిపెట్టారు. అంతటితో రాష్ట్రంలో కాంగ్రెస్ చరిత్ర ముగిసింది. తిరిగి వైయస్సార్ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి, వారి అవసరాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్‌కు వరుసగా రెండోసారి కూడా విజయాన్ని సాధించిపెట్టాయి. అయితే ఆ మహానేత చనిపోయిన తర్వాత రాష్ట్రం ఒక్కసారిగా చంద్రబాబు పాలించినప్పటి అంధకారంలోకి వెళ్లిపోయింది. ఒకటా? రెండా? అనేక సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి. ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా, కాంగ్రెస్‌కు సహాయకపాత్ర పోషించడంతో ప్రజల కోసం పోరాడే నాయకుడే కరవయ్యాడు. 

అంత పవర్, ఆదరణ ఉన్న ఒకే ఒక్క నాయకుడు వై.ఎస్. జగన్ కూడా ఈ కుటిల వ్యూహాల మూలంగా ప్రజలకు అందుబాటులో లేకుండా, జైలుకు వెళ్లవలసివచ్చింది. ఈ స్థితిలో ప్రజలందరికీ ఆశాజ్యోతిగా ఒక్క వైయస్సార్ పార్టీ మాత్రమే కనిపిస్తోంది. అయితే ఈ చేదు నిజాన్ని భరించలేక జగన్‌ని, ఆయన పార్టీనీ అణగదొక్కాలని పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. అలాగే వైయస్సార్ దయ వల్ల పదవులు పొంది, ఆర్థికంగా లబ్ధిపొందిన నాయకులు సైతం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ప్రజల మనసులను కలచివేస్తోంది. దీనికి పర్యవసానం ఏమిటో స్పష్టాతిస్పష్టం. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా జగన్‌దే విజయం.

- జె.జె.ఎస్. ప్రసాద్‌బాబు, రాజమండ్రి

జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. 
e-mail: ysjagankosam@gmail.com

ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?!


మాది అనంతపురంజిల్లా అమరాపురం మండలంలోని కెంకెరా గ్రామం. ఆ రోజు రాజీవ్ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌గారు మా గ్రామానికి వచ్చారు. ఆ సందర్భంగా నేను దాదాపు బ్రిటిష్‌వారి హయాంలోని ఒక సమస్యను ఆయనకు విన్నవించాను. వెంటనే అప్పటి కలెక్టర్ అనురాధకి గ్రామస్తుల సమక్షంలోనే ఉత్తర్వులిచ్చి ‘ఒక్క నెలరోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాను. నన్ను నమ్మండి. మీ ఊరి రూపురేఖలను మారుస్తాను’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఐదుగురు సర్వేయర్లు, ఆర్‌డీఓ, ఎమ్మార్వో సుమారు 250 ఎకరాల బంజరుభూమిని సర్వే చేయించి, సాగుదార్లందరికీ పట్టాలిచ్చిన భూమిదాత వైఎస్సార్. కర్ణాటకలో బీసీలుగా ఉండే మమ్మల్ని బీసీల నుండి ఓసీలుగా చేసిన బ్రహ్మానందరెడ్డిగారి ఉత్తర్వులను రద్దుచేసి, మళ్లీ బీసీలుగా జీవో ఇచ్చిన వైఎస్సార్ మాకు దేవుని కంటే ఎక్కువ. 

ఈ పని ప్రధాని దేవెగౌడ గాని, మా కులం మంత్రిగాని చేయలేదు. వైఎస్సార్ వచ్చిన తర్వాత మా గ్రామంలోని అన్ని సమస్యలూ తీరాయి. ప్రజలారా! ఆ మహానుభావునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన బిడ్డను ఈ రాష్ట్రానికి రాజును చేసి, ఆయన భార్య కన్నీళ్లను తుడిచి, వాళ్ల కుటుంబంలో సంతోషం నింపడం తప్ప. ఈ రాష్ట్రంలో అన్ని కుటుంబాలను చింత నుండి దూరంచేసిన వైఎస్సార్ కుటుంబం సంతోషంగా ఉండవద్దా? ఆలోచించండి. ఆ మహానేత తనయుడైన జగన్‌గారిపై బురద జల్లి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధిస్తుంటే చూస్తూ ఊరుకునేంత అమాయకులు కారు ప్రజలు. సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పి తీరతారు. ఆ రోజును మనమంతా తప్పక చూస్తాం.

- కె.జయప్రకాష్, అమరాపురం, అనంతపురం జిల్లా

e-mail: ysjagankosam@gmail.com

137 రోజులుగా షర్మిలతోపాటు వైఎస్ అభిమానుల పాదయాత్ర

రాజన్నే నడిపిస్తున్నాడు

* 137 రోజులుగా షర్మిలతోపాటు వైఎస్ అభిమానుల పాదయాత్ర
* జ్వరమొచ్చినా.. కాళ్లు బొబ్బలెక్కినా.. ఆగకుండా నడక
* వైఎస్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కొందరు
* సాయం చేసిన మహానేత రుణాన్ని తీర్చుకోడానికి మరికొందరు
* పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రైతు బాంధవుడు రాజశేఖరన్న... రచ్చబండకు పయనమై...

చోదకుని తప్పిదమో... మానవ కుట్రయో మరణం వాటిల్లెనయా..
ఆంధ్రదేశ ప్రజలు అల్లాడిరి... కొందరు ఆహుతైరి...
నువ్వు తెచ్చిన అధికారంతో నీ పుత్ర బాంధవుడిని జైలు పాలు చేసిరన్నా... ఆలకింపుడయ్యా...!
ఇదెక్కడి న్యాయమో... ఆలకింపుడయ్యా ఆంధ్రదేశ ప్రజలారా... ఆంధ్రదేశ పౌరులారా...
అమ్మా...! షర్మిలమ్మ ఏ నాడు నడిచినావు... ఈ గతుకుల రోడ్లలోనా...
ఈ నాడు తల చూపితివి ప్రచండపుటెండకు.. నడిచావుతలశిల రఘురామ వేసిన బాటలోనా...
ప్రజల, రైతుల కష్ట సుఖములను చెవిచేర్చితివి..
అమ్మా...! షర్మిలమ్మా.. నీ వెంటే మేమంత జగనన్న దారిలోనా.. షర్మిలమ్మా!


అని మందలపు సత్తెన్న రాగమెత్తితే జనమంతా వంత పాడారు. ‘‘కుట్రేదో చేసి పులి లాంటి మహానేతను పొట్టనబెట్టుకున్నారు.. అదే కుట్రతో పులి బిడ్డను బంధించారు.. ఆడబిడ్డను ఇలా రోడ్డు మీద నిలబెట్టారు. ఆమెకు అండగా నిలబడాలనే పాదయాత్రలో మేము సైతం అంటూ పదం కలుపుతూ కదం తొక్కుతున్నాం. మహానేతపై ఉన్న అభిమానంతోనే ఇంత దూరం అలుపన్నదే లేకుండా అవలీలగా నడుస్తున్నాం.

రాజన్నే మమ్మల్ని నడిపిస్తున్నాడు’’ అని ‘మరో ప్రజాప్రస్థానం’లో ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేస్తున్న పలువురు తమ మనోభావాలను వివరించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండు రోజులుగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. కాళ్లు బొబ్బలెక్కినా.. జ్వరమొచ్చినా.. ఆగకుండా ఏడు నెలలుగా తన అడుగులో అడుగువేసి కదం తొక్కుతున్న అలుపెరగని పాదయాత్రికులతో కలిసి షర్మిల వారి అభిప్రాయాలు పంచుకున్నారు. శుక్రవారం ఎన్కూరు మండలం రాజలింగాల గ్రామ శివారులో చెట్టుకింద కూర్చొని వారంతా మాట్లాడారు. వారి అభిప్రాయం వారి మాటల్లోనే..


ఆదుకునే కుటుంబానికి ఆపద వచ్చింది... దేవుడి లాంటి వైఎస్సార్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టడం మా కుటుంబాన్ని బాగా బాధించింది. అప్పుడే నాభర్త కాపు రామచంద్రారెడ్డి పదవీ త్యాగానికి సిద్ధపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారు. ఈ సమయంలో కూడా తన కుటుంబ కష్టాలను పక్కనబెట్టి , కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం షర్మిల పాదయాత్ర చేయడం చూసి నేనూ ఆగలేకపోయా.. ఇడుపులపాయ నుంచి నడుస్తున్నా.
- కాపు భారతి, రాయదుర్గం, అనంతపురం

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెన్నెముకకు వ్యాధి సోకడంతో ఆరోగ్యశ్రీ ద్వారా రూ. లక్ష విలువైన ఆపరేషన్ చేయించుకున్నా. ఇల్లు లేక ఇబ్బందులు పడుతుంటే నాకు ఇల్లు మంజూరు చేయించారు. ఆ కుటుంబాన్ని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తుంటే తట్టుకోలేక, పాదయాత్రలో పాల్గొంటున్నా. జగనన్న మచ్చలేని చంద్రుడిలా బయటకు వస్తారు.
- దయామణి, బల్లెపల్లి, ప్రకాశం జిల్లా

వైఎస్సార్ పాలనలో ప్రతి పల్లె పచ్చగా ఉంది. ప్రతి కుటుంబం బాగుపడింది. ఇప్పుడు పల్లెల్లో ఆ పరిస్థితి లేదు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్రపన్ని ఆయన్ను జైలు పాలు చేశాయి. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చాలని, మళ్లీ ఆయన పాలన రావాలనే తలంపుతో పాదయాత్రలో పాలుపంచుకుంటున్నా.
- అంజిరెడ్డి, పర్చూరు, ప్రకాశం జిల్లా

మహానేత మరణించినప్పుడు నేను లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా... జగనన్న సీఎం అవుతాడు అనుకున్న.. కుట్రేదో జరిగింది. జగన్‌రెడ్డిని బందీని చేశారు. నా మనుసు నిలబడలేదు. ఉద్యోగం వదిలి రాష్ట్రానికి వచ్చాను. పాదయాత్రలో షర్మిలమ్మతో నడవాలని నిర్ణయించుకున్నా... ఇచ్ఛాపురం వరకు పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నా.
- దవళ వెంకట గిరిబాబు, ఎన్‌ఆర్‌ఐ, టెక్కలి, శ్రీకాకుళం

మొదట్నుంచి నేను వైఎస్సార్ కుటుంబానికి అభిమానిని. 2003లో వైఎస్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో 65 కిలోమీటర్లు నడిచా. ఇప్పుడు కూడా షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొంటున్నా. జగనన్నపై ఎన్ని అబద్ధపు నిందలు వేసినా ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు.
-ఉప్పు వరప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా

డాక్టర్‌గా వైఎస్సార్ పేదల నాడిపట్టుకున్నారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. నేనూ డాక్టర్‌గా పనిచేస్తున్నా. పాదయాత్ర మొదలవగానే షర్మిల వద్దకు వచ్చేశా. పాదయాత్రలో పాల్గొనాలా.. వద్దా.. అనేది కొద్దిగా సంశయించా... కానీ ఇప్పుడు తెలిసింది... పాదయాత్రలో పాల్గొనకుంటే నేను చాలా కోల్పోయేవాడిని. షర్మిలమ్మ మనోధైర్యంతో ముందుకు సాగుతుండటంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మేం కూడా ముందుకు సాగుతున్నాం. నమ్ముకున్న జనం కోసం దేనికైనా సిద్ధపడే జగనన్నకు అనుచరుడినని చెప్పుకోవడానికి గర్విస్తున్నా.
- డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి, అనంతపురం జిల్లా

మూడు తరాలుగా మా తాత ముత్తాతలు వైఎస్సార్ కుటుంబాన్నే దైవంగా భావించి పనిచేస్తున్నారు. ఆ కుటుంబం కోసం పని చేయడం అంటే దేవునికి పూజ చేయడమే. వైఎస్సార్ దయవల్లే నాకు డిప్లొమా సీటొచ్చింది. జగన్ సార్ వల్ల నాకు ఉద్యోగం లభించింది. వైఎస్సార్ కుటుంబంలో పనిచేయడం మేం అదృష్టంగా భావిస్తున్నాం.
- కరుణాకర్, పులివెందుల, కడప జిల్లా

జగనన్న జైలు నుంచి బయటకు రావాలని ప్రతి రోజూ ప్రార్థిస్తున్నా. పేదల కోసం ప్రతి నిత్యం ఆలోచించే వైఎస్సార్ కుటుంబాన్ని కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుంది. ఈ కుటుంబానికి అండగా నిలబడాలనే సంఘీభావంగా నడుస్తున్నా.
- పేరమ్మ, పులివెందుల, కడప జిల్లా

జగనన్నను కావాలనే జైలు పాలు చేశారు. ఒంటరిగా పార్టీని పెట్టినందుకు ఆయనపై కక్ష గట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు షర్మిల చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలూ మద్దతు తెలుపుతున్నాయి. షర్మిలమ్మ అందరికీ ధైర్యం చెబుతూ అండగా నిలుస్తున్నారు. ఈ మంచి కార్యక్రమంలో ఆమెకు మద్దతు తెలుపుతూ నేనూ నడుస్తున్నా..
- లక్ష్మీరెడ్డి, జమ్మలమడుగు, కడప జిల్లా

జగనన్న బయట ఉంటేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల కోసం వైఎస్సార్ కుటుంబం పనిచేస్తుంది. వైఎస్సార్ కుటుంబం కోసం నేను పని చేయాలని అనుకొని పాదయాత్ర చేస్తున్నాను.
- కె.వెంకటనారాయణ, ఎర్రగుంట్ల కడప జిల్లా

వైఎస్సార్ దగ్గర పనిచేశాను. ఆయన కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం. ఓదార్పు యాత్రలో పూర్తిగా జగనన్న వెంటే ఉన్నాను. ఇప్పుడు షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకొని నడుస్తున్నా. షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా.
- జొన్నల శ్రీనివాసరెడ్డి, దేవరపల్లి, కృష్ణా జిల్లా

ఊహ తెలిసిన దగ్గర్నుంచి వైఎస్సార్ అభిమానిగా ఉన్నాను. జగనన్న ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకుంటూ యాత్రలో పాల్గొం టున్నా. ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయి.
- ఐలా వెంకట కోటిరెడ్డి, నర్సరావుపేట, గుంటూరు జిల్లా

తిరుపతిలో డిగ్రీ చదివే సమయంలో జగన్‌సార్ ప్రోత్సాహంతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశా. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. పాదయాత్ర కోసం ఉద్యోగానికి సెలవుపెట్టా. పాదయాత్రలో పాల్గొంటున్న వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నా.
- ఇమాం బాష, పులివెందుల, కడప జిల్లా

మా కుటుంబానికి వైఎస్సార్ ఎంతో చేశారు. ఆయన వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను. మా నాన్నకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారు. వైఎస్సార్ కుటుంబానికి చేతనైనంత సహాయం చేయాలని వచ్చాను. పాదయాత్రలో నడుస్తున్న వారికి మంచినీళ్లు అందిస్తున్నాను.
- నర్సింహ్మ, అనంతపురం

ఎండలో షర్మిలమ్మ మా కోసం నడుస్తోంది. వైఎస్సార్ వల్ల నేను, నా కుటుంబం చాలా లబ్ధి పొందాం. మా లాంటి పేదలకు న్యాయం జరగాలంటే జగన్ బయటికి రావాలి.
- నాగలక్ష్మి, పులివెందుల, కడప జిల్లా

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..

ఖమ్మం: దివంగత వెఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరోప్రజాప్రస్థానం యాత్ర 138వ రోజయిన శనివారం జిల్లాలో 12.3 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. జూలూరుపాడు మండలం దండుమిట్టతండా నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కొత్తగూడెం మండలంలోని వేపలగడ్డ వరకు సాగనుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు
దండుమిట్టతండా, నర్సాపురం, కాకర్ల, మాచినపేట, కొమ్ముగూడెం, డేగలమడుగు, నాయకులగూడెం, సుజాతనగర్, వేపలగడ్డ.

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నా: దాడి

అనకాపల్లి:వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు దాడి వీరభద్రరావు ప్రకటించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం తాను ములాఖత్ ద్వారా చంచల్‌గూడ జైలులో కలుస్తానన్నారు. ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నానని దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత హోదాలో అధికార పార్టీ నిర్ణయాలను ఎన్నోసార్లు ఎండగట్టి, అనేక స్కామ్‌లను బయటపెట్టానని, అయినప్పటికీ చంద్రబాబు వెన్నుదన్నుగా నిలవక పోవటంతో మనస్తాపం చెందానన్నారు.

'జగన్ కు మంచి జరగాలని కోరుకున్నా'

తిరుమల: రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ కు మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ వైఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ పై ఎవరెన్ని కుట్రలు చేఇస భగ్నం అవుతాయని అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు

బాబు అండతోనే కిరణ్ విర్రవీగుతున్నాడు: షర్మిల

Written By news on Friday, May 3, 2013 | 5/03/2013

ఖమ్మం: చంద్రబాబు అండతోనే సీఎం కిరణ్ విర్రవీగుతున్నారని ఖమ్మం జిల్లా జూలూరుపాడులో జరిగిన బహిరంగసభలో షర్మిల మండిపడ్డారు. చంద్రబాబును నాయకుడు కాదు దుర్మార్గుడు అనాలని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మామను వెన్నుపోటు పొడిచారు.. నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారు అని షర్మిల అన్నారు. అన్ని ఛార్జీలు పెంచుతూ కిరణ్ సర్కారు ప్రజలపై అదనపు భారం మోపుతోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని షర్మిల తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గాలను బయటపెడతారనే జగనన్నను జైలుకు పంపారని ఆమె అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్‌ఆర్ ఎంతో కృషి చేశారని షర్మిల గుర్తు చేశారు. 

రేపు మహేశ్వరంలో విజయమ్మ పర్యటన!

రంగారెడ్డి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటిస్తారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్‌ నగర్‌లో స్థలాలను క్రమబద్దీకరించాలంటూ స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతలు చేపట్టిన 3 రోజుల నిరాహార దీక్ష శిబిరాన్ని విజయమ్మ సందర్శించనున్నారు. నిరాహారదీక్షకు సంఘీభావంగా రేపు సాయంత్రం 5 గంటలకు ప్రజలను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ప్రసంగిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. 

2011 ప్రకారమే పంచాయితీ ఎన్నికలు: రమాకాంత్

వరంగల్: 2011 జనాభా లెక్కల ప్రకారమే పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి మూడు జిల్లాల అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే 30 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని రమాకాంత్‌రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

ఏపీపీఎస్సీ వయోపరిమితి పెంచాలి: వైఎస్ఆర్సీపీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏపీపీఎస్సీ నియామకాల వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 39 ఏళ్లకు పెంచాలని వైఎస్‌ఆర్ సీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. లెక్చరర్ల నియామకాల్లోనూ డీఎస్సీ నియామకాల వయోపరిమితినే పాటించాలని బాలినేని సూచించారు. యూపీ, కేరళ, బెంగాల్‌లో అన్ని నియామకాల్లో వయోపరిమితి 40 ఏళ్లుగా ఉందని..యూపీపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. 

ఏపీపీఎస్సీ వెలువరించే పలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని..జాప్యం వల్ల విద్యావంతులైన యువతీయువకులు అవకాశాలు కోల్పోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి వైఎస్‌ఆర్ సీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Abide by YS Jagan's decision: Konathala

Dadi Veerabhadra rao will meet YS Jagan

Srikanth Reddy Terms Rajiv Yuva Kiranalu as Bogus

6న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరతా: కూన

 ఈనెల 6వ తేదీన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ వెల్లడించారు. కుత్బుల్లాపూర్‌ కార్యకర్తల కోరిక, ఒత్తిడి మేరకు జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు కూన శ్రీశైలంగౌడ్ తెలిపారు. మళ్లీ వైఎస్‌ఆర్‌ పాలన రావాలంటే అది జగన్‌ వల్లే సాధ్యమని అన్నారు

రేపు జగన్ ను కలవనున్న దాడి వీరభద్రరావు

అనకాపల్లి : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈరోజు ఉదయం ఆయన విశాఖలో కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ను కలిసిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని దాడి వీరభద్రరావు తెలిపారు

Khammam Khillalo 3rd May 2013

Sharmila speech in Enkur at Khammam district

వైఎస్సార్ టీయూసీకి అనుబంధంగా ఆర్టీసీ మజ్దూర్ యూనియన్

హైదరాబాద్: ఆర్టీసీలోని రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ సభ్యులందరూ ఈనెల 1 నుంచి వైఎస్సార్ టీయూసీ అనుబంధ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సభ్యులుగా కొనసాగాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2011, జూలై 5న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ వైఎస్సార్ టీయూసీకి అనుబంధ సంఘంగా ఏర్పడిందని వివరించారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌గా మార్పు చేయాలని సంకల్పించి ఏప్రిల్ 29న కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించామని వెల్లడించారు.

చంద్రబాబు సీబీఐని, కాంగ్రెస్‌ను పల్లెత్తి మాట్లాడరు

* బాబుకు పదవీవ్యామోహం లేదనడం భూమి గుండ్రంగా లేదన్నట్లే
* పిల్లనిచ్చి, పదవినిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు
* ఎన్టీఆర్ ట్రస్ట్ స్థలాన్ని కుటుంబీకుల పేర్లమీద రాయించుకున్నారు
* కార్యకర్తలను మాత్రం ఆస్తులమ్ముకొని పార్టీ కోసం పనిచేయాలని చెబుతున్నారు
* ధర్మపోరాటం చేస్తున్నానని ఆయన చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది
* సీబీఐ.. కీలుబొమ్మని కోల్‌గేట్ ఉదంతంతో తేటతెల్లమైంది
* అయినా చంద్రబాబు సీబీఐని, కాంగ్రెస్‌ను పల్లెత్తి మాట్లాడరు
* తనపై కేసుల విషయంలో ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు గారు మారిన మనిషట... ధర్మపోరాటం చేస్తున్నాడట.. ఇప్పుడాయనకు పదవీ వ్యామోహం.. ముఖ్యమంత్రి పీఠం మీద కోరిక లేనే లేదట... చంద్రబాబుగారూ... విలువలను, విశ్వసనీయతను పక్కనపెట్టి అధికార పక్షంతో కుమ్మక్కై ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవటమేనా ధర్మయుద్ధమంటే... అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకోవాలని కార్యకర్తలకు చెబుతున్న చంద్రబాబు అదే పార్టీకోసం తన ఆస్తులెన్ని అమ్ముకున్నారో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మంజిల్లా వైరా నియోజకవర్గంలో సాగింది. ఏన్కూరు మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

నేను ధర్మపోరాటం చేస్తున్నానంటూ ఈ మధ్య చంద్రబాబు నాయుడుగారు సినిమా డైలాగులు కొడుతున్నారు. ఆయనకు పదవీ వ్యామోహం, ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదనడమంటే... భూమి గుండ్రంగా లేదన్నట్లే. మంచివాడనుకుని ఎన్టీఆర్ పిల్లనిచ్చి, పార్టీలో హోదాను, మంత్రి పదవిని ఇచ్చారు. కానీ పట్టపగలే కన్నార్పకుండా అదే మామగారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, కుర్చీని, అధికారాన్ని లాగేసుకున్న ఘనుడు ఈ చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ల ఆస్తులు కూడా అమ్మేసుకుని పార్టీకోసం పనిచేయాలని చెప్తున్నారాయన. కానీ అదే పార్టీకోసం తాను ఏ ఆస్తులు అమ్ముకున్నారో చెప్పనేలేదు. పైగా హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్ స్థలాన్ని ట్రస్టు పేరు మీద రాయకుండా తన కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకున్నారు. దాన్నిబట్టే ఆయన ఎలాంటివాడో అర్థమవుతోంది. చంద్రబాబు వేరొకరిని తొక్కి పైకొచ్చిన రకమే గానీ త్యాగాల మీద ఎదిగిన నాయకుడు కాదు. ధర్మపోరాటం చేస్తున్నానని ఆయన చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఆయన ఎన్ని అబద్ధాలైనా కన్నార్పకుండానే చెప్పగలరు. నిజం చెప్తే తల వెయ్యిముక్కలయ్యేలా చంద్రబాబుకు శాపం ఉందని వైఎస్సార్ చెప్పేవారు. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పరు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే ప్రజలు నమ్ముతారని ఆయన సిద్ధాంతం. మోసం, వెన్నుపోటు నుంచి పుట్టి... కుట్రలు, నీచరాజకీయాలతో ఎదిగిన చంద్రబాబుకు న్యాయం, ధర్మం, విలువలు, విశ్వసనీయత అనే పదాలకు కనీస అర్థం తెలియదు. అందుకే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యానికే వెన్నుపోటు పొడిచారు.

సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ కాదని ఎవరైనా వాదించగలరా..! 
ఇప్పుడు దేశంలోని నాయకులు అంతా కోల్ గేట్ గురించి మాట్లాడుకుంటున్నారు. బొగ్గును వేలం వేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం వల్ల దేశానికి రూ.రెండు లక్షలకోట్ల నష్టం వచ్చిందని స్వయంగా కాగ్ పేర్కొంటే... దానిపై సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. సీబీఐ విచారణ చేసి తయారు చేసిన నివేదికను ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రి కార్యాలయాలకు పంపించి, వాళ్లు నివేదికలో మార్పులు చేర్పులు చేసిన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించింది.

దీన్నిబట్టి ఈ సీబీఐ ఎవరికోసం పనిచేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. జగనన్నమీద కుట్రలు పన్ని 11 నెలలుగా జైల్లో పెట్టారు. ‘సీబీఐ పెడుతున్న బాధలతో జగన్‌మోహన్‌రెడ్డి తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయక తప్పదని’ ఇటీవల కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చెప్పారు అంటే వీళ్ల మనసుల్లో ఎన్ని కుట్రలు దాగి ఉన్నాయో అర్థమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేలా చేయడానికి అధికార దుర్వినియోగంతో జగనన్నను ఇంత ఇబ్బంది పెడుతున్న వీళ్లను ఏమనాలి? ఇంత జరిగిన తరువాత సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ కాదని ఎవరైనా వాదించగలరా?

సీబీఐ మీద చంద్రబాబు ఎందుకు నోరు విప్పరు...
బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారణ తీరుపై దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నా మన చంద్రబాబు మాత్రం నోరు విప్పటం లేదు. అదే వైఎస్సార్ కుటుంబం మీదనైతే ఇంతెత్తున లేచి, ఎంత నీచంగానైనా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులపై విచారణ జరగకుండా ఉండేందుకు చంద్రబాబు కాంగ్రెస్, సీబీఐకి లొంగిపోయారు కాబట్టే వాటిని విమర్శించే ధైర్యం లేదు. బతికి ఉంటే బలుసాకైనా తిని బతకవచ్చని నిర్ణయించుకొని కాంగ్రెస్, సీబీఐలను ప్రశ్నించడం లేదు, విమర్శించడం లేదు. సీబీఐ మీద, కాంగ్రెస్ మీద ఎందుకు నోరు విప్పడం లేదో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 136వ రోజు ఖమ్మంజిల్లా వైరా నియోజకవర్గం రాజలింగాల గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి బురదరాఘవాపురం, లచ్చగూడెం, తూతుక లింగన్నపేట, ఇందిరానగర్ మీదుగా ఏన్కూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి భగవాన్‌నాయక్ తండా శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి తొమ్మిది గంటలకు చేరుకున్నారు. గురువారం ఆమె మొత్తం 12.3 కిలోమీటర్లు నడిచారు.

ఇప్పటివరకు మొత్తం 1,834 కి.మీ యాత్ర పూర్తయ్యింది. ఏన్కూరు మండలంలోని లచ్చగూడెం శివారులో షర్మిలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ కలిశారు. ఇటీవల ఎడమకాలి మడమ బెణికి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్ర చేస్తున్న షర్మిలను కలిసి ఆమె ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..

ఖమ్మం: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర 136వ రోజు శుక్రవారం జిల్లాలో 12.4 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. ఏన్కూరు మండలం భగవాన్‌నాయక్ తండా శివారు నుంచి ప్రారంభమై అక్కినాపురం తండా మీదుగా జూలూరుపాడు మండల కేంద్రం, సాయిరాం తండా వరకు కొనసాగుతుందని, ఇక్కడ షర్మిల రాత్రి బస చేస్తారని వివరించారు.

పర్యటించే ప్రాంతాలు..
అక్కినాపురం తండా, హిమామ్‌నగర్, వినోబానగర్, 
ఒంటిగుడిసె క్రాస్‌రోడ్, జూలూరుపాడు, సాయిరాంతండా

బాబుకు నిజం చెప్పకూడదనే శాపం

Written By news on Thursday, May 2, 2013 | 5/02/2013

 ఖమ్మం జిల్లా ఏన్కూరులో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై షర్మిల మండిపడ్డారు. సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది అని షర్మిల అన్నారు. తొమ్మిదేళ్ల హయాంలో 8సార్లు చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారని షర్మిల విమర్శించారు. బాబుకు పదవి మీద ఆశ లేదంటే భూమి గుండ్రంగా లేదన్నట్టే అని షర్మిల వ్యాఖ్యానించారు.

రంగులు మార్చడం బాబు రక్తంలోనే ఉందని, విలువలు, విశ్వసనీయత బాబు డిక్షనరీలోనే లేవని షర్మిల అన్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు నిజం చెప్పకూడదనే శాపం ఉన్నట్టుందన్నారు. కాంగ్రెస్‌కానీ సీబీఐని కానీ బాబు ఎందుకు ప్రశ్నించడంలేదని షర్మిల నిలదీశారు.

ఈనాడు దుష్ప్రచారం చేస్తుంది: మారెప్ప

కర్నూలు: ఈనాడు దినపత్రికపై మాజీ మంత్రి మారెప్ప తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీలో చేరుతున్నట్లు తనపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. తాను పార్టీ మారేది లేదని....చచ్చినా బతికినా వైఎస్‌ఆర్‌సీపీని వదిలే ప్రసక్తే లేదని మారెప్ప స్పష్టం చేశారు. 

ప్రాణమున్నంత వరకూ జగన్ తోనే: రెహ్మాన్

తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. తాను పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నాననటం అవాస్తవమని.... ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఛానళ్లు దుష్ర్పచారం చేస్తున్నాయని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. మైనార్టీలకు జగన్ మాత్రమే న్యాయం చేయగలరని రెహ్మాన్ అన్నారు.

ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ రెక్కల కష్టం: షర్మిల

ఖమ్మం: పేదలకు కార్పోరేట్ విద్య అందించిన ఘనత వైఎస్ఆర్‌దినని ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నదే వైఎస్ఆర్ కల అని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్‌ హయాంలో విద్యుత్ చార్జీలు ఒక్కసారి కూడా పెరగలేదని షర్మిల తెలిపారు. గూడులేని నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టించారని, వైఎస్ఆర్ రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని కిరణ్‌ అనుభవిస్తున్నారని షర్మిల అన్నారు. 

పదవి అనుభవించడమే తప్ప కిరణ్‌ పేద ప్రజలకు ఏమీ చేయటం లేదని షర్మిల విమర్శించారు. కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు తప్ప కరెంట్ ఇవ్వడంలేదని. కిరణ్‌ మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని షర్మిల తెలిపారు. కిరణ్‌ పెట్టుబడుల లిస్ట్ పేరుకే పరిమితమవుతున్నాయని, బాబు అండదండలు చూసుకునే కిరణ్‌ రెచ్చిపోతున్నారని షర్మిల ఆరోపించారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందని, కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగం చేస్తోందని షర్మిల విమర్శించారు. 

AP in ruins after Peddayana's demise

YSRCP Leader Konatala Ramakrishna press meet

YSRCP Leader Rehman press meet

ఆనంకు లీగల్ నోటీసు చేరింది: శివకుమార్

సాక్షి, హైదరాబాద్: వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ జారీ చేసిన లీగల్ నోటీసు మంత్రికి చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ తెలిపారు. తనకు లీగల్ నోటీసు అందలేదని మంత్రి ఆనం మీడియాతో చెప్పడంపై శివకుమార్ స్పందిస్తూ.. మంత్రికి లీగల్ నోటీసులు అందినట్లు వచ్చిన అక్‌నాలెడ్జ్‌మెంట్ ప్రతులను పత్రికలకు విడుదల చేశారు.

బాబువి పనికిరాని పాదయాత్రలు

- టీడీపీ నేత మణిగాంధీ విమర్శ.. వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు వెల్లడి

సాక్షి, హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల తన పాలనా కాలంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఉపయోగం ఉండదని, ప్రజలు ఆయనకు పట్టంగట్టే పరిస్థితి లేదని కర్నూలు జిల్లా కోడుమూరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత శిఖామణి తనయుడు, టీడీపీ నాయకుడు మణిగాంధీ అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం ఆయన ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు.

గాంధీ వెంట పత్తికొండ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డి, నాయకుడు భూపాల్‌రెడ్డి ఉన్నారు. ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన గాంధీ విలేకరులతో మాట్లాడారు. కరెంటు కోతలు, రెట్టింపు చార్జీలతో రాష్ట్ర ప్రజలు సతమతం అవుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడుతున్న జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. వైఎస్సార్ సీపీని కాంగ్రెస్‌లో కలిపితే జగన్‌ను బయటకు తీసుకువస్తామన్న కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలతో ఆ పార్టీ క్రమ శిక్షణ ఎటువంటిదో ప్రజలు అర్ధం చేసుకుంటారని అన్నారు. 

వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా?


* కిరణ్, చంద్రబాబులకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్న
* వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా?
* బాబు ఏ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చారో.. వైఎస్ అలాగే చేశారు
* సీబీఐ మాత్రం కొంతమందినే లక్ష్యంగా చేసుకుని వేధిస్తోంది
* బాబు పాలనలాగే.. కిరణ్ పాలనలోనూ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు
* పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే

సాక్షి, హైదరాబాద్: ఒకప్పటి చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీలు ఇస్తే అవి ‘క్విడ్ ప్రో కో’ కిందకు రావా? దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు మాత్రమే ‘క్విడ్ ప్రో కో’ అవుతాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న ఆమె అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఏ మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారో.. వైఎస్ కూడా అదే పద్ధతిలో రాయితీలిచ్చారు. ఇప్పుడు కిరణ్ అదే విధానంలో ఇస్తున్నారు. కానీ సీబీఐ కొంత మందినే లక్ష్యంగా చేసుకుని వారిని వేధింపులకు గురిచేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుజుకు ఏ మార్గదర్శకాల ప్రకారం రాయితీలిచ్చారు?
‘ఇసుజు’ కార్ల కంపెనీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఏ మార్గదర్శకాల ప్రకారం రాయితీలిచ్చారు అని విజయమ్మ నిలదీశారు. ‘‘సాధారణంగా 50 శాతం వరకూ వ్యాట్ రాయితీలు ఇవ్వవచ్చు. అలాంటిది 135 శాతం రాయితీలు ఎలా ఇచ్చారు? రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీకి రూ.2,025 కోట్ల రాయితీలు ఇస్తున్నారు. చంద్రబాబు, కిరణ్ ఏమిచ్చినా నిబంధనల ప్రకారమే ఇచ్చినట్లా? వైఎస్ ఏమిచ్చినా ‘క్విడ్ ప్రో కో’ అవుతుందా?’’ అని విజయమ్మ ప్రశ్నించారు. క్విడ్ ప్రో కో పేరిట సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారందరినీ వేధిస్తూ.. ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇలా పెట్టుబడులు పెట్టినవారిని వేధిస్తూ విద్యుత్ కూడా సరిగా ఇవ్వని నేపథ్యంలో ఏ పారిశ్రామికవేత్తయినా రాష్ట్రానికి ఎందుకు వస్తారు? ఎలా పెట్టుబడులు పెడతారు? అని ప్రశ్నించారు. ‘‘భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ముఖ్యమంత్రి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయన్నారు. కనీసం రూ. 65 కోట్ల విలువ చేసే పరిశ్రమ అయినా వచ్చిందా? 35 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎక్కడ ఆ ఉద్యోగాలు?’’ అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి హాలిడే ప్రకటించి.. ప్రజలను గాలికొదిలేసి... కేవలం వైఎస్‌ను విమర్శించడానికి, వైఎస్ కుటుంబాన్ని వేధించడానికే సమయం వెచ్చిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదు..
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏరోజూ కార్మికులను, పేదోళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని విజయమ్మ ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ఏం చేయమంటే అది చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి, ప్రభుత్వ ఉద్యోగాలను ఊడబీకేయడానికి కృషి చేశారు. రాష్ట్రంలో 50 ప్రభుత్వ రంగ సంస్థలను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారు.

విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రైవేటు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి వేల కోట్లు దోచిపెట్టారు. మొన్నటికి మొన్న చిల్లర వర్తక రంగంలో విదేశీ పెట్టుబడుల బిల్లుపై ఓటింగ్‌కు తన పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించి.. ఆ బిల్లు ఆమోదం పొందేలా చేశారు’’ అని దుయ్యబట్టారు. ఆర్టీసీ వంటి సంస్థలను ప్రైవేటీకరించాలని బాబు ప్రయత్నిస్తే ప్రతిపక్ష నేతగా అందరితో కలిసి వైఎస్ అడ్డుకున్నారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేపట్టిన వైఎస్ పాలనను జగన్ నేతృత్వంలో తిరిగి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.

ఘనంగా మేడే: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాల్లో భాగంగా విజయమ్మ కార్యాలయ ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత జరిగిన సభలో కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్ ప్రసాద్, పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్‌వీ ప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మే డే ఉత్సవం అనంతరం విజయమ్మ సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆఖరి ఏడాదిలో అందరిపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు..


* ఆఖరి ఏడాదిలో అందరిపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు..
* ఆడబిడ్డలపై ప్రేమ ఉంటే ఇన్ని అత్యాచారాలు జరిగేవా?
* వయసుతో అంతరం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి
* ప్రభుత్వం మొద్దు నిద్ర వల్లే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది
* చంద్రబాబు దారిలోనే కిరణ్ పయనం
* ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, కార్మికులు చితికిపోయారు
* జగనన్న రాజ్యంలో ఆడబిడ్డలకు ‘అమ్మ ఒడి’
* రెండు రోజుల విరామం అనంతరం పాదయాత్ర కొనసాగింపు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘ఆడబిడ్డల మీద ప్రేమతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టానంటున్నారు. నిజంగా ఆడబిడ్డలపై ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరిగేవా? వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాచారాలు జరిగితే కఠిన శిక్షలు ఉండేవి. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్లే ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలో షర్మిల మరోప్రజాప్రస్థానం పాదయాత్ర రెండు రోజుల విరామం అనంతరం బుధవారం తిరిగి ప్రారంభమైంది.

కామేపల్లి మండలం ముచ్చెర్ల నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఏన్కూరు మండలం మర్సకుంట్ల గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో ఆమె ప్రసంగించారు. ఆడబిడ్డలపై నిత్యం అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం గురకపెట్టి నిద్రపోతోందని విమర్శించారు. ఇప్పటివరకు నిద్రపోయి ఆఖరి ఏడాదిలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని విమర్శించారు. మంచి నీటి కోసం గ్రామాలలో మహిళలు పడుతున్న ఇబ్బందులు సీఎంకు కనిపించవా అని ప్రశ్నించారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి 30 కేజీల బియ్యం అందిస్తామని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది.

ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. వైఎస్ బతికి ఉంటే దీనిని అమలు చేసేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికీ ఈ వాగ్దానం అమలు చేయలేదు. చంద్రబాబు దారిలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి పయనిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.2కే కిలో బియ్యం ప్రవేశపెట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అదే దారిలో పయనిస్తున్నారు’’ అని మండిపడ్డారు.

రైతులు, కార్మికులు చితికిపోయారు
‘వైఎస్ పాలనలో రెండు పంటలకు నీళ్లొచ్చాయి. ఏడు గంటలు ఉచిత విద్యుత్ అందింది. రైతులు, కూలీలు బాగుపడ్డారు. ఈరోజు కార్మికుల దినం. కానీ రాష్ట్రంలో రైతులు, కార్మికులు చితికిపోయారు. రైతు మంచిగా ఉంటేనే కూలీలు బాగుంటారు. ఈ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుండటంతో వాళ్లు అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైఎస్ హయాంలో మిర్చికి క్వింటాలుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఇచ్చారు. ఇప్పుడు కేవలం రూ.4 వేలే ఇస్తున్నారు’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో గిరిజనులకు రెండు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఏకైక వ్యక్తిగా వైఎస్ గుర్తింపు పొందారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవరూ ఇలా గిరిజనులకు భూమిని పంపిణీ చేయలేదని చెప్పారు.

జగనన్న రాజ్యంలో ‘అమ్మ ఒడి’
‘‘ఆడపిల్లలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెడతామని పార్టీ ప్లీనరీలో జగనన్న చెప్పారు. ఈ పథకం ప్రకారం.. పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ.500, ఏడాదికి రూ.6 వేలు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.700, ఏడాదికి రూ.8,400, డిగ్రీ విద్యార్థులకు ప్రతి నెలా రూ.వెయ్యి, ఏడాదికి రూ.12 వేలు అమ్మ ఖాతాలోనే పడతాయి. ఆడా మగా తేడా లేకుండా అందరూ చదివేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. విద్యార్థుల జీవితాలు బంగారుబాటలో పయనిస్తాయి. ఇప్పుడు ఏడాది మిగిలి ఉండటంతో బంగారు తల్లి అంటూ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఆడబిడ్డలపై ప్రేమతో పెట్టినది కాదు’’ అని షర్మిల అన్నారు.

12.3 కిలో మీటర్లు పాదయాత్ర
ఎడమ కాలి మడమకు గాయం కావడంతో రెండు రోజుల విరామం అనంతరం షర్మిల బుధవారం పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం ముచ్చెర్ల నుంచి నడక ప్రారంభించారు. అడవిమద్దులపల్లి, లాల్యాతండా, వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు మండలం మర్సకుంట్ల, శ్రీరాంపురంతండా, తిమ్మారావుపేట, రాజలింగాల వరకు 12.3 కిలోమీటర్లు నడిచారు. రాజలింగాల గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, సాధు రమేష్‌రెడ్డి, భూక్యా దళ్‌సింగ్, బాణోతు పద్మావతి, నంబూరి రామలింగేశ్వరరావు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..

మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 136వ రోజయిన గురువారం జిల్లాలో 12.3 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. ఏన్కూరు మండలం రాజలింగాల నుంచి ప్రారంభమై భగవాన్ నాయక్ తండా వరకు పాదయాత్ర కొనసాగుతుందని, అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేస్తారని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు..
బురదరాఘవాపురం, లచ్చగూడెం, లింగన్నపేట, ఇందిరానగర్, ఏన్కూరు మీదుగా భగవాన్‌నాయక్‌తండా వరకు

కాంగ్రెస్, టీడీపీల ఆశల్ని తలకిందులు చేస్తాడని!

జగన్ అరెస్టుకు సీబీఐ చెప్పిన కారణం... ‘జగన్ ఒక ఎంపీ. ఒక పార్టీ అధ్యక్షుడు. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు’ అని! ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడని తెలిస్తే, సాక్ష్యాలు దొరికాక అరెస్ట్ చేస్తారు. కానీ సీబీఐ లాంటి సంస్థ ఏమంటోందంటే, ‘జగన్ తప్పు చేశాడని అనుమానం ఉంది. దానిని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నాం. అవి నిరాటంకంగా సాగాలంటే ముందు జగన్‌ను అరెస్ట్ చేయాలి’ అని!! సీబీఐ చెప్తున్న కారణం ఎంత సిల్లీగా ఉందంటే, రేపు ఒక సామాన్యుణ్నీ ఇదే కారణంతో అరెస్ట్ చేసినా, ఎవరూ ప్రశ్నించే పరిస్థితి ఉండదు. అరెస్ట్ చేసినప్పుడు ఇదే మాట, అరెస్ట్ అయ్యి పది నెలలు దాటినా ఇదే మాట.

ఇలా ఒక వ్యక్తిని జైల్లో ఉంచటం న్యాయమా?
భారతదేశంలో ఇది ఒక పెద్ద కుట్ర. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయటానికి కేసులు పెట్టడం, బెదిరించటం, మాట వినకపోతే అరెస్ట్ చేయటం, ఇంకా మాట వినకపోతే బెయిల్ రాకుండా చూడటం! అధికారంతో ఇన్ని పనులు చేయగలిగిన వ్యవస్థ మన ప్రజాస్వామ్యంలో ఉందంటే ఎంత ఘోరం. ఎన్ని తప్పులు చేసినా అధికారపక్షం మాట వింటే అరెస్టులు ఉండవు. బయటకొచ్చినా, దాని గురించి సీబీఐ విచారణ ఉండదు. అధికార పార్టీకి చెందిన ఎవరినీ సీబీఐ అరెస్ట్ చేయదు.

ఒక 2జీ స్కామ్, కోల్ స్కామ్... ఏదైనా ఇదే వరుస.ఎన్నో కేసులు చూశాం. అన్నింటిలో బలవంతునికి ఒక న్యాయం, బలహీనునికి ఒక న్యాయం. అధికారంలో ఉన్న వ్యక్తికి ఒక న్యాయం, లేని వ్యక్తికి ఒక న్యాయం. అధికారంలో ఉన్న వ్యక్తి ఇన్ని వ్యవస్థలను ప్రభావితం చేయగలిగితే, ఆ వ్యక్తి ఒకవేళ చెడ్డవాడైతే దేశానికి ఎంత నష్టమో గమనించాలి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు దీన్ని ప్రశ్నించాలి. ధైర్యంగా వ్యతిరేకించాలి. అధికారంలో ఉన్న వ్యక్తికి తన పరిధి ఏంటో చూపించాలి.

అదే పని చేస్తున్న వ్యక్తి వై.ఎస్.జగన్‌గారు. భయపెట్టినప్పుడు లొంగలేదు. అరెస్ట్ చేసినప్పుడు కుంగిపోయి వారి మాట వినలేదు. బెయిల్ రాకుండా ఉన్నా తొణకలేదు. ఇలాంటివారే నిజమైన నాయకుడు. వీరే ప్రజలకు మంచి చేయటం కోసం ధైర్యంగా ముందుకు సాగగలరు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా దేశాన్ని కాపాడగలరు.అధికారంలో ఉన్న వ్యక్తి తనకు అధికారాన్ని అందించిన ప్రజలను తప్ప అన్ని వ్యవస్థలనూ తనకు అనుకూలంగా మార్చుకోగలడు. ప్రజల మన్ననలు పొందాలంటే మాత్రం, వారి కష్టాలను తీర్చాలి, ఆకాంక్షలను నెరవేర్చాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి. అది సాధ్యమయ్యేది ఒక్క వైఎస్సార్‌కి, తర్వాత జగన్‌కు మాత్రమే.

కాంగ్రెస్ పార్టీ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తోంది... జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని కాదు, ప్రజల మనసులను ప్రభావితం చేస్తాడని! ప్రజలకు నిజమేంటో చెబుతాడని! జగన్ సాక్ష్యులను తారుమారు చేస్తాడని కాదు. కాంగ్రెస్, టీడీపీ ఆశలను తలకిందులు చేస్తాడని!ఒకసారి ఆలోచిద్దాం, జగన్ ఒకవేళ ఈ అరెస్టులకు భయపడి, ఇవన్నీ మనకెందుకు, కామ్‌గా మనపని మనం చేసుకుపోదాం అనుకొనుంటే, ఆయన ఎప్పుడో కేంద్రమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు.

కానీ ప్రజలకు మేలుచేసే ఒక్కొక్క పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తుంటే సహించలేకపోయాడు. బాగుపడిన పేదవాడి జీవితాన్ని ఛిద్రం చేసే కాంగ్రెస్ ఆలోచనలను సహించలేకపోయాడు. అందుకే ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఎదిరించాడు. పర్యవసానం... జైల్లో ఉన్నాడు. మనకోసం ఆయన జైలుకెళ్తే మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? 

మనం నోరుతెరిచి, ‘మా సమస్యలను పరిష్కరించే నాయకుణ్ని జైల్లో ఉంచి మీరు పరిపాలించొద్దు. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోండి. కేసులు పెట్టి కాదు. ఇక్కడ ప్రజలు తమకు మేలుచేసిన నాయకుడిని ఎప్పుడూ మరిచిపోరు’ అని చెబుదాం. 

కాంగ్రెస్ పార్టీ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తోంది... జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని కాదు, ప్రజల మనసులను ప్రభావితం చేస్తాడని! ప్రజలకు నిజమేంటో చెబుతాడని! జగన్ సాక్ష్యులను తారుమారు చేస్తాడని కాదు. కాంగ్రెస్, టీడీపీ ఆశలను తలకిందులు చేస్తాడని!
- అరుణ, సికింద్రాబాద్

'చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు'

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు చైతన్యవంతులైనందు వల్లే బాబును రెండుసార్లు ప్రతిపక్షనేతగా ఉంచారని ఈ సందర్భంగా కొణతల రామకృష్ణ గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కాంగ్రెస్ కు సీల్డ్ కవర్ లా పనిచేస్తోందని ప్రజలకు అర్థమైందని ఆయన వివరించారు.

ధైర్యంగా ఉండండి జగన్ వస్తారు:విజయమ్మ

Written By news on Wednesday, May 1, 2013 | 5/01/2013



సికింద్రాబాద్: అడ్డగుట్ట రచ్చబండలో తమ బాధలు చెప్పుకున్న ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధైర్యం చెప్పారు. జగన్ వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారని, అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం ఈ రచ్చబండ ఉద్దేశమని చెప్పారు. పథకాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడానికే పార్టీ ఈ రచ్చబండను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుతాయని చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే వృద్ధులకు 700 రూపాయల పించన్ ఇస్తారన్నారు. కార్మికులందరికీ విజయమ్మ మేడ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ పేరులోనే శ్రామికులను చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం పాలనలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ కోతలతో ఫ్యాక్టరీలు మూత పడటంతో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండేళ్లుగా కుంటుపడుతున్నాయని బాధపడ్డారు.

వైఎస్ కుటుంబాన్ని వేధించడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఏ ప్రాతిపదికన ఈసీజీ కార్ల కంపెనీకి పెట్టుబడికి మించి రాయితీలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించినట్లు, లక్ష మందికిపైగా ఉపాధి కల్పించినట్లు కిరణ్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. అన్ని పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయని, కనీసం ఒక్కరికైనా ప్రభుత్వరంగంలో ఉపాధి కల్పించారా? అని ఆమె ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు పెంచారని, ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలని చూశారన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకులు రాష్ట్రంలో రావాలసిన అవసరం ఉందని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు 50 ప్రభుత్వ రంగ సంస్థలను టీడీపీ నేతలకు దారాదత్తం చేశారని చెప్పారు. దాంతో వేలాది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు.

త్వరలో రాజన్న రాజ్యం: షర్మిల

ఖమ్మం: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కరెంట్‌ బిల్లులు విపరీతంగా పెరిగాయని, రైతులకు రుణాలు అందడంలేదని, పంటనష్ట పరిహారం అందడంలేదని గిరిజన మహిళలు సూర్యతండాలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో పావలావడ్డీ రుణాలు సక్రమంగా అందేవని..ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ మహిళలు షర్మిలతో అన్నారు. అయితే మహిళల బాధలకు స్పందించిన షర్మిల ..త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుంది అని భరోసా నింపారు.

రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని షర్మిల అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా గిరిజనులకు 2లక్షల ఎకరాలకు యాజమాన్య హక్కు కల్పించిన ఘనత వైఎస్‌దేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. వైఎస్‌ బతికివుంటే మరో 6లక్షల ఎకరాలు భూపంపిణి జరిగి వుండేదని షర్మిల అన్నారు. నాడు వైఎస్‌ ప్రతి కుటుంబానికి 30కేజీల బియ్యం ఇవ్వాలనుకున్నారని.. కానీ నేడు కిరణ్‌ సర్కార్‌ 20కేజీలకే పరిమితం చేసిందని షర్మిల విమర్శించారు. మహిళలకు మేలు చేసేందుకు జగనన్న అమ్మఒడి వంటి పథకాన్ని ప్రకటించారని షర్మిల తెలిపారు.

YS Vijayamma speech at May Day Celebrations

ముచ్చర్లలో జెండా ఆవిష్కరించిన షర్మిల

ఖమ్మం : మహానేత వైఎస్సార్ తనయ షర్మిల ఖమ్మం జిల్లాలో బుధవారం పాదయాత్రను పునప్రారంభించారు. ముచ్చర్ల నుంచి ఆమె తన పాదయాత్రను మొదలుపెట్టారు. మేడే సందర్భంగా షర్మిల ముచ్చర్లలో జెండాను ఆవిష్కరించారు. 135వ రోజు మరో ప్రజాప్రస్థానం యాత్ర అడవిమద్దలపల్లి, లాలయ్య తండా, మర్సగుంట, శ్రీరామపురం తండా, తిమ్మారావుపేట, రాజలింగాల గ్రామాల్లో కొనసాగనుంది.

బిందెడు మంచినీళ్లు ఇవ్వడంలేదు: వాసిరెడ్డి పద్మ

మహిళలకు ఒక్క బిందె మంచి నీళ్లు అందివ్వడం చేతకాని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. కొత్తగా ప్రకటించిన బంగారుతల్లి పథకానికి కొనసాగింపుగా ‘బూచోళ్లం వస్తున్నాం’ అని చేరిస్తే కిరణ్ ప్రభుత్వం చేస్తున్న పనులకు అతికినట్లు సరిపోయేదని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకడంలేదు. మంచి నీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదు. అలాంటి వ్యక్తులు మహిళలకు మంచిచేస్తామంటే నమ్మెదెవరు? ఎన్నికల సమయం దగ్గరకొస్తోందని మహిళలను మచ్చిక చేసుకోవడానికి వారు ఆడుతున్న గిమ్మిక్కులు’’ అని దుయ్యబట్టారు.

బాపట్లలో 5న వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నగారా


రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలుగెత్తి చాటడానికి మే 5వ తేదీన గుంటూరు జిల్లా బాపట్లలో మహిళా నగారా పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును నిర్వహించబోతుంది. ఈ సదస్సును పురస్కరించుకుని మంగళవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన నివాసంలో ‘మహిళా నగారా’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు కోన రఘుపతి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి, నన్నపనేని సుధ తదితరులు పాల్గొన్నారు. 

సదస్సుకు ‘సునీల’ ప్రాంగణంగా నామకరణం
ఇటీవల తెనాలి పట్టణంలో కొందరు దుర్మార్గుల చేతిలో బలైన సునీల జ్ఞాపకార్థం మహిళా సదస్సు జరిగే వేదికకు ‘సునీల ప్రాంగణం’ అని నామకరణం చేస్తున్నామని పార్టీ నేత కోన రఘుపతి తెలిపారు. మహిళల భద్రతపై ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చేందుకే బాపట్లలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు.

చిన్న వయసులో భగవంతుడు ఎంత గుండె ధైర్యం ఇచ్చాడు!!

జగనన్నను అరెస్టు చేస్తారని నాకు గట్టి అనుమానం ఉండింది. ఆరోజు మే 27 సాయంత్రం అరెస్టు వార్త విని ఎంతో బాధపడ్డాను. గుండెల్లో దాచలేనంత బాధ. కాని జగనన్న ముఖం మీద చిరునవ్వు... ‘బాధ పడొద్దు, నాకేం కాదు’ అన్న ఒక సంకేతం ఇచ్చినట్లనిపించింది. ఆరోజు జగనన్న కుటుంబాన్ని చూస్తే చాలా బాధనిపించింది. కన్నతల్లి మనసు బిడ్డ కోసం ఎంత తపిస్తుందో మనం అర్థం చేసుకోగలం.

అంత బాధలో కూడా పేద ప్రజల కోసం, విద్యార్థుల కోసం విజయమ్మ పోరాడుతున్నారు. జగనన్న బయట ఉండి పేద ప్రజలకు మంచి చేస్తూ, వారికి దగ్గరవుతున్నారని కొన్ని పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కై సీబీఐ తోడ్పాటుతో జగనన్నను జైలుకు పంపాయి. ఈ రోజుల్లో తప్పు చేస్తేనే జైలుకి పోవాలని లేదనీ, అధికారంలో ఉన్న రాజకీయపార్టీ, పెద్దపెద్ద వ్యక్తులు చేతులు కలిపితే ఎంత మంచివారైనా సరే జైలుకు పోవడం తప్పదని జగనన్న అరెస్టు విషయంలో స్పష్టం అయింది. 

ఇదేనా ప్రజాస్వామ్యం? జగనన్న తన తండ్రి చనిపోయిన తరువాత నల్ల కాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పుయాత్ర చేస్తుంటే, అది వారికి నచ్చక పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టారు. మాటతప్పని మడమ తిప్పని కుటుంబం కాబట్టే పదవులను సైతం పట్టించుకోకుండా జగనన్న, విజయమ్మ ప్రజలకోసం త్యాగం చేశారు. ఎవరు చేస్తారు ఇంత త్యాగం. (చూస్తూనే ఉన్నాం కదా... కొంతమంది పార్టీనేతలు పదవులకోసం పార్టీలనే అమ్ముకున్నారు!) పార్టీలు కుమ్మక్కై ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు జగనన్న వెనుక ఉన్నారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారు. 
- ఉమ్ముల్ బనీన్, విజయవాడ

చిన్న వయసులో భగవంతుడు ఎంత గుండె ధైర్యం ఇచ్చాడు!!
మాది వ్యవసాయ కుటుంబం. నా అనుభవంలో రైతు కష్టాలను అర్థం చేసుకున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్సార్‌గారే. ఇన్ని కోట్లమంది ప్రజల మనస్సులో వైఎస్సార్ చిరస్థాయిగా ఉన్నారంటే ఆయన అవలంబించిన రైతుహిత విధానాలే కారణం. ఆ మహానేత తనయుడు జగన్‌ని ఇప్పుడు కుటిల రాజకీయ నాయకులంతా కలిసి వేధింపులకు గురిచేస్తుండడం మాకెంతో బాధకలిగిస్తోంది. 

ఆ మధ్య జరిగిన బై ఎలక్షన్లలో జగన్‌గారు నాలుగు రోజులు కోవూరులో ఉండి ప్రచారం చేశారు. ఆఖరిరోజు రాత్రి మా బంధువు వినోద్‌రెడ్డి ఇంట్లో బసచేశారు. వినోద్‌రెడ్డి నాకు ఫోన్ చేసి, ‘జగన్‌గారు ఈరోజు మన ఇంట్లోనే ఉన్నారు. రేపు ఉదయం రండి’ అని చెప్పారు. మర్నాడు ఉదయాన్నే ఐదు గంటలకల్లా నేను కోవూరు చేరుకున్నాను. తొమ్మిది గంటలకు జగన్‌ను చూశాను.

చూశాక, ‘ఇంత చిన్న వయసులో భగవంతుడు ఎంత గుండె ధైర్యం ఇచ్చాడు..!’ అని మనసులో పదేపదే అనుకున్నాను. ఆయనతో కలిసి ఫొటో కూడా తీయించుకున్నాను. అది నాకు మరపురాని రోజు. ఏ తప్పూ చేయని జగన్‌ని జైలుపాలు చేసి కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టాలని చూసింది.

అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా ఆ పార్టీకు బుద్ధి రాలేదు. జగన్ త్వరలోనే బయటికి వస్తారు. ఆ రోజున రాజకీయంగా ఆయన మరింత బలపడతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
- డి.గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు

బాబూ మాట్లాడవేం?

నిలదీసిన అంబటి రాంబాబు
మీరు కూడా కాంగ్రెస్‌తో భాగస్వాములయ్యారా?
కేంద్రం చెప్పుచేతల్లో సీబీఐ ఉందని రుజువైంది
కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే జగన్‌ను నిర్బంధించారు

సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎక్కడికి చేరిందో అర్థం చేసుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ప్రత్యర్థులుగా మారిన రాజకీయనాయకులను వేధించేందుకే సీబీఐ ఒక ఆయుధంగా పనిచేస్తుందని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో చీమచిటుక్కుమన్నా నానా యాగీ చేసే టీడీపీ అధినేత చంద్రబాబు.. సీబీఐ ధోరణిపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు పెదవి విరుస్తున్నప్పటికీ పెదవి విప్పకపోవడంలో మతలబేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మారిన సీబీఐలో చంద్రబాబు కూడా భాగస్వామ్యం అయినట్లున్నారని విమర్శించారు. జగన్ కేసు విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏది చెబితే సీబీఐకి అది వేదంలా కనబడుతోందని వ్యాఖ్యానించారు. జగన్ కేసుకు సంబంధించి ముక్కలు ముక్కలుగా చార్జీషీట్లు వేయాలని ఆ రెండు పార్టీ చెప్పినట్లు సీబీఐ తలూపుతోందని విమర్శించారు. సీబీఐ చేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్రం చెప్పుచేతల్లో సీబీఐ

కేంద్రం చెప్పుచేతల్లో సీబీఐ పనిచేస్తోందని గతంలో తాము అనేక సందర్భాల్లో చేసిన వాదనలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరింత బలం చేకూరుతుందని అంబటి తెలిపారు. బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సంస్థ చేసే దర్యాప్తు ఏవిధంగా సాగుతోందనే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందన్నారు. కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును ముందే కేంద్ర న్యాయశాఖమంత్రి, ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంతో దేశం నివ్వెరపోయిందని చెప్పారు. 

అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం అందించడంలో ప్రధానమంత్రి కార్యాలయం నిమగ్నమైందంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన చర్య మరొకటి ఉండదని విమర్శించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న బొగ్గుకుంభకోణం కేసు పరిస్థితి ఈ విధంగా ఉంటే రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న వారి కేసుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తుల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని చెప్పారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై దర్యాప్తు ఏవిధంగా సాగుతుందో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీబీఐ చేస్తున్నది దర్యాప్తు కాదని జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్‌సీపీపై దౌర్జన్యం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను ఎదిరించి బయటకొచ్చారనే దురుద్దేశంతోనే జగన్‌పై కత్తిగట్టి పదకొండు నెలలుగా నిర్బంధించారని చెప్పారు. ఈ విషయమై తాము గతంలో రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

నేటి నుంచి షర్మిల యాత్ర పునఃప్రారంభం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం పునఃప్రారంభమవుతుంది. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్ తరఫున చేపట్టిన పాదయాత్ర.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో సాగుతుండగా బూడిదంపాడు వద్ద ఆమె ఎడమ కాలు మడమ బెణికి గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ముచ్చర్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న షర్మిల బుధవారం పాదయాత్ర పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. మంగళవారంఅపోలో ఆసుపత్రి వైద్యుడు సీఎస్ రెడ్డి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారని, గాయం 95 శాతం నయమైందని, మెల్లగా నడక ప్రారంభించవచ్చని సూచించారని చెప్పారు. 

సీబీఐ స్వతంత్రత, నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా..

అధికారం, సంబంధం లేని వ్యక్తులు విచారణను ప్రభావితం చేశారని గనుక తేలితే, దాని అర్థం ఒక్కటే... 
ఈ దర్యాప్తు మొత్తం ఒక ప్రహసనం, అర్ధరహితం!

ఏప్రిల్ 26న సీబీఐ డెరైక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ‘‘చాలా కలవరపరిచే అంశం’’ ఉంది

బొగ్గు గనుల కేటాయింపులు సహేతుకం, చట్టబద్ధం, రాజ్యాంగబద్ధంగా జరిగి ఉంటే సరే. లేకుంటే వాటి తాలూకు పర్యవసానాలను (బాధ్యులు) అనుభవించక తప్పదు!

మంత్రి దర్యాప్తు సంస్థలకు మార్గనిర్దేశ నం చేస్తే.. ఆ సంస్థల స్వతంత్రకు భంగం వాటిల్లినట్టు కాదా..?

మేం మిమ్మల్ని నమ్మాం, విశ్వసించాం. కానీ నివేదికను మీరు ప్రభుత్వంతో పంచుకున్నారు. ఇది మొత్తం విచారణ ప్రక్రియనే కుదిపేసింది. ఇది మామూలు విషయం కాదు. పైగా దీనిపై 
కోర్టును ఎందుకు చీకట్లో పెట్టాల్సి వచ్చింది?

ఈ పరిణామాల తర్వాత సీబీఐ స్వతంత్రత, నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారింది.

రాజకీయ, తదితర బయటి ఒత్తిళ్లు, ప్రభావాలు, చొరబాట్ల బారి నుంచి సీబీఐకి విముక్తి కలిగించాలి. తద్వారా.. సంస్థ విచారణ రాజకీయ బాసులు, బయటి అంశాల ప్రభావానికి లోనైందనే మచ్చ ఇకముందు పడకుండా ఉండాలంటే అలా చేయాల్సిందే.

సీబీఐ స్వతంత్రత, నిష్పాక్షిక విచారణ పట్ల ప్రతి ఒక్కరూ గర్వపడే పరిస్థితిని కల్పించడమే (మా) తొలి లక్ష్యం.

నివేదికను ఎవరైనా చూశారా? లేదా? అన్న అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మేము ఆదేశించకపోతే... రాజకీయ జోక్యం విషయం అసలు బయటపడేదే కాదేమో...

ఎవరినైనా కాపాడేందుకు ప్రయత్నం జరిగిందా అన్నది మాకు తెలియాలి. అలాంటిదే గనుక జరిగితే అప్పుడు మా ప్రతిస్పందన వేరేలా ఉంటుంది!

విచారణ ఎలాంటి బయటి ఒత్తిళ్లకూ లోనవకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా జరగాలి. కానీ ఈ విచారణ ప్రక్రియలో నిష్పాక్షికత లేదు. అది పూర్తిగా కుదుపుకు గురైంది.

రాజకీయ బాసుల సూచనలను సీబీఐ స్వీకరించాల్సిన అవసరం లేదు. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలి


విచారణ నిష్పాక్షికంగా జరిగినంత మాత్రాన చాలదు.. అలా జరిగినట్టుగా కన్పించాలి కూడా!

ఇదంతా కీలక సమాచారాన్ని కోర్టు ముందుకు రాకుండా అణచివేసే ప్రయత్నం కాదా? దీనిపై మేమెలా ముందుకెళ్లేది?


ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అసలు ఎందుకు జరిగింది? ఇది కోర్టు నుంచి కీలక సమాచారం 
నొక్కిపెట్టేందుకు చేసిన ప్రయత్నమా?

నివేదికను తనకు చూపించాల్సిందిగా కోరే అధికారం న్యాయ మంత్రికి ఉందేమో చెబుతారా (సీబీఐని ఉద్దేశించి)?

(ముసాయిదా నివేదికలో) ఎలాంటి మార్పులు చేశారు? ఎవరి ప్రభావంతో చేశారు? వాటి పర్యవసానం ఏమిటి?

http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=590002&Categoryid=1&subCatId=32

Popular Posts

Topics :