19 May 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జగన్ ప్రజలపక్షం- బాబు కాంగ్రెస్ పక్షం

Written By news on Saturday, May 25, 2013 | 5/25/2013

Written by Nagarjuna On 25/5/2013 19:19:00 PM
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=62945&Categoryid=28&subcatid=0
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రజల పక్షం నిలిస్తే, ప్రధాన పత్రిపక్షం తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పక్షాన నిలుస్తున్నారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల కోసం జగన్ దీక్షలు చేసి, పోరాడి ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. పోరాటాలు, ఉద్యమాలతో అద్వితీయమైన ప్రజాస్పందనని కూడగట్టుకున్నారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన రాజకీయాలలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే జననేతగా ఎదిగారు.

2010 డిసెంబరులో విజయవాడలో రైతుల కోసం జగన్మోహన రెడ్డి భారీ లక్ష్యదీక్ష చేపట్టారు. ధర్మవరంలో చేనేత కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతు పలికారు. 2011 మేలో గుంటూరులో రైతు సమస్యలపై దీక్ష చేశారు. 2011 జనవరిలో రైతులతో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు. దేశ రాజధాని పార్లమెంటు వీధిలో ఒక రోజంతా నిరశన దీక్ష పాటించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా
విశాఖపట్నంలో 2011 జనవరి 22న జగన్ జనదీక్ష చేపట్టారు. రైతులకు విద్యుత్ సక్రమంగా అందించకపోవడంతో 2011 ఏప్రిల్ 3న విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించాలని పిలుపు ఇచ్చారు. 2012 జనవరిలో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మూడు రోజుల పాటు రైతుల సమస్యలపై విజయవంతంగా దీక్ష నిర్వహించారు. ఈ విధంగా ప్రజలకు చేరువయ్యారు. ప్రజాదరణ పొందారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వానికి తొత్తుగా మారటంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే నాధుడే లేడు. ఈ పరిస్థితులలో జగన్ పార్టీ పెట్టింది మొదలు ప్రజా సమస్యలపైనే పోరాడుతూ వారికి అత్యంత చేరువయ్యారు.

అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్ కు లభించిన అపూర్వ ఆదరణ, ఆయన పాల్గొన్న బహిరంగ సభలకు వచ్చే జనవాహినిని చూసి తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతటి ప్రజాదరణ గల నేత యువకులలో గానీ, సీనియర్లలో గాని మరొకరు లేరని తేల్చేశారు. ఈ ప్రజాదరణని చూసి తట్టుకోలేక, ఈర్ష్య, కుళ్లుతో అధికార, ప్రధాన ప్రతిపక్షం కలిసి కక్ష గట్టాయి. కుట్ర పన్నాయి. జన నేతగా ఎదిగిన జగన్ చూసి ఓర్వలేకపోయారు. జైలులో పెట్టించారు. జగన్ జైలులో ఉన్నా రాష్ట్ర ప్రజల గురించే ఆయన ఆలోచిస్తున్నారు. తండ్రిలాగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వికలాంగులకు, వితంతువులకు, పేదలకు, అన్ని వర్గాల వారికి మేలు చేయాలన్న తలంపుతో ఉన్నారు.
జగన్ ఓ పక్క ప్రజల కోసం, ప్రజాసమస్యలపై పోరాడితే, ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ ఇంత హీనమైన స్థితిలో లేదు. తనపై వచ్చిన ఆరోపణలు, సిబిఐ విచారణను తప్పించుకోవడానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర మంత్రి చిదంబరాన్ని రహస్యంగా కలిసినట్లు వార్తలు కూడా వచ్చాయి. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డిఐ)ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చి చివరకు పార్లమెంట్ లో ఓటింగ్ కు వచ్చేసరికి టిడిపి సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా నాటకీయంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి(యలమంచిలి సత్యనారాయణ చౌదరి), గుండు సుధారాణిలు ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. కేంద్రంతో చేసుకున్న చీకటి ఒప్పందం ప్రకారంమే ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్నారు. పాదయాత్ర పేరుతో జనం మధ్యకు వెళ్లి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పాలించే అర్హతలేదన్నారు.

చివరకు ప్రభుత్వాన్ని దించే అవకాశం వచ్చినప్పుడు దానికి అండగా నిలిచారు. శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇష్టపడలేదు. టిఆర్ఎస్, వైఎస్ఆర్ సిపి మద్దతు ఇస్తామన్నా ప్రభుత్వాన్ని కాపాడటానికే సిద్ధపడ్డారు. టిఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ప్రకటించలేదు. దాంతో చంద్రబాబు వ్యవహారం ప్రజలకు అర్ధమైపోయింది. పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని బాధపడ్డారు. పదవీ వ్యామోహంతో ఆయన చేసే చేష్టలు ప్రజలకు రోతపుట్టిస్తున్నాయి. ఆయన తీరు నచ్చక దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి వంటి వారు పార్టీని వీడి వెళ్లిపోయారు. పార్టీ పెట్టిననాటి నుంచి అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నేతలు, ఎన్టీఆర్ వీరాభిమానులు, ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అయినా చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. ఆ రకంగా ఆయన కాంగ్రెస్ పక్షం వహిస్తున్నారు.
సిబిఐ పని తీరును ప్రతిపక్షాలతోపాటు యుపిఏ మిత్రపక్షాలు కూడా తీవ్రస్థాయిలో తప్పుపట్టాయి. సిబిఐని కాంగ్రెస్ తన జేబు సంస్థగా వాడుకుంటుందని విమర్శించారు. ఎఫ్ డిఐల బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐని అడ్డుపెట్టుకొని పార్లమెంట్ లో నెగ్గిందని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సుప్రీం కోర్టు కూడా సిబిఐ వ్యవహారశైలిపై మండిపడింది. అయినా చంద్రబాబు సిబిఐని ఒక్క మాట కూడా అనలేదు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారు అమాయకులు కారు. గతంలో వారు ఇచ్చిన తీర్పులే అందుకు నిదర్శనం. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో వారికి తెలుసు!

Maro Prajaprasthanam: Sharmila's speech in Bhimavaram

జవాబుదారితనం ఎవరిది?


Greatandhra article














http://telugu.greatandhra.com/politics/may2013/25e_jealousy_jail_a.php

వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రావడం ఖాయం

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ఆయనకు చెందిన టివి ఛానెళ్లు జగన్ ను ఎంత విమర్శించినా 2014 ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రావడం ఖాయం అని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయం అని ఆయన అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో చేసిన చీకటి రాజకీయాలు ప్రజలందరికీ తెలుసన్నారు. 

మైలవరంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈ చిన్నబాబు నియోజకవర్గ సమస్యలు గాలికొదిలి పెద్దబాబు మెప్పుపొందడానికి జగన్‌ను విమర్శిస్తూ గాలికి తిరగడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

వైఎస్సార్ సీపీలో 2 వేల మంది చేరిక

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌లకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలకు చెందిన 2 వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సోదరి షర్మిల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.

జగనన్నను ఎవరూ ఆపలేరు: షర్మిల

భీమవరం: ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని రైతులకు ఒక్క రూపాయికి సహాయం చేయలేదని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేశారని గుర్తు చేశారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్‌లో బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా లక్షల కోట్లు విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటే ఇలావుండాలని చూపిన నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చార్జీలు పెంచలేదని తెలిపారు.

కిరణ్ సర్కారు ప్రజలను కాల్చుకు తింటోందని అన్నారు. విద్యుత్ కోతలతో రాష్ట్రంలో వేల పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా కరెంట్ చార్జీలు పెంచిందన్నారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈగ కూడా వాలకుండా చంద్రబాబు కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో ఊడిపడిన కిరణ్ కు ప్రజలు కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడే జనం గురించి ఆలోచిస్తారని చెప్పారు.

అవిశ్వాసానికి మద్దతు ఇచ్చివుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేదన్నారు. చంద్రబాబుకు పదవీకాంక్ష లేకుంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచేవారా? అని నిలదీశారు. అబద్దపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారన్నారు. జైలులో ఉన్నా సింహం సింహమే అన్నారు. జగనన్నను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి హామీ నెరవేరుతుందన్నారు. అందరికీ మేలు జరుగుతుందని షర్మిల అన్నారు. ఆ రోజు వచ్చే వరకు జగనన్నను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని కోరారు. 

YS Jagan odarpu yatra as a political sensation

YSRCP MLA Gurunath Reddy press meet at YSRCP Office

Godavari Gattuna 25th May 2013

జగన్‌ను కేసులతో వేధిస్తూ జైలుకు పంపిన కుట్రలు


* నల్లకాలువ సభలో ప్రజలకిచ్చిన మాట.. ఓదార్పు
* ఆయన యాత్రల ప్రభంజనం చూసి కుళ్లుకున్న నేతలు
* కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు.. ఆప్తులపై వేటు అస్త్రాలు
* కుటుంబాన్ని విడదీసే కుట్రలతో పార్టీని వీడిన జననేత
* వైఎస్సార్ సీపీ ఆవిర్భావానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ
* ప్రతి ఎన్నికలోనూ బ్రహ్మరథం పట్టిన రాష్ట్ర ప్రజానీకం

ప్రజలకు ఇచ్చిన మాట తప్పినట్లయితే.. ఆయనకు పదవులు దక్కేవి! మడమ తిప్పి.. ఓదార్పు యాత్రను వదిలేస్తే ఆయనను కేంద్రమంత్రి పదవి వరించేది! అధిష్టానం ఆదేశాలకు జీ హుజూర్ అంటూ శిరసును నేలకు తాటిస్తే ఇంకెన్నో భోగభాగ్యాలు లభించేవి! 

కానీ.. మాట తప్పటం.. మడమ తిప్పటం.. ఆయన రక్తంలోనే లేదు! అందుకోసం కష్టాలెన్ని ఎదురైనా వెరపులేదు! ఫలితం.. అవినీతి అంటూ నోటీసులు, కేసులు, ఆస్తుల అటాచ్‌మెంట్లు, అనూహ్య అరెస్టులు, రిమాండ్ పేరుతో జైలు, బెయిల్ కూడా రానివ్వకుండా వేధింపులు! వారం, నెలా కాదు.. ఏకంగా ఏడాది కాలం గడచిపోయింది!

‘‘మాట తప్పటం కన్నా మరణించటం మేలు. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం’’ అంటూ తన తండ్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెప్పే మాటను నరనరానా జీర్ణించుకున్న వ్యక్తి. ఆయనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
ఇంతకీ జగన్ ప్రజలకు ఇచ్చిన మాట ఏమిటి? ఏ మాటపై నిలబడినందుకు జగన్‌కు ఇన్ని కష్టాలు?

నల్లకాలువ సభలో ఇచ్చిన మాట... నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర ప్రజలంతా దిగ్భ్రమకు లోనయ్యారు. ఆత్మీయమైన ఆసరా కోల్పోయామంటూ తెలుగుజాతి యావత్తూ విలవిలాడింది. వైఎస్ మరణ వార్త విన్న షాక్‌లో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది ప్రాణాలొదిలారు. ఈ మరణాలు జగన్‌మోహన్‌రెడ్డిని కదిలించివేశాయి. వైఎస్ మరణంతో పెద్ద దిక్కుకోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రజలంతా ఓదార్చగా.. వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు తాను స్వయంగా ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి కలుస్తానని.. జగన్ మాట ఇచ్చారు.

వైఎస్ మరణించిన 22వ రోజున నల్లకాలువ వద్ద అశేష జనవాహిని సమక్షంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు 2010 ఏప్రిల్ 10న పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన యాత్ర ప్రారంభించారు. వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా వారి ఇంటికి వెళ్లి.. వారికి తానున్నానంటూ ఓదార్పునందించారు. జగన్ ఓదార్పు యాత్ర ప్రజావెల్లువతో ప్రభంజనంలా మారింది. తమను ఓదార్చటానికి వచ్చిన జగన్‌లో ప్రజలు కన్న కొడుకును, తోబుట్టువును చూసుకున్నారు. ఆత్మీయుడిగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. తమ కష్టాలు చెప్పుకుని కన్నీరు కార్చారు. కంచంలో కూటిని నోటికి అందించారు. నీవు ఒంటరివి కావంటూ జగన్‌కూ ఓదార్పునందించారు. ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా నిలిచారు.

* వైఎస్ మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతానని జగన్ మాట ఇవ్వటం నేరమా?
* కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఇంటికి వెళ్లి పరామర్శించటం మన సాంప్రదాయం కాదా?
* రాజన్న కొడుకుకు జనాదరణ పెరగటం చూసి కాంగ్రెస్ పెద్దలకు కన్నుకుట్టటం నిజంకాదా?
* రాజన్నను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనటానికి ఓదార్పుయాత్ర అద్దం పట్టలేదా?

ప్రభంజనంగా మారిన ఓదార్పు... 
వ్యక్తిగా ఓదార్పు యాత్ర ప్రారంభించిన జగన్ ప్రజల ఆదరాభిమానాల వెల్లువతో ఓ శక్తిగా మారారు. ప్రజల కష్టాలు, కడగండ్లను దగ్గరగా చూసి చలించిపోయి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర వైఎస్‌ను చరిత్రలోనే అరుదైన సంక్షేమపథగామిగా మారిస్తే.. ఓదార్పు యాత్ర జగన్‌ను ప్రజల ఆశలు, ఆకాంక్షలకు నిలువుటద్దంలా మార్చింది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, వారిలో భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకుగాను జగన్‌లో వయసుకు మించిన ఓర్పును, పరిణతిని ఓదార్పు యాత్ర కల్పించింది. వేనవేల కిలోమీటర్ల ప్రయాణంలో కోట్లాది మంది జనం గుండె తలుపులు తట్టిన ఓదార్పుయాత్ర ఇక జగన్‌ది కాకుండా పోయింది. అది ప్రజల ఓదార్పుయాత్రగా మారిపోయింది. ఓదార్పు యాత్రకు లభిస్తున్న ప్రభంజనం కాంగ్రెస్ వృద్ధ జంబూకాల మదిలో కల్లోలం రేపింది.

జగన్ జననేతగా ఎదగటం వారికి ఇష్టం లేకపోయింది. కుట్రలు, కుతంత్రాలు బయల్దేరాయి. కాంగ్రెస్ నేతలు ఈ యాత్ర వద్దన్నారు. అధిష్టానం ఆంక్షలు పెట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ ఓదార్పు యాత్రలో పాల్గొనరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. జగన్‌కు మద్దతుగా నిలబడిన నాయకులపై వేటు పడింది. అయినా జగన్ వెనక్కు తగ్గలేదు. ఓదార్పు ఆగలేదు. అరెస్టయ్యే వరకూ ఆయన యాత్ర సాగుతూనే ఉంది. మొత్తం 13 జిల్లాల్లో 265 రోజుల పాటు సాగిన ఓదార్పు యాత్రలో 494 కుటుంబాలను జగన్ ఓదార్చారు. 18,162 కిలోమీటర్ల మేర ఓదార్పు యాత్ర సాగటం, 5,124 గ్రామాలు, పట్టణాలలో 2,217 సభలు నిర్వహించటం ఓ రికార్డు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారందరినీ తాము పరామర్శిస్తామని, కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండాఅటకెక్కించేసింది.

* జగన్ కోసం ప్రజలు రేయనక పగలనక ఎదురుచూడటం నిజం కాదా?
* ప్రజానాయకుడిగా ఎదుగుతున్న జగన్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కుట్రలు సాగటం, తప్పుడు నివేదికలివ్వటం ఎందుకు?
* ఓదార్పుపై ఆంక్షలు.. జగన్‌ను జనం నుంచి దూరం చేయటానికి కాదా?
* ప్రజలను కదిలించగలిగే నాయకుడిగా జగన్ ఎదగటం కాంగ్రెస్ నేతలకు ఎందుకు కంటగింపయ్యింది?

పథకాల అమలు కోసం నిరంతర పోరాటం
వైఎస్ మరణం తర్వాత.. జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పడుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు గండికొట్టటం ప్రారంభించింది. ఆరోగ్యశ్రీ పథకానికి కోత పెట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరతను తీర్చకుండా, మౌలిక వసతులు కల్పించకుండానే.. 133 జబ్బులను ప్రయివేటు ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించి, ప్రభుత్వాస్పత్రులకు బదలాయించారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆయా జబ్బులకు చికిత్స లభించక రోగులు అల్లాడుతున్నారు. అలాగే.. వేల సంఖ్యలో రోగులకు చికిత్సలకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీకి నిధులూ అరకొరే. అటు లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులపై భరోసా కల్పించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఆంక్షలతో సర్కారు తూట్లు పొడిచింది. ఫీజులు ఏ సంవత్సరమూ సక్రమంగా విడుదల చేయలేదు.

పైగా వయోపరిమితి, ఆదాయపరిమితి, ప్రభుత్వ కాలేజీల్లోనే చదవాలి అంటూ విపరీతమైన ఆంక్షలతో పాటు.. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజులపై పరిమితులు వంటి చర్యలతో మొత్తం పథకం స్ఫూర్తికే తూట్లు పొడిచారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల పథకానికీ సర్కారు ఎసరు పెట్టింది. కొత్తగా పెన్షన్లే ఇవ్వకపోగా ఉన్న వాటినే తొలగించింది. మహిళలకు పావలా వడ్డీ పథకం కాగితాలకే పరిమితమయింది. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చారు. రోజుకు 9 గంటలు విద్యుత్ అందిస్తామన్న వైఎస్ హామీకి పాతరేశారు. కనీసం ఏడు గంటల విద్యుత్ అయినా సరఫరా అవుతుందా అంటే.. రోజుకు రెండు మూడు గంటలు విద్యుత్ వస్తే ఎంతో గొప్పగా మారిపోయింది. వీటిపై జగన్ పోరాటానికి దిగారు.

ఓదార్పు యాత్ర కొనసాగిస్తూనే వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ ఎన్నో దీక్షలు నిర్వహించారు. అన్నదాత కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం 2010 డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో విజయవాడలో కష్ణా నది తీరాన జగన్ లక్ష్యదీక్ష నిర్వహించారు. జగన్‌తో పాటు లక్షలాది మంది రైతులు ఈ దీక్షలో పాల్గొన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి తెలియజెప్పటం కోసం జగన్ 2011 జనవరి 11న దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు వీధిలో జల దీక్ష పేరుతో ఒక రోజంతా నిరశనదీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైలులో వేలాదిమంది రైతులు, నాయకులు ఢిల్లీ తరలివెళ్లారు. నిత్యావసరాల ధరలపై విశాఖలో 2011 జనవరి 22న జనదీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరుతూ 2011 ఫిబ్రవరి 7 నుంచి 10 వరకూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి 88 కిలోమీటర్ల దూరం హరితయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేస్తుండటంపై 2011 ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో వారం రోజుల పాటు జగన్ నిరాహార దీక్ష నిర్వహించారు.

రైతుల సమస్యలపై 2011 మే 15 నుంచి రెండు రోజులు గుంటూరులో, 2012 జనవరి 10 నుంచి 12 వరకూ 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతు దీక్షలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత దీక్ష చేపట్టారు. చిత్తూరులో సాగుపోరు ధర్నా, వైఎస్‌ఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కరెంటు పోరు ధర్నా, విజయవాడలో రైతు సమస్యలపై మహాధర్నా, ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఫీజుపోరు ధర్నా, నరసరావుపేటలో వస్త్రవ్యాపారులకు వ్యాట్ రద్దు డిమాండ్‌తో ధర్నా, మొగల్తూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా.. జగన్ నిర్వహించారు.

* ప్రజా సమస్యల పరిష్కరిం చాలని కోరుతూ ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు దీక్షలు చేయటం ప్రజాస్వామ్యంలో ఒక ఉద్యమ రూపం కాదా?
* జగన్ ఏ సమస్యపై నిరాహార దీక్ష చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం నిజం కాదా?
* వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను ఆయన మరణం తర్వాతి ప్రభుత్వాలు నిర్వీర్యం చేయటం నిజం కాదా?
* ప్రజలు పెద్ద ఎత్తున దీక్షలు, ధర్నాలలో పాల్గొంటుంటే అదే స్థాయిలో జగన్‌పై కుట్రలు, కుతంత్రాలు పెంచటం జగన్‌ను అడ్డుకోవటానికి కాదా?

పొమ్మనకుండా పొగబెట్టిందెవరు?
ఒకవైపు ఓదార్పుయాత్రకు ఆటంకాలు కలిగిస్తూ ఆంక్షలు విధిస్తూనే.. మరోవైపు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని తమవైపు తిప్పుకునే వ్యూహానికి కాంగ్రెస్ తెరతీసింది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు కోరే సాకుతో సోనియాగాంధీ స్వయంగా చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఓదార్పును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న జగన్.. తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల వెంటరాగా ఢిల్లీకి వెళ్లి.. ఓదార్పు యాత్రను కొనసాగించేందుకు సోనియాను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నెల రోజులు నాన్చిన సోనియా తర్వాత ఓదార్పును జిల్లాకో సభకు పరిమితం చేసుకోవాలని ఆంక్షలు పెట్టారు. అయితే ఇచ్చిన మాటను తప్పటానికి సిద్ధంగా లేని జగన్ 2010 జూలై 8న శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు.

జగన్ మద్దతుదారులపై వేటువేస్తూ పార్టీలో జగన్‌ను ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తూనే కుటుంబాన్ని చీల్చేందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించింది. ఇక కాంగ్రెస్‌లో ఉండలేని పరిస్థితులు తీవ్రమవటంతో జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ రాజీనామా చేశారు. చివరకు వైఎస్‌ఆర్ ఆశయ సాధన కోసం, ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేసి పేదప్రజలను ఆదుకోవటం కోసం.. ఆ సంక్షేమ పథకాలే జెండా, ఎజెండాగా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ క్రమంలో వైఎస్ తమ పార్టీ నేతని, ఆ పథకాలన్నీ తమ పార్టీ పథకాలని ప్రచారం చేసుకోవటానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కానీ.. అవి విఫలమవటంతో వైఎస్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంది.

* జగన్ కాంగ్రెస్‌లో ఉండగానే.. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో విలీనం మంతనాలు నిజం కాదా?
* విజయమ్మకు నెల రోజుల వరకూ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటం వైఎస్‌ఆర్ కుటుంబం విషయంలో సోనియా వైఖరి ఎలా ఉందో అద్దం పట్టటం లేదా?
* జగన్ మద్దతుదారులపై వేటు వేయటం, ఆయన కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నించడం జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపటం కోసం కాదా?

కుట్రలను ఛేదించుకుంటూ... 
దివంగతనేత రాజశేఖరరెడ్డి ఆశయాల స్ఫూర్తితో ప్రజాసంక్షేమం కోసం జగన్‌మోహనరెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అడుగడుగునా కుట్రలు, కుతంత్రాల నడుమ ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా విజయపథాన ముందుకుసాగుతోంది. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందారు. 2011 డిసెంబర్‌లో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జగన్‌కు మద్దతిస్తున్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు.

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చినందుకు నిరసనగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి కూడా పదవికి రాజీనామా చేశారు. జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి మెజారిటీతో గెలుచుకుంది. కడప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ సీపీని ఓడించటం కోసం అధికార కాంగ్రెస్, దాని బద్ధశత్రువైన ప్రతిపక్ష టీడీపీలు రెండూ రహస్యంగా చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మరో 9 మంది ఎమ్మెల్యేల వరకూ ఆ పార్టీలను వీడి వైఎస్‌ఆర్ సీపీలో చేరినా ఓటమి భయంతోనే వారిపై అనర్హత వేటు వేయటానికి ఆయా పార్టీలు జంకుతున్నాయి.

* సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చటం వెనక కాంగ్రెస్ కుట్ర ఉందనటం నిజం కాదా?
* కడప ఎన్నికల్లో జగన్‌ను, విజయమ్మను ఓడించటానికి, కనీసం మెజారిటీ తగ్గించటానికి ప్రయత్నించాలని మంత్రులందరినీ మోహరించింది నిజం కాదా?
* లోక్‌సభ ఓటు మీకు, అసెంబ్లీ ఓటు మాకు అంటూ కడప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ రహస్య అవగాహనకు ఎందుకు రావలసి వచ్చింది?.. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఓడించటానికి కాంగ్రెస్, టీడీపీలు పరస్పరం సహకరించుకోవటం నిజం కాదా?

జనం మధ్య ఉన్న జగన్‌ను పిలిచి అరెస్టు... 
2012 జూన్ 12న ఉప ఎన్నికలకు ముందు కుట్రలు మరింత పదునుతేలాయి. మే 28న నేరుగా కానీ, న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకావాలని ఓదార్పుయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి సమన్లు అందాయి. కానీ న్యాయస్థానానికి వెళ్లక ముందే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని జగన్‌మోహన్‌రెడ్డి ఊహించారు. ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ మే 25వ తేదీన తమ ఎదుట విచారణకు రావాలంటూ అంతకు రెండు రోజుల ముందు జగన్‌కు సీబీఐ నోటీసులిచ్చింది. ఎన్నికలు ముగిసే వరకూ సమయమివ్వాలని, జూన్ 12 తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు హాజరవుతానని సీబీఐని జగన్ కోరారు. కానీ సీబీఐ ససేమిరా అంది.

25 నుంచి 27 వరకూ మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించిన సీబీఐ.. కోర్టుకు హాజరు కావటానికి ఒక రోజు ముందు అంటే మే 27 ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జగన్‌ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్‌ను పాల్గొననీయకుండా చేయటం, వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులను గందరగోళ పరిస్తే ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయనే ఇలాంటి కుట్రలు జరిగాయి. కానీ జనం స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఏ కేసులోనైనా 90 రోజుల్లోగా చార్జిషీటు సమర్పించటం, నిందితులపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే బెయిల్ మంజూరు చేయటం చట్టంలోని నిబంధనలు. కానీ జగన్ కేసులో అవన్నీ తారుమారయ్యాయి. ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు విడతల వారీగా చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు.

* ఏడాది పాటు ఏ ఒక్కసారీ జగన్‌ను విచారించని సీబీఐ.. హఠాత్తుగా ఎన్నికల వేళ విచారణకు సమన్లు పంపటం వెనక కుట్ర లేదా?
* ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననీయకుండా జగన్‌ను అరెస్టు చేయటానికి సీబీఐని పురికొల్పటం నిజం కాదా?
* జగన్ ఎంపీ కనుక సాక్ష్యాలను తారుమారు చేస్తారని సీబీఐ అంటోంది? అంటే జగన్ ఇప్పుడే కొత్తగా ఎంపీ అయ్యారా? ఈ కేసు దాఖలై విచారణ కొనసాగిన 9 నెలల కాలంలో కూడా ఆయన ఎంపీనే కదా?
* జగన్‌కు బెయిల్ రాకుండా చేయటం కోసమే విచారణను సాగదీస్తున్నారని, చార్జిషీట్లను ముక్కలు ముక్కలుగా దాఖలు చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదా?

దుష్ర్పచారాన్ని పటాపంచలు చేస్తూ..
తాము అనుకున్న పరిస్థితులు వచ్చేవరకూ జగన్‌ను జనం నుంచి దూరంగా ఉంచాలన్నది అధికార పార్టీ పథకంగా కనిపిస్తోంది. జగన్‌ను నిర్బంధిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఛిన్నాభిన్నమయిపోతుందని, కార్యకర్తలు, నాయకులు మనోస్థయిర్యం కోల్పోతారని ఆశించినవారికి భంగపాటు ఎదురయ్యింది. కొండా సురేఖ దంపతులు దూరమయ్యారని, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని, జలగం వెంకట్రావ్ అసంతృప్తితో ఉన్నారని, దాడి చేరికతో కొణతాల పార్టీని వీడబోతున్నారని రకరకాల ఊహాగానాలు ప్రచారంలో పెట్టి పార్టీని గందరగోళ పరిచేందుకు కాంగ్రెస్, టీడీపీలతో పాటు మీడియాలో ఒకవర్గం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ పటాపంచలవుతున్నాయి.

టీడీపీ ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ.. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడుతున్నది వైఎస్‌ఆర్ కాంగ్రెసేనని ప్రజలు గుర్తించారు. కుట్రలను ఎండగట్టడం, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి రాజన్న రాజ్యం వస్తుందన్న భరోసా కల్పించడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్రను కొనసాగించే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకుని.. ఇటీవలే 2,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించారు.

వైఎస్ కుటుంబంపై సాగుతున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారనటానికి విజయవంతంగా సాగుతున్న షర్మిల
పాదయాత్ర ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నికలు ఏ క్షణాన వచ్చినా కుట్రదారులందరికీ ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయం.


అధికార-ప్రధాన ప్రతిపక్షాలు ఒక్కటై... జేబు వ్యవస్థల సాయంతో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలకు దూరంగా ఉంచి ఏడాది కావస్తోంది. దీని పూర్వాపరాలపై ప్రత్యేక కార్యక్రమం ‘మాట కోసం’ శనివారం రాత్రి 8.20కి సాక్షి టీవీలో..

పింఛను కావాలంటే.. ఆ ఊళ్లో పింఛనుదారులెవరైనా చనిపోతే ఇస్తామనేవారు

* చార్జీలు పెంచింది వైఎస్సేనని, తాను ఏ చార్జీలూ పెంచలేదని బాబు అంటున్నారు
* ఆయన తీరుచూస్తే.. ఫీజులు, ఆరోగ్యశ్రీ, 108 పథకాలు తానే పెట్టాననేట్లున్నారు
* చంద్రబాబు తన పాలనలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు
* బిల్లులు కట్టకపోతే కేసులు పెట్టి జైల్లో వేయించారు
* ఎవరైనా పింఛను కావాలంటే.. ఆ ఊళ్లో పింఛనుదారులెవరైనా చనిపోతే ఇస్తామనేవారు
* అధికారంలో ఉన్న 9 ఏళ్లలో ప్రజలకు ఏమీ చేయని బాబు.. ఇప్పుడు హామీల మీద హామీలిస్తున్నారు

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో రైతుల ఉసురు తీశారు. వ్యవసాయం దండగన్నారు.. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పారు. వృద్ధులు పింఛను కావాలంటే ఆ ఊళ్లో పింఛన్ వచ్చే వాళ్లెవరైనా చనిపోతే ఇస్తానన్నారు. సబ్సిడీ ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారని చెప్పారు. ఆయన పాలనలో తీవ్ర కరువుతో లక్షలాది మంది జనం పొట్ట చేత పట్టుకొని వలస పోయారు. నాడు ప్రజల్ని అంతలా వేధించిన చంద్రబాబు తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల పాదయాత్ర చేశారు. 

ఆ పాదయాత్రను ఇటీవలే అర్ధంతరంగా ముగించుకుని.. మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయనేమంటున్నారంటే.. చార్జీలు పెంచింది వైఎస్సారట.. చంద్రబాబు తన హయాంలో ఏ చార్జీలూ పెంచలేదట.. రైతుల పక్షాన నిలబడ్డారట.. ఆయన వల్లనే ఉచిత విద్యుత్తు సాధ్యమయిందట.. ఇలా చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు.’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘ఆయన తీరుచూస్తే.. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం తానే ప్రవేశపెట్టానని చంద్రబాబు చెప్పినా చెప్తారు. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు తనవే అని కూడా చెప్తారు. చార్మినార్, నాగార్జున సాగర్ తానే కట్టాను అని కూడా ఆయన చెప్పగలరు’’ అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సాగింది. ఉండిలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు
‘‘చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడుకు ఒక మునీశ్వరుని శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు ఆయన తల వెయ్యి ముక్కలవుతుందట. వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇస్తే.. చంద్రబాబు పైన వేలాడుతున్న కరెంటు తీగలను చూపిస్తూ ‘ఉచిత విద్యుత్తు ఇస్తే వాటి మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అని హేళన చేసి మాట్లాడారు. తొమ్మిదేళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచి వాటిని కట్టాలని ఒత్తిడి చేశారు. ‘అయ్యా మేం కరువులో ఉన్నాం.. అప్పుల్లో ఉన్నాం’ అని రైతులు ఎంత మొరపెట్టుకున్నా చంద్రబాబు నాయుడు వినలేదు. వాళ్ల మీద కేసులు పెట్టారు. ప్రత్యేక కోర్టులు పెట్టి రైతులను జైలుకు పంపించే వరకు నిద్రపోలేదు. అవమానాలు తట్టుకోలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. చంద్రబాబు మన రాష్ట్రంలో రైతులను ఇంతగా హింసించారు.

ఎన్నికల తరువాత చంద్రబాబుకు గుర్తుండదు..
చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు ప్రతి మహిళకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానన్నారు. ఆడ పిల్లలు స్కూల్‌కు వెళ్తుంటే వాళ్లకు సైకిళ్లు ఇస్తామని అన్నారు. పాపం ప్రజలు నమ్మి ఓటేసి అధికారం ఇస్తే అన్ని వాగ్దానాల్లో చంద్రబాబు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. చంద్రబాబుకి మాట ఇవ్వడం అంటే ఏమిటో ఆ మీట మీద నిలబడడం అంటే ఏమిటో ఈ జన్మకు అర్థం కాదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఆయనకు ఎన్నికల తరువాత గుర్తుండదు. 

ఇప్పుడేమో మళ్లీ వాగ్దానాలు చేస్తున్నారు. గొప్పగొప్ప వాగ్దానాలు చేస్తున్నారు. ‘అమ్మకు అన్నం పెట్టడు కానీ.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను’ అన్నాడట ఒకడు. అధికారం ఉన్నప్పుడే ఏమీ చేయలేదు కాని ఇప్పుడేమో అన్నీ చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అంటే ప్రజలు అమాయక గొర్రెలని, తాను ఏది చెప్తే అది నమ్ముతారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లున్నారు. ఎన్టీఆర్ గారు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే టీడీపీని స్థాపించారో, అదే కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు కుమ్మక్కైపోయారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ రోజు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐని కలుపుకొని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను నిర్బంధించాయి.

మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది..
అరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్తు, పక్కా ఇళ్లు ఇలా వైఎస్సార్ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి చూపెట్టారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి రూపాయి కూడా చార్జీ పెంచని రికార్డు ముఖ్యమంత్రి వైఎస్సార్. కానీ మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది. ఇప్పుడు మన ఖర్మకొద్దీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి ఇప్పటికే ఎరువుల ధరలు 300 శాతం పెంచారు. ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచారు. మరోవైపు రూ. 305 ఉన్న గ్యాసు ధర రూ. 420కు పెరిగింది. అదీ సబ్సిడీ ఉంటే. సబ్సిడీ లేకుంటే ఒక్క గ్యాసు సిలిండర్‌కు రూ.1,000 పెట్టాల్సిన పరిస్థితి. రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, కరెంటు చార్జీలు.. ప్రతి ఒక్కటీ పెంచేశారు.’’

11.5 కిలోమీటర్ల మేర యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 158వ రోజు శుక్రవారం షర్మిల పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆరేడు గ్రామం నుంచి యాత్ర ప్రారంభించారు. కోలమూరు, పాములపర్రు మీదుగా ఉండి నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలిచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఎన్‌ఆర్పీ అగ్రహారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె 11.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,095.3 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు పేర్ని నాని, మద్దాల రాజేశ్, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, జూపూడి ప్రభాకర్, నేతలు మొవ్వ ఆనంద శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, ముదునూరు ప్రసాదరాజు, స్థానిక నాయకులు ఉమాబాల, మేడిద జాన్సన్ తదితరులున్నారు.

మాట్లాడితే ఢిల్లీకి పరుగెత్తేవాళ్లు...ప్రజానాయకులు ఎలా అవుతారు?

రాజకీయ నాయకులు తమను నమ్మి ఓటు వేసిన ప్రజలను విస్మరించి ఢిల్లీ నేతలను పెద్దలుగా భావించి వారి ఆశీర్వాదాల కోసం వెంపర్లాడినంతకాలం ప్రజానాయకులు కాలేరు. దేశంలోనే మొదటిసారి దివంగత నేత వైయస్సార్ గారు ప్రజలకోసం ఎంత చెయ్యవచ్చో అంతా చేసి చూపించారు. నిస్వార్థంగా ప్రజల మంచి కోరి వారికి సేవ చేసేవారికి ఏ పెద్దల అండా అవసరం లేదని, అలాంటి వారినే ప్రజలు మళ్లీమళ్లీ ఎన్నుకొంటారని రెండవసారి గెలిచి నిరూపించారు. అదే లక్ష్యంతో ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి... ‘ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో సి.ఎం. అయి రావడం’ కంటే... ‘ప్రజల మనిషి’ అని ప్రజల చేత సీల్ వేయించుకోవడం మేలని తలచాడు. ఇప్పుడు ప్రజలు గమనించింది ఏమిటంటే జగన్ కి వచ్చిన కష్టాలు మరి ఏ నాయకులకైనా వచ్చి ఉన్నట్లయితే వారు ఢిల్లీలో కాళ్ల బేరానికి వచ్చేవారని. కాని జగన్ ఒంటరిగా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ప్రజల మనిషిగా నిలబడతానన్నాడు. అతని ధైర్యం చూస్తే ఎవ్వరికైనా కొనియాడాలనిపిస్తుంది. తన ఆస్తులను కాపాడుకొనేవాడైతే జగన్ మరో గులాం నబీ అయ్యుండేవాడు కదా!

ఉదయం లేచింది మొదలు అవినీతి గురించే మాట్లాడే ప్రతిపక్ష నాయకుడు కూడా తనకున్న వేలఎకరాలు, కుప్పంలో ఇజ్రాయిల్ తరహా సేద్యం, బినామీ వ్యాపారాలు, హోటల్‌లు, హెరిటేజ్‌ల గురించి మాత్రం నోరెత్తకపోవడం గురువిందగింజ చందంగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబుగారి యాత్రలు, పర్యటనలు చూస్తుంటే... నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉన్నాయి. ఆయన తన పాదయాత్రలో చిన్నపిల్లలతో మాట్లాడుతూ ‘మీరూ రాజకీయాల్లోకి రండి, నీతిగా ఉండండి, ఎన్టీఆర్ రాజకీయాల్లో నీతిగా ఉండి ఎంతో పేరు గడించారు’ అనడం చూస్తే, ఆయన నీతిగా లేరనేగా అర్థం. పిల్లనిచ్చిన మామను, కుటుంబ సభ్యులను, ప్రజలను నమ్మించి మోసం చేసి, ఇప్పుడు కొత్తగా ‘తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కార్యకర్తలకు ఏమీ చెయ్యలేకపోయాను. 

ఈసారి గెలిపిస్తే మిమ్ములను లక్షాధికారులను చేస్తా’ అంటున్నారు బాబుగారు. ఎలా చేస్తారు? అవినీతిని ప్రోత్సహించా? ఆయన మాటలు, ఆ అసహనం, ప్రజల మధ్య ఆయన ప్రవర్తన చూస్తే చంద్రబాబుకి మతిస్థిమితం గానీ తప్పలేదు కదా అన్న అనుమానం కలుగుతోంది. 63 సంవత్సరాల వయస్సు ఉండి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉండి తోటి వయస్సు గల దివంగత నేత గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు! కుటుంబ సభ్యులతోనే వ్యాపారం చేసే బాబుగారు, ‘ఒక్క అవకాశం ఇస్తే చాలు, మీ ఇంట్లో పెద్దకొడుకుగా ఉంటా’నంటే ప్రజలు ఎలా నమ్ముతారు? 

ఎల్లో మీడియా కూడా చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోలేదు. మన దౌర్భాగ్యంఏమిటంటే ప్రజాశ్రేయస్సు కోరవలసిన ఆ రెండు పత్రికలు తమ సొంత లాభం కోసం, తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం, అసత్యాలు ప్రచారం చేయడం! అభూత కల్పనలను, ఊహలను వార్తలుగా నమ్మించి, జగన్‌పై వ్యతిరేకతను కలిగించే ప్రయత్నం చేయడం. పనికిమాలిన వార్తలతో జగన్‌కు జనాన్ని దూరం చేయాలన్నది వారి ఎత్తుగడల్లో ఒకటి. 

కాని ప్రజలు అమాయకులు కారు. అదేదో సినిమాలో అన్నట్లు వారు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’. ‘ముప్పైఏళ్లుగా మీరు రాస్తున్న వార్తల్లో ఏది నిజమైన వార్తో, ఏది బ్లాక్‌మెయిల్ వార్తో కనిపెట్టలేమా?’ అంటున్నారు. చివరగా... రాజకీయనాయకులు కాని, పత్రికలు కాని అర్థం చేసుకోవలసినది ఏమిటంటే... ఒకసారి ప్రజలు మైండ్‌లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్‌గా వెళ్లిపోతారంతే. వైయస్సార్ ప్రజల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అవి నిరాటంకంగా కొనసాగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. ప్రజలు ఇలాగే ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇలాగే జరుగుతుంది. 

- సాయిలక్షి్ష్మ, నెల్లూరు

కాంగ్రెస్‌కు చేసిన ఉపకారానికి కాంగ్రెస్ చేసిన ప్రత్యుపకారం ఇదా!

మనసున్న మారాజు డా॥తన రెక్కల కష్టంతో... రేయనక, పగలనక సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొంటూ, వారిలో ఒకరిగా కలిసిపోయి రాష్ట్రంలో జీర్ణావస్థలో ఉన్న కాంగ్రెస్‌పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెప్పించారు. అందుకు ‘ప్రత్యుపకారంగా’ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆయన తనయుడిని ఏడాదికాలంగా నిర్బంధించి వేధిస్తోంది! తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖాన్ని దిగ మింగుకొని, మీకోసం నేనున్నానంటూ నల్లకాలువ వద్ద ప్రజలకిచ్చిన మాటకోసం జగన్‌గారు ఓదార్పుయాత్ర ప్రారంభిస్తే, అది చూసి సహించలేక, ఆయనపై వర్షిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక పాలక, ప్రతిపక్షాలు రెండూ కలసి జనహృదయ యువనేతపై విషపు జ్వాలలు చిమ్ముతున్నారు. అయినా సూర్యుడిపైన ఉమ్మివేస్తే ఏమౌతుంది? తిరిగొచ్చి ఉమ్మినవారి మీదే పడుతుంది. ఈ వాస్తవం మన కుటిలనేతలకు తెలిసేరోజు దగ్గర్లోనే ఉంది. తల్లి విజయమ్మగారు, వదిన భారతిగారు, చెల్లి షర్మిలమ్మ కన్నీటి మంటలే వారిని దహించి వేస్తాయి. త్వరలోనే జగనన్న బయటకు వచ్చి, రాజన్న సువర్ణ పాలనను మనకు అందించాలని మనసారా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. 

- ఎ. శ్రీనివాస్‌రాజు, కరీంనగర్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com

26న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ ఆవిర్భావ దినోత్సవం

వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ నిర్వహిస్తున్నట్టు యూనియన్ అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా యూనియన్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 159వ రోజు శనివారం 11.1 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఉండిలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీకి చేరుతుందని పేర్కొన్నారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు.

పర్యటించే ప్రాంతాలు :
మహదేవపట్నం అడ్డరోడ్డు, నరసింహపురం, భీమవరంలోని
ఉండి రైల్వేగేటు, పాత బస్టాండ్, ప్రకాశం చౌక్,
కొత్త బస్టాండ్, హౌసింగ్ బోర్డు కాలనీ

మే 28న ఇందిరాపార్క్ వద్ద విజయమ్మ దీక్ష!

హైదరాబాద్: జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మే 28 తేదిన హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నట్టు వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు వెల్లడించారు. 28 తేది మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను విజయమ్మ కొనసాగిస్తారని వైఎస్ఆర్ సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. విజయమ్మ దీక్షకు మహానేత వైఎస్ఆర్ అభిమానులు, జననేత వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలుపాలని పార్టీ నాయకులు విజ్క్షప్తి చేశారు.

జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా 27న ర్యాలీ!

 ఏడాది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భంధించిన తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాకు తరలి రావాలని వైఎస్ భారతి పిలుపునిచ్చారు. మే 27 తేది సోమవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీ, మౌన ప్రదర్శన కార్యక్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొనాలని వైఎస్ భారతి విజ్ఞప్తి చేశారు. జగన్ కు బాసటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు కొవ్వొత్తితో తరలిరావాలి అని అభిమానులను వైఎస్ భారతీ కోరారు.

నీరు బంద్,అభివృద్ధి బంద్, ప్రజలకు మనశ్శాంతి బంద్..

Written By news on Friday, May 24, 2013 | 5/24/2013

కిరణ్, చంద్రబాబు లపై దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల శుక్రవారం నిప్పులు చెరిగారు. కిరణ్ సర్కారుతో ప్రతిపక్షనేత చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఉండి చేరిన ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట శాసనసభలో అవిశ్వాసానికి మద్దతు పలికి ఐఎంజీ,ఎమ్మార్ కేసుల విచారణ లేకుండా చంద్రబాబు అమ్ముడుపోయారని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేధం అమలు చేస్తే, ఆయనకు వెన్నుపోటుపోడిచి అడ్డదారులు తొక్కి సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. బాబు హయాంలో మళ్లీ బెల్ట్ షాపులు తెరిపించారన్నారు. చంద్రబాబు నాయకుడా లేక ఊసరవెల్లా ఆని షర్మిల ప్రశ్నించారు. 

ఎరువుల ధరలు కిరణ్ ప్రభుత్వమే పెంచిందని తెలిపారు. కిరణ్ సర్కారు కారణంగా వ్యవసాయానికి నీరు బంద్, రాష్ట్రానికి అభివృద్ధి బంద్, ప్రజలకు మనశ్శాంతి బంద్ అని అన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక వడ్డీలేని రుణం అందిస్తామని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే వైఎస్ ఆర్ అమ్మ ఒడి పథకాలతో ఆదుకుంటారన్నారు. 70 లక్షల మంది ప్రజలను పిచ్చోళ్లు చేసి చిరంజీవి కాంగ్రెస్ లో చేరారని షర్మిల ఎద్దేవా చేశారు.

నిమ్స్ లో ఇద్దరు నేతలకు విజయమ్మ పరామర్శ!

అనారోగ్యంతో నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు వైఎస్ఆర్ సీపీ నేతలను శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు సిద్ధార్ధరెడ్డి, కాంతారెడ్డిలు కొద్ది రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకుని నిమ్స్ ఆస్పత్రికెళ్లి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. దాంతోపాటు నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో రోగుల ఆరోగ్య పరిస్థితిని వైఎస్ విజయమ్మ అడిగి తెలుసుకున్నారు. 

గంపెడు ఆశలతో...రాష్ట్రం నిరీక్షిస్తోంది

పవిత్ర భారతావనిలో సమస్త మానవాళికీ న్యాయం, ధర్మం, స్వేచ్ఛ సమంగా వర్తించాలని మన రాజ్యాంగం నిర్దేశించింది. కాని నేడు సాగుతున్నది నిరంకుశ పాలన. మూడు నెలలు దాటితే ఏ వ్యక్తికైనా నిబంధన ప్రకారం బెయిల్ ఇచ్చి తీరాలి. కాని జగన్ విషయంలో మూడు నెలలు దాటి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా బెయిల్ రాకుండా కేంద్రం, సీబీఐ దోబూచులాడుతున్నాయి. జగన్ బెయిల్‌ను అడ్డుకుంటున్నాయి. మన పుణ్యభూమిలో ఒక మహిళ కంటతడి పెట్టుకుంటే దేశానికి సౌభాగ్యం ఉండదు. 

ఇది యదార్థం. మన పురాణాలు కూడా ఇదే ఘోషిస్తున్నాయి. భర్తను పోగొట్టుకుని, కొడుకు జైలుపాలై విజయమ్మ పడుతున్న క్షోభ ఊరికేపోదు. నాడు కురుసభలో ఎందరో వృద్ధులు, ఆచార్యులు, మహావీరులు తమ ముందు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లారా చూసి, మౌనంగా ఉండిపోయారు. ఫలితమే మహా సంగ్రామం. ఆ సంగ్రామంలో కురు సామ్రాజ్యం నాశనమైపోయింది. ధర్మజ్ఞులైన పాండవులు విజయం పొందారు. నేడు ఇదే జరగబోతోంది. ప్రభుత్వంలోను, ప్రతిపక్షంలోను, కేంద్రంలోను ఎందరో న్యాయకోవిదులు, పెద్దలు ఉండి కూడా నేడు జగన్‌కు జరుగుతున్న ఘోరమైన అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. రేపు ఇదే పరిస్థితి తమకు వస్తే ఏమిటి? అని వారు కాస్త ఆలోచించి ఈ కేసుకు ముగింపు చూసి, ఒక నిరపరాధిని బయటకు తీసుకురావాలి. గౌరవనీయులు, దేశ ప్రథమపౌరులు అయిన రాష్ట్రపతి కలుగజేసుకుని ఈ అన్యాయాన్ని ఆపవలసిందిగా కేంద్రానికి, సీబీఐ వారికి గట్టి సూచనలివ్వాలని ప్రజలు కోరుతున్నారు.

జగన్ ఏనాడైనా మంత్రి పదవిలో ఉన్నారా? ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారా? ఏరోజైనా సచివాలయం గుమ్మం ఎక్కారా? ఏ మంత్రితోనైనా లాలూచీ పడ్డారా? ఆయన ఒక మహానాయకునికి, ప్రజల ఆరాధ్య దైవమైన వైఎస్సార్‌కి జన్మించడం తప్పా? ఆయన చేసిన నేరమేంటి అని ప్రజలు అడుగుతున్నారు. నిరూపించి తగిన శిక్ష విధించవచ్చు కదా. తండ్రి మరణం తర్వాత ప్రజలకిచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం న్యాయం కాదా? ప్రజలను కలుసుకుని వారిని పరామర్శించడం తప్పా? మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడం నేరమా? 

నా వయసు 70. ఎన్నో ప్రభుత్వాలను, నాయకులను, ముఖ్యమంత్రులను చూశాను. ఇంతటి నీతిమాలిన, నిరంకుశ పాలనను, పాలకులను చూడలేదు. ఈ కుటిల పాలకులకు భగవంతుడు తగినశిక్ష వేయాలని; దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. ఇటీవల మంత్రి ఆనం, కేంద్ర మంత్రి కోట్ల కారుకూతలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెపుతారు. పునరపి జననం, పునరపి మరణం. నాయకులు వస్తారు, పోతారు. చేసిన మంచి పనులు శాశ్వతం. రాజన్న కీర్తి సంపాదించి దివికేగిన పుణ్యమూర్తి. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న జగన్‌ని ప్రజలు గత ఎన్నికల్లో అఖండ మద్దతుతో గెలిపించారు. రాబోయే ఎన్నికల రణరంగంలోను ముసలి కాంగ్రెస్‌కు, దాని చేతికింది టీడీపీకి గుణపాఠం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలాగే జగన్ సీఎంగా వచ్చి రాష్ట్రంలో నేడున్న ఘోర పరిస్థితులను చక్కదిద్దుతారని నమ్ముతున్నారు. జగన్ త్వరలోనే జైలు నుండి వస్తారని, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని గంపెడు ఆశలతో యావత్‌రాష్ర్టం నిరీక్షిస్తోంది.

- ఎ.సాంబమూర్తి, చిన అమిరం, భీమవరం 

ఇది రాజకీయ కుట్ర కాదా?

రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల రాజకీయ మనుగడకు పెను సవాల్ విసిరిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైలు గోడల మధ్య నిర్బంధించి వేధిస్తుండటం వెనుక ఢిల్లీ స్థాయిలో రాజకీయ కుట్ర ఉందని అడుగడుగునా తేటతెల్లమవుతోంది. స్వయంగా కాంగ్రెస్ నాయకుల నోటి నుంచే ఈ విషయం పలుమార్లు బయటపడింది.

‘‘జగన్ సంవత్సరం ఆగి ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చేది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు. జగన్ తొందరపాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత నష్టం వాటిల్లింది. ఈ విషయంలో జగన్‌కే ఎక్కువ నష్టం కలుగుతోంది.’’ - కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ 2012 ఉప ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలివి. అంటే.. జగన్ కాంగ్రెస్‌లోనే కొనసాగి వుంటే.. ఆయనకు ‘కష్టాలు’ ఉండేవి కావని.. పైగా కేంద్ర మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాళ్లమని పరోక్షంగా చెప్పటం కాదా?

ప్రముఖ జాతీయ వారపత్రిక ‘ఇండియా టుడే’ 2012 జూన్ 12వ తేదీ నాటి సంచికలో.. జగన్ అరెస్టుకు ముందు ‘ఢిల్లీలో జరిగిన పరిణామాలను’ పూసగుచ్చినట్టు వివరించింది కూడా. ‘‘హైదరాబాద్‌లో జగన్‌ను సీబీఐ ప్రశ్నిస్తుండగా.. ఢిల్లీలో ముఖ్య నాయకుల మధ్య ముమ్మరంగా మాటామంతీ నడిచింది. జగన్ కోర్టుకు హాజరు కావటానికి ముందు రోజైన మే 27 ఉదయం ఆజాద్ వెళ్లి సోనియాను కలిశారు. అంతే! అదే రోజున కొన్ని గంటలు గడిచేసరికల్లా ‘జగన్‌ను అరెస్టు చేయండి’ అంటూ ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చేశాయి’’ అని వెల్లడించింది. ఇంతకంటే ఏం తార్కాణం కావాలి?!

ఆ 26 జీవోలపై నిగ్గుతేల్చరేం?!
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. ప్రభుత్వం ద్వారా ‘లబ్ధి’ పొందిన వారు.. అందుకు ప్రతిఫలంగా(క్విడ్ ప్రో కో) జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. అంటే.. వారు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొంది ఉండాలి. వారికి ప్రాజెక్టులు ఇస్తూ విడుదలైన 26 జీవోలు తప్పయి ఉండాలి. సీబీఐ ముందు ఈ విషయాన్ని తేల్చాలి. ఆ జీవోల్లో ఉన్న అక్రమాలను నిగ్గుతేల్చాలి. ఇది తేల్చాలంటే ఆ జీవోలు ఇచ్చిన ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్‌లను విచారించాలి. కానీ సీబీఐ తొలి చార్జిషీటు వేసేదాకా ఆ మంత్రులు, ఐఏఎస్‌లలో ఒక్కరిని కూడా విచారించలేదు. దీనిపై నెల్లూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ వేయగా.. ఆ కోర్టు కొట్టివేసింది. హైకోర్టుకు వెళ్తే అక్కడా పిటిషన్‌ను కొట్టివేశారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లగా.. ఆ మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లో సమాధానమివ్వాలని స్పష్టంచేసినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అనంతర కాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో సీబీఐ మంత్రుల దిశగా కదిలింది. ఒక మంత్రిని అరెస్టు చేసింది.

బాబుకు ఊరట దక్కే వరకూ...
కేసుల్లో ఉన్న వ్యక్తులను బట్టి సీబీఐ దర్యాప్తు తీరు ఎలా ఉంటుందనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు మరో ఉదాహరణ. జగన్ సంస్థల్లో పెట్టుబడులపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు వచ్చిందే తడవుగా.. ఆగమేఘాలపై రంగంలోకి దూకి రెండు వారాల్లో 100 మందిని విచారించి, నివేదిక సమర్పించిన సీబీఐ.. చంద్రబాబు ఆస్తులు, అక్రమాలపై ప్రాథమిక దర్యాప్తునకు అదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల విషయంలో మాత్రం అత్యంత తాపీగా వ్యవహరించింది. కోర్టు ద్వారా బాబు ఊరట పొందేవరకూ నెల రోజులకుపైగా వేచిచూసింది.

టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతి, అక్రమాస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. చంద్రబాబు, ఆయన బినామీలు అక్రమాలకు పాల్పడ్డట్లు తమ ముందున్న ఆధారాలను దృష్టిలో ఉంచుకుని.. దీనిపై ప్రాథమిక దర్యాప్తు చేయాలని సీబీఐని, ఈడీని ఆదేశిస్తూ 2011 నవంబర్ 14న తీర్పు చెప్పింది. సీబీఐ రోజులు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయింది. ఈలోగా సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ దశలో జోక్యం చేసుకోవటానికి నిరాకరించిన సుప్రీం.. హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. దీంతో బాబు, రామోజీ, నామా నాగేశ్వరరావులు వెకేషన్ పిటిషన్‌లు వేశారు. వీటిలో అనూహ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంప్లీడ్ అయింది. అనేక నాటకీయ మలుపుల తర్వాత.. బాబు తదితరులపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 13న ఆదేశాలు జారీచేసింది.

ఇద్దరి స్క్రిప్టూ రచించింది ‘ఈనాడు’ రామోజీరావా?

- వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు
- కిరణ్, బాబు ఒకే రోజు ఒకేలా మా పార్టీపైన,‘సాక్షి’పైన అక్కసు వెళ్లగక్కారు
- ఇద్దరి స్క్రిప్టూ రచించింది ‘ఈనాడు’ రామోజీరావా?
- కిరణ్, బాబులతో చిలుక పలుకులు పలికించేదెవరు?
- మీ తప్పులను ఎత్తి చూపడమే ‘సాక్షి’ చేసిన తప్పా?
- కిరణ్, బొత్సలు చానళ్లు పెట్టడానికి డబ్బెక్కడిది?

సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ముఖ్యనేతలు ఒకేరోజు ఒకేలా వైఎస్సార్ సీపీపైన, ‘సాక్షి’పైన అక్కసు వెళ్లగక్కారు. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, విలేకరుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేలా మాట్లాడారు. కిరణ్ స్క్రిప్టు చంద్రబాబు చదివారా? లేక చంద్రబాబు స్క్రిప్టు కిరణ్ చదివారా? లేదా వీరిద్దరూ ‘ఈనాడు’ రామోజీరావు రచించిన స్క్రిప్టు చదివారా? కిరణ్, చంద్రబాబుల చేత చిలుక పలుకులు పలికించేదెవరు?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలందరూ.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని పల్లెత్తు మాట విమర్శించకుండా ప్రజాపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీని తూలనాడటానికే సమయం వెచ్చించారని తెలిపారు. అదే విధంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు, చంద్రబాబు హయాంలో కుంభకోణాలను వెలుగులోకి తీసుకొస్తున్నందుకే ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతున్నారా? అని గట్టు ప్రశ్నించారు. మీ తప్పులను ఎత్తిచూపడమే ‘సాక్షి’ చేసిన తప్పా? అని అడిగారు. నాణేనికి రెండో కోణాన్ని చూపుతున్నందుకు ఎల్లో మీడియా మొత్తం జట్టుగా ఏర్పడి ‘సాక్షి’పై విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

మీ చానళ్లు, పత్రికల అడ్రసేంటి?
రెండు న్యూస్ చానళ్లను, ‘కృష్ణా పత్రిక’ అనే దినపత్రికను నడిపించడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని గట్టు ప్రశ్నించారు. ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిరణ్ నడిపిస్తున్న పత్రిక ఏ అక్రమ పుత్రికనో ఆయనే స్పష్టం చేయాలన్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ న్యూస్ చానెల్ కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడిదో బయటపెట్టాలన్నారు. కిరణ్, బొత్సలు న్యూస్ చానెళ్లు, పత్రికలు కొనుగోలు చేస్తున్నా వాటిపై విచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏనాడూ ప్రశ్నించరన్నారు. అదే విధంగా చంద్రబాబు బినామీలైన రామోజీ, రాధాకృష్ణల మీడియా సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై సీఎం కిరణ్ విచారణ జరపరని అన్నారు. ఈ మేరకు ఇద్దరూ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారని గట్టు వెల్లడించారు. ఇద్దరూ కలిసి వారి లోపాలు బయటపడకుండా మంచి నటనతో రక్తికట్టిస్తున్నారన్నారు.

మంత్రి ఆనం మానసిక ఉన్మాది
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక మానసిక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ పిచ్చికూతలు కూస్తున్నారని గట్టు మండిపడ్డారు. ఆనం సోదరులు పచ్చి అవకాశవాదులని దుయ్యబట్టారు. మంత్రి ఆనం శాడిస్టు అయితే, ఆయన సోదరుడు వివేకానంద పగటి వేషగాడంటూ నిప్పులు చెరిగారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే వీరు పిచ్చికూతలు కూసేవారా? అని ప్రశ్నించారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని వెక్కివెక్కి ఏడ్చిన మంత్రి ఆనం.. ఇప్పుడు అధికారకాంక్ష, అవకాశవాదంతో హీనంగా మాట్లాడుతున్నారన్నారు. ఆనం సోదరుల చరిత్రేంటో నెల్లూరు జిల్లా ప్రజలకు బాగా తెలుసన్నారు. ‘‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుమారుడు తన పరీక్ష రాయకుండా ఇతరుల చేత రాయిస్తూ గతంలో అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో పత్రికలు పెద్దపెద్ద అక్షరాలతో ‘చీడ పురుగా, పేడ పురుగా’ అంటూ కథనాలు వెలువరించాయి. మరి అలాంటి చీడ పురుగును కన్న తండ్రిని ఏ పురుగుతో పోల్చాలి’’ అని గట్టు ధ్వజమెత్తారు.

ఆ నోట్లు ముద్రించమన్నది నీవే కదా బాబూ!
అబద్ధాలను చాలా అందంగా, కనురెప్ప కొట్టకుండా చెప్పగల నేర్పరి చంద్రబాబు అని గట్టు విమర్శించారు. రూ.వెయ్యి, రూ.500 నోట్లు వెలువడడానికి ముఖ్యకారణమైన చంద్రబాబే వాటిని తొలగించడానికి ఉద్యమం చేస్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఎన్డీయే హయాంలో చక్రం తిప్పిన చంద్రబాబు పట్టుబట్టి రూ.వెయ్యి, రూ.500 నోట్ల ముద్రణకు ఒప్పించారని తెలిపారు. 

అదే విధంగా రాజకీయాలను ఆర్థికమయం చేసి, అత్యంత హీనంగా భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబే అని వివరించారు. దొంగనోట్ల ముద్రణ, నకిలీ స్టాంపులు మొదలు అనేక కుంభకోణాల్లో చంద్రబాబు హస్తముందని, అయితే అవి వెలుగులోకి రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల సందర్భంగా చిత్తూరులో టీడీపీ నేత హరిబాబు వాహనంలో దొరికిన రూ.7 కోట్లు చంద్రబాబువే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ దానిపై విచారణ చేయడం లేదేమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల నేతలు ఒకరికొకరు సహకరించుకుంటూ పూర్తిగా కలిసిపోయారని గట్టు విమర్శించారు.

మాకు చిత్తశుద్ధి ఉంది...

* అందుకే వాటిని మా జెండాలో పెట్టుకున్నాం 
* సీఎం కిరణ్ వ్యాఖ్యలకు దీటుగా జవాబిచ్చిన షర్మిల 
* ఆ పాత పథకాలనే అమలు చేస్తామని ప్రజలకు చెబుతారా అని సీఎం అడుగుతున్నారు
* వాటిని మరింత మెరుగ్గా అమలు చేస్తామని, వైఎస్సార్ అమ్మ ఒడి లాంటి అద్భుత పథకాలనూ పెడతామని మేం చెప్తున్నాం
* అవన్నీ కాంగ్రెస్ పథకాలని సీఎం అంటున్నారు..అలాగైతే ఇతర రాష్ట్రాల్లో లేవేం?
* మీ పార్టీ పథకాలైతే.. రాష్ట్రంలో సక్రమంగా అమలుచేయట్లేదేం?
* ఫీజులు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీలకెందుకు తూట్లు పొడుస్తున్నారు?
* వైఎస్ హామీ ఇచ్చిన 9 గంటల ఉచిత కరెంటు, 30 కిలోల బియ్యం ఎందుకు ఇవ్వట్లేదు?

‘‘వైఎస్సార్ ప్రతి పథకానికీఈ ప్రభుత్వం తూట్లు పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం తాను పెట్టిన ఓ పథకాన్ని మాత్రం చాలా బాగా అమలు చేస్తోంది. అది ఏంటంటే చార్జీలు పెంచే పథకం. అన్నింటి ధరలూ పెంచే పథకం.’’ 
*- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ మాకు ఆదర్శం, ఆయన ఆలోచనా విధానమే మాకు మార్గదర్శకం. ఆయన అమలు చేసి చూపెట్టిన పథకాలే మాకు స్ఫూర్తి. అందుకే వైఎస్సార్ పథకాలను మా జెండాలో పెట్టుకున్నాం. వైఎస్సార్ పథకాలు మా హక్కు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె ఇలా దీటుగా జవాబిచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో సాగింది. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

మాకు చిత్తశుద్ధి ఉంది...
‘‘మేం మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలో వైఎస్సార్ అమలు చేసిన పథకాలన్నీ పెట్టుకున్నాం. దీని మీద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఆ పాత పథకాలే అమలు చేస్తామని ప్రజలకు చెబుతారా? అని ఆయన అడుగుతున్నారు. అవి కాంగ్రెస్ పథకాలు కావు కనుక, రాజశేఖరరెడ్డి పథకాలే కనుక, వాటి మీద మాకే హక్కుంది కనుక, వాటిని మా జెండాలో పెట్టుకున్నాం. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పిన ప్రతి మేలూ చేశారు. చెప్పని మేళ్లు కూడా ఎన్నో చేశారు. మేం కూడా వైఎస్సార్ పథకాలను ఇంకా మెరుగుపరిచి అమలు చేయడమే కాకుండా, వైఎస్సార్ అమ్మ ఒడి లాంటి అద్భుత పథకాలను కూడా అమలు చేస్తామని చెప్తున్నాం. మాకు అమలు చేసే చిత్తశుద్ధి ఉంది. మేం ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతామని ప్రజలకు విశ్వాసం ఉంది. అదీ వైఎస్సార్‌కు, జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న విశ్వసనీయత.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవే?
నిన్న ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు. వైఎస్సార్ అమలుచేసి చూపెట్టిన పథకాలు వైఎస్సార్‌వి కావట. అవన్నీ కాంగ్రెస్ పార్టీవట. మరి అవన్నీ కాంగ్రెస్ పార్టీవైతే.. ఆ పార్టీ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదో ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాలి. మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడదాం. సరే.. ఇవన్నీ కాంగ్రెస్ పథకాలే అయితే వాటిని రాష్ట్రంలో ఎందుకు సక్రమంగా అమలుచేయడం లేదో సమాధానం చెప్పాలి. వైఎస్సార్ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన ‘జలయజ్ఞం’ ప్రవేశపెడితే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను అటకెక్కించిన మాట నిజమా? కాదా? అని అడుగుతున్నాం.

అది వైఎస్సార్ పెద్ద మనసు..
వైఎస్సార్ రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారు. వైఎస్సార్ ఈ రోజు బతికే ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి చూపించేవారు. ఇప్పుడున్న ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి తొమ్మిది గంటలు కాదు కదా.. వైఎస్సార్ ఇచ్చి చూపించిన 7 గంటలు కాదు కదా.. కనీసం మూడు గంటలు కూడా ఇవ్వలేక పోతున్నారన్న మాట నిజమా? కాదా? పేదవారు కూడా పెద్దాసుపత్రికి పోయి రూ. లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా చేయించుకోవాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఇప్పుడున్న సర్కారు ఆ పథకం నుంచి 133 వ్యాధులను, 97 ఆసుపత్రులను తొలగించిన మాట నిజం కాదా? సీఎం సమాధానం చెప్పాలి. ఇంత అనవసరం. ఒకే ఒక మాట చెప్తాను. చెవిటి, మూగ పిల్లలకు సంజీవని లాంటి ‘కాక్లియర్ ఇంప్లాంటేషన్’ అనే ఆపరేషన్ చేస్తారు. దీనికి రూ. 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వైఎస్సార్ 12 ఏళ్ల వరకు పిల్లలకు ఈ ఆపరేషన్ చేయించుకునే అవకాశం కల్పిస్తే, ఈ ప్రభుత్వం దాన్ని రెండేళ్ల వయసుకు కుదించేసిన మాట వాస్తవమో.. కాదో.. కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాలి. రెండేళ్ల పిల్లలకు చెవిటి, మూగ ఉందో.. లేదో.. కూడా తెలుసుకోవడం కష్టం. వైఎస్సార్ మనసు ఎంత పెద్దదో.. కిరణ్‌కుమార్‌రెడ్డి మాట ఎంత చిన్నదో స్పష్టంగా ఇక్కడే అర్థమవుతోంది.

ఫీజుల పథకానికి ఆంక్షలు..
‘పేదలు చదివితేనే పేదరికం పోతుంది. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి.. ప్రభుత్వమే మిమ్మల్ని ఉచితంగా చదివిస్తుంద’ని వైఎస్సార్ భరోసా ఇస్తే.. లక్షల మంది విద్యార్థులు పెద్ద చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి సగం ఫీజు ఇస్తాం.. మూడో వంతుఇస్తాం.. అని భిక్షం వేసినట్టు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలని, లేకపోతే 10 వేల లోపు ర్యాంకు రావాలని ఆంక్షలు పెడుతున్నారు. లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఎంసెట్ రాస్తుంటే 10 వేల లోపు ర్యాంకు ఎంతమందికి వస్తుందో మీకు తెలియదా కిరణ్‌కుమార్‌రెడ్డీ? వైఎస్సార్ లక్షలకొద్దీ పక్కా ఇళ్లను కట్టారు. మరి ఈ కిరణ్ సర్కారు పక్కా ఇళ్లకు పాడె కట్టిన మాట నిజమా కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, వైఎస్సార్ వచ్చాక 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. అంటే 55 లక్షల మందికి అదనంగా పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్‌కు అంత పెద్ద మనుసు ఉంది. మరి మీరేమో.. ఉన్న పింఛన్లను తొలగిస్తున్న మాట వాస్తవమా కాదా?

రూ. 1,800 ఎక్కడ.. రూ. 24 వేలు ఎక్కడ: వైఎస్సార్ బతికే ఉంటే ఈ రోజు పేదలకు 20 కిలోల బదులు 30 కిలోల బియ్యం వచ్చేవి. ఇప్పుడు కిలో బియ్యం రూ.40 ఉంది. ఈ లెక్కన ప్రతి పేద కుటుంబానికీనెలకు రూ.400 మిగిలేవి. ఏడాదికి రూ.4,800 మిగిలేవి. వైఎస్సార్ బతికి ఉంటే ఇవి ఐదేళ్ల పాటు ప్రజలకు అందేవి. అంటే కనీసం రూ.24 వేల వరకూ ప్రజలు లబ్ధిపొందేవారు. 

మరి ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి 30 కిలోల బియ్యం ఇవ్వకుండా 20 కిలోల బియ్యాన్నే ఒక రూపాయి తగ్గించారు. ఈ లెక్కన ఆయన నెలకు మిగిలిస్తుంది కేవలం రూ.20. అమ్మ హస్తం పథకంతో ప్రజలకు రూ.100 దాకా ఆదా చేస్తున్నాను అని సీఎం అంటున్నారు. సరే అమ్మహస్తం కింద రూ.100, 20 కిలోల బియ్యానికి రూ.20.. కలిపి నెలకు ఆయన రూ.120 మిగిలిస్తున్నారు అనుకుందాం. అది కూడా ఎన్నికలు వచ్చిన ఈ సంవత్సరం ఆఖరిలో ఈ పథకం పెట్టారు. దాన్ని 15 నెలల పాటు ఇస్తారు అనుకుంటే ఆయన ఓ కుటుంబానికి మిగిలిస్తున్న మొత్తం రూ.1,800. మరి వైఎస్సార్ బతికి ఉంటే ఇచ్చే రూ.24 వేలు ఎక్కడ? ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇస్తున్న రూ.1,800 ఎక్కడ? కిరణ్‌కుమార్‌రెడ్డీ మీరు లెక్కల గారడీ చేస్తున్న మాట వాస్తవమో? కాదో? చెప్పాలి.

11.2 కిలోమీటర్ల మేర యాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ 157వ రోజు గురువారం షర్మిల పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని జెల్లికొమ్మర నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి వెలగపల్లి, వరదరాజుపురం, గొల్లలదిబ్బ, గణపవరం, సరిపల్లె గ్రామాల మీదుగా ఉండి నియోజకవర్గంలోని ఆరేడు గ్రామం వరకు యాత్ర చేశారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 11.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,083.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, ఎమ్మెల్సీ మేకాశేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరు ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, నాయకులు మొవ్వ ఆనంద శ్రీనివాసు, స్థానిక నాయకులు గాదిరాజు సుబ్బరాజు, నౌడు వెంకటరమణ, వగ్వాల అచ్యుత రామయ్య, గంట ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రతి రోజు షర్మిల వెంట నడుస్తున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపుభారతి, డాక్టర్ హరికృష్ణ ఉన్నారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 158వ రోజు శుక్రవారం 11.5 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆరేడులో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి ఉండి గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు. అక్కడ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు.

పర్యటించే ప్రాంతాలు :
కొండేపూడి అడ్డరోడ్డు, కోలమూరు, పాములపర్రు, ఉండి

మెగా జల్సా!

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=62796&subcatid=0&categoryid=28


ప్రజాధనం వినియోగంపై బాద్యతయుతంగా వ్యవహరించాల్సిన నేతలే నిబంధనలను గాలికి వదిలేశారు. అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు దంచే చిరంజీవి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వెలుగులోకి రావడం అందర్ని షాక్ కు గురిచేసింది. కేంద్ర మంత్రి హోదాలో హైదరాబాద్ లో నిర్వహించిన టూరిజం సదస్సుకు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేక విమర్శలకు చోటిచ్చింది.

ఇటీవల దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు హైదరాబాద్‌లో వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ కాన్ఫరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది . టూరిజం వంకతో స్వామి కార్యం స్వకార్యాన్ని టూరిజం శాఖ మంత్రి చిరంజీవి రెండు నెరవేర్చుకున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. సమాచార హక్కు చట్టంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

భారత్‌లో టూరిజం అభివృద్ది పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో కేంద్ర మంత్రి చిరంజీవి ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు పెట్టారు. కొత్తగా పదవిలోకి వచ్చాక చిరు హడావుడి తీవ్రమైంది. అందుకు నిదర్శనమే హైదరాబాద్‌ సదస్సు ఖర్చు. శాఖను ప్రమోట్‌ చేస్తున్నట్టు కలరిస్తూనే వ్యక్తిగతంగానూ తనను తాను ఫేమ్‌ చేసుకునేందుకు అమాత్యులు పెట్టిన ఖర్చు చర్చనీయాంశమైంది. టూరిజం అభివృద్ధి సంగతేమోగాని 3 రోజుల్లోనే 2 కోట్ల 14 లక్షల ప్రజాధనానికి మంగళం పాడేశారు.

టూరిజం సదస్సుకు సంబంధించిన వివరాలు అందించాలని ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సమాచారహక్కు కార్యకర్త సాయిప్రసాద్‌ సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. సమాచార చట్టం అందించిన వివారాలను చూసి పలువరు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచార హక్కు చట్టం వివరాల ప్రకారం తాజ్‌ ఫలక్‌నుమాలో 150 మంది ప్రతినిధులకు భోజనానికి 5 లక్షల 25 వేలు వెచ్చించారు. టీ లేదా కాఫీకి 90 వేల రూపాయలు ఖర్చు చేశారు. గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన సౌండ్‌ అండ్‌ లైట్‌ కార్యక్రమానికి మరో 6 లక్షలు వెచ్చించారు. తాజ్‌ ఫలక్‌నుమాలో ఏర్పాటైన హైటీకి 2 లక్షల 40 వేల రూపాయలు, ఆరు జ్ఞాపికల కోసం ఏకంగా 9 లక్షల రూపాయలు సమర్పించుకువడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజా ధనం వెచ్చించే సమయంలో సంయమనం పాటించాలని, ఖర్చు తగ్గించుకోవాలంటూ ఓవైపు ప్రధాని మన్మోహన్‌, యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియా సమయం సదర్భం వచ్చినప్పుడల్లా చెబుతూన్న మాటలను కేంద్రమంత్రి చిరంజీవి గాలికి వదిలేశారు. ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారన్న పేరుతో జల్సాలకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం మాటల్ని పెడచెవిన పెట్టిన శశిథరూర్, ఎస్ఎం కృష్ణ దారిలోనే చిరంజీవి కూడా ప్రయాణించడం చర్చనీయాంశమైంది.

ఆ పథకాలు మిగత రాష్ట్రాల్లో అమలుకావడం లేదే

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్ పార్టీ పథకాలని సీఎం కిరణ్ ప్రకటించడం పట్ల మహానేత కుమార్తె షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గణపవరం చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినట్లు అయితే దేశంలోని మిగతా రాష్టాల్లో ఎందుకు అమలు చేయలేకపోతోందని ఆమె ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ జాబితాలో నుంచి 133 వ్యాధులను ఈ ప్రభుత్వం తొలిగించిదన్నారు. 12 ఏళ్ల లోపు గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు ఆపరేషన్లు చేయాలని వైఎస్ ఆలోచించారు. కాని ఈ ప్రభుత్వం రెండేళ్లల్లోపు చిన్నారులకే ఆ ఆపరేషన్లు చేయాలని వయోపరిమితి విధించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. 

వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ తో లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. 10 వేల ర్యాంక్ వరకే ఫీజురీయింబర్స్ ను పరిమితి చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి దక్కించుకున్న ఘనుడు చంద్రబాబు అని షర్మిల అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలోనే రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని షర్మిల తెలిపారు.

Sharmila speech in Ganapavaram, WGDT

కాంగ్రెస్ అధిష్టానం ప్రయోగించిన సీబీఐ అనే ఆయుధం కథ!!

ఇది... పంజరంలో చిలుక కథ! సర్కారు చేతిలోని కీలుబొమ్మ కథ!!
ఎవరిపై ప్రయోగిస్తే వారిని కేసులతో వేధించుకుతినే
కేంద్ర దర్యాప్తు సంస్థ కథ!!
జననేతగా ఎదిగిన జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టేందుకు
కాంగ్రెస్ అధిష్టానం ప్రయోగించిన సీబీఐ అనే ఆయుధం కథ!! 


ఆరంభించిన నాటి నుంచీ ఏ రోజూ సక్రమంగా సాగని దర్యాప్తు.. ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఒక ఎంపీగా, రాజకీయ పార్టీ అధినేతగా, వైఎస్సార్ వారసుడిగా తన ప్రజలతో కలవటానికి జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం దరఖాస్తు చేసినపుడల్లా.. మాయల ఫకీరు చేతిలో దండంలా పైకి లేస్తూనే ఉంది. దాదాపు 21 నెలలుగా ఈ రాష్ట్రంలో దర్యాప్తు పేరిట సీబీఐ సాగిస్తున్న రాజకీయ మేధం తీరుతెన్నులివి....

జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది 2011 ఆగస్టు 10న. మూడు రోజుల్లో తీర్పు కాపీ ఆగమేఘాలమీద సీబీఐకి అధికారికంగా చేరింది. మధ్యలో రెండు రోజులు సెలవులూ వచ్చాయి. కానీ ఈలోపే సీబీఐ సిబ్బందిని సమీకరించుకుంది. 28 ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ 17వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే.. అంటే 18వ తేదీన మూకుమ్మడి దాడులు మొదలుపెట్టింది. భారతి సిమెంట్స్, ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులకు దిగింది. ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేసి రికార్డుల్ని, కంప్యూటర్లను, సమాచారాన్ని స్వాధీనం చేసుకుంది. పలువురిని పిలిచి ప్రశ్నించింది. ఒకరకమైన టై సృష్టించింది. 

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెట్టాలంటేనే వణికిపోయేలా భయపెట్టింది. ఆ తరవాత.. కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డిని, ఇన్వెస్టర్లను, అధికారుల్ని, ఇతరులను పలుమార్లు ప్రశ్నించింది. చిత్రమేంటంటే.. ఇదంతా ఎల్లోమీడియాలో ‘ప్రత్యక్ష ప్రసారం’ అవుతూనే వచ్చింది. సీబీఐ రహస్యంగా రికార్డు చేసిన స్టేట్‌మెంట్లు కూడా బహిరంగ ప్రకటనల మాదిరి ప్రచురితమయ్యాయి. నేరుగా న్యాయమూర్తి ముందు సాక్షుల చేత సీబీఐ ఇప్పించిన వాంగ్మూలాలు సైతం వారి ముందే నమోదైనట్లు వెలువడ్డాయి. ఈ రకమైన దర్యాప్తు కొనసాగించిన సీబీఐ.. విజయసాయిరెడ్డిని గత ఏడాది జనవరి 2న అరెస్టు చేసింది. 90 రోజుల్లో చార్జిషీటు వేయాలి కనుక మార్చి 31న చార్జిషీటు దాఖలు చేసింది. 

చార్జిషీటుకు అర్థం మారింది...
చార్జిషీటంటే దర్యాప్తు పూర్తి చేసి ఇచ్చే తుది నివేదిక. తరవాత.. కోర్టు దాన్ని చూసి విచారణకు స్వీకరిస్తుంది. ఆనక కోర్టులో విచారణ మొదలవుతుంది. కానీ ఈ కేసులో నిందితుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కావటంతో అర్థాలన్నీ మారిపోయాయి. మొత్తం ప్రక్రియ తల్లకిందులయింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాల్లోని కొన్నిటితో గత ఏడాది మార్చి 31న ఒక చార్జిషీటు దాఖలు చేసింది. అంతటితో తమ దర్యాప్తు పూర్తి అయిపోయినట్లు భావించవద్దని, మిగిలిన అంశాలపైనా తాము దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పింది. తరవాత ఆ ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను చించి ముక్కలు చేసి.. వాటిపై వరుసగా చార్జిషీట్లు వేస్తూనే ఉంది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును అడ్డుకుంటూనే ఉంది. 

ఇప్పటికి ఐదు... ఇంకా వేస్తారట!!
బహుశా! భారతదేశంలో దర్యాప్తును ఇంతగా సాగదీస్తూ... ఇన్ని చార్జిషీట్లు వేసి... ఒక బెయిలును అడ్డుకోవటమనేది ఇంతవరకూ జరగలేదేమో!! వేసిన ఐదు చార్జిషీట్లలో కూడా ఒకదానికొకటి పొంతనలేని వాదనలే. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగానే పెట్టుబడులు పెట్టారని కొన్ని చార్జిషీట్లలో వాదించిన సీబీఐ.. అసలు ఏ ప్రాజెక్టూ చేపట్టని వారి విషయంలో కొత్త వాదన తీసుకొచ్చింది. వై.ఎస్.జగన్, ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిసి లాభాల ఆశ చూపించి ఇన్వెస్టర్లను మోసం చేశారని చెప్పింది. దీన్నేమనుకోవాలి? అసలు ముడుపులిస్తే వాటికి బదులుగా ఎక్కడైనా వాటాలిస్తారా? జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలేవీ షెల్ కంపెనీలో, డమ్మీ కంపెనీలో కాదు కదా! వాటి ఆస్తులు కళ్లముందు కనిపిస్తున్నాయి. అవి రోజురోజుకూ ఎదుగుతున్నాయి. మరి వాటిలో వాటాలు తీసుకుని పెట్టుబడి పెడితే... ఆ పెట్టుబడులకు లాభాలు కూడా వస్తూ ఉంటే వాటిని క్విడ్ ప్రో కో అనటంలో ఏమైనా అర్థం ఉందా?

రూ. 16 కోట్ల లబ్ధికి 32 కోట్లు పెట్టుబడి పెడతారా?
సీబీఐ తన తొలి చార్జిషీట్లో ఏమని పేర్కొందంటే... ‘‘అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌లకు విశాఖ జిల్లా నక్కపల్లి సెజ్‌లోను, మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల సెజ్‌లోను ఏపీఐఐసీ భూములు కేటాయించింది. జడ్జర్ల సెజ్‌లో ఈ రెండిటికీ తలా 75 ఎకరాల చొప్పున 150 ఎకరాలు కేటాయించారు. ధరల్ని నిర్ణయించే కమిటీ ఎకరానికి రూ. 15 లక్షలు నిర్ణయించినా, ఎకరా రూ. 7 లక్షలకే ఇవ్వటం వల్ల ఖజానాకు రూ. 12 కోట్ల నష్టం వాటిల్లిందనేది సీబీఐ వాదన. ఇదికాక మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో ఫార్మా తనకిచ్చిన భూమిలో కొంత తన అనుబంధ కంపెనీ అయిన ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించింది. ట్రైడెంట్ గనక అరబిందో నుంచి తీసుకోకుండా నేరుగా ఏపీఐఐసీ నుంచి తీసుకుంటే... అప్పటి రేటు ప్రకారం తీసుకుని ఉండేది.. అలాకాకుండా అరబిందో నుంచి తీసుకోవటం వల్ల దానికి రూ. 4.30 కోట్లు లబ్ధి చేకూరింది. ఇలా మొత్తం రూ. 16.3 కోట్ల లబ్ధి చేకూరినందుకు ఈ రెండు సంస్థలూ కలిసి జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో రూ. 32 కోట్లు పెట్టుబడి పెట్టాయి’’ అని సీబీఐ అభియోగం మోపింది. 

రూ. 16 కోట్లు లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగా ఎవరైనా రూ. 32 కోట్లు పెట్టుబడి పెడతారా? పెట్టారంటే దానర్థం వారు లాభాల కోసమని కాదా?
జడ్చర్ల సెజ్‌కు చంద్రబాబు హయాంలోనే భూములు సేకరించినా.. మూడేళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టటానికి ఎవరూ రాకపోవటాన్ని సీబీఐ ఎందుకు ప్రస్తావించలేదు?
అభివృద్ధి చేసిన భూమిని ఎకరా రూ. 15 లక్షలకు కేటాయించాలని అనుకున్నపుడు.. ప్రహరీ, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించుకునేవారికి తక్కువకు ఇవ్వరా? 
ఎకరాకు 15 లక్షలనేది అమ్మకం ధర. కానీ ఎకరా రూ. 7 లక్షల చొప్పున ఇచ్చింది లీజుకు. పైగా మొత్తం లీజు సొమ్మును ముందే చెల్లిస్తారు. గడువు తీరాక భూమి ఏపీఐఐసీకే ఉంటుంది. సీబీఐ దాన్నెందుకు ప్రస్తావించదు? 
ట్రైడెంట్ విషయం చూసినా... తన పేరెంట్ సంస్థకు భూమి ఉంటుండగా అక్కడే అది కొత్తగా 
కొనుగోలు చేయాల్సిన అవసరమేముంది? 
అయినా ఇది జరిగేది ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ స్థాయిలో. దానికీ సీఎంకీ లింకు పెట్టటం ఎంతవరకు కరెక్టు? 

ప్రాజెక్టు దక్కకుంటే మోసపోయినట్టా?
జయలక్ష్మి టెక్స్‌టైల్స్ ద్వారా టి.ఆర్.కన్నన్ రూ. 5 కోట్లు, మాధవ్ రామచంద్ర రూ. 19.65 కోట్లు, అరుణ్‌కుమార్ దండమూడి రూ. 10 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిసి తప్పుడు మాటలు చెప్పి, లాభాల ఆశ చూపించి మోసపూరితంగా వారిచేత పెట్టుబడులు పెట్టించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. 

సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడుల్నా లేక ఇన్వెస్టర్లు మోసపోయారనే అంశాన్నా? 
ప్రాజెక్టులు చేపట్టిన ఇన్వెస్టర్లయితే క్విడ్ ప్రో కో అనటం.. ఏమీ చేపట్టని వారైతే మోసపోయారని చెప్పటం.. ఎంతవరకూ కరెక్టు?
జగతిలో కానీ, భారతి సిమెంట్‌లో కానీ పెట్టుబడి పెట్టి తాము మోసపోయినట్లు ఏ ఇన్వెస్టరైనా ఫిర్యాదు చేశారా?
కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు చేసినపుడు లాభనష్టాలు సహజమని సీబీఐకి తెలియదా? భారతి సిమెంట్‌లో ఇన్వెస్టర్లంతా లాభపడ్డారు కదా? దాన్నెందుకు పట్టించుకోరు?
‘సాక్షి’తో సమాన సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ తన విలువను రూ. 7,150 కోట్లుగా అంచనా కట్టినపుడు సాక్షి దాన్లో సగం కూడా చెయ్యదా? ‘సాక్షి’ కొత్త సంస్థ. కానీ 35 ఏళ్లుగా నడుస్తున్న ‘ఈనాడు’... తన వద్ద 2,600 కోట్లు పెట్టుబడి పెట్టినవాళ్లకు ఒక్కపైసా అయినా డివిడెండ్ ఇచ్చిందా? 
10 రూపాయల విలువైన సాక్షి షేరు రూ.350కి కేటాయిస్తే తప్పంటున్న వారికి... 100 రూపాయల విలువైన ‘ఈనాడు’ షేరు ఒకొక్కటి 5,28,630 రూపాయల చొప్పున కేటాయిస్తే తప్పనిపించటం లేదేం?

భూమినిచ్చిన బాబును వదిలేశారేం?
విశాఖపట్నంలోని ఫార్మాసిటీని డెవలప్ చేసింది రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ. ఫార్మా సిటీ చుట్టూ వదలాల్సిన గ్రీన్‌బెల్ట్‌లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మినహాయింపు ఇచ్చారని, అందుకే అది వివిధ సంస్థల ద్వారా జగతి పబ్లికేషన్స్‌లో రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. 

ఇదీ... జరిగింది...
ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో చంద్రబాబు ప్రభుత్వం భావించింది. 2001లో టెండర్లు పిలిచినా.. చివరికి రద్దు చేశారు. కానీ 2003 జూన్‌లో చంద్రబాబు ‘బిల్డ్ - ఓన్ - ఆపరేట్ - ట్రాన్స్‌ఫర్’ బదులు ‘బిల్డ్ - ఆపరేట్ - ఓన్’కు మార్చారు. అంటే నిర్మించిన సంస్థకే ప్రాజెక్టు సొంతమవుతుందన్న మాట. దీంతో 2003 జూలైలో రాంకీ సంస్థ ముందుకు రావటం, చంద్రబాబు ఓకే చేయటం.. ఎంఓయూ.. అన్నీ నాలుగు నెలల్లో జరిగిపోయాయి. 2004 మార్చి 12న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే చంద్రబాబు రాంకీతో రాయితీ ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ ఒప్పందంలోనే.. 352 ఎకరాల మేర గ్రీన్‌జోన్ ఉండాలని, దాన్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు ఉండాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టలపై సమీక్షించేటపుడు ఫార్మాసిటీ అంశం చర్చకొచ్చింది. దాన్లో గ్రీన్‌జోన్‌పై పలు ప్రతిపాదనలు వచ్చాయి. నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా.. బౌండరీ చుట్టూ కిలోమీటరు మేర ఉంటే బాగుంటుందనుకున్నారు. ఆచరణ సాధ్యం కాదని ‘ఉడా’ చెప్పటంతో అటూఇటూ 250 మీటర్ల చొప్పున 500 మీటర్లకు పరిమితం చేద్దామనుకున్నారు. ఇలా చేయటం వల్ల తమది వెయ్యి ఎకరాల వరకూ పోతుందని ఫార్మాసిటీ యాజమాన్యం చెప్పటంతో గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల మాత్రం 50 మీటర్లు ఉంటే చాలనుకున్నారు. చంద్రబాబు రాయితీ ఒప్పందంలో నిర్దేశించింది కూడా గోడ లోపల 50 మీటర్లే. పెంపుపై జరిగినవన్నీ సంప్రతింపులే తప్ప ఎక్కడా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. ఒక్క జీవో కూడా విడుదల కాలేదు. ఇందులో తప్పేంటి?

గ్రీన్‌బెల్ట్‌ను పెంచాలనుకుని, పెంచకుండా వదిలేసినందుకే ‘సాక్షి’లో రాంకీ రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే.. 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరుపై ఇచ్చేసిన బాబుకు ఎంత ముడుపులు ముట్టి ఉండాలి? 
పెంచాలనుకున్నపుడు.. బాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 50 మీటర్లకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రిని రాంకీ అడిగే అవకాశం లేదా? దానికి అంగీకరించి ఉంటే అదీ తప్పేనా? 
బల్క్ డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘంలో (బీడీఎంఏ) సభ్యత్వం ఉన్న సంస్థలకు ఎకరా రూ. 15 లక్షల చొప్పున 450 ఎకరాలివ్వాలని వైఎస్సార్ షరతు పెట్టారు. అప్పటికే రాంకీ తన ప్లాట్లను ఎకరా రూ.కోటి చొప్పున విక్రయిస్తోంది. వైఎస్సార్ షరతు వల్ల రాంకీకి ఎకరాపై రూ. 85 లక్షల చొప్పున రూ.382 కోట్లు నష్టం వచ్చింది. మరి వైఎస్సార్ లబ్ధి చేకూర్చినట్లా?

వాన్‌పిక్‌పై ‘లెక్క’లేని వాదన...
ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్ ప్రాజెక్టును అప్పగించినందుకు జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 850 కోట్లు పెట్టుబడి పెట్టారనేది సీబీఐ ఆరోపణ. నిజానికి ప్రకాశం జిల్లాలో పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలనేది 1999-2000లో చంద్రబాబు హయాంలో వచ్చిన ప్రతిపాదనే. ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ ఈ ప్రతిపాదన చేసి విరమించుకుంది. తర్వాత చెక్ సంస్థ స్కోడా వచ్చి, ఎంఓయూ కుదిరి కూడా తీవ్ర జాప్యం చేయటంతో ఒప్పందం రద్దయింది. తరవాత రస్ అల్ ఖైమా వచ్చింది. జీ టూ జీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) ప్రాతిపదికన దాంతో ఎంఓయూ కుదిరాక.. తన స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్ సంస్థను అది చేర్చుకుంది. రెండు సీపోర్టులు, ఎయిర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ కోసం వాన్‌పిక్ 28 వేల ఎకరాలడిగింది. వైఎస్సార్ ప్రభుత్వం 18 వేల ఎకరాలు చాలని చెప్పింది. కానీ ఇప్పటిదాకా సేకరించింది 13 వేల ఎకరాలే. ఇందులో ప్రభుత్వ భూమి కేవలం 200 ఎకరాలు. మిగతావి అసైన్డ్, పట్టా భూములే. వీటిని ఎకరాకు రూ. 1.2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య వెచ్చించి వాన్‌పిక్ సంస్థే కొనుగోలు చేసుకుంది. 

ప్రసాద్ పెట్టిన పెట్టుబడుల్లో 80 శాతం వరకూ.. వాన్‌పిక్ ప్రాజెక్టు దక్కకముందో, ైవై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాకో పెట్టినవే. వాటిని క్విడ్ ప్రో కో అంటారా?
11.3.2008న రాష్ట్ర ప్రభుత్వానికి - రస్ అల్ ఖైమా ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరి ఎంఓయూపై సంతకాలు చేశారు. కానీ నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు మాత్రం 2006 డిసెంబర్‌లోనే మొదలయ్యాయి. అంటే 14 నెలల ముందే. ఇది క్విడ్ ప్రోకోనా?
భారతి సిమెంట్‌లోనూ 2007లోనే రూ. 280 కోట్లు పెట్టుబడి పెట్టారాయన. 2010 ఏప్రిల్‌లో ఇతర ఇన్వెస్టర్లతో పాటు భారతిలో తన వాటాను ఫ్రాన్స్ కంపెనీ వికాకు విక్రయించినపుడు ఇతర ఇన్వెస్టర్లతో పాటు ఆయనకూ రూ. 267 కోట్ల మేర లాభం వచ్చింది. క్విడ్‌ప్రోకో పెట్టుబడులకు లాభాలొస్తాయా? 
2008లో జగతి పబ్లికేషన్స్‌లో మరో రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రసాద్.. భారతి వాటా విక్రయంలో తనకు లాభం రావటంతో దానికి కొంత కలిపి 2010లో మరో రూ. 350 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. అప్పటికి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కాదు కదా.. జీవించి కూడా లేరు. దీన్ని క్విడ్‌ప్రో కో అంటారా? 
2010లో ప్రసాద్ పెట్టుబడి పెట్టేనాటికి ‘సాక్షి’ అగ్రశ్రేణి పత్రికగా ఆవిర్భవించింది. దేశంలోనే 8వ స్థానానికి చేరింది. ప్రసాద్‌కు మాత్రం జగతి షేర్లు 2006లో కొన్న ధరకే 2010లోనూ దక్కాయి. దీన్ని క్విడ్ ప్రో కో అంటారా? 
జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో ప్రసాద్ నికరంగా పెట్టిన పెట్టుబడి రూ. 230 కోట్లే. ప్రతిగా ఆయనకు సాక్షిలో దాదాపు 18 శాతం వాటా ఉంది. జగతి పబ్లికేషన్స్‌ను కనక రూ. 1,300 కోట్ల కింద లెక్కించినా ప్రసాద్‌కు తన పెట్టుబడి రూపాయి నష్టం లేకుండా చేతికొస్తుంది. పోటీ పత్రిక ‘ఈనాడు’ ప్రకారమే విలువ కడితే ప్రసాద్‌కు పెట్టుబడిపై కనీసం నాలుగు రెట్ల లాభం వస్తుంది. దీన్ని క్విడ్ ప్రో కో అంటారా?

లీజిస్తే పెట్టుబడులొస్తాయా? 
దాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో సున్నపురాయి లీజుల్ని బదలాయించినందుకు అది భారతి సిమెంట్‌లో రూ.95 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది 5వ చార్జిషీట్లో సీబీఐ చేసిన ప్రధానారోపణ. నిజానికి వైఎస్సార్ కడప జిల్లా పెద్దగా అభివృద్ధి చెందినదేమీ కాదు. అక్కడ వ్యవసాయం గిట్టుబాటూ కాదు. అలాంటిచోట లీజుపై సున్నపురాయి గనుల మైనింగ్‌కు అనుమతివ్వాలంటూ 1997లో చంద్రబాబు హయాంలో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. అది అడిగిన భూమి పూర్తిగా ప్రైవేటుది. పెపైచ్చు వేరే దరఖాస్తులేవీ రాలేదు. దీంతో 2006లో జయా మినరల్స్‌కు 1,005 ఎకరాల సున్నపురాయి గనుల ప్రాస్పెక్టివ్ లెసైన్స్ మంజూరయింది. తర్వాత జయా సంస్థ ఆ లీజును తమ ప్రమోటర్లకే చెందిన ఈశ్వర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించాలని కోరింది. రుణం రావాలంటే లీజు ఆ కంపెనీ పేరిటే ఉండాలన్న ఉద్దేశంతో ఈ బదలాయింపునకు దరఖాస్తు చేయటం, అనుమతించటం రొటీన్‌గా జరిగాయి. తర్వాత నిధుల కోసం ఈశ్వర్ సిమెంట్స్ దాల్మియాకు షేర్లు విక్రయించటంతో పాటు ఆ సంస్థకు చెందిన వారిని డెరైక్టర్లుగానూ చేర్చుకుంది. అలా అది దాల్మియాకు అనుబంధ సంస్థగా మారింది. అనుబంధ సంస్థే కావటంతో లీజును దాల్మియాకు బదలాయించాలని కోరటం.. అనుమతించటం రొటీన్‌గా జరిగాయి. ఆ తరవాత ఈశ్వర్ సంస్థ దాల్మియాలో విలీనమైంది కూడా. 

సున్నపురాయి గనులనేవి సిమెంట్ కంపెనీలకు కాకుండా వేరే వాటికి పనికొస్తాయా? ఎప్పటికైనా వాటిని సిమెంట్ కంపెనీలకు ఇవ్వాల్సిందే కదా?
ఏటా 100 వరకూ మైనింగ్ లీజుల బదలాయింపు ఉత్తర్వులు జారీ అవుతుంటాయి. వాటన్నిటినీ క్విడ్ ప్రో కో ఉత్తర్వులు అంటారా?
మైనింగ్ లీజులు జారీ చేయటానికి ప్రత్యేక శాఖే ఉంది. అరుదైనవి తప్ప అన్నీ సీఎం టేబుల్ వద్దకు రావు. మరి వీటితో వైఎస్‌కు సంబంధం అంటగట్టటం ఏ మేరకు సమంజసం? నిజంగా వైఎస్ వాళ్లకు మేలు చేయాలనుకుంటే నేరుగా ప్రభుత్వ భూమిలో ఉన్న మైనింగ్ లీజులే ఇచ్చి ఉండేవారుగా? 
దాల్మియా సిమెంట్స్ దశల వారీగా భారతి సిమెంట్‌లో రూ 95 కోట్ల పెట్టుబడి పెట్టింది. షేరు ధర కూడా వివిధ దశల్లో దక్కింది. కానీ వికాకు వాటా విక్రయించాక 55 కోట్ల మేర లాభం వచ్చింది. క్విడ్ ప్రో కో అయి ఉంటే లాభాలొస్తాయా?

సీబీఐపై నమ్మకం పోతోంది...
ఒకప్పుడు పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేక ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేసేవి. ఇప్పుడు ఆ సీబీఐపైనా నమ్మకం పోతోంది. ప్రతిపక్ష నేతలనే కాదు తనకు మద్దతునిస్తున్న మిత్రపక్షాల నేతలను బెదిరించడానికి యూపీఏ ప్రభుత్వం సీబీఐని ప్రయోగిస్తోంది. జగన్ కూడా కొత్త పార్టీ పెట్టడం, ఉప ఎన్నికలలో విజయం సాధించడం, కొంతమంది కాంగ్రెస్ నుంచి ఆయన పార్టీలో చేరుతుండటం వల్ల అధిష్టానం పెద్దల్లో తమ రాజకీయ భవితపై బెంగ మొదలైంది. దీంతో జగన్ కేసులను సీబీఐ ద్వారా సుదీర్ఘకాలం సాగదీయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన కావొచ్చు. 
- సురవరం సుధాకరరెడ్డి, సీపీఐ ప్రధాన కార్యదర్శి

సీబీఐ తీరు ఆశ్చర్యకరం...
జగన్‌రెడ్డి కేసు విషయంలో సీబీఐ వ్యవహార శైలి ఆశ్చర్యం కలిగిస్తోంది. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఒకే రకమైన వాదన వినిపిస్తోంది... ఆయన బయటకొస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని... అయితే ఆయన ఎలా తారుమారు చేయగలరనేది మాత్రం చెప్పట్లేదు. మరి కోల్‌గేట్ కుంభకోణం విషయంలో సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయానికే సంబంధం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు కాదు ఇక్కడ కుంభకోణం జరిగిందనేది వాస్తవం. మరి ఆ కేసులో ప్రధానమంత్రిని సీబీఐ ఎందుకు విచారించట్లేదు?
- ఎంజే అక్బర్, సీనియర్ పాత్రికేయులు

Popular Posts

Topics :