05 May 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Sharmila speech in Sathupalli, Khammam

Written By news on Saturday, May 11, 2013 | 5/11/2013

టిడిపిని పారిశ్రామికవేత్లలు నడుపుతున్నారుతెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. తాను ఎన్.టి.ఆర్., చంద్రబాబు నాయుడుల ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశానని, ఏ రకమైన అవకతవకలకు, దందాలకు అవకాశం లేకుండా పనిచేశానని అన్నారు. టిడిపి తనను ప్రోత్సహించింది, గుర్తింపు ఇచ్చిందని ఆయన అన్నారు.అయితే ప్రస్తుతం పార్టీలో పారిశ్రామికవేత్తలకు, డబ్బున్నవారికి,ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేస్తున్నారని ఆయన విమర్శించారు.రెండు సాదారణ ఎన్నికలలోను,ఆ తర్వాత ఉప ఎన్నికలలో టిడిపి ఓడిపోయిందని ఆయన అన్నారు.చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూలం అని ఎన్నడూ చెప్పలేదని శ్రీహరి అన్నారు. ఎఫ్.డి.ఐల విషయంలో పార్టీ విప్‌ ను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోలేదని అన్నారు.అవిశ్వాస తీర్మానం విషయంలో టిడిపి తటస్థంగా ఉండడం సరికాదని అన్నారు.కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని కూడా శ్రీహరి వ్యాఖ్యానించారు.

టీడీపీ విశ్వసనీయత కోల్పోయింది: కడియం

 అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవటంతో తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని కడియం శ్రీహరి అన్నారు. ఆయన శనివారం టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు.

టీడీపీ-కాంగ్రెస్ కలిసిపోయాయనే సంకేతాలు ప్రజలకు వెళ్లాయన్నారు. 

Khamma Khillalo 11th May 2013

జగన్‌కి కాదు...జనానికి ఈ నిర్బంధం


అంతా అనుకున్నట్లే జరిగింది. జగన్‌కి బెయిల్ రాలేదు. మరో నాలుగు నెలల తరవాతే బెయిల్‌కి అప్పీల్ చేసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయం. గడువు లోపల సీబీఐ తన విచారణ పూర్తి చెయ్యకపోతే, అప్పుడు జగన్ అవసరమైతే మళ్లీ పిటిషన్ పెట్టుకోవచ్చట. ఒకవేళ అలా పెట్టుకోకుండా సీబీఐ ఎన్ని సంవత్సరాలు విచారణ జరపాలనుకున్నా అంతకాలం జగన్ జైల్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి గాను తన శక్తియుక్తులన్నిటినీ ధారబోసిన సీబీఐ న్యాయవాది బయటకు రాగానే ‘‘అవసరమైతే నాలుగునెలల తరవాత కూడా మరింత గడువు ఇవ్వాలని కోరతాం’’ అని వ్యాఖ్యానించారు. దీనినిబట్టే అర్థమవుతోంది సీబీఐ ఎలాంటి పన్నాగాలు పన్నుతోందో! కుట్ర ఫలించడంతో కాంగ్రెస్‌కు, తెలుగుదేశానికి, ఎల్లో మీడియాకు, సీబీఐకి అపరిమిత ఆనందం కలిగి వుంటుంది. జగన్‌కు బెయిల్ రాలేదు కదా! అందుకు. కానీ ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న సామాన్య ప్రజానీకానికిది పిడుగుపాటు. ఏం జరుగుతుందో, ఇంకా ఏం జరగబోతుందో దిక్కు తెలియని స్థితి. జగన్ నిర్బంధంతో జనానికి సంకెళ్లు పడినట్లయింది!

ఒక ముఖ్యమంత్రిని నిర్దేశించగల అధికారం హైకమాండ్‌కి ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి కుమారుడు మంత్రివర్గాన్ని, గవర్నమెంటుని నిర్దేశించగల సూపర్ నేచురల్ పవర్ అని కేవలం సీబీఐ హ్రస్వదృష్టికి మాత్రమే కనిపిస్తుంది. ఆర్థికశాస్త్రనిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నదేమంటే... ఇన్వెస్ట్‌మెంట్‌కీ ఆర్జనకీ మధ్య తేడా తెలియనట్లు సీబీఐ ప్రవర్తించడం. జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడి అతని అక్రమార్జన ఎలా అవుతుంది? కానేకాదు అన్నది కామన్‌సెన్స్. కానీ సీబీఐ ఏ మాత్రం కామన్‌సెన్స్ లేకుండా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు జగన్ అక్రమార్జన అని తేల్చింది. కంపెనీరూల్స్‌కి తాజా కొత్త భాష్యం ఏమంటే... ముఖ్యమంత్రి కుమారుడి కంపెనీల్లో ఎవరూ పెట్టుబడి పెట్టకూడదు!

ఇంతవరకూ ఏ ఎనలిస్ట్‌కీ అందని పాయింట్ ఇది! అలా పెట్టుబడి పెట్టినవారంతా దోషులేనట. ఈ లాజిక్ కేవలం సీబీఐకి మాత్రమే అర్థమౌతుంది. అలా ప్రజల్ని నమ్మించడానికి ఎన్ని టక్కుటమార విద్యలైనా ప్రదర్శించగలదు. ఈ డ్రామాకి సహాయ సహకారాలు అందిస్తున్నవాళ్లు సచ్ఛీలులు! వాళ్లు చేసే వ్యాపార, పారిశ్రామిక వ్యవహారాల్లో పెట్టుబడులన్నీ సక్రమార్జన. ఆహా! ఎంత అద్భుత విన్యాసం. ఏ కొమ్ములు తిరిగిన ఆడిటర్ జనరల్‌కీ అర్థం కాని అర్థశాస్త్ర వైచిత్రి. రాజశేఖరరెడ్డిగారు తాను జీవించినంతకాలం, తనకి సాధ్యమైనంత సహాయం చేస్తూ, తన శత్రువుని కూడా చేరదీసిన గొప్పవ్యక్తి. ఆయన ప్రవర్తనాసరళి తెలుసుకోవడానికి ఆయన స్వచ్ఛమైన నవ్వు చాలు. ఆయన జనాన్ని ప్రేమించారు.

జనం కోసం జీవించారు. ఆ జనం కోసమే మరణించారు. కానీ నేడు జరుగుతున్నదేమిటి? ఆయన్ని ద్వేషించేవాళ్లు, ఆయన పెంచి పోషించిన పార్టీ కలిసి ఆయన తనయుడు జగన్‌ని రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి సహాయసహకారాలు అందించేందుకు ఎల్లో మీడియా రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. పర్యవసానమే జగన్ నిర్బంధం, బెయిల్ రాకపోవడం. జగన్‌ని జనానికి దూరంగా ఉంచినందువల్ల వీరు ఆశించినట్లు ఏమీ జరగదు. పైగా జనమే జగన్‌కి దగ్గరవుతారు.

జగన్ ఈ రెండుసంవత్సరాల్లో జనంతో మమేకమైన విధానం, అతని వ్యవహారశైలి, తీసుకున్న నిర్ణయాలు... అతని నాయకత్వ లక్షణాలను ప్రజలందరికీ సుపరిచితం చేశాయి. ఒక నిర్ణయం తీసుకుంటే, హరిహరాదులున్నా లెక్కచెయ్యని ధీశాలి జగన్. అందుకే ఇన్ని కష్టాలు. అందుకే ప్రజల్లో అతని మీద ఇంత విశ్వాసం. పాలక ప్రతిపక్షాలని ప్రజలు సమూలంగా కూకటివేళ్లతో పెకలించి దూరంగా విసిరేసే రోజు ఒకటి వస్తుంది. అదెంతో దూరంలో లేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. సీతమ్మ వనవాస కాలం దాటాక, రావణ వధ. సీతమ్మవారి చెర తొలగించబడినట్లే, ప్రజాతీర్పు కోరే ఆ రోజుతో జగన్ కష్టాలు చెల్లు. జనానికి సంకెళ్లు తెగిపడే రోజు, ఈ ఆంధ్రదేశానికి పట్టిన చీడ వదిలే రోజు కూడా అదే.

- వి.నాగరాజాచార్యులు, మియాపూర్, హైదరాబాద్

వచ్చేది కాంగ్రెస్ సమాధి నామ సంవత్సరం

నేను ఆర్‌టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాను. డ్యూటీ మీద ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు తిరుగుతుంటాను. జనం మాటలు, అభిప్రాయాలు, వాదనలు నేను విన్నదాని ప్రకారం ఇలా ఉన్నాయి. డెబ్బై శాతం ప్రజలు ఎన్నికలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వారిలో తొంభై శాతం ప్రజలు కాంగ్రెస్ సమాధి కోరుకుంటున్నారు. ఇక చంద్రబాబు జైలు శిక్ష నుండి తప్పించుకోవటానికి కాంగ్రెస్‌తో చెయ్యి కలిపి, తనని నమ్ముకున్న టీడీపీ నాయకుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నాడన్నమాట కూడా వినిపిస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇవే మనకు ఆఖరి పదవులు అనే నిర్ణయానికొచ్చేశారు. అటువైపు చంద్రబాబు మాటకు విలువ లేదు, అతడిని ప్రజలే కాదు, ఆ పార్టీలోని వారు కూడా నమ్మడం లేదు. ఈ రెండు పార్టీలు కలిసి తమ దుష్ర్పచారాలతో జగన్ పార్టీకి మేలే చేస్తున్నాయి. ‘పాతాళభైరవి’ సినిమాలో విలన్, హీరోను దేవతకు బలివ్వబోతాడు. కానీ విలన్ చేతిలోనే బలైపోతాడు. జగన్‌మీద కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్‌కూ చివరికి అదే పరిస్థితి ఎదురవుతుంది.

- ఎ.వి.వి.ఎస్.ఎన్.మూర్తి, కాకినాడ

‘ఎమ్మార్’లో బాబును విచారించరేం?


సీబీఐకి వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి ప్రశ్న
రాజధాని నడిబొడ్డున 535 ఎకరాలు ఎమ్మార్‌కు కారుచౌకగా చంద్రబాబు అప్పగించారు
సీబీఐ ఆయన్ను విచారించకుండా చార్జిషీటు ఎలా ఫైల్ చేస్తుంది?
‘ఈనాడు’ టీడీపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తోంది


సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మార్’ కంపెనీని రాష్ట్రానికి పరిచయం చేయడంతో పాటు రాజధాని నడిబొడ్డున ఉన్న 535 ఎకరాలను ఆ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టిన అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఈ కేసులో సీబీఐ ఎందుకు విచారించడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మార్‌కు సంబంధించి అత్యంత కీలకమైన చంద్రబాబును విచారించకుండా సీబీఐ దర్యాప్తు పూర్తి చేయడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటూ కేసులో కీలక నిందితుడు, ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడైన దుబాయి ప్రసాద్(కోనేరు రాజేంద్రప్రసాద్) కోర్టులో వేసిన పిటిషన్‌ను ఆయన గుర్తుచేశారు. ‘‘రాష్ట్ర రాజధానిలో 535 ఎకరాల్లో విలాసవంతమైన విల్లాలు, గోల్ఫ్ కోర్సులు, స్టార్ హోటళ్లు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఏపీఐఐసీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది.

ఆ తర్వాత దాన్ని రద్దు చేసింది. మళ్లీ కొన్నాళ్లకే 2001 జూలై 6న కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి స్పందించి 5 కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో దుబాయికి చెందిన ఎమ్మార్, మలేసియాకు చెందిన ఐఓఐ, హాంకాంగ్‌కు చెందిన సోమ్‌ఏషియా, ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజి అనే సంస్థలు పాల్గొన్నాయి. అయితే టెండర్ సమయానికి వారంతా తప్పుకొని ఎమ్మార్ మాత్రమే పోటీలో నిలిచేలా చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎమ్మార్‌కు ఈ టెండర్ కట్టబెట్టే ప్లాన్‌లో భాగంగా ఎల్‌అండ్‌టీకి కాకినాడ పోర్టు, హైటెక్‌సిటీ నిర్మాణం, ఐఓఐకి జెమ్స్ పార్కు వద్ద అత్యంత విలువైన 10 ఎకరాల కేటాయింపులు చేశారు. ఇంత తతంగం జరిగిన ఈ కేసులో చార్జ్జిషీట్ ఫైనల్ చేసేటప్పుడు దానికి ఆద్యుడైన చంద్రబాబును సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదు?’’ అని అంబటి ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యతిరేక వార్తలు వేయరేం?
‘‘సీబీఐ ధోరణిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడకపోవడంలో ఉన్న మతలబేంటి? అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు చంద్రబాబు ఎందుకు దూరంగా ఉన్నారు. ఇదంతా కుమ్మక్కు కాదా?’’ అని అంబటి నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకమైన వార్తలు ఎప్పుడు వచ్చినా వాటిని కప్పిపుచ్చేందుకు ‘ఈనాడు’ శతవిధాలా ప్రయత్నం చేస్తోందని అంబటి పేర్కొన్నారు. ఎమ్మార్ కేసుకు సంబంధించి కోనేరు ప్రసాద్ వేసిన పిటిషన్‌కు సంబంధించిన వార్తలో ఎక్కడా కూడా చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని అంబటి చదివి వినిపించారు. ఆ పత్రిక తెలుగుదేశం అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

న్యాయస్థానాలపై మాకు గౌరవముంది
తాము న్యాయస్థానాలను తప్పుబట్టినట్లు కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని అంబటి అన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పేరుతో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడే రెండు రోజులపాటు ఉండి జగన్‌కు బెయిల్ రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారని తమ పార్టీ నేత జూపూడి చెప్పారే కానీ, ఎవర్ని మేనేజ్ చేశారనేది ఆయన ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. ఇదే విషయాన్ని గతంలో బ్రిటన్‌కు చెందిన డీఎఫ్‌ఐడీ సంస్థ ప్రతినిధి జేమ్స్ మ్యానర్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అందజేసిన రిపోర్టులో చాలా స్పష్టంగా పేర్కొన్నారన్నారు.

చంద్రబాబు ప్రతీ వ్యవస్థలో తన సొంత మనుషులను జొప్పించి అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నారని రాతపూర్వకంగా వెల్లడించారని చెప్పారు. జేమ్స్ మ్యానర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ... ప్రస్తుత రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ సమయంలోనే సుప్రీంకోర్టులో పిల్ వేశారని చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే ఆయనకు సైకిల్‌గుర్తు ఎలా వచ్చిందో చెప్పాలని అంబటి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ ఆఫీసులను ఎలా కబ్జా చేయగలిగారని అడిగారు. బాబు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమని, జెండా పీకేయడం కూడా ఖాయమని అంబటి అన్నారు.

స్థానిక ఎన్నికలపై విస్తృత భేటీసాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు తదితర అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) శుక్రవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. తాజా రాజకీయ పరిణామాలతోపాటు మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనడంపై చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయాత్తం చేయడం, వచ్చే సాధారణ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న ఎజెండాతో త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ప్రాంతాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ప్రజల పక్షాన నిలబడుతూ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించింది. సమావేశంలో నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, డీఏ సోమయాజులు, వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. భేటీ అనంతరం పీఏసీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ రకమైన ఆందోళనలు చేపట్టాలనేదానిపై చర్చించామన్నారు. అదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహరచనతోపాటు పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి బూతు కమిటీల ఏర్పాటుపై చర్చించినట్లు కొణతాల చెప్పారు. జగన్‌కు బెయిల్ రాకపోయినా పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం కొల్పోకుండా మరింత విస్తృతంగా ఉత్తేజంతో పనిచేసేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించామని, వాటి కార్యచరణ త్వరలో ప్రకటిస్తామని అన్నారు.

తెలంగాణలో ఓదార్పు యాత్రపై చర్చ: బాజిరెడ్డి
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు ‘ప్రాణహిత-చేవేళ్ల’కు జాతీయ హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో త్వరలో ఆందోళన చేపట్టాలని పీఏసీలో నిర్ణయించినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. జగన్ జైలు నుంచి రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో అసంపూర్తిగా మిగిలిన ఓదార్పు యాత్రను విజయమ్మ నేతృత్వంలో జరపాలనే దానిపై కూడా చర్చించామన్నారు.

రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి..

సర్కారుపై షర్మిల ధ్వజం
ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువులు మానేస్తున్నారు
వైఎస్ తెచ్చిన పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది
పేదల కోసం పెట్టిన ఫీజుల పథకానికీ కిరణ్ సర్కారు తూట్లు పొడుస్తోంది
రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టండి..


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదవాలనే గొప్ప ఆశయంతో వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి ఈ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. 

విద్యార్థులకు పాతిక శాతమిస్తాం... ముప్పాతిక శాతమిస్తాం అంటూ ఫీజులు భిక్షం వేసినట్లుగా వేస్తోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువులు మానేసే రోజులు మళ్లీ వచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అమ్మా..! కొద్దిగా ఓపిక పట్టండి, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. అంత వరకు మీ చదువులు ఆపొద్దు’’ అని ఆమె విద్యార్థులకు సూచించారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సాగింది. పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో జరిగిన రచ్చబండలో చిన్నారి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండానే డిగ్రీ పూర్తి చేశాను. ఇప్పుడు ఎమ్మెస్సీ జువాలజీ చేస్తున్నాను. ఇంత వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదు’’ అని చెప్పడంతో షర్మిల పై విధంగా స్పందించారు.

వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నారు?
షర్మిల యాత్రలో సాగుతుండగా దారి వెంట పలువురు మహిళలు కలిసి ఆమెకు తమ సమస్యలు వివరించారు. షర్మిల వారితో మాట్లాడుతూ.. ‘‘అమ్మా..! వడ్డీ లేని రుణాలు అందడం లేదని మీరు బాధపడుతున్నారు. పల్లెల్లో ఏ మహిళను అడిగినా కూడా అసలు మాకు రూణాలే అందటం లేదని చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రేమో వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నామని రూ. కోట్లు ఖర్చు చేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నట్లు?’’ అని విమర్శించారు. ‘‘ఆమ్మా... అక్కా... సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికీ జీవం పోస్తారు’’ అని షర్మిల వారికి ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు.

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి..
మార్గమధ్యంలో తనను కలిసి సమస్యలు చెప్పుకొన్న రైతులు, కూలీలతో షర్మిల మాట్లాడుతూ...‘‘రాబోయే రాజన్న రాజ్యంలో అన్ని వర్గాల వారికీ జగనన్న మేలు చేస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేటట్టు రూ. 3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. మన విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700 చేస్తారు. వికలాంగులకైతే రూ. 1,000 ఇస్తారు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారు. చిన్నారికి రూ. 500 చొప్పున పదో తరగతి వరకు తల్లి ఖాతాలో డబ్బులు వేస్తారు. ఇలా కుటుంబానికి ఇద్దరేసి పిల్లలకు పథకం వర్తింపజేస్తారు. ఇంటర్ చదివితే రూ. 700 చొప్పున, డిగ్రీ చదివితే రూ. 1,000 చొప్పున అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఉండనే ఉంది’’ అని షర్మిల ధైర్యం చెప్పారు.

12.2 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 144వ రోజు శుక్రవారం షర్మిల ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వీఎం బంజర శివారు నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి రామచంద్రరావు బంజర, మండాలపాడు, లంకపల్లి, కొత్తలంకపల్లి మీదుగా నడిచారు. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,929.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, జలగం వెంకటరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు భానోతు మదన్‌లాల్, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయకుమార్, సాదు రమేష్‌రెడ్డి, భూక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ ఉన్నారు.

పదేళ్ల కిందట ఇక్కడే వైఎస్ పాదయాత్ర..
మహానేత వైఎస్ చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చేరుకొని శనివారానికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తవుతుండగా.. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కాకతాళీయంగా శనివారమే సత్తుపల్లికి చేరడం విశేషం. నాడు వైఎస్ పాదయాత్ర చేస్తూ సత్తుపల్లి బస్టాండ్ రింగ్‌సెంటర్ వద్ద బహిరంగసభలో ప్రసంగించి తాళ్లమడ గ్రామ శివారులో బస చేశారు. మరుసటి రోజున యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. షర్మిల కూడా శనివారం సత్తుపల్లి బస్టాండ్ రింగ్‌సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి తాళ్లమడ శివారులోనే రాత్రి బస చేయనున్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
శుక్రవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 144, కిలోమీటర్లు: 1,929.6

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..

 వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరోప్రజాప్రస్థానం యాత్ర 145వ రోజు శనివారం జిల్లాలో 11 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. సత్తుపల్లి మండలం కిష్టారం శివారు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర సత్తుపల్లి దాటనుందని పేర్కొన్నారు. సత్తుపల్లి బస్టాండ్ సెంటర్‌లో సభ జరగనుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు
కిష్టారం, వెంగళరావునగర్, సత్తుపల్లి

YSRCP leader Ambati rambabu press meet

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

Telangana area YSRCP plan to start Odarpu Yatra

ప్రజలతరపున మరిన్నిపోరాటాలు: వైఎస్ఆర్

వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన రాజకీయవ్యవహారాల కమిటీ సమావేశమైంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. తెలంగాణలో ఓదార్పుయాత్రపై కూడా చర్చించారు. ప్రజల తరపున మరిన్ని పోరాటాలు చేయాలని నిర్ణయించారు. త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ త్వరలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను విజయమ్మ సందర్శిస్తారని చెప్పారు. 

టిడిపి అధికారప్రతినిధి 'ఈనాడు': అంబటి

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా 'ఈనాడు' వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబు పేరు రాయవలసిన చోట ఈనాడులో అప్పటి ముఖ్యమంత్రి అని రాశారని తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు కారు చౌకగా భూమి కట్టబెట్టింది చంద్రబాబు అని చెప్పారు. ఎకరం దాదాపు 4 కోట్ల రూపాయలు ధర ఉన్న సమయంలో కేవలం 29 లక్షల రూపాయలకే ఇచ్చారని వివరించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడుపై సిబిఐ ఎందుకు విచారణ జరపడంలేదని ఆయన ప్రశ్నించారు.

Sharmila rachchabanda in Mandalapaadu at Khammam

Khammam Khillalo 10th May 2013

అసలు ఆయనొక ఎంపీ అన్న సంగతి ఎవరికీ గుర్తున్నట్టులేదు!!

భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. వాటిలో ఓటు హక్కు, విద్యా హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, జీవించే హక్కు... ఇలా కొన్ని హక్కుల్ని భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించింది. ఈ హక్కులకు అడ్డు తగులుతూ, కక్ష సాధింపు ధోరణితో వ్యక్తిని నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు. అయితే జగన్ విషయంలో కాంగ్రెస్‌పార్టీ సీబీఐతో కుమ్మక్కై ఆయన ప్రాథమిక హక్కుకే భంగం కలిగేలా కుటిల రాజకీయాలకు పాల్పడుతోంది! ఇది రాజ్యాంగ ఉల్లంఘన తప్ప మరొకటి కాదు.

రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న యువనేత జగన్‌ను ఎదుర్కోవటానికి ఎన్ని కుయుక్తులు, ఎన్ని అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయో! నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర కలిగి, రాజకీయాల్లో తలపండిన అతిరథ మహారథులు ఉన్న కాంగ్రెస్ పార్టీ; ముప్పై యేళ్ల రాజకీయానుభవం, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ... కడప లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన విషయం గుర్తొచ్చి, గుండెల్లో దడపుట్టి, జగన్‌కు ఎక్కడ ప్రజాదరణ పెరుగుతుందోనన్న భయంతో... ఈర్ష్య, కక్ష సాధింపులతో ఆయన్ని జైల్లో నిర్బంధించటం ఎంతవరకు న్యాయం?

కాంగ్రెస్, టీడీపీలకు ప్రజల మద్దతు ఉంటే, ప్రజలే కనుక వారిని కోరుకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించాలి కాని, అనవసరమైన వ్యర్థ ఆరోపణలతో, కుంటి సాకులతో జగన్‌ను జైల్లో నిర్బంధించటం ప్రాథమిక హక్కులను కాలరాయడమే! కాంగ్రెస్‌పార్టీ జగన్‌ను ఇలా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తే, అంతకంతా వంద రెట్లు జగన్‌కు ప్రజాభిమానం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తరగదు. న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అంటారు. న్యాయమూర్తులైనా జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వొచ్చు కదా. జగన్ ఏమైనా దేశం విడిచి పారిపోతాడా? అసలు ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడన్న విషయం వీళ్లెవరికైనా గుర్తుందా? 

జగన్ ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారోనని కాంగ్రెస్, తెలుగుదేశం, ఎల్లో మీడియాల భయం. అయినా జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవటం తప్పు కాదే! ఆయనకు ఆ హక్కు లేదా? ప్రజా సంక్షేమానికి పాటుపడగల సామర్థ్యం ఉంది. ప్రజాదరణ ఉంది. అది తెలుసుకోకుండా ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందాన కాంగ్రెస్, టీడీపీలు ప్రవర్తిస్తే, ప్రజలే తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ తందాన అంటే సీబీఐ తాన తందాన అనటం బాగా అలవాటైపోయింది. దీన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి స్వేచ్ఛను నిర్బంధించటం శోచనీయం. ఇదేనా మనం భావితరాలకు ఇచ్చే రాజకీయ సందేశం, ఉపదేశం!

- చింతపల్లి సత్యనారాయణ ప్రసాద్, భవానిపురం, విజయవాడ

జగన్ బయట ఉండి వుంటే వీళ్లు ఇన్నేసి మాటలు అనేవారా?!

ఒక వ్యక్తి బాణం వదిలితే, ఎదుటి వ్యక్తి మనోధైర్యం గలవాడైతే, ఆ బాణం వారిని తాకదు. తిరిగి ప్రయోగించిన వ్యక్తికే వచ్చి గుచ్చుకుంటుంది. జగన్‌పై మాటల బాణాలు సంధించినవారికి కూడా ఇదే పరిస్థితి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని రాజశేఖరరెడ్డిగారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఒక మాట మాట్లాడితే దానిలో నిబద్ధత ఉండాలి, నోటికొచ్చినట్లు మాట్లాడితే అది మాట్లాడినవారికే అనర్థం అనేవారు. ఎదుటివారికి బాధ కలిగించే ఏ మాటలైనా క్షమించరానివి. 

అసలు జగన్ ఏం తప్పు చేశారని అందరూ ఇన్ని మాటలంటున్నారు? జగన్ ఆస్తులను అక్రమాస్తులు అనడమే తప్పు. వ్యాపారం సజావుగా సాగాలంటే పెట్టుబడులు రాబట్టాలి కదా. ఆ విధంగా వచ్చిన పెట్టుబడులన్నీ అక్రమాస్తులు అనడం సమంజసమేనా? సీబీఐ ఇంకా జగన్ ఆస్తుల విషయంలో ఒక నిర్థారణకు రాలేదు. నేటికీ అభియోగాలు మాత్రమే దాఖలు చేస్తోంది. అలాంటప్పుడు ‘అక్రమం’ అనే మాట ఎలా ఉపయోగిస్తారు. ‘జగన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, ఆ డబ్బుతో ఒక రాష్ట్రాన్నే కొనెయ్యగలడు’ అని కొందరు నాయకులంటున్నారు. ఒక నాయకుడైతే మరికాస్త ముందుకెళ్లి ‘జగన్‌కు పద్నాలుగేళ్లు జైలుశిక్ష వేయాలి’ అన్నాడు. 

ఇంకొకాయన ‘ఉరిశిక్ష’ వేయించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఏం మాటలండీ ఇవి? ఒకసారి ఆ వ్యక్తులు తమ బిడ్డలమీద ప్రమాణం చేసి చెప్పమనండి... జగన్ దోషి అని. రాజకీయ కక్షతో జగన్‌ని అణగదొక్కటానికి ఆయనపై అనేక రకాలుగా రాళ్లు వేస్తున్నారు. అవి ఎంతమాత్రం జగన్‌ను తాకవు. అసలు జగన్ జైల్లో కాకుండా, బయట ప్రజల్లో ఉండి ఉంటే, వీరు ఇన్ని మాటలు ధైర్యంగా అనగలిగేవారా? ఆ ధైర్యం వారికి ఉందా? గుండెల మీద చేతులేసుకుని చెప్పమనండి. ఏదైతేనేం. జగన్ మీద ఒక మబ్బు పొర కమ్ముకుని ఉంది. అది త్వరలో తొలగిపోయి, స్వచ్ఛమైన వ్యక్తిగా బయటకు వస్తారు. 

- టి.వి.సుబ్బారెడ్డి, కూకట్‌పల్లి, హైదరాబాద్

రాజకీయ బాసుల మాటలే వల్లించిన సీబీఐ

* సుప్రీం ఆవరణలోనే తీర్పుపై సీబీఐ న్యాయవాది వ్యాఖ్యలు
* ‘నాలుగు నెలల గడువు’ను పొడిగిస్తామంటూ ముందే కూత
* ఎవరో చెప్పమన్నట్టుగా రాజకీయ వ్యాఖ్యలు చేసిన అశోక్‌భాన్
* ఆది నుంచీ జగన్ కేసును నడిపింది రాజకీయ ప్రయోజనాలే
* కేసు వేసిన ఎమ్మెల్యేకు మంత్రిపదవి, అదే అసలు క్విడ్ ప్రో కో
* టీడీపీ-కాంగ్రెస్ కూడబలుక్కుని ఒకే పత్రాలతో కేసు
* తీర్పు వెలువడిన దగ్గర్నుంచీ ప్రత్యర్థి పార్టీలా మారిన సీబీఐ
* ఒక్కో కోర్టులో ఒక్కో మాట; ఒక్కో అఫిడవిట్లో ఒక్కో తీరు
* సింగిల్ చార్జిషీటు గాలికి; సుప్రీంకిచ్చిన హామీ తుంగలోకి
* జగన్‌ను కనీసం ప్రశ్నించకుండానే మూడు చార్జిషీట్లు
* మరో 24 గంటల్లో కోర్టుకు హాజరవుతారనగా అరెస్టు

‘‘నాలుగు నెలలే అని ఏముంది? (దర్యాప్తు పూర్తయ్యేందుకు) ఆరు నెలలు కూడా పట్టొచ్చు. మా అధికారులు విదేశాల్లో ఉన్నారు. అక్కడి నుంచి సమాచారం రాకుంటే గడువు పొడిగించాలని అడుగుతాం. అందుకు కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాం. అవసరమైతే మరో పిటిషన్ వేస్తాం’’
- సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక కోర్టు ఆవరణలోనే ఫక్తు రాజకీయ నాయకుడిలా సీబీఐ న్యాయవాది చేసిన వ్యాఖ్యలివి!

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘‘స్వతంత్రంగా దర్యాప్తు చేయాల్సిన సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయింది. కేంద్రంలోని ప్రభుత్వాన్ని తన యజమానిగా భావిస్తూ, యజమాని చెప్పిన చిలుక పలుకులనే వల్లిస్తోంది’’ 
ఇవీ... బొగ్గు కుంభకోణంలో సీబీఐ వ్యవహారశైలిపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు.

‘‘అవును! సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అది అక్షరాలా నిజం’’
ఇది సుప్రీం వ్యాఖ్యలపై సీబీఐ డెరైక్టరు రంజిత్ సిన్హా
గురువారం చేసిన వ్యాఖ్య.


దీనర్థమేంటి? సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించటం లేదనేగా? కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడుతోందనేగా? దాన్ని సీబీఐ కూడా ‘‘ఔను! నిజమే’’ అంటూ ఒప్పుకున్నట్టేగా? మరి కేంద్రంలోని రాజకీయ బాసులు చెప్పినట్టల్లా ఆడుతున్నది ఒక్క బొగ్గు కుంభకోణంలోనేనా? కేంద్ర ప్రభుత్వానికో, దాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకో ఇబ్బంది కలిగించే ప్రతి వ్యవహారంలోనూ ఇలాగే జరిగే అవకాశం నూరు శాతం ఉన్నట్టేగా? సీబీఐని తన చెప్పుచేతల్లో ఆడించే అవకాశం ఉన్నప్పుడు తనను ఇబ్బంది పెట్టే అంశాల్లో కేంద్రం గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ వేలు పెట్టకుండా ఉంటాయని అనుకోగలమా? ప్రజలకు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారంలో కేంద్రంతో సీబీఐ కుమ్మక్కయి అది చెప్పినట్టల్లా చేస్తోందనటానికి ఎన్ని ఉదాహరణలు లేవు!! అంతెందుకు? గురువారం ఆయన బెయిలుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి కొన్ని నిమిషాలు కూడా గడవక ముందే... కోర్టు ఆవరణలోనే సీబీఐ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ఈ తీరును కళ్లకు కట్టడం లేదా? నాలుగు నెలల్లోగా దర్యాప్తు ముగించాలని, ఆ తరవాత పిటిషనర్ బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన చాలా తేలికగా కొట్టిపారేశారు.

‘‘నాలుగు నెలలే అని ఏముంది? ఆరు నెలలు కూడా పట్టొచ్చు. మా అధికారులు విదేశాల్లో ఉన్నారు. అక్కడి నుంచి సమాచారం రాకుంటే గడువు పొడిగించాలని అడుగుతాం. అందుకు కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాం. అవసరమైతే మరో పిటిషన్ వేస్తాం’’ అంటూ ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. సీబీఐని పంజరంలో పెట్టి దాని చేత పలికిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానివే ఈ పలుకులని చెప్పటానికి ఇంకా ఏం కావాలి?

వేల కోట్లంటూ వితండ వాదన
సీబీఐ స్థాయి వాదనంటే ఎలా ఉండాలి? నిజం చెప్పేట్టుగా ఉండాలి. కనీసం జనం నమ్మేట్టుగానైనా ఉండాలి. తన వాదనల్లో కొంతైనా నిజముందని దర్యాప్తులో తేల్చగలగాలి. కానీ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారంలో కింది కోర్టు నుంచి పై కోర్టు వరకూ సీబీఐ చెప్పిన లెక్కలు వింటే ఎవరికైనా మతిపోవడం ఖాయం. ఇది వేల కోట్ల వ్యవహారమని ఒకసారి, 40 వేల కోట్ల రూపాయల కుంభకోణమని ఒకసారి, 50 వేల కోట్ల రూపాయల కేసని మరోసారి... ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు సీబీఐ న్యాయవాది.

బహుశా! న్యాయశాస్త్రమంటే ఏంటో తెలియని సామాన్యులు సైతం ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడే సాహసం చేయరేమో!! పోనీ సీబీఐ తాను చెప్పినదేదైనా దర్యాప్తులో తేల్చిందా అంటే... అలాంటి పరిస్థితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా సీబీఐ దాఖలు చేసిన 5 చార్జిషీట్ల ప్రకారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులుగా అది చూపించిన మొత్తం దాదాపు రూ.1,030 కోట్లు. ఇంకా 2,500 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి తాము దర్యాప్తు జరపాల్సి ఉందని సుప్రీంకోర్టుకు తాజాగా ఇచ్చిన నివేదికలో సీబీఐ స్వయంగా పేర్కొంది.

ఇప్పటిదాకా వేసిన చార్జిషీట్లలో పెట్టుబడులుగా వచ్చిన మొత్తాన్ని సీబీఐ 1,030 కోట్లుగా చూపించింది. కానీ ఈ లెక్కలను చూసినప్పుడు ఔరా... ఇంత దారుణమా అనిపించకమానదు. ఎందుకంటే మొదటి చార్జిషీటు ప్రకారం అరబిందో, హెటెరో సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను రూ.29.5 కోట్లుగా సీబీఐ పేర్కొంది. రెండో చార్జిషీట్లోనైతే నలుగురు వ్యక్తులు 39.5 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిపింది.

మూడో చార్జిషీట్లో రాంకీ సంస్థ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు, ఐదో చార్జిషీట్లో దాల్మియా సంస్థ రూ.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలియజేసింది. కానీ వాన్‌పిక్ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా నాలుగో చార్జిషీట్లో పేర్కొంది. ఇదెంత అసమంజసమంటే... ప్రసాద్ ఒకసారి పెట్టుబడి పెట్టి, దానిపై లాభం సంపాదించి ఆ లాభంతో సహా కొంత అసలును మళ్లీ పెట్టుబడి పెడితే, ఆ రెండింటినీ కలిపి లెక్కించటమనేది సీబీఐ తీరుకు పరాకాష్ట. మొదట జగన్ సంస్థల్లో రూ.280 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టిన ప్రసాద్, తరవాత దాన్లో రూ.250 కోట్ల విలువైన వాటాను రెట్టింపు కన్నా అధిక లాభంతో విక్రయించారు.

అలా లాభంగా వచ్చిన మొత్తాన్ని రీ ఇన్వెస్ట్ చేశారు. ఇంతా చేస్తే ఆయన నికరంగా పెట్టిన పెట్టుబడి రూ.230 కోట్లే. కానీ సీబీఐ రూ.854 కోట్లుగా పేర్కొంటూ చార్జిషీటు వేయడమే విచిత్రం. ఈ లెక్కన చూస్తే సీబీఐ వేసిన చార్జిషీట్లలో పేర్కొన్న లావాదేవీల సొమ్ము నికరంగా 400 కోట్ల రూపాయలు. మరి 40 వేల కోట్లు... 50 వేల కోట్ల రూపాయలంటూ టీడీపీ నేతల మాదిరిగా సీబీఐ ఎందుకు ఆరోపణలు చేసినట్టు? తెలుగుదేశానికైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలన్న రాజకీయ అనివార్యత ఉంది. మరి సీబీఐకి ఏముంది? తన రాజకీయ బాసులకు సహకరించాల్సిన అనివార్యతా? అధికార పార్టీ ఆదేశాలను, వాటికి కొమ్ముకాసే తెలుగుదేశం వంటి రాజకీయ పార్టీలను సైతం మోసి మోసి నడుం వంగిపోయిన సీబీఐని ఈ వ్యవస్థ ఇంకా ఎన్నాళ్లు భరించాలి?

ఆది నుంచీ అరాచకమే...: 
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సాగుతున్నది రాజకీయ కేసు అనడానికి ప్రత్యేక ఉదాహరణలేవీ చెప్పాల్సిన పని లేదు. కేసు వేసిన శంకర్రావుకు మంత్రిపదవి రావడం నుంచి... సోనియాగాంధీ వేయమన్నందుకే తాను కేసు వేశానని ఆయన స్వయంగా చెప్పడం వరకూ అన్నీ అలాంటి ఉదంతాలే. ఆర్‌వోసీ పత్రాలనే సాక్ష్యాలంటూ శంకర్రావుకు అందించిన తెలుగుదేశం నేతలు... అవే జిరాక్స్ కాపీలతో తాము కూడా కేసు దాఖలు చేయటం తెలియనిదేమీ కాదు. ఇక ఈ కేసులో తీర్పునిచ్చిన జడ్జి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయ్యారు! తెలుగు కూడా రాని వ్యక్తికి ఆ పదవి ఎందుకు ఇచ్చారంటూ ఈ ఉదంతంపై కేసు దాఖలైంది కూడా! తీర్పు వచ్చింది మొదలు... ప్రత్యేక బృందాలతో సోదాలు, ఇన్వెస్టర్లను భయభ్రాంతుల్ని చేయటం వంటి సీబీఐ చర్యలు పంజరం పాలిటిక్స్‌ను కళ్లకు కట్టనే కట్టాయి.

ఇక మరో 24 గంటల్లో జగన్ కోర్టుకు హాజరవుతారనగా... అలా జరిగితే ఆయనకు బెయిలు మంజూరై ఇక ఎన్నడూ తాము అరెస్టు చేయలేమోనని భయపడి సీబీఐ అరెస్టుకు దిగడం తెలియనిదేమీ కాదు. దర్యాప్తు మొదలయ్యాక సుమారు 9 నెలల పాటు ఆయన్ను కనీసం ప్రశ్నించకుండా... మూడు చార్జిషీట్లు వేసేశాక... అరెస్టు చేయకుండా బయట ఉంచితే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని కోర్టుకు చెప్పటమే అతి పెద్ద విచిత్రం. ఆ తరవాత దర్యాప్తును సాగదీస్తూ... ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వేస్తూ... వైఎస్సార్ కుటుంబ పరువు ప్రతిష్టలే లక్ష్యంగా ప్రత్యర్థి మీడియాతో కుమ్మక్కయి కథనాలు వండటం... వేల కోట్ల రూపాయలంటూ ఆరోపణలు చేయటం... రకరకాలుగా జగన్‌ను వే ధించటం... ఇవన్నీ రాజకీయ డ్రామాలో భాగంగా దర్యాప్తు జరుగుతున్న వైనాన్ని కళ్లకు కట్టినవే.

ఇవన్నీ చూసినవారికి అనిపించేదొక్కటే. ఇపుడు దర్యాప్తు జరగాల్సిన అవసరం గానీ, అంశం గానీ ఏదైనా ఉందంటే అది రాజకీయ బాసులతో సీబీఐ కుమ్మక్కుపై జరగాలి! రాజకీయంగా ఎదుగుతున్న నాయకుడిని, పార్టీని అణచివేయటానికి సాగిస్తున్న కుటిల నీతిపై జరగాలి. జనం నుంచి జగన్‌మోహన్‌రెడ్డిని దూరం చేయలేక చతికిలపడ్డ చేవచచ్చిన నాయకులకు... వారికి తోడుగా నిలిచిన దర్యాప్తు సంస్థలకు మధ్య ఉన్న రహస్య అవగాహనపై జరగాలి. కానీ దురదృష్టమేమిటంటే దర్యాప్తు చేయాల్సిన సంస్థే ఈ నేరంలో నిండా మునిగిపోయి ఉంది. మరి దీనిపై దర్యాప్తు చేయాల్సిందెవరు? నేరాన్ని మించిన ఈ ఘోరానికి రాష్ట్ర ప్రజలే సాక్షి.

కోర్టుల్లో ఇలా కూడా చెప్పొచ్చా?
సుప్రీంకోర్టే కానక్కరలేదు. మేజిస్ట్రేటు కోర్టు నుంచి మొదలు పెడితే ఏ కోర్టులోనైనా లిఖితపూర్వకంగా ఒక మాట చెబితే అదే ఫైనల్. అలా ప్రమాణపూర్వకంగా దాఖలు చేసే అఫిడవిట్‌పై మాట మార్చే అవకాశం లేనే లేదు. కానీ దేశంలో అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థయిన సీబీఐ లిఖితపూర్వకంగా ఒక కోర్టులో చెప్పింది మరో కోర్టులో చెప్పడం లేదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టుకిచ్చిన హామీని సైతం పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుకూ వక్రభాష్యాలే చెబుతోంది. అరబిందో ఫార్మా కేసులో మాత్రమే జగన్‌ను అరెస్టు చేశామని కింది కోర్టుకు చెప్పి... వాన్‌పిక్ కేసులోనే ఆయన్ను అరెస్టు చేశామని హైకోర్టుకు చెప్పింది. లేదు లేదు... దర్యాప్తు చేయకుండా మిగిలిపోయిన ఏడు అంశాల్లోనే ఆయన్ను అరెస్టు చేశామని సాక్షాత్తూ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతే కాదు, దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఒకే తుది చార్జిషీటు దాఖలు చేస్తామని గతేడాది అక్టోబర్లో సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది పరాశరన్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు.

దాన్ని తీర్పులో ప్రస్తావించిన సుప్రీంకోర్టు... సీబీఐ చెప్పినట్టుగా దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీటు వేశాక జగన్ బెయిలు కోసం దరఖాస్తు చేయొచ్చని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడింది గతేడాది అక్టోబరు 5న. కానీ ఇటీవలే సీబీఐ మరో చార్జిషీటు దాఖలు చేసింది. చిత్రమేంటంటే అది తుది చార్జిషీటు కాదు. 5వది! మరి సుప్రీంకిచ్చిన హామీ సంగతేంటి? దాన్ని కోర్టు సైతం తీర్పులో ప్రస్తావించింది కదా? ఇలా కోర్టుకిచ్చిన హామీని, కోర్టు తీర్పును సైతం పట్టించుకోకపోయినా సీబీఐకి సాగిపోతుండటాన్ని ఏమనుకోవాలి?

సుప్రీంకోర్టును సీబీఐ డామినేట్ చేస్తోందా?: జీవన్‌రెడ్డి

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బెయిల్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును మాజీమంత్రి జీవన్‌రెడ్డి తప్పుపట్టారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం 3 నెలల్లో దర్యాప్తు సంస్థ చార్జిషీట్ వేయకపోతే నిందితులు బెయిల్‌కు అర్హులవుతారని చెప్పారు. సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదని, అనుబంధ చార్జిషీట్ల పేరుతో కొత్త నిర్వచనం చెబుతోందన్నారు. ‘చార్జిషీట్ వేసి కోర్టులో ట్రయల్స్ మొద లయ్యాక విచారణ సమయంలో కొత్తగా వెలుగులోకి వచ్చే విషయాలు, లభించే ఆధారాల ఆధారంగా మాత్రమే అనుబంధ చార్జిషీట్ వేయాలి. 

కానీ సీబీఐ మాత్రం అది జరగకముందే అనుబంధ చార్జిషీట్ల పేరుతో ఇప్పుడు కొత్త నిర్వచనం చెబుతోంది. జరుగుతున్న తీరును చూస్తుంటే అసలు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందో లేకసీబీఐ సుప్రీంకోర్టును డామినేట్ చేస్తోందో అంతుచిక్కడం లేదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు, కేసుల వ్యవహారం చూస్తుంటే అవన్నీ కాంగ్రెస్ మెడకే చిక్కుకునేటట్లు కన్పిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదని, దీనిపై వస్తున్న అపవాదులన్నీ కాంగ్రెస్ భరించాల్సి వస్తోందన్నారు. 

జగన్‌పై ఉన్న స్పీడు ‘కోల్’గేట్‌పై లేదేం?: కిషన్‌రెడ్డి

వైఎస్ జగన్ ఆస్తుల కేసులో చూపిస్తున్న దూకుడు కేంద్రంలో జరిగిన బొగ్గు కుంభకోణంపైన, 2జీ స్పెక్ట్రమ్‌పై ఎందుకు చూపడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ సీబీఐని ప్రశ్నించింది. ప్రాంతానికో న్యాయం ఉంటుందా? అని నిలదీసింది. నిందితులకే నివేదికలు చూపించిన సీబీఐ తీరు అడుగడుగునా అనుమానాస్పదమేనని పేర్కొంది. 

సీబీఐని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: రామచంద్రరావు

‘‘సీబీఐ వాళ్లు మొదటి నుంచీ ఒకటే మాట చెప్తున్నారు. తాము సుప్రీంకోర్టులో ఏం చెప్పినా.. తమకు కావలసిన విధంగా చేసుకునేది చేసుకుంటామంటున్నారు. చార్జిషీట్లో పేర్లున్న మంత్రులేమో బయట తిరుగుతున్నారు.. పదవులు అనుభవిస్తున్నారు. అందువల్లే సీబీఐ దర్యాప్తే రాజకీయ ప్రేరేపితంగా సాగుతోందన్న భావన సామాన్య ప్రజల్లో వచ్చేసింది. ఒక మనిషిని రాజకీయంగా ఫినిష్ చేయడానికి వీలుగా అతడిని బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో దర్యాప్తు సాగుతున్నట్లు స్పష్టంగా కనపడుతోంది. అయితే జగన్‌ను జైల్లో పెట్టి రాజకీయంగా ఫినిష్ చేద్దామనుకుంటే వీలుపడలేదు. 

ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పటికీ... ఉప ఎన్నికల్లో.. అందరికీ కలిపి వచ్చిన ఓట్లకంటే ఈయన పార్టీ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈయన బయటకొస్తే.. తమ పార్టీకి ఇంకా నష్టమనే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. అందుకే ఏడాదిగా దర్యాప్తు సాగుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్‌గాని, ఆయన మనుషులుగాని ఇప్పుడు బయట ఉంటే.. రూలింగ్ పార్టీని పడగొట్టగలరన్న భయం వారి కుంది. అందుకే సీబీఐని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారన్న ఫీలింగ్ సామన్య ప్రజల్లోకూడా వచ్చేసింది. 

సీబీఐ స్వతంత్రత నిన్న, మొన్న జరిగిన బొగ్గు కుంభకోణం కేసుల్లోనే తేటతెల్లమైంది. మంత్రులే సీబీఐ అధికారులను పిలిపించుకుని నివేదికలు చూసి మారుస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సీబీఐ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సీబీఐ పంజరంలో చిలకలా.. ఒక యజమాని చెప్పినట్లు ఆడుతోందని వేరే కేసుల్లో వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. జగన్ కేసు విషయంలో మాత్రం సీబీఐ చెప్పిందే బైబిల్ అన్నట్లు నమ్ముతోంది.’’
- రామచంద్రరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=595794&Categoryid=1&subcatid=33

YS Bharathi interview with NDTV

మంత్రులు ప్రభావితం చేయలేనిది..

శక్తివంతమైన హోంశాఖలో ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కీలక శాఖలో ఉన్న ధర్మాన ప్రసాదరావు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయలేరుగానీ, వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తారా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘జగన్ బయటికొస్తే.. సాక్షులను ప్రభావితం చేస్తారనే ఒకే ఒక్క అంశంతో ఆయనకు బెయిల్ నిరాకరించినట్లు చెబుతున్నారు.

ఎలాంటి అధికారంలో లేని జగన్ సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో చెప్పిఉంటే బాగుండేది. అధికారంలో ఉన్న మంత్రులు మూడు, నాలుగో నిందితులుగా చార్జిషీట్లలో ఉన్నారు. వారు ప్రభావితం చేయలేనిది జగన్ ఎలా చేస్తారు? ఎందుకు దానిపై వివరణ కోరలేక పోయారనేది మాకు బాధ కలిగించే అంశం’’ అని ఆయన అన్నారు. తమకైతే ఈ తీర్పుపై అనుమానాలున్నాయన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బెణికిన కాలుకు ఫిజియోథెరపీ చేయించుకోవడానికంటూ ఉండడంపట్ల ఆయన అనుమానం వెలిబుచ్చారు.

నిర్దోషి అని తేలాక ఈ సంవత్సర కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?

* టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పెడితే నడుస్తున్న కేసు ఇది
* వైఎస్సార్ చనిపోయాక.. జగనన్న కాంగ్రెస్‌ను వీడాక తప్పులు కనిపించాయా?
* వైఎస్ బతికి ఉన్నప్పుడు ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడిన వారే ఇప్పుడు దోషి అంటున్నారు
* అబద్ధపు కేసులతో ఏడాది కాలంగా జైల్లో ఉంచుతారా?
* నేరాన్ని నిర్ధారించకుండానే శిక్ష వేస్తారా?
* ఇది ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నట్టు కాదా?
* ఒక వ్యక్తిని ఏడాది దాకా రిమాండ్‌లో ఉంచొచ్చని ఏ చట్టం చెబుతోంది?
* జగన్ నిర్దోషి అని తేలాక ఈ సంవత్సర కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?
మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘జగనన్నపై నడుస్తున్న కేసు సివిల్ కేసో... క్రిమినల్ కేసో కానే కాదు.. కేవలం పొలిటికల్ కేసు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కేసు పెడితే నడుస్తున్న కేసు.. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత.. జగనన్న కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన తర్వాత మాత్రమే ఈ తప్పులన్నీ సీబీఐకి, కాంగ్రెస్‌కు, టీడీపీకి కనిపిస్తున్నాయంటే దీన్ని పొలిటికల్ కేసు కాకుంటే ఇంకేం అంటారు..’’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడిన వాళ్లే.. ఇప్పుడు వైఎస్సార్ దోషి అని, ఆయన చేసిన పనుల వలన జగన్ లబ్ధి పొందారని కేసులు పెట్టారన్నారు. 

వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఈ తప్పులు సీబీఐకిగాని, కాంగ్రెస్‌కుగాని, టీడీపీకిగాని కనిపించ లేదా అని నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సాగింది. ‘‘ఈ పొద్దు కొడుకును ఇడుస్తారని అనుకున్న బిడ్డా..! కానీ దొంగల చెయ్యే పైకయింది. టీవీ జూస్తంటే కూడు కూడా ముట్టబుద్ది కాలేదు. కుట్రగాండ్లంతా ఒక్కటై ఈ పని జేసిండ్రు’’ అని రంగారావు బంజర గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు గోపిశెట్టి అనసూర్య, ‘‘అన్నకు బెయిల్ వస్తుందని ఈరోజు పనికి కూడా పోలే... కానీ ఆ దేవునికి దయపుట్టలేదు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణే రాజకీయ శత్రువుగా మారి ఈ పని జేస్తుండక్కా..’’ అని పెనుబల్లికి చెందిన వెంకటనర్సమ్మతో పాటు పలువురు యువకులు, మహిళలు షర్మిలతో చె ప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను వింటూ ముందుకు సాగిన షర్మిల పెనుబల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

నేరాన్ని నిర్ధారించకుండానే శిక్షా..:
కాంగ్రెస్, టీడీపీ చేతిలో చెయ్యి వేసుకొని సీబీఐని వాడుకొని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశారు. ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ ఏ ఒక్క ఆరోపణకు ఆధారం చూపించకుండానే జగనన్నను సంవత్సర కాలంగా జైల్లో పెట్టారు. ఏ వ్యక్తినైనా దోషి అని నిర్ధారించకుండానే ఇన్ని రోజులపాటు అరెస్టు చేసి జైల్లో ఉంచుతారా? ఇది నేరాన్ని నిర్ధారించకుండానే శిక్ష వేసినట్లు కాదా? అని అడుగుతున్నాం. 

ఆరోపణలు రుజువు కాకుండా ఏ వ్యక్తినైనా సంవత్సరం రోజుల పాటు రిమాండ్‌లో ఉంచ్చొచ్చని ఏ చట్టం చెప్తోంది? తీరా కేసు అంతా జరిగిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని తేలాక.. ఆయనను సంవత్సరంపాటు జైల్లో ఉంచిన దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఆ రోజున జరిగిన తప్పుకు ఎవరికి శిక్ష పడుతుంది? ఎంత శిక్ష పడుతుంది? ఆయన నిర్దోషి అని తేలిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నష్టపోయిన ఈ సంవత్సర కాలాన్ని సీబీఐ గానీ, ఈ నాయకులు గానీ వెనక్కి తెచ్చి ఇవ్వగలరా? అని అడుగుతున్నాం.

జగన్‌కు ప్రాథమిక హక్కులు లేవా?
జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ రుజువు కాకుండానే ఇంతకాలం పాటు జైల్లో పెట్టారంటే ఆయన ప్రాథమిక హక్కును కాలరాస్తున్నట్టు కాదా? ఆయన మనిషి కాదా? జగన్‌మోహన్‌రెడ్డి భారతీయుడు కాదా? ఆయనకు ప్రాథమిక హక్కులు లేవా? ఈ వ్యవస్థలు ఇలా పని చేస్తున్నాయి అంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అని అడుగుతున్నాం. 

ఈ నాయకులకు జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే కుట్రలు పన్ని నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. కానీ బోనులో ఉన్నా సింహం.. సింహమే. ఈరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా వస్తాడు. వచ్చేరోజు కూడా దగ్గర్లోనే ఉంది. ఆ రోజును ఆపే దమ్మూధైర్యం ఈ నాయకులకు లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో.. మంచి వాళ్ల పక్షాన ఆయన నిలబడతారనేది అంతే నిజం.

గురువారం 143వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని రాంనగర్ శివారు నుంచి ప్రారంభమైంది. మైబూబ్‌నగర్, పెనుబల్లి మండలంలోని ఉప్పలచెలక గ్రామం ద్వారా సత్తుపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. అక్కడ్నుంచి రంగారావు బంజర, ఎడ్ల బంజర మీదుగా పెనుబల్లి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.25 గంటలకు చేరుకున్నారు. గురువారం 11.8 కిలోమీటర్లు నడిచారు.

ఇప్పటివరకు మొత్తం 1,917.4 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, ఎడవల్లి కృష్ణ, స్థానిక నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, బుక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ తదితరులున్నారు.

కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు కాబట్టే..


 హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఈ విషయం రాష్ట్రంలో చిన్న పిల్లాడికి కూడా తెలుసని ఆయన భార్య వైఎస్ భారతి అన్నారు. జగన్‌ను జైల్లో ఉంచడమే సీబీఐ లక్ష్యమని, అందుకే సీబీఐ ఈ కేసులో దర్యాప్తు చేయడమే లేదని చెప్పారు. జగన్‌కు బెయిల్ నిరాకరణపై గురువారం ఆమె ప్రముఖ ఆంగ్ల న్యూస్ చానెల్ ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడారు.

‘‘ఈ కేసును సీబీఐ 21 నెలలుగా దర్యాప్తు చేస్తోంది. అక్టోబర్‌లో బెయిల్‌కోసం పిటిషన్ వేసినప్పుడు.. మరో మూడు నెలల గడువు కావాలని సీబీఐ వారు అడిగారు. ఇప్పటికి 8 నెలలైంది. ఇప్పుడు మరో 4 నెలల సమయం కావాలని అంటున్నారు. ఇవాళ(గురువారం) సుప్రీంకోర్టు అలా తీర్పు ఇచ్చిందో లేదో వారి న్యాయవాది బయటకొచ్చి మాట్లాడుతూ.. 4 నెలల తర్వాత తాము ఈ గడువును పెంచాలని అడిగే అవకాశముందని చెప్పారు. దర్యాప్తు పూర్తి చేయాలన్న ఆలోచనే వారికి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే అసలు దర్యాప్తే జరగడం లేదు కాబట్టి’’ అని ఆమె విమర్శించారు.

కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు కాబట్టే..
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు వేసి వేధిస్తున్నారని అన్నారు. ‘‘జగన్‌కు ఇప్పట్లో బెయిల్‌రాదని, ఏదో ఒక రోజు ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో కలపక తప్పదని ఇటీవల కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా అన్నారు. జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే ఆయన మీద కేసులే ఉండేవి కావని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా అప్పట్లో చెప్పారు. జగన్ మీద చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని ప్రజలకు తెలుసు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. గత ఉప ఎన్నికల్లోనూ వారు కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతూ తీర్పు ఇచ్చారు’’ అని భారతి అన్నారు

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..

వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరోప్రజాప్రస్థానం యాత్ర 144వ రోజు శుక్రవారం జిల్లాలో 12.2 కిలోమీటర్లు సాగనుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. పెనుబల్లి నుంచి పారంభం కానున్న పాదయాత్ర కొత్తలంకపల్లి శివారు వరకు సాగుతుందని తెలిపారు. 

పర్యటించే ప్రాంతాలు
రాంచందర్‌రావు బంజర్, లంకాసాగర్‌క్రాస్‌రోడ్, మండాలపాడు, లంకపల్లి, కొత్తలంకపల్లి

జగన్ పై కేసు రాజకీయ కుట్రే: వైఎస్ భారతిరెడ్డి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు రాజకీయ ప్రేరేపితమని ఎన్డీటీవీతో వైఎస్‌ భారతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, పార్టీని వీడనంత వరకు జగన్‌ కూడా గౌరవనీయ వ్యక్తులని ఎన్డీటీవీతో వైఎస్‌ భారతిరెడ్డి వ్యాఖ్యానించారు. 

జగన్‌ కాంగ్రెస్‌ను వీడిన నెల తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పిల్‌ వేశారని..ఆ తర్వాత నెలలోపే ఆయన మంత్రి కూడా అయిన విషయాన్ని వైఎస్ భారతి ప్రస్తావించారు. జగన్‌కు బెయిల్‌ రాదంటూ ఇటీవలే రైల్వేమంత్రి కోట్ల కూడా చెప్పారని.. ఇక ఆజాద్‌ అయితే కాంగ్రెస్‌లో జగన్‌ ఉంటే మంత్రి అయ్యేవారని చెప్పిన విషయాన్ని ఎన్డీటీవీతో వైఎస్‌ భారతిరెడ్డి అన్నారు. జగన్‌ బెయిల్‌పై వస్తారు.. న్యాయం జరుగుతుందనుకున్నామని.. సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గడువు విధించడం సంతోషమని ఆమె అన్నారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోరిందన్నారు.

జగన్‌ జైలులో ఉన్నా జనం ఆయన వెంట ఉన్నారని.. జగన్‌పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని వైఎస్‌ భారతిరెడ్డి తెలిపారు. జగన్‌ అరెస్టయ్యాక 18చోట్ల ఉపఎన్నికలైతే 15 గెలిచామని.. నెల్లూరు లోక్‌సభలోనైతే రికార్డు మెజార్టీతో గెలిచామన్నారు. ఉపఎన్నికల ఫలితాలు ప్రజాభిమానానికి నిదర్శనాలని.. కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటి తీర్పును ప్రజలు ఇస్తారని వైఎస్‌ భారతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

గత 21నెలలుగా సీబీఐ దర్యాప్తు చేస్తూనే ఉందని..గతంలో 3నెలల్లో దర్యాప్తు ముగించేస్తామని సుప్రీంకు చెప్పిన సీబీఐ 8నెలలైనా చేయలేదని..తాజాగా సుప్రీంకోర్టు 4నెలల గడువు విధించిందని ఎన్డీటీవీతో వైఎస్‌ భారతిరెడ్డి తెలిపారు. తీర్పు వెలువడ్డ కాసేపటికే మరింత గడువు కోరుతామన్నారు అశోక్‌భాన్‌ మీడియాకు తెలపడం ఇదీ సీబీఐ దర్యాప్తుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.

వైఎస్ హయాంలో రైతే రాజు

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013

వైఎస్ఆర్ ఉన్నప్పుడు రైతులు రాజులుగా ఉన్నారని మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల అన్నారు. మహిళలకు 25 పైసలకే రుణాలిచ్చారని..పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ ద్వారా YSR ఉచితవిద్య అందించారని.. షర్మిల తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యాన్ని కూడా పేదలకు అందచేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని షర్మిల ఈ సందర్బంగా గుర్తు చేశారు. 

ప్రజలపై దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఛార్జీలను పెంచిందని..అలాంటి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు అండగా నిలిచారని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌- టీడీపీ కుమ్మక్కై జగన్‌ను జైలులో ఉంచారని షర్మిల మండిపడ్డారు.

సీబీఐ ప్రాథమిక హక్కులను హరిస్తోంది: షర్మిల

ఖమ్మం: జగనన్నది పొలిటికల్ కేసు అని షర్మిల వ్యాఖ్యానించారు. దోషి అని నిర్థారించకుండానే జైలులో ఉంచమని ఏ చట్టం చెబుతోందని షర్మిల ప్రశ్నించారు. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను సీబీఐ హరిస్తోందని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐలు జగనన్నపై కక్ష సాధిస్తున్నాయని షర్మిల అన్నారు. జగనన్నను అనవసరంగా సంవత్సరం పాటు జైలులో ఉంచారని..జగనన్న నిర్దోషి అని తేలాక బాధ్యత ఎవరు తీసుకుంటారని...ఆశిక్షను ఎవరు అనుభవిస్తారని షర్మిల నిలదీశారు. 

సీబీఐ తీరు దారుణంగా ఉంది: కరుణాకర్ రెడ్డి


నిజామాబాద్: జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ తీరు దారుణంగా ఉందని భోదన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, సీబీఐ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అయితే ఎన్ని కుట్రలు చేసినా.. జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు అని కరుణాకర్ రెడ్డి అన్నారు.

Just yellow

ముగిసిన షర్మిల 143వ రోజు పాదయాత్ర!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 143వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లాలో విఎం బంజరా వద్ద ముగిసింది. గురువారం నాటి షర్మిల పాదయాత్ర 11.8 కిలోమీటర్లు సాగిందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. చండ్రుగొండ మండలంలోని రాంనగర్ శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మైబూబ్‌నగర్ క్రాస్ రోడ్, లింగన్నగూడెం క్రాస్ రోడ్, ఉప్పలచెలక, రంగారావు బంజర, ఎడ్ల బంజర మీదుగా వీఎం బంజర వరకు సాగింది.

సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థ: భూమన

సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థగా మారిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. సోనియా గాంధీని ధిక్కరించినందుకే వైఎస్ జగన్‌కు కష్టాలపాల్జేరని ఆయన ఆరోపించారు. సీబీఐ నిజాయతీగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు సీబీఐని ఆడిస్తున్నాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజాకోర్టులో జగన్ కడిగిన ముత్యం బయటకొస్తారన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

పల్లెల్లో మహిళా పోలీసులను పెడతాం: షర్మిల


 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రాబందుల్లా పీక్కుతింటోందని షర్మిల విమర్శించారు. పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా ఉప్పలచర్ల షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతుల వెన్నంటి నడిచిన నేత వైఎస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. మద్దతు ధర, ఇన్‌పుట్‌ సబ్సిడీలతో రైతులను వైఎస్ఆర్‌ ఆదుకున్నారని తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిగ్రామంలో మహిళా పోలీసులను నియమిస్తామని హామీయిచ్చారు. అక్రమ మద్యం, బెల్ట్‌షాపులను నిర్మూలిస్తామన్నారు. అతి త్వరలో జగనన్న నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాడుతుందని షర్మిల విశ్వాసం వ్యక్తం చేశారు.

Sharmila's padayatra at Aswaraopeta

సామారియాను కలిసిన శ్రీకాంత్‌రెడ్డి

ట్రాన్స్‌కో సీఎండీ సామారియాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఘోరంగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపైన సామారియా స్పందిస్తూ... త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీయిచ్చారు. 

కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉంది: జీవన్‌రెడ్డి

జగన్ విషయంలో సీబీఐ వ్యవహారశైలిని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తప్పుబట్టారు. ఛార్జిషీట్ దాఖలు విషయంలో సీఆర్‌పీసీ నిబంధనలను సీబీఐ ఉల్లంఘిస్తోందన్నారు. కేసు నమోదైన మూడునెలల్లోగా ప్రధాన ఛార్జిషీట్ దాఖలు చేయాలని, ఆ తరువాతవన్నీ సప్లిమెంటరీ ఛార్జిషీట్లేనని నిబంధనలు చెప్తున్నాయన్నారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు.. కాంగ్రెస్ మెడకే చుట్టుకునేలా ఉందని జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్‌ విషయంలో సీబీఐ దూకుడు: కిషన్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అదే సీబీఐ....ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల విషయంలో అలా ఎందుకు వ్యవహరించడంలేదని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు.

దొంగల వద్దకు వెళ్లి చార్జిషీటు మార్చిన ఘనత సీబీఐదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ చిలక అని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. రాహుల్‌కు చరిష్మా ఉంటే అతన్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. 

కోర్టు తీర్పును తప్పుపట్టడం లేదు: విజయమ్మ


వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ అర్థంలేని ఆరోపణలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆమె గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ పని తీరును సుప్రీంకోర్టే తప్పు పట్టిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదని ఆమె అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ పై కుట్ర పన్నాయని విజయమ్మ ఆరోపించారు. పార్టీని వీడినందుకే కాంగ్రెస్ కక్ష కట్టిందని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం ప్రజాసేవకే అంకితమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని విజయమ్మ స్పష్టం చేశారు. 

YS Vijayamma press Meet 9th May 2013

YSRCP Leader Ambati Rambabu comments on YS Jagan's bail plea

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆ మైండ్ గేమ్ లో పడవద్దని...

: సీబీఐ చిలుక పలుకులను న్యాయస్థానాలు నమ్మాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అయితే న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని....మరో నాలుగు నెలలు తర్వాత అయినా న్యాయమే గెలుస్తుందన్నారు.

రాజకీయ క్రీడలో జగన్ పావుగా మారారని అంబటి రాంబాబు అన్నారు. జగన్ ను మరో ఏడాది జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. బెయిల్ రానంతమాత్రాన పార్టీ శ్రేణుల నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆ మైండ్ గేమ్ లో పడవద్దని అంబటి సూచించారు. కాంగ్రెస్, టీడీపీని ఓడించేందుకు పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు

Jupudi prabhakar comments on YS Jagan's bail plea

YSRCP Leader Konatala comments on YS Jagan's bail plea

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రెండు రోజులుగా ఏంచేశారన్నది ......

హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు నిరాశ పరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారనడం ఎంతవరకు సాధ్యమని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు.
మంత్రులు ప్రభావితం చేయలేని సాక్షులను జగన్‌ ఎలా చేస్తారని శ్రీకాంత్ రెడ్డి సూటి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నాయకులు బెయిల్‌ రాదని చెప్పనట్లే జరిగిందని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రెండు రోజులుగా ఏంచేశారన్నది తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. సీబీఐ వాదనపట్ల ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.


సీబీఐ న్యాయవాదుల తీరు సరిగాలేదు

: కేంద్రం ఆదేశాల మేరకే సీబీఐ వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. బొగ్గు కుంభకోణంలో సీబీఐ తీరును సుప్రీంకోర్టే తప్పు పట్టిందని ఆయన గురువారమిక్కడ గుర్తు చేశారు. 
సుప్రీంకోర్టుకు సీబీఐ తప్పుడు నివేదికలను అందిస్తోందని కొణతాల అన్నారు. 

సీబీఐ న్యాయవాదుల తీరు సరిగా లేదని, హైకోర్టులో ఒకలా.. సుప్రీంకోర్టులో మరోలా సీబీఐ వ్యవహరిస్తోందని కొణతాల అన్నారు. ఈ కేసులో 43వేల కోట్ల రూపాయిల మేరకు అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించిందని.... అయితే ఇంతవరకూ సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ ల అన్నింటిలోనూ కలిసి వెయ్యి ముప్పయి కోట్ల రూపాయిల మేరకు మాత్రమే ఆరోపణలు చేసిందన్నారు.

అరకొర ఆరోపణలతో జగన్ కు బెయిల్ తిరస్కరించటం దురదృష్టకరమన్నారు. ఈ మొత్తం వ్యవహారం వైఎస్ జగన్ ను బయటకు రాకుండా చేసే కుట్ర అని అన్నారు. ఈకుట్ర ప్రభావంలో పడి సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వటం విచారకరమని కొణతాల వ్యాఖ్యానించారు. సీబీఐ పంజరంలో రామచిలుకలా మారిందని సుప్రీమే వ్యాఖ్యానించిందని ఆయన పేర్కొన్నారు 

వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్‌లోపు దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది. 

సెప్టెంబర్‌ లోపు దర్యాప్తు పూర్తి కాకుంటే బెయిల్‌ కోసం పిటిషనర్‌ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించవచ్చని తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్‌ కోరుతూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. 

సుప్రీంకోర్టులో ఓ మాట, హైకోర్టులో ఓ మాట చెప్తూ సీబీఐ కేసును తప్పుదోవ పట్టిస్తోందని జగన్‌ తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. సీబీఐ మాత్రం కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని, ఈ పరిస్థితుల్లో బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని వాదించింది. గతేడాది మే 27న సీబీఐ... వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అరెస్టు చేసింది. 

నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ కొట్టివేత

ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనలను ఏకీభవిస్తూ న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. కాగా నాలుగు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సీబీఐని ఆదేశించింది.

vijayasai reddy bail cancelled

కాసేపట్లో జగన్ బెయిల్ పిటిషన్ పై తీర్పు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈ నెల ఆరోవ తేదీన జగన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కావటంతో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా ఈరోజే తీర్పు వెలువడనుంది. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడిన నేతల సస్పెండ్

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడిన  నలుగురు  వరంగల్  జిల్లా నేతలపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రాధ, మసూద్, మోమన్ రావు, శ్రీనివాస్  తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరు కార్మిక, ఎస్.సి.సెల్, వాణిజ్య,మహిళ విబాగాలకు చెందిన నేతలుగా ఉన్నారు.

పార్టీ బలోపేతానికి మరింత కృషి: పువ్వాడ అజయ్

ఖమ్మం : జిల్లాలో షర్మిల మరో ప్రజా ప్రస్థానం విజయవంతమైనందున కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తాను ఇతర పార్టీల్లోకి వెళతానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన గురువారమిక్కడ తెలిపారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని అజయ్ కుమార్ తెలిపారు.

సీబీఐని విమర్శిస్తే కేసులు తిరగదోడుతుందని బాబుకు భయమా?

- వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి సవాల్ 
- రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ వేర్వేరు కాదు
- ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతే
- కర్ణాటకలో బీజేపీ మాదిరే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఓటమి ఖాయం 
- విప్ ధిక్కరించిన 17 మంది ఎమ్మెల్యేలపై ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే అనర్హత వేటు వేయట్లేదు
- సీబీఐని విమర్శిస్తే కేసులు తిరగదోడుతుందని బాబుకు భయమా?

సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు అంత ధీమా ఉంటే రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి సవాల్ విసిరారు. మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం పెట్టి పడగొట్టాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని, ప్రజలు ఎవరి నాయకత్వాన్ని కోరుతున్నారో అప్పుడు తేలుతుందని చెప్పారు. 

కర్ణాటక ఫలితాలే రాష్ట్రంలో పునరావృతమౌతాయని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ... కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకలో అధికార బీజేపీ తరహాలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, ప్రజలు వారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు వేరువేరుగా లేవని, ఆ రెండూ కలిసిపోయాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. 

అందుకే గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కై పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయారని గుర్తుచేశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని తెలిపారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా ప్రజాపక్షంగా నిలిచేందుకు పార్టీ విప్‌లను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన వారిపై రెండు నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్, టీడీపీలు కలిసి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీనే విజయభేరి మోగిస్తుందని, బలమైన ప్రతిపక్షంగా, ప్రజలకు అండగా ఉంటున్నందునే తమ పార్టీ గెలుస్తుందని చెప్పారు. కర్ణాటకలో అధికార బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్లే అక్కడ కాంగ్రెస్ గెలిచిందన్నారు. అక్కడి ఓటర్లకు ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లేకపోవడంతో కాంగ్రెస్‌కు ఓటేశారని వివరించారు. 

రాష్ట్రంలో 30 ఏళ్లనాటి పరిస్థితులు పునరావృతమవుతాయి
రాష్ట్రంలో 30 ఏళ్ల నాటి పరిస్థితులు మళ్లీ వస్తాయని శోభ చెప్పారు. 1983లో ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ప్రజలు ఏ విధంగా ఎదురు చూసి టీడీపీని అధికారంలోకి తెచ్చారో, ప్రస్తుతం అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, వైఎస్సార్ సీపీకి ఓటేసి జగన్‌ను సీఎం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.

మూడు దశాబ్దాల క్రితం సైకిల్ గుర్తుతో ఎన్టీఆర్ స్వీప్ చేస్తే, ఇప్పుడు అదే గుర్తుతో చంద్రబాబు డిపాజిట్లు కోల్పోతున్నారని అన్నారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఏ నేరం రుజువు కాకముందే 12 నెలలుగా నిర్బంధించారని అన్నారు. దేశంలో ఏ వ్యక్తిపై కూడా ఇంత అన్యాయంగా వ్యవహరించలేదని తెలిపారు. వీరికంటే బ్రిటిష్ వాళ్లే నయమనిపిస్తోందన్నారు. విచారణ పేరుతో జగన్‌కు బెయిల్ రాకుండా 12 నెలలుగా వేధిస్తున్నారన్నారు. 

ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా హడావుడి చేసే టీడీపీ అధినేత చంద్రబాబు.. సీబీఐపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు స్పందిస్తున్నా, ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. సీబీఐపై సుప్రీంకోర్టు ఘాటైన విమర్శలు చేసినా బాబు స్పందించకపోవడంలో ఉన్న మతలబేమిటని అన్నారు. కాంగ్రెస్ జేబు సంస్థగా ఉన్న సీబీఐని విమర్శిస్తే తనపై ఉన్న కేసులను తిరగతోడుతారనే భయంతోనా లేక ఆ సంస్థ జగన్‌ను వేధిస్తుందనే కారణం చేత మాట్లాడటంలేదేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆఖరి పాయింట్ వచ్చిందనే కాంగ్రెస్‌లో సంబరం: గట్టు
ఆటలో ఓడినా ఆఖరి పాయింట్ వచ్చిందనే సంబరంలో కాంగ్రెస్ ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఘోర ఓటమిని చవిచూస్తున్న కాంగ్రెస్ కర్ణాటక ఫలితాలను చూసి సంబరపడిపోతోందని అన్నారు. కర్ణాటక ఫలితాలు బీజేపీ ఓటమి తప్ప కాంగ్రెస్ విజయం కాదని వివరించారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2014లో ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు బ్రాంచి ఆఫీసుగా మారిన టీడీపీకి కూడా అదే గతి పడుతుందని చెప్పారు.

మైబూబ్‌నగర్‌ నుంచి షర్మిల పాదయాత్ర

మరోప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నేడు షర్మిల ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర 143వ రోజుకు చేరుకుంది. ఆమె గురువారం ఉదయం మైబూబ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 

లింగగూడెం ఎక్స్‌రోడ్‌, ఉప్పలచెలక, రంగారావు బంజెర, ఎడ్ల బంజెర మీదుగా.. విఎం బంజారా చేరుకుంటారు. అక్కడ షర్మిల బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు షర్మిల 11.8 కిలోమీటర్లమేర పాదయాత్ర చేయనున్నారు

జగన్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు

వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరిస్తారు. జగన్‌తో పాటుగా ఇదే కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్, విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్లపైనా తీర్పు రానుంది. మూడు తీర్పులనూ వేర్వేరుగా ఇవ్వనున్నారు.

కడదాకా వైఎస్సార్ కాంగ్రెస్ లోనే

కిరణ్ ధీమా చంద్రబాబే

అందుకే ఇంత విర్రవీగుతూ అన్ని చార్జీలూ పెంచేస్తున్నారు: షర్మిల
ఎరువుల ధర ఇప్పటికి 10 సార్లు, ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచారు
సబ్సిడీ లేని గ్యాస్ ధరను రూ.వెయ్యి చేసేశారు
వ్యాట్, రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగించారు
కరెంటు చార్జీల పేరుతో ప్రజలపై రూ.30 వేల కోట్ల భారమేశారు
చంద్రబాబు అండదండలు ఉన్నంతవరకు ఏం చేసినా చెల్లుతుందనే సీఎం ధీమా


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతులంతా అల్లాడిపోతున్నారు.. పండించిన పంట కు మద్దతు ధర లేదు. ఎరువుల ధరలు ఇప్పటికి 10 సార్లు పెంచారు. లేని కరెంటుకు మూడింతల బిల్లులు వేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు ఇప్పటికి మూడు సార్లు పెంచారు. గ్యాస్ ధర రూ. 305 నుంచి రూ. 420 అయింది. అదీ సబ్సిడీ ఉంటే, సబ్సిడీ లేకుంటే ఏకంగా రూ. వెయ్యి. వ్యాటు, రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగించారు. ఇలా ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిదీ పెంచేశారు. రూ. 30 వేల కోట్ల కరెంటు భారం ప్రజల నెత్తిన మోపి వాళ్ల రక్తం పిండైనా వసూలు చేస్త్తున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతగా విర్రవీగుతూ రెచ్చిపోయి పన్నుల పోటు పొడవడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు అండదండలు ఉన్నంత వరకు తాను ఏం చేసినా చెల్లుతుందనే ఈ ముఖ్యమంత్రి ధీమా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అని ప్రతిపక్ష పార్టీ లూ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చి ఉంటే ఈపాటికి ఈ దుర్మార్గపు ప్రభుత్వం కూలిపోయి ప్రజల నెత్తిన భారం తప్పేది’’ అని అన్నారు. ప్రజల బాగోగులను గాలికి వదిలేసిన ఈ ప్రతిపక్ష నాయకుడిని నాయకుడు అంటారా? దుర్మార్గుడు అంటారా? అని ప్రశ్నించారు. 

కరెంటు ఇవ్వకుండాబిల్లులు వసూలు చేయ డం అమానుషం అనే సంగతి ఈ ముఖ్యమంత్రికి తెలిసేలోపు ఇంకాఎంత బిల్లు పెంచుతారో అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పల్లెల్లో సాగింది. చండ్రుగొండ మండలం ఎర్రగుంట గ్రామం లో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల కొద్దిసేపు ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు..
‘‘ప్రజల గురించి కిరణ్‌కుమార్‌రెడ్డి గాని, చంద్రబాబు గాని ఏ రోజూ ఆలోచన చేయలేదు. వారి కన్నంతా ముఖ్యమంత్రి పదవి మీదే ఉంది. మన రాష్ట్రంలో ప్రజలకు వైఎస్సార్ ఎంత గొప్ప మేలు చేశారో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం కోరుకుంటున్నారంటే దానికి కారణం వైఎస్సార్ చేసిన మంచి పనులు, వైఎస్సార్ సంపాదించుకున్న విశ్వసనీయతే. అవే విలువలు, అదే విశ్వసనీయతను ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిలో చూశారు గనుకనే, రాజన్న రాజ్యం తెచ్చే సత్తా జగన్‌కు ఉందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా జగన్‌ను వైఎస్సార్ ప్రతిరూపంగా చూస్తున్నారు. ఈ విషయం టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు బ్రహ్మాండంగా తెలుసు. అందుకే కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలు చేశారు.

రాజన్న పథకాలకు జగనన్న మళ్లీ జీవం పోస్తారు..
జగనన్న బయటకు రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత.. రాజన్న చేసి చూపించిన ప్రతి పథకానికి మళ్లీ జీవం పోస్తారు. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలిస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేటట్టు రూ. 3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ప్రతి రైతూ అప్పుల ఊబిలోంచి బయటికి వచ్చి బాగుపడేటట్టు చేస్తారు. మన విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంటు, పేదల కోసం ఆరోగ్య శ్రీ నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700, వికలాంగులకైతే రూ. 1,000 అవుతుంది. అక్కాచెల్లెళ్లు తమ పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం.. పదోతరగతి వరకు చిన్నారికి రూ.500 చొప్పున తల్లి ఖాతాలో వేస్తారు.

ఇలా ఒక్కో కుటుంబంలో ఇద్దరేసి పిల్లలకు పథకాన్ని వర్తింపజేస్తారు. అంటే ఏడాదికి ఒక్కో చిన్నారికీ రూ.6,000 చొప్పున తల్లి ఖాతాలో పడతాయి. ఇంటర్ చదివితే ఏటా రూ. 8,400, డిగ్రీ చదివితే రూ. 12,000 అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎలాగూ ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా జగనన్న ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదవాళ్లు ధీమాగా పెద్దాసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు మళ్లీ వస్తాయి. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు జగనన్న ప్రతి పేద కుటుంబానికీనెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు.’’

11.8 కిలోమీటర్ల మేర యాత్ర..
పాదయాత్ర 142వ రోజు బుధవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అయ్యన్నపాలెం గ్రామం నుంచి ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి దామరచర్ల, ముద్దుకూరు, కట్టుగూడెం, గుంపెన, ఎర్రగుంట, శాంతినగర్ మీదుగా నడుచుకుంటూ రాంనగర్ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.25 గంటలకు చేరుకున్నారు. బుధవారం 11.8 కిలోమీటర్లు ఆమె నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,905.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిర్రాజు నగేష్, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, సాదు రమేష్‌రెడ్డి, భూక్యాదళ్ సింగ్, మెండెం జయరాజ్ తదితరులున్నారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
బుధవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 142, కిలోమీటర్లు: 1,905.6

Popular Posts

Topics :